Breaking News

[19 : 37]

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా షూటర్ గా రహీ జీవన్ సర్నోబత్ రికార్డు సృష్టించింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణ పతకం దక్కింది.

[19 : 34]

అమరావతి : 2006 తర్వాత ఇప్పుడు పెద్ద వరదలు వచ్చాయని, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన విహంగవీక్షణం చేసి, జిల్లాల్లో జరిగిన నష్టంపై అంచనా వేశారు.

[19 : 33]

ఢిల్లీ : ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయేసరికి ఎన్నో విమర్శలు, దెప్పిపొడుపులు. అయినా, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెలవాలనే ఏకైక లక్ష్యంతో మూడో టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు... తొలి రోజు నుంచే ఇంగ్లండ్ పై పైచేయి సాధించి...

[19 : 29]

ఢిల్లీ : మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఆస్థి కలశ యాత్ర చేపట్టి దేశంలోని 100 నదుల్లో ఆయన అస్థికలను నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

[16 : 30]

మూడో టెస్టులో భారత్ విజయం సాధించింది. 202 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలుపొందింది. భారత్ 329, 352 (డిక్లేర్డ్), ఇంగ్లండ్ 161, 317

[16 : 28]

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుండి ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు. 18 నెలల చిన్నారిని కాపాడబోయి కాలు జారి బాలిక పడిపోయింది. మూడంతస్తుల భవనం పై నుండి చిన్నారి కింద పడిపోతుండగా బాలిక కాపాడబోయింది. 

[16 : 28]

ఆసియా క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది. 25 మీటర్ల విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం లభించింది. 

[16 : 27]

నాటింగ్ హోమ్ టెస్టులో విజయానికి భారత్ ఒక వికెట్ దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్స్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. మూడో టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

[16 : 27]

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో ఎయిర్ పోర్టులో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

 

[16 : 27]

ఢిల్లీ : మంత్రులతో సీఎం కేసీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన, ప్రగతి నివేదన సభపై చర్చించనున్నారు. ఫించన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల రుణమాఫీ అంశావలపై మంత్రివర్గం చర్చించనుంది.

 

[16 : 26]

ఢిల్లీ : రెజ్లింగ్ గ్రీకో రోమన్ విభాగంలో హర్ ప్రీత్ సింగ్ గెలుపొందారు. 87 కేజీల విభాగంలో దక్షిణకొరియాపై 8-0 తేడాతో గెలుపొందారు. 

[16 : 25]

హైదరాబాద్ : ఆసియన్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమైంది. మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో సెమీస్ కు అంకిత్ రైనా దూసుకెళ్లారు. హాంకాంగ్ క్రీడాకారిణి యుడీస్ చాంగ్ పై 6-4, 6-1 తేడాతో అంకిత్ రైనా విజయం సాధించారు. 

[13 : 54]

తిరువనంతపురం : కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.21 కోట్ల విరాళం అందజేసింది. దాంతో పాటు రూ.50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది.

[13 : 52]

ఉత్తర్ ప్రదేశ్ : కేరళ రాష్ట్రానికి ఆహార పదార్థాలు..నీళ్లతో కూడిన 25 ట్రక్కులను పంపింనట్లు సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు. ఇంకా కేరళకు సహాయం చేస్తామని తెలిపారు. 

[13 : 02]

హైదరాబాద్ : కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు రాజీనామా చేయనున్నారు. ఈనెల 24వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

[13 : 01]

విజయవాడ : ప్రధాన మంత్రి మోడీతో జరిగిన 45 నిమిషాల భేటీలో జగన్ ఏం మాట్లాడారని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ ఇకనైనా పెళ్లిళ్ల మాట పక్కన పెట్టి రాష్ట్రం గురించి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం చర్చకు రాలేదన్నారు.

[12 : 57]

తూర్పుగోదావరి : రాజమండ్రి ఏయిర్ పోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. డిప్యూటి సీఎం చిన రాజప్ప ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో బాబు, చిన రాజప్పలు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

[12 : 55]

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కు బయలుదేరారు. ఆయన సోదరుడు ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో ఎమ్మెల్యే గంగుల హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బయలుదేరారు. 

[12 : 53]

విజయవాడ : దుర్గగుడిలో నూతన వైదిక కమిటీ ఏర్పాటుకు ఈవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీర వివాదం, ఇతరత్రా వివాదాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కొత్త కమిటీలో శాండిల్యకు చోటు దక్కలేదు. 

[12 : 49]

ముంబై : దేశ వాణిజ్య కేంద్రమైన ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిల్ ఏరియాలోని క్రిస్టల్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

[12 : 20]

జగన్ పై యనమల ధ్వజం... వైఎస్ జగన్ పై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల తరువాత జగన్, ఆయన మీడియా కనిపించవని జోస్యం చెప్పారు. ప్రజల్లో అపోహలు సృష్టించాలనే జగన్ కుట్ర ఫలించదని, బీజేపీ వంచన చేరి టిడిపిపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు.

[12 : 15]

ప్రకాశం : జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా కొల్లు విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థల విషయంలో రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని వీడియోలో విష్ణువర్ధన్ పేర్కొన్నాడు.

[11 : 17]

ముంబై : దేశ వాణిజ్య కేంద్రమైన ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిల్ ఏరియాలోని క్రిస్టల్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

[11 : 16]

కేరళ : వరదలు..వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్న బీఎస్ఎఫ్ బృందం రహదారులపై పడిపోయిన భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. రోడ్లకు మరమ్మత్తులు చేపడుతున్నారు. 

[11 : 14]

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ పార్థివ దేహానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ నివాళులర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ కామత్ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీనితో ఆసుపత్రికి సోనియా వెళ్లి కామత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. 

[11 : 11]

కృష్ణా : జిల్లాలో పాము కాటు బాధితులు పెరుగుతున్నారు. బాధితుల సంఖ్య 60కి చేరింది. ముగ్గురు మృతి చెందారు. నాగాయలంక, ఆవనగడ్డ, కోడూరు, మోపిదేవి, మొవ్వ, గన్నవరం మండలాల్లో పాము కాటు బాధితులున్నారు. గన్నవరంలో ఇద్దరు, కోడూరులో ఒకరు మృతి చెందారు. 

[11 : 09]

గుంటూరు : తాడేపల్లి మండలం చినరావూరు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. 

[11 : 08]

రాజమండ్రి : సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు డిప్యూటి సీఎం నిమ్మకాయల చినరాజప్ప కూడా ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. 

[10 : 26]

హైదరాబాద్ : ముందస్తు యోచనపై నేడు పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. పది రోజులు కూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. 

[10 : 24]

ఢిల్లీ : ఏఐసీసీ కోశాధికారిగా అహమద్ పటేల్ ను నియమితులయ్యారు. 90వయేట పార్టీ ప్రధాన కార్యదర్శిగా మోతీలాల్ ఓరాను బదిలీ చేశారు. గత 18 ఏళ్లుగా ఓరా కోశాధికారిగా ఉన్న సంగతి తెలిసిందే. 

[10 : 23]

ముంబై : దేశ వాణిజ్య కేంద్రమైన ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిల్ ఏరియాలోని క్రిస్టల్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టవర్స్ లో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

[10 : 20]

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ కామత్ తుదిశ్వాస విడిచారు. 

[10 : 19]

హైదరాబాద్ : కేరళ వరద బాధితుల సహాయార్థం 500 టన్నుల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపుతోంది. కాసేపటి క్రితం నెక్లెస్ రోడ్డులో బియ్యం లారీలను మంత్రి ఈటెల రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు. 

[10 : 18]

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. శ్రీనగర్, ఆనంతనాగ్, కుల్గామ్ లో పోలీసులపైకి రాళ్లు విసిరారు. పాక్, ఐసీస్ జెండాలను వేర్పాటు వాదులు ప్రదర్శించారు. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసుల వాహనాల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. 

[10 : 16]

నెల్లూరు : బుచ్చిరెడ్డిపాలెం (మం) రెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి ఓ తల్లిబావిలోకి దూకింది. తల్లి అపస్మారక స్థితిలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

[10 : 14]

హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. ప్రార్థనా స్థలాల వద్ద 250 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ పరిధిలో 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రెండు ఆర్ఏఎఫ్ బలగాలను అందుబాటులో ఉంచారు. 

[10 : 13]

పశ్చిమగోదావరి : ఎర్రకాల్వకు వరద ఉధృతి పెరిగింది. నిడదవోలు - తాడేపల్లి గూడెం రహదారిని మూసివేశారు. రోడ్ కమ్ రైల్వే బిడ్రిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో రైల్వే గేటును మూసివేశారు. నిడదవోలు కోటసత్తెమ ఆలయ గర్భగుడిలోకి వరద నీరు చేరింది.

[9 : 44]

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 76,392, ఔట్ ఫ్లో 9,998 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 551 అడుగులు ఉంది. 
 

[9 : 43]

తిరువనంతపురం : కేరళ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో 10లక్షల మంది బాధితులు ఉన్నారు. 3,757 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆర్మీ, ఎన్ డీఆర్ ఎఫ్, కోస్ట్ గార్డ్ సహాయక చర్యల్లో ఉన్నారు.  

 

[9 : 22]

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కీచక టీచర్‌ను బాధితురాలి బంధువులు నడిరోడ్డుపై నగ్నంగా నడిపించారు. ఏలూరు శర్వాణీ స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిని రాంబాబు అనే టీచర్‌ శారీరకంగా లోబరుచుకున్నాడు.

[9 : 21]

అసిఫాబాద్ : కుమురంభీం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తివేశారు. అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా ఉంది. 

[8 : 39]

కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోదరుడు ప్రభాకర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలో రోడ్డు పక్కన ప్రభాకర్ మృతదేహాన్ని గుర్తించారు. 

[7 : 13]

భద్రాద్రి : గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం గోదావరి వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

[7 : 06]

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో నేడు హాకీ (పురుషులు) మధ్యాహ్నం 12.30 భారత్, హాంకాంగ్ తలపడనున్నాయి. జిమ్నాస్టిక్ మహిళల టీమ్ ఫైనల్ లో సాయంత్రం 5 గంటలకు ఆర్చరీ (మహిళల కాంపౌండ్ ) జ్యోతి సురేఖ, త్రిష, మధుమిత, ముస్కాన్ ఉదయం 8 నుంచి ఆర్చరీ (పురుషుల కాంపౌండ్) సంగ్రామ్, అభిషేక్, రజిత్. 

[7 : 01]

హైదరాబాద్ : నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రగతి నివేదన సభ, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

[6 : 25]

అమరావతి : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. 

 

[6 : 21]

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ కు వాజ్ పేయి చితాభస్మం తీసుకురానున్నారు. ఈనెల 23న గోదావరి, మూసీలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు. 

 

[6 : 18]

భద్రాద్రి : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 49.9 అడుగులకు చేరింది. 

[21 : 18]

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులను ఆదేశించినట్టు సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.

[20 : 29]

విజయవాడ : మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగ్రేటం సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

[19 : 57]

ఢిల్లీ : ఏడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాన్ని కేంద్రం ప్రభుత్వం చేపట్టింది.

[19 : 48]

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో 85 పోస్టులకు నోటీఫికేషన్ ను ప్రకటించింది. 35 శానిటరీ ఇన్పెక్టర్లు, 50 హెల్త్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి జీహెచ్ఎంసీ నోటీఫికేషన్ ను ప్రకటించింది. ఈనెలాఖరు వరకు దరఖాస్తులకు అవకాశమున్నట్లుగా ప్రకటించింది. 

[19 : 46]

హైదరాబాద్ : కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23న తలపెట్టిన పశ్చిమగోదవరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 2న జరుపుకోవాల్సిన తన పుట్టినరోజు వేడుకలకు కూడా పవన్ దూరంగా వున్నారు.

[19 : 41]

అమరావతి : మంత్రులు,ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ధర్మపోరాట దీక్షలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సమాలోచనలను కొనసాగిస్తున్నారు. 

[19 : 36]

ఢిల్లీ : ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఫండ్స్ నుండి కేరలకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తన ఎంపీ ఫండ్స్ నుండి వరద బాధితుల సహాయార్థం రూ. 5 లక్షల విరాళాన్ని అందించారు.

[16 : 31]

భద్రాచలం : ఎగువన, స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈరాత్రికి 53 అడుగులకు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

[16 : 25]

మధ్యప్రదేశ్ : మాండసౌర్ రేప్ కేసు ఘటనలో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. కేవలం రెండు నెలల్లో కేసును కూలంకషంగా విచారణ పూర్తి చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇద్దరు నిందితులకు మరణ శిక్ష విధించింది.

[16 : 06]

భద్రాద్రి : ఎగువన, స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు రాత్రికి మూడో ప్రమాద హెచ్చరికను దాటే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహశీల్దార్లు, అధికారులు అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు.

[15 : 46]

కేరళ : రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలోనే ప్రకటించిన యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్..

[15 : 44]

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కుప్పం, పలమనేరు జాతీయ రహదారిపై కడపల్లి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

[15 : 44]

హైదరాబాద్ : తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు ఘోర ప్రమాదం తప్పింది. లోకో పైలెట్ అప్రమత్తంతో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు ఘోర ప్రమాదం నుండి బైటపడింది. మహారాష్ట్రలోని బాలార్షా వద్ద రైలు పట్టాల లింక్ తొలగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలెట్ ను హెచ్చరించారు.

[14 : 49]

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారిపై ఉన్న సస్పెన్షన్ వేటుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది.

[14 : 05]

పశ్చిమగోదావరి : గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్పిల్‌వేలోకి నీరు చేరకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రాజెక్టు ప్రధాన నిర్మాణమైన స్పిల్‌వే, స్పిల్‌ వే ఛానల్‌లోకి వరద నీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు.

[13 : 47]

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌  కేసులో సింగిల్‌ బెంచ్‌ తీర్పును రెండు నెలల పాటు సస్పెన్షన్‌ చేసింది డివిజన్‌ బెంచ్‌. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది.

[13 : 46]

మహబూబ్‌నగర్‌ : ఆ గ్రామాలకు  వెళ్ళాలంటే నాటు పడవే దిక్కు.. బడికెళ్ళే పిల్లలైనా.. ఆసుపత్రికి వెళ్ళాల్సిన గర్భిణీ స్ర్తీలైనా.. ఊరు దాటాలంటే పడవ ఎక్కాల్సిందే. దాదాపు పదేళ్ళ క్రితం ర్యాలంపాడు తుంగభద్ర బ్రిడ్జికి శంకుస్థాపన చేసినా.. నేటికీ పనులు పూర్తి కాలేదు.

[13 : 45]

అసిఫాబాద్ : ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాబందులు సైతం విలవిల్లాడుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా  పెంచికల్‌ మండలం మేరిగూడ అటవీ ప్రాంతంలో వర్షానికి ఓ రాబందు అస్వస్థతకు గురైంది. ఇది గమనించి ఫారెస్ట్‌ అధికారులు పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలో చికిత్స చేయించారు.  

[13 : 44]

భూపాలపల్లి : జిల్లాలో 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కాకతీయ కట్టడాలు దెబ్బతింటున్నాయి. చారిత్రక రామప్ప ఆలయానికి ముంపు పొంచి ఉంది. రామప్ప ఆలయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. 800 ఏళ్లనాటి ప్రాచీన ఆలయం వర్షానికి తడిసింది. శివలింగం పక్కకు ఒరిగిపోయింది.

[13 : 26]

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. టీజర్ ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామచరణ్, శ్రీజ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు.

[13 : 17]

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. కమిషనర్ ఆఫీసు ముందు దీక్ష చేసేందుకు రాజాసింగ్ సిద్ధమయ్యారు.

[11 : 59]

 పశ్చిమ గోదావరి : జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎక్కడికక్కడ వంతెనలు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

[11 : 25]

మంచిర్యాల : వెన్నెల మండలంలో ఎర్రవాగు ఉప్పొంగుతోంది. ఎర్రవాగు ఉప్పొంగుతుండడంతో పజలు అవస్తలు పడుతున్నారు. స్థానికులు మానవత్వం చాటుకున్నారు. నొప్పులతో బాధపడుతున్న సౌందర్య అనే గర్భిణీని వాగు స్థానికులు దాటించి, ఆస్పత్రికి తరలించారు.

[11 : 23]

మంచిర్యాల : వెన్నెల మండలంలో ఎర్రవాగు ఉప్పొంగుతోంది. ఎర్రవాగు ఉప్పొంగుతుండడంతో పజలు అవస్తలు పడుతున్నారు. నొప్పులతో బాధపడుతున్న సౌందర్య అనే గర్భిణీని వాగు స్థానికులు దాటించి, ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 

[10 : 39]

ప.గో : యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో ప్రేమించి మోసం చేశాడంటూ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఏడేళ్లుగా ఒక అమ్మాయిన ప్రేమించి..మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందుకు మురళీకృష్ణ సిద్ధమయ్యారు. మహిళా సంఘాలు, గ్రామస్తులతో కలిసి యువతి ప్రియుడు మరళీకృష్ణను చితకబాదింది.  

[10 : 24]

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. నీటిని నాగార్జునసాగర్ లోకి విడుదల చేశారు.

[10 : 21]

తూ.గో : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 14.7 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం సహా గోదావరి తీర ప్రాంతాల్లో స్కూళ్ల సెలవు ప్రకటించారు. ఏజెన్సీలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరంలో వరద ఉధృతి కొనసాగుతోంది.

[10 : 05]

తిరువనంతపురం : కేరళ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఎడతెరిపి లేని వర్షాలతో కేరళ అతాలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలతో 400 మందికి పైగా మృతి చెందారు. పది లక్షల మంది బాధితులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్, కోస్ట్ గార్డు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

 

[9 : 57]

భదాద్రి కొత్తగూడెం : తాళిపేరు ప్రాజెక్టు 13 గేట్లను అధికారులు ఎత్తివేశారు. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీటి ఇన్ ఫ్లో 39,000 క్యూసెక్కులుగా ఉంది. 

 

[8 : 47]

నిర్మల్ : కడెం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 74, 494 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 68,650 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 698.700 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. 

[8 : 46]

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,08,128 క్యూసెక్కులు కాగా ఔటో ఫ్లో 9,238 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 549 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. 

[8 : 23]

ఢిల్లీ : టాంజానియాలో గుంటూరు జిల్లావాసి మృతి చెందారు. అనుమానాస్పదస్థితిలో లక్ష్మణ్ మృతి చెందారు.  

Pages

Don't Miss