Breaking News

[8 : 12]

హైదరాబాద్ : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది.

[8 : 08]

ఢిల్లీ : నేడు థాయ్ లాండ్ తో భారత పురుషుల కబడ్డీ జట్టు ఢీకొట్టనుంది.

 

[7 : 36]

భద్రాద్రి : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45.6 అడుగులకు చేరుకుంది.   

[7 : 21]

నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుగా ఉంది.  

[6 : 37]

భద్రాద్రి : నేటి నుంచి భద్రాచలంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. 

 

[6 : 35]

ప.గో : జిల్లాలో వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా రాజమహేంద్రవరంలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సీతానగరం, కడియం మండలాల్లో డీఈవో సెలవు ప్రకటించారు. 

 

[6 : 30]

చిత్తూరు : తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో మూడు రోజులపాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 

[6 : 25]

హైదరాబాద్ : నేడు ఆర్టీసీ నిపుణుల కమిటీతో టీఎంయూ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

 

[20 : 16]

అమరావతి : కేరళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిందని, ఏపీ ఎన్జీవోలు రూ. 20 కోట్ల సాయాన్ని ప్రకటించారని చంద్రబాబు చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్రానికి కేంద్రం రూ. 1000 కోట్లను ప్రకటించిందని... కానీ, రూ. 650 కోట్లను మాత్రమే ఇచ్చిందని విమర్శించారు.

[20 : 15]

అమరావతి : కేరళకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకుందామనుకోవడం సరికాదని అన్నారు.

[20 : 13]

అమరావతి : జల దిగ్బంధంతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమ వంతు సాయం అందించడానికి యూఏఈ లాంటి దేశాలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పారు. కేరళ ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

[19 : 44]

ఢిల్లీ : ఆసియా క్రీడలు-2018లో భారత రెజ్లర్‌ వినీశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. 50 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకొంది. ఆసియా క్రీడల్లో పసిడి సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్రను తిరగరాసింది.

[19 : 28]

అమరావతి: పోలవరం సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గేలరీ వాక్ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతోందని, పనులకు ఎడతెరిపి లేని వర్షాలు అడ్డంకిగా ఉన్నాయని పోలవరం అధికారులు సీఎంకు వివరించారు.

[18 : 43]

హైదరాబాద్ : తెలంగాణలో సీనియర్ రాజకీయవేత్త అయిన డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.

[17 : 16]

అఫ్గానిస్తాన్ : దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తఖర్ ప్రావిన్సు నుంచి రాజధాని కాబూల్ కు వెళుతున్న మూడు బస్సులపై మెరుపుదాడి చేశారు. అనంతరం వాటిలోని 100 మంది ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేశారు.

[15 : 24]

హైదరాబాద్ : బసవతారకం కిట్ల పథకంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పైవిచారణ చేపట్టిన న్యాయస్థానం పథకం అమలుపై మరో మూడు రోజులు స్టే పొడిగిస్తు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

[14 : 35]

పశ్చిమ గోదావరి : భారీ వర్షాల కారణంగా జిల్లాలో నదులన్నీ పొంగిపొర్లడంతో జంగారెడ్డి గూడెంలోని గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన 700 మంది భక్తులు ఆలయం వద్దే చిక్కుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వీరిని సురక్షితంగా కొండపైకి తీసుకెళ్లారు.

[14 : 24]

పశ్చిమ గోదావరి : వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్ర కాల్వ రిజర్వాయర్ కు నీటిమట్టం పోటెత్తింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో 27,000 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు విడుదల చేశారు.

[14 : 16]

పశ్చిమగోదావరి : గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వంతెనలు కూలిపోతున్ న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది.

[13 : 50]

పశ్చిమగోదావరి : జంగారెడ్డి గూడెంలో బైనేరు వాగుపై వంతెన కూలింది. దీనితో రాకపోకలు నిలిచిపోయాయి. 

[13 : 49]

పశ్చిమగోదావరి : తాడ్వాయి వద్ద కూలిపోయిన బ్రిడ్జీని జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పరిశీలించారు. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద చిక్కుకున్న భక్తులను 500 మందిని క్షేమంగా రక్షించామని టెన్ టివితో ఎస్పీ వెల్లడించారు. రాష్ట్రీయ రహదారుల బ్రిడ్జీలు కూలిపోతున్నాయన్నారు. 

[13 : 47]

ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోడీ లండన్ లో తలదాచుకున్నాడు. మోడీ తమ దేశంలో ఉన్నట్లు బ్రిటన్ ప్రకటించింది. మోడీని అప్పగించాలని సీబీఐ కోరనుంది. పీఎన్ బీ స్కాంలో నీరవ్ మోడీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

[13 : 46]

కృష్ణా : జిల్లాలో ఆదివారం 24 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు సాధారణంగా 447 మిల్లిమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 552 మిల్లీమీటర్లు నమోదైందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. విస్సన్నపేట, తిరువూరు, గన్నవరం మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు.  

[13 : 44]

నిజామాబాద్ : ఐదు జిల్లాల కలెక్టర్లతో మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు, ముంపునకు గురయ్యే ప్రాంతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

[13 : 35]

ఢిల్లీ : ఏపీలో నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఏపీ మంత్రి దేవినేని వివరించారు. బాబు నాయకత్వంలో రికార్డు సమయంలో కృష్ణా - గోదావరి నదులను అనుసంధానించడం జరిగిందన్నారు.

[13 : 35]

విజయవాడ : కేరళ రాష్ట్రానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ విరాళం ప్రకటించారు. రూ. కోటి విరాళాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు.

 

 

[13 : 11]

విజయవాడ : ఏపీ సచివాలయంలో మళ్లీ వర్షపు నీరు కురుస్తోంది. 4వ బ్లాక్ లోని మంత్రుల పేషీ పై నుండి వర్షపు నీరు కారుతోంది. నీటిని సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. 

[12 : 27]

విజయవాడ : మొబైల్ షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రూ. 20లక్షల మేర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైస్కూల్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

[12 : 23]

విజయవాడ : ప్రకాశం బ్యారేజీలో గరిష్టస్థాయికి నీటి మట్టం చేరింది. 1.16 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. 70 గేట్లను 2-3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 

[12 : 22]

విజయవాడ : కేరళ వరద బాధితులకు రూ. 20 కోట్ల విరాళాన్ని ఏపీ ఎన్జీవో జేఏసీ ప్రకటించింది. సీఎం చంద్రబాబును కలిసిన నేతలు అంగీకారపత్రాన్ని అందచేశారు.

 

 

[12 : 01]

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ లో రిజర్వేషన్ అన్యాయం జరిగిందంటూ పలువురు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

[11 : 14]

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతుండడంతో పాములు కొట్టుకొస్తున్నాయి. దీనితో పలు గ్రామాల ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 26 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. 

[11 : 01]

భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం విపరీతంగా కరుస్తోంది. దీనితో భద్రాచలం రామాలయం వద్ద పడమర మెట్ల వరకు చేరిన వర్షపునీరు

[10 : 59]

కేరళ : కొచ్చిన్ ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఓల్డ్ కొచ్చిన్ ఎయిర్ పోర్టు నుండి బెంగళూరుకు విమాన సర్వీసు కొనసాగుతోంది. 

[10 : 58]

ఢిల్లీ : ఆసియా గేమ్స్ లో సోమవారం భారత్ కు రజత పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్ రజత పతకం సాధించాడు. 

[10 : 56]

మహారాష్ట్ర : గడ్చిరౌలిలో వర్షం బీభత్సం కారణంగా ప్లరకోట, ఇంద్రావతి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాములగౌతం, పిరిమిలి వాగు, బాండియా వాగులకు వరద ఉధృతి పెరుగుతోంది. 300 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం. 

[10 : 55]

విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్యారేజీ 70 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ కృష్ణా కాల్వకు 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

[10 : 53]

తూర్పుగోదావరి : ఐదు రోజులుగా లంక..ముంపు గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. పడవలపైనే లంక గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

[10 : 52]

తూర్పుగోదావరి : ధవళేశ్వరం వద్ద 13.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. సముద్రంలోకి 12.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

[10 : 32]

మంచిర్యాల : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీరాంపూర్, కళ్యానిఖని, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. 

[9 : 18]

ఖమ్మం : వర్షం కారణంగా సత్తుపల్లి జేవీఆర్ సింగరేణి ఓసీలో 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

[9 : 17]

తూర్పుగోదావరి : ముమ్ముడివరం (మం) గురదాసులంక సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడింది. ఒకరు గల్లంతయ్యారు. 

[9 : 15]

కర్నూలు : శ్రీశైలం డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. 5గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. 

[9 : 11]

పశ్చిమగోదావరి : జల్లెరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో తడువాయి ఆంధ్రషుగర్స్ వంతెన కుప్పకూలిపోయింది. దీనితో వేలాది ఎకరాల పంట నీట మునగగా రాకపోకలు నిలిచిపోయాయి. 

[8 : 25]

నిజామాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతోంది. ఇన్ ఫ్లో 9847 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1072 అడుగులు. 

[8 : 19]

పెద్దపల్లి : ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 24,648 క్యూసెక్కులు ఉండగా 6 గేట్లు ఎత్తి 32,370 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం 19,0084గా ఉంది. 

[8 : 15]

నిర్మల్ : కడెం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత నీటి మట్టం 692.870 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 1135 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 5169 క్యూసెక్కులుగా ఉంది. 

[8 : 13]

హైదరాబాద్ : లేబర్ కమీషన్ కార్యాలయం వద్ద 108 ఉద్యోగులు ధర్నా చేయనున్నారు. 

[7 : 50]

ఢిల్లీ : రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు రాజీవ్ సమాధి వద్ద నివాళులర్పించారు. 

[7 : 04]

విజయవాడ : భారీ వర్షాల కారణంగా కృష్ణా...పశ్చిమగోదావరి జిల్లాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. 

[7 : 03]

చిత్తూరు : తిరుమలలో నేడు శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకుర్పారణ జరుగనుంది. మంగళవారం నుండి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. 

[6 : 46]

హైదరాబాద్‌ : చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో పోలీసులు రాత్రి కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. 100 మంది పోలీసులతో కమలానగర్‌, చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో ఈ కార్డన్‌సెర్చ్‌ కొనసాగింది. సరైన పత్రాలులేని 30 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు.  

[6 : 34]

తిరువనంతపురం : వరదల బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడుతోంది. కానీ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

[6 : 32]

హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

[6 : 27]

ఢిల్లీ : నేడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి సంస్మరణ సభ జరుగనుంది. టిడిపి ఎంపీలు సుజనా చౌదరి, తోట నరసింహలు హాజరు కానున్నారు. 

[6 : 26]

నల్గొండ : నాగార్జున సాగర్ కు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2,340 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 12,996 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 539.90 అడుగులు.

 

[6 : 26]

హైదరాబాద్ : నాటింగ్ హోమ్ టెస్టులో 292 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది.

[21 : 48]

విజయవాడ : ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కీసర, మున్నేరు, వైరా, బుడమేరు ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి 45 వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం 12 అడుగుల గరిష్ఠస్థాయికి చేరింది.

[21 : 41]

ప.గో : బుట్టాయిగూడెం మండలం వరదలో 200 మంది భక్తులు చిక్కుకున్నారు. బుట్టాయిగూడెంలో కొండ వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంలో ఆలయం వద్ద భక్తులు చిక్కుకున్నారు. గుబ్బలమంగమ్మ ఆలయ దర్శనానికి భక్తులు వెళ్లారు. అటవీప్రాంతంలో ఉధృతంగా కొండవాగులు ప్రవహిస్తున్నాయి. 

[20 : 40]

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద వరద నీరు 41.8 అడుగులకు చేరింది. పలు కాలనీలు జలమయం, రోడ్లపై వర్షపు నీరు చేరింది. 8 గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. రామాలయం పడమర మెట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. 

 

[20 : 37]

ఇండోనేషియా : ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో 65 కిలోల విభాగంలో బజరంగ్ పునియా స్వర్ణం సాధించింది. భారత్ కు చెందిన బజరంగ్ పునియా. 

[20 : 25]

విజయవాడ : తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో కట్లెరు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పికెట్‌ పెట్టారు. వరద ఉధృతితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

[20 : 19]

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలోని పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. స్టీల్‌ ప్లాంట్‌లో బట్టీ పేలడంతో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

[19 : 59]

వరంగల్‌ : జిల్లాలో హన్మకొండ ఆశోక్‌ థియేటర్‌ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి తల్లి, కొడుకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

[19 : 27]

కృష్ణా : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని నందిగామ అగ్నిమాపక కార్యాలయం నీట మునిగింది. వర్షం నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

[19 : 27]

కృష్ణా : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని నందిగామ అగ్నిమాపక కార్యాలయం నీట మునిగింది. వర్షం నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

[18 : 30]

నిర్మల్ : కడెంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ క్వార్టర్స్ లో పురుగుల మందు తాగి మధురేఖ ఆత్మహత్య చేసుకున్నారు. కడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. 

[15 : 46]

తూర్పుగోదావరి : రాగల 24 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదాదరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ సూచించింది.

[15 : 14]

తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. మృతుల సంఖ్య 385కి చేరింది. ఇళ్లల్లోకి వర్షపు నీటితో పాములు, కప్పలు చేరుతున్నాయి. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

[15 : 01]

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి.

[15 : 00]

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి.

[14 : 58]

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి.

[14 : 53]

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి.

[13 : 08]

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు సినీ నటులు విరాళాలను ప్రకటించారు. ప్రభాస్ రూ. 25 లక్షలు, అక్కినేని నాగార్జున, అక్కినేని అమలలు రూ. 28 లక్షలు, జూ.ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు, విక్రమ్ రూ. 35 లక్షలను విరాళం ప్రకటించారు. 

[13 : 07]

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో చొరబాట్లకు యత్నం జరిగింది. ఓ ఉగ్రవాదిని భారత్ బలగాలు కాల్చి చంపింది. 

[13 : 06]

ఇండోనేషియా : ఏషియన్ గేమ్స్ లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో భారత్ కు కాంస్య పతకం లభించింది. అపూర్వి చండేలా, రవికుమార్ జోడిలు పతకం సాధించారు. 

[12 : 24]

తూర్పుగోదావరి : ఏపీలో రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అనడం హాస్యాస్పదమని మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. జగన్ రాజకీయాలను భ్రష్టుపట్టించి 16 నెలలు జైల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను అవినీతి పరులనడం ఏంటీ ?

[12 : 22]

తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజీని మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 1140 టీఎంసీ మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయడం జరిగిందని దేవినేని వెల్లడించారు.

[12 : 11]

ఛత్తీస్ గడ్ : కేరళలో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని సీఎం రమన్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం ఒక రైలులో రూ. 7 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం.. తరలిస్తున్నట్లు, మూడు కోట్ల నగదును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందివ్వనున్నట్లు వెల్లడించారు.

[11 : 29]

భద్రాచలం : జిల్లాలోని పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు చెందిన 5గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. 

Pages

Don't Miss