Activities calendar

01 July 2015

21:37 - July 1, 2015

హైదరాబాద్: కెనేడియన్ ఓపెన్ డబుల్స్ విజయంతో... భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ గుత్తా జ్వాల పొంగిపోతోంది. కెనడాలోని కాల్గారీలో ముగిసిన ఫైనల్లో హాలెండ్ కు చెందిన టాప్ సీడింగ్ జోడీ మస్కీన్, సెలెనాలపై 21-19, 21-16 తో విజయం సాధించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. తండ్రి క్రాంతి, భారత బ్యాడ్మింటన్ మాజీ చీఫ్ కోచ్ మహ్మద్ ఆరీఫ్ లతో కలసి..హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని జ్వాల చెప్పింది. తమ విజయం అందరికీ ఆనందాన్ని కలిగించిందని పొంగిపోతూ చెప్పింది. బ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతున్న బాలలతో కలసి సందడిసందడి చేసింది...

21:33 - July 1, 2015

హైదరాబాద్: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ నియమించిన ఎసిబి చీఫ్‌ ఎం కె మీనా అధికారాలపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోత పెట్టింది. కోర్టు ఉత్తర్వులు వచ్చేవరకు ప్రస్తుతానికి మీనా కేవలం శిక్షణా వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అండదండలున్న ఏసిబి అదనపు కమిషనర్ ఎస్‌ఎస్‌ యాదవ్‌కు కేసుల పర్యవేక్షణను చూసుకోవాలని చెప్పింది. మీనాను ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకోవాలని ఢిల్లీ సర్కార్‌ కోరినా.. అలా ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విజిలెన్స్‌ శాఖ డైరెక్టర్‌ సుకేష్‌ కుమార్‌ జైన్ ఏసిబికి కూడా అధినేతగా ఉంటారని ఆప్‌ ప్రభుత్వం చెబుతోంది. యాదవ్‌ నేరుగా తనకే రిపోర్టు చేయాలని సుకేష్‌ కుమార్‌ జైన్‌ ఆదేశించారు.

21:31 - July 1, 2015

ఢిల్లీ:తన వీసా కోసం సహకరించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు లలిత్‌మోదీ మంచి ఆఫరే ఇచ్చాడు. సుష్మ భర్త స్వరాజ్‌కౌశల్‌కు తన కంపెనీ ఇండోఫిల్‌లో బోర్డు డైరెక్టర్‌ పదవి ఇస్తానంటూ మోదీ ఏప్రిల్‌లో ఈమెయిల్‌ ద్వారా ప్రతిపాదించాడు. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు గత 20 ఏళ్లుగా లలిత్‌మోదీకి న్యాయవాదిగా ఉంటున్న స్వరాజ్‌ కౌశల్‌ స్పష్టం చేశారు. మరోవైపు మోదీ ఆఫర్‌ సుష్మా-లలిత్‌ల మధ్య ఉన్న సంబంధాలకు సాక్ష్యమని కాంగ్రెస్‌ పేర్కొంది. మోదీతో కౌశల్‌కు వృత్తిపరమైన సంబంధముందని ఆయన పదవిని ఆఫర్‌ చేయడంలో తప్పేముందని బిజెపి ప్రశ్నించింది. 

21:26 - July 1, 2015

ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత్‌నెట్‌, డిజిటల్‌ లాకర్‌, ఉపకార వేతనాల పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. ఇకపై ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌ ద్వారా జరగనున్నాయి. ఆసుపత్రులలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, విద్యార్థులు తమ స్కాలర్‌షిప్‌ను ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. డిజిటల్‌ ఇండియాలో భారీగా పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ కార్యక్రమానికి బడా పారిశ్రామికవేత్తలు హాజరవ్వడమే ఇందుకు నిదర్శనం. డిజిటల్‌ ఇండియాలో 2 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబాని ప్రకటించారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ 44 వేల 5 వందల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. టాటా గ్రూప్‌ కూడా డిజిటల్‌ ఇండియాలో పెట్టుబడులు పెడుతుందని సైరస్‌ మిస్త్రీ తెలిపారు. డిజిటల్‌ ఇండియా ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని విప్రో ఛైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ పేర్కొన్నారు.

డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

హైదరాబాద్:పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో డార్జిలింగ్‌, కలింపాంగ్, కుర్సియాంగ్‌ సబ్‌ డివిజన్లలో దాదాపు 25 చోట్ల కొండచరియలు విరిగి పడ్డట్టు అధికారులు తెలిపారు. 10, 55 వ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో రవాణా స్తంభించింది. సహస్ర సీమ బల్‌ బృందాలను రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఆర్మీ సహకారాన్ని అభ్యర్థించింది.

21:20 - July 1, 2015

తిరుమల: దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగింది. తొలుత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రెసిడెంట్. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రణబ్. అనంతరం కపిలతీర్థం దర్శించి అక్కడినుంచి నేరుగా తిరుమల బయల్దేరారు.
క్షేత్ర సంప్రదాయాన్ని పాటించిన ప్రణబ్ ....
క్షేత్ర సంప్రదాయాన్ని పాటించిన ప్రణబ్ ముఖర్జీ ముందుగా శ్రీవరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. తర్వాత ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. మేళతాళాలతో శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు రాష్ట్రపతి. తిరుమల శ్రీవారి దర్శనంలో రాష్ట్రపతి వెంటే ఉన్నారు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి తాను కొత్త శక్తి పొందుతానని చెప్పారు ప్రణబ్. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని చెప్పారు.
తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు....
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని నిలిపివేశారు. అయితే తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా రాష్ట్రపతి కాన్వాయ్‌లోని వాహనం స్వల్ప ప్రమాదానికి గురైంది. మొత్తానికి రాష్ట్రపతి తిరుమల పర్యటన ప్రశాంతంగా ముగియడంతో ఆలయ అధికారులు, పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

21:18 - July 1, 2015

హైదరాబాద్:ఆయన కోసం అన్నీ చేశాం. ఓడినా... నెత్తిన పెట్టుకున్నాం. పదవులిచ్చాం. అందరి కంటే ఎక్కువ గౌరవించాం. ఇంతకన్నా ఏం చేయాలి. అన్ని పదవులు అనుభవించి.. కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్తారా..? కన్నతల్లిలాంటి పార్టీకి ఆయన ఇచ్చే గౌరవమిదేనా..? డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరతారని తెలియగానే కాంగ్రెస్ నేతల స్పందన ఇది. డీఎస్ జంపింగ్‌పై టీకాంగ్‌ నేతలు గుస్సా అవుతున్నారు.
కాంగ్రెస్‌లో ఎక్కడ చూసినా..
కాంగ్రెస్‌ సీనియర్ నేత డీ.శ్రీనివాస్... ఆ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేస్తున్నారని క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్‌లో ఎక్కడ చూసినా... ఇపుడు డీఎస్‌పైనే చర్చ జరుగుతోంది. పార్టీ ఆజ్ఞలను పక్కాగా పాటించి....హైకమాండ్‌కు వీర విధేయుడిగా పేరున్న డీఎస్‌....ఇప్పుడు ఏకంగా గులాబీ గూటికి చేరుతున్నారు. పార్టీకి ఇన్నాళ్లు నమ్మిన బంటులా ఉన్న డీఎస్‌.... కష్టకాలంలో పార్టీ ఫిరాయిచంటాన్ని, కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
9 సార్లు ఎమ్మెల్యే టికెటిస్తే 6 సార్లు ఓటమి....
డీఎస్ ఎపిసోడ్‌తో ఉలిక్కపడ్డ కాంగ్రెస్‌ నేతలు.. ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఆయనకు పార్టీ చేసిన సేవలను గుర్తుచేస్తున్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడే ఆయనకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని చెబుతున్నారు. మొత్తం 9 సార్లు టికెటిస్తే ఆరుస్లార్లు ఓడిపోయారని...ఐనా పార్టీ ఆయన్ను నెత్తిన పెట్టుకుందని వాపోతున్నారు. డీఎస్‌ను రెండుసార్లు పీసీసీ చీఫ్‌ను చేసిందని, మండలిలో ఎల్‌వోపీని చేసి గౌరవించిందని విమర్శిస్తున్నారు. ఆ తర్వాత పార్టీ హైలెవల్ కమిటీకి ఛైర్మన్‌ను కూడా చేసిందని గుర్తు చేశారు. ఇంతకన్నా ఏం చేయాలని కాంగ్‌ నేతలు రగిలిపోతున్నారు.
హైకమాండ్‌ నుంచి పీసీసీ వరకు బుజ్జగింపులు....
ఇంత జరిగినా...డీఎస్‌ను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు చివరి వరకు ప్రయత్నం చేశారు. డీఎస్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారనే సమాచారాం రాగానే...హైకమాండ్ నుంచి పీసీసీ వరకు ఆయన్ను బుజ్జగించారు. ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసినా.. డీఎస్ స్పందించలేదని పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టి...మంగళవారం రాత్రి ఆయనతో మాట్లాడితే...ఉదయం ఇంటికి రమ్మని చెప్పారు. కాని ఆయన నేరుగా కేసీఆర్ క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లి చర్చలు జరిపారు. బయటకు వచ్చాక... కారెక్కటం ఖాయమని తేల్చిచెప్పారు. డీఎస్‌ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నేతగా మిగతావారికి నీతులు చెప్పి...తాను ఇలా చేయటమేంటని మండిపడుతున్నారు. మొత్తానికి డీఎస్‌ జంపింగ్‌తో ఉలికిపడ్డ కాంగ్రెస్‌....ఇతర నేతలు జారిపోకుండా అలర్టవుతోంది. 

21:15 - July 1, 2015

హైదరాబాద్:ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి..? ఏకంగా పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారే పార్టీని వీడుతుండటం దేనికి సంకేతం..? తెలుగు రాష్ట్రాల్లో ఇక పార్టీ కోలుకోవడం కష్టమని నేతలు గుర్తించారా..? పీసీసీలుగా పనిచేసిన అనుభవంతో ముందే సర్ధుకుంటున్నారా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది..
సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని షాక్‌....
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.. సార్వత్రిక ఎన్నికల్లో హస్తానికి కోలుకోలేని షాక్‌ తగిలింది.. చికిత్స చేసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రయత్నాలు ప్రారంభించారు.. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై గళమెత్తుతున్నారు.. ఇటీవలే తెలంగాణలోనూ పర్యటించి ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించారు.. మరికొద్ది రోజుల్లో ఏపీ, తెలంగాణలోనూ పర్యటనకు ప్లాన్‌ చేసుకున్నారు రాహుల్‌.. ఈలోపే సీనియర్‌ నేతలు పార్టీని వీడుతుండటం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది..స్పాట్
ఉమ్మడి ఏపీలో వరుస విజయాలు....
పదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది.. రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ 30 మందికిపైగా ఎంపీలను అందించారు తెలుగు ప్రజలు.. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.. గతెన్నికల్లో ఏపీలో హస్తం అడ్రస్‌ గల్లంతైంది.. ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన బొత్స సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ప్రజాసమస్యలపై పోరాడాలంటే తనకు ఓ వేదిక కావాలని కామెంట్‌ చేశారు.. కాంగ్రెస్‌ కూడా ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదనే సంకేతాలిచ్చారు బొత్స..
తెలంగాణ ఏర్పాటైనా దక్కని అధికారం ....
తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్నా ఇక్కడా మైలేజ్‌ రాలేదు.. చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగారు.. తర్వాత వారిని కూడా కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ నుంచి నిలువరించలేకపోతున్నారు.. మాజీ పీసీసీ చీఫ్‌ బొత్స పార్టీ వీడి నెల రోజులు కూడా తిరక్కుండానే కాంగ్రెస్‌లో మరో బిక్‌ వికెట్‌ పడింది.. ఈసారి తెలంగాణ వంతైంది.. మాజీ పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.. పార్టీలో సీనియర్‌నైన తనను క్రమంగా దూరం పెడుతుండటంపై అసంతృప్తితో ఉన్నారు.. ఎమ్మెల్సీ పదవిని కొనసాగించకపోవడంపై భగ్గుమన్నారు.. కేసీఆర్‌ను కలిసి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.. త్వరలో అన్ని విషయాలు వివరంగా చెబుతానన్నారు డీఎస్‌..
పీసీసీలు పార్టీ మారడంపై కలకలం....
ఇప్పటికే ఏపీ, తెలంగాణలో చాలా మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడారు.. ఇప్పుడు ఏకంగా పీసీసీ చీఫ్‌లుగా పనిచేసినవారే మరో పార్టీలో చేరుతుండటం కాంగ్రెస్‌ నేతలను ఆలోచనలో పడేస్తోంది.. ఇలాగైతే కేడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని నేతల్లో ఆందోళన నెలకొంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పొన్నాలను సైతం అవమానకర రీతిలో పక్కనపెట్టింది కాంగ్రెస్‌.. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తే పొలిటికల్‌గా ఫ్యూచర్‌ గందరగోళంగా మారుతుందా అనే కొత్త చర్చ కాంగ్రెస్‌ పార్టీలో ప్రారంభమైంది.. డీఎస్‌ లాంటి నేతలు పార్టీని వీడుతుండటం తాజా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా ఇబ్బందికర పరిణామమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

21:13 - July 1, 2015

హైదరాబాద్:అనారోగ్యమంటూ ఏసీబీకి మొహం చాటేసిన ఎమ్మెల్యే సండ్ర తాను రెడీ అంటున్నారు.. ఎప్పుడైనా విచారించుకోవచ్చంటూ ఏసీబీకి లేఖ రాశారు.. ఇంతకీ సడెన్‌గా సండ్రకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? ఏసీబీ అధికారులు ఇక అరెస్టులకు దిగరనే నమ్మకం కలిగిందా..? సండ్ర కాన్ఫిడెన్స్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌గా మారే ప్రమాదం ఉందా..?
ఓటుకు నోటు కేసులో ఇక అరెస్టులు లేనట్లేనా..?
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ మీద బయటకు రావడం టీడీపీ నేతలకు ఊరటనిస్తోంది.. ఈ కేసులో ఏసీబీ ఇంకా అరెస్టులకు దిగే అవకాశం లేదని నేతలు అంచనా వేస్తున్నారు.. తనను ప్రశ్నించుకోవచ్చంటూ ఎమ్మెల్యే ఏసీబీకి సండ్ర వెంకటవీరయ్య ఏసీబీకి లేఖ రాయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.. కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సండ్ర ఇంటికి వెళ్లారు. అతను అందుబాటులో లేకపోవడంతో మరో రోజు ప్రయత్నించిన ఏసీబీ అధికారులు నోటీసును ఇంటి గోడకు అతికించారు.. తర్వాత సండ్ర ఏసీబీకి లేఖ రాశారు.. అనారోగ్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నానని వివరించారు..
గడువు ముగిసినా స్పందించని సండ్ర....
విచారణకు హాజరయ్యేందుకు గడువు పొడగించాలని కోరిన సండ్ర అది పూర్తైనా స్పందించలేదు... కనీసం తాను ఎక్కడ ఉన్నాననే విషయంలోనూ గోప్యత పాటిస్తున్నారు.. రేవంత్‌ బెయిల్‌పై వాదనల్లోనూ అడ్వొకేట్‌ జనరల్‌ ఇవే అంశాలను ప్రస్తావించారు.. సండ్రతో పాటు జెరూసలెం మత్తయ్య తదితరులను ప్రశ్నించాల్సి ఉందన్నారు... ఈ లోపే ప్రధాన నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం సరికాదని వాదించారు.. ఏజీ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు రేవంత్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.. ఈ పరిణామాలతో తాను విచారణకు రెడీ అని సంకేతాలిస్తున్నారు సండ్ర..
ఇప్పటికే వేం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించిన ఏసీబీ.....
ప్రధాన నిందితులు ముగ్గురుకి బెయిల్‌ వచ్చింది.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని సైతం ఏసీబీ అధికారులు విచారించి వదిలేశారు.. ఇక తనను అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చని నిర్ధారణకు రావడం వల్లే సండ్ర ఏసీబీకి లేఖ రాసినట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.. అయితే సండ్రపై మోపిన అభియోగాలేమిటి..? అతని విషయంలో ఏసీబీ ఏ విధంగా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది.. నిందితులు ముగ్గురు బెయిల్‌పై వచ్చినంత మాత్రాన మిగతా వారిని అరెస్టు చేయవద్దనే నిబంధన ఎక్కడా లేదంటున్నారు న్యాయనిపుణులు.. మరి సండ్ర యాక్షన్‌కు ఏసీబీ ఎలాంటి రియాక్షన్‌ ఇస్తుందనేది తేలాల్సి ఉంది.

21:10 - July 1, 2015

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చారు.. షరతులతో కూడిన బెయిల్‌ నిబంధనలు అన్నీ పూర్తిచేసి బయటకు రప్పించారు అతని తరపు లాయర్లు.. రేవంత్‌ అభిమానులు చర్లపల్లి జైలు దగ్గర హంగామా చేశారు..
ఘనస్వాగతానికి తమ్ముళ్ల ఏర్పాట్లు....
రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు రెండు రోజులుగా ఎదురుచూశారు తమ్ముళ్లు.. మంగళవారం మధ్యాహ్నమే కండిషనల్‌ బెయిల్‌ వచ్చినా నిబంధనలు పూర్తి చేసేసరికి సమయం మించిపోయింది.. ఫలితంగా బుధవారం వరకు రేవంత్‌ రాకకోసం అభిమానులకు ఎదురు చూపులు తప్పలేదు...
ఏసీబీ కోర్టుకు బెయిల్‌ పత్రాలు.....
రేవంత్‌ బెయిల్‌ నిబంధనల్లో మార్పులు చేసింది హైకోర్టు.. పత్రాలను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.. ఈ ప్రక్రియంతా పూర్తయ్యే సరికి సాయంత్రం ఐదు గంటలు దాటింది.. ఉదయం నుంచే రేవంత్‌కు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు.. నగరంలో రోడ్లపై భారీగా ఫ్లెక్సీలు ఎర్పాటు చేశారు.. చర్లపల్లి జైలు దగ్గర ప్లకార్డులు ప్రదర్శించారు.. లయన్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు... ఆటమొదలైంది అంటూ ఫ్లెక్సీలు కట్టారు రేవంత్‌ ఫ్యాన్స్.
24 గంటలు ఎదురుచూపులు.....
రేవంత్‌కు బెయిల్‌ లభించిందని తెలియడంతోనే స్వీట్లు పంచుకున్న నేతలు అతను జైలు నుంచి బయటపడేందుకు మాత్రం 24 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది.. రేవంత్‌కోసం భారీగా కార్యకర్తలు తరలిరావడంతో చర్లపల్లి పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.. ఓ దశలో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వివాదం చోటుచేసుకుంది.. అడ్డుగా పెట్టిన బారీకేడ్లను తోసేసే ప్రయత్నం చేశారు రేవంత్‌ ఫ్యాన్స్‌.. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున్న గుంపులుగా ఉండటం కుదరని అధికారులు ఆదేశాలు జారీచేశారు.. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది..
సా. 4:40కి జైలుకు చేరిన బెయిల్‌ పేపర్లు....
ఏసీబీ కోర్టులో బెయిల్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న రేవంత్‌ తరపు న్యాయవాది చర్లపల్లి జైలుకు సాయంత్రం.. 4.40కి చేరుకున్నారు.. రిలీజ్‌ ఆర్డర్‌తో వచ్చిన లాయర్‌పై రేవంత్‌ అభిమానులు పూలవర్షం కురిపించారు.. బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు అతన్ని జైలు సిబ్బంది లోపలికి అనుమతించారు.. టూ వీలర్‌పై ఆఫీస్‌ వరకు తీసుకెళ్లారు.. తర్వాత జైలు నిబంధనలు పూర్తి చేసుకోవడంతో రేవంత్‌ చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చారు.. నెలరోజుల తర్వాత స్వేచ్చా వాయువులు పీల్చుకున్న రేవంత్‌ను చూసిన అభిమానులు జిందాబాద్‌లతో హోరెత్తించారు.
సా.5:25కి బయటకు వచ్చిన రేవంత్‌
సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు రేవంత్‌రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు.. అభిమానులకు టీడీపీ జెండూ ఊపుతూ అభివాదం చేశారు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌ వరకు ర్యాలీ తీశారు.. రేవంత్‌తో పాటు ఓటుకు నోటు కేసులో మిగతా ఇద్దరు నిందితులు సెబాస్టియన్‌, ఉదయసింహా బెయిల్‌పై బయకువచ్చారు... భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు బాణాసంచాకాల్చి సంబరాలు జరుపుకున్నారు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..

20:20 - July 1, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో 30 రోజుల పాటు చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు సిగ్గు పడే విధంగా రేవంత్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన భాష చూసి చంద్ర బాబు తప్ప ఎవరూ మెచ్చుకోరని తెలిపారు.

20:17 - July 1, 2015

తూ.గో: రాజమండ్రి పుష్కర ఘాట్ లో గోదావరి నిత్యాహారతి వేడుకను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు పుష్కర శంఖారావాన్ని పూరించారు. అనంతరం పురష్కర సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్య రూపక ప్రదర్శనలు కనులవిందు చేశాయి.

20:13 - July 1, 2015

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో బుధవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు. రేవంత్ విడుదలవుతుండటంతో టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున చర్లపల్లి జైలు వద్దకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి రేవంత్ మాట్లాడారు. 'నన్ను కావాలని ఈ కేసులో ఇరికించారు. నాకు బెయిల్ వచ్చింది. కేసీఆర్ కు జ్వరం వచ్చింది. కేసీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే టీఆర్ఎస్ లో చేర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయించాలి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ను గద్దె దించడమే నా ఏకైక లక్ష్యం. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుండి తరిమి కొడతా. మందులోకి సోడాలు కలిపే వాళ్లు.. మార్కెట్లో ఆలుగడ్డలు అమ్మేవాళ్లు మంత్రులయ్యారు. టీడీపీ పెట్టిన బిక్షతో పదవులు అనుభవిస్తున్నారు.' అంటూ తీవ్ర పదజాలంతో ఊగిపోయారు. అయితే షరతులతో కూడిన బెయిల్ తో వచ్చిన రేవంత్ ఈ రేంజ్ లో మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించలేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ రోజు సోషల్ మీడియాలో ఈ టాపిక్ హల్ చల్ చేస్తోంది.

ఇదంతా మాటల కుంభకోణం: పంకజ ముండే

హైదరాబాద్: మహారాష్ట్రలో స్కూలు పిల్లల కోసం రూ. 206 కోట్ల విలువైన సామగ్రి సరఫరా కాంట్రాక్టులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే ఎట్టకేలకు నోరు విప్పారు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన స్కాం అని, కేవలం రాజకీయ కక్షతోనే తనపై పస లేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కూతురైన పంకజ... మహారాష్ట్ర ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం రూ. 408 కోట్లతో ఈ తరహా సామగ్రి కొనుగోలు చేసిందని ఆమె అన్నారు.

19:41 - July 1, 2015

హైదరాబాద్:యూరోపియన్ జోన్ కు గ్రీస్ షాక్ ఇచ్చిందా? గ్రీస్ సంక్షోభాన్ని ప్రాపంచక దృక్పధంతో చూడాల్సిన అవసరంవుందా? గ్రీస్ ప్రభావం భారత్ పై పడుతుందా? గ్రీస్ సంక్షోభం అనుభవాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? రూ.170 కోట్ల డాలర్ల రుణాన్ని తీర్చలేనని గ్రీస్ చెప్పిందా? కొత్త షరతులు ఒప్పుకోవాలని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఒత్తిడి చేస్తున్నాడా? జులై5న రెఫరెండం నిర్వహిస్తానని గ్రీస్ ప్రధాని సిఫ్రాస్ ఎందుకు చెప్తున్నారు. అప్పటి వరకుఅప్పు తీర్చడానికి సమయం ఎందుకు కోరుతున్నారు?భారత్ లో సంక్షోభం రాకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ఇత్యాది విషయాలపై 10 టివి హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు, సీపీఎం జాతీయ నేత వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను చర్చించి.. విశ్లేషించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:38 - July 1, 2015

యూరోపియన్‌ దేశాలకు దిమ్మ తిరిగిపోయే స్టేట్ మెంట్..! మైండ్‌ బ్లాంక్‌ అయిపోయే సమాధానం..! ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సిన రుణ వాయిదాను చెల్లించేది లేదని గ్రీస్‌ ప్రకటించింది. తమ హెచ్చరికలతో తలవంచుకు వస్తుందనుకున్న గ్రీస్‌, ఎదిరించి నిలబడడంతో.. యూరో జోన్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. గ్రీస్‌ ప్రజానీకం చెమటను ఇన్నాళ్లూ.. అత్తరులా పూసుకున్న యూరో జోన్ కు ఊహించని షాక్‌.... గ్రీస్‌ జనుల నోటికాడి కూడు లాక్కు తిన్న యూరోపియన్ యూనియన్‌కు మింగుడు పడని సమాధానం...
అప్పును చెల్లించలేమని చేతులెత్తేసిన గ్రీస్‌....
అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఇవ్వాల్సిన అప్పును చెల్లించలేమని గ్రీస్‌ చేతులెత్తేసింది. జులై 1వ తేదీ నాటికి చెల్లించాల్సిన 170 కోట్ల డాలర్ల రుణ వాయిదా మొత్తాన్ని తీర్చడం తమ వల్లకాదని తేల్చి చెప్పింది. బుజ్జగింపులు అయిపోయాయని, ఇక చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ వచ్చిన యూరో జోన్ దేశాలకు.. ఈ పరిణామంతో ముఖంలో నెత్తురు చుక్క కరువైంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకే అధికారంలో వచ్చిన వామపక్ష ప్రభుత్వం.. జనంపై భారాలు మోపే నిర్ణయాలను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.
విజువల్స్‌షరతులతో వచ్చే కొత్త అప్పులు..
యూరోపియన్‌ కొత్త షరతులకు అంగీకరించాలని, షరతులతో వచ్చే కొత్త అప్పు తీసుకోవాలంటూ యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ జీన్‌ క్లాడ్ జంకర్‌, గ్రీస్‌ ప్రధానితో రాయబారానికి వచ్చారు. ఈ విషయాలకు అంగీకరిస్తున్నట్టు లిఖిత పూర్వకంగా చెబితే.. యూరప్‌ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేయిస్తానని, అప్పు తీర్చడానికి వారితో కొత్త అప్పు ఇప్పిస్తానని గ్రీస్‌ ప్రధాని సిప్రాస్‌కు జంకర్‌ చెప్పారు. అయితే... ప్రజల ఆమోదం మేరకే నిర్ణయం తీసుకుంటానన్న గ్రీస్‌ ప్రధాని.. ఈ నెల 5న రెఫరెండం నిర్వహించి, వారి అభిప్రాయం తెలుసుకుంటానని చెప్పారు. ఈ రెఫరెండం 5వ తేదీన జరుగుతుంది కాబట్టి, ఒకటో తేదీన చెల్లించాల్సిన అప్పు విషయంలో మరో ఐదు రోజులు ఆగాలని రాయబారానికి వచ్చిన జంకర్‌ను కోరారు. అయితే.. ఒకటో తేదీ వచ్చినా యూరో జోన్‌ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. అప్పు వాయిదాను చెల్లించలేమంటూ గ్రీస్ ప్రకటించింది.
అప్పులు ఇచ్చినట్టే ఇచ్చి....
అప్పులు ఇచ్చినట్టే ఇచ్చి, వాటిపై నానా రకాల షరతులు విధించి, గ్రీస్‌ సంపదను ఇన్నాళ్లూ దోచుకుంది యూరోపియన్‌ యూనియన్‌. గ్రీస్‌ ప్రజల నోటికాడి కూడును లాగేసుకుని యూరో దేశాలు బొజ్జలు పెంచాయి. ఏళ్ల తరబడి సాగిన ఈ దోపిడీతో గ్రీస్‌ బక్క చిక్కిపోయింది. చిక్కి శల్యమైంది. ఇప్పుడు అప్పులు చెల్లించడానికి ఆ దేశం వద్ద చిల్లి గవ్వకూడా లేదు. ఈ నేపథ్యంలో.. బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించాల్సింది యూరో జోన్‌ దేశాలే. ఇన్నాళ్లూ.. గ్రీస్‌ ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఆ దేశాలే.. ఇప్పుడు ఆ ఊబిలోంచి బయటపడేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అప్పులు మొత్తం మాఫీ చేయడంతోపాటు, గ్రీస్ పునర్నిర్మాణానికి చేయందించాలి. ఎందుకంటే.. గ్రీస్‌ మనుగడతోనే తమ భవిష్యత్‌ కూడా ముడిపడి ఉందన్న విషయాన్ని యూరోజోన్‌ మరచిపోకూడదు..

 

3వ తేదీ నుండి హరిత హారం ప్రారంభం...

హైదరాబాద్:ఈనెల మూడున హైదరాబాద్ శివార్లలోని చిల్కూరు బాలాజీ ఆలయం దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించనున్నారు. నాలుగున మెదక్‌, ఐదున కరీంనగర్‌లో ఆరున నిజామాబాద్‌ జిల్లాలో ఈ కార్యక్రమాన్నిముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

నాకు బెయిల్ వస్తే... కేసీఆర్ కు జ్వరం వచ్చింది:రేవంత్

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసు పెట్టిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో బెయిల్ పొంది చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ శ్రేణులు, తన అభిమానులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆరెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ తనపైనే ప్రయోగించి ఈ కేసులో ఇరికించారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టినందుకే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి గొంతు కోశారంటూ తెలంగాణ సిఎం తీరును రేవంత్‌ ఎండగట్టారు.

18:45 - July 1, 2015

అజిత్‌...తమిళ అగ్రనటుడిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయనొక పక్కా ప్రొఫెషనల్‌ ఫైలట్‌గా ఆర్‌సి ప్లేన్స్‌, హెలికాప్టర్స్‌ నడుపుతారనిగాని, ఫార్ములా 2 కారు రేసింగ్స్‌లో పాల్గొంటారని, అద్భుతమైన ఫొటోల్ని తీసే ఫొటోగ్రాఫర్‌ అనే సంగతి చాలా మందికి తెలీయదు. ఆయనలోని ఇన్ని కోణాల జాబితాలోకి మరో కొత్త కోణం జత కానుంది. త్వరలోనే ఓ షార్ట్‌ ఫిల్మ్‌తో ఆయన దర్శకుడిగా మారబోతున్నారు. స్క్రిప్ట్‌ని కూడా స్వయంగా ఆయనే తయారు చేయడం విశేషం. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'తలా 56' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. షెడ్యూల్‌లో గ్యాప్‌ దొరకడంతో షార్ట్‌ ఫిల్మ్‌ని రూపొందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేవలం ఒకే ఒక పాత్రతో సాగే ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో జాతీయ అవార్డు గ్రహీత అప్పుకుట్టీ నటిస్తున్నారు. 'వీరమ్‌' చిత్రంలో అజిత్‌తో అప్పుకుట్టీ నటించిన సంగతి తెలిసిందే. సందేశాత్మకంగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఉంటుందని సమాచారం. షార్ట్‌ ఫిల్మ్‌తో దర్శకుడిగా మారబోతున్న అజిత్‌ త్వరలోనే సినిమాలకు కూడా దర్శకత్వం వహించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

18:37 - July 1, 2015

హైదరాబాద్: గోదావ‌రి పుష్కరాల‌కు ఏపీ సర్కార్‌ సిద్ధమైంది. ప్రస్తుత ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధునాత‌న సాంకేతిక‌త ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకోవాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల‌ను ఉప‌యోగించుకుని పుష్కరాల ప్రచారం చేస్తోంది. పుష్కరాల కోసం ప్రత్యేక యాప్‌ను త‌యారు చేసిన ఏపీ సర్కార్‌.. భద్రత కోసం అధునాతన కెమెరాల‌తో పాటుగా హెలిక్యాప్టర్‌ సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకోనుంది.
ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల‌ ద్వారా ప్రచారం...
గోదావ‌రి పుష్కరాలంటే ఆధ్యాత్మిక‌త వెల్లివిరుస్తుంది. భ‌క్తుల పుణ్య స్నానాలు, పూజ‌లు, పిండప్రదానాలతో అంతా భ‌క్తి భావ‌మే ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పుష్కరాల ప్రచారం కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ప‌ద్దతులు అవ‌లంబిస్తోంది. గ‌త పుష్కరాల‌కు ఇప్పటికీ సాంకేతిక‌త బాగా పెరిగింది. కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయి. దీంతో మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా మారుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల‌లో గోదావ‌రి పుష్కరాల ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. దేశ విదేశాల్లో ఉన్న భ‌క్తుల‌కు పుష్కరాల ప్రాశస్త్యంతో పాటు స‌మాచారం కూడా అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల కోసం ప్రత్యేక‌ యాప్‌ను కూడా త‌యారు చేస్తున్నారు. ఈ యాప్‌ స‌హాయంతో పుష్కరాలు జ‌రిగే తీరు, ర‌వాణా స‌దుపాయాలు, ఇత‌ర ఏర్పాట్లు, ఘాట్ల వివ‌రాలు ఇలా అన్నీ అందుబాటులో ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇలాంటి యాప్ బాగా ఉప‌యోగప‌డుతుందని ప్రభుత్వ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో పాటు వైఫై సౌక‌ర్యం కూడా పూర్తి స్థాయిలో క‌ల్పించనున్నారు.
అధునాతన నిఘా కెమెరాలు...
అధునాతన నిఘా కెమెరాలను అన్ని ఘాట్ల ద‌గ్గర ఏర్పాటు చేస్తున్నారు. చిన్న విష‌యం కూడా రికార్డ్ అయ్యే విధంగా 450 సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్‌. వీటితో పాటుగా గ‌గ‌న తలంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేసి భ‌ద్రతను క‌ట్టు దిట్టం చేస్తున్నారు. శాంతి భద్రతల ప‌రిర‌క్షణ‌కు దాదాపు 30 వేల మంది పోలీసుల‌ను ఉప‌యోగిస్తున్నారు. టెక్నాల‌జీ వాడుకుని ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. 

18:33 - July 1, 2015

హైదరాబాద్:సముద్రమే వారి జీవనాధారం. బతుకు పోరులో ఎన్నో కష్టాలు.. మరెన్నో సవాళ్లు. అయినా వాటన్నింటినీ అధిగమించి.. నిత్యం శ్రమిస్తారు. ప్రకృతి కన్నెర్ర జేసినా.. ప్రేమిస్తారు. విపత్తులు ఆగ్రహించినా.. కరుణిస్తారు. కాలం కలిసిరాకున్నా.. ఓపికతో ఎదురుచూస్తారు. కొన్నాళ్లుగా ప్రకృతి విధ్వంసంతో పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోతున్న మత్స్యకారులకు తీపి కబురు అందుతోంది. కష్టాల నుంచి గట్టెక్కేందుకు.. రొయ్యలకు మంచి డిమాండ్‌ పెరగడంతో గంగపుత్రులు సంతోషంలో తేలిపోతున్నారు.
చేపల వేట ఆరంభంలో మంచి దిగుబడి....
నిషేధం తరువాత చేపల వేటకు శ్రీకారం చుట్టిన మత్స్యకారులు ఆరంభంలో మంచి దిగుబడి సాధించారు. తూర్పు తీరంలో తొలిసారిగా రెండునెలల నిషేధాన్ని కేంద్రం అమలు చేసింది. అనంతరం జూన్‌ 16 నుంచి చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు మంచి ధర పలికే రొయ్యలతో తిరిగొచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 200 బోట్లు వేటకు వెళ్ళాయి. మరో వంద బోట్లు ఆర్ధిక కారణాల వల్ల వేటకు వెళ్ళలేదు. ఒక్కో బోటుకు 3 లక్షలపైగా మరమ్మతులకు, వేటకు ఖర్చు అవుతోంది. ఆశించిన దిగుబడి రాకపోతే ఆత్మహత్యలే శరణ్యమని భావించిన మత్స్యకారులకు తీపి కబురు అందింది. విదేశాల్లో మంచి ఖరీదున్న టైగర్ రొయ్యకు మంచి దిగుబడి ఉండటంతో ఆనందపడుతున్నారు.
కేజీ టైగర్‌ రొయ్య రూ.600 నుంచి 1100....
కేజీ టైగర్ రొయ్య 600 నుంచి 1100 రూపాయల ధర పలుకుతోంది. జూన్‌లోనే వర్షాలు కురవడం, ఎక్కువ రోజులు నిషేధం అమలు కావడం.. చేపల లభ్యతకు కారణమని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇదేమీ పెద్ద సంతోషం కాదని, ఏడాది అంతా వాయుగుండాలు, తుపానులు లేకుండా వాతావరణం సహకరిస్తే.. తామంతా నష్టాల నుంచి గట్టెక్కుతామని చెబుతున్నారు.
రొయ్యలు, ట్యూనా చేపలకు మంచి గిరాకీ ......
విశాఖ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యే చేపల్లో రొయ్యలు, ట్యూనా చేపలకు మంచి గిరాకీ ఉంది. రొయ్యలు తొలి వేటలోనే బాగా వలకు పడటంతో రానున్న రోజుల్లో మరింత దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది హూదూద్ తుపాను దెబ్బకు మత్స్యకారులు కుదేలయ్యారు. ఈ సారి అలాంటి ప్రతికూల వాతావరణం లేకుండా ఉండాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు. 

18:31 - July 1, 2015

చిత్తూరు:ఐఏఎస్ అయిన ఆయన అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2014 ఎన్నికల్లో ఎంపీ విజయం సాధించారు. ఎన్నెన్నో హామీలతో ఎంపీ పదవి చేజిక్కించుకున్న ఆయన, చివరకు ప్రజలకు కనిపించకుండా పోతున్నారు. చెన్నైలో నివాసముంటూ, అడపాదడపా సొంత నియోజకవర్గంకు వచ్చిపోతున్నారు. ఇంతకీ నియోజకవర్గంలో కనబడకుండా పోయినా ఆ ప్రజాప్రతినిధి ఎవరు.?
ప్రజలు ఆయన్ను మరచిపోయారా.? ఆ మిస్టరీ ఏంటో ఓ సారి చూద్దాం...
తమిళనాడు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్‌గా విధులు....
నిజానికి రాజకీయాల్లో అకస్మాత్తుగా ఊడిపడ్డ వ్యక్తి వరప్రసాద్. తమిళనాడు రాష్ట్రంలో జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసి రిటైర్ మెంట్ సమయానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవిని కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున నాటి ఎన్నికల్లో తిరుపతి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. చాలా కాలం ఎవ్వరికీ కనిపించలేదు. చివరకు 2014 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి తిరుపతి ఎంపీగా విజయం సాధించారు. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు మాత్రం ఆయన ముఖం చూపకుండా చెన్నైలోనే సెటిలయ్యారు.
సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదని విమర్శలు......
నెల్లూరు, చిత్తూరు జిల్లాలో విశాలంగా విస్తరించి ఉన్న తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని కవర్ చేయడం కష్టమే అయినప్పటికీ, ఒక్కో ఊరికి నెలలో ఒకటి రెండు రోజులు కేటాయించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, వరప్రసాద్ ఆ పని చేయడం లేదు. సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదన్న విమర్శలున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మార్చుతామని గత ప్రభుత్వ హామీని పట్టించుకునే వారు లేరు. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పిస్తామన్న హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వీటి గురించి కనీసం ఎంపి వరప్రసాద్ పార్లమెంట్‌లో మాట్లాడిన దాఖలా లేదు. తిరుపతిలోని ఎంపి కార్యాలయం ఎప్పుడూ బోసిపోయి ఉంటుంది. ఎంపీ కనిపించరన్న ప్రచారంతో అవసరం కోసం ఇక్కడకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. మరి దీనిపై ఆయన ఏమంటున్నారు.
తిరుపతి, కాళహస్తి ఆఫీసులతో చేతులు దులుపుకుంటారా.?
తిరుపతి లాంటి అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం అభివృద్దికి పాటుపడటం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు వరప్రసాద్. తిరుపతి, కాళహస్తి లాంటి కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు ప్రారంభించి ఆయన చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా ఆయన నియోజకంలో ఎప్పటికప్పుడు పర్యటించి, సమస్యలు పరిష్కరించాలని జనం కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

18:26 - July 1, 2015

వరంగల్ : జిల్లాలో అవినీతి చేప ఏసిబి వలకు చిక్కింది. సంగ్యం మండలం పల్లారు గ్రామంలో అలావత్‌ రాజేందర్‌ అనే యువకుడు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ అమరవీరుడి కుటుంబానికి తెలంగాణ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. ఈచెక్కును తీసుకునేందుకు అమరవీరుని కుటుంబం కలెక్టరేట్‌కు వచ్చింది. దీంతో కలెక్టరేట్లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీల్ 10వేలు ఇస్తేనే చెక్ ఇస్తానని చెప్పాడు. చేసేది లేక బాధితులు ఏసిబిని ఆశ్రయించటంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సునీల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

18:25 - July 1, 2015

విశాఖ:రావికమతం మండలం, ఆర్‌.కొత్తూరులో గ్రామపెద్దలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూమిని కౌలుకు ఇవ్వడం లేదని ఆగ్రహంతో గ్రామంలోని మూడు కుటుంబాలను గ్రామపెద్దలు బహిష్కరించారు. అప్పరావు అనే కుటుంబంతో పాటు మరో రెండు కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారు. దీంతో బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక నేతలతో కలిసి వచ్చిన పోలీసులు.. గ్రామంలో పంచాయతీ పెట్టి వివరాలు సేకరిస్తున్నారు.

ఓటుకు నోటు కేసు ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి:ఏచూరి

ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలని సూచించారు.

 

అక్రమ నిర్మాణాలపై శాసనసభా సంఘం ఆగ్రహం

హైదరాబాద్: టీఎస్ శాసన సభా సంఘం జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్ సొసైటీల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించింది. అక్రమ నిర్మాణాలపై శాసన సభా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. నాలాలపై ఆక్రమణలను కూల్చివేయాలని సభా సంఘం నిర్ణయించింది. ఈనెల 13న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

 

17:39 - July 1, 2015

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో 30 రోజుల పాటు జైలు జీవితం గడిపిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పణ, అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్స్‌తో చర్లపల్లి జైలుకు చేరుకున్న రేవంత్ తరఫు న్యాయవాది, వాటిని జైలు అధికారులకు అందజేయడంతో ఆయన విడుదలయ్యారు. ఆయనతో సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు కూడా ఉన్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు, రేవంత్ అభిమానులు ఆయన్ని బాణసంచా నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ముందుగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించి.. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లి అనంతరం తన నియోజకవర్గం కొడంగల్ కు వెళ్లనున్నారు.

17:37 - July 1, 2015

తపస్‌ జేనా, ప్రదీప్‌ దాష్‌ దర్శకత్వంలో.. సంబిత్‌, కె.కె, మౌసుమి, స్నేహ, ఎల్లి ప్రధాన పాత్రల్లో, ప్రదీప్‌ కుమార్‌ అర్ర నిర్మించిన 'ప్రమాదం' చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో కె.కె మాట్లాడుతూ, 'ఇది పూర్తి స్థాయి హర్రర్‌ చిత్రం. హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అందరు హార్డ్‌ వర్క్‌ చేశారు. అందరి కృషికి తగ్గట్టుగానే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాను విడుదల చేసిన శ్రేయాస్‌ మీడియా వారికి, ఈ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు' అని అన్నారు. 'మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. హర్రర్‌ సినిమా లవర్స్‌కి ఈ చిత్రం బాగా కనెక్ట్‌ అయ్యింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌' అని నిర్మాత ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. హీరోయిన్‌ ఎల్లి మాట్లాడుతూ, 'ప్రమాదం'తో తెలుగు తెరకు పరిచయం కావడం సంతోషంగా ఉంది' అని అన్నారు.

 

రేవంత్ విడుదల

హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి బెయిల్ పై విడుదల అయ్యారు. రేవంత్ తోపాటు సెబాస్టియన్, ఉదయసింహలు కూడా విడుదల అయ్యారు. జైలు వద్ద అభిమానులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. చర్లపల్లి జైలు నుంచి ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ కు ర్యాలీగా వెళ్లనున్నారు.

 

17:18 - July 1, 2015

విక్టరీ వెంకటేష్‌, మాంత్రిక దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలు వచ్చాయి. మళయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన 'భాస్కర్‌ ద రాస్కెల్‌' చిత్రాన్ని ఈ కాంబినేషన్‌లో రీమేక్‌ చేస్తున్నారని తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రీమేక్‌ హక్కుల్ని డి.సురేష్‌బాబు పొందారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇందులో వెంకటేష్‌ సరసన నయనతారనే ఎంపిక చేశారట. గతంలో కూడా మళయాళంలో ఘన విజయం సాధించిన 'బాడీగార్డ్‌', 'దృశ్యం' చిత్రాల రీమేకుల్లో వెంకటేష్‌ నటించారు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాత సమంతతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని, స్నేహితుడు సునీల్‌తో 'బంతి' చిత్రాన్ని త్రివిక్రమ్‌ రూపొందిస్తున్నట్టు వచ్చిన వార్తలకు ఈ తాజా రీమేక్‌ బ్రేక్‌ వేసిందని చెప్పవచ్చు.

17:00 - July 1, 2015


హైదరాబాద్: ఏ కాలమొచ్చినా హైదరాబాదీ వాసులకు నీటి కష్టాలు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలం వచ్చినా.. తాగునీటి సమస్య తీరడం లేదు. ఫలితంగా రోజు రోజుకు నీటి వ్యాపారం పెరిగిపోతోంది. పట్టణాలు, నగరాల్లోనే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ నీటి వ్యాపారం పుంజుకుంది. హైదరాబాద్‌లో ప్రతిరోజూ 340 మిలియన్‌ గ్యాలన్ల నీటిని అందిస్తున్నట్లు జలమండలి లెక్కలు చెబుతోంది. అయితే నగరంలో మొత్తం నీటి డిమాండ్‌ ప్రతిరోజూ 490 మిలియన్‌ గ్యాలన్లు. అంటే 150 ఎంజీడీల నీటి కొరత వెంటాడుతోంది.
ఉస్మాన్‌సాగర్‌ 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్‌ 15 ఎంజీడీలు....
హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లతో పాటు సింగూరు, మంజీరా, కృష్ణా నదుల నుంచి జలమండలి నీటిని తరలిస్తోంది. ఉస్మాన్‌సాగర్‌ 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్‌ 15 ఎంజీడీలు, సింగూరు నుంచి 75 ఎంజీడీలు, మంజీరా నుంచి 45, అక్కంపల్లి కృష్ణానది నుంచి రెండు దశల్లోనూ కలిపి 180 ఎంజీడీల నీరు హైదరాబాద్‌ నగరానికి చేరుతుంది. అంటే ప్రతి రోజుకు 340 మిలియన్‌ గ్యాలన్ల నీరు హైదరాబాద్‌కు వస్తుంది. అయితే నగరంలో 40 శాతం వరకు నీటి పంపిణి నష్టాలు ఉన్నట్లు అధికారుల లెక్కలే చెబుతున్నాయి. అంటే 210 ఎంజీడీల నీరే నగరవాసులకు అందుతుంది. అంటే ఈ లెక్కన నగరవాసులు తాగునీటికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతోంది.
జలాశాయాల్లో అడుగంటిన నీటిమట్టాలు....
నగరానికి తాగునీరు అందించే రెండు జంట జలాశయాల్లోనూ నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. రోజురోజుకు నీరు అడుగంటుతుండడంతో డెంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఉస్మాన్‌సాగర్‌ నుంచి సరఫరా అయ్యే నీటిని కొన్ని ప్రాంతాలకు నిలిపివేసినట్లు సమాచారం. ఈ జలాశాయాల క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షం పడని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇక సింగూరులోనూ నీటి మట్టం క్రమక్రమంగా తగ్గడంతో పరిస్థితి దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు నగరంలో కొన్నిప్రాంతాల్లో వారంలో రెండురోజులు మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది.
కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా..
మరోవైపు తాగునీరు కలుషితంగా సరఫరా అవుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అదే నీటిని నగరవాసులు తాగుతున్నారు. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి వారు తరచూ రోగాల పాలవుతూ.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రతినెలా వివిధ రకాల ట్యాక్సీల పేరుతో నీటిబిల్లులు వసూలు చేస్తున్న జలమండలి..పరిశుభ్రమైన నీటిని అందించడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. 

16:51 - July 1, 2015

హైదరాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సమ్మె బాట పట్టారు. సమస్యలు పరిష్కరించని టీఆర్ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సమ్మె చేపట్టినట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని.. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని భాస్కర్ డిమాండ్ చేశారు.

16:48 - July 1, 2015

హైదరాబాద్ :సిపిఎం సీనియర్‌ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు కొరటాల సత్యనారాయణ వర్ధంతి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఆపార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఇతర నేతలు హాజరయ్యారు. కొరటాల చిత్రపటానికి పూలమాల వేసిన నేతలు.. అనంతరం ఆయనకు నివాళులర్పించారు. పార్టీ అభ్యున్నతికి కొరటాల ఎంతో కృషి చేశారని రాఘవులు కొనియాడారు. ఆయన సాధనకు మరింత కృషి చేస్తామని నేతలు అన్నారు.

విశాఖ జిల్లాలో గ్రామపెద్దల దౌర్జన్యం..

విశాఖ: రావికమతం (మండలం) ఆర్.కొత్తూరులో గ్రామపెద్దల దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూమి కౌలుకు ఇవ్వడం లేదనే కోపంతో గ్రామపెద్దలు.. కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామపెద్దలు బాధితుల సరుగుడు తోటలనూ ధ్వంసం చేశారు. గ్రామపెద్దలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

16:46 - July 1, 2015

హైదరాబాద్:వరంగల్‌ ఎంపీ ఉపఎన్నికకు ముందే కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మరోసారి భారీస్థాయిలో తెరతీసినట్లు కనిపిస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్‌ ఎలక్షన్‌కు ముందు కాంగ్రెస్‌లో కీలక నేతలను కారెక్కించుకుంటున్నారు... కాంగ్రెస్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉండి.. కీలక పదవులు చేపట్టిన నేతలు సైతం గులాబీ గూటికి చేరుతున్నారు..
బీసీ నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు...
ధర్మపురి శ్రీనివాస్‌.. డీఎస్‌గా రాజకీయాల్లో సుపరిచితులు.. కాంగ్రెస్‌ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు.. బీసీ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.. సోనియాగాంధీతో నేరుగా సమావేశమవగలిగే నాయకుల్లో డీఎస్‌ ఒకరు.. 1948 సెప్టెంబర్‌ 27న నిజామాబాద్‌లో జన్మించారు.. డీఎస్‌కు ఇద్దరు కుమారులున్నారు.. కాంగ్రెస్‌ పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు డీఎస్‌.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీని తన చాణక్యతతో 2004, 2009లో అధికారంలోకి తీసుకురాగలిగారు.. దివంగత వైఎస్‌తో డీఎస్‌ జోడీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ దశను మార్చింది.
పీసీసీ చీఫ్‌, మంత్రిగా డీఎస్‌ బాధ్యతలు...
పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు డి.శ్రీనివాస్‌.. పార్టీని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపించగలిగిన డీఎస్‌కు.. తన పొలిటికల్‌ కెరీర్‌ మాత్రం డైలమాలో పడిపోయింది.. వరుసగా మూడు ఎన్నికల్లో పరాభవాలు చవిచూడాల్సి వచ్చింది.. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.. 2012లో జరిగిన ఉప ఎన్నికలోనూ డీఎస్‌కు ఓటమి తప్పలేదు.. 2014లోనూ అదే పరిస్థితి ఎదురైంది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక నిర్వహించిన డీఎస్‌కు ఈ ఓటములు జీర్ణించుకోలేకుండా చేశాయి.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌ పార్టీ సత్తా చూపిస్తామన్న హామీలు ఆచరణలో చూపలేకపోయారనే అపవాదు మూటగట్టుకునేలా చేశాయి.
కాంగ్రెస్‌లో తగ్గుతున్న డీఎస్‌ ప్రాధాన్యం....
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పీసీసీ బాధ్యతలు పొన్నాల లక్ష్మయ్య చేతికి వెళ్లాయి.. తరువాత పరిణామాలు కూడా డీఎస్‌ ప్రాధాన్యం తగ్గుతోందనే సంకేతాలే వచ్చాయి.. పొన్నాలను పీసీసీ నుంచి తప్పించినపుడు మరోసారి తనకు పదవి దక్కుతుందని ఆశించారు డీఎస్‌.. 2011లో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నా మరోసారి పొడగించకపోవడం అతనికి ఆగ్రహం తెప్పించింది.. అలాగే నిజామాబాద్‌ జిల్లాకే చెందిన ఆకుల లలితకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి ఎంపిక విషయంలోనూ తనను సంప్రదించలేదని అసంతృప్తితో ఉన్నారు డి.శ్రీనివాస్‌.. మండలిలోనూ విపక్ష నేత పదవి దక్కకుండా కొందరు ప్రయత్నించారనేది డీఎస్‌ ఆరోపణ.
రాహుల్‌ గాంధీ నిర్ణయాలతో బ్రేక్‌....
ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు పరోక్షంగా చట్టసభలకు పంపకూడదని ఇటీవల రాహుల్‌ గాంధీ నిర్ణయించారు.. ఇలాంటి పరిణామాలతో ఇక కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే ఫ్యూచర్‌ లేదనేది డీఎస్‌ ఆలోచనగా కనిపిస్తోంది.. జాతీయ స్థాయిలోనూ పార్టీ బాగా డ్యామేజ్‌ అయింది.. మరో నాలుగేళ్ల నాటికి కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటో తెలియదు.. ఇవన్నీ గమనించే డీఎస్‌ గులాబీ గూటికి చేరుతున్నారనేది రాజకీయ విశ్లేషకులు మాట.. సీఎం కేసీఆర్‌తో డీఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.. టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తులోనూ డీఎస్‌ కీ రోల్‌ పోషించారు.. ఉద్యమ సమయంలోనూ డీఎస్‌.. కేసీఆర్‌కు.. సోనియా అపాయింట్‌మెంట్‌ ఇప్పించేవారనేది పొలిటికల్‌ టాక్‌..
కాంగ్రెస్‌ను వీడుతున్న మాజీ పీసీసీ చీఫ్‌లు.....
ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్‌లుగా పనిచేసిన కీలక నేతలు పార్టీని వీడుతుండటం కాంగ్రెస్‌ నేతలకు వరుస షాక్‌లకు గురిచేస్తోంది.. ఇటీవలే బొత్స సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన బొత్స తన రాజకీయ భవిష్యత్‌ కోసం రెండు మెట్లు దిగాల్సి వచ్చిందని కామెంట్‌ చేశారు.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత డీఎస్‌ పార్టీని వీడుతుంటడం హాట్‌టాపిక్‌ అవుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బలపడాలని రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రయత్నాలకు వరుస పరిణామాలు మింగుడుపడకుండా చేస్తున్నాయి.

16:38 - July 1, 2015

"నేను నచ్చలేదో? లేక నా ఫేస్ నచ్చలేదో? పనిగట్టుకుని నాపై రాజకీయాలు చేస్తున్నారు" అంటూ ప్రముఖ క్రీడాకారిణి గుత్తాజ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలసి టైటిల్ కైవసం చేసుకున్న జ్వాలా గుత్తా మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రైవేట్ అకాడమీకి నిధులిస్తూ వాటిని ఎంకరేజ్ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. జ్వాలా గుత్తా చెప్పకనే చెపుతూ పుల్లెల గోపీచంద్ అకాడమీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బ్యాడ్మింటన్‌లో ఎంతో రాణిస్తున్నప్పటికీ, ఒలింపక్ టాప్ స్కీంకు తన పేరును ప్రతిపాదించకపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని చెప్పారు. రెండు రోజులు క్రితం జరిగిన 'కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ' పైనల్లో తన భాగస్వామి పొన్నప్పతో కలిసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. కేవలం 35 నిమిషాల్లోనే తన ప్రత్యర్ధులను మట్టికరిపించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన మోడీ

ఢిల్లీ: డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా పథకం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని ద్వారా ప్రముఖ నగరాల్లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం అనుసంధానం చేయబడుతుంది.

 

 

చర్లపల్లి జైలు పరిసరాల్లో 144 సెక్షన్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి విడుదలవుతున్న నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసరాల్లో 2 కి.మీ వరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. చర్లపల్లి జైలు వద్ద నుంచి రేవంత్ అభిమానులు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు.

కాసేపట్లో రేవంత్ రెడ్డి విడుదల

హైదరాబాద్: కాసేపట్లో చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల కానున్నారు. రేవంత్ పూచీకత్తును ఎసిబి కోర్టు ఆమోదించింది. రేవంత్ ను విడుదల చేయాలని జైలు అధికారులకు ఆదేశించింది. రిలీజ్ ఆర్డర్ తో రేవంత్ తరపు లాయర్లు చర్లపల్లి జైలుకు బయలుదేరారు.

 

తిరుమలకొచ్చిన ప్రతిసారీ కొత్త శక్తి పుంజుకున్నా:ప్రణబ్

తిరుమల: తిరుమలకు వచ్చిన ప్రతిసారీ కొత్త శక్తి పుంజుకున్నానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడిఆయతో మాట్లాడారు. తాను ఎన్నో సార్లు తిరుమలకు వచ్చానని ప్రణబ్ తెలిపారు. ప్రజలందరికీ సుఖసౌఖ్యాలు కల్పించాలని ప్రార్థించానని వెల్లడించారు.

 

అక్రమాలపై టీఎస్ శాసనసభాసంఘం క్షేత్రస్థాయి పరిశీలన

హైదరాబాద్: జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీల్లో జరిగిన అక్రమాలపై టీఎస్ శాసనసభా సంఘం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ సొసైటీల్లో అక్రమాలు జరిగాయి. ఈ సొసైటీ భూములపై రీసర్వే జరగాలని శాసనసభా సంఘం అభిప్రాయపడింది. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిగాయి. పార్కులు అక్రమణకు గురయ్యాయి. గ్రీన్ బెల్ట్ కు కేటాయించిన స్థలంలో పెట్రోల్ బంకులు వచ్చాయి. ఈనేపథ్యంలో జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రీసర్వే జరగాలని శాసనసభా సంఘం భావించింది. 

మత్తయ్య కాల్ డేటా ఇచ్చేందుకు సమయం కోరుతూ పిటిషన్

విజయవాడ: మత్తయ్య కాల్ డేటాను ఇచ్చేందుకు సమయం కోరుతూ.. ముగ్గురు సర్వీస్ ప్రొవైడర్లు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 3కు విచారణ వాయిదా పడింది.

 

రూ.5 లక్షల పూచికత్తును చెల్లించిన రేవంత్ న్యాయవాదులు

హైదరాబాద్: రేవంత్ రెడ్డి బెయిల్ కు సంబంధించిన హైకోర్టు ఆర్డర్ కాపీని రేవంత్ తరపు న్యాయవాదులు ఎసిబి కోర్టులో సమర్పించారు. రూ.5 లక్షల పూచికత్తునూ కోర్టుకు చెల్లించారు.

 

15:42 - July 1, 2015


హైదరాబాద్:ఆయనో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం అదే రాష్ట్రంలో హోం మంత్రి... బాధ్యత మరిచి మాట్లాడం ఆయనకు అలవాటే...తాజాగా మద్యం మన ప్రాథమిక హక్కు.. మద్యం తాగడం మన ప్రతిష్టకు చిహ్నమంటూ కొత్త భాష్యం చెప్పారు గౌరు గారు.. అంతటితో ఆగకుండా మద్యపానం చేసిన వారు మత్తులో ఉంటారు.. ఆ నిశాలో వారు నేరాలేమీ చేస్తారంటూ కితాబిచ్చారు.. ఈ మధ్యనే వ్యాపమ్ స్కాంలో నిందితులు వరుసగా అనుమానస్పద రీతిలో మరణిస్తున్నారు.. దీనిపై మూడ్రోజుల కిందటే గౌర్ మాట్లాడారు.. విధిని ఎవ్వరూ మార్చలేరంటూ వ్యాఖ్యలు చేశారు.
పంచ కట్టడం కాదు... విప్పడం నేర్పిస్తా
ఇలా నోటి దురదను ప్రదర్శించడం గౌరు సార్ కు కొత్తేం కాదు.. గతంలో ఓ రష్యా మహిళ గౌర్ పంచకట్టు చూసి ఎలా కట్టుకుంటారంటూ అడిగారట.. పంచ కట్టడం కాదు... విప్పడం నేర్పిస్తా నంటూ సదరు రష్యా మహిళతో మంత్రి గౌర్ వ్యాఖ్యానించారు... అది ఇప్పుడు కుదరదన్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కార్యకర్తల సమావేశంలో చెప్పుకున్నారు...రష్యా మహిళలు చాలా అందంగా, ఆరోగ్యంగా ఉంటారు... ఓ రష్యా మహిళ తనను బహిరంగంగా ముద్దు పెట్టుకుందని ఇదే సమావేశంలో గౌర్ చెప్పారు.. అయితే ఆమె ముద్దు పెట్టుకున్న ఫోటో ఉండుంటే తనకు ఎన్నికల్లో సీటు గోవిందా అయ్యేదని కార్యకర్తల సమావేశంలో చమత్కరించారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే రేప్..లేకుంటే కాదు-గౌర్
గతంలో రేప్ పై కూడా ఈ మాజీ సీఎం నోరు పారేసుకున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే అది రేప్ అంటారు.. లేకుంటే కాదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు...
తమిళనాడులో అత్యాచారాలు తక్కువని...
తమిళనాడులో అత్యాచారాలు తక్కువని... అక్కడి ప్రజల వస్త్రదారణే దానికి కారణమంటూ గతంలో ఇదే గౌర్ వ్యాఖ్యానించారు.... ఒక వైపు లలిత్ మోడీ వివాదం, సొంత పార్టీ మంత్రులపై ఆరోపణలు, స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ వివాదం, మహారాష్ట్రలో మంత్రి పంకజ్ ముండే తో పాటు మరో మంత్రిపై అవినీతి ఆరోపణలతో తలలు పట్టుకుంటున్న బిజెపి అగ్రనేతలకు గౌర్ లాంటి నేతలు మరింత తలనొప్పిని పెంచుతున్నారు. 

ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

హైదరాబాద్: ఓ అవినీతి తిమింగలం ఎసిబికి చిక్కింది. వనస్థలిపురం ట్రాన్స్ కో ఏఈ అశోక్ రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డారు.

15:38 - July 1, 2015

హైదరాబాద్: ఎండార్స్‌మెంట్లలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోంలను మించిపోయింది హైదరాబాదీ బ్యాడ్మింటర్ స్టార్ సైనా నెహ్వాల్‌. భారీ ఎండార్స్‌మెంట్‌ డీల్‌ సొంతం చేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద బ్రేక్‌ ఫాస్ట్ చిరుధాన్యాల తయారీ సంస్థ కెల్లాగ్‌తో కోటిన్నర రూపాయల ఎండార్స్‌మెంట్‌పై సైన్ చేసింది. ఇప్పటికే యోనెక్స్, బజాజ్ నోమార్క్స్, లోడెక్స్ లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సైనా. భారతీయ మహిళా క్రీడాకారిణుల్లో ఒకటిన్నర కోట్ల రూపాయల స్పోర్ట్స్ ఎండార్స్ మెంట్‌ కలిగిఉన్నది సైనానే. కోటి రూపాయల ఎండార్స్‌మెంట్ క్లబ్‌లో సానియా మీర్జా, మేరీ కోమ్, స్వ్కాష్‌ ప్లేయర్ దీపికా పల్లికాల్ ఉన్నారు. సైనా నెహ్వాల్ , కెల్లాగ్ ప్రకటన మరికొన్ని రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది.

15:37 - July 1, 2015

హైదరాబాద్: వికిపీడియాలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు సంబంధించిన పేజీలను కేంద్రం ఐపి అడ్రస్‌ ద్వారా మార్పు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు మోతీలాల్‌ పేజీలను కూడా వికీపీడియాలో మార్పు చేశారని తెలిపింది. జవహర్‌లాల్‌ నెహ్రూను ముస్లింగా చూపుతూ వికీపీడియాలో తప్పుడు మార్పులు చేశారని కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ హిందూ, ముస్లిం అన్నది ప్రధానం కాదు..నెహ్రూ భారతీయుడని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌ నేషనల్‌ ఇన్ఫర్మెటిక్స్‌ సెంటర్‌ ద్వారా జూన్‌ 26న రహస్యంగా మార్పు చేయడం జరిగిందని ఆరోపించింది. ఈ విషయంలో ప్రభుత్వం విచారణ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అంతేకాదు.. నెహ్రూ తాత గంగాధర్‌ సమాచారాన్ని కూడా మార్పు చేశారు. గంగాధర్‌ గయాసుద్దీన్‌ గాజీ పేరుతో ముస్లిం కుటుంబంలో జన్మించారని ఆంగ్లేయుల నుంచి రక్షించుకోవడానికి గంగాధర్‌గా పేరు మార్చుకున్నట్టుగా మార్పిడి జరిగింది.

15:35 - July 1, 2015

హైదరాబాద్:రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ వైద్యం అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వైద్య సలహా కమిటీతో సమావేశమైన ఆయన.. వైద్య విధానంపై చర్చించారు. ప్రస్తుతం వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి, మెరుగైన వాతావరణం సృష్టించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలతో చర్చలు జరపాలని చెప్పారు. మాతా శిశు మరణాల రేటు తగ్గించాలని సీఎం.. ఈ విషయంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సహా రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలో..
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సహా రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలో.. వైఫై సదుపాయం కల్పించాలని చంద్రబాబు సూచించారు. వైద్యవిద్య బోధనలో నాణ్యత పెరగాలని, వైద్య పరిశోధనలపై విద్యార్థులలో ఆసక్తి పెరిగేలా చూడాలని చెప్పారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని బాబు సూచించారు.
అన్ని అవయవ మార్పిడి చికిత్సలు చేసే నైపుణ్యాన్ని....
అదేవిధంగా.. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలతోపాటు, అన్ని అవయవ మార్పిడి చికిత్సలు చేసే నైపుణ్యాన్ని అందుబాటులోకి తేవాలని, అందుకు అవసరమైన వసతులు కల్పించాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 అత్యాధునిక వైద్య శాలలు నెలకొల్పి, పేదలకు అత్యున్నత వైద్యం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఈ విధమైన లక్ష్యాలు పూర్తిచేసి, రాబోయే రోజుల్లో ఏపీని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.

15:32 - July 1, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదుపేస్తోంది. ఈ ఇష్యూ బయటకు వచ్చాక ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వివాదాలు తెరపైకి వచ్చాయి. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది. తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది.
నలుగురు అధికారుల హస్తమున్నట్లు ఆరోపణ...
ఐతే తెలంగాణ మాత్రం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేసింది. టీడీపీ నేతలు మాత్రం హోంశాఖలోని పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో...నలుగురు అధికారుల హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ తరుణంలో....కొందరు తెలంగాణ ఉన్నతాధికారులు సెలవులపై వెళ్లటం...పలు అనుమానాలకు తావిస్తోంది.
సెలవులపై వెళ్లిన ముగ్గురు ఉన్నతాధికారులు....
తెలంగాణకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ఇప్పటికే సెలవులపై వెళ్లారు. ఓట్లకు నోట్ల అంశం తెరపైకి రాగానే..ఇంటలిజెన్స్ డీజీ సెలవులపై వెళ్లారు. ఆయన బాధ్యతలను హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డికి అప్పగించారు. ఆ తర్వాత కీలకమైన ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా సెలవులపై వెళ్లారు. ఆయన క్వాజువల్‌గానే వెళ్లారంటూ ప్రభుత్వ వర్గాలు కవర్ చేశాయి. కానీ తాజాగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం సైతం సెలవులు పెట్టారు. ఆయన బాధ్యతలను రాజీవ్‌ త్రివేదికి అప్పటించారు. త్వరలో హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి కూడా సెలవులపై వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి కోరుతూ లేఖ!
ఇలా తెలంగాణ ఉన్నతాధికారులంతా ఒక్కొక్కరుగా సెలవులపై వెళ్లటం....టీడీపీ నేతల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కొన్ని నెలల క్రితం...వీరంతా ప్రభుత్వ ఆదేశాలతో పలువురి ఫోన్‌లను ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖరాసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే..టీ-సర్కార్‌ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు.... నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు.
అంత తేలిగ్గా....వదిలిపెట్టేది లేదని నారా లోకేష్‌...
తాజా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంత తేలిగ్గా....వదిలిపెట్టేది లేదని నారా లోకేష్‌ కూడా అంటున్నారు. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు....కొందరు సీనియర్ అధికారుల్లో మాత్రం వణుకుపుట్టిస్తున్నాయి. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో...ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారిలో ఆందోళన మొదలైంది.

15:28 - July 1, 2015

హైదరాబాద్‌: వనస్ధలిపురంలో మరో అవినీతి అధికారిని ఏసిబి అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 20వేలు లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 

15:26 - July 1, 2015

తిరుమల:రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. తిరుమల పర్యటనలో ఏపీ ప్రభుత్వ వాహనం మొరాయించింది. తిరుమల కొండపై వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద సీఎమ్‌ఓ వాహనం ఓ డివైడర్‌పై ఎక్కేసింది. డివైడర్‌పై చిక్కుకున్న వాహనాన్ని తప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు ట్రాఫిక్‌ వాహనం సహాయంతో పోలీసులు సీఎమ్‌ఓ వాహనాన్ని తీసుకెళ్లారు.

 

15:24 - July 1, 2015

తిరుపతి: తిరుమల వెంకటేశ్వరుడిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు,వేదపండితులు, టిటిడి అధికారులు ప్రణబ్‌ ముఖర్జీకి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్రపతి ప్రణబ్‌కు తీర్ధప్రసాదాలతో పాటు ఆశీర్వాచనాలు అందించారు. ప్రణబ్‌ వెంట రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబుతో పాటు గవర్నర్‌ నరసింహన్‌, ఏపిమంత్రులు ఉన్నారు.

15:21 - July 1, 2015

హైదరాబాద్:సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ మరో లేఖ రాశారు.తాను విచారణకు సిద్ధమని తెలియచేశారు. పది రోజులపాటు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడే ఏసీబీ విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు.

15:19 - July 1, 2015

తూ.గో:జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్‌ షాపులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. కాకినాడ రూరల్‌ డ్రైవర్స్‌ కాలనీలో స్థానిక మహిళలు ఆందోళన చేశారు. జనావాసాల మధ్య ఉన్న వైన్‌ షాపును తొలగించాలని షాప్‌పై మహిళలు దాడి చేశారు. విషయం తెలుసుకున్న వైన్‌ షాప్‌ యాజమాని ముందుగానే షాపును మూసివేసి వెళ్లాడు. దీంతో వైన్‌ షాప్‌ బయట ఉన్న కుర్చీలను, టేబుల్స్‌ను ధ్వంసం చేశారు. 

14:43 - July 1, 2015

హైదరాబాద్ : ఎక్స్ ట్రా మ్యారిటల్ లైఫ్(అక్రమ సంబంధం) అంటే ఏమిటి? అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు శిక్ష పడుతుందా? లేదా పురుషునికే శిక్ష పడుతుందా? ఎక్స్ ట్రా మ్యారిటల్ విడాకులకు గ్రౌండ్ అవుతోందా? ఇలాంటి అంశాలపై మానవి కార్యక్రమంలో 'వేదిక'లో చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి పాల్గొన్నారు. వారు చర్చించిన అంశాలు.. ప్రేక్షకుల అనుమానాల నివృత్తి చేసిన విదానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:40 - July 1, 2015

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. బెయిల్ ఆర్డర్‌లోనున్న ఏసీబీ పీఎస్‌ను ఏసీబీ కోర్టుగా హైకోర్టు సవరించింది. మరికాసేపట్లో వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించిన బాండ్లను రేవంత్‌ తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు.

మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తివేత..

ముంబై: మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తివేశారు. 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అధికారులు అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం బాబ్లీలో 0.17 టీఎంసీల నీరు ఉంది. గేట్ల ఎత్తివేత కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.

13:43 - July 1, 2015

హైదరాబాద్ : ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదలయ్యాయి. బుధవారం ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. ఈనెల మూడో వారంలో కౌన్సిలంగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు నిర్వహిస్తారని, నూజివీడు, ఇడుపుల పాయలో రెండు వేల సీట్లు ఉన్నాయన్నారు. నూజివీడు, ఇడుపులపాయ రెండింటికి 19,754 దరఖాస్తులు వచ్చాయని, కొన్ని కారణాల వల్ల 1,146 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. అమరావతి, వైజాగ్, తిరుపతి విద్యానగరాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ట్రిపుల్ ఐటీలలో శాశ్వత సిబ్బంది నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 

ప్రమాదం తర్వాత తొలిసారి సెక్రటేరియట్ కొచ్చిన ఈటెల

హైదరాబాద్: తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్.. ప్రమాదం తర్వాత తొలిసారి సెక్రటేరియట్ కు వచ్చారు.

 

13:38 - July 1, 2015

హైదరాబాద్ : తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. నగరంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కలుసుకున్న బన్సీ సరదాగా ముచ్చటించారు. గంటపాటు చిన్నారులతో అల్లు అర్జున్ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని కుటుంబ సభ్యులు..వైద్యులను బన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు బహుమతులను అందచేశారు. మేక్ ఏ విష్ ఏర్పాటు చేసిన బైక్ లను బన్నీ చిన్నారులకు అందచేశారు. మేక్ ఏ విష్ స్పూర్తిని అల్లు అర్జున్ అభినందించారు. పిల్లలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అన్ని డబ్బుతో కొనలేమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి గ్రస్థులకు డబ్బు సహాయం చేయడంకంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమని తెలిపారు. 

డివైడర్ ను ఢీకొట్టిన రాష్ట్రపతి కాన్వాయ్ వాహనం

తిరుపతి: అలిపిరిలో రాష్ట్రపతి కాన్వాయ్ లోని ఓ వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. సీఎంఓ మరోక వాహనంలో వెళ్లిపోయారు. సిబ్బంది క్రేన్ ద్వారా వాహనాన్ని తరలించారు. 

వామపక్షవిద్యార్థి సంఘాల ర్యాలీ..పులువురి అరెస్టు

హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మానవహారం చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఈనేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

 

13:25 - July 1, 2015

హైదరాబాద్ : అన్ని త్వరలో చెబుతానని కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. డీఎస్ గులాబీ గూటిలో చేరుతారన్న ప్రచారానికి ఈ భేటీ బలం చేకూర్చినట్లైంది. కేసీఆర్ తో భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ అన్ని వివరాలు త్వరలోనే చెబుతానంటూ డీఎస్ కారులో వెళ్లిపోయారు. 
ఆపరేషన్‌ ఆకర్ష్...
ఆపరేషన్‌ ఆకర్ష్ లో భాగంగా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. డీఎస్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరికొంత మంది నేతలు కూడా గులాబీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ కీలక నేత మండలి బరిలో తన సోదరుడికి దింపేందుకు అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను కోరుతున్నట్లు సమాచారం. టిడిపి నుంచి కూడా వలసలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నేతలనే కాకుండా.. గ్రేటర్ పరిధిలో ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నేతలను సైతం తీర్థం ఇచ్చేందుకు టీఆర్ఎస్‌ రెడీ అవుతోందని తెలుస్తోంది. మొత్తం మీద పార్టీ మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపడుతున్నారు గులాబీ బాస్‌. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల కోటాలో మండలి, గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. డీఎస్ తో పాటు మరికొంతమంది కీలక నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మరి డీఎస్ ఎప్పుడు చేరుతారో..మరెంత మంది చేరుతారనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

ఈనెల 6న టీఆర్ ఎస్ గూటికి డీఎస్..?

హైదరాబాద్: సచివాయంలో సీఎం కేసీఆర్ తో డీ.శ్రీనివాస్ భేటీ ముగిసింది. ఈనెల 6న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా డీఎస్.. టీఆర్ ఎస్ లో చేరే అవకాశముంది.

 

తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు

చిత్తూరు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ఎపి సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. టిటిడి అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రణబ్ ముఖర్జీ వరాహస్వామిని దర్శించుకోనున్నారు.

13:09 - July 1, 2015

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సాయంత్రం లోపున రేవంత్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేవంత్ విడుదలలో ఉత్కంఠ తొలగిపోవడంతో నేతలు, ఆయన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ ఆర్డర్ లో సాంకేతిక లోపాలున్నాయని..న్యాయమూర్తి తీర్పులో రూ.5లక్షల చొప్పున పూచికత్తును పోలీస్ స్టేషన్ లో దాఖలు చేయాలని చెప్పడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని సమాచారం. బెయిల్ ఆర్డర్ లో స్పష్టత కోసం హైకోర్టును రేవంత్ తరపు న్యాయవాదులు బుధవారం ఉదయం ఆశ్రయించారు. ఏసీబీ పీఎస్ స్థానంలో ఏసీబీ కోర్టు అని సవరించాలని రేవంత్ తరపు న్యాయవాదులు కోరారు. దీనితో కోర్టు ఆర్డర్ ను పూర్తిగా సవరించింది. ఏసీబీ పీఎస్ ను ఏసీబీ కోర్టుగా సవరిస్తూ ఆర్డర్స్ తయారు చేశారు. ఈ కాపీలు అందుకున్న అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించి రేవంత్ ను విడుదల చేయాలన్న ఆదేశాలు అందుకొనేందుకు ఆయన న్యాయవాదులు ఆఘమేఘాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో రేవంత్ తరపు న్యాయవాదులు ఆర్డర్స్ తో పాటు ఐదు లక్షలు..వ్యక్తిగత పూచీలను సమర్పించనున్నారు. అనంతరం బెయిల్ ఆర్డర్ పత్రాలను తీసుకుని చర్లపల్లి జైలుకు రేవంత్ తరపు న్యాయవాదులు వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వడానికి సాయంత్రం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం 4.30గంటల్లోగా చర్లపల్లి జైలు అధికారలుకు అందిస్తేనే రేవంత్ సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆలోగా జైలుకు ఆదేశాలు అందకుంటే రేవంత్ విడుదల రేపటికి వాయిదా పడనుంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ ను విడుదల చేయించాలన్న లక్ష్యంతో న్యాయవాదులు పరుగులు పెడుతున్నారు. మరోవైపు చర్లపల్లి జైలు వద్ద టిడిపి నాయకులు..రేవంత్ అభిమానుల కోలాహాలం ఎక్కువైంది. భారీగా నాయకులు తరలివస్తున్నారు. విడుదలయిన అనంతరం రేవంత్ ను ర్యాలీగా తీసుకెళ్లనున్నారు. దీనికి పోలీసులు మాత్రం అనుమతించలేదని సమాచారం. 

జానారెడ్డితో ఎంపీ వినోద్ భేటీ..

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

డార్జిలింగ్ కు వెళ్లనున్న మమత..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ డార్జిలింగ్ కు వెళ్లనున్నారు. భారీ వర్షాలకు డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. 

రూపాయి విలువ వాళ్ల ఏజ్ ఎప్పుడో దాటేసింది - అజయ్ కుమార్...

ఢిల్లీ : రూపాయి విలువ ప్రధాన మంత్రి మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి వయస్సు దాటిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ వయస్సు కూడా దాటాలని ప్రభుత్వం కోరుకొంటోందని ఎద్దేవా చేశారు. 

12:49 - July 1, 2015

విజయవాడ : నారాయణ విద్యాసంస్థల ఆగడాలు హద్దుమీరుతున్నాయని ఏపీ సీపిఎం కార్యదర్శి పి.మధు ఫైర్ అయ్యారు. డొనేషన్ల పేరుతో సామాన్య, మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రుల నుంచి వేలకువేల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వారి చర్యలను అడ్డుకుంటున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయించి, అక్రమంగా కేసులు నమోదు చేయించడం మరీ దారుణమన్నారు. ఇప్పటికైనా..ప్రైవేట్ విద్యాసంస్థలను రెగ్యులేట్‌ చేయడానికి సర్కార్ ఒక విధానం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే భారీ ఆందోళన తప్పదని హెచ్చరించారు. 

12:47 - July 1, 2015

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల వెండిని అపహరించారు. మరో ఇంట్లో పది వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన కుటుంబసభ్యులు దొంగతనం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

రేప్ కేసుల్లో రాజీప్రయత్నాలు సరికాదు:సుప్రీంకోర్టు

ఢిల్లీ: అత్యాచార కేసులపై సుప్రీంకోర్టు స్పందించింది. రేప్ కేసుల్లో రాజీప్రయత్నాలు సరికాదని కోర్టు తెలిపింది. రాజీకుదిర్చే ప్రయత్నాలు చేస్తే.. మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని చెప్పారు. 

12:43 - July 1, 2015

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో మోది హత్య చేసిన అనంతరం మురికినీటి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

12:38 - July 1, 2015

రాజమండ్రి: ఈనెల 14 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమహేంద్ర పూజారులు రిలే నిరహార దీక్ష చేపట్టారు. స్థానిక మార్కండేయ గుడి ఎదురుగా దీక్షలు చేస్తున్నారు. పుష్కరాల్లో తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర పురోహితులపై అధికారులు నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగానే పిండ ప్రధానాలకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. పుష్కర ప్రత్యేక అధికారులు తమను సంప్రదించకుండా పిండ ప్రధానాలకు ప్రత్యేక ప్రాంతాన్ని ఎంపిక చేశారని విమర్శించారు. వెంటనే ఈ ప్రతిపాదను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 

డీఎస్ తో మాట్లాడిన ఉత్తమ్, భట్టి

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు రాత్రి డీ.శ్రీనివాస్ తో మాట్లాడారు. పార్టీ వీడొద్దని నేతలు డీఎస్ ను కోరారు. అయితే ఉదయం 10 గంటలకు మాట్లాడుకునేందుకు రమ్మని డీఎస్ చెప్పారు. అనుకున్న సమయానికి ఉత్తమ్, బట్టిలు డీఎస్ ఇంటికి వెళ్లారు. డీఎస్ ఇంట్లో లేకపోవడంతో నాయకులు వెనుదిరిగారు.

 

కేజ్రీవాల్ నివాసం ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా..

ఢిల్లీ : రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నివాసం ఎదుట యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. వ్యాట్ సవరణ బిల్లును నిరసిస్తూ వారు ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

12:18 - July 1, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల ఎప్పుడవుతారా అని టిడిపి నేతలు, ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆయన విడుదల కోసం చర్లపల్లి జైలు ఎదుట భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బెయిల్ ఆర్డర్ లో సాంకేతిక లోపాలున్నాయని..న్యాయమూర్తి తీర్పులో రూ.5లక్షల చొప్పున పూచికత్తును పోలీస్ స్టేషన్ లో దాఖలు చేయాలని చెప్పడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని సమాచారం. బెయిల్ ఆర్డర్ లో స్పష్టత కోసం హైకోర్టును రేవంత్ తరపు న్యాయవాదులు బుధవారం ఉదయం ఆశ్రయించారు. ఏసీబీ పీఎస్ స్థానంలో ఏసీబీ కోర్టు అని సవరించాలని రేవంత్ తరపు న్యాయవాదులు కోరారు. బెయిల్ ఆర్డర్ లు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు రేవంత్ విడుదల కానున్నారు. కానీ కోర్టు మధ్యాహ్నాం తరువాత విచారణ చేపడితే రేవంత్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ష్యూరిటీ తదితర ప్రక్రియ ఐదు గంటల లోపు పూర్తి కావాల్సి ఉంటుంది.
విడుదల కాకపోతే ధర్నా చేపడుతాం..
రేవంత్ విడుదలలో కాలయాపన చేస్తున్నారని, మంగళవారం అప్పుడు..ఇప్పుడు విడుదల అవుతారని ప్రచారం చేశారని రంగారెడ్డి జిల్లా బిసి సెల్ నేత టెన్ టివితో పేర్కొన్నారు. సాంకేతిక సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారని తెలిపారు. ఈ రోజు విడుదల కాకపోతే చర్లపల్లి జైలు ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ జిల్లా వ్యాప్తంగా భారీగా నేతలు తరలి వస్తున్నారని తెలిపారు.
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్..
టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

ఎపి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదల

హైదరాబాద్: ఎపి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదలయింది. అడ్మిషన్ల ప్రక్రియను ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈనెల మూడో వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఆగస్టు 1 నుంచి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నూజివీడు, ఇడుపులపాయలలో రెండు వేల సీట్లు, అమరావతి, వైజాగ్, తిరుపతిలలో 224 సూపర్ న్యూమరీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.

 

11:40 - July 1, 2015

మహారాష్ట్ర : బిజెపి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్కుండానే స్కాంలు బయటపడుతున్నాయి. పంకజ్‌ ముండే స్కాం మరవక ముందే మరోమంత్రి వినోద్‌ తావ్‌డే టెండర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. తాజాగా అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లకు సంబంధించి విద్యాశాఖలో 191 కోట్ల రూపాయల స్కాం వెలుగు చూసింది. విద్యాశాఖ మంత్రి వినోద్‌ తావ్‌డే అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లకు సంబంధించిన191 కోట్ల రూపాయల స్కాం బయటపడింది. జిల్లా పరిషత్‌ స్కూళ్లలో 62 వేల 105 అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి 11న విద్యాశాఖ థానేకు చెందిన ఫైర్‌ ఇంజనీర్లకు కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. ఒక్కో అగ్నిమాపక యంత్రం ధర 8 వేల 321 రూపాయలుగా నిర్ణయించింది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే 191 కోట్ల రూపాయల కాంట్రాక్టులపై విద్యాశాఖ డైరెక్టర్ సంతకం చేయడం వివాదాస్పదంగా మారింది. 3 లక్షలు దాటితే ఈ టెండర్ల ద్వారా కాంట్రాక్టు ఇవ్వాలన్న నిబంధనలను విద్యాశాఖ అతిక్రమించడంతో ఆర్థికశాఖ దీనిపై విచారణకు ఆదేశించింది. దీంతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టును నిలుపదల చేశారు.
నిబంధనలు అతిక్రమించలేదు..
అగ్నిమాపక యంత్రాల కొనుగోలుకు సంబంధించి తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని, ఆర్థిక శాఖ ఆదేశంతో కాంట్రాక్టర్లకిచ్చిన ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు విద్యామంత్రి వినోద్‌ తావ్‌డే పేర్కొన్నారు. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రెండు స్కాంలు బయటపడ్డాయి. గతవారం మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పంకజా ముండే అంగన్‌వాడి పిల్లలకు సంబంధించిన వస్తు సామాగ్రి కొనుగోళ్లలో 206 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యామంత్రి వినోద్‌ తావ్‌డే ఇప్పటికే ఫేక్‌ సర్టిఫెకేట్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు అవినీతి మంత్రులను తొలగించాలంటూ కాంగ్రెస్‌ ఆందోళనను తీవ్రం చేసింది. పంకజా ముండేపై దర్యాప్తు కోసం కాంగ్రెస్‌ ఏసిబికి ఫిర్యాదు చేసింది.
సతమతమౌతున్న బీజేపీ..
కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే బిజెపి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. లలిత్‌ మోడీ గేట్‌తో కేంద్రం సతమతమవుతుంటే...మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులు స్కాంలో చిక్కుకోవడంతో కమలనాథుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది.

శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రణబ్

తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రణబ్ పూజలు నిర్వహించారు. 

వరంగల్ సీకేఎం ప్రభుత్వాస్పత్రిలో దారుణం..

వరంగల్: సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసూతికి వచ్చిన గర్భిణీ పట్ల వైద్యులు నిర్లక్ష్యం చేశారు. బి.. పాజిటివ్ బదులు ఓ.. పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ ఎంఓ స్పందించలేదు. బాధితురాలు హన్మకొండలోని రెడ్డి కాలనీ నివాసి. బాధితురాలి బంధువులు ఆందోళనలో అన్నారు.  

11:30 - July 1, 2015

చిత్తూరు : ఏడుకొండల వాడి సేవలో తరించేందుకు భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ప్రపంచ ప్రఖ్యాత పుణ్యనగరి తిరుమల తిరుపతికి చేరుకున్నారు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుపతికి వచ్చారు. బుధవారం ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రణబ్ కు ఎయిర్ పోర్టులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు అమ్మవారి దర్శనార్థం రాష్ట్రపతి ప్రణబ్ బయలుదేరారు. అక్కడ టిటిడి అధికారులు నాదసర్వంతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, నారా చంద్రబాబు నాయుడులున్నారు. ధ్వజస్తంభన చుట్టూ ప్రదిక్షణ చేసిన అనంతరం ఆలయంలోకి రాష్ట్రపతి ప్రవేశించారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత కపీలతీర్థంకు బయలుదేరి వెళ్లారు. ఈ ఆలయానికి ఆయన రావడం ఇదే తొలిసారి. ఇక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శిస్తారు. 11.50గంటలకు ఏడుకొండల వాని దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళుతారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రపతి పర్యటన తొలిసారి..
భారత దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ఆయన శ్రీవారి దర్శనార్థం రావడం ఇది మూడోసారి. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక సప్తగిరులకు విచ్చేయడం తొలిసారి. తనయుడు అభిజిత్ ముఖర్జీ..ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన మూడు ప్రఖ్యాత ఆలయాలను సందర్శించనున్నారు. మొత్తం ఆరుగంటల పాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ ను యంత్రాంగం విమానాశ్రయం లోపలే అందుబాటులో ఉంచింది. ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.

నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్.. నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ తోపాటు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఐఎఎస్ అధికారి బిపి ఆచారిలు హాజరయ్యారు.

 

11:15 - July 1, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ కారు ఎక్కడడానికే సిద్ధమౌతున్నారు. ఆయన బుజ్జగించేందుకు రంగంలోకి దిగాలని అధిష్టానం సూచనలతో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కలు డీఎస్ నివాసానికి వెళ్లారు. కానీ అప్పటికే డీఎస్ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. దీనితో కొద్దిసేపు వేచి చూసిన అనంతరం ఉత్తమ్, భట్టి విక్రమార్కలు గాంధీ భవన్ కు వెళ్లారు. పార్టీలో ఎప్పుడు చేరాలన్న దానిపై కేసీఆర్ తో డీఎస్ చర్చించినట్లు సమాచారం. డీఎస్ టీఆర్ఎస్ లో చేరితే రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన హోదాకు తగ్గ పదవిని పార్టీలో ఇస్తారని సమాచారం. పదవి ఇస్తారనే హామీ పొందిన తరువాతే డీఎస్ తన అనుచరులతో కలిసి గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. డీఎస్ బాటలోనే మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్ లు నడువనున్నట్లు సమాచారం.
డీఎస్ అసంతృప్తికి కారణం..
గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో డీఎస్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా టిఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ కే. కేశవరావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ తాను కేకేతో సమావేశం కాలేదని డీఎస్ పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను తనకు జరిగిన అన్యాయాన్ని పార్టీకి తాను చేసిన సేవ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసినప్పటికీ కొంత మంది పార్టీ సీనియర్ నాయకులు అడ్డుకున్నారని అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తనను కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు అడ్డుగా తయారయ్యారని ఇటీవల జరిగిన విలేకరు సమావేశంలో డీఎస్ మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి తనకు దక్కకుండా మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీ ప్రయత్నం చేశారని ఆయన గుర్రుగా ఉన్నారు. డీఎస్ ఎన్నికైతే తనకు మండలిలో ప్రతిపక్ష నేత ఆకుల లలితను తెరపైకి తెచ్చి తనను పార్టీకి దూరం చేశారని తన అనచరుల వద్ద డీఎస్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 

హైకోర్టులో రేవంత్ తరపు న్యాయవాదుల పిటిషన్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. ఉత్తర్వులోని 'ఎసిబి పోలీసులు' పదంపై వివరణ కోరారు. 

రేవంత్ దిష్టిబొమ్మ దహనం..విద్యార్థికి అంటుకున్న మంటలు..

హైదరాబాద్: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రమాదవశాత్తు ఓ విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. తోటి విద్యార్థులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.  

కాసేపట్లో కాంగ్రెస్ కు డి.ఎస్ రాజీనామా..?

హైదరాబాద్: కాసేపట్లో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. టిపిసిపి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్లివిక్రమార్కలు డీఎస్ నివాసానికి వెళ్లారు.

 

మధ్యప్రదేశ్ మంత్రిపై ఐద్వా ఆగ్రహం

విజయవాడ: మధ్యప్రదేశ్ మంత్రిపై ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం సేవించడం ప్రాథమిక హక్కు అని మంత్రి అనడం సరికాదని ఐద్వా నేతలు అభిప్రాయపడ్డారు. మద్యంపై మంత్రి చేసిన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

స్కూల్ డైరెక్టర్ హత్య.. ఆరుగురి అరెస్టు

బీహార్: స్కూల్ డైరెక్టర్ ను కొట్టి చంపిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నలందా జిల్లా నిర్పూర్ లో మూడు రోజుల క్రితం ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమయ్యాడన్న ఆగ్రహంతో స్కూల్ డైరెక్టర్ ను గ్రామస్తులు కొట్టి చంపారు.

 

వెస్ట్ బెంగాల్ లో భారీ వర్షాలు..పది మంది మృతి..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిరిక్, కలిపాంగ్, డార్జెలింగ్ ప్రాంతాల్లో పది మందికిపైగా మృతి చెందినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. 

ఏవోబీ బంద్ కు మావోల పిలుపు..

విశాఖపట్టణం : జులై ఆరు, ఏడో తేదీల్లో ఏవోబీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల దమనకాండకు నిరసనగా ఈ బంద్ కు పిలుపునిచ్చారు. 

పొగాకు రైతుల ఆందోళన..

ప్రకాశం : వెల్లంపల్లి వద్ద ఎన్ హెచ్ పై పొగాకు రైతులు ఆందోళన నిర్వహించారు. పొగాకు ధరల తగ్గుదలకు నిరసనగా రహదారిపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

ఇరువర్గాల మధ్య ఘర్షణ..20 మందికి గాయాలు..

విజయనగరం : తెర్లాం (మం) నందిగామలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 20 మందికి గాయాలయ్యాయి. వీరిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : ఈ రోజు నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమ్మె కొనసాగించనున్నారు. పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్ సహా అన్ని సేవలూ బంద్ కానున్నాయి. హరితహారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. కనీస వేతనాల అమలు..ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీల అమలులో ప్రభుత్వం విఫలం చెందాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. 

10:16 - July 1, 2015

విశాఖపట్టణం : ఇంటిపై నుండి హెటెన్షన్ వైర్లు వెళుతుండడంతో పలువురు ప్రమాదానికి గురవుతున్నారు. ఇందులో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటను ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మాకవరపాలెం (మం) వజ్రగడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నలుగురు విద్యార్థులు బుధవారం ఉదయం ట్యూషన్ కు వెళ్లారు. అకస్మాత్తుగా వర్షం పడడంతో నీటిని బయటకు పంపేందుకు ఇనుప ఊచతో రంధ్రం చేసేందుకు నలుగురు విద్యార్థులు ప్రయత్నించారు. ప్రమాదవశాత్తు ఇనుప ఊచ హైటెన్షన్ వైర్లకు తాకింది. విద్యార్థులకు షాక్ గురై ఎగిరిపడ్డారు. వీరి అరుపులు విన్న స్థానికులు వీరిని స్పందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకూ గాయాలయ్యాయి. నివాసాలపై వెళుతున్న హైటెన్షన్ వైర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 60 పాయింట్లు..నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. 

తిరుపతికి వెళ్లిన గవర్నర్..ఏపీ సీఎం..కేంద్ర మంత్రులు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులు తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుపతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

 

బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్న రేవంత్ లాయర్లు..

హైదరాబాద్ : టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ఆర్డర్ లో ఉన్న తప్పులను సవరించి తిరిగి ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఈ ఉదయం హైకోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. 

రాజమండ్రిలో నిరహార దీక్ష చేస్తున్న పురోహితులు..

రాజమండ్రి : పుష్కర ఘాట్లలో పిండ ప్రదానాది క్రియలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీ ఉమామహేశ్వర స్వామి పుష్కర ఘాట్ వద్ద పురోహితులు నిరహార దీక్ష మొదలు పెట్టారు. 

09:32 - July 1, 2015

చిత్తూరు : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు తిరుమలలో పర్యటించనున్నారు. భారతదేశ రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిక ఆయన శ్రీవారి దర్శనార్థం రావడం మూడోసారి. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ఏర్పాటకయ్యాక సప్తగిరులకు విచ్చేయడం ఇదే తొలిసారి. తనయుడు అభిజిత్ ముఖర్జీ..ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఆయన మూడు ప్రఖ్యాత ఆలయాలను దర్శించుకోనున్నారు. ఆరున్నర గంటల పాటు తిరుక్షేత్రంలో సాగే రాష్ట్రపతి పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ పక్కా ఏర్పాట్లు చేశాయి.
ప్రత్యేక విమానంలో తిరుపతికి..
హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయం నుండి బుధవారం ఉదయం 10.35గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఐఏఎఫ్ బీబీజే ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుచానూరు, తిరుపతిలో ఆలయాలు చూసుకుని నేరుగా రెండో ఘాట్ ద్వారా తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.20 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తిరుమలలోనే ప్రణబ్ గడుపనున్నారు.
మధ్యాహ్నాం 12గంటలకు శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత..
తిరుమలలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. మధ్యాహ్నాం 12 తరువాత శ్రీవారి సర్వదర్శనాన్ని నిలిపివేయనున్నారు. కళ్యాణోత్సవ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. 

ఆప్ ఎలాంటి పనులు చేపట్టడం లేదు - కాంగ్రెస్..

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదని కాంగ్రెస్ నేత బార్కా షుక్లా సింగ్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థతో కొట్లాడుతోందని విమర్శించారు. 

వరంగల్ లో పర్యటించనున్న కడియం..జోగు రామన్న...

వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన 'హరితహారం' కార్యక్రమం అమల్లో భాగంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిలు నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. 

నేటి నుండి మావోయిస్టుల నిరసన వారోత్సవాలు..

విశాఖపట్టణం : నేటి నుండి మావోయిస్టుల నిరసన వారోత్సవాలు జరుగనున్నాయి. జిల్లా సరిహద్దు ఏజెన్సీల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.  

రియా కళాశాలలో ఫైర్ ఆక్సిడెంట్..

రంగారెడ్డి : జిల్లా చేవెళ్ల మండలం అనుబంధ గ్రామమైన కేసారం గేటు సమీపంలోని రియా కళాశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫర్నీచర్, కంప్యూటర్లు కాలిపోయినట్లు సమాచారం. 

విద్యుత్ షాక్ తో నలుగురు విద్యార్థులకు గాయాలు...

విశాఖపట్టణం : మాకవరపాలెం (మం) వజ్రగడలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. 

08:39 - July 1, 2015

కేజీ బేసిన్ లో కేంద్రానికి వచ్చే వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయల్టీ ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు. ఈవిషయంలో ప్రతిపక్షాలు సైలెంట్ గా ఉండడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హాన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే...
''కేజీ బేసిన్ వాటపై సీఎ చంద్రబాబు కోరడం కరెక్టే. ఎందుకంటే ఎంతో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం భిన్నంగా స్పందిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా మెరుగైన వసతు కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఏపీకి రాయల్టీ వాటా ఇవ్వండి అని ఎందుకు అడగడం లేదు. గ్యాస్ వస్తే అనేక రకాల అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు. ఇష్యూ అయిన అనంతరం ధర్నాలు చేస్తారు. కేంద్రం ఇవ్వకపోవడం అన్యాయం. ఈ విషయంలో అధికార పక్షం..ప్రతిపక్షాలు..ప్రశ్నిస్తానన్న పవన్ స్పందించాల్సినవసరం ఉంది. నిందితుడు అని టిడిపి శ్రేణులు భావించడం లేదు. టిడిపి పండుగ చేసుకొంటోంది. వేరే వారికి కోపం ఎందుకు ? ఇది అవినీతి కేసు కాదు. చట్టపరంగా నేరం కావచ్చు. శిక్ష పడవచ్చు..పడకపోవచ్చు. టిడిపిని దెబ్బ తీయడానికి టీఆర్ఎస్..టీఆర్ఎస్ ను దెబ్బ తీయడానికి టిడిపి ప్రయత్నాలు. ఒక విధంగా ఇదంతా రాజకీయ ప్రక్రియలో భాగమే. కాంగ్రెస్ తనతప్పు వల్ల చస్తుంది..పుడుతుంది. డీఎస్ పోయినంత మాత్రాన ఏమి జరుగదు. పదవులు రాకపోతే..ఇతరత్రా కారణాలతో టీఆర్ఎస్ నుండి వలసలు ప్రవాహాంలా కొనసాగుతాయి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

08:30 - July 1, 2015

జమ్మూ : చుట్టూ మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాలు.. ఆ పర్వతాల నుంచి జాలువారే హిమనదాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం.. మరోవైపు హర హర మహాదేవ.. శంభో శంకర.. అంటూ వినిపించే మంత్ర నాదాలు.. వీటన్నింటినీ గుండెల్లో మూటగట్టుకొని మంచుకొండల్లో సాహసోపేతంగా ముందుకు సాగే ప్రయాణమే అమర్‌నాథ్‌ యాత్ర.. బుధవారం పవిత్ర అమర్ నాథ్ యాత్ర జమ్మూ నుండి ప్రారంభమైంది. అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తొలివిడతలో 1100 మంది భక్తులు యాత్రలో వెళ్లనున్నారు. బాల్తల్ మార్గం ద్వారా అమర్ నాథ్ కు వెళ్తున్నారు. ఈ బృందంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. దీనితో ఈ మార్గంలో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అమర్ నాథ్ క్షేత్రం సముద్ర మట్టానికి 3,888 మీటర్ల అనగా 12,760 అడుగుల ఎత్తులో ఉంది. ఉగ్రవాదుల దాడి, కేదార్ నాథ్ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపద్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 

08:21 - July 1, 2015

ప్రకాశం : అతివేగం..అధిక లోడ్ తో ప్రయాణించవద్దని అధికారులు సూచనలు చేస్తున్నా పలువురు బేఖాతర్ చేస్తూ నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. లారీ - ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బుధవారం తెల్లవారజామున 15 మందితో ఓ ఆటో వెళుతోంది. సింగరాయ కొండ మండలం కలికివాయి దగ్గరకు రాగానే లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. 12 మందిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఉలవపాడు మండలం చాగిచర్ల గ్రామానికి చెందిన వారు. వీరంతా జరుగుమల్లి వద్ద మున్నంగి సీఫుడ్స్ లో పని చేస్తున్నారు. ఆటోలో ఎక్కువ మంది ప్రయాణించడం..అతివేగంతో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

08:10 - July 1, 2015

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా బెయిల్ మంజూరైంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. పార్టీలోని పరిస్థితులపై సోనియాకు డీఎస్ లేఖ రాసినట్లు సమాచారం. మరో కీలక అంశం..ఔట్ లుక్ పత్రికలో కలెక్టర్ స్మితా సబర్వాల్ పరోక్షంగా ఉద్దేశిస్తూ వేసిన క్యారికేచర్, అభ్యంతర వ్యాఖ్యానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్మిత సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరువు నష్టం కలిగించేలా కథనం ప్రచురించారని పేర్కొంటూ లీగల్ నోటీసు పంపారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నన్నపనేని రాజకుమారి (టిడిపి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), నడింపల్లి సీతారామరాజు (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

నేడు పంకజా ముండే ప్రెస్ మీట్ ?

ఢిల్లీ : నేడు మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన పిల్లలకోసం నడిపే స్కూళ్లకు ఆహార పదార్థాలు - పల్లీ చిక్కీలు సరఫరా విషయంలో జరిగిన 200 కోట్ల రూపాయల కుంభకోణంలో పంకజా ముండే ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

నేడు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ ?

ఢిల్లీ : నేడు సౌత్ బ్లాక్ లో ఉదయం 10.30గంటలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగే అవకాశం ఉందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

అమర్ నాథ్ యాత్ర ప్రారంభం..

ఢిల్లీ : జమ్మూ నుండి అమర్ నాథ్ యాత్రను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో 1100 భక్తులు యాత్రకు వెళుతున్నారు. బాల్తల్ మార్గం ద్వారా అమర్ నాథ్ కు భక్తులు వెళ్లనున్నారు. యాత్ర మార్గంలో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికులతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దర్శనం చేసుకోనున్నారు. 

07:06 - July 1, 2015

వివిధ రకాల కేసుల్లో ఇరుక్కున్న నాయకులు కొద్ది రోజుల్లోనే బెయిల్‌ తెచ్చుకోగలుగుతున్నారు. కానీ, ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టిన నిరుద్యోగులకు ఏజ్‌ బార్‌ అవుతున్నా ఇంటర్వ్యూ కాల్స్ మాత్రం రావడం లేదు. బాబు వస్తే జాబు వస్తుంది. ఇలాంటి ఆకర్షణీయ నినాదాలు, ప్రకటనలిచ్చిన టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా, ఉద్యోగాల నోటిఫికేషన్లు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 35 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులున్నారని అంచనా. ఇంత భారీ సంఖ్యలో నిరుద్యోగులున్నప్పుడు బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా తక్షణమే ఖాళీ పోస్టుల భర్తీ మీద దృష్టి సారిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి దాదాపు లక్షన్నర పోస్టులు ఖాళీగా వున్నాయి. గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ 2, జెఎల్‌, డీఎల్‌, పీఆర్‌ఓ, వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లాంటి పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక ఆస్పత్రుల సంగతి చెప్పక్కరలేదు. వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్ లాంటి పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా వున్నాయి. ఆయా పోస్టుల్లో ఉద్యోగులు, సిబ్బంది లేక ప్రజలూ అవస్థలు పడుతున్నారు. అయినా వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పోస్టులు భర్తీ చేయాలనీ, అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని కొంతకాలంగా నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

07:01 - July 1, 2015

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎక్కడో ఒక చోట ఆందోళనలు చేస్తున్నారు. వీరి అలజడికి కారణం ఏమిటి? నిరుద్యోగులు కోరుతున్నదేమిటి? ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నవారి భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటి ? ఈ అంశంపై జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు లగుడు గోవిందరావుగారు మాట్లాడారు.

06:42 - July 1, 2015

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో రోజురోజుకి ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నగర పోలీసులు చర్యలు చేపట్టారు. నిత్య రోడ్డు ప్రమాదాలపై సమీక్ష నిర్వహించిన పోలీసులు.. ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. జులై 1 నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఆదేశాలిచ్చారు. మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

06:37 - July 1, 2015

హైదరాబాద్ : ఏపీ మున్సిపల్‌ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసు మేరకు ఆ సంఘాల నాయకులు మున్సిపల్ శాఖామంత్రి నారాయణతో సచివాలయంలో జరిపిన చర్చలు జరిపారు. మున్సిపల్ కార్మికులకు వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవ్స్, జాతీయ పర్వదినాల సెలవులు ఖచ్చికంగా అమలయ్యేవిధంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి మంత్రి అంగీకరించారు. అయితే జీతాల విషయాలను మాత్రం మంత్రి తేల్చలేదు.
రోటేషన్ పద్ధతిలో లీవులు..
మున్సిపల్‌ కార్మికులకు వారాంతపు సెలవులను రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. కార్మికులకు యూనిఫాంలు, చెప్పులు, సబ్బులు, టవల్స్, నూనెలను సకాలంలో అందజేస్తామని అన్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగాల్లోని కార్మికులకు పెరిగిన జీతాలను వెంటనే అమలు చేయాలని యూనియన్ నాయకులు చేసిన డిమాండ్‌కు మంత్రి సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కార్మికులు చనిపోయిన సందర్భాల్లో వారి దహన సంస్కారాలకు ఇచ్చే పదివేల రూపాయల నగదును థర్డ్ పార్టీల ద్వారా కాకుండా మున్సిపాలిటీల ద్వారా నేరుగా ఇప్పించాలని నాయకులు చేసిన అభ్యర్థనకు మంత్రి అంగీకరించారు.
మరోసారి చర్చలు..
రెగ్యులర్ సిబ్బందికి పిఆర్‌సి అమలు, జీపీఎఫ్ అక్కౌంట్‌ల ప్రారంభం, ఆరోగ్య కార్డుల పంపిణీ, పార్ట్ టైమ్ ఉద్యోగులకు కనీస వేతనాల అమలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేసే విషయం తదితర డిమాండ్‌లపై ఈ నెల 4వతేదీన మరోసారి చర్చలు జరపాలని, ఆ చర్చలకు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడిని ఆహ్వానించాలని మున్సిపల్‌ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆయా జిల్లాల కలెక్టర్లకు సిఫారసు చేయాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచాలనే డిమాండుపై తగిన పరిశీలన చేయనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల్లో పారదర్శకత ఉండే విధంగా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాల్లో పెండింగ్‌లో వున్న ప్రతిపాధనలను త్వరలో పరిశీలిస్తామని.. మంత్రి కార్మిక సంఘం నేతలకు హామీ ఇచ్చారు. 

06:34 - July 1, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐడిఎస్ ఓ, ఏఐఎఫ్ డీ ఎస్ విద్యార్థి సంఘాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు ఉండటం లేదని.. ప్రైవేటు స్కూల్స్ లో ఫీజుల మోత మోగుతోందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. 

06:33 - July 1, 2015

ఢిల్లీ : డిజిటల్‌ ఇండియా వారోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. డిజిటల్‌ ఇండియా వారోత్సవానికి గౌరవ అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ హాజరుకానున్నారు. డిడి ఇండియా, డి న్యూస్ ఛానళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.

 

06:30 - July 1, 2015

ప్రకాశం : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. తెలుగుదేశం పార్టీ అక్రమాలను నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించామని వైసీపీ నేతలు ఆరోపించారు. కోట్ల రూపాయలు వెదజల్లి తమ పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసిందని ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. మరోవైపు కనీసం కర్నూలు స్థానం అయినా దక్కించుకునేందుకు ఆ పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి జిల్లాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య హోరా హోరీ పోటీ నడిచింది. విజయం కోసం ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. కానీ వైసీపీకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు సుమారు 35 మంది టీడీపీ క్యాంప్‌లో చేరడంతో వైసీపీ ఢిపెన్స్ లో పడింది.
ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. అధికార పక్షం టీడీపీ అక్రమాలను నిరసిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని వారు వెల్లడించారు. కోట్ల రూపాయలు కుమ్మరించి వైసీపీ ఎంపీటీసీ సభ్యులను టీడీపీ కొనుగోలు చేస్తోందని సుబ్బారెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ అక్రమాలపై ఎలక్షన్ కమిషన్‌తో పాటు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు.
మాగుంట గెలుపు లాంఛనం..
ప్రకాశం జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ నుంచి చిన వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గెలుపు కష్టమని భావించిన వైసీపీ నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి మాగుంటకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపు లాంఛనం కానుంది.
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ దృష్టి..
ఇక మిగిలిన కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. జిల్లాలో మొత్తం 1087 ఓట్లకు గాను వైసీపీకి 560, టీడీపీకి 444, కాంగ్రెస్‌కు 47, ఇతర పార్టీలు, ఇండిపెండెట్‌లకు 36 ఓట్లు ఉన్నాయి. జిల్లాలో వైసీపీకి 80 మంది సభ్యుల మెజార్టీ ఉంది. దీనికి తోడు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జగన్‌ పార్టీకి మద్దతిస్తున్నాయి. అయితే టీడీపీ గూటికి 20 మంది సభ్యులు చేరడంతో.. వైసీపీకి కేవలం 20 ఓట్ల మెజార్టీ ఉంది. దీంతో ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అని సవాళ్లు విసురుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో... గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. చివరికి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.  

06:27 - July 1, 2015

హైదరాబాద్ : గోదావ‌రి పుష్కరాల‌కు ఏపీ సర్కార్‌ సిద్ధమైంది. ప్రస్తుత ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధునాత‌న సాంకేతిక‌త ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకోవాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల‌ను ఉప‌యోగించుకుని పుష్కరాల ప్రచారం చేస్తోంది. పుష్కరాల కోసం ప్రత్యేక యాప్‌ను త‌యారు చేసిన ఏపీ సర్కార్‌ భద్రత కోసం అధునాతన కెమెరాల‌తో పాటుగా హెలిక్యాప్టర్‌ సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకోనుంది. పుష్కరాల ప్రచారం కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ప‌ద్దతులు అవ‌లంబిస్తోంది. గ‌త పుష్కరాల‌కు ఇప్పటికీ సాంకేతిక‌త బాగా పెరిగింది. కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయి. దీంతో మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా మారుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల‌లో గోదావ‌రి పుష్కరాల ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. దేశ విదేశాల్లో ఉన్న భ‌క్తుల‌కు పుష్కరాల ప్రాశస్త్యంతో పాటు స‌మాచారం కూడా అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రత్యేక యాప్..సీసీ కెమెరాలు..
పుష్కరాల కోసం ప్రత్యేక‌ యాప్‌ను కూడా త‌యారు చేస్తున్నారు. ఈ యాప్‌ స‌హాయంతో పుష్కరాలు జ‌రిగే తీరు, ర‌వాణా స‌దుపాయాలు, ఇత‌ర ఏర్పాట్లు, ఘాట్ల వివ‌రాలు ఇలా అన్నీ అందుబాటులో ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇలాంటి యాప్ బాగా ఉప‌యోగప‌డుతుందని ప్రభుత్వ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో పాటు వైఫై సౌక‌ర్యం కూడా పూర్తి స్థాయిలో క‌ల్పించనున్నారు. అధునాతన నిఘా కెమెరాలను అన్ని ఘాట్ల ద‌గ్గర ఏర్పాటు చేస్తున్నారు. చిన్న విష‌యం కూడా రికార్డ్ అయ్యే విధంగా 450 సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్‌. వీటితో పాటుగా గ‌గ‌న తలంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేసి భ‌ద్రతను క‌ట్టు దిట్టం చేస్తున్నారు. శాంతి భద్రతల ప‌రిర‌క్షణ‌కు దాదాపు 30 వేల మంది పోలీసుల‌ను ఉప‌యోగిస్తున్నారు. టెక్నాల‌జీ వాడుకుని ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

06:24 - July 1, 2015

రాజమండ్రి : దక్షిణ గంగగా.. రైతుల కల్పవల్లిగా.. అఖిలాండ కోటి జనావళికి ఆధారభూతంగా నిలుస్తున్న గోదావరికి ఇక నిత్య హారతులు ఇవ్వనున్నారు. రాజమండ్రిలో గోదావరి నదికి నేటి నుంచి నిత్యహారతులు వైభవంగా జరగనున్నాయి. ప్రతీ నెల పౌర్ణమి రోజున రాజమండ్రి పుష్కరాల రేవులో గోదావరి నదికి గంగానది తరహాలో హరతులిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను నేటి నుంచి నిత్యహరతిగా కొనసాగించనున్నారు.
బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్టు..
ఐదేళ్ళ నుంచి నెలవారీగా పౌర్ణమి రోజున బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున ఆ సంస్థ ప్రతినిధులు గోదావరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే జులై 14 నుంచి గోదావరినదికి పుష్కరాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం, బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గోదావరి నదికి నిత్య హారతిని ఇవ్వనున్నారు. ఈ మహత్తర ఘట్టానికి ఇవాళ రాత్రి 6:30 గంటల నుంచి 8 గంటల మధ్యలో సుముహుర్తాన్ని నిర్ణయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రాజమండ్రి పుష్కరాలరేవులో నదీమతల్లికి హారతి ఇవ్వనున్నారు. నిత్యహరతి క్రతువును వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ, బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

06:22 - July 1, 2015

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర సమితి .. మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్ కు పదును పెట్టింది. కొన్నాళ్లు విరామం ఇచ్చిన టీఆర్ఎస్‌.. ఇపుడు గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. భవిష్యత్‌కు ఢోకా లేకుండా అధికార పార్టీ.. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. కండువా కప్పి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో పీసీసీ మాజీ చీఫ్‌తో సహా పలువురు సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు గులాబి గూటికి వలసబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది.
ప్రతిపక్షాల బలహీనపరిచేందుకే..
తొలి తెలంగాణ రాష్ట్రంలో కావాల్సిన మెజార్టీ కంటే.. అధిక స్థానాలను సాధించి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.. పార్టీ భవిష్యత్ పైనే దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టిన కేసీఆర్.. ఇతర పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలను గాలంవేస్తూ పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. శాసనసభలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్‌లో ప్రతిపక్షాలను మరింత బలహీన పర్చేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యం..
తెలంగాణలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆపరేషన్‌ ఆకర్ష్ మంత్ర.. ఇపుడు మరోసారి తెరపైకి వస్తోంది. అవసరాలకునుగుణంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. విపక్ష పార్టీలకు చెందిన మరికొందరిని కారెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా గులాబీ బాస్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు.
డీఎస్ కు గ్రీన్ సిగ్నల్..
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల కోటాలో మండలి, గ్రేటర్ ఎన్నికలకు ముందు గులాబీ దళపతి.. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్ లో భాగంగా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. డీఎస్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరికొంత మంది నేతలు కూడా గులాబీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ కీలక నేత మండలి బరిలో తన సోదరుడికి దింపేందుకు అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను కోరుతున్నట్లు సమాచారం. టిడిపి నుంచి కూడా వలసలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నేతలనే కాదు.. గ్రేటర్ పరిధిలో ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నేతలను సైతం తీర్థం ఇచ్చేందుకు టీఆర్ఎస్‌ రెడీ అవుతోందట. మొత్తం మీద పార్టీ మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపడుతున్నారు గులాబీ బాస్‌.

06:19 - July 1, 2015

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేడు చర్లపల్లి జైలు నుండి విడుదల కానున్నారు. ఆయనతో పాటు ఇద్దరి నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. వీరి బెయిల్ పిటిషన్ వాదనలు వాడివేడిగా సాగాయి. జడ్జి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎసిబి నీళ్లు నమలాల్సి వచ్చింది. అయిదు సంవత్సరాల శిక్షపడే కేసుకి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చుకదా అని ఏసిబిని ప్రశ్నించారు.. రేవంత్ రెడ్డి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఏసిబి తరపున తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించారు. గతంలో ఒక రోజు తన కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ తీసుకున్నప్పుడు కోర్టు షరతులను రేవంత్ రెడ్డి పాటించారు. ఇప్పుడు ఎలాంటి షరతులు పెట్టిన పాటిస్తారని అతని తరపు లాయర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.. అన్ని ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయి కనుక విచారించాల్సిన అవసరం లేదని తెలిపారు.. స్టీఫెన్‌ సన్ సీఆర్పీసీ 164 స్టేట్ మెంట్ పూర్తి అయినందున బెయిల్ ఇవ్వల్సిందిగా కోరారు.
డబ్బు వివరాలు రాబట్టాలన్న ఏజీ..
ఓటుకు నోటు కేసులో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని ఏజీ రామకృష్ణారెడ్డి వాదించారు. రేవంత్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని, విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్నారు. మరింత మందిని ఇంకా విచారించాల్సి ఉందని తెలిపారు. సండ్ర వెంకట వీరయ్య ఇంకా పరారీలోనే ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన విచారణకు హాజరు కాలేదని చెప్పారు. అలాగే మత్తయ్యను కూడా ఇంకా అదుపులోకి తీసుకోలేదని కోర్టుకు విన్నవించారు. దీని ఉద్దేశ్యం కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినదేనా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా ఉందా అని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. పది మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వమే పడిపోయేదని ఏ.జీ వాదించారు. ఎన్నికల ప్రక్రియనే ప్రభావింతం చేశారని, అలాంటివారు బయటికొస్తే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చని వివరించారు... కనిమొళి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు ఏజీ రామకృష్ణారెడ్డి.
2జీ కేసుతో పోల్చడంపై జడ్జి ఆశ్యర్యం..
2జి కేసులో నిందితులకు చార్జీషీట్ దాఖలు చేసేంత వరకు బెయిల్ ఇవ్వలేదని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఏజీ.. 2జీ కేసుతో పోలికా అని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో శిక్ష ఎంత పడుతుందో తెలుసా అని జడ్జి అడగగా.. గరిష్ఠంగా ఐదేళ్లు, కనిష్టంగా ఆరు నెలలని ఏజీ చెప్పారు. అయితే కేసులను బట్టి తీర్పులు మారుతాయని జడ్జి వ్యాఖ్యానించారు.. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయిదు సంవత్సరాల శిక్ష పడే రేవంత్ కు స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వలేదని జడ్జి డిగిన ప్రశ్నకు ఎసిబి నోరు మెదపలేదు.
సెబాస్టియన్, ఉదయసింహాలకు ఊరట..
ఇరు వాదనలు విన్న కోర్టు.. రేవంత్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ... షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల హామీతో బెయిల్‌ ఇచ్చింది న్యాయస్థానం. మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహాకు బెయిల్‌ ఇచ్చింది హైకోర్టు. కేసుకు సంబంధించిన అన్ని అదారాలు హార్డ్ డిస్క్ లో పొందుపర్చినందున.. తారుమారు అయ్యే అవకాశాలు లేవంది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఏసిబి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతోంది.
బెయిల్ షరతులు..

  • ముగ్గురు నిందితులు వేర్వేరుగా రూ.5లక్షల చొప్పున ఒక్కో పూచీకత్తు సమర్పించాలి.
  • సెబాస్టియన్..ఉదయ్ సింహాలు రోజు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5లోపు ఏదో ఒక సమయంలో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి.
  • తమ ముందు హాజరు కావాలని దర్యాప్తు అధికారులు ఎప్పుడు కోరితే అప్పుడు రేవంత్ హాజరు కావాలి.
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ విడిచి వెళ్లకూడదు.
  • ముగ్గురూ వారి వారి పాస్ పోర్టులను కింది కోర్టులో స్వాధీనం చేయాలి.


 

నేడు తిరుమలకు రాష్ట్రపతి రాక..

తిరుమల : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన నేపథ్యంలో నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. మధ్యాహ్నాం 12 గంటలకు సర్వదర్శనాన్ని టిటిడి నిలిపివేయనుంది. కళ్యాణోత్సవం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకే అనుమతి లభించనుంది.

చిత్తూరులో రోడ్డు ప్రమాదం..నలుగురికి గాయాలు..

చిత్తూరు : చంద్రగిరి మండలం కాసిపెంట్ల వద్ద వోల్వో బస్సు - ప్రైవేటు అంబులెన్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

 

నేడు పాఠశాలల బంద్..

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాల నేతలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో గురువారం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పర్యటన..

హైదరాబాద్ : నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా గురువారం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఢిల్లీ నుంచి గురువారం ఉదయం 8.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పనగారియా నేరుగా మహబూబ్‌నగర్ జిల్లాకు వెళతారు. 

Don't Miss