భువీ ఈజ్ బ్యాక్: ప్రాక్టీస్‌లో జోరు పెంచిన టీమిండియా

Submitted on 25 June 2019
Bhuvneshwar Kumar trains in indoor nets session

భారత బౌలర్ భువనేశ్వర్ మళ్లీ ఆడేందుకు సిద్ధమైపోయాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను అర్ధాంతరంగా వీడిన భువీ.. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. జూన్ 16న పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో భువనేశ్వర్‌ కుమార్‌ వెనుదిరిగాడు. వరల్డ్ కప్ సన్నాహాల్లో భువీకి బ్యాకప్‌ ప్లేయర్‌గా నవదీప్‌ సైనీని ఇంగ్లండ్‌కు రప్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. 

కానీ, అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ స్థానంలో చోటు దక్కించుకున్న మహ్మద్‌ షమీ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగి భారత్‌ను గెలిపించాడు. మరి భువనేశ్వర్ గురువారం ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్ధమైనప్పటికీ తుది జట్టులో చోటు కల్పించుకుంటాడా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్‌ 5మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. 

వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్‌తో పాటు భారత్ ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తోంది. అయితే భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షంతో ఒక్క మ్యాచ్ రద్దయింది. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌లతో కూడిన  భారత్‌ పేస్‌ బలగం పటిష్టంగా కనిపిస్తుంది. బొటనవేలి గాయంతో ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. భారత్‌ తన తర్వాతి ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా మ్యాచ్‌‌ను  గురువారం వెస్టిండీస్‌తో తలపడనుంది.

Bhuvneshwar Kumar
2019 icc world cup
world cup 2019
Team India
india

మరిన్ని వార్తలు