Breaking News

[8 : 14]

తిరుపతి : గొల్లపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా కూబింగ్ చేపట్టారు. శ్రీ కాళహస్తి సమీపంలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో అటవీ శాఖ అధికారులు భారీగా కూబింగ్ చేపట్టారు.

[7 : 08]

హైదరాబాద్ : సెప్టెంబర్ 2న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు జరగనున్న ప్రగతి నివేదన సభకు రెండు గంటలు ముందుగా ఈ సమావేశాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రగతిభవన్ లో సెప్టెంబర్ 2 మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగనుంది.

[6 : 45]

చెన్నై : సేలం సమీపంలోని మామందూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 8మంది మృతి చెందారు. మరో 30మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

[6 : 36]

నల్లగొండ : హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకున్న నలుగురు సిబ్బందిపై వేటేసినట్టు కామినేని ఆసుపత్రి తెలిపింది. ఈ ఘటన అమానుష, అనాగరిక ప్రవర్తన వల్ల జరిగిన తప్పిదమని, జరిగిన తప్పుకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

[20 : 56]

హైదరాబాద్ : సెప్టెంబర్ 2న మ.1.గంటకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతి నివేదన సభకు గంట ముందుగానే కేబినెట్ సమావేశం జరగనుంది. ముందస్తు ఊహాగానాలతో కేబినెట్ సమావేశానికి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 

[20 : 30]

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

[19 : 00]

విశాఖపట్నం : నక్కపల్లిలో ఓ విద్యార్థి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దొడ్డి త్రినాథ్ అనే రాజమండ్రికి చెందిన యువకుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.

[18 : 56]

ఢిల్లీ : ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. అండర్సన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన కోహ్లీ... టెస్టుల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

[17 : 38]

తిరుపతి : తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి చంద్రబాబు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

[17 : 35]

తిరుపతి : కేన్సర్ వ్యాధిని నివారించేందుకు..క్యాన్సర్ వ్యాధి గ్రస్థుల కోసం ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

[17 : 34]

తూర్పుగోదావరి : రాజమండ్రి నగరంలోని రంభ, ఊర్వశి థియేటర్లలో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా తీవ్ర భయాందోళనలకు గురైన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.

[17 : 26]

ఢిల్లీ : ఏపీ హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడున్న హైకోర్టు ఏపీకి ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. 

[16 : 28]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

[15 : 34]

తిరుపతి : క్యాన్స్ రోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. క్యాన్సర ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ఆధునాతనమైన సౌకర్యాలు శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థలో రాబోతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు.

[14 : 44]

తిరుపతి : శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ వైద్య, విజ్నాన సంస్థ నిర్మాణానికి, క్యాన్సర్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో క్యాన్సర్ ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

[12 : 08]

ఢిల్లీ : 'జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 35 ఏ' పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ జనవరి 2019కి వాయిదా వేసింది. 

[12 : 06]

చిత్తూరు : అలపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది.

[12 : 02]

విజయవాడ : టిడిపితో తమది సోదర బంధమని కర్నాటక సీఎం కుమార స్వామి పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సినవసరం ఉందని, వీలైనన్నీ పార్టీలను కలుపుని వెళుతామన్నారు. ఇప్పటికే చర్చలు జరిపామని, ఈ రోజు జరిగిన భేటీ దానికి కొనసాగింపు అన్నారు. 

[11 : 54]

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలుగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

[11 : 51]

హైదరాబాద్ : ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీ లక్ష్మీ, వైవి సుబ్బారెడ్డిలు హాజరయ్యారు. 

[11 : 51]

హైదరాబాద్ : ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. 

[11 : 50]

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్ కే ప్రసాద్ దర్శించుకున్నారు. ఆసియా కప్ పాల్గొనే జట్టును రేపు ప్రకటిస్తామని టెన్ టివితో ప్రసాద్ తెలిపారు.

[10 : 52]

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఘనత మరోసారి స్పష్టమైందని ఎంపీ గుత్తా పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని, నాలుగేళ్లుగా సాధించిన విజయాల కోసమే ప్రగతి నివేదన సభ అన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులంతా కుటుంబంతో సహా హాజరు కావాలని, కాంగ్రెస్ నేతలే ఆవేదనలో ఉన్నారని తెలిపారు.

[10 : 47]

ఢిల్లీ : ఐఆర్ సీటీసీ కేసులో లాలూ కుటుంబానికి ఊరట లభించింది. రబ్రీదేవి, తేజశ్రీలకు పటియాల హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. 

[10 : 42]

విజయవాడ : గేట్ వే హోటల్ లో కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని, ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే విధంగా అన్ని ఆలోచనలు చేస్తున్నామన్నారు.

[10 : 21]

ఢిల్లీ : ఐఆర్సీటీసీ కేసులో నిందితులందరికీ బెయిల్ లభించింది. 14 మందికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాల హౌస్ కోర్టు తీర్పును వెలువరించింది. 

[10 : 11]

విజయవాడ : గేట్ వే హోటల్ లో కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా ఉన్నారు. చిత్తూరు పర్యటనకు వెళుతూ మధ్యలో ఆగి కుమార స్వామితో బాబు, మంత్రులు భేటీ అయ్యారు. 

[10 : 09]

మెదక్ : తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కంటెనర్ బీభత్సం సృష్టించింది. రెండు టోల్ బూత్ లు, రెండు కార్లను కంటైనర్ ఢీకొంది. వరంగల్ సీపీ విశ్వనాథ్ కారుతో పాటు మరో కారుకు ప్రమాదం ఎదురైంది. కారులో ప్రయాణిస్తున్న సీపీ బంధువు అనిత మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో సీపీ లేరు. 

[10 : 08]

కర్నూలు : మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు మోహన్ భగవత్ దర్శించుకున్నారు. 

[9 : 16]

హైదరాబాద్ : మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.35 కాగా డీజిల్ ధర రూ. 76.47 కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.97 కాగా డీజిల్ ధర రూ. 77.76 కి చేరింది. 

[9 : 14]

నిజామాబాద్ : ధర్మపురి సంజయ్ జైలు నుండి విడుదలయ్యారు. నర్సింగ్ విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసులో బెయిల్ పై విడుదలయ్యారు. 

[9 : 10]

శ్రీశైలం : నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రవాహంతో సాగర్ భారీగా నీరు వచ్చి చేరుతోంది. సాగర్ నీటి మట్టం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 582 అడుగులకు నీరు చేరింది. మధ్యాహ్నానికి ఇదే ప్రవాహం ఉంటే అధికారులు గేట్లను తెరుస్తారని తెలుస్తోంది. 

[9 : 08]

హైదరాబాద్ : స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్ కు వేధింపులు ఎదురయ్యాయి. హైదరాబాద్ కు చెందిన అజయ్ రెడ్డిపై పైలట్ కు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కు పైలట్ సమాచారం అందించాడు.

[9 : 04]

ఢిల్లీ : వరదల బీభత్సంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఎంతో మంది ఆర్థిక సహాయం అందచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1027 కోట్ల రూపాలయ విరాళాలు అందాయని ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది. 

[8 : 27]

హైదరాబాద్ : ప్రముఖ దర్శకురాలు జయ మృతి చెందడం పట్ల నిర్మాత సి.కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జయ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. జయ తమ కుటుంబసభ్యురాలని, , జయ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు.

[7 : 55]

కడప : నేడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు పర్యటించనున్నారు. కలెక్టరేట్ లో దళిత సంఘాల నుండి కమిషన్ సభ్యుడు శ్రీరాములు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం కలెక్టరేట్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.  

[7 : 54]

నల్గొండ : నార్కట్ పల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఓ బైక్ డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

[7 : 53]

పశ్చిమగోదావరి : ఏలూరు అంబికా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమయానికి స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

[7 : 51]

సంగారెడ్డి : ఐడీఏ బొల్లారంలో నకోడా జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. 

[7 : 50]

సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద లారీని తూఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఎస్ఆర్ నగర్ వాసులు.

[6 : 26]

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకురాలు బి. జయ కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఆమె వయస్సు 54 ఏళ్లు.

[6 : 22]

సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద లారీని తూఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

[6 : 18]

హైదరాబాద్ : డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కోసం సెప్టెంబర్ 2న నిర్వహించతలపెట్టిన ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. 

[6 : 16]

చిత్తూరు : ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తిరుపతికి రానున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. 

[6 : 15]

విజయవాడ : విజయవాడకు కర్నాటక సీఎం కుమార స్వామి రానున్నారు. ఉదయం 8.30గంటలకు ఆయన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. 

[6 : 14]

కర్నూలు : నేటి నుండి మూడు రోజుల పాటు మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు హాజరు కానున్నారు. 

[6 : 12]

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి భార్య ఉమ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 

[6 : 09]

హైదరాబాద్ : దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో మృతి చెందారు. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ప్రేమికులు, గుండమ్మ గారి మనువడు, లవ్ లీ, వైశాఖం సినిమాలకు జయ దర్శకత్వం వహించారు. 

[19 : 50]

హైదరాబాద్ : బొల్లారం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. వినాయక్ నగర్ లో ఓ యువకుడు విద్యార్థిని గొంతు కోశాడు. నికిత అనే 10వ తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడిన యువకుడు గొంతు కోసాడు.

[19 : 38]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీ చేస్తు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

[19 : 33]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా రామా రాజేశ్వరి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాశ్ రెడ్డి, ఎల్బీ నగర్ డీసీపీగా సుమతి, నార్త్ జోన్ డీసీపీగా కమలేశ్వర్ లు బదిలీలయ్యారు.  

[19 : 15]

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత్‌మరో బంగారుపతాకాన్ని సాధించింది.అథ్లెటిక్స్‌లో 1500 మీటర్ల పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన జిన్సన్‌ జాన్సన్‌ మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకున్నాడు.

[19 : 11]

అమరావతి : చెన్నై తాఉగనీటి అవకాసరాల కోసం.. 15 టీఎంసీల నీరును విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరును విడుదల చేయాలని కర్నూలు నీటిపారుదల శాఖ సీఈకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

[18 : 34]

విశాఖపట్నం : జిల్లాకు పిడుగు హెచ్చరికలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జారీ చేసింది.

[18 : 28]

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన భారీ సభకు అనుమతి ఇవ్వవద్దంటు హైకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది.

[18 : 11]

హైదరాబాద్ : దివంగత హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తన తండ్రి హరికృష్ణ చితికి కల్యాణ్ రామ్ నిప్పు పెట్టారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, సెల్యూట్ చేశారు.

[17 : 32]

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్టు సమాచారం.

[14 : 00]

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుండి జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానం వరకు కొనసాగనుంది. 

[13 : 47]

హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ముందస్తు యాక్షన్ ప్లాన్ ను హై కమాండ్ సూచించనుంది.

[13 : 25]

యాదాద్రి : స్నేహితులు పెట్టిన ఓ ఫొటో ఓ విద్యార్థినిని బలి తీసుకుంది. ఆలేరు (మం) కొల్లూరులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఈ ఫొటోను స్నేహితులు వాట్సాప్ లో పెట్టారు. పరువు పోయిందని భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 

[13 : 04]

హైదరాబాద్ : సినీ నటుడు హరికృష్ణ నివాసానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. బంధువులను మాత్రమే అనుమతించాలని సూచించారు. అభిమానులు మహా ప్రస్థానానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. 

[12 : 26]

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిపికేషన్ ను జారీ గురువారం ఉదయం చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. 

[12 : 18]

హైదరాబాద్ : మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఛాంపియన్ షిప్ లో రెండు గ్రూపుల మధ్య గొడవ చెలరేగింది. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

[11 : 53]

జార్ఖండ్ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఎదుట లొంగిపోవాలని రాంచీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టు వద్దకు చేరుకున్నారు. 

[11 : 18]

జమ్మూ కాశ్మీర్ : బండిపోరాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒక ఉగ్రవాది హతం కాగా, మరో ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. 

[11 : 13]

హైదరాబాద్ : సినీ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ పార్థీవ దేహానికి టిడిపి మంత్రి సోమిరెడ్డి నివాళి అర్పించారు. చైతన్య రథాన్ని నడిపించిన నాయకుడు హరికృష్ణ అని, కానీ దురదృష్టవశాత్తు డ్రైవింగ్ లో చనిపోవడం బాధాకరమన్నారు.

[11 : 03]

ఢిల్లీ : కేరళ వరద బాధితుల సహాయార్థం సీంఎ రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వచ్చాయని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈనెల 28 వరకు రూ. 738 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. 

[9 : 13]

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ పార్థీవ దేహానికి ఆయన నివాళులర్పిస్తున్నారు. 

[9 : 02]

చిత్తూరు : తిరుపతిలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

[8 : 09]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతి చెందడం పట్ల మంత్రి పోచారం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆత్మయంగా పలకరించేవాడని, ఆయన మరణం అందరికీ దుఖాన్ని కలుగ చేస్తోందన్నారు.

[7 : 51]

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ పర్యటనకు బయలుదేరారు. ఖాట్మండులో జరిగే బిక్ స్టెక్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. 

[7 : 49]

చిత్తూరు : ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ దంపతులు తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం వారు శ్రీవారిని దర్శించుకున్నారు. 

[7 : 48]

చెన్నై : టిడిపి నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ లేఖ రాశారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు స్టాలిన్ సానుభూతి తెలియచేశారు. 

[7 : 47]

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును పూణే పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను నేటి నుండి సెప్టెంబర్ 5వరకు గృహ నిర్భందం చేయనున్నారు. వరవరరావును అరెస్టు చేయడంతో ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

[6 : 17]

విజయవాడ : నేడు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ విజయవాడకు రానున్నారు. పార్టీ నేతలతో మొయిలీ సమావేశం కానున్నారు. 

[6 : 16]

సాథాంప్టన్ లో నేడు భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

[6 : 15]

ఆసియా క్రీడల్లో హకీ పురుషుల సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్ - మలేషియా జట్లు ఢీకొననున్నాయి. స్వాష్ మహిళల టీమ్ లో భారత్ - హాంకాంగ్, మహిళల 1500 మీటర్లలో పలకీజ్, మౌనిక, పురుషుల 1500 మీటర్లలో జిన్సన్ జాన్సన్, మంజీత్ లు పోటీ పడనున్నారు. 

[6 : 13]

విశాఖపట్టణం : జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 250వ రోజు విశాఖపట్టణంలోని అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగనుంది. మార్టూరు, బవులువాడ, త్రిమూర్తులు నగర్ లో పాదయాత్ర కొనసాగనుంది. 

[6 : 12]

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నై పర్యటన రద్దు అయ్యింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంతాప సభకు బాబు హాజరు కావాల్సి ఉంది. బాబుకు బదులుగా గజపతి రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్ లు చెన్నై వెళ్లనున్నారు. 

[6 : 10]

ఢిల్లీ : కృష్ణా, గోదావరి బోర్డుల అంశాలపై నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. 

Pages

Don't Miss