ఏపీలో అందరికీ ఇల్లు : YSR గృహ పథకానికి రూ.8వేల కోట్లు 

Submitted on 12 July 2019
 Budget Allocation for YSR Housing Scheme Rs.8,615 crore for YSR housing scheme

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా YSR గృహ వసతి పథకానికి రూ.8వేల 615 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. పేదలు, నిరుపేదలు జానెడు జాగా కోసం జీవితమంతా కష్టపడుతున్నారనీ.. అలాంటి వారికోసం ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి. ఐదు సంవత్సరాల్లో 25 లక్షల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారాయన.

దీనికోసం ఈ ఏడాదిలోనే (ఉగాది నాటికి) స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. భూ సర్వేలు నిర్వహించి అవసరమైతే ప్రైవేట్ భూములను కూడా తీసుకుని గృహాలు నిర్మిస్తామని తెలిపారు. 2020 మార్చి 25వ తేదీ.. ఉగాది పండుగనాటికి ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇంటి స్థలాలకు పట్టాలను ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు మంత్రి బుగ్గన. మహిళ పేరుమీదనే ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కూడా చేయనున్నట్లు తెలిపారు. పేదలు తమ అవసరాల కోసం వీటిని తనఖా పెట్టుకునే సౌలభ్యం కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇళ్ల స్థలాల పంపిణీ, భూముల సేకరణ, ఇంటి నిర్మాణాల కోసం ఈ ఒక్క ఏడాదిలోనే అక్షరాల 8వేల కోట్లు కేటాయించటం జరిగిందన్నారు. ఈ నిధులన్నింటినీ ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు ఉంటాయన్నారు. కేవలం కేటాయింపులే కాకుండా.. చేతల్లో చూపించనున్నట్లు తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

AP
Budget
2019
Rs.8
615 crore
YSR
Housing
Scheme


మరిన్ని వార్తలు