బ్యాగుల్లో కుక్కేస్తున్నారు : ఈ Bit Coin మిషన్.. కరెన్సీ కక్కేస్తోంది!

Submitted on 13 June 2019
Bitcoin machine spits out money in middle of London station, internet shocked

ఏటీఎం మిషన్ మాదిరిగా బిట్ కాయిన్ మిషన్ లండన్ రైల్వే స్టేషన్ లో దర్శనమిచ్చింది. ఇక్కడి బిట్ కాయిన్ (ఫ్రీ క్యాష్ విత్ డ్రా) మిషన్ కరెన్సీ కక్కేస్తోంది. టన్నుల కొద్ది కరెన్సీ బిట్ కాయిన్ మిషన్ నుంచి బయటకొస్తోంది.

అది చూసిన ప్రయాణికులు.. స్టేషన్ ల్లో తమ బ్యాంకుల్లో కరెన్సీ కట్టలను నింపుకుంటున్నారు. లండన్ బాండ్ స్ట్రీట్ ట్యూబ్ స్టేషన్ లో బిట్ కాయిన్ మిషన్ నుంచి కరెన్సీ బయటకు వస్తున్న వీడియో కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో స్టేషన్ లోని ప్రయాణికులు బిట్ కాయిన్ మిషన్ పక్క నుంచి వెళ్తుండగా.. మిషన్ నుంచి 20 పౌండ్ నోట్లు బయటకు రావడం చూడవచ్చు. మిషన్ లో ట్రాన్స్ జెక్షన్ చేసేందుకు వచ్చిన వ్యక్తి కింద పడుతున్న కరెన్సీని బ్యాగులో సేకరించడం చూడవచ్చు.

ఈ వీడియోను రెడిట్ ప్లాట్ ఫాంపై షేర్ చేయగా.. 2.4వేలకు పైగా ఓట్లు 330కిపైగా కామెంట్లు వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Bitcoin machine
Money
London station
internet shock
currency notes
Free Cash withdraw 

మరిన్ని వార్తలు