బిగ్ బ్రేకింగ్ : గడ్కరీ ప్రయాణిస్తున్న విమానంలో సీరియస్ ప్రాబ్లం

Submitted on 13 August 2019
Breaking: IndiGo aborts take-off in Nagpur after 'serious error' in flight; Nitin Gadkari was onboard

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. నాగ్ పూర్ నుంచి ఢిల్లీ మధ్య నడిచే ఇండిగో 6E 636 విమానం ఇవాళ(ఆగస్టు-13,2019)ఉదయం నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు టేకాఫ్ అవుతున్న సమయంలో పెద్ద సాంకేతిక సమస్యను గుర్తించి పైలట్.. వెంటనే విమాన టేకాఫ్ కాకుండా రన్ వే పై నుంచి అతికష్టం మీద టాక్సీ వే పైకి తీసుకొచ్చాడు. ఇవాళ ఢిల్లీలోని లోక్ కళ్యాన్ మార్గ్ లో జరిగే కేంద్ర కేబినెట్ భేటికి హాజరయ్యేందుకు గడ్కరీ ఈ విమానం ఎక్కారు.

విమానంలో గడ్కరీతో పాటు ఉన్న ప్రయాణికులందరూ సేఫ్ గా ఉన్నట్లు  అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరినీ సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. వేరే ఫ్లైట్ ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

nitin gadkari
technical problem
SERIOUS ERROR
take off
ONBOARD
ABORTED

మరిన్ని వార్తలు