వాట్ యాన్ ఐడియా : కారును చాపర్ గా మార్చేశాడు 

Submitted on 11 August 2019
Bihar yong boy Mithi Lash who converted a car into a helicopter

బిహార్‌లోని ఛప్రా ప్రాంతానికి చెందిన మితిలేశ్ ప్రసాద్ కు చిన్నప్పటి నుంచీ హెలీకాఫ్టర్ అంటే  పిచ్చి..హెలీకాప్టర్ తయారుచేయాలని కోరిక. కానీ దానికి సరిపడా డబ్బులేదు. కానీ ఎలాగైనా చేయాలని పట్టుదలతో ఉన్నాడు. నిరంతరం అదే ధ్యాస. దీంతో TaT నానో కారును హెలికాఫ్టర్ గా మార్చేశాడు. 

 
పైప్ ఫిట్టర్‌గా పనిచేసే మితిలేశ్ కు చిన్నప్పటి నుంచి టెక్నాలజీపై మక్కువ. ఆ ఇష్టంతోనే ఆ మక్కువతోనే హెలికాఫ్టర్ రూపొందించాలని కలలు కనేవాడు. టాలెంట్ కూడా ఉంది. టాలెంట్ ఉంటే సరిపోదు కదూ..దానికి తగిన డబ్బు కూడా కావాలి..హెలికాఫ్టర్ తయారు చేసేందుకు కావాల్సిన పరికరాలు కొనడానికి డబ్బు లేదు. ఓ ఐడియా వచ్చింది. అందుబాటులో ఉన్న నానో కారుకు హెలికాఫ్టర్‌కు ఉండే తోక, పైన చక్రం తగిలించాడు.నానో కారునే హెలికాఫ్టర్ లుక్ లోకి మార్చిపడేశాడు. దానికి రంగురంగుల ఎల్ఈడీ లైట్స్ ఫిట్ చేశాడు. 

Read All so : వాడేసిన వంట నూనెతో వాహనాలు నడుస్తాయ్!!: మోడీ సర్కార్ న్యూ ప్లాన్
 
నానో కారు హెలికాప్టర్ గా తయారుచేయటానికి  ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. నిజమైన హెలీకాఫ్టర్ ను తయారు చేయటానికి తన వద్ద డబ్బు లేకపోయినా..కారునే హెలికాఫ్టర్ గా మార్చిన తృప్తి ఉందనీ..హెలికాఫ్టర్ కారులో ప్రయాణిస్తుంటే హెలికాఫ్టర్‌లో తిరిగిన ఫీలింగ్ కలుగుతోందంటున్నాడు మితిలేశ్.

Read All so :‘ఫ్లెక్స్‌మోటివ్‌’ వీడియో : కాళ్లు లేనివారు కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

If you don't know how to fly a helicopter, just make your car look like one! 🚁👏 (@ruptly)

A post shared by UNILAD Tech (@uniladtech) on

Nano-sized
BIHAR
Namo car
helicopter
Mithi Lash

మరిన్ని వార్తలు