Breaking News

[15 : 54]

కర్నూలు : సీఎం చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో ధర్మ పోరాట సభలో పాల్గొననున్నారు. ఈక్రమంలో చంద్రబాబు రాకను రాయలసీమ యూనివర్శిటీ జేఏసీ వ్యతిరేకిస్తోంది.

[15 : 54]

తిరుమల : తిరుమలలో టీటీడీ ప్రవేశపెట్టిన ఆన్ లైన్ లక్కీ డిప్ విధానం అక్రమార్కులకు వరంగా మారింది. వేల యూజర్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తూ.. వందలాది టికెట్‌లను అక్రమార్కులు పొందుతున్నారు. దీంతో లక్షల రూపాయలు గడిస్తున్నారు.

[15 : 53]

పెద్దపల్లి : ఓ ప్రైవేటు స్కూల్ కు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడం...సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యుత్ తీగలు కింద పడడం..విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

[15 : 53]

కృష్ణా : బాపులపాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత (బ్యూటిషన్) ను ప్రియుడు దారుణంగా హత్యాయత్నం చేశాడు. కాళ్లు కట్టేసి చేతులు నరికేశాడు. 

[15 : 53]

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిన్న సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

[15 : 51]

విజయనగరం : కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి తన సుఖం కోసం కన్న బిడ్డను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని గుర్ల మండలం గరికివలసలో చోటుచేసుకుంది.

[15 : 49]

కర్నూలు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట సభలో పాల్గొననున్నారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల పేరిట నిర్వహిస్తున్న ధర్మపోరాట 5వ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. 

[15 : 46]

ఢిల్లీ : నేడు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీకానున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వంటి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

[15 : 44]

కృష్ణా : జిల్లాలోని కేఈబీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లింది. తల్లీ, కూతురు క్షేమంగా ఉన్నారు. కారుతోపాటు మరొకరు గల్లంతు అయ్యారు. 

[15 : 44]

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో జరిగిన ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

[15 : 43]

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వాహణకు సంబంధించిన ప్రకటన జారీ అయ్యింది. సెప్టెంబర్ 6 ఉదయం 9.15 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

[15 : 43]

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోని మందుబాబులు తాగి వాహనాలు నడపటం మాత్రం మానలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అమ్మాయిలు హల్ చల్ చేశారు.

[15 : 42]

హైదరాబాద్ : నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించనున్నారు.

[15 : 41]

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై గులాబీబాస్‌ దూకుడు కనబరుస్తోంటే.... కాంగ్రెస్‌లో మాత్రం కన్ఫ్యూజన్‌ నెలకొంది. కొందరు ముందస్తు ఖాయమంటుంటే... మరికొందరు అది అసాధ్యమంటున్నారు. ఇంకొందరైతే..

[15 : 41]

ఢిల్లీ : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజులపాటు సీఎం ఢిల్లీల్లోనే గడపనున్నారు. సాయంత్రం 4.10 గంటకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

 

[14 : 04]

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించబోతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సెప్టెంబర్‌ చివరి వారం..

[11 : 18]

హైదరాబాద్ : ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు నిర్వహించనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా ఉదయం 4.30 నుంచి 9 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టు పక్కలతోపాటు రన్ జరిగే రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపార

[11 : 18]

హైదరాబాద్ : నగరంలో రెండురోజులపాటు జాతీయ పోషకాహార సంస్థ సదస్సు నిర్వహిస్తున్నది. 2018 నవంబర్ నెలలో వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.

[11 : 17]

ఢిల్లీ : నేడు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీకానున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వంటి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

[11 : 17]

హైదరాబాద్ : నేడు టీ.టీడీపీ ఛలో బయ్యారం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలనే డిమాండ్ తో టీడీపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 

[11 : 16]

సికింద్రాబాద్ : నేడు కంటోన్మెంట్ బోర్డు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణపై అవిశ్వాసం తీర్మానాన్ని ఈ కీలక సమావేశంలో ప్రవేశపెట్టాలని స్వంత పార్టీ సభ్యులు బోర్డులో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

[11 : 16]

అమరావతి : మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తుల గురించి మాట్లాడంపై వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

[11 : 15]

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో జరిగిన ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

[11 : 15]

హైదరాబాద్ : నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించనున్నారు.

[11 : 15]

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోని మందుబాబులు తాగి వాహనాలు నడపటం మాత్రం మానలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అమ్మాయిలు హల్ చల్ చేశారు.

[11 : 14]

హైదరాబాద్ : నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించనున్నారు.

[20 : 04]

గుంటూరు : తాడేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీకొన్ని ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

[19 : 11]

హైదరాబాద్ : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5,000 భృతి ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన భృతి చెల్లించనున్నట్లు వెల్లడించారు.

[19 : 03]

అమరావతి : ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాఊంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంవైపు మారాలన్నారు.

[18 : 55]

హైదరాబాద్ : 29 మినీ గురుకులాల ఉద్యోగులకు వేతనాలు పెంచుతు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ ఎం, వార్డెన్ కు రూ.5వేల నుండి 21వేలకు పెంచారు.

[18 : 51]

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఎన్నికల విషయంలో తుది నిర్ణయం నాదేనన్న సీఎం కేసీఆర్‌ ఎవరూ ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

[18 : 47]

విశాఖపట్నం : వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం దేశ ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతుల సాగును విడనాడి ఇతర వృత్తుల్లోకి వెళ్తుతున్నారి ఆవేదన వెలిబుచ్చారు.

[17 : 50]

హైదరాబాద్ : తెలంగాణలో ఐఏఎస్ లను బదిలీలయ్యారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ గా దాన కిషోర్, హెచ్ ఎండీ కమిషన్ గా జనార్థన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గా చిరంజీవులు, రెడ్డి బదిలీలయ్యారు.

[17 : 43]

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు నేరుగా వేతనాలకు అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ ఖరాజా నుండి వేతనాలను అందజేస్తామన్నారు. అర్చకుల పదవీ విరమణ వయోపరిమితి 58 నుండి 65 ఏళ్ళకు పెంచుతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు.

[17 : 25]

హైదరాబాద్ : ఆరు సంచార కులాలకు కలిపి పది ఎకరాల్లో రూ. 10కోట్ల వ్యయంతో హైదరాబాద్ సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మున్నూరు కాపులకు 5 ఎకరాలు రూ. కోట్లు, దూదేకుల కులానికి 3 ఎకరాలు - రూ. 3 కోట్లు, గంగ పుత్రులకు రూ. 2 ఎకరాలు- రూ.

[17 : 22]

హైదరాబాద్ : రాజధానిలో అన్ని కులాల వారు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. 

[17 : 20]

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్లు ఉచిత విద్యుత్ గా ఉంది. తెలంగాణలో విద్యుత్ పరిస్థితి మెరుగు పడిందన్నారు. 

[17 : 05]

హైదరాబాద్ : దేశంలో మరే రాష్ట్రంలోను లేని విధంగా తెలంగాణలో అన్ని కులాలవారికి రాజధానిలో ఆత్మగౌవర భవనాలు నిర్మించుకోవటానికి స్థలాలు, నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు.

[17 : 00]

ఢిల్లీ : ఆంధ్రులకు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ముమ్మాటి నిలబెట్టుకుంటామని..ఆంధ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

[16 : 49]

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

[16 : 45]

అమరావతి : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లు గెలవటం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.

[16 : 40]

అమరావతి : పర్యాటక రంగంలో ఉపాధిని యువత సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ పర్యాటక రంగంపై తపాలా బిళ్లలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలో 12 పర్యాటక స్థలాలపై రూపొందించిన తపాలాబిళ్లలకు చంద్రబాబు విడుదల చేశారు.

[15 : 32]

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.

[15 : 28]

ఢిల్లీ : జీవో 550పై హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రిజర్వేషన్ కోటా మించకుండా యదావిధిగా ప్రవేశాలు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. వైద్య విద్య సీట్ల భర్తీలో రిజర్వేషన్ కోటా మించకుండా ప్రవేశాలు చేయనుంది. జీవో 550 ప్రకారం ప్రవేశాలు ఉండనున్నాయి. 

[15 : 25]

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు ఎమ్మెల్సీలు విరాళాన్ని ప్రకటించారు. ఒక రోజు వేతనాన్ని 34 మంది ఎమ్మెల్సీలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు చీప్ విప్ సుధాకర్ రెడ్డి చెక్కును అందచేశారు. 

[15 : 24]

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు మేకపాటి గౌతంరెడ్డి రూ. కోటి విరాళం ప్రకటించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి గౌతంరెడ్డి సంబంధిత చెక్కును అందచేయనున్నారు.

 

[15 : 24]

హైదరాబాద్ : ఈనెల 29వ తేదీన సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు యాజమాన్యం వాటా చెల్లించనుంది. 27 శాతం వాటా రూ. 327.44 కోట్లను చెల్లించనుంది. 

[15 : 18]

విజయవాడ : రాష్ట్ర పర్యాటక ప్రమోషన్ బోర్డుతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అఖిల ప్రియ పాల్గొన్నారు. ఏపీ పర్యాటకంపై ప్రత్యేక తపాల బిళ్లలను సీఎం బాబు విడుదల చేశారు. 

[15 : 16]

ఆదిలాబాద్ : ఇచ్చోడ (మం) కుమరం భీం చౌక్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పగిలింది. నీరంతా వృథాగా పోతోంది. దీనితో వాహనాలు నిలిచిపోయాయి. 

[15 : 15]

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో మహిళ కబడ్డీ విభాగంలో భారత్ కు రజత పతకం లభించింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై 27-24 తేడాతో ఇరాన్ జట్టుపై గెలుపొందింది. 

[15 : 14]

బీహార్ : ఈ నెల 30వ తేదలోగా లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టులో లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ గడువు 3 నెలలు పొడిగించాలన్న లాలూ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దాణా స్కాం కేసులో లాలూ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. 

[13 : 54]

తూర్పుగోదావరి : మలికిపురం మండలం గొల్లపాలెంలో ఓఎన్జీసీ వెల్ నెంబర్ 11లో గ్యాస్ లీకేజీ అయ్యింది. ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. 

[13 : 53]

విజయవాడ : మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. 'జన జాగృతి' పేరిట పార్టీని ఎంపీ కొత్తపల్లి గీత ఏర్పాటు చేశారు. మార్పు కోసం ముందడుగు నినాదంతో ప్రజల్లోకి వెళ్లనుంది.  

[13 : 51]

మెదక్ : సిద్దిపేట బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు హెల్త్ కిట్స్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. విద్యార్థినిల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ మరో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారని, విద్యార్థినిలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో హెల్త్ కిట్స్ పథకం అమలు చేయడం జరుగుతోందన్నారు. 

[13 : 49]

గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వ నుండి త్వరలోనే వరి సాగుకు నీరందిస్తామని స్పీకర్ కోడెల వెల్లడించారు. సెప్టెంబర్ 6 నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, 10-15- రోజులు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

[13 : 47]

చిత్తూరు : తిరుపతిలో నాలుగు రోజులైనా బాలిక ఆచూకి లభ్యం కాలేదు. బాలిక ఆచూకి కనుక్కోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు. బీటీఆర్ కాలనీలో బాలిక మిస్సింగ్ అయిన సంగతి తెలిసిందే. 

[13 : 46]

ప్రకాశం : అమరావతి బాండ్ల పేరిట అవినీతి జరిగిందని ఎంపీ జీవీఎల్ మరోసారి ఆరోపించారు. యనమల పంటి చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చు చేశారంటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో తెలుస్తోందన్నారు.

[13 : 43]

తూర్పుగోదావరి : కాంగ్రెస్ తో పొత్తు విషయంలో చిన రాజప్ప స్పందించారు. బీజేపీ - కాంగ్రెస్ కు సమాన దూరంలో ఉన్నామని, సీఎం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. 

[13 : 41]

ఢిల్లీ : కేరళకు రూ. 700 కోట్ల సాయం ప్రకటనను యూఏఈ ఖండించింది. కేరళ రాష్ట్రానికి నిర్దిష్టమైన సాయం చేస్తామని తాము ప్రకటించలేదని ప్రకటించింది. ఎంత సాయం అనేది ఇంకా నిర్ణయించలేదని, అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని యూఏఈ పేర్కొంది.

 

[13 : 23]

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని వరద ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. 

[13 : 19]

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విరాళాన్ని ప్రకటించింది. 30 రకాల వస్తువులతో 10500 ఫ్యామిలీ కిట్లు, 12వేల లీటర్ల పాలను సంగం డెయిరీ పంపించింది. 8 లారీల ఆహార సరుకులను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.

[13 : 17]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ ప్రగతి నివేదిక సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

[12 : 30]

నెల్లూరు : నాయుడుపేట గురుకుల పాఠశాల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి శివప్రతాప్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని స్వస్థలం చిట్టమూరు (మం) తాడిపేడు. 

[12 : 17]

కృష్ణా : జిల్లాలో పాము కాటుల భయం వెంటాడుతూనే ఉంది. 14 రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాపులపాడులో పాము కాటుతో మహిళ మృతి చెందింది. దీనితో ప్రజలు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. 

[12 : 06]

చిత్తూరు : నిత్యం తాగి వస్తూ వేధిస్తున్నాడని తండ్రి షేక్ బాబును కూతురు నగీన తలపై బండరాయితో మోది హత్య చేసింది. పుంగనూరు మండలం మేలుపట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

[12 : 05]

హైదరాబాద్ : చింతల్ బాలానగర్ ఎన్ఆర్ఐ టాలెంట్ స్కూల్ లో యూకేజీ విద్యార్థి రత్నవర్ధన్ ను టీచర్ సునీత కొట్టింది. బాలానగర్ పీఎస్ లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. 

[11 : 56]

విజయవాడ : రాష్ట్రానికి నిధులు రాకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు. పీడీ అకౌంట్లను తప్పుగా చూపడం దుర్మార్గమని, టీడీపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 

[11 : 54]

అనంతపురం : జిల్లాలోని పెనుకొండ మండలం సత్తారుపల్లి గ్రామం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. గోపాల్‌రెడ్డి, అంజినప్ప, రవీంద్రారెడ్డి, వెంకటప్ప, వడ్డె అంజి, వెంకటస్వామిలు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. 

[11 : 49]

విశాఖపట్టణం : ఓ లంచం కేసులో సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఆంధ్రా బ్యాంకు మేనేజర్ అక్షయ్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించినట్లు తీర్పును వెలువరించింది. రైతు నుండి లంచం తీసుకుంటుండగా అక్షయ్ పట్టుబడ్డాడు. 

[11 : 44]

చెన్నై : కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యలకు చెన్నై సీఎం పళనీ స్వామి స్పందించారు. ముళ్ల పెరియార్ డ్యామ్ నీటి విడుదల వల్లే వరదలు వచ్చాయని కేరళ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తమిళనాడు ఖండించింది. 

[11 : 43]

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటాలియన్ మహిళా డీజేకు అవమానం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా సిబ్బంది చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

[11 : 12]

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజాద్ హైదరాబాద్ కు శనివారం రానున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల స్కాంపై ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 

[11 : 09]

హైదరాబాద్ : మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసింది. నగదు, కారు, ల్యాప్ టాప్స్ లను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై గతంలో పలు పీఎస్ లలో కేసులు నమోదయినట్లు సమాచారం. 

[11 : 06]

మధ్యప్రదేశ్ : తాను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువునంటూ ఓ కుటుంబం రోడ్డుపై హల్ చల్ చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ట్రాఫిక్ పోలీసులు వారి కారును ఆపడంతో ఈ వివాదం చెలరేగింది. దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

[11 : 04]

విజయవాడ : ఏపీ కేబినెట్ విస్తరణ జరుగబోతోందని ప్రచారం జరుగుతోంది. 28న గుంటూరులో మైనార్టీ సదస్సులో కేబినెట్ విస్తరణ ప్రకటనను సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నారని తెలుస్తోంది. కేబినెట్ లో మైనార్టీలకు అవకాశం కల్పించనున్నారని సమాచారం.

[10 : 59]

కర్నాటక : డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కర్నాటకకు చేరుకున్నారు. కొడుగు ప్రాంతంలో కొండచరియలు విరిగి పడి...వరదలతో నష్టపోయిన వారిని ఆమె పరామర్శించారు. 

[10 : 32]

విజయవాడ : సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదని మంత్రి ఆనందబాబు తెలిపారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. 

[10 : 30]

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఓ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ ఉగ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి. పౌరుడికి గాయాలు కాగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 

[10 : 28]

రంగారెడ్డి : శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎయిర్ పోర్టు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. నేపాల్ నుండి ఈ కుటుంబం ఇక్కడకు వచ్చింది. 

[10 : 26]

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. రోయింగ్ క్వాడ్రుపుల్ పురుషల స్కల్స్ లో భారత క్రీడాకారులు స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ లో భారత్ కు కాంస్య పతకం లభించింది. 

Pages

Don't Miss