సెంచరీతో వార్నర్ విజృంభణ : బంగ్లాకు భారీ లక్ష్యం 382 

Submitted on 20 June 2019
Australia sets target to Bangladesh for 382 runs 

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో నాటింగ్ హామ్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆసీస్ 381 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టుకు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వార్నర్ (147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్ ; 166) విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగి సెంచరీ నమోదు చేశాడు.

మరో ఓపెనర్ కెప్టెన్ అరోన్ ఫించ్ (51బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్; 53)తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ బంగ్లా బౌలర్ల బంతులను బౌండరీలను దాటిస్తూ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో సౌమ్య సర్కార్ వీరి భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. 20 ఓవర్ల దగ్గర సర్కార్.. ఫించ్ దూకుడుకు బ్రేక్ వేశాడు. 

సర్కార్ బౌలింగ్ లో ఫించ్ షాట్ ఆడబోయి రుబెల్ కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. వార్నర్ 44 ఓవర్ల దగ్గర సర్కార్ బౌలింగ్ లోనే రెండో వికెట్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఖావాజా (72 బంతుల్లో 10 ఫోర్లు; 89)తో విజృంభించి హాఫ్ సెంచరీ దాటేసి సెంచరీ చేరువలో ఔటయ్యాడు. ఖాజాను కూడా బౌలర్ సర్కార్ కట్టడి చేయడంతో 4 వికెట్ గా వెనుదిరిగాడు. మిగిలిన ఆటగాళ్లలో మ్యాక్స్ వెల్ (32), స్టోయినీస్ (17 నాటౌట్), క్యారీ (11 నాటౌట్) నిలిచారు.

49 ఓవర్ల దగ్గర వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటికి వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ మూడు వికెట్లు తీయగా, ముస్తాఫాజర్ రెహామాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.  

Australia
 Bangladesh
target 382 runs
Warner
Pinch

మరిన్ని వార్తలు