డోంట్ మిస్ : తెలంగాణలోని 33 జిల్లాలకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

Submitted on 10 August 2019
Army Recruitment Drive From October 7 Under Recruitment Office, Secunderabad

కరీంనగర్ : సైన్యంలో  చేరాలనుకునే యువత కోసం అక్టోబరు 7నుంచి 17 వరకు కరీంనగర్ లోని అంబేడ్కర్  గ్రౌండ్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33  జిల్లాల యువకులు ఈ ర్యాలీలో పాల్గోనవచ్చును. ఆర్మీలో 5 కేటగిరీల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని, దరఖాస్తు చేసేవారు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లయ్  చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌  సూచించారు. దేశ సైన్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తక్కువ మంది ఉన్నారని, అందుకే ఇక్కడ ఈ నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

రాష్ట్రంలోని 17-23 ఏళ్ల వయసు వారు ఆర్మీ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఆయా పోస్టుల వారీగా 10వ తరగతి నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. 2019 ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో అభ్యర్ధులు తన  పేర్లు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.  10 రోజుల ప్రతిరోజువ పాటు జరిగే రిక్రూట్ మెంట్ ర్యాలీలో  జిల్లాల వారీగా 3-4వేల మందికి పరుగు, శారీరక పరీక్ష, శారీరక కొలతలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరీంనగర్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు తదుపరి సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహిస్తారని  ఆయన వివరించారు.

రిక్రూట్ మెంట్ సంబంధిత ప్రశ్నల కోసం, అభ్యర్థులు 'ఆర్మీ కాలింగ్' మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.  ఈ అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు అభ్యర్థులకు తెలుగు లైవ్ చాట్ సౌకర్యాన్ని అందిస్తుంది. అభ్యర్థులు 040-27740059 నంబరుతో ARO సికింద్రాబాద్  వారిని సంప్రదించి మరింత సమాచారం పొందవచ్చు. 

సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్, ఎమునేషన్ ఎగ్జామినర్), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటి, సోల్జర్ ఫార్మా, సోల్జర్ ట్రేడ్స్ మెన్ కాటగిరీలలో అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్ధులు 2019 ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో అభ్యర్ధులు తన  పేర్లు నమోదు చేసుకోవాలి. అడ్మిట్ కార్డులు సెప్టెంబర్ 23 తర్వాత ఆన్‌లైన్‌లో జారీ చేయబడతాయి. రిపోర్టింగ్ తేదీని అడ్మిట్ కార్డు ద్వారా తెలియజేస్తారు. 
Also Read : రోడ్డున పడనున్న ఉద్యోగులు : మీ సేవా రద్దు యోచనలో ఏపీ ప్రభుత్వం

Army Recruitment Drive
Recruitment Office
Secunderabad

మరిన్ని వార్తలు