ఏపీ గూప్ -1 ఎగ్జామ్స్ డేట్ వచ్చేసింది!

Submitted on 5 July 2019
APPSC Group 1 Mains Exam Postponed, Check Revised Dates

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూపు-1 మెయిన్ పరీక్షలను 2019, డిసెంబరు 12 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు   ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చే స్కోర్‌ ని బట్టి అభ్యర్థులను గూప్-1 మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

అసలైతే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 2 నుంచే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ UPSC డిసెంబరు 1 నుంచి పది రోజుల పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని APPSC ఈ నిర్ణయం తీసుకుంది.

> డిసెంబరు 12న తెలుగు పేపర్, 13న ఇంగ్లీష్, 15న పేపర్-1, 17న పేపర్-2, 19న పేపర్-3, 21న పేపర్-4, 23న పేపర్-5. ఇలా మొత్తం ఏడు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తారని APPSC కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటనలో తెలిపారు. 

APPSC Group 1 Mains Postponed
Check Revised Dates
2019

మరిన్ని వార్తలు