Breaking News

[11 : 26]

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ, వైగే నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుచ్చిలో వరద ఉధృతికి వంతెన కుప్పకూలినట్లు తెలుస్తోంది.

 

[11 : 07]

కేరళ : రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతొక్కరూ ముందుకు రావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళ సీఎం అకౌంట్ నెంబర్ తో విడుదల చేసింది. 

[10 : 09]

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం కీలక అనుచరుడు జబిన్ మోతిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ కు ఆర్థిక మేనేజర్ గా జబిన్ వ్యవహరిస్తున్నాడు. చీకటి వ్యవహారాలన్నీ అతని తెలుసని అక్కడి పోలీసులు భావిస్తున్నారు.

[9 : 15]

మెదక్ : మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం డాకూర్ లో మాణిక్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మాణిక్ రెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలియచేశారు. 

[9 : 15]

పశ్చిమగోదావరి : నరసాపురం వద్ద గోదావరి ఉధృతి క్రమ క్రమంగా పెరుగుతోంది. సముద్రంలోకి 12 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య పడవల రాకపోకలను నిలిపివేశారు. 

[9 : 14]

తూర్పుగోదావరి : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

[9 : 05]

కర్ణాటక : రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరదలు జిల్లాను ముంచెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కుమార స్వామి ఏరియల్ సర్వే నిర్వహించారు. 

[8 : 58]

విజయవాడ : ఏపీ రాష్ట్రానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. వాటర్ షెడ్ పథకానికి నిధులను నిలిపివేసింది. కొత్తగా మంజూరైన ఆరో బ్యాచ్ వాటర్ షెడ్లకు సొంత నిధులు వినియోగించుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. దీనితో 790 మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రూ.

[8 : 12]

సూర్యాపేట : జిల్లా మఠంపల్లి గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నోముల మౌనిక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మఠంపల్లి మండలం పెదవీడుకు చెందిన మౌనిక ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. 

[8 : 04]

చిత్తూరు : తిరుమల కొండపై అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఐదు రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. ఈ ఘటన కళ్యాణ కట్ట దగ్గర జరిగింది. పాప గుక్క పట్టి ఏడుస్తుడడంతో టిటిడి అధికారులు గుర్తించారు. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు.

[7 : 32]

అనంతపురం : ఎస్ కే వర్సిటీలో ర్యాగింగ్ కలకం సృష్టించింది. ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 20 మంది సీనియర్లపై వేటు పడింది. ఏడాది పాటు హాస్టల్ నుండి బహిష్కరించారు.  

[7 : 29]

అనంతపురం : రాప్తాడు నియోజకవర్గం తూమచర్లలో దారుణం చోటు చేసుకుంది. అంగన్ వాడీ ఉపాధ్యాయురాలిపై నాగరాజు అనే టిడిపి నేత అత్యాచార యత్నం చేయబోయాడు. ఉపాధ్యాయురాలిని నాగరాజు చెప్పుతో కొట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో నాగరాజు పారిపోయాడు. 

[7 : 27]

ఢిల్లీ : నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

[6 : 57]

ఢిల్లీ : ఫిజీ దీవుల్లో భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.2తీవ్రతగా నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

[6 : 56]

తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి శాంతిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.1 అడుగులకు నీటి మట్టం చేరింది. 11.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

[6 : 55]

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ఖరారుకు 2019 జనవరి 1వ తేదీ గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. 

[6 : 53]

ఢిల్లీ : జకార్తాలో 18వ ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. 45 దేశాల నుండి 10వేల అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుండి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత బృందంలో 311 మంది పురుషులు, 260 మంది మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నారు. 

[6 : 53]

ఢిల్లీ : నాటింగ్ హోమ్ టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. కోహ్లీ 97, రహానే 81, ధావన్ 35, పంత్ 22 నాటౌట్ గా నిలిచాడు. వోక్స్ కు 3, అండర్సన్, బ్రాడ్ రషీద్ లకు తలో వికెట్ దక్కింది. 

[6 : 53]

హైదరాబాద్ : కేరళ రాష్ట్రానికి టాలీవుడ్ నటుడు మహేష్ బాబు విరాళం ప్రకటించారు. రూ. 25లక్షల విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

[6 : 52]

విశాఖపట్టణం : జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 240వ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగనుంది. సుబ్బరాయుడుపాలెం, చంద్రయ్యపాలెం, వజ్రగడ్డ క్రాస్, తుమ్మయ్యపాలెం, జోగినిపాలెం క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 

[6 : 52]

ఢిల్లీ : కేరళలో జల విలయం కొనసాగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 357కి చేరింది. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో రూ. 19వేల కోట్ల నష్టమని ప్రాథమికంగా అంచనా వేసింది. 

[21 : 54]

ఢిల్లీ : భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 281 పరుగుల వద్ద రహానే (81) ఔట్ అయ్యారు. 

[20 : 54]

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు చిరంజీవి కుటుంబం విరాళం ప్రకటించింది. చిరంజీవి, రామ్ చరణ్ రూ. 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. చిరంజీవి తల్లి అంజనాదేవి రూ.లక్ష విరాళం ప్రకటించింది. రామ్ చరణ్ భార్య ఉపాసన 10లక్షల రూపాయల విలువైన మందులు విరాళంగా ఇచ్చారు. 

[20 : 50]

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు 'మా' అసోసియేషన్ రూ.10 లక్షల విరాళం ప్రకటించింది. 

[20 : 35]

ఇండోనేషియా : జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రెండోసారి ఏసియాడ్ గేమ్స్ కు అతిథ్యమిస్తోంది. 16 రోజులు పాటు ఏసియాడ్ గేమ్స్ జరుగనున్నాయి. 45 దేశాల నుండి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో భారత్ బరిలోకి దిగనుంది.

[19 : 21]

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 881.9 అడుగులు ఉంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

 

 

[18 : 51]

విశాఖ : వైసీపీ అధినేత వైస్ ఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపట్టారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా మోసం, అబద్ధాలు, అవినీతిమయమని విమర్శించారు. లంచాలు తీసుకునేది చంద్రబాబేనని ఆరోపించారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర 239 రోజుకు చేరింది.

[18 : 15]

ఢిల్లీ : వరదలతో అస్తవ్యస్తమైన కేరళను ఆదుకోవాలంటూ ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన చేపట్టారు. అనంతరం హోంశాఖ కార్యాలయానికి వెళ్తుండగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. 

[17 : 49]

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని షాద్‌నగర్‌లో కంటి వెలుగు ఆపరేషన్‌ వికటించి ఓ వృద్ధురాలు మృతి చెందింది. కేశంపేట మండలం దత్తాయిపల్లి చెందిన వృద్ధురాలు చెన్నమ్మను కంటి ఆపరేషన్‌ కోసం కొత్తూరు సమీపంలోని ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

[17 : 35]

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సూచించారు. రూ.500లకు పైగా విలువ చేసే విమానాలను బీజేపీ ప్రభుత్వం రూ.1600 కోట్లకు కొనుగోలు చేసిందిని రాహుల్‌ ఆరోపించారు. మోదీ ప్రజాధనాన్ని దోచుకుంటూ...

[17 : 11]

హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ రాకెట్  కలకలం సృష్టించింది. పబ్స్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇమ్మనియేల్‌ను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

[16 : 57]

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో రాహుల్‌ గాంధీ కీలక సమావేశం ముగిసింది. రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు రాహుల్‌. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలని సూచించారు. 

[13 : 41]

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల దోచుకొంటోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

[13 : 40]

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ. 41వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

[13 : 39]

పశ్చిమగోదావరి : పోలవరం పనులకు ఆంటకం ఎదురైంది. ఎగువున ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తింది. దీనితో గోదావరి నదికి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా పోలవరం ప్రాజెక్టుల్లోకి గోదారి నీరు వచ్చి చేరింది. స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ లు నీట మునిగిపోయాయి. 

[13 : 05]

ఢిల్లీ : కేరళ వరదలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది కేరళ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

[12 : 57]

విజయవాడ : 108 కిలోల వెండిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుండి సేలంకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 50లక్షల విలువైన వెండి దిమ్మెలు, రూ. 6 లక్షలు, కారును సీజ్ చేశారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

[12 : 55]

విజయవాడ : దుర్గగుడి మాజీ పాలక మండలి సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. భక్తులు అమ్మవారికి ఇచ్చే విరాళాలపై రికార్డులు లేవని, సెక్యూర్టీ టెండర్ల విషయంలో ఛైర్మన్ సొంత అజెండాగా వెళితే అడ్డుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

[12 : 51]

ఢిల్లీ : లక్షలాది కేరళ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకుని కేరళ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రిని ఆయన కోరారు.  

[11 : 25]

జయశంకర్ భూపాలపల్లి : గంగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫారెస్టు అధికారులపై ఆదివాసీలు తిరగబడ్డారు. పోడు రైతుల భూములను ధ్వంసం చేసేందుకు ఫారెస్టు అధికారులు పెద్ద ఎత్తున వచ్చారు. అధికారులను ఆదివాసీలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. 

[11 : 23]

విశాఖపట్టణం : ఏపీ సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 7.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

[11 : 16]

ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ 22వ ప్రధాని. ప్రమాణ స్వీకారోత్సవానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. 

[11 : 14]

పెద్దపల్లి : గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో మైనర్ బాలిక ప్రసవించింది. పెళ్లి చేసుకుంటానని బాలికను ఆటో డ్రైవర్ మోసం చేసినట్లు తెలుస్తోంది. 

[11 : 13]

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం పినరయి విజయన్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.  

[10 : 47]

ఢిల్లీ : కేరళ రాష్ట్రానికి ఎస్ బీఐ విరాళం ప్రకటించింది. రూ. 2 కోట్ల రూపాయలను సీఎం రిలీప్ ఫండ్ కు విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 

[10 : 38]

కేరళ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం పినరయి విజయన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కె.జె.అల్ఫోన్స్ హాజరయ్యారు. వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేరళకు రూ. 500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. 

[10 : 37]

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతనలో కాంగ్రెస్ వార్ రూమలో కీలక సమావేశం జరుగుతోంది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీలు హాజరయ్యారు. 

[9 : 56]

ఖమ్మం : తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిపోవడంతో ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 18వేలు ఉండగా ఔట్ ఫ్లో 14,200గా ఉంది. 

[9 : 54]

భద్రాద్రి : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 47.5 అడుగకు నీటిమట్టం పెరిగింది. వరద ఉధృతి తగ్గుముఖం పడుతుందని రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయలేదు. దీనితో ముంపు మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

[9 : 33]

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళలో నిర్వహించాలిస్న ఏరియల్ సర్వే రద్దయినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏరియల్ సర్వేను వాయిదా వేసినట్లు సమాచారం. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

[9 : 25]

విజయవాడ : మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలియచేశారు. 

[9 : 24]

తూర్పుగోదావరి : వైసీపీకి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

[7 : 42]

విజయవాడ : మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య (84) కన్నుమూవారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1934 జూన్ 5వ తేదీన విద్య జన్మించారు. విద్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. 1980-89 వరకు లోక్ సభకు ఎంపికయ్యారు.

[7 : 39]

తిరువనంతపురం : కేరళలో వరదలు మంచెత్తుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. 24గంటల్లోనే 106 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 385కి చేరింది. 

[7 : 38]

చిత్తూరు : తిరుమలకు రాబర్ట్ వాద్రా చేరుకున్నారు. ప్రజలు కోరుకుంటే మార్పు వస్తుందని, రాహుల్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, త్వరలో రాజకీయంగా పెద్దమార్పు వస్తుందన్నారు. 

[7 : 36]

హైదరాబాద్ : జూబ్లీహిల్స్..బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 124 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 

[7 : 29]

తూర్పుగోదావరి : గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.6 అడుగులకు నీటి మట్టం చేరింది. 14.8 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. విలీన మండలాల్లో వరద ఉధృతి చేరింది. 

[7 : 27]

పశ్చిమగోదావరి : గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ నీట మునిగింది. కొవ్వూరు గోపాద క్షేత్రాన్ని గోదావరి ముంచెత్తింది. కుక్కునూరు, వేలేరుపాడులో వరదనీరు చేరడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. 

[6 : 56]

హైదరాబాద్ : వంద మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని కేరళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆహారాన్ని తరలించనున్నారు. 

[6 : 27]

ఢిల్లీ : శనివారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. నాటింగ్‌హామ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి, రెండవ టెస్టులను ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. మూడో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు ఆశలు సజీవంగా ఉంటాయి. 

[6 : 15]

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి సీఎం పినరయి విజయన్ స్వాగతం పలికారు. శనివారం వారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. 

[6 : 14]

విజయవాడ : నేడు ఏపీ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. 

[6 : 14]

ఢిల్లీ : నేటి నుండి ఇండోనేషియాలో 18వ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. 45 దేశాల నుండి 11వేల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొననున్నారు. 

[6 : 13]

ఇస్లామాబాద్ : పాక్ జాతీయ అసెంబ్లీ ప్రధానిని ఎన్నుకొంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

[6 : 12]

విజయవాడ : నేడు శ్రీశైలం గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఉదయం 7-9 గంటల మధ్య మంత్రి దేవినేని ఉమ గేట్లను ఎత్తనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 878.9 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. 

[21 : 27]

తిరువనంతపురం : కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో ఇప్పటికే 324 మందికి పైగా మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాలో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు కొడుగు జిల్లాలో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.

[21 : 26]

తిరువనంతపురం : కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో ఇప్పటికే 324 మందికి పైగా మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాలో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. రెండు లక్షలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు. జనం ఇళ్లూ..

[20 : 11]

ఢిల్లీ : దేశ రాజకీయాల్లో వాజ్ పేయి ధృవతారగా వెలిగారని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంతో వాజ్ పేయికి అవినాభావ సంబంధం ఉందన్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకురావడంలో వాజ్ పేయి సహాయసహకారాలు ఉన్నాయన్నారు.

[20 : 09]

ఢిల్లీ : వాజ్ పేయి.. ఆదర్శవంతమైన నాయుకుడని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం వాజ్ పేయి 45 సం.రాలు నిరంతరం కృషి చేశారని చెప్పారు. మూడుసార్లు ప్రధాని అయ్యారని తెలిపారు.

[18 : 54]

తిరువనంతపురం : కేరళలో మృతుల సంఖ్య 167కు చేరింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. వరదలు సంభవించనున్నాయి. 4 వేల మందిని ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. కేరళ వ్యాప్తంగా 1,568 క్యాంపులు ఏర్పాటు చేశారు.

[18 : 45]

కుమ్రంభీం : సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట సమీపంలో పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ ఉన్న బ్రిడ్జీపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

[18 : 41]

తిరుమల : ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

[17 : 08]

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అటల్‌ దత్తపుత్రిక నమిత ..

[16 : 58]

నిర్మల్ : కౌంటర్ వెయిట్ పగిలి..కబెం ప్రాజెక్టు 2వ గేటు కుప్ప కూలిపోయింది. గేటు కూలిపోయి 8 అడుగుల ఎత్తులో నిలిచిపోవటంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో 10వేల క్యూసెక్కుల నీరు గోదావరిలో కలిసిపోతోంది. 17వ నంబర్ గేటు మోటార్ వైండింగ్ కాలిపోయింది. 

[16 : 26]

ఢిల్లీ : ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సుమారు నాలుగు కిలోమీటర్ల మేర సాగి స్మృతిస్థల్ కు చేరుకుంది.

[15 : 55]

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ అంతిమ యాత్ర స్మృతిస్థల్ కు చేరుకుంది. మరికొద్ది పేపట్లో అంతిమ సంస్కారాలు పూర్తి కానున్నాయి. దారి పొడవునా ‘అటల్ జీ అమర్ రహే’ అంటే అభిమానులు నినాదాలు చేశారు.

[15 : 37]

ఢిల్లీ : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై మరోసారి దాడి జరిగింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అగ్నివేశ్‌ వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.

[15 : 31]

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ అంతిమ సంస్కార కార్యక్రమానికి విదేశీ మంత్రులు హాజరకానున్నారు. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి భూటాన్ రాజు జిగ్నే ఖస్త్రసర్ వాంగ్ చుక్ కూడా హాజరయ్యారు.

[15 : 24]

ఢిల్లీ : అభిమాన నేత కడసారి చూపు కోసం అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దారి పొడవునా ‘అటల్ జీ అమర్ రహే’ అంటే అభిమానులు నినాదాలు చేస్తున్నారు.

[14 : 50]

ఢిల్లీ : బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి మాజీ ప్రధాని వాజ్ పేయ్ అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్ లో సాయంత్రం 4గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.

Pages

Don't Miss