లండన్‌లో భారీ అగ్నిప్రమాదం : 20 ప్లాట్లు దగ్ధం

Submitted on 10 June 2019
Barking fire Blaze destroys 20 flats in east London

ఈస్ట్ లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం (జూన్ 10,2019) డీ పాస్‌ గార్డెన్స్‌ సమీపంలోని ఓ నివాస సముదాయంలో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 100మంది అగ్నిమాపక సిబ్బంది  ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెస్తున్నారు. బిల్డింగ్ లోని 6వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. దీంతో ప్లాట్స్ లో నివాసం ఉంటున్న వారిని  సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ అగ్ని ప్రమాదంలో 20 ప్లాట్లు కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు, మంటలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  భయాందోళన చెందారు. అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపు మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు దీనిపై  విచారణకు ఆదేశించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Barking fire
Blaze
destroys
20 flats
east London
Fire Accident

మరిన్ని వార్తలు