Breaking News

[9 : 01]

హైదరాబాద్ : తెలంగాణలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలయ్యారు. జీహెచ్ఎంసీ నుండి 14 మంది, ఏసీపీ, టీపీఓ, టీపీఎస్ అధికారులు ఇతర జిల్లాలకు బదిలీయ్యారు.

[7 : 16]

హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఓపెన్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

[7 : 15]

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుండి బీ ఫార్మసీ చివరి దశ కౌన్సెలింగ్ జరుగనుంది. నేడు, రేపు వెబ్ ఆప్షన్లు ఎంచుకొనే అవకాశాన్ని కల్పించారు. 20న సీట్ల కేటాయింపు జరగనుంది. 

[7 : 14]

హైదరాబాద్ : నేడు ఐఐసీటీ ఆడిటోరియంలో సదస్సు జరగనుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 

[7 : 13]

హైదరాబాద్ : రాజ్ భవన్ స్కూల్ లో నేడు టీకాల కార్యక్రమాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. తట్టు, రూబెల్లా వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 9-15 ఏళ్ల లోపు పిల్లలకు ఐదు వారాల పాటు టీకాలు వేయనున్నారు. 

[7 : 11]

ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లో నేడు ఢిల్లీ దబాంగ్ తో తమిళ తలైవాస్ ఢీకొననుంది. మరో మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

 

[7 : 10]

తూర్పుగోదావరి : కాకినాడ ఎన్నిక నిర్వాహణపై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది.

 

[7 : 09]

హైదరాబాద్ : నేటి నుండి 28 వరకు ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాలతో సహా వివిధ ప్రాంతాల్లో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 78 పోస్టుల భర్తీ జరగనుంది. ఈ పరీక్షకు 3,900 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 

[7 : 08]

హైదరాబాద్ : ఓయూలో నేటి నుండి న్యాక్ బృందం పర్యటించనుంది. ఓయూకి 2013లో నాక్ గుర్తింపు ముగిసిపోయింది. 

[6 : 12]

విజయవాడ : సీఆర్డీఏపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈనెల 24, 25 తేదీల్లో పరిపాలన నగరానికి సంబంధించిన 400 పేజీల మాస్టర్ ప్లాన్ నివేదికను సీఎంకు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు అందచేయనున్నారు. 

[6 : 08]

విజయవాడ : నేడు మరోసారి సీఎం చంద్రబాబుతో గంగుల ప్రతాప్ రెడ్డి భేటీ కానున్నారు. టిడిపిలో గంగుల చేరికపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 

[6 : 07]

కరీంనగర్ : రాంనగర్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 31 మందిపై కేసులు నమోదు చేశారు. 7 కార్లతో పాటు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

 

[6 : 04]

సంగారెడ్డి : నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేపట్టనున్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేయనున్నారు. 

[22 : 20]

విజయవాడ : మొఘల్ రాజ్ పురం నారాయణ ఒలింపియాడ్ స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తో ఏసీ మిషనల్ లో మంటలు చెలరేగాయి. రెండు తరగతి గదులు, దగ్ధం అయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

[22 : 16]

కృష్ణా : గన్నవరం మండలంలో తల్లీకొడుకులు హత్య గావించబడ్డారు. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న తల్లి, కొడుకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మృతులు జొన్నలగడ్డ నాగలక్ష్మీ, అవినాష్. పాతకక్షలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

[21 : 11]

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా కొత్తగా 84వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. లక్షా 12 వేల ఉద్యోగ నియామకాలే లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 58 నోటిఫికేషన్ల ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు...మరో నెల రోజుల్లో 12 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. 

 

[20 : 36]

తూ.గో : వై.రామవరం మండలం చౌటుదిబ్బ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత కలిగింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

[20 : 33]

అమరావతి : నంద్యాలలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు సమక్షంలో గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు. గంగులను సీఎం వద్దకు అచ్చెన్నాయుడు తీసుకొచ్చారు. 

 

[20 : 29]

రంగారెడ్డి : శంషాబాద్ తహశీల్దార్ ఆఫీస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. తహశీల్దార్ కార్యాలయం తాళాలు పగలగొట్టి, ముసుగు ధరించి ఇద్దరు దొంగలు దోపిడీకి యత్నించారు. సీసీ కెమెరాలకు కవర్లు కప్పి దోపిడీకి యత్నించారు. తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

[20 : 22]

గుంటూరు : వెలగపూడి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. 

[20 : 11]

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మరో కొత్త కంపెనీ ముందుకొచ్చింది. సంస్థ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తమకు ఇస్తే.. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు కొత్త కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

[18 : 47]

గుంటూరు : కాంగ్రెస్ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో కాసేపట్లో అచ్చెన్నాయుడుతో కలిసి చంద్రబాబును కలవనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన గంగుల ప్రతాప్ రెడ్డి.

[18 : 22]

శ్రీకాకుళం : వంశధార నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. పాడలి, దుగ్గుపురం గ్రామాల్లోని పొలాల్లో పని చేస్తున్న వందలాది మంది నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. 200 మందికిపైగా అరెస్టు చేసి, పోలీసు స్టేషన్ కు తరలించారు. 

 

[18 : 17]

గుంటూరు : అమరావతిలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ పర్యటించారు. అసెంబ్లీ, సచివాలయాన్ని పరిశీలించారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం గురించి మంత్రి నారాయణ అనుప్రియకు వివరించారు. 

[17 : 16]

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సన్మానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

[17 : 15]

హైదరాబాద్ : ఉప్పల్ లో స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు కేంద్రీయ స్కూల్ విద్యార్థులకు గాయాలయ్యాయి. 

[17 : 11]

చెన్నై : మెడికల్ కౌన్సెలింగ్ ను నిలిపివేయాలంటూ తమిళనాడు రాష్ట్ర వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

[17 : 10]

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభం దగ్గరి నుండి సెన్సెక్స్ లాభాల బాటలోనే కొనసాగింది. సెన్సెక్స్ 31,770.89 వద్ద ముగియగా నిఫ్టీ 9,897 వద్ద ముగిసింది. 

[17 : 05]

ఢిల్లీ : త్రిపుర ముఖ్కమంత్రి మాణిక్‌ సర్కార్‌ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయకపోవడాన్ని సీపీఎం తీవ్రంగా ఆక్షేపించింది.

[16 : 48]

విజయవాడ : మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను గుర్గావ్ కు చెందిన మాస్ ట్రాన్సిటీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం అప్పగించింది. డీపీఆర్ తయారీకి రూ. 98 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. 

[16 : 47]

విజయవాడ : నరుకుల పాడు వద్ద నక్కలవాగులో ఇద్దరు యువతులు అనుమానస్పదంగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

[16 : 05]

కర్నాటక : బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఓ స్కూల్ బిల్డింగ్ లోకి వరదనీరు ముంచెత్తింది. 

[16 : 04]

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇవ్వాలని లేఖలో కోరారు. 

[16 : 02]

హైదరాబాద్ : జెన్ పాక్ట్ ఐటీ క్యాంపస్ లో షీ షటిల్ బస్సులను సీపీలు మహేందర్ రెడ్డి, మహేష్ భగవత్ లు ప్రారంభించారు. 

[16 : 01]

హైదరాబాద్ : సీఎస్ ఎస్పీ సింగ్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భేటీ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. 

[16 : 00]

విజయవాడ : డీజీపీ ఆఫీసు వద్ద ఆక్టోపస్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాలను సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల, డీజీపీలు తిలకిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వనరులు మనకున్నాయని, అమరావతిలో సౌరవంతమైన భూమి ఉందన్నారు.

[15 : 57]

నల్గొండ : కుంతియా చెప్పినంత మాత్రానా అయ్యేదేమీ లేదని, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకత్వాన్ని కార్యకర్తలు కోరుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

[15 : 52]

హైదరాబాద్ : 2019వరకు ఎన్నికల్లో పోటీ చేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళుతామన్నారు.

[15 : 23]

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నిక విషయంలో జనసేన ఓ నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను సినీ నటుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ కాసేపట్లో చేయనున్నారు. 

[15 : 09]

ఒడిశా : భువనేశ్వర్ లో స్వైన్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. 155 పాజిటవ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం. 

[15 : 07]

హైదరాబాద్ : సెప్టెంబర్ నెలాఖరు నుండి డిసెంబర్ 15వ తేదీలోగా ఛార్జీషీట్లు దాఖలు చేయడం జరుగుతుందని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. విచారణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని, ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 8వేల కేసులు నమోదయ్యాయన్నారు.

[14 : 35]

ఢిల్లీ : రోహిత్ వేముల ఆత్మహత్యపై అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రూపన్ వాల్ నివేదిక సమర్పించారు. హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖకు ఈ నివేదిక అందించారు.

[14 : 31]

సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 12 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

[14 : 22]

విజయవాడ : ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్..కమ్యూనికేషన్స్ అధికారుఅలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ - ప్రగతి రూపొందించిన ఆధునాతన సాఫ్ట్ వేర్ పై చర్చ జరిగింది. ప్రభుత్వ రుణమార్పిడి విధానంపై ఆధునాతన సాఫ్ట్ వేర్ ఈ - ప్రగతి రూపొందించింది.

[14 : 20]

కర్నూలు : విద్యుత్ భవన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ. 6 వేలు లంచం తీసుకుంటున్న లైన్ ఇన్ స్పెక్టర్ ప్రభాకర్ ఏసీబీకి చిక్కాడు. 

[13 : 40]

నిర్మల్ : బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం ఆచూకీపై సస్పెన్ష్ ఇంకా కొనసాగుతోంది. స్టోర్ ఇన్ ఛార్జీ సుశీల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. విగ్రహ తరలింపుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే ఇద్దరు పూజారులపై సస్పెన్షన్ వేటు వేశారు. 

[13 : 22]

హైదరాబాద్ : కలెక్టర్ గా యోగితా రాణను నియమిమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యోగితా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 

[13 : 06]

బీహార్ : ఓ గ‌ర్భిణి రెస్క్యూ బోటు లోనే పురుడు పోసుకుంది. గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ధుబ‌ని జిల్లాలోనూ వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. అక్క‌డ నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణీని రక్షించి బోటులో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

[13 : 04]

హైదరాబాద్ : ఏడాదిలోపు ఓఆర్ఆర్ ప‌రిధిలోని గ్రామాలన్నింటికీ అంటే దాదాపు 10 ల‌క్ష‌ల మందికి మంచినీరు అందుతుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొంప‌ల్లి ద‌గ్గ‌ర మిష‌న్ భ‌గీర‌థ పైప్ లైన్ ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. రూ.

[13 : 00]

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలోని వరద ప్రాంతాల పరిస్థితిని సీఎం యోగి ఆదిత్య నాథ్ సమీక్షిస్తున్నారు. బుధవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. 

[12 : 47]

విజయవాడ : మంగళగిరిలో ఏపీ ఎస్పీ బెటాలియన్ లో పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రులు చిన్న రాజప్ప, నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. భవనం వివరాలపై డీజీపీ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

[12 : 45]

హైదరాబాద్ : కొంపల్లి సినీ ప్లానెట్ వద్ద మిషన్ భగీరథ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 183 గ్రామాలు, 7 మున్సిపాల్టీలకు రూ. 628 కోట్లతో ప్రభుత్వం మంచినీటి వసతి కల్పించనుంది. ఈ పథకం ద్వారా 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

[12 : 18]

విజయవాడ : రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో - యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ సిటీకి బాబు శంకుస్థాపన చేశారు.

[12 : 16]

హైదరాబాద్ : నేరేళ్ల ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంజీఎం వైద్యుల నివేదికను సీల్డ్ కవర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. బాధితులకు తీవ్రగాయాలైనట్లు నివేదికలో వెల్లడించింది. అందరికీ ఒకేచోట తీవ్రగాయాలు ఎలా జరిగాయని కోర్టు ప్రశ్నించింది.

[12 : 03]

హైదరాబాద్ : మెహిదీపట్నంలో గోడ కూలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

[11 : 59]

ఢిల్లీ : కేరళలో లవ్ జిహాద్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మత మార్పిడిలు, వివాహాలపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

[11 : 51]

బెంగళూరు : నగరంలో 'ఇందిరా' క్యాంటీన్ లు ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ క్యాంటీన్ లను ప్రారంభించారు. 

[11 : 46]

మేడ్చల్ : ఓఆర్ఆర్ లోని గ్రామాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 183 గ్రామాలకు రూ. 628 కోట్లతో తాగునీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టినట్లైంది. ఈ పథకం ద్వారా 1.50లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

[11 : 44]

విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు గఫూర్ పాల్గొన్నారు. 

[11 : 19]

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో - యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ సిటీకి ఆ సంస్థ సీఈవో అజయ్ రాజన్ గుప్తా కుటుంబసభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. 

[11 : 08]

భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ (మం) నర్సంపేటలో రాయల భాస్కర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. న్యూ డెమోక్రసీ రవి దళ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

[11 : 07]

ఢిల్లీ : త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని సెన్సార్ చేయడాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. మాణిక్ సర్కార్ ప్రసంగం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో ప్రసారం కాకుండా కేంద్రం అడ్డుకొంది.

[11 : 02]

కర్నూలు : నంద్యాల (మం) వెంకటేశ్వరపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తున్నారు. టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని, ఓటు తూటాతో వైసీపీకి బుద్ధి చెప్పాలని సూచించారు. 

[10 : 47]

విజయవాడ : ఎర్రబాలెంలో ఇండో - యూకే హెల్త్ మెడిసిటీ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. వెన్యూ కన్వెన్షన్ నుండి రిమోట్ ద్వారా శిలాఫలకాన్ని బాబు ఆవిష్కరించనున్నారు. 

[10 : 46]

ఢిల్లీ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తోంది. పూంచ్ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులను భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టింది. 

[10 : 46]

తమిళనాడు : డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో కరుణా చికిత్స పొందుతున్నారు. 

[10 : 46]

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్రను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు నినాదాలు చేశారు. 

[10 : 45]

కర్నూలు : నంద్యాల (మం) వెంకటేశ్వరపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తున్నారు. 

[10 : 07]

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, బారాముల్లా హంద్వారాలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఉగ్రవాదుల నిధుల వ్యవహారంపై 12 ప్రాంతాల్లో ఎన్ ఐఏ తనిఖీలు నిర్విహించినట్టు తెలుస్తోంది.

[9 : 39]

కర్నూలు : జిల్లా నంద్యాల్లో బాలకృష్ణ ప్రచారానికి పోటీగా వైసీపీ నుంచి రోజు ప్రచారం చేయనున్నారు. ఆమె నంద్యాల రూరల్, గోప్పాడు మండలాల్లో ప్రచారం చేయబోతున్నారు.

[8 : 11]

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కావడంతో పోటీలో ఎంత మంది మిగులుతారో చూడాలి. ఎన్నికలు ఈ నెల 29న, సెప్టెంబర్ 1న ఫలితాలు విడుదల కానున్నాయి.

[8 : 05]

గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీకి ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

[7 : 58]

విజయవాడ : ఏపీ విద్యుత్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. నేడు విజయవాడలో విద్యుత్ కాంట్రాఖ్ట కార్మికుల భారీ ప్రదర్శన అనంతరం వారు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

[7 : 55]

చిత్తూరు : నేడు తిరుమలలో ఉట్లోత్సవం జరగనుంది.

[7 : 47]

గుంటూరు : జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామం దగ్గర ఆగివున్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

[7 : 44]

గుంటూరు : ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సంయుక్త కృషి వల్లే బాలుడు సురక్షితంగా బయటపడ్డాడడని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.

[7 : 03]

గుంటూరు : జిల్లా ఉమ్మడివరంలో బోరు బావిలో పడ్డ చంద్రశేఖర్ సురక్షితంగా బయటపడ్డాడు. నిన్న మధ్యాహ్నం 3గంటలకు బోరు పడ్డ చిన్నారిని రాత్రి 2గంటల సమయంలో బయటకు తీశారు.

[22 : 02]

గుంటూరు : జిల్లాలో మరోసారి మానవ తప్పిదం ఓ బాలుడి ప్రాణాలమీదికి తెచ్చింది. వినుకొండ మండలం ఉమ్మడివరంలో తెరిచిఉన్న బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

[22 : 00]

గుంటూరు : వినుకొండ మండలం ఉమ్మడివరంలో ప్రమాదవశాత్తు బాలుడు బోరు బావిలో పడ్డాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు. బోరుబావి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 

[20 : 44]

 గుంటూరు : జిల్లాలో బోరు బావిలో బాలుడు పడిన ఘటనలో హోంమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

Pages

Don't Miss