చిల్లర లేదని తప్పించుకోలేరు: ‘బాబ్బాబూ’E-వాలెట్‌లో భిక్షం వేయండి 

Submitted on 15 July 2019
beggars cashless in china collect alms using qr codes and e- wallets

‘బాబ్బాబూ’ ధర్మం చేయండి.. రెండు రోజుల నుంచి అన్నం తినలేదు..అంటూ బిచ్చగాళ్లు అడుక్కోవడం చూసే ఉంటారు. అబ్బా చిల్లర లేదు వెళ్లవయ్యా.. అంటు విసుక్కుంటాం. కొంతమంది వారి నుంచి తప్పించుకోవటానికి చిల్లర లేదు అని కసురుకుంటారు. ఇకపై చిల్లర పేరుతో తప్పించుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పుణ్యమా అని బెగ్గింగ్ హైటెక్ అయిపోయింది. E-వాలెట్‌లో భిక్షం వేయాలని కోరుతున్నారు.

చిల్లర లేదని చెబితే..QR code చూపించి మరీ ‘బాబ్బాబూ’ అంటు వెంటపడతారు. వారి మొబైల్ నెంబర్ చెప్పి ఇ-వాలెట్‌లో భిక్షం వేయాలని అడుగుతారు. ఈ ముష్టి గోలంతా డెవలప్ మెంట్ లో దూసుకుపోతున్న మన పొరుగు దేశం చైనాలోనిది. 
Also Read : భయపడినట్లే జరిగింది :హైకోర్టు బయటే...సాక్షి దంపతుల కిడ్నాప్

చైనాలో పలు ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బిచ్చగాళ్లు ఐడీ కార్డుల తరహాలో QR code‌ (క్యూ‌ఆర్ కోడ్ - దీన్ని ఇ-వాలెట్స్ ద్వారా స్కాన్ చేస్తే డబ్బు సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో పడతుంది) మెడలో వేసుకుని  బిచ్చం అడుక్కుంటున్నారు. చిల్లర లేదని చెబితే.. క్యూఆర్ కోడ్ చూపించి..ఇ-వాలెట్ నుంచి మొబైల్ పేమెంట్ చేయాలంటున్నారు.

టెక్నాలజీని ఫాలో అవుతున్న చైనా బిచ్చగాళ్లు అలీ బాబా గ్రూప్‌కు చెందిన అలిపే లేదా టెన్సెంట్‌కు చెందిన వుయ్ చాట్ వాలెట్‌లను ఉపయోగిస్తున్నారు. చైనాలో ఎప్పటి నుంచో క్యాష్‌ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో నోట్లు, కాయిన్స్ వినియోగం బాగా తగ్గిపోవటంతో బిచ్చగాళ్లు డిజిటల్ బెగ్గింగ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ బెగ్గింగ్ తో వీరికి మరో ప్రయోజనం కూడా ఉంది. వారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు వేస్తే.. ఆన్‌లైన్ పేమెంట్ స్టార్టప్ సంస్థలు నుంచి కూడా డబ్బులు వస్తాయి.

Also Read : సిద్ధమౌతున్న జాతీయ టారిఫ్ విధానం : వేళలను బట్టి కరెంటు ఛార్జీలు

China
Beggars
cashless
using
qr codes
e- wallets

మరిన్ని వార్తలు