కంగారు దెబ్బకు ఇంగ్లాండ్‌ బేజారు

Submitted on 25 June 2019
Australia won by 64 runs

వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా మరో విజయాన్ని అందుకుంది. భారత్ మినహాయించి మిగిలిన జట్లన్నింటిపైనా విజయం కొనసాగిస్తూ వచ్చింది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 64పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 286 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ స్వల్ప లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 

ఓపెనర్లుగా బరిలోకి దిగిన జేమ్స్ విన్స్(0)డకౌట్‌గా వెనుదిరగడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెన్ స్టోక్స్(89; 115 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులు)తో ఒంటరిపోరాటం జట్టుకు లాభం చేకూర్చలేకపోయింది. స్టోక్స్ మినహాయించి జేమ్స్ విన్స్(0), జోయ్ రూట్(8), జానీ బెయిర్ స్టో(27), ఇయోన్ మోర్గాన్(4), జోస్ బట్లర్(25), క్రిస్ వోక్స్(26), మొయిన్ అలీ(6), ఆదిల్ రషీద్(25), జోఫ్రా ఆర్చర్(1), మార్క్ వుడ్(1)లు మాత్రమే చేయడంతో 221పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 7వికెట్లు నష్టపోయి 286 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రమంగా తడబడింది. ఫించె సెంచరీతో రాణించగా జట్టు 300కు పైగా స్కోరు చేసేలా కనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ తీయగలిగారు. 

ఓపెనర్లుగా దిగిన ఫించ్(100; 116 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సులు), డేవిడ్ వార్నర్(53; 61 బంతుల్లో 6ఫోర్లు)తో రాణించినప్పటికీ ఇన్నింగ్స్ కుదేలైంది. ఓపెనర్ల శుభారంభాన్ని చక్కగా వినియోగించుకోలేదు ఆసీస్. 22.4ఓవర్లో తొలి వికెట్‌గా వార్నర్ 123పరుగుల వద్ద అవుట్ అయినా.. ఫించ్ క్రీజులో పాతుకుపోయి ఖవాజా(23; 29బంతుల్లో 1ఫోర్)సహకారంతో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 36వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఫించ్ తర్వాతి బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. 

అప్పటికే క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్(38; 34బంతుల్లో 5ఫోర్లు)తో కాసేపు మెరిశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(12), స్టోయినిస్(8), అలెక్స్ క్యారీ(38), పాట్ కమిన్స్(1), మిచెల్ స్టార్క్(4)లకు ఎక్స్‌ట్రాలు 8చేరడంతో ఆసీస్ 285పరుగులు చేయగలిగింది. 

Australia
england
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు