ఒంటిపై 5కేజీల బంగారం : ఫోన్ బ్యాక్ కవర్, బూట్లు కూడా బంగారమే

Submitted on 16 July 2019
Businessman wear 5 kg gold on his shit

బప్పీలహరి సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. డ్రెస్సింగ్‌ విషయంలోనూ ఆయన శైలి భిన్నంగానే ఉంటుంది. బప్పీకి బంగారు ఆభరణాలు ధరించడం అంటే ఎంతో ఇష్టం. పుణెకు చెందిన ప్రశాంత్‌ సప్కల్‌ అనే... ఓ యువ వ్యాపారవేత్త చిన్ననాటి నుంచి బంగారం ధరించడంలో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 

జీవితంలో స్థిరపడ్డాక ఆయన కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే వ్యాపారంలో రాణించాక తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న ఓ పెద్ద బంగారు గొలుసు, బ్రేస్‌ లెట్‌, కడియం, ఉంగరాలతో పాటు ఫోన్‌ బ్యాక్‌ కవర్‌, బూట్లు కూడా బంగారంతోనే తయారు చేయించుకున్నాడు. 

5కిలోల బరువున్న వీటి విలువ సుమారు రూ.1.5కోట్లు. తన అభిరుచికి తగ్గట్టుగా తయారు చేయించుకున్న ఈ ఆభరణాలను ప్రశాంత్‌ ప్రతిరోజు ధరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

businessman
WEAR
5 kg gold
maharastra
pune

మరిన్ని వార్తలు