ఫైనల్లో కివీస్ ప్రత్యర్థి ఎవరు: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్

Submitted on 11 July 2019
Australia takes on England in Cricket World Cup semi-final

ఫైనల్‌ బెర్త్‌కోసం ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా తలపడనుంది. లీగ్‌ దశలో 2, 3 స్థానాల్లో నిలిచిన ఇరు జట్లు సెమీ ఫైనల్ 2కు అర్హత సాధించాయి. ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలవాలన్న కలతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగుతోంది. ఫైనల్‌‌కు చేరి పలుమార్లు బోర్లా పడింది. ఇయాన్‌ మోర్గాన్‌ కెప్టెన్సీలోని ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. 

ఇంగ్లండ్‌ 1992 తర్వాత ఫైనల్‌ బెర్త్‌కోసం గురువారం రెండోసెమీఫైనల్‌ పోటీ ఆడనున్నాయి. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌ పోరులో కివీస్.. భారత్‌ను ఓడించి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లోకి అర్హత సాధించింది. ఆదివారం జరిగే టైటిల్‌ కోసం ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు రెండో సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో పోటీపడనుంది. ఫైనల్‌ పోరుకు లార్డ్‌ వేదికకానుంది. 2015 అనంతరం ఇంగ్లండ్‌ జట్టు బలీయంగా కనిపిస్తోంది. 

చివరి రెండు మ్యాచ్‌లలో భీకర ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్‌.. ఉత్సాహంగా కనిపిస్తోంది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో వరుస శతకాలతో చెలరేగుతుండటం సానుకూలాంశం. పవర్‌ప్లేలో జాసన్‌ రాయ్‌ దూకుడు.. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ క్రిస్‌ వోక్స్‌ మంచి ఫామ్‌ కలిసొచ్చే అంశాలు. కీలక సెమీస్‌లో బట్లర్‌ చెలరేగితే ఇంగ్లాండ్‌కు విజయం ఖాయమనే చెప్పాలి. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నిలకడ లేమి సైతం ఆతిథ్య జట్టును ఇబ్బంది పెడుతోంది. బంతితో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌, ఫ్లంకెట్‌ గొప్పగా రాణిస్తున్నారు. మొయిన్‌ అలీ మరోసారి బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఆదిల్‌ రషీద్‌ స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు. 

పిచ్‌ రిపోర్టు : ఎడ్జ్‌బాస్టన్‌లో పిచ్ పరిస్థితి కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. పిచ్‌పై పచ్చిక బాగా తగ్గించారు. స్పిన్‌ పెద్దగా అనుకూలించలేదు. గురువారం బర్మింగ్‌హామ్‌లో వర్ష వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మ్యాచ్‌ వాయిదా పడే ప్రమాదం లేకపోయినా, అంతరాయం ఏర్పడవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఎక్కువుంది.

తుది జట్లు (అంచనా) : 
ఇంగ్లాండ్‌ : జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌ స్టోక్స్‌, జోశ్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌, లియాం ఫ్లంకెట్‌, ఆదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌.
ఆస్ట్రేలియా : అరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అలెక్స్‌ కేరీ, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయాన్‌, జేసన్‌ బహ్రాన్‌డార్ఫ్‌.
 

Australia
england
cricket
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు