సీఎం జగన్‌ తొలి విజయం : ఆంధ్రాలో ఆర్టీసీ సమ్మె లేదు

Submitted on 12 June 2019
apsrtc strike with drawn

ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయి. ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె ప్రతిపాదన విరమించుకున్నాయి. జూన్ 13 నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ ని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. కార్మికుల డిమాండ్లను, సమస్యలను సీఎం ముందు ఉంచారు. వారి డిమాండ్ల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. 27 డిమాండ్లను నెరవేరుస్తామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని     సీఎం హామీ ఇచ్చారు. దీంతో సమ్మె ప్రతిపాదనను జేఏసీ నేతలు విరమించుకున్నారు. సీఎంతో చర్చల తర్వాత సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కితగ్గారు. అమరావతిలో సీఎం జగన్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం అయ్యారు. ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు, రవాణశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు అంగీకారం తెలిపిన సీఎం జగన్.. అందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను తీర్చేలా విలీనానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడం, కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉండటంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి 2 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు తయారవుతాయి.

apsrtc
Strike
with drawn
AP CM JAGAN
Demands
rtc jac

మరిన్ని వార్తలు