అసలేం జరిగింది : చాక్లెట్ తిని చిన్నారి మృతి

Submitted on 15 July 2019
boy dies eating choclate

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్ తిని అభిచరణ్ తేజ (5) అనే చిన్నారి మృతిచెందాడు. మరో ఇద్దరు చిన్నారులు సంతోష్(7), రాహుల్(6) అస్వస్థతకు గురయ్యారు. వారికి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్ ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు.

చరణ్ తేజ్ ఆదివారం సాయంత్రం తన ఇంటికి సమీపంలోని ఓ కొట్టుకి వెళ్లాడు. అక్కడ చాక్లెట్స్ కొన్నాడు. వాటిని తన స్నేహితులతో కలిసి తిన్నాడు. ఆ తర్వాత ఇంట్లో వండిన చేపల కూరతో భోజనం చేసి ఆడుకోవడానికి బయటకి వెళ్లాడు. కాసేపటికి ఒక్కసారిగా నోట్లో నుంచి నురగలు వస్తూ పడిపోయాడు. మాట్లాడలేని స్థితిలో ఉండటంతో చేపల కూరలో చేప ముల్లు గొంతులో అడ్డుపడిందేమోనని తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికుల సాయంతో బుట్టాయగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది.

పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా అభయ్ చనిపోయాడు. చరణ్ తేజ్ తిన్న చాక్లెట్ లో ఎలుకల మందు కలిసిందని అది తిన్న బాలుడు మృతి చెందాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బాలుడు తల్లిపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా భార్య భర్తలు దూరంగా ఉంటున్నారని, కొడుకు అభయ్ మాత్రం తల్లి దగ్గరే ఉంటున్నాడని ఈ క్రమంలో కొడుకును అడ్డు తొలగించుకోవడం కోసం తల్లి ఇలా ప్లాన్ చేసిందా అనే డౌట్స్ కలుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

గతంలోనూ అభయ్ ఇలాగే అస్వస్థతకు గురి కావడంతో బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పిందన్నారు. మళ్లీ అదే రీతిలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలం చెల్లిన చాక్లెట్స్ తినడం వల్ల ఇలా జరిగిందని కొందరు అంటున్నా... అందులో నిజం లేదని అదే జరిగితే చాలామంది పిల్లలకు ఇలాగే జరగాలని చెబుతున్నారు. అభయ్ మరణం మిస్టరీగా మారింది. అభయ్ మృతికి అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Boy
dies
choclate
West Godavari
Buttayamgudem
poison

మరిన్ని వార్తలు