నోట్ దిస్ : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు

Submitted on 4 July 2019
appsc group 1 exams dates

ఏపీలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. డిసెంబర్‌ 12 నుంచి 23 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు కండక్ట్ చేస్తారు. 7 పేపర్లుగా ఈ పరీక్షలు ఉంటాయి. 169 పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా మే 26న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు లక్ష 14వేల 473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 80వేల 250 మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 59వేల 697 మంది, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59వేల 200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. మొత్తంగా 73.76 శాతం మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు.

పరీక్షల తేదీలు:
* డిసెంబర్ 12న తెలుగు
* డిసెంబర్ 13న ఇంగ్లిష్
* డిసెంబర్ 15న పేపర్-1
* డిసెంబర్ 17న పేపర్-2
* డిసెంబర్ 19న పేపర్-3
* డిసెంబర్ 21న పేపర్-4
* డిసెంబర్ 23న పేపర్-5

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 2 నుంచి 14 వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 1 నుంచి 10 రోజుల పాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్) ప్రధాన పరీక్షలను నిర్వహించనుంది. దీంతో 2 పరీక్షలకూ హాజరయ్యే అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ కారణంగా గ్రూప్-1 పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది.

appsc
group 1
Exams
schedule
dates

మరిన్ని వార్తలు