కుంబ్లేని గుర్తు చేశాడు : రక్తం ధారాగా కారుతున్నా.. బ్యాటింగ్ చేసిన క్యారీ

Submitted on 11 July 2019
Archer bouncer knocks Carey's helmet off

బర్మింగ్‌హామ్ వేదికగా ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ సమరంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆదిలోనే వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో  ఆలెక్స్ క్యారీ, స్మిత్ జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు క్యారీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి క్యారీ హెల్మెట్‌కు తగలగా.. హెల్మెట్ పైకి లేవగా.. దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. రక్తం కూడా కారింది. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బంది మైదానంలోకి వచ్చి.. అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. అయితే రిటైర్డ్ హర్ట్‌గా క్యారీ రక్తం కారుతున్నా కూడా ఆడాడు.  కట్టు కట్టుకుని ఆడాడు.   70బంతుల్లో 46 పరుగులు చేసిన క్యారీ అదీల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అయితే అలెక్స్ క్యారీని చూస్తుంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ అనీల్ కుంబ్లే గుర్తొస్తున్నాడు అంటూ క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దవడకు గాయం తగిలినా, కట్టు కట్టుకుని బౌలింగ్ వేసి టీమిండియాను గెలిపించిన అనీల్ కుంబ్లేని గుర్తు చేసుకున్నారు. 2002లో వెస్టిండీస్‌పై ఆంటిగ్వాలో అనిల్‌ కుంబ్లే కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే బరిలోకి దిగి రాణించాడు. కీలకమైన బ్రియన్ లారా వికెట్ తీసి టీమిండియాను గెలిపించాడు.

ఇక సెమీఫైనల్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్మిత్(58), మ్యాక్స్‌వెల్(1) ఉన్నారు.

Archer bouncer
Carey
helmet off
anil kumble


మరిన్ని వార్తలు