ప్రాబ్లమ్.. పసిగట్టే ఫీచర్ : ఆపిల్ Smart Watch.. చచ్చే మనిషిని బతికించింది!

Submitted on 25 June 2019
Apple Watch Series 4 helps a doctor to save a life in a restaurant

ఆపిల్ వాచ్ మనషుల ప్రాణాలను రక్షిస్తోంది. కొద్ది క్షణాల్లో హార్ట్ ఎటాక్ రాబోతుంది అంటూ ముందుగానే అలర్ట్ చేస్తోంది. మనిషిలో క్రిటికల్ హెల్త్ కండీషన్ ఎలా ఉంది.. కాసేపట్లో ఎలా ఉండబోతుంది, హెల్త్ సమస్య ఏంటో అచ్చం డాక్టర్ మాదిరిగానే చెప్పేస్తోంది. అదే.. ఆపిల్ వాచ్ సిరీస్ 4. ఈ స్మార్ట్ వాచ్ లో ECG ఫీచర్ అనే అద్భుతమైన ఫీచర్ మనిషి ఆరోగ్య పరిస్థితిని ఇట్టే పసిగట్టేస్తోంది. దీని ద్వారా మనిషి హార్ట్ బీట్స్ నుంచి.. అన్నిరకాల లక్షణాలను ముందుగానే గుర్తిస్తోంది. 

యువకుడిని రక్షించిన వాచ్ :
మనిషిలో A-Fib (హృదయ స్పందనలో మార్పుల రేటు)తేడాను కొన్ని సెకన్ల వ్యవధిలో గుర్తించగలదు. సకాలంలో వైద్య చికిత్స అందితే మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. 2018 ఏడాదిలో టంపా బే కు చెందిన యువకుడి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడింది.

మెడికల్ కండీషన్ క్రిటికల్ గా ఉందని ముందుగానే హెచ్చరించడంతో సకాలంలో ట్రీట్ మెంట్ చేయించుకున్నాడు. ఇప్పుడు.. ఆపిల్ స్మార్ట్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది. ఆపిల్ స్మార్ట్ వాచ్ సాయంతో సెకన్ల వ్యవధిలో శాన్ డియోగో కు చెందిన వైద్యుడు సదరు వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. 

A-fib అంటే తెలుసా? : 
అట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా A-fib (హార్ట్ బీట్ రేటు పడిపోవడం) అని పిలుస్తారు. చాలామందికి A-fib ఏంటో అవగాహన ఉండదు. హార్ట్ బీట్ రెగ్యులర్ కంటే నెమ్మదిగా కొట్టుకోంటుంది. దీనివల్ల రక్తం గడ్డుకట్టే ప్రమాదం ఉంది. ఫలితంగా హార్ట్ ఫెయ్యిలర్ అయి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యసాయం అందించాల్సి ఉంటుంది.

రెస్టారెంట్ కు వెళ్లిన ఓ ఫిజిషియన్ డాక్టర్ తన చేతికి ఆపిల్ స్మార్ట్ వాచ్ ధరించాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన డాక్టర్.. వెంటనే తన చేతికి ధరించిన ఆపిల్ స్మార్ట్ వాచ్ ను ఆ వ్యక్తికి పెట్టాడు. వాచ్ లోని ECG ఫీచర్.. వెంటనే అతడి మెడికల్ కండీషన్ ఏంటో పసిగట్టేసింది. వాచ్ స్ర్కీన్ డిస్ ప్లేపై మెడికల్ కండీషన్ ఏంటో డిస్ ప్లే అయింది. 

ఇండియాలో ధర ఎంతంటే? :
వైద్యుడు సకాలంలో ట్రీట్ మెంట్ చేయడంతో ప్రాణాలు దక్కాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆపిల్ వాచ్ సిరీస్ 4, ECG ఫీచర్ ద్వారా ఒక వ్యక్తి హార్ట్ కండీషన్ గుర్తించిన తొలి కేసు ఇదే. ఆపిల్ కంపెనీ.. ఈ స్మార్ట్ వాచ్ ను గత ఏడాదిలో రిలీజ్ చేసింది. ఫాల్ డిటెక్షన్, ECG ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ఇండియాలో ప్రారంభ ధర రూ.40వేల 990వరకు ఉంటుందని అంచనా. 

ప్రస్తుతానికి ఇండియాలో ఆపిల్ స్మార్ట్ వాచ్ అందుబాటులో లేదు. యూఎస్, యూరోప్, హాంగ్ కాంగ్ దేశంలోని యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. సాధ్యమైనంత తొందరగా ఆపిల్ వాచ్ సిరీస్ 4 ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.  

Apple Watch Series 4
Doctor
save a life
Restaurant
ECG feature

మరిన్ని వార్తలు