Breaking News

[6 : 08]

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2.30గంటలకు యాత్ర కొనసాగనుంది. 

[6 : 06]

హైదరాబాద్ : తెలంగాణలలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. 9మంది ఐపీఎస్ లు బదిలీలయ్యారు.

[6 : 03]

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

[20 : 55]

ఢిల్లీ: డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వాహనాదారులను బెంబేలెత్తిస్తున్నాయి. డీజిల్ రేట్లు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్ల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.

[20 : 53]

ఢిల్లీ : ఇరాక్‌లోని అంబర్ ప్రొవిన్స్‌లో ఈరోజు ఉదయం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

[20 : 22]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందులో స్వల్ప మార్పులు చేసుకున్నాయి.

[18 : 55]

హైదరాబాద్ : పౌరహక్కుల సంఘాల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారిని అరెస్ట్ చేయటం సరికాదంటు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పౌరహక్కుల సంఘాల నేతలకు ఊరట లభించింది.

[18 : 36]

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో దివంగత హరికృష్ణ అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు.

[18 : 35]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ విషాద మరణం చాలా దురదృష్టకరమని.. దుర్దినం అని ప్రముఖ నటుడు చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు.

[15 : 45]

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, నటుడు అయిన హరికృష్ణకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నివాళులర్పించనున్నారు. మెహిదీపట్నంలోని హరికృష్ట నివాసానికి చేరుకుని గవర్నర్ నరసింహన్ నివాళులర్పించున్నారు.

[15 : 42]

హైదరాబాద్ : హరికృష్ణ పార్ధీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

[14 : 39]

హైదరాబాద్ : మాజీ దివంగత నేత, మాజీ సీఎం అయిన ఎన్టీఆర్ కు హరికృష్ణ అంత్యంత ఇష్టుడు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

[14 : 18]

నల్లగొండ : హరికృష్ణ మృతికి కారు అతి వేగంతో డ్రైవ్ చేయటమే కారణమని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కారు డ్రైవ్ చేసే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రాణాలు పోవటానికి కారణమనీ..బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తగ్గే అవకాశముండేదని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

[13 : 56]

హైదరాబాద్ : అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరిపించాలని సీఎం కేసీఆర్ సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సంప్రదించి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

[13 : 38]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెహిదీపట్నం వెళ్లనున్నారు. అక్కడ హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. 

[12 : 52]

హైదరాబాద్ : నల్గొండ నుండి కామినేని ఆసుపత్రి నుండి హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మెహిదీపట్నం నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

[12 : 49]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతికి సిని, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియచేశారు. గురువారం ముర్తుజగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

[12 : 48]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అకాల మృతిపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణ వార్తను విని తట్టుకోలేక పోతున్నానని, తనను నోరారా అమ్మా అని పిలిచేవాడని తెలిపారు.

[12 : 17]

నల్గొండ : నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాసేపటి క్రితం హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. 

[11 : 44]

నల్గొండ : హరికృష్ణ భౌతికకాయానికి నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో వైద్యులు పోస్టమార్టం పూర్తి చేశారు. 

[11 : 26]

హైదరాబాద్ : సినీ నటుడు, నిర్మాత, టిడిపి నేత హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. 

[11 : 14]

నల్గొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

[10 : 12]

నల్గొండ : నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి నేత హరికృష్ణ భౌతికకాయాన్ని ఉంచిన నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధేశ్వరీలు ఆసుపత్రికి చేరుకున్నారు. 

[9 : 48]

కృష్ణా : నిమ్మకూరు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ మృతి చెందడం పట్ల పలువురు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా స్వస్థలం నిమ్మకూరులో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నిమ్మకూరులో రూ.

[9 : 43]

హైదరాబాద్ : పుట్టిన రోజుల వేడుకలపై అభిమానులకు ఒక లేఖ రాయాలని హరికృష్ణ ఆలోచించారు. సెప్టెంబర్ 2న జరిగే తన 63వ పుట్టిన రోజు వేడుకలు వద్దని లేఖలో రాసుకున్నారు. పుట్టిన రోజు వేడుకలకు అయ్యే ఖర్చును కేరళ వరద బాధితులకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

[9 : 40]

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

[9 : 38]

విజయవాడ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకుని షాక్ కు గురయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతం వ్యక్తం చేశారు. 

[9 : 34]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు. ఒకరు లక్ష్మీ కాగా మరొకరు శాలిని. హరికృష్ణకు ముగ్గురు కుమారులుండగా (జానకీ రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్), ఒక కుమార్తె (సుహాసిని) ఉంది. కుమారులు. నందమూరి వారసుడిగానే కాకుండా హరికృష్ణ వ్యక్తిగతంగా ఎదిగారు.

[9 : 31]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. మరికొద్ది రోజుల్లో 63వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన హరికృష్ణ మృతి చెందడం పలువురిని కలిచివేస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు.

[9 : 16]

నల్గొండ : కారు ప్రమాద వార్తను తెలుసుకున్న ఎన్టీఆర్, తన సోదరుడు కల్యాణ్ రామ్ తో కలసి హుటాహుటిన నార్కట్ పల్లి ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరికృష్ణ తుదిశ్వాస విడిచారు.

[8 : 12]

నల్గొండ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 1956 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. రాజకీయ నేతగా, నటుడిగా, ప్రొడ్యూసర్ గా రాణించారు. తెలుగుదేశంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇతనికి జానకీ రామ్, కల్యాణ్ రామ్, నందమూరి సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్ లు సంతానం.

[7 : 55]

హైదరాబాద్ : నందమూరి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నందమూరి హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

[7 : 52]

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అద్దంకి - నార్కెట్ పల్లి రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

[7 : 44]

విజయవాడ : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

[7 : 42]

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు హైదరాబాద్ కు రానున్నారు. నల్గొండ జిల్లాలో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. 

[7 : 27]

నల్గొండ : హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు. హరికృష్ణ చికిత్సకు అందించడం లేదని, ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారన్నారు. హరికృష్ణ తలకు బలమైన గాయమయ్యిందని పేర్కొన్నారు. 

[7 : 17]

నందమూరి హరికృష్ణ కారుకు ప్రమాదం జరిగింది. హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయని..ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హరికృష్ణను నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళుతున్నారు. స్వయంగా కారును హరికృష్ణ నడుపుతున్నారు. 

[6 : 23]

హైదరాబాద్ : నేడు ఓయూ ఎన్ సీసీ గేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగనుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ విద్యార్థుల ఫెలోషిప్స్ స్కాలర్ షిప్ ల కేటాయింపులో కేంద్ర నిర్లక్ష్య వైఖరిపై నిరసన చేపట్టనున్నారు. 

[6 : 21]

కర్నూలు : నేడు ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహం జరుగనుంది. ఆళ్లగడ్డలో జరిగే ఈ వివాహ వేడుకలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొననున్నారు. 

[6 : 20]

హైదరాబాద్ : ఉదయం 11గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వరవరరావును అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం జరుగనుంది. కవులు, కళాకారులు, వామపక్ష పార్టీలు పాల్గొననున్నాయి.

[6 : 19]

ఢిల్లీ : వరవరరావును నేడు పూణే కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరచనున్నారు. ప్రధాన మంత్రి మోడీ హత్య కేసు కుట్రలో భాగంగా ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

[6 : 18]

హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేడు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు.

[6 : 17]

తిరుపతి : నగరంలోని బర్డ్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వాకం బయటపడింది. ఆసుపత్రికి వెళ్లిన రోగికి వైద్యులు ఒక కాలికి చేయాల్సిన ఆపరేషన్ మరో కాలికి చేశారు. రోగిని టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ పరామర్శించారు. వైద్యుడిని సస్పెండ్ చేయాలని బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ ను ఆయన కోరారు.

[6 : 15]

పశ్చిమగోదావరి : పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుకు మాతృవియోగం కలిగింది. ఎమ్మెల్యే రామానాయుడు తల్లి రమామాణి (91) కన్నుమూశారు. గత కొంతకాలంగా రమామణి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రమామణికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. 

[21 : 02]

హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు నీటిని కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల కింద ఉన్న పంట పొలాలకు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

[21 : 01]

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ లు బదిలీ అయ్యారు. 11 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా రఘునందన్‌రావు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా యోగితా రాణా. రంగారెడ్డి కలెక్టర్‌గా లోకేశ్ కుమార్.

[19 : 21]

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన, ఇతరత్రా వివరాలు తెలియచేస్తున్నట్లు సమాచారం. 

[18 : 21]

గుంటూరు : అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి యువ నేస్తం వస్తోందని నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. 

[18 : 19]

గుంటూరు : రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానం పెట్టండని తాను ఢిల్లీలో ఉంటానన్న పవన్ కనిపించలేదని విమర్శించారు. బిజెపితో వైసీపీ కలిసిలందా లేదో ప్రజల చెప్పాలన్నారు. 

[18 : 18]

చిత్తూరు : ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాలపై ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు, ఒంటిమిట్ట యాత్రకులకు వసతి సదుపాయం ఏపీ టూరిజం శాఖకు కేటాయింపు, రాబోయే ఆరు నెలల్లో కొత్త కళ్యాణ మండపాలు మంజూరు చేయడం జరగదు, ఏపీలోని టిటిడి కళ్యాణ మండపాల అభివృద్ధికి రూ. 37వేల కోట్లు కేటాయింపు, రూ.

[18 : 15]

హైదరాబాద్ : విద్యుత్ శాఖలో సమ్మెపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకూడదని విద్యుత్ శాఖ పేర్కొంది. 

[17 : 43]

గుంటూరు : ఏపీ రాష్ట్రానికి మోసం చేస్తున్న బీజేపీకి...మైనార్టీ సోదరులను మోసం చేస్తున్న ఎన్డీయేని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

[17 : 35]

గుంటూరు : బీజేపీ పార్టీ...బీ అంటే బీజేపీ.. జే అంటే జగన్.. పి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని...వారికి ఓటేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసినట్లేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తన అవినీతిపై ఆరోపణలు చేసే వారు నిరూపించాలని సవాల్ విసిరారు.

[17 : 09]

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును నాంపల్లి కోర్టులో జడ్జి ముందు వరవరరావును పూణె పోలీసులు ప్రవేశ పెట్టారు. బుధవారం సాయంత్రం 5గంటల వరకు వరవరరావును పూణె కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరవరరావును వెంట తన మెడిసిన్ తీసుకెళ్లడానికి...

[16 : 54]

విజయవాడ : కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నట్లుగా బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదమని మంత్రి యనమల పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే ఏపికి ఈ పరిస్థితి ఎందుకొస్తుందని ప్రశ్నించారు. 

[16 : 00]

హైదరాబాద్ : ఓ కేసు విషయంలో పూణె పోలీసులు తనను 9గంటల పాటు విచారించారని, తన ల్యాప్ టాప్, ఫోన్, పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వరవరరావుకు చెందిన వెబ్ సైట్ లో పనిచేస్తున్నందుకు పోలీసులు తనను విచారించారని జర్నలిస్టు క్రాంతి తెలిపారు.

[15 : 49]

హైదరాబాద్ : సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ కేటాయించలేదు. కానీ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

[15 : 45]

హైదరాబాద్ : ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...75 సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

[15 : 37]

విజయవాడ : ప్రభుత్వ తల్లి పిల్లల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బెడ్ పై నుండి ఓ బాలింత కింద పడి మృతి చెందింది. బెడ్ పై నుండి కిందపడి కొట్టుకుంటున్నా స్వాతిని సిబ్బంది పట్టించుకోలేదు. ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

[14 : 20]

హైదరాబాద్ : నాగోల్ లో జర్నలిస్టు క్రాంతిని పూణె పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ హత్య కుట్ర కేసులో విరసం నేత వరవరరావు నివాసంపై పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నటిస్టు క్రాంతి నివాసంలో సోదాలు నిర్వహించి ఆయన్ను కూడా అరెస్టు చేశారు. 

[14 : 12]

హైదరాబాద్ : నాగోల్ విజయపురి కాలనీలో జర్నలిస్టు క్రాంతి ఇంట్లోనూ పూణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 9గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ల్యాప్ టాప్, పుస్తకాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ నివాసంలో కూడా సోదాలు చేశారు.  

[14 : 02]

ఢిల్లీ : హస్తినలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. 2019 లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

[13 : 54]

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియార్టీ ప్రకారం చేస్తే తెలంగాణకు న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని వాదనలు జరిగాయి. తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున న్యాయవాదులు సల్మాన్ ఖుర్షి, అహ్మద్ వాదనలు వినిపించారు.

[13 : 53]

ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటెన్ సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ లో సింధు ఓటమి పాలైంది. ఫైనల్ లో చైనా షట్లర్ తైజుయింగ్ చేతిలో పరాజయం చెందిన సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

[13 : 53]

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును పూణే పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను పూణెకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ హత్య కేసు కుట్రల్లో వరవరరావును అరెస్టు చేశారు.

 

[13 : 52]

ఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ..అమిత్ షాలు భేటీ అయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోని బీజేపీకిచ చెందిన డిప్యూటి సీఎంలు హాజరయ్యారు. త్వరలో జరుగనున్న మధ్యప్రదేవ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై చర్చ జరిగింది.

[13 : 45]

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు ఇంట్లో పూణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు చేసిన కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్‌కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి.

[12 : 56]

చెన్నై : డిఎంకె అధ్యక్షునిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 49 ఏళ్ల తరువాత డిఎంకె పార్టీ మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 65 మంది కార్యదర్శుల మద్దతుతో డిఎంకె చీఫ్‌గా స్టాలిన్‌ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. కోశాధికారిగా దురై మురగన్ ఎన్నికయ్యారు. 

[12 : 28]

హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఇంట్లో పుణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోణలున్నాయి. 

 

[9 : 15]

గుంటూరు : ఇవాళా పట్టణంలో 'నారా హమారా..టీడీపీ హమారా' పేరుతో మైనారిటీ సభ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. 

[9 : 13]

హైదరాబాద్ : మెహిదీపట్నంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డను తల్లి నేలకేసి కొట్టింది. ఆ బిడ్డ తనకు పుట్టలేదని భర్త ఆరోపించడంతో భార్య ఆగ్రహంతో బిడ్డను నేటకేసి బాదింది. ట్రాఫిక్ పోలీసులు బిడ్డను తల్లికి అప్పగించారు.   

 

[8 : 24]

చిత్తూరు : నేడు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

 

[8 : 18]

చిత్తూరు : నేడు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

[8 : 17]

ఢిల్లీ : నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆత్మీయ సమావేశం జరుగనుంది. ఉప రాష్ట్రపతిగా ఏడాది పూర్తైన సందర్భంగా సమావేశం నిర్వహించనున్నారు. 

[8 : 15]

హైదరాబాద్ : నేడు తెలంగాణ కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కుంతియా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. మాజీ పీసీసీలు, డీసీసీలు, ఏఐసీసీ కార్యదర్శులకు ఆహ్వానం పంపారు. 

[8 : 11]

తిరువనంతపురం : కేరళ వరద ప్రాంతాల్లో నేడు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

[6 : 56]

హైదరాబాద్ : నేడు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరింకుంది. కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ పంపారు.

[6 : 55]

చెన్నై : నేడు డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.  

 

[6 : 26]

హైదరాబాద్ : నేడు ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ పై తీర్పు వెలువడనుంది. 

[6 : 25]

విశాఖ : ఇవాళ 248వ రోజ జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. నేడు యలమంచిలి నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. కొండపల్లి నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.  

 

Pages

Don't Miss