పాక్‌ను కంగారు పెట్టేశారు

Submitted on 12 June 2019
australia won by 41 runs on pakistan

పాకిస్తాన్ మరోసారి పరాజయాన్ని ముద్దాడింది. ఆస్ట్రేలియా విధించిన 308 పరుగుల టార్గెట్ ను నిర్దేశించే క్రమంలో బరిలోకి దిగిన పాక్ బ్యాట్స్ మెన్ లక్ష్యానికి 41పరుగులు ఉండగానే ఆలౌట్ గా వెనుదిరిగారు. టార్గెట్ చేధించే క్రమంలో పాక్ పోరాట పటిమ చూపించినప్పటికీ ఆసీస్ బౌలర్ల పనితనం ముందు పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్ 2, కేన్ రిచర్డ్ సన్ 2, నాథన్ కౌల్టర్ నైల్, ఆరోన్ ఫించ్ చెరో వికెట్ తీయగలిగారు. 


చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఓపెనర్ పాక్ ఇమామ్ ఉల్ హక్(53) క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. సహకార లోపంతో స్కోరు బోర్డుపై ఇమామ్ ఇన్నింగ్స్ దూకుడుగా నడిపించలేకపోయాడు. మరో ఓపెనర్ ఫకార్ జమాన్ డకౌట్ గా వెనుదిరగ్గా ఆ తర్వాత వచ్చిన బాబర్ అజామ్(30)పరుగులు పూర్తి చేశాడు. 10.5ఓవర్ల వద్ద బాబర్ అజామ్ అవుట్ అవడంతో బ్యాటింగ్ కు దిగిన మొహమ్మద్ హఫీజ్(46) ఇమామ్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కమిన్స్ బౌలింగ్ లో తడబాటుకు గురవడంతో ఇమామ్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ గా వెనుదిరిగాడు. 

ఆ తర్వాత సర్ఫరాజ్(40)తో కలిసి హఫీజ్ కాసేపటి వరకూ చక్కటి స్కోరు నమోదు చేశారు. ఆ తర్వాత ఆరో బ్యాట్స్ మన్ గా వచ్చిన షోయబ్ మాలిక్(0) డకౌట్ అవగా, ఆసిఫ్ అలీ(5)లతో సరిపెట్టుకున్నారు. లోయర్ ఆర్డర్ మ్యాచ్ గెలిపించేందుకు ప్రయత్నించినా లాభం లేదు. హసన్ అలీ(32), వహబ్ రియాజ్(42), మొహమ్మద్ అమీర్(0), షహీన్ అఫ్రీది(1)మాత్రమే నమోదు చేయడంతో పాక్ జట్టుకు టోర్నీలో రెండో ఓటమి తప్పలేదు. 

Australia
Pakistan
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు