దేవుడు సార్ మీరు : 2 వేల మంది రైతుల అప్పు తీర్చిన అమితాబ్

Submitted on 12 June 2019
Bollywood Big B Amitabh bachchan Pays Off Farmers loan

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ రైతుల అప్పులు తీర్చారు. ప్రామిస్ చేసినట్లుగానే చేశానని అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన 2 వేల 100 మంది రైతుల అప్పులు తీరుస్తానని గతంలో ఆయన ప్రామిస్ చేశారు. అనుకున్నట్లుగానే ఎంపిక చేసిన రైతుల అప్పులు తీర్చేశారు బిగ్ బి. 

తాను ముందుగా ప్రామిస్ చేసినట్లుగానే బీహార్ రాష్ట్రానికి చెందిన 2, 100 రైతులను ఎంపిక చేసి వారి అప్పులు తీర్చేసినట్లు అమితాబ్ బ్లాగ్‌లో వెల్లడించారు. కొందరి అప్పులను నేరుగా బ్యాంకులో వేయడం జరిగిందన్నారు. మరికొందరిని తన ఇంటికి పిలిపించి..అభిషేక్, శ్వేత చేతుల మీదుగా చెక్కులు అందించడం జరిగిందన్నారు.మరో ప్రామిస్ కూడా నెరవేర్చాల్సి ఉందన్న బిగ్ బి..దేశం కోసం పుల్వామా దాడిలో మృతి చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను..వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


బాలీవుడ్‌లో బిగ్ బిగా పిలుచుకొనే అమితాబ్ బచ్చన్...సినిమాలు, వివిధ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఆదాయంలో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. గతంలో కూడా ఎందరో రైతులను ఆదుకున్నారు. యూపీకి చెందిన 1000 మంది రైతులకు రూ. 5.5 కోట్ల రూపాయలు చెల్లించారు బిగ్ బి. 

Bollywood Big B
Amitabh Bachchan
Farmers loan
UP
BIHAR Formers Loan

మరిన్ని వార్తలు