Breaking News

[20 : 20]

చిత్తూరు : తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం, వెండి పాదాలను భక్తులు బహుకరించారు. టిటిడి ఛైర్మన్ సుధాకర్ యాదవ్ కు దొరై స్వామి అందచేశారు. కిలో 600 గ్రాముల వెండి పాదాలను తమిళనాడు గుడియాతంకు చెందిన దొరై స్వామి కుటుంబం అందచేసింది. 

[20 : 18]

హైదరాబాద్ : 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పోస్టుల భర్తీ, కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకం జరుగనుంది. 

[20 : 17]

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీపీఎం నేత తమ్మినేని లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేనతో కలిసి పని చేయాలని ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కలిసి పనిచేద్దామని సూచించారు.

[20 : 15]

విజయవాడ : ఏపీలో 22 మంది డిప్యూటి కలెక్టర్లు బదిలీ అయ్యారు.

[18 : 09]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కాసేపటి క్రితం ముగిసింది. కాసేపట్లో ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్నారు. 

[17 : 05]

హైదరాబాద్ : నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని, మరి కాంగ్రెస్ ఏం చేసిందని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల పదవులు..ఆస్తులు..పాపాలు పెరిగాయో..అలానే ఫ్లోరైడ్ భూతం పెరిగిందని అభివర్ణించారు.

[17 : 01]

కేరళ : కొచ్చి ఎయిర్ పోర్టులో విమానాల పునరుద్ధరణకు సంబంధించి కొచ్చి ఎయిర్ పోర్టు బోర్డు సమీక్ష జరిపింది. ఈ నెల 29 నుండి విమాన సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కొచ్చి ఎయిర్ పోర్టును సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ పరిశీలించారు. 

[17 : 00]

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన ఎంపి కమిటీ, పంచాయతీ రాజ్ కమిషనర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. 30 జిల్లాల్లో నియామక పరీక్ష నిర్వహించాలని స్ఫష్టం చేసింది. 

[16 : 58]

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం కేరళకు వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. 

[16 : 57]

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో ఈసీ జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈవీఎంలు, వీవీ పాట్ లపై కొన్ని పార్టీలు అభ్యంతాలు లేవనెత్తాయని ఓపీ రావత్ వెల్లడించారు. 

[16 : 56]

హైదరాబాద్ : నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. 

[16 : 04]

పశ్చిమగోదావరి : పాలకొల్లు, నరసాపురంలో టిడిపి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణలు ప్రారంభించారు. దేశంలో మోడీని ఎదిరించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయడని, తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 

[15 : 24]

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం సాయంత్రం జరుగనుంది. ప్రపోజల్స్ తో సిద్ధంగా ఉండాలని ముఖ్య అధికారులకు ప్రిన్స్ పల్ సెక్రటరీ నోట్ జారీ చేశారు. 

[15 : 22]

ఢిల్లీ : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని నేషనల్ హైవే పెండింగ్ ప్రాజెక్టులపై గడ్కరితో చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు అంశంపై చర్చించారు. అనుమతులిచ్చిన రహదారులకు అలైన్ మెంట్లు, నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు.

[15 : 15]

హైదరాబాద్ : కేంద్ర మంత్రి రాధా మోహన్ కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో కందులు, అపరాలు కొనడానికి 25 శాతం అనుమతిని 75 శాతానికి పెంచాలని లేఖలో కోరారు. కొనుగోళ్ల రోజులను 60 నుండి 15 రోజులకు పెంచాలని లేఖలో కోరారు. 

[15 : 10]

కర్నూలు : జిల్లాలోని సివిల్ సప్లై గోదాములపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని అన్ని గోదాములపై దాడి చేశారు. డీలర్లకు బియ్యం తక్కువగా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. 

[14 : 17]

ముంబై : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముంబైలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటాను బాబు కలిశారు. టాటా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను వారు సందర్శించారు.

[14 : 16]

ఢిల్లీ : వాట్సాప్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భారత్ లో ఫిర్యాదుల స్వీకరించే అధికారిని ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని నోటీసుల్లో పేర్కొంది. వాట్సాప్ తో పాటు కేంద్ర సమాచార, ఆర్థిక శాఖలకూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది. 

[14 : 14]

హైదరాబాద్ : బీజేపీ నేత పురంధేశ్వరీ సమక్షంలో దేవనకొండ జడ్పీటీసీ కోట్ల హరి చక్రపాణిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి ఎదురుగాలి అన్నవారికి ఈ చేరికలే సమాధానమని పురంధేశ్వరీ పేర్కొన్నారు.

[14 : 12]

వరంగల్ : హన్మకొండ బస్టాండులో ఆర్టీసీ అద్దె బస్సు మాయమైంది. పార్క్ చేసిన బస్సును దొంగలు అపహరించారు. పోలీసులకు అద్దె బస్సు యజమాని ఫిర్యాదు చేశారు. 

[13 : 52]

అనంతపురం : పరిగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్‌ బాటిల్స్‌ పట్టుకొని ఊటకూరు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. 

[13 : 48]

ఢిల్లీ : ఆసియా గేమ్స్‌లో పివీ సింధు చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పైనల్స్‌కు చేరి రికార్డ్‌ నెలకొల్పింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్రను సృష్టించింది. సెమిస్‌లో జపాన్‌ ప్లేయర్‌ యమగుచిపై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

[13 : 44]

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బోంగుళూరు గేట్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సాహితీ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రతిక బస్సు కింద పడి మృతి చెందింది. 

[13 : 00]

ఢిల్లీ : ఆసియా క్రీడల ఫైనల్ లో సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. జాయింత్ తై (చైనా) చేతిలో సైనా ఓడిపోయింది. 

[12 : 56]

 హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. సెప్టెంబర్ 4కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును వాయిదా వేసింది. 2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది.

[12 : 38]

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సమావేశం ప్రారంభం అయింది. బీజేపీ నుంచి జెపీ నడ్డా, భూపేంద్ర, టీఆర్ ఎస్ నుంచి ఎంపి వినోద్, సీపీఐ తరపున నారాయణ హాజరయ్యారు.

[12 : 02]

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇవాళ తుదితీర్పు రాబోతోంది.

[11 : 40]

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌లో ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈనేపథ్యంలో చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

[11 : 13]

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని ఎడపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అక్క ప్రేమపెళ్లి వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించాడని విజయ్‌ అనే వ్యక్తి స్నేహితుడైన కిషోర్‌ను హత్య చేశాడు. 

[11 : 12]

హైదరాబాద్‌ : మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన బాలిక వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అల్మాస్గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన వైష్ణవి రెండ్రోజుల క్రితం అదృశ్యమైంది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

[10 : 25]

వరంగల్ : ఎల్కతుర్తిలో దారుణం జరిగింది. భర్త.. భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

[9 : 28]

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా... ఇవాళ  కేంద్ర మంత్రి  నితిన్‌గడ్కరీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జాతీయ రహదారులు, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. 

[9 : 23]

ముంబై : బీఎస్ ఈలోని అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభం అయింది. అమరావతి బాండ్ల లిస్టింగ్ 2018 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

[8 : 30]

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందింది.

[8 : 21]

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇవాళ తుదితీర్పు రాబోతోంది.

[7 : 56]

విజయవాడ : దుర్గగుడిలో నేటితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.

[7 : 55]

కర్నూలు : నేడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరనున్నారు. పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. 

[7 : 54]

ఢిల్లీ : మొండి బకాయిలపై నేటితో ఆర్ బీఐ గడువు ముగియనుంది.  

[7 : 20]

హైదరాఆద్ : నేడు ఎస్ ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల కానుంది. పోలీస్ నియామక బోర్డ్ వెబ్ సైట్ లో కీ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 29 వరకు తుది గడువు విధించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ ఐ ప్రిలిమినరీ పరీక్ష పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

 

[7 : 17]

హైదరాబాద్ : నేడు 247వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. యలమంచిలి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది.

 

[6 : 34]

ముంబై : నేడు జీఎస్ ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటలకు మార్కెట్లు తెరిచిన వెంటనే లిస్టింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

 

[6 : 25]

అమెరికా : చికాగోలో ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఉడుత స్వర్ణ మృతి చెందారు. మృతరాలి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి. 

[20 : 50]

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.

 

[20 : 49]

ఢిల్లీ : తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్డు సంస్థల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరారు.

[19 : 09]

అనంతపురం : పులివెందుల జేఎన్టీయూలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెది అనంతపురం జిల్లాలోని పాతూరు.

[19 : 06]

హైదరాబాద్ : సెప్టెంబర్ 2 ఆదివారం కావాలనే ఆ రోజున ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ రోజున కార్యాలయాలు, పిల్లలకు స్కూళ్లు ఉండవుని...ఇతర ఇబ్బందులు కూడా ఉండవన్నారు. ఆ రోజున దయచేసి ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.

 

[18 : 38]

విజయవాడ : బ్యూటిషీయన్ హత్యాయత్నం కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఆమెపై హత్యాయత్నం చేసినట్లుగా భావిస్తున్న ప్రియుడు నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే బ్యూటీషియన్ పద్మపై నూతన్ కుమార్ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాళ్లు కట్టేసి చేతులు నరికేసి పారిపోయాడు.

[16 : 23]

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరు పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇనుప స్కేల్ కాల్చిన తల్లి కృష్ణకుమారి సొంత కుమారుడు ప్రణీత్ కు వాతలు పెట్టింది. భార్య కృష్ణకుమారి, భర్త ప్రశాంత్ కుమార్ లు విడిగా ఉంటున్నారు. 

[15 : 49]

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. విభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. 

[15 : 08]

నెల్లూరు : జిల్లా చేజర్ల మండలం నాగల వెలటూరులో హరిబాబు సైకో హల్ చల్ చేశాడు. మూఢనమ్మకాల ముసుగులో హైమావతమ్మ అనే మహిళపై సైకో హరిబాబు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి పూజారీగా హైమావతమ్మ పని చేస్తోంది.

[14 : 21]

పశ్చిమగోదావరి : పాలకొల్లు దమ్మయ్యపతి డ్రైన్ సబ్ కాంట్రాక్టర్ పాకపాటి పృథ్వీరాజును పోలీసులు అరెస్టు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయనందుకు పృథ్వీరాజుపై డీఈ శ్రీనివాసరావు కేసు పెట్టారు.

[14 : 19]

కృష్ణా : విజయవాడ బ్యుటీషయన్ హత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. హత్యాయత్నానికి ముందు బ్యుటీషయన్ పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు నూతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

[14 : 18]

విజయవాడ : నగరాన్ని అభివృద్ధి చేయడమంటే కార్పొరేటర్లకు కోట్లు దోచి పెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. స్కూటర్లపై తిరిగిన కార్పొరేటర్లు ఆడి కార్లలో తిరుగుతున్నారని, రూ.

[14 : 17]

విజయవాడ : జనసేన, సీపీఐ, సీపీఎం శంఖారావం పూరించాయి. విజయవాడ కార్పొరేషన్ బకాసురుడిలా ఉందని సీపీఎం నేత మధు విమర్శించారు. విజయవాడ కార్పొరేటర్లు బకాసురుడి ఏజెంట్లుగా మారారని, కార్పొరేషన్ కార్యాలయానికి అందరూ కలిసి సున్నం పూస్తారని పేర్కొన్నారు.

[14 : 15]

గుంటూరు : నరసరావుపేటలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 10 లక్షలు, 80 సవర్ల బంగారం అపహరించారు. 

[13 : 49]

ఢిల్లీ : రెండోరోజు ఢిల్లీలో కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌ను, 4.30 గంటలకు అరుణ్‌జైట్లీతో భేటీ కానున్నారు.

[13 : 46]

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఉదయమే అక్కడకు చేరుకున్న మహేందర్‌రెడ్డి... రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

[13 : 23]

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారనే నెపంతో అధికారులు... రోజువారీ వేతనంతో వేరే వ్యక్తులతో పనులు కానిచ్చేస్తున్నారు. అయితే.. ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేని..

[11 : 18]

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
 

[10 : 23]

అనంతపురం : నగరంలో ఓ మైనర్ బాలిక ప్రసవించింది. శిశువును బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు. 

 

[8 : 30]

హైదరాబాద్ : నేడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బస్సు యాత్రపై చర్చించనున్నారు.

[7 : 34]

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా నేడు బ్యాడ్మింటన్ క్వార్టల్ ఫైనల్ జరుగనుంది. రచనోక్ ( థాయ్ లాండ్ ) తో సైనా నెహ్వాల్ తలపడనుంది. జిందాపోల్ ( థాయ్ లాండ్ )తో పీవీ సింధు ఢీకొననుంది. 

 

[7 : 02]

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ముంబై వెళ్లనున్నారు. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో రేపు పెద్ద ఎత్తున జరిగే అమరావతి బాండ్ల లిస్టింగ్‌లో పాల్గొనేందుకు ఇవాళ ముంబై వెళ్తున్నారు.  టాటా సంస్థ ప్రధాన కార్యాలయం బోంబే హౌస్‌నూ సందర్శిస్తారు.

[6 : 52]

ఢిల్లీ : నేడు సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అవుతారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆయనను కోరనున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై ఆయనతో చర్చించనున్నారు.

[6 : 38]

హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష జరుగనుంది. ఎస్సై ప్రిలిమ్స్ కు 1,88,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 339 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు గంట ముందే సెంటర్ లకు చేరుకోవాలని అధికారుల సూచించారు. నిమిషం ఆలస్యం నిబంధన వర్తించనుంది.

[6 : 34]

విశాఖ : నేడు 246వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. ఇవాళ యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలోని రాంజల్లి, వెంకటాపురం, గొల్ల ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపురం, రామన్నపాలెంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

 

[20 : 15]

కర్నూలు : ఏపీ ప్రజల కష్టాన్ని కేంద్రం దోచుకోవాలనుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నులు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీ ఏమైంది ? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా ? అని ప్రశ్నించారు.

[20 : 14]

కడప : ఢిల్లీని తలదన్నే రీతిలో, ఢిల్లీ చిన్నబోయే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్రం 1500 కోట్లు ఇచ్చారని.. అవి ఎలక్ట్రికల్ కేబుల్ వేయడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు.

[20 : 13]

కర్నూలు : 'నాది రైట్ టర్న్.. మీదే యూటర్న్...రాంగ్ టర్న్' అని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేంద్రానిది అవకాశ వాదమని విమర్శించారు. తాను అవినీతి ఉచ్చులో పడలేదని.. బీజేపీ నేతలే అవినీతి ఉచ్చులో పడ్డారని...

[18 : 57]

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ర్టానికి సంబంధించిన 14 అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. 

[16 : 38]

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. 

[16 : 36]

ఢిల్లీ : 2019 ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కమిటీలను నియమించారు. కోర్ గ్రూప్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను నియమించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు చోటు దక్కలేదని సమాచారం. 

[16 : 32]

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర భేటీ అయ్యారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం, హైకోర్టు విభజన, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారని సమాచారం. కేసీఆర్ భేటీ అనంతరం ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

[16 : 20]

ఢిల్లీ : డీఆర్ డీవో ఛైర్మన్ గా సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. డీవోపీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సతీశ్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. ప్రస్తుతం రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సతీశ్ రెడ్డి ఉన్నారు. 

[16 : 18]

కర్నూలు : ఎన్టీబీసీ కళాశాల మైదానంలో ధర్మపోరాట సభ జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కళా వెంకట్రావు, దేవినేని, పరిటాల, అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు. 

[16 : 15]

కృష్ణా: జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామచంద్రాపురం నుంచి కోడూరుకు వెళుతున్న ఓ కారు అవనిగడ్డ బెజవాడ కరకట్టపై పాపవినాశనం వద్ద అదుపు తప్పి బందరు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎస్సై కోట వంశీ గల్లంతయ్యారు.

[15 : 57]

కడప : 55 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని..వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవ్వగా మిగిన ప్రాజెక్టులు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సీఎంం చంద్రబాబు 'వనం మనం' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తెలిపారు. 

[15 : 56]

మేడ్చల్ : మేడిపల్లి పీఎస్ పరిధిలోని బుద్ధ నగర్ లో విషాదం నెలకొంది. రెండేళ్ల బాలుడు పక్కింటి సంపులో పడి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలోను..స్థానికంగాను..తీవ్ర విషాదాన్ని నింపింది.

[15 : 55]

హైదరాబాద్ : మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ 9వ సాధారణ సమావేశం ప్రారంభంకానుంది. ఇప్పటి వరకూ స్టాండింగ్ కమిటి ఆమోదించిన ప్రతిపాదనలతను కార్పొరేటర్లు ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

[15 : 55]

కడప : ఆర్డీవో దేవేందర్ రెడ్డిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల విషయంలో ఆర్డీవో నిర్లక్ష్యంగా వ్యవరించి విఫలమైనందుకు ఆర్డీవో దేవేందర్ రెడ్డిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు.

Pages

Don't Miss