దారుణం : మద్యం మత్తులో బిడ్డపై పడుకున్న తల్లి, బిడ్డ మృతి

Submitted on 10 June 2019
Baby dies after mother takes him to a nightclub

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోవడం లేదు. మగాళ్లే కాదు ఆడాళ్లు కూడా ఫుల్లుగా తాగేస్తున్నారు. మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని సమయాల్లో ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. తల్లికి ఉన్న మద్యం తాగే అలవాటు బిడ్డ ప్రాణం తీసింది. ఆ తాగుబోతు తల్లి కారణంగా పసిపాప చనిపోయింది.
Also Read : OMG : హైదరాబాద్ లో 9వేల కిలోల వెండి పట్టివేత

వివరాల్లోకి వెళితే.. తాగిన మైకంలో ఓ తల్లి తన బిడ్డపై నిద్రపోయింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది. ఈ విషాదం బ్రిటన్ లోని నార్తర్న్ వేల్స్ లో జరిగింది. తల్లి నిర్వాకానికి నాలుగు వారాల పసికందు బలైంది. 26 ఏళ్ల మారినా టిల్బీ అనే మహిళ తన 4 వారాల పాపను తీసుకుని నైట్ క్లబ్ కి వెళ్లింది. అక్కడ పీకల దాకా మందు తాగింది. మద్యం మత్తులో విపరీతంగా ప్రవర్తించింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కసాయిలా వ్యవహరించింది. తన ఒడిలో ఉన్న పాపను గాల్లోకి ఎగరేసి వికృతానందం పొందింది. ఆ తర్వాత పాపను బెడ్ పై పడుకోబెట్టింది. ఆమె అలానే పాపపై నిద్రపోయింది. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది.

తెల్లారి లేచి చూసేసరికి పాప చనిపోయి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తాగుబోతు తల్లిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కసాయిలా వ్యవహరించిందని కోర్టు మండిపడింది. ఆ తల్లి నిర్లక్ష్యం క్షమించరాదని సీరియస్ అయ్యింది. ఆమెకి జైలు శిక్ష విధించింది.
Also Read : ఏంటీ బాదుడు : బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేస్తే.. పన్ను కట్టాలి

baby
dies
mother
nightclub
drunkenly
FALLS
asleep

మరిన్ని వార్తలు