ఎంతో రుచిరా.. : ఎర్ర ద్రాక్షాల గుత్తి.. రూ. 7లక్షలపైనే! 

Submitted on 11 July 2019
Bunch of red Japanese grapes sold for $11,000 at auction

తియ్యతియ్యని ఎర్రని ద్రాక్షాలను చూస్తే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. ఎంతో రుచిగా ఉండే ఈ ఎర్రని ద్రాక్షాలకు జపాన్ లో ఫుల్ గిరాకీ ఉంటుంది. అత్యంత ఖరైదీన ఎర్రఎర్రగా ఉండే ద్రాక్షాలను సొంతం చేసుకునేందుకు అక్కడి వారంతా ఎగబడుతుంటారు. ఈ ఎర్రని ద్రాక్ష పళ్ల గుత్తిని సీజన్ లో తొలి వేలానికి పెట్టారు.

వేలంలో ఒక్క ద్రాక్ష గుత్తి 1.2 మిలియన్ల యెన్స్ (11వేల డాలర్లు) దేశీయ కరెన్సీలో రూ. 7లక్షలపైనే ధర పలికింది. 12ఏళ్ల నుంచి జపాన్ మార్కెట్లో ఈ ఎర్రవర్ణపు జాతి ద్రాక్షాలను విక్రయిస్తున్నారు. ఇక్కడ ‘రూబీ రోమన్’ అనే పేరుతో ఎర్రద్రాక్షపండ్లను పిలుస్తుంటారు. వీటి నుంచి ఎక్కువ మోతాదులో జ్యూస్ వస్తుంది. 

పులుపు తక్కువగానూ షుగర్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. ఒక్కో ద్రాక్ష జాతిని అక్కడి ఇషైక్వా ప్రీపెక్చురల్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటి బరువు 20గ్రాములపైనే ఉంటుందని కైడో న్యూస్ ఏజెన్సీ రిపోర్టులో తెలిపింది. జూలై ఆరంభంలో వాతావరణం ప్రతికూలంగా మారింది.

దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ద్రాక్ష సాగుకు నష్టం వాటిలినట్టు రిపోర్టు తెలిపింది. సెప్టెంబర్ నాటికి 26వేల రూబీ రోమన్ ఎర్రటి ద్రాక్ష గుత్తులను రవాణా చేయడం జరుగుతుందని సాగు చేసే కంపెనీ జేఎ జెన్నాహ్ ఇషైక్వా తెలిపింది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జపాన్ లో ఖరీదైన ఈ ఎర్రని ద్రాక్షగుత్తులను వ్యాపారంలో బహుమతులుగా ఇస్తుంటారు. వ్యాపారాల్లో ప్రమోషనల్ కోసం వీటిని గిఫ్టులుగా బహుకరిస్తుంటారు. రెడ్ గ్రేప్స్ మాత్రమే కాదు.. స్టాబెర్రీలు, వాటర్ మిలాన్ వంటి ఖరీదైన పండ్లను కూడా జపాన్ లో గిఫ్ట్ లుగా ఇవ్వడం జపాన్ లో సర్వసాధారణం. 

Bunch red grapes
Japanese grapes
Kanazawa
JA Zennoh Ishikawa

మరిన్ని వార్తలు