కథ చెప్పిన బుగ్గన : రామయణంలోని ఆ ఘట్టమే.. ఆరోగ్యశ్రీకి ప్రేరణ

Submitted on 12 July 2019
Budget Minister Ramayana in Budget of AP Assembly

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి రామాయంలోని ఓ ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. రాముడి సోదరుడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చపోయిన అంశాన్ని ప్రస్తావించారు.

ప్రజలకు వైద్యం ఎంత అవసరమో.. ఏ ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎందుకు ప్రవేశ పెట్టారనే విషయాన్ని వివరించారు. రామాయణంలో రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని.. మూర్ఛ నుంచి లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు వైఎస్‌ఆర్‌ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారని తనదైన శైలిలో వివరించారు. 

ప్రతి పేద కుటుంబం కార్పొరేట్‌ హాస్పిటల్లో నాణ్యత కలిగిన ట్రీట్ మెంట్ పొందాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజలు పేదరికంలోకి పడిపోవడానికి వైద్య ఖర్చులు కూడా కారణమని ఆయన భావించారని వివరించారు. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని.. పేదలవి కూడా ప్రాణాలే అని తపించి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆ పథకాన్ని కొనసాగింపుగా.. మరింత బలోపేతంగా మా ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి. వైఎస్ఆర్ ఆశయాలను మా ప్రభుత్వంలో మరింతగా అభివృద్ది చేస్తామని.. అలాంటి పథకాల్లో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఒకటిగా సభలో రామాయణంలోని కథను తీసుకుని వివరించారు ఆర్థిక మంత్రి బుగ్గన.

AP
Assembly
Budget
Finance Minister
Ramayana
Laxman
Indrajith
Sanjeevani

మరిన్ని వార్తలు