Breaking News

[10 : 23]

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కాసేపట్లో కొంగర కలాన్ కు వెళ్లనున్నారు. 'ప్రగతి నివేదిన' సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. 

[10 : 23]

రంగారెడ్డి : శంషాబాద్ లో దారుణం జరిగింది. ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. 

[10 : 21]

ప.గో : పాలకోడేరు మండలం గోరగనముడిలో దారుణం జరిగింది. భర్తను కత్తితో పొడిచి భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. 

[10 : 12]

హైదరాబాద్ : నేడు శ్రావణ శుక్రవారం. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.

[8 : 18]

అనంతపురం : జిల్లాలో రెండు మినీ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయలయ్యాయి. పెనుకొండ మండలం సత్తూరుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది.   

[8 : 16]

హైదరాబాద్ : హయత్ నగర్ లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.  భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 

[7 : 51]

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ లో ఎదురుకాల్పులు జరిగాయి. ఓ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

[7 : 48]

విశాఖ : నేడు 244 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. ఇవాళ యలమంచిలి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేయనున్నారు. 

 

[7 : 09]

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. పెండింగ్‌ అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. 

[6 : 44]

 హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై ఇందులో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.

[6 : 24]

విజయవాడ : నేడు మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీని ప్రకటించనుంది.

 

[6 : 23]

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

[6 : 19]

ఢిల్లీ : జీవో 550పై నేడు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్నారు. 

[6 : 17]

హైదరాబాద్ : నేడు, రేపు సీపీఐ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి. జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ ముఖ్య అతిథిగా హాజరుకున్నారు. 

 

[20 : 47]

హైదరాబాద్ : కొన్ని నెల‌లుగా కంటి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఈరోజు మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింది.

[20 : 45]

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

[17 : 09]

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి వెల్లడించారు. వివిధ పనుల నిమిత్తం హస్తినలో ఉన్నతాధికారులను కలవడం జరుగుతుందని, ఈసీని రాజీవ్ శర్మ కలవడం జరిగిన తరువాత ముందస్తు ఎన్నికలపై వార్తలు వస్తున్నాయన్నారు.

[17 : 07]

విశాఖపట్నం : కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11.30 గంటలకు పార్టీని లాంచ్ చేస్తున్నామని ఆమె తెలిపారు.

[17 : 06]

హైదరాబాద్ : తెలంగాణలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ కావడం...కేంద్ర ఎన్నికల కమిషన్ ను రాజీవ్ శర్మ..ఉన్నతాధికారులు కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై శర్మ ఆరా తీసినట్లు సమాచారం.

[17 : 03]

విశాఖపట్టణం : ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం జ్ఞానభేరీ జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

[17 : 03]

విజయవాడ : టఫే ట్రాక్టర్ల కంపెనీ సీవోవో టీఆర్ కేశవన్, కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. టఫేకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని, జేపార్క్ లెర్నింగ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. 13 జిల్లాలో జే ఫార్మ్ యాప్ అమలుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. 

[17 : 01]

హైదరాబాద్ : 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖపరమైన కమిటీతో భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

[17 : 00]

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ ను రాజీవ్ శర్మ కలిశారు. ముందస్తు ఎన్నికల అవకాశాలపై శర్మ ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం భేటీలో రాజీవ్ శర్మతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సహాని కూడా పాల్గొన్నట్లు సమాచారం. 

[16 : 57]

హైదరాబాద్ : రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

[16 : 25]

విజయవాడ : మిషన్ 2019లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ రావాలని, ఇందుకు కృషి జరుగుతోందని ఏపీ పిసిసి చీఫ్ రఘువీరా తెలిపారు. తమపైనున్న అపోహాలు తొలగిపోవడం జరిగిందని, ప్రస్తుతం రాహుల్ గాంధీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

[16 : 24]

విజయవాడ : కేరళ రాష్ట్రానికి ఏపీ కాంగ్రెస్ నేతలు స్వయంగా విరాళాలను ఉదారంగా ప్రకటిస్తున్నారని ఏపి పిసిసి చీప్ రఘువీరా తెలిపారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. ఈ డబ్బులను పోగు చేసి కేరళ రాష్ట్రానికి పంపిస్తామన్నారు. నివాసాలు కోల్పోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.

[16 : 18]

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం విశాఖ జిల్లాకు చేరుకున్నారు. జ్ఞానభేరీ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

 

[16 : 17]

హైదరాబాద్ : సీఎం ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్ రావుతో ఎంపీ కవిత భేటీ అయ్యారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన 27 శాతం లాభాలపై చర్చించారు. 

[15 : 45]

హైదరాబాద్ : వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ కానిస్టేబుల్ విరాళం ప్రకటించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తుడి రాజు తన ఒక నెల వేతనం రూ. 68వేల వేతనాన్ని విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ విరాళాన్ని ఉన్నతాధికారికి అందచేశారు. 

[15 : 42]

విశాఖపట్టణం : కాంగ్రెస్ ను అణగదొక్కాలనే టిడిపి పుట్టిందని, ఆ పార్టీతో చేతులు కలిపితే ఒప్పుకోమని మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 

[15 : 40]

ఢిల్లీ : ఏఐసీసీ కార్యదర్శులుగా కొత్తగా 8మందిని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఉత్తర్వులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ జారీ చేశారు.

[15 : 28]

హైదరాబాద్ : జైపాల్ రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేత డీకే అరుణ పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, తమ అమ్మాయికి మహబూబ్ నగర్ సీటు అడుగుతామన్నారు. 

[15 : 27]

విజయవాడ : విశాఖ మెట్రోపై కొరియా బృందంతో చర్చించడం జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రూ. 8వేల కోట్లతో మెట్రో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అమరావతిలో టిటిడి ఆలయ నమూనాలపై చర్చించినట్లు తెలిపారు. 

[15 : 25]

కర్నూలు : ఆవుకు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 9,950 లంచం తీసుకుంటూ ఏసీబీకి జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ రెడ్డి చిక్కాడు. 

[15 : 24]

గుజరాత్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. లక్ష మందితో ఒకేసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరుగనుంది. 

[15 : 16]

విజయవాడ : టిడిపిలో కాంగ్రెస్ మాజీ నేతలు చేరనున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో చేరేందుకు కొందరు నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి కలిశారు. టిడిపిలో చేరే అంశంపై మంతనాలు జరుపుతున్నారు.

[14 : 08]

హైదరాబాద్ : తెలంగాణలో సూపర్ స్పెషాల్టీ మెడికల్ పీజీ కోర్సుల ఫీజు పెంపు జీవోపై హైకోర్టు స్టే విధించింది. గతంలో సూపర్ స్పెషాల్టీ కోర్సుల యాజమాన్య కోటాకు రూ. 5 లక్షలు, 2018-19 నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

[14 : 04]

కృష్ణా : జిల్లాలోని గన్నవరం (మం) బీబీగూడెంలో పాఠశాలలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. వారం రోజుల క్రితం లైబ్రరీ వద్ద కుబుసాన్ని తాచుపాము వదిలి పెట్టి వెళ్లిందని, తరగతి గదిలోకి పాములు రావడంతో భయాందోళనకు గురయ్యామని విద్యార్థులు పేర్కొంటున్నారు. 

[14 : 02]

హైదరాబాద్ : నకిలీ ఓటర్ల విషయంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణపై పిటిషన్ ను ఆగస్టు 31కి వాయిదా వేసింది. 

[14 : 01]

కృష్ణా : జిల్లాలోని పలు ప్రాంతాల్లో 'పాము కాటు'లు ఆగడం లేదు. 22 రోజుల్లో 85 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరారు. ఇద్దరు పాము కాటుతో మృతి చెందారు. రెండు రోజల క్రితం గన్నవరంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

[13 : 01]

విజయవాడ : కాంగ్రెస్ తో పొత్తు ఉండదని డిప్యూటి సీఎం కేఈ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, పవన్, జగన్, లు తమ ప్రత్యర్థులేనని పేర్కొన్నారు. 

[12 : 59]

విజయవాడ : నాగరికతకు అద్దం పట్టేది ఆర్కిటెక్చర్ అని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. వేద, పురాణాల్లోనూ ఆర్కిటెక్చర్ కు అత్యంత ప్రాధాన్యత ఉందని, నగరాల్లో నిర్మిస్తున్న బహుళంతస్తుల్లో భద్రతా చర్యలు ఉండేలా ఆర్కిటెక్చర్లదే బాధ్యత అని తెలిపారు. 

[12 : 58]

ఢిల్లీ : ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. కిడ్నీ మార్పిడి కారణంగా కొన్ని నెలలు జైట్లీ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ చూడనున్నారు.

[12 : 56]

ఆసియా గేమ్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమైంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న - శరణ్ జోడీలు ప్రవేశించారు. జపాన్ జోడి ఉసుంగ్ - షమాబుకురోపై గెలుపొందారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 15 పతకాలు చేరాయి. 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్య పతాకాలను సాధించారు. 

[12 : 54]

విజయవాడ : ఏపీ కాంగ్రెస్ కమిటీ మిషన్ - 2019 సమావేశం జరిగింది. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ఊమెన్ చాందీ, రఘువీరా, కొప్పుల రాజులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 నుండి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతుందని జేడీ శీలం పేర్కొన్నారు.

[12 : 53]

విజయవాడ : ఉండవల్లి ప్రజా వేదికలో సీఆర్డీఏ సమీక్షా సమావేశం జరిగింది. అమరావతిలో టిటిడి నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయ నమూనా చిత్రాలను ప్రదర్శించారు. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తూనే భవ్యమైన నిర్మాణం జరగాలని సీఎం బాబు సూచించారు. 

[12 : 50]

అమెరికా : ఆలస్కాలోని అలెటియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది. 

[12 : 49]

విజయవాడ : ఏపీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్నాతకోత్సవ సభ జరిగింది. స్కూల్ ఆప్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనాన్ని ఉప రాష్ట్రపతి, గవర్నర్ లు ప్రారంభించారు. 

[12 : 10]

విజయవాడ : పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సూచించారు. 

[12 : 08]

విజయవాడ : భోగాపురం ఎయిర్ పోర్టును టెండర్లను రద్దు చేసి టిడిపి ప్రభుత్వం కొత్త స్కాంకు తెరలేపిందని బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు.

[12 : 03]

హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి అస్థికలను నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. బాసర గోదావరి నది పుష్కరఘాట్ 1లో నిమజ్జనం చేయనున్నారు. 

[11 : 59]

కేరళ : రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పలు సహాయక శిబిరాలను సందర్శించారు. అక్కడ తల దాచుకుంటున్న వరద బాధితులను ఆయన పరామర్శించారు. అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. 

[11 : 23]

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. 

[11 : 11]

ఉంగటూరు : వ్యవసాయాన్ని లాభసాటి చేయడంపై దేశ వ్యాప్తంగా సమగ్ర చర్చ జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఉంగుటూరు మండలం ఎస్.ఎన్.పాలెంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

[11 : 07]

కేరళ : రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు..వరదలతో రాష్ట్రం అతాలకుతలమైన సంగతి తెలిసిందే. గురువారం పెట్రోల్ కోసం వాహనాలు బారులు తీరాయి. 

[11 : 05]

నల్గొండ : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుండి వెయ్యి క్యూసెక్కుల నీటిని మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. సాగర్ ఆయుకట్టులో చివరి భూములకు నీరందే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఆరున్నర లక్షళ ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. 

[11 : 01]

శ్రీకాళహస్తి 'అన్నా' క్యాంటీన్ లో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనకు ఆహ్వానం పంపలేదని శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణను మోహన్ అడ్డుకున్నట్లు సమాచారం. 

[10 : 59]

హైదరాబాద్ : కొమరం భీంకు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 240.5 మీటర్లుగా ఉంది. 

[10 : 57]

చెన్నై : కేరళ వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ వెల్లడించారు. 

[10 : 53]

హైదరాబాద్ : వచ్చే నెల నుండి కమిషన్ అమలు చేయడం జరుగుతుందని, 2015 అక్టోబర్ నుండి ఉన్న బకాయిలను చెల్లిస్తామని మంత్రి ఈటెల వెల్లడించారు. కాసేపటి క్రితం రేషన్ డీలర్ల కమిషన్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. 

[10 : 50]

ఒడిశా : భారత మాజీ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తి కలశ యాత్ర పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ యాత్రలో పాల్గొన్నారు. 

[10 : 49]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమిషన్ పెంపుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. కమిషన్ 70 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. 

[10 : 32]

ఖమ్మం : డబుల్ డెడ్ రూం ఇళ్ల జాతకం తేలిపోయింది.

[10 : 32]

తిరుమల : శ్రీవారి సేవా టికెట్ల స్కాంలో ఇంటి దొంగను పోలీసులు అరెస్టు చేశారు. షోలాపూర్ దళారీ తరహాలో కాల్ సెంటర్ ఉద్యోగి అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీవారి సుప్రభాత సేవా టికెట్లను లక్కీ డీప్ లో పొందిన ఉద్యోగి శ్రీనివాసులు ఇతరులకు విక్రయించాడు. ఒక్కో టికెట్ ను రూ.

[10 : 30]

కృష్ణా : ఉంగుటూరు (మం) ఎస్.ఎస్.పాలెంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు. 

[10 : 23]

ఢిల్లీ : సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా నయ్యర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పలు పత్రికలకు నయ్యర్ వ్యాసాలు రాశారు. 1990లో బ్రిటన్ లో భారత రాయబారిగా పనిచేసిన ఈయన 1923 ఆగస్టు 14వ తేదీన పాక్ లోని సియోల్ కోట్ లో కుల్దీప్ నయ్యర్ జన్మించారు. 

[10 : 21]

హైదరాబాద్ : రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సీఎం కేసీఆర్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

[10 : 21]

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను తండ్రి హతమార్చారు. 

[10 : 19]

చిత్తూరు : టిటిడిలో లైంగిక వేధింపుల కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో వేధిస్తున్నాడని చంద్రగిరి పీఎస్ లో మహిళ ఫిర్యాదు చేసింది. 

[9 : 57]

భూపాలపల్లి : జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. టీచర్లు లేక సర్కార్ బడులు వెలవెలబోతున్నాయి. మంగపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐదుగురు టీచర్లతో నడుస్తోంది. పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారు.

[9 : 26]

కర్నూలు : రామలింగేశ్వనగర్ లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక రెండు నెలల గర్భవతి. 

 

[9 : 23]

తూర్పుగోదావరి : గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. నాలుగు రోజులుగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ధవళేశ్వం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

 

[8 : 38]

కృష్ణా : నేడు ఏపీలోని అన్ని జిల్లాల, నియోజకవర్గాల కాంగ్రెస్ సమన్వయ కమిటీల సమావేశం జరుగనుంది. విజయవాడలో సమన్వయ కమిటీల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు హాజరుకానున్నారు.  

[8 : 24]

హైదరాబాద్ : నేడు రేషన్ డీలర్లతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. సచివాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమావేశం కానున్నారు.

[7 : 40]

తిరుమల : శ్రీవారి ఆలయంలో నేటితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలను ముగించనున్నారు. 

[7 : 37]

విశాఖ : నేడు ఏయూ జ్ఞానభేరి సదస్సు నిర్వహించనున్నారు. విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. 
 

[6 : 34]

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలోని నదుల్లో వాజ్ పేయి చితాభస్మం నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ అనంతగిరి వద్ద మూసీ నదిలో వాజ్ పేయి చితాభస్మాన్ని నిమజ్జనం చేయనున్నారు. దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి నేతృత్వంలో కార్యక్రమం జరుగనుంది.

[6 : 31]

గుజరాత్ : నేడు గుజరాత్ లో లక్ష సామూహిక గృహప్రవేశాలు జరుగనున్నాయి. లక్ష ఇళ్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

[19 : 53]

హైదరాబాద్ : కొంగరకలాన్ లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు టీ.కేబినెట్ అమోదం పలికింది. సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ జరపాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

[19 : 39]

వరంగల్ : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

Pages

Don't Miss