ఓపెనర్ల విజృంభణ, పాక్ టార్గెట్ 308

Submitted on 12 June 2019
Australia vs Pakistan: pak target 308

ఆసీస్ ఓపెనర్లు విజృంభించి పాక్‌కు 308పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఓపెనర్లు మినహాయించి జట్టులో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. ఆరోన్ ఫించ్(82; 84బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు), డేవిడ్ వార్నర్(107; 111బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సు)తో చెలరేగారు. 

పాక్ బౌలర్ మొహమ్మద్ అమీర్ 5వికెట్లు పడగొట్టడంతో, షాహీన్ అఫ్రీది 2, హసన్ అలీ, వహబ్ రియాజ్, మొహమ్మద్ హఫీజ్ తలో వికెట్ తీయగలిగారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడు మీదున్న ఆసీస్ తొలి వికెట్ ఆరోన్ ఫించ్ అవుట్ అవడంతో స్కోరుకు బ్రేక్ పడింది. 

మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సహకారం అందకపోవడంతో ఆసీస్ ఖాతాలో పరుగులు చేరేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్(10), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (20; 10బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు), షాన్ మార్ష్(23), ఉస్మాన్ ఖవాజా(18), అలెక్స్ క్యారీ(20), నాథన్ కౌల్టర్ నైల్(2), పాట్ కమిన్స్(2), మిచెల్ స్టార్క్(3), కేన్ రిచర్డ్ సన్(1)పరుగులు మాత్రమే చేయగలిగారు. 

Australia
Pakistan
Pak
AUS
cricket
world cup 2019
2019 icc world cup

మరిన్ని వార్తలు