సైన్యాన్ని తగ్గించుకోవాలని ఆర్మీ ప్లాన్

Submitted on 13 August 2019
Army may trim 27,000 from non-core units

భారత ఆర్మీ తన మ్యాన్ పవర్ ని తగ్గించాలని ఫ్లాన్ చేస్తోంది. ప్రధానమైనవి కాని(నాన్ కోర్) యూనిట్ల నుంచి 27,000 మందికి సైనికులను తగ్గించాలని  యోచిస్తోంది. దీనివల్ల ఇది సుమారు 1,600 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, టెరిటోరియల్ ఆర్మీ, సైనిక్  స్కూల్స్ నుండి కార్యాచరణ-కీలకమైన అస్సాం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్ మరియు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వరకు ప్రస్తుతం 1లక్షా75వేల మంది అధికారులు, సైనికులు ఉన్నారు. వీరందరూ రెగ్యులర్ స్టాండింగ్ ఆర్మీ కిందకి రారు.

ఆర్మీ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ (పెర్స్పెక్టివ్ ప్లానింగ్) అధ్యక్షతన  జరిగిన మీటింగ్ లో...ఆర్మీ మ్యాన్‌పవర్‌ను సుమారు 27,000 మంది సిబ్బందితో తగ్గించాలని, అలాగే మెరుగైన సామర్థ్యం, ప్రభావం కోసం వారి పునర్నిర్మాణానికి రికమెండ్ చేసింది. నాన్-కోర్ యాక్టివిటీస్ లో మోహరించిన సైనికులను పసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రతిపాదనను ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ తెలిపారు. 

సైన్యాన్ని తగ్గింపు ప్రతిపాదిత... ఆర్మీని క్లీన్ గా,అర్థవంతంగా మార్చే, కార్యాచరణలో బహుముఖ శక్తిగా మార్చడానికి పెద్ద సంస్కరణల్లో భాగం. రాబోయే ఆరు-ఏడు సంవత్సరాలలో సుమారు 1.5 లక్షల మంది సిబ్బందిచే మానవశక్తిని ఆర్మీ తగ్గించుకుంటుంది. 

NON CORE UNITS
army
TRIM
27
000
save
Money
Soldiers
REGULAR STANDING ARMY

మరిన్ని వార్తలు