Breaking News

[20 : 39]

విశాఖపట్టణం : పద్మనాభం (మం) నరసాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతులు కళ్యాణ్, మోహన్, వినయ్, సింహాచలంగా గుర్తించారు.

[19 : 55]

బీహార్ : ఛత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలికపై సమీప బంధువులైన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

[19 : 51]

శ్రీకాకుళం : గార (మం) గనగళ్లవానిపేట వద్ద సముద్రంలో పడవ బోల్తా పడింది. ఒకరు గల్లంతు కాగా నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. 

[19 : 51]

నెల్లూరు : కొవ్వూరు ఎస్సీ బాలికల హాస్టల్ లో పదో తరగతి చదువుతున్న సుమతి పాముకాటుకు గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన జరిగితే హాస్టల్ సిబ్బంది గోప్యంగా ఉంచారు. 

[18 : 59]

రంగారెడ్డి : హయత్ నగర్ మండలం, అబ్దుల్లాపూర్ మెట్ ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చిక్కుకున్నారు. ఈఘటనలో వేదవ్యాస్ (10) బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. 

[18 : 59]

ప్రకాశం : వేటపాలెం ఎఫ్ సీఐ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పత్తిబేళ్లు దగ్గమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 

[18 : 59]

హైదరాబాద్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 30న జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. 

[18 : 59]

ఢిల్లీ : జోషిమఠ్ నుండి ఆరు బస్సుల్లో 168 మంది తెలుగు యాత్రికులను రిషికేష్ కు తరలించారు. రాత్రి పది గంటలకు రిషికేష్ లోని టిటిడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.

[18 : 58]

హైదరాబాద్ : చట్టాల్లో మార్పులు చేసైనా గృహ నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. మహిళా కార్మికుల భద్రతకు కృషి చేస్తామన్నారు.

[18 : 58]

హైదరాబాద్ : అసంఘటిత, గృహ నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు అందిస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. గుర్తింపు కార్డులతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.

[18 : 07]

కడప : గోపవరం (మం) ప్రాజెక్టు కాలనీ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మూడు వాహనాల్లో 33 ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. 

[18 : 07]

హైదరాబాద్ : రేపు మధ్యాహ్నాం రెండు గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్నారు. రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు..ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ రావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి రాజ్ భవన్ లో విందు జరుగనుంది.

[17 : 33]

గుంటూరు : జిల్లాలో 337 మద్యం షాపులకు 11,545 దరఖాస్తులు వచ్చాయి. ఈ మద్యం దరఖాస్తుల ద్వారా రూ.34కోట్ల ఆదాయం ఏపీ ప్రభుత్వానికి వచ్చి పడింది.

[17 : 24]

ఢిల్లీ : వ్యాపమ్ స్కాంలో ఇప్పటి వరకు 41 మందికిపైగానే అనుమానాస్పదస్థితిలో మృతి చెందారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎంపీ సీఎం దీనిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

[17 : 19]

బీహార్ : నలంద స్కూల్ ప్రిన్స్ పాల్ స్థానికుల దాడిలో మృతి చెందాడు. ఆదివారం ఇద్దరు విద్యార్థుల మృతి చెందిన సంగతి తెలిసిందే. పాఠశాల యాజమాన్యమే కారణమంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మృతుల కుటుంబసభ్యులు..స్థానికులు ప్రిన్స్ పాల్ పై దాడి చేశారు. దీనితో అతను అక్కడికక్కడనే మృతి చెందాడు. 

[17 : 15]

భోపాల్ : వ్యాపమ్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర సింగ్ తోమర్ (29) ఇండోర్ జైలులో అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. 

[17 : 12]

కెనడా : ఓపెన్ గ్రాండ్ ఫ్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తెలుగుతేజం గుత్తా జ్వాల - అశ్వినీ పొన్నప్ప జోడి ఫైనల్లో ప్రవేశించింది. సెమీ ఫైనల్ లో జ్వాల, అశ్వినిలు 21-17, 21-16 స్కోరుతో జపాన్ క్రీడాకారిణులు షిహో టనక, కొహరు యొనెమొటో పై విజయం సాధించారు. 

[16 : 58]

హైదరాబాద్ : ఇప్పటి వరకు టీఎస్ ఉన్నత విద్యామండలికి ఐదు లేఖలు రాసినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రికార్డులు ఇస్తామన్నా తీసుకోవడం లేదన్నది అవాస్తవమని తెలిపారు. 

[16 : 58]

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 30వ తేదీన రాత్రి 7.30 గంటల నుండి మూడు గంటల పాటు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నియలం - రాజ్ భవన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

[16 : 58]

ఖమ్మం : పాల్వంచ మండలం బంజార వద్ద విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు చందు (7), చరణ్ (9) గా గుర్తించారు.

 

[16 : 32]

ఉత్తరాఖండ్ : భారీ వర్షాలకు యాత్రికులు చిక్కుకపోయారు. హేమకుంద్ మార్గంలో చిక్కుకున్న వేయి మంది యాత్రికులను ఇంటో టిబెట్ బోర్డర్ పోలీసులు రక్షించారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

[16 : 20]

మహబూబ్ నగర్ : జడ్చర్ల పీఎస్ సమీపంలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

[16 : 20]

హైదరాబాద్ : ఓటుకు నోటు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు సెక్షన్ 8ను ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని ప్రొ. కొదండరాం విమర్శించారు. కేంద్రం మొండిగా ముందుకు పోతే ప్రజల పక్షాన ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

 

[16 : 06]

ఉత్తర్ ప్రదేశ్ : వారణాసి ప్రజలకు భారత ప్రధాన మంత్రి మోడీ క్షమాపణలు చెప్పారు. ఆదివారం మోడీ వారణాసిలో పర్యటించాల్సి ఉంది. కానీ అక్కడ భారీ వర్షాలు పడడంతో ఆయన పర్యటన రద్దయ్యింది. పర్యటన రద్దు కావడం వల్ల క్షమాపణలు చెబుతున్నట్లు మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

[15 : 59]

హైదరాబాద్ : తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని టీఆర్ఎస్ నేత కేకే పేర్కొన్నారు. నగరంలో టీజీవో భవన్ లో సెక్షన్ - 8 పై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా కేకే మాట్లాడారు. ఉమ్మడి రాజధాని కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా నగరం నుండే పాలన చేసుకోవచ్చన్నారు.

[15 : 39]

రాజస్థాన్ : శిఖర్ జిల్లాలో బోరు బావిలో పడిన ఏడేళ్ల బాలికను బయటకు తీశారు. దాదాపు 32గంటల పాటు శ్రమించిన అధికారులు బాలికను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. 

[15 : 18]

జార్ఖండ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. హజరిబాగ్ లో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. 

[15 : 12]

ఢిల్లీ : ఉత్తరాఖండ్ నుండి తెలుగు యాత్రికులను ఏపీకి పంపేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రేపు రాత్రి 9గంటలకు ఢిల్లీ నుండి రైలులో ఏపీకి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

[15 : 12]

చిత్తూరు : రాష్ట్రపతి పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నట్లు టిటిడి జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. జులై 1న తిరుమలలో రాష్ట్రపతి పర్యటన చేస్తారని, క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ రాష్ట్రపతి తొలుత వరహా స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

[15 : 06]

పాట్నా : మిత్రా మండలం కాలనీలో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలిక మృతి చెందింది. సుమారు ఐదు గంటల పాటు బోరు బావిలో ఉండిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

[14 : 08]

పాట్నా : మిత్రా మండలం కాలనీలో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన చిన్నారని బయటకు తీశారు. వెంటనే అక్కడనే ఉన్న అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

[14 : 04]

హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారులు, నిపుణులతో పంచాయతీరాజ్ సంస్థల బలోపేతంపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. 

[14 : 03]

హైదరాబాద్: రామంతాపూర్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటిస్తున్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల భవనం, వసతిగృహం పనులకు శంకుస్థాపన చేశారు. 

[13 : 56]

పాట్నా : మిత్రా మండలం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

[13 : 47]

కడప:నగరంలోని రాజీవ్ పార్క్ సమీపంలో బిజెని నాయకుడు బండి ప్రభాకర్ పై కొందరు దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఆయన్ని స్థానికులు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

[13 : 45]

కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీదే అని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే మాపై వైసీపీ ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. పట్టిసీమ త్వరలో పూర్తి చేసి కుడి కాల్వ ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తామని తెలిపారు.

[13 : 41]

తిరుమల:కుర్తాలం పీఠాధిపతి సిద్దేశ్వర భారతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆచార వ్యవహారాలకు అనుగునంగా స్వామి వారికి గంట విరామం ఉంటే సరిపోతుందని తెలిపారు. శ్రీవారి నామాల వ్యవహారాన్ని వివాదం చేయడం సరికాదన్నారు. గర్భాలయం పై నుంచి మాత్రమే విమానాలు తిరగరాదన్నారు.

[13 : 19]

విజయవాడ:ఓటుకు నోటు వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటని ప్రశించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికల్లో గెలిచారా ? అంటూ జూపూడి వితండవాదం చేశారు.

[13 : 12]

ఖమ్మం: కొత్తగూడెం కేటీపీఎస్ ఐదో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

[13 : 09]

హైదరాబాద్: విశాఖ జిల్లాలో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.

[13 : 06]

హైదరాబాద్:ఏసీ సీఎం చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్ట్ గా జనసేన అదినేత పవన్ కల్యాణ్ ప్రవర్తించొద్దంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చలోక్తులు విసిరారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతానన్న పవన్ ఏం చేస్తున్నారని మండి పడ్డారు.

[12 : 50]

హైదరాబాద్: దివంగత ప్రధాని పీవీ నరసింహారావును ప్రధానిని చేసిన ఘనత ఎన్టీరామారావుకే దక్కుతుందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ గుర్తుచేశారు. పార్టీలతో సంబంధం లేకుండా సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి పీవీ అని కీర్తించారు.

[12 : 49]

గుంటూరు: బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకున్నామని ఏపీ హోం మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోదని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

[12 : 46]

హైదరాబాద్:జులై మొదటి వారంలో రాజధాని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తాం అని మంత్రి ప్రత్తిపాటి పుల్తారావుత ఎలిపారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకుమని పేర్కొన్నారు.

[12 : 40]

హైదరాబాద్:మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా తెలంగాణ బిడ్డకు ఇచ్చే గౌరవం అని అసహనం వ్యక్తం చేశారు. పీవీకి నివాళులర్పించే సమయం కూడా కేసీఆర్‌కు లేదా అంటూ కాంగ్ నేతలు మండిపడ్డారు.

[12 : 31]

హైదరాబాద్: సాధారణంగా ఒక రోజుకు 86,400 సెకన్లుంటాయి. కానీ ఈ సంవత్సరం జూన్ 30వ తేదీకి మాత్రం కాదు. ఆ రోజున గడియారాన్ని ఒక సెకను అధికంగా తిప్పాలని నాసా నిర్ణయించింది. భూ భ్రమణ వేగం అత్యంత నిదానంగా తగ్గుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది.

[12 : 22]

హైదరాబాద్:తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 4 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, జూలై 5 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుందని విద్యాశాఖధికారులు తెలిపారు.

 

[12 : 20]

సికింద్రాబాద్‌ : జూలైలో రాజమండ్రిలో జరిగే గోదావరి పుష్కరాలకు హాజరయ్యే యాత్రికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో మొత్తం 58 ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఈ రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

[12 : 19]

హైదరాబాద్: నాగోల్‌ అరణోదయ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. 47 తులాల బంగారం, కిలో వెండి, రూ.45 వేలు చోరీ చేసినట్టు యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసకున్నారు.

[12 : 19]

గుంటూరు: జిల్లా మాచవరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా లయోలా ప్రేమ నిలయంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులు శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లి తిరిగి వసతి గృహానికి చేరుకోలేదు. దీనిపై ప్రేమ నిలయం సిబ్బంది శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

[12 : 14]

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతీయులకు గర్వకారణమని, యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో ’మన్‌ కీ బాత్‌‘కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

[12 : 12]

కర్నూలు:ఓర్వకల్లు మండలం వెంకటాపురంలోని గంగమ్మగుడి దగ్గర కొద్దిసేపటిక్రితం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వెంకటాపురం, రామళ్లకోట గ్రామస్తుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లాఠీచార్జ్‌ చేశారు. రామళ్ల కోట గ్రామస్తులు..

[12 : 09]

హైదరాబాద్: దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పీవీ జయంతి సందర్భంగా నగరంలోని పీవీ ఘాట్ జ్ఞానభూమి వద్ద హోంమంత్రి నేడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ తెలంగాణ ముద్దు బిడ్డ.

Pages

Don't Miss