Activities calendar

02 July 2015

21:33 - July 2, 2015

హైదరాబాద్: సైన్స్‌, గణితం, సాంఘిక శాస్త్రం బోధించని మదర్సాలతో పాటు ఇస్లాం మత బోధనలు చేసే సంస్థల గుర్తింపును రద్దు చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన విధానాలను పాటించని సంస్థలు, మదర్సాలను ఇతర పాఠశాలల మాదిరిగా గుర్తించనవసరం లేదని సంక్షేమశాఖ మంత్రి దిలీప్‌ కాంబ్లీ తెలిపారు. మదర్సాలలో మతబోధనలే కాకుండా సైన్స్‌, గణితం, సాంఘిక శాస్త్రం లాంటి సబ్జెక్టులను బోధించాలని మైనారిటీ శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే గతంలోనే సూచించారు. ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. విద్యార్థులను మతపరంగా విభజించడం సరికాదని విమర్శించింది. మదర్సాలను మూసివేయడం లేదని, గ్రాంట్లను కూడా ఆపడం లేదని మతబోధనతో పాటు సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులు బోధించడాన్ని ముస్లింలు కూడా స్వాగతించారని విద్యామంత్రి వినోద్‌ తావ్‌డే స్పష్టం చేశారు. 

21:32 - July 2, 2015

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నం...
జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తమ విద్యార్థులకు ర్యాంకులు రాకపోవడంపై ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు.. ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
అధికారులపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపాటు...
తెలంగాణా ఇంటర్ బోర్డు అధికారులపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. అధికారులు చేసిన తప్పిదాలకు జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో దాదాపుగా 2వేల మంది విద్యార్థులు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండ్రోజులుగా ఇంటర్ బోర్డు, సచివాలయం, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఏ ఒక్కరూ స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకంపై విద్యావేత్తలు సైతం మండిపడుతున్నారు.
ఆందోళనలతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం..
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థులకు తగిన న్యాయం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. హుటాహుటిన ఆచార్య బృందాన్ని ఢిల్లీకి పంపించి సమస్యను పరిష్కరించారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ర్యాంకుల గల్లంతైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికి న్యాయం చేస్తామని మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మరి శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న కౌన్సిలింగ్‌లో జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ర్యాంకులు గల్లంతైన ఈ విద్యార్థులకు మంత్రి హామీతోనైనా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

21:27 - July 2, 2015

హైదరాబాద్: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో... రేపు జరగబోయే... స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు... ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికార పార్టీ వ్యవహరిస్తోన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ప్రతిపక్ష వైసీపీ... ప్రకాశం జిల్లాలో ఎన్నికను బహిష్కరించింది. ఇక కర్నూలు జిల్లాలో రెండు పార్టీల మధ్య హోరాహోరా జరిగే అవకాశం వుంది. ఇప్పటికే ప్రలోభ పర్వాలకు తెరలేచినట్లు సమాచారం. ఇరు పార్టీల క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి

21:26 - July 2, 2015

హైదరాబాద్: ముస్లిం సోదరులపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పవిత్ర మాసమైన రంజాన్‌ వేళ మైనార్టీలకు పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్‌. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో... జులై 8న నిజాం కాలేజీలో "దావత్ ఏ ఇఫ్తార్" విందు ఇవ్వనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. భాగ్య నగరంలోని వంద మసీదుల్లో దావత్ ఏ ఇఫ్తార్ ఏర్పాటు చేస్తామన్నారు.                             
10 జిల్లాల్లోనూ ఇఫ్తాన్ విందు...
తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ ఇఫ్తాన్ విందు జరగనుంది. ఆ బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలో ఒక మసీదులో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం 26 కోట్లు కేటాయించింది. రాజకీయలకతీతంగా కార్యక్రమం ఉంటుందన్నారు కేసీఆర్‌. ఎక్కడా పొరపాటు జరుగకుండా చూడాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇఫ్తార్‌కు టర్కీ, ఇరాన్‌తోపాటు సౌదీ అరేబియా, ఇండోనేషియా అంబాసాడర్లు...
నిజాం కాలేజీ మైదానంలో జరిగే ఇఫ్తార్‌కు టర్కీ, ఇరాన్‌తోపాటు సౌదీ అరేబియా, ఇండోనేషియా అంబాసాడర్లను ఆహ్వానిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. విదేశీయుల ఆహ్వానానికి సీనియర్ ఐపీఎస్ ఏకే ఖాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమిస్తున్నామన్నారు. అలాగే 1 లక్షా 95 వేల మంది పేద ముస్లింలకు 500 చొప్పున బట్టలు కొనిస్తామన్నారు. అందుకోసం 9 కోట్ల 75 లక్షలు కేటాయించామన్నారు.
5 వేల మసీదుల ఇమామ్, మౌసమ్‌లకు ప్రభుత్వం కానుక....
రంజాన్ సందర్భంగా 5 వేల మసీదుల ఇమామ్, మౌసమ్‌లకు ప్రభుత్వం కానుక అందిస్తుందని తెలిపారు. వారి కోసం నెలకు రూ.1000 చొప్పున భృతి చెల్లించనున్నట్టు ప్రకటించారు. మసీదు కమిటీలు ఇప్పటికే భృతిని ఇస్తున్నాయని వాటికి అదనంగా వక్ఫ్ బోర్డు ద్వారా ఈ మొత్తాన్ని అందజేస్తామని వివరించారు కల్వకుంట్ల. మొత్తానికి ప్రత్యేక రాష్ట్రంలో జరిగే తొలి ఇఫ్తార్ విందుకు టీ-సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

21:23 - July 2, 2015

విజయవాడ: ఏపీ రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు పోరుబాట పట్టారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కూలీలు, కార్మికులకు నెలకు తొమ్మిది వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. పేదలు, కూలీల ఆధ్వర్యంలో డీఆర్ డీఏ కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు, కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు మధు. లేకుంటే భవిష్యత్‌లో వామపక్ష ఉద్యమాలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.

21:20 - July 2, 2015

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి... విశాఖ జిల్లా పర్యాటన ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ వెళ్లిన జగన్‌కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఆయన అచ్యుతాపురం బయల్దేరారు. రాజమండ్రి బ్రిడ్జి వద్ద కారు ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పటి వరకూ పరిహారం అందివ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌ పర్యటన ఇలా...
తుని, పెరుమళ్లాపురం, హుకుంపేట, కొత్తపట్నం, రామన్నపాలెంలో జగన్‌ పర్యటించారు. సముద్రంలో వేటకువెళ్లి చనిపోయిన మత్సకారుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రాత్రికి కాకినాడ.....
జగన్‌ రాత్రికి కాకినాడ చేరుకుంటారు. 3వ తేదీ కాకినాడలోని పరాడపేట, ఉప్పలంక, పగడాలపేటలో పర్యటిస్తారు. మధ్యాహ్నం తర్వాత రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్తారు. 4వ తేదీ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి పొగాకు రైతులతో సమావేశమవుతారు. అదేరోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. 

21:17 - July 2, 2015

ప.గో:గోదావరి నది రాష్ట్రానికే జీవనాడిలాంటిదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన బాబు... గోదావరి తల్లి రుణం తీర్చుకునే అవకాశం పుష్కరాల ద్వారా వచ్చిందని... అందుకే ఖర్చుకు వెనకాడకుండా 520 కోట్ల రూపాయలు కేటాయింటినట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులనూ పరిశీలించి... వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృత పర్యటన....
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నరసాపురం వెళ్లిన సీఎం... అక్కడ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక లయన్స్‌ సామాజిక భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా మంత్రులు మాణిక్యాలరావు, పీతల సుజాత, ఎంపీ గోకరాజుగంగరాజు, కలెక్టర్, ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గామన్‌ కంపెనీ ప్రతినిధులపై సీఎం ఆగ్రహం....
రాజమండ్రి వద్ద నిర్మాణం జరుగుతున్న నాలుగో బ్రిడ్జి పనులు ఇంకా పూర్తిచేయకపోవడంతో... గామన్‌ కంపెనీ ప్రతినిధులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తిచేయకపోతే.. కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనులు పరిశీలిన....
పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు... పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈనెల 25లోపు పోలవరం కుడికాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2018 ఎన్నికలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం కుడికాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్న బాబు... గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. 

21:13 - July 2, 2015

హైదరాబాద్: వదల బొమ్మాళీ వదల..! ఇదేదో సిన్మా డైలాగ్ కాదు. గులాబీ లీడర్ల మాటలివి. ఇల్లు అలకగానే పండగ కాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద... జైలు నుంచి బయటకొచ్చిన రేవంత్‌కు... తెలంగాణ పోలీసులు ఝలక్ ఇస్తూనే ఉన్నారు. కేసుల మీదు కేసులు నమోదు చేస్తూ హడలెత్తిస్తున్నారు. తాజాగా ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి.                      
తమ్ముళ్లు చేసిన హడావుడే తలనొప్పులు తెచ్చిపెట్టేలా....
రేవంత్ విడుదల తర్వాత తమ్ముళ్లు చేసిన హడావుడే తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అభిమానుల కోలహాలం మధ్య కొడగంల్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఒక్క రాత్రి గడిచిందో..? లేదో..? ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. కేసీఆర్‌తో ఏసీబీ చీఫ్ ఏకేఖాన్ భేటీ అయ్యారు. ఆ కాసేపటికే మల్కాజ్‌గిరి పీఎస్‌లో ఒక కేసు, కుషాయిగూడ పీఎస్‌లో రెండు కేసులు పెట్టారు.
144 సెక్షన్‌ను ఉల్లంఘించారని పోలీసుల వాదన....
జులై 1న సాయంత్రం ఐదున్నరకు రేవంత్ విడుదలయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు చర్లపల్లి గేటు లోపలే కలిశారు. జైలు పరిసర ప్రాంతంలో ఉన్న 144 సెక్షన్‌ను ఉల్లంఘించారని పోలీసుల వాదన. నిషేధాజ్ఞాలు ఉన్న నేపథ్యంలో ర్యాలీ తీయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపైనా కుషాయిగూడ పోలీసులు 341, 188, 506, 509 ఐపీసీ సెక్షన్లతో పాటు సిటీ పోలీస్ యాక్ట్ 22 కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారంటూ రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. 341, 188 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

ముప్పేటదాడికి దిగిన టిఆర్ఎస్ లీడర్లు ....

మరోవైపు రేవంత్ ర్యాలీపై టీఆర్ఎస్ లీడర్లు ముప్పేటదాడికి దిగారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అన్న ఆయన.. విద్యార్థుల ఆత్మహత్యలకు టీడీపీయే కారణమన్నారు. తెలంగాణలో తెలుగుదేశం జెండాలను లేకుండా ప్రజలు చేస్తారని హెచ్చరించారు.
హద్దుమీరి మాట్లాడారు....
ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత రేవంత్ హద్దుమీరి మాట్లాడారని మరో మంత్రి తుమ్మల అన్నారు. రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడాలన్నారు. ఇకనైనా రౌడీ వేషాలు మానుకోవాలంటూ రేవంత్‌కు చరకలంటించారు. అద్దెమనుషులతో ఊరేగింపులు చేయడం హీరోయిజం కాదన్నారు తుమ్మల.
కేసీఆర్ గురించి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ...
కేసీఆర్ గురించి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ మంత్రి మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బెయిలొస్తే ముచ్చట కాదని..అసలు కథ ముందుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పసుపుదళంపై మండిపడ్డారు. చంద్రబాబు గైడెన్స్‌తోనే రేవంత్ మాట్లాడుతున్నారని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్‌ వస్తే కేసీఆర్ జ్వరం వచ్చిందన్న లోకేష్‌ను బర్గర్ బాబంటూ గంగుల కమలాకర్ కామెంట్ చేశారు. మరోవైపు శుక్రవారం రేవంత్ బెయిల్‌ పిటీషన్‌ సుప్రీంకోర్టులో చర్చకు రానుంది. 

రేపు ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్: రేపు ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీని కోసం కర్నూలు, ఆదోని, నంద్యాలలో, ఒంగోలు, కందుకూరు, మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

లలిత్ మోదీ కేసులో శ్రీనివాస్ వాంగ్మూలం నమోదు

హైదరాబాద్: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది.

తణుకు లోని పాత కలప దుకాణంలో అగ్ని ప్రమాదం...

పశ్చిమ గోదావరి:తణుకు వేల్పూరు రోడ్డులోని పాత కలప దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం పక్కనే వెలిగించిన పొయ్యి నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుగారుగా రూ. 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం.

మోక్ష గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషుడు..

హైదరాబాద్: ఏటేటా సరికొత్త రూపంతో కొండంత ఎత్తున కొలువై అనుగ్రహించే ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సారి ఏ రూపంలో.. ఎంత ఎత్తున దర్శనమివ్వనున్నాడనే సందేహాలకు ఖైరతాబాద్ గణేష్‌ ఉత్సవ కమిటీ తెరదించింది. శక్తిమయ మోక్ష గణపతి రూపంలో 60 అడుగుల బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయని ఖైరతాబాద్ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ తెలిపారు. మోక్ష గణపతి చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు.

సంఘీ గ్రూప్‌ యజమాని ఇంటి ఎదుట రైతుల ఆందోళన

హైదరాబాద్:బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని సంఘీ గ్రూప్‌ యజమాని ఇంటి ఎదుట వరంగల్‌ పత్తి రైతుల ధర్నా చేశారు. నాలుగేళ్లుగా పత్తి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. సంఘీగ్రూప్‌కు చెందిన ఇన్నర్‌ స్పేస్‌ ఫర్నిచర్‌ షాప్‌ ఎదుట ధర్నా చేయడంతోపాటు స్వాతి సంఘీ, అమిత్‌సంఘీ ఇంటి ముందు ఆందోళన చేశారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని పత్తి రైతులు డిమాండ్ చేశారు.

బీహార్ లో 1400 మంది ప్రభుత్వ టీచర్ల రాజీనామా

హైదరాబాద్ : బిహార్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే దాదాపు 1400 మంది ఉపాధ్యాయులు స్వచ్చందంగా రాజీనామా చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు చూపించి బిహార్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం సంపాదించారని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాస్థానం నకిలీ ధ్రువీకరణ పత్రాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన వారు ఈ నెల 8లోగా స్వచ్చందంగా రాజీనామా చేయాలని ఆదేశించింది. లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు వరకు 1400 మంది రాజీనామా చేశారు.

విమానాల ఆలస్యంపై క్షమాపణ కొని అశోక్ గజపతిరాజు...

ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంపై ప్రయాణికులందర్నీ క్షమాపణలు కోరినట్లు పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. గత రెండు రోజుల క్రితం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గంటసేపు ఆపారు. దీంతో విమానం ఆలస్యంగా బయల్దేరడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు.

ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణకు ఆదేశం...

కృష్ణా:మోపిదేవి బీసీ సంక్షేమ పాఠశాలను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ సందర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.

19:36 - July 2, 2015

హైదరాబాద్:నిజాం నిరంకుశత్వంపై బిగిసిన పిడికిలి.. ఇప్పుడు చేయి చాస్తోంది..! రజాకార్లపై నిప్పులు కురిపించిన కళ్లు.. నేడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి..! దౌర్జన్యంపై గళమెత్తిన స్వరం ఆవేదనతో మూగబోతుంటే.., దుర్మార్గాలను ప్రతిఘటించిన గుండె ధైర్యం కోల్పోతోంది..! పోరాటం ఫలించినా, ప్రతిఫలం మాత్రం దక్కలేదు..! జీవితాన్ని ధారపోసినా, ఆధారం మాత్రం లభించలేదు..! నాడు నిజాం సర్కారుపై విజయబావుటా ఎగరేసిన యోధులు.. నేడు సొంత సర్కారు చేతిలో దారుణంగా ఓడిపోయారు.
నిజాం దురాగతాలపై యుద్ధం....
నిజాం దురాగతాలపై యుద్ధం కొనసాగించారు...రజాకార్ల తుపాకీ గుళ్లకు గుండెను ఎదురొడ్డారు... భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జీవితాలనే పణంగా పెట్టారు... ఈ వృద్ధులంతా.. యువకెరటాలుగా నిజాం సేనలపై సమరశంఖం పూరించినవారు. నేడు ఇలా ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 30ఏళ్ల నుంచి పింఛను కోసం తిరుగుతూనే ఉన్నారు. నడిచీ నడిచీ కాళ్లరిగాయి.. జీవితం చరమాంకానికి చేరింది.. అయినా, వారికి దక్కాల్సిన ప్రతిఫలం దక్కలేదు. జరగాల్సిన న్యాయం జరగలేదు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జీవితాలను త్యాగం చేసినవారికి, వృద్ధాప్యంలో పింఛన్‌ కూడా దక్కని దౌర్భాగ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు..
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వేలాది మంది నిజాం పీడనకు వ్యతిరేకంగా పోరు సాగించారు. ఏళ్లకు ఏళ్లు జైళ్లలో మగ్గిపోయారు. నిజాం రజకార్ల హత్యా కాండకు సైతం తలవంచని ధీరులు.. నేటి పాలకుల తీరుతో తల దించుకుంటున్నారు. తమ పోరాటాన్ని గుర్తించమంటే.. ఆధారమేంటని అడుగుతున్న వైనంపై మౌనంగా రోదిస్తున్నారు.
పోరాట సమయంలో లంఘించి దూకినవారు....
ఇక్కడ ఉన్నవాళ్లంతా.. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో లంఘించి దూకినవారు. కమ్మ జగ్గయ్య, మనిమెట్ల మోహన్‌ రావు, మల్లిఖార్జున రావు నేతృత్వంలోని దళాల్లో.. సిరిపురం, బడార్‌ క్యాంపుల్లో పనిచేశారు. నిజాం వెట్టిచాకిరీ విధానాన్ని ప్రశ్నించినందుకు గానూ వీరిని చిత్రహింసలు పెట్టారు. అరెస్టు చేసి జాల్‌నా, గుల్బర్గా, ఔరంగాబాద్‌, సికింద్రాబాద్‌, చంచల్‌ గూడ, వరంగల్‌ వంటి జైళ్లన్నీ తిప్పారు. అయినా.. స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు ఉరికారే తప్ప, వెనకడుగు వేయలేదు. లక్ష్యం సాధించే వరకూ వెన్ను చూపలేదు.
పోరాటం ఫలించి....
చేసిన పోరాటం ఫలించింది, తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది. అయితే.. స్వరాజ్యం కోసం ఉద్యమించిన వారి జీవితాలు మాత్రం అల్లకల్లోలం అయిపోయాయి. అలాంటి వారిని ఆదుకోవాలంటూ.. వివిధ పార్టీలు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన డిమాండ్‌తో 1980లో గోవింద దాస్‌ షరాఫ్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. 1947 ఆగస్టు 15 నాటికి 15 ఏళ్ల వయసుండాలని, జైలు శిక్ష అనుభవించిన సాక్ష్యాలూ, పోరాట శిబిరం నడిపిన వారి నుంచి లేఖలు తేవాలని షరతు విధించారు. వీటికి అనుగుణంగా కమిటీకి 21 వేల దరఖాస్తులు రాగా.. కేవలం 7 వేల మందిని మాత్రమే షరాఫ్‌ కమిటీ గుర్తించింది. కానీ.. పింఛన్‌ పంపిణీ మాత్రం అమలుకాలేదు.
కమ్యూనిస్టుల ఒత్తిడితో...
ఆ తర్వాత కమ్యూనిస్టుల ఒత్తిడితో 1997లో చెన్నమనేని రాజేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి 41 వేల దరఖాస్తులు రాగా.. అందులో 13 వేల 500 మందిని ఎంపిక చేశారు. అయితే.. ఈ జాబితాలో చోటు దక్కాల్సిన తమను.. వివిధ కారణాలు చూపుతూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారని నాటి యోధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు ఇవ్వలేక తాము చనిపోయినట్టు కూడా ప్రభుత్వం చిత్రించిందని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు..
ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు.. వీరు సర్వం కోల్పోయారు. జనం కోసం వీరు జీవితాలనే ధారపోశారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉంది.

19:29 - July 2, 2015

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్‌ సాబ్‌ ఏ నిర్ణయం ఫైనల్‌ చేయాలన్నా.. హైదరాబాద్‌లోనే ఉండనక్కర్లేదు. రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కాంటాక్ట్‌లో ఉంటారు. అధికారులకు ఆదేశాలు జారీ చేయగలరు. తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రత్యేక బస్సు రెడీ అయ్యింది. లేటెస్ట్ టెక్నాలజీ, న్యూ, రిచ్‌లుక్‌, భద్రత ఇలా సర్వ హంగులతో ఉన్న తెలుపు రంగు బస్సు తయారైంది. సీఎం కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బస్సును భారీ వాహనంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

సెక్షన్ -8 పై పోరాటానికి సిద్ధం:అశోక్ బాబు

తిరుపతి:సెక్షన్-8పై పార్టీలకు అతీతంగా పోరాటానికి సిద్ధమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సెక్షన్-8పై తిరుపతిలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్-8కు కేంద్రం పరిష్కారం చూపాలని అశోక్‌బాబు కోరారు.

ఏసీబీ పిటిషన్ పై సుప్రీంలో రేపు మధ్యాహ్నం విచారణ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు మధ్యాహ్నం ఒంటిగంటలకు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

ఏ విద్యార్థికి అన్యాయం జరగనీయం:కడియం..

హైదరాబాద్: జేఈఈ, మెయిన్స్ ర్యాంకుల అంశంలో తెలంగాణ ఇంటర్‌మీడియట్ బోర్డు ద్వారా పొరపాటు జరిగిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1188 మంది విద్యార్థుల డాటా మిస్సయిందని.. పొరపాటును సరిదిద్దేందుకు అన్నీ చర్యలను చేపట్టామని తెలిపారు. ఏ విద్యార్థికి అన్యాయం జరుగనీయమని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. 

నార్సింగ్ వద్ద రోడ్డు ప్రమాదం:ముగ్గరి మృతి

హైదరాబాద్: నగర శివారు ప్రాంతం నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ ను వేగంగా వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

19:06 - July 2, 2015

పి.వి.పి. పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి. వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం తాజా షెడ్యూల్‌ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..'నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ కమర్షియల్‌ చిత్రమవుతుంది' అని చెప్పారు. 'నాగార్జునలాంటి స్టార్‌తో తొలిసారిగా తెలుగు స్ట్రయిట్‌ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది' అని కార్తీ అన్నారు. 'తొలి షెడ్యూల్‌ను చెన్నైలో 20 రోజుల పాటు నిర్వహించాం. రెండో షెడ్యూల్‌ను హైదరా బాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ సెట్‌లో 25 రోజుల పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. జులై 7 నుంచి జరిగే మూడో షెడ్యూల్‌ను యూరప్‌లోని అత్యద్భుతమైన లొకేషన్స్‌కి పేరొందిన సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో స్టార్ట్‌ చేస్తున్నాం. సౌత్‌ ఈస్ట్‌ యూరప్‌లో పెద్ద సిటీ బెల్‌గ్రేడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న మొదటి తెలుగు చిత్రమిదే కావడం చాలా ఆనందంగా ఉంది. బెల్‌గ్రేడ్‌ తర్వాత ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌, లియాన్‌లలో షూటింగ్‌ నిర్వహిస్తాం. స్లోవేనియా రాజధాని జబ్లిజనాలో సైతం షూటింగ్‌ జరుపుతున్నాం. ఈ షెడ్యూల్‌లో నాగార్జున, కార్తీ, తమన్నా పాల్గొనే కొన్ని భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నాం. దీనిలో భాగంగా చిత్రంలో ఎంతో కీలకమైన కార్‌ ఛేజ్‌ను ప్యారిస్‌ స్ట్రీట్స్‌లో షూట్‌ చేయనున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది చివరలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం' అని అన్నారు. ' మా కథకు హండ్రెడ్‌ పర్సంట్‌ సూట్‌ అయ్యే నాగార్జున, కార్తీలతో ఇంత భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది' అని వంశీ పైడిపల్లి చెప్పారు.

18:46 - July 2, 2015

మంచు లక్ష్మికి తెలుగు సినిమా ప్రేక్షకుల పై విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో తెలుగు సినిమా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ మంచులక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. రియలిస్టిక్ సబ్జెక్ట్స్, కమర్షియాలిటీ లేని సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదో తనకు అర్ధం కావడం లేదని దీనివల్ల మంచి సినిమాలను తీయాలని కోరిక ఉన్నా ఏమి చేయలేక మౌనం వహించవలసి వస్తోందని కామెంట్స్ చేసింది. తమిళంలో ఈమధ్య విడుదలై ఘన విజయం సాధించిన "కాక ముట్టై" సినిమాను చూసి తాను తెలుగులో రీమేక్ చేద్దామని భావిస్తే ఆ సినిమా తెలుగులో ఒక్కరోజు కూడ ఆడదు అని చాలామంది కామెంట్ చేయడంతో ధైర్యం చేయలేక వదిలి వేశానని బాధపడుతోంది మంచువారి అమ్మాయి. తాను నిర్మించి నటించిన "గుండెల్లో గోదారి" వేరొకరు తీసిన "చందమామ కథలు" మంచి సినిమాలుగా పేరొచ్చినా అవార్డులు వచ్చాయి కాని కలెక్షన్స్ రాలేదని అభిప్రాయ పడుతోంది మంచు లక్ష్మి స్లమ్ ఏరియాలో ఉండే ఇద్దరు పిల్లలు  పిజ్జా తినాలనే కోరికను ఎలా నెరవేర్చుకున్నారనే కథతో రూపొందిన "కాక ముట్టై" సినిమాపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ధనవంతుల సంఖ్య పెరిగి పోతున్న మనదేశంలో కనీస అవసరాలు, సరదాలు కూడ తీరని స్లమ్ ఏరియాలోని నిరుపేద పిల్లల జీవితాల పై తీసిన ఈసినిమాకు అనేక అవార్డులు రావడమే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులు ఈసినిమాను ఆదరించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సీరియస్ కథను ప్రేక్షకులకు ఎటువంటి బోర్ అనిపించకుండా దర్శకుడు మణికందన్ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. గత నెల జూన్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో ప్రదర్శింప బడటం హాట్ న్యూస్ గా మారింది.

18:46 - July 2, 2015

హైదరాబాద్‌: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ తన పెళ్లిపై దృష్టిపడింది. పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సల్మాన్‌ఖాన్‌ తెలిపారు. ఒక పత్రిక కోసం ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'బాలీవుడ్‌ నటుడు సాహిద్‌ కపూర్‌ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. మీకు ఆలాంటి ఆలోచన ఏమైనా ఉందా' అని విలేకరులు ఆడిగిన ప్రశ్నకు సల్మాన్‌ స్పందించారు. 'ఎవరైనా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆడిగితే తాను కచ్చితంగా ఆలోచిస్తానని' చెప్పారు. కానీ ఇప్పటి వరకు తనను ఎవరూ ఆడగలేదని పేర్కొన్నారు. ఒక్కోసారి ప్రేమ పెళ్లిళ్లు చేయలేనివి పెద్దలు కుదిర్చిన వివాహాలు చేస్తాయని చెప్పారు.


 

18:36 - July 2, 2015

గుంటూరు:బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు చెరువు జమ్ములపాలెం వాసులుగా గుర్తించారు. బాపట్ల రైల్వేస్టేషన్‌లో 4 రోజుల వ్యవధిలో ఇదో సంఘటన. 

18:35 - July 2, 2015

.గో: ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి పుష్కరాల సీడీలను ఆవిష్కరించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాలపై ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో రివ్యూ నిర్వహించారు. పుష్కరాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. 

18:34 - July 2, 2015

రెక్కడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది. పనిలేకపోతే పూటగడవని ధీనస్థితి వారిది. అలాంటి వారి జీవితాల్లో...రాజధాని పేరుతో చీకట్లు నింపారు. భూమిలిచ్చే రైతులకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. కానీ రైతుల కుడి భుజాలైన... కూలీలను మాత్రం మరిచిపోతున్నారు. నిన్నటిదాకా చేతి నిండా పనితో...కడుపు నిండా అన్నం తిన్న కూలీలు....ఇప్పుడు పనులు లేక పస్తులు ఉంటున్నారు. రాజధాని కూలీల కష్టాలపై టెన్‌టీవీ స్పెషల్ స్టోరీ...
కష్టపడే రైతులకు...కుడి భుజాలు....
రక్తాన్ని చెమటగా చిందింతే రైతు కూలీలు. కండల్ని కరిగించి పంటలు పండించే భూమిపుత్రులు. పంటపొలాల్లో కష్టపడే రైతులకు...కుడి భుజాలు.మొన్నటి దాకా చేతి నిండా పనితో....కడుపు నిండా అన్నం తిని...కంటి నిండా నిద్రపోయారు. జీవితం సాఫీగా సంతోషంగా గడిచిపోయేది. కాని ఇప్పుడు చేతిలో పనిలేదు. కడుపులో మెతుకు లేదు. కంటికి నిద్ర లేదు. ఏపీ రాజధాని...వీరి జీవితాల్లో చీకట్లను నింపింది. అభివృద్ధి పేరుతో కోలుకోలేని దెబ్బకొట్టింది.
75శాతం మంది కూలీల పరిస్థితి ఇదే...
పొలం పనుల్లో...రైతుల కంటే ముందుండే వీళ్లు....ఇప్పుడు అధికారులు ఆఫీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భూసేకరణతో చేతిలో పనిలేక...కుటుంబాన్ని నడపలేక అల్లాడుతున్నారు. రాజధాని పేరుతో ఎంతమందికి లాభం చేకూరిందో కాని... వీని మాత్రం నిండా ముంచింది. రాజధాని గ్రామాల్లో 75 శాతం మంది కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రైతులతో సమానంగా ఆదుకుంటామని హామీ....
రాజధాని రైతులతో పాటు కూలీలపైనా ప్రభుత్వం హామీల వర్షం కురిపించింది. రైతులతో సమానంగా కూలీలను ఆదుకుంటామన్నారు. కాని ప్రభుత్వ ప్రకటన మాటలకే పరిమితమయ్యాయి. మాటలు కోటలు దాటాయి...కాని చేతలు మాత్రం గడప కూడా దాటలేదు. రైతులకు చెక్కుల పంపిణీ చేస్తున్న ప్రభుత్వం....కూలీల పెన్షన్‌ను మాత్రం పక్కనబెట్టింది. దీంతో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
రూ. 9 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్.....
అధికారుల చుట్టూ తిరిగి..తిరిగి అలిసిపోయారు. పెన్షన్‌ కోసం వేడుకొని..విసిగిపోయారు. చివరకు తప్పనిపరిస్థితుల్లో సీఆర్‌డిఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధర్యంలో ధర్నా చేశారు. నెలకు 9 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూలీల పెన్షన్ విషయంలో స్పందించారు..జూలై మాసం నుండి కులీలకు 2500 ఫిన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జూలై మాసం నుండి కూలీలకు పెన్షన్‌ ఇవ్వాలంటూ అదేశించారని మంత్రి తెలిపారు..ప్రభుత్వం ప్రకటించిన 2500 ఫిన్షన్ పై కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబానికి 2500 ఇస్తే , నలుగురు ఉండే ఇంట్లో ఎలా బ్రతికేది అని ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై కూలీల ఆగ్రహం...
స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్..తమ గోడును పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ మోసాలకు ఎమ్మెల్యే వంత పాడుతున్నారని విమర్శించారు.
సీపీఎం పెద్ద ఎత్తన పోరాటాలు...
రాజధాని కూలీల సమస్యలపై సీపీఎం పెద్ద ఎత్తన పోరాటాలు చేస్తోంది. కూలీలతో కలిసి సీపీఎం నేత బాబురావు ఆందోళన చేశారు. కూలీలకు ఉపాధి కల్పించిన తర్వాతే ప్రభుత్వం ముందుకు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి...9 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రైతు కూలీలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.

18:30 - July 2, 2015

కడప జిల్లా టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుతోంది.. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన సీఎం రమేష్‌ తీరుపై స్థానిక నేతలు భగ్గుమంటున్నారు.. ఆయన ఒంటెద్దుపోకడలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జిల్లాలో టీడీపీ పరాభవానికి సీఎం రమేష్‌ నిర్ణయాలే కారణమంటున్నారు నేతలు.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు సీఎం రమేష్‌ ప్రాధాన్యం ఇచ్చిన ఫలితమంటున్నారు తమ్ముళ్లు.. బద్వేల్, కడప, మైదుకూరు, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సమన్వయం చేయడంలో రమేష్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు..
బాధితుల లిస్టులో లింగారెడ్డి....
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన లింగారెడ్డి సైతం సీఎం రమేష్‌ బాధితుడేనని మండిపడుతున్నారు స్థానిక నేతలు.. అంకితభావంతో పనిచేసిన లింగారెడ్డిని కాదని టికెట్‌ వరదరాలుజులురెడ్డికి ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఎమ్మెల్సీ ఆశచూపి లింగారెడ్డి నోరుమూయించారని ఆరోపిస్తున్నారు.. సీనియర్‌ నేతలను సైతం సీఎం రమేష్‌ ఇంటికి పిలిపించి మాట్లాడుతుండటం ఇబ్బందికరంగా ఉందంటున్నారు.. ఇలాంటి వ్యవహారం నచ్చక చాలా మంది మథనపడుతున్నారని జిల్లా టీడీపీలో చర్చ జరుగుతోంది.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డితోనూ సీఎం రమేష్‌ సఖ్యతగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సతీష్‌రెడ్డి వ్యతిరేకులను రమేష్‌ చేరదీస్తుండటం వివాదానికి కారణమవుతోందంటున్నారు.. కలెక్టర్‌ నుంచి అంతా తనమాటే అమలు చేయాలన్నట్లు సీఎం రమేష్‌ ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు..
రామగోపాల్‌రెడ్డికి సపోర్ట్‌....
సతీష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రామగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం సీఎం రమేష్‌ చేశారంటున్నాయి పార్టీ వర్గాలు.. సమస్య పరిష్కరించాల్సింది పోయి వేరుకుంపట్లు పెట్టిస్తూ వర్గపోరును పెంచారని ఫైరవుతున్నారు.. రామగోపాల్‌రెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ కుటుంబంతో పోరాడని గుర్తింపు ఉంది.. ఈ నేపథ్యంలో అతన్ని సీఎం రమేష్‌ దగ్గరకు తీసి సతీష్‌రెడ్డితో విభేదాలు పెంచారంటున్నారు.. ఇదే క్రమంలో లింగారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా చేయాలన్న సీఎం రమేష్‌ ప్రయత్నాలకు చెక్‌పెట్టారు మిగతా నాయకులు.. ఆర్‌.శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా బలపరచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. అయితే తన సోదరుడు సురేష్‌ నాయుడుకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించేందుకు సీఎం రమేష్‌ ప్రయత్నిస్తుండటం మిగతా నేతలకు మింగుడుపడటం లేదు.. తమ కులానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు బలిజ సామాజిక వర్గం నేతలు..
ఎర్రచందనం స్మగ్లర్లకు పెద్దపీట...
ఎర్రచందనం స్మగ్లర్లను సైతం సీఎం రమేష్‌ పార్టీలో ప్రోత్సహించారని ఆరోపిస్తున్నారు కడప జిల్లా టీడీపీ నేతలు.. జెడ్పీటీసీ టికెట్లు ఇప్పించి సమావేశాల్లో చంద్రబాబు వెనకే కూర్చుండబెట్టారని మండిపడుతున్నారు.. సామాన్య కార్యకర్తలను సీఎం రమేష్‌ అసలు దగ్గరికే రానివ్వడం లేదంటున్నారు.. చుట్టూ గన్‌మెన్‌లతో ముఖ్యమంత్రి స్థాయిలో హడావుడి చేస్తున్నారు తప్ప స్థానికంగా అందుబాటులో ఉండటం లేదంటున్నారు.. ఇటీవల చంద్రబాబు సైతం అందరికీ అందుబాటులో ఉండాలని చురకలంటించినా ఫలితం లేదంటున్నారు తమ్ముళ్లు..స్పాట్
ఇంకా ఓపిక లేదంటున్న నేతలు...
సీఎం రమేష్‌కు జిల్లా టీడీపీలో గడ్డు పరిస్థితులు తప్పవంటున్నారు సీనియర్‌ నేతలు.. తామంతా ఇన్నాళ్లూ ఓపికతో భరించామంటున్నారు.. ఇకమీదట అతని పెత్తనాన్ని సహించేది లేదని చెబుతున్నారు.. ఏదో ఓరోజు సీఎం రమేష్‌కు సంబంధించిన అరాచకాల చిట్టాను చంద్రబాబు దగ్గర విప్పుతామంటున్నారు.. చంద్రబాబు సైతం సీఎం రమేష్‌ వ్యవహార శైలిపై కొంత అసహనంగా ఉన్నారు.. ఇటీవల ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి కోసం రచ్చకెక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక కడప జిల్లా నేతలు ఫిర్యాదు చేస్తే సీఎం రమేష్‌కు పొలిటికల్‌గా ఇబ్బందులు తప్పవంటున్నారు పరిశీలకులు..

18:26 - July 2, 2015

కర్నూలు: జిల్లాలో దారుణం మూడేళ్ల చిన్నారితో... ఓ మద్యం వ్యాపారి సారా తాగించి పొట్టనపెట్టుకున్నాడు.ఆస్పత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. డోన్ మండలం పెదమల్కాపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న డోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపడుతున్నారు. 

18:24 - July 2, 2015

పశ్చిమగోదావరి: జిల్లా సీఎం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పోలవరం మండలం, ఎడ్లగూడెం వద్ద వేగంగా వస్తున్న పోలీస్‌ కాన్వాయ్‌... అదుపు తప్పి ఓ పూరింట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడిక్కడే చనిపోయింది. మరొకరికి, పోలీస్‌ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో బాధితులను న్యాయం చేయాలని ఎడ్లగూడెం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వివాదం సర్దుమణిగింది.

డీఎస్ పార్టీ మారడం మాకు మంచిదే:వీహెచ్

ఢిల్లీ: డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మారడం తమకు మంచిదేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్ కాంగ్రెస్ లో అన్ని పదువులు అనుభవించారని తెలిపారు. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్సీలు, 13 మంది ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. అన్ని పార్టీల నాయకులను చేర్చుకుని కేసీఆర్ ఏం.. చేస్తారని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ కార్యకర్తలు.. తమ పరిస్థితేంటని అడుగుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన యువకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తామన్నారు. 2019 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేస్తామని వెల్లడించారు.

 

రంజాన్ కు రూ. 26 కోట్లు

హైదరాబాద్: రంజాన్ కోసం రూ. 26 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 8న నిజాం కాలేజీ వేదికగా ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామన్నారు. 100 మసీదులలో ఇఫ్తార్ విందు ఉంటుందని చెప్పారు. పార్టీలకతీతంగా అందరు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

 

ఎపిలో రెండు సాగునీటి ప్రాజెక్టుల పేరు మార్పు

హైదరాబాద్: ఎపి ప్రభుత్వం రెండు సాగునీటి ప్రాజెక్టుల పేరు మార్చింది. శ్రీకృష్ణదేవరాయ గాలేరు..నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును గాలేరు.. నగర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్పు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును హంద్రీనీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్పు చేశారు. 

విశాఖ జిల్లాలో 160 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ: జిల్లాలోని మాడుగుల మండలం కృష్ణపాలెం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 160 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా.

 

17:32 - July 2, 2015

ఢిల్లీ: డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడటాన్ని స్వాగతించారు ఆపార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. పార్టీలో అన్ని పదవులు అనుభవించిన డీఎస్‌.. టీఆర్ఎస్‌లో చేరడం మంచిదన్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులను చేర్చుకుని.. కేసీఆర్‌ ఏంచేస్తారని వీహెచ్ ప్రశ్నించారు. త్వరలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు తిరగబడతారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తామని వీహెచ్‌ అన్నారు.

17:30 - July 2, 2015

మహబూబ్ నగర్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాకతో ఆయన ఇల్లు సందడిగామారింది.. బెయిల్‌పై బయటకొచ్చిన రేవంత్‌ని పరామర్శించేందుకు బంధువులు, అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.. 

17:29 - July 2, 2015

హైదరాబాద్‌: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కుషాయిగూడ, మల్కాజ్‌గిరి పీఎస్‌లలో ఫిర్యాదులొచ్చాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కొందరు బాధితులు.. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారంటూ మరికొందరు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిపై సెక్షన్ 341, 188, 506, 509తో పాటు సిటీ పోలీస్ యాక్ట్ 22 కింద కేసులు నమోదయ్యాయి. 

రేవంత్ పై మూడు కేసులు నమోదు

హైదరాబాద్: కుషాయిగూడ, మల్కాజ్ గిరి పిఎస్ లలో రేవంత్ రెడ్డిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కుషాయిగూడ పీఎస్ లో రెండు, మల్కాజ్ గిరిలో ఒక కేసు నమోదు అయింది. ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ట్రాఫిక్ కు ఇబ్బంది కల్గించడం.. వంటి అంశాలపై రేవంత్ పై కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 341, 188, 506, 509 తోపాటు సిటీ పోలీస్ యాక్టు 22 కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.

 

17:23 - July 2, 2015

రోబో మనిషిని చంపిన దుర్ఘటన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్‌వాగన్ తయారీ ప్లాంట్‌లో ఓ కాంట్రాక్టర్‌ను రోబో చంపినట్టు కంపెనీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వంద కిలోమీటర్ల దూరంలో గల వోక్స్‌వాగన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ (22)రోబోకు కొన్ని పరికరాలు అమర్చుతున్నాడు. ఆ సమయంలో రోబోని ఆపరేట్ చేసే వ్యక్తి వల్ల ఆ కాంట్రాక్టరును సమీపంలోని ఓ పెద్ద మెటల్ ప్లేట్ పైకి విసిరేసింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుపాలైన ఆ కాంట్రాక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని వోక్స్‌వాగన్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అతడు విచారణ కొనసాగుతుందని తెలిపాడు. జర్మనీ పత్రికలు మాత్రం ఈ దుర్ఘనటలో రోబో దోషిగా తేలితే ఏయే శిక్షలు వేస్తారనే వార్తా కథనాలను ప్రచురించాయి.

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు: జిల్లాలోని డోన్ మండలం పెదమల్కాపురంలో దారుణం జరిగింది. మౌనిక(3) అనే చిన్నారికి ఓ వ్యాపారి నాటుసారా తాగించాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మౌనిక మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు డోన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 

ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

విజయనగరం: ఓ అవినీతి తిమింగలం ఎసిబికి చిక్కాడు. సాలూరులో అటవీశాఖ ఉద్యోగి డి.ఏడుకొండలు.. రూ.15 వేల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు.

తణుకులో అగ్నిప్రమాదం...

ప.గో: తణుకులోని ఓ పాతకలప డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటాన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. రూ.20 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

 

రిమాండ్ ఖైదీ ఆత్మహత్య...

గుంటూరు: నర్సరావుపేట జైలులో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హత్య కేసులో ప్రసన్నకుమార్ అనే వ్యక్తి నేరారోపణ ఎదుర్కొంటున్నారు. బెయిల్ ఇప్పించేందుకు ఎవరూ రాకపోవడంతో మనస్థాపం చెందిన ప్రసన్న కుమార్.. బాత్ రూంలో ఉరివేసుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

రేవంత్ నిర్ధోషిగా బయటకు రాలేదు: మంత్రి పోచారం

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మాత్రమే వచ్చిందని.. నిర్ధోషిగా బయటకు రాలేదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఇస్తూ... రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ర్యాలీ నిర్వహణ.. బెయిల్ నిబంధన ఉల్లంఘన అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. ఏదో సాధించినట్లు ఊరేగింపు తీశారని ఎద్దేవా చేశారు.
 

16:51 - July 2, 2015

హైదరాబాద్‌: నగరంలో కేఎఫ్‌సీ సంస్థను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు....

16:50 - July 2, 2015

ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో... రేవంత్‌ బెయిల్‌పై... సుప్రీంకోర్టులోనూ న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని... తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సన్నిహితులైన జడ్జిలు సుప్రీంకోర్టులో వుండటమే ఇందుకు కారణమన్నారు. . హైకోర్టులోనూ దాదాపు 70శాతం మంది చంద్రబాబుకు అనుకూలమైన వారున్నారని... అందుకే అక్కడ న్యాయం జరగలేదన్నారు. ఇలాంటి సమస్యల వల్లే తెలంగాణకు ప్రత్యేక కోర్టు కావాలని కోరామన్నారు. ఇక సుప్రీంకోర్టులో తమ వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేస్తామంటోన్న రామచంద్రరావు టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలు చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రేవంత్ ది హీరోయిజం కాదు.. చిల్లరతనం: మంత్రి తుమ్మల

హైదరాబాద్: రేవంత్ ది హీరోయిజం కాదు.. చిల్లర తనమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నాడని పేర్కొన్నారు. 

16:46 - July 2, 2015

హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ర్యాంకుల కేటాయింపులో తమకు పూర్తి అన్యాయం జరిగిందని విద్యార్ధులతో పాటు తల్లితండ్రులు మండిపడుతున్నారు. సాయంత్రంలోగా ర్యాంకులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇంటర్‌ బోర్డ్‌ ముందు విద్యార్ధుల తల్లితండ్రులు ధర్నా నిర్వహించారు. ఇదే అంశంపై టెన్ టివిలో చర్చను చేపట్టింది. ఈ చర్చని పూర్తి పాఠవం వినాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:42 - July 2, 2015

హైదరాబాద్:భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ స్టార్ జ్వాలా గుత్తా....కెనేడియన్ ఓపెన్ టైటిల్ విజయంతో ఉరకలేస్తోంది. వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్ వరకూ..ఇదేజోరు కొనసాగిస్తానంటున్న తెలుగుతేజం జ్వాలతో 10 టివి పలకరించింది. పూర్తి వివరాలు ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:39 - July 2, 2015

అనంతపురం:ఉరవకొండలో దారుణం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు గమనించి హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. కోదండరాం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిండికేట్‌ బ్యాంకు అధికారుల వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తల్లి పేరు మీద ఉన్న పంట రుణం చెల్లించినా.. బ్యాంకు అధికారులు పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనన కోదండరాం బ్యాంకు ఎదుట పురుగులు మందు తాగాడు.

 

పాస్ పుస్తకం ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో దారుణం జరిగింది. పాస్ పుస్తకం ఇవ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదండరాం అనే విద్యార్థి పాస్ పుస్తకం కోసం ఉరవకొండలోని బ్యాంకుకు వెళ్లాడు. తల్లిపేరు మీద ఉన్న పంట రుణం చెల్లించినా.. పాస్ పుస్తకం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందాడు. బ్యాంకులోనే పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోదండరాం మృతి చెందారు. అతని మృతికి అధికారుల వేధింపులే కారణమని స్థానికులు అంటున్నారు. 

 

16:37 - July 2, 2015

ఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని... కరీంనగర్ ఎంపీ వినోద్ ఆరోపించారు. మోడీ సర్కారు మాట ఇచ్చి మాట తప్పిందన్నారు. ఈ విషయంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు. 

16:36 - July 2, 2015

కృష్ణా: జిల్లాలోని మోపిదేవి బీసీ బాలుర వసతి గృహంలో.. ఫుడ్‌ పాయిజన్‌ అయింది. దీంతో వంద మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి వండిన ఆహారం కలుషితం కావడంతో.. వాంతులు, విరేచనాలు అయినట్లు విద్యార్థులు చెప్పారు. గురుకుల విద్యార్థులను మండలి బుద్ధప్రసాద్‌, పలువురు నేతలు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

16:34 - July 2, 2015

తుళ్లూరు: ఏపీ రాజధాని ప్రాంతంలో చైనా ప్రతినిధి బృందం పర్యటించింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన బృందం.. పలు అంశాలపై అధ్యయనం చేసింది. అంతకుముందు.. విజయవాడలో కలెక్టర్, ప్రభుత్వాధికారులతో సమావేశమైన చైనా ప్రతినిధి బృందం.. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌తో పాటు.. ఏపీలోని 13 జిల్లాల్లో చేపట్టబోయే ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు.. చైనా బృందానికి వివరించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపించేందుకు చైనా సానుకూలంగా స్పందించిందని కృష్ణా కలెక్టర్ తెలిపారు.

 

16:33 - July 2, 2015

మెదక్:అప్పు తీర్చలేదని... అప్పుతీసుకున్న వ్యక్తిని వదిలి... మధ్యవర్తిని పట్టుకున్నారు. రాత్రంతా ఇంట్లో నిర్బంధించారు. తీసుకున్న పైసలు నీవు కడతావా? అతడితో కట్టిస్తావా? అంటూ బెదిరించారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. నర్సాపూర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి కుంచెరుకల రాములు లక్ష్మీ... హత్నూరు మండలం నవాబుపేటకు చెందిన రమేష్‌కు నాలుగేళ్ల క్రితం 20వేలు అప్పుగా ఇచ్చాడు. వాటికి మధ్యవర్తి అదే గ్రామానికి చెందిన లింగమయ్య. నాలుగేళ్లుగా డబ్బులు తిరిగి ఇవ్వటం లేదని... వడ్డీవ్యాపారి లింగమయ్యను నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... వడ్డీవ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. 

16:32 - July 2, 2015

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.. ఈ మేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు.. కాంగ్రెస్‌లో నిబద్ధతగా పనిచేశానన్నారు డీఎస్‌.. తెలంగాణ సాధన కోసం కృషి చేశానని చెప్పారు.. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసున్న డీఎస్‌.. తెచ్చింది మాత్రం కేసీఆర్‌ అని స్పష్టం చేశారు.. సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి పథాన సాగాలన్న నిర్ణయంతోనే పార్టీ మారుతున్నానని వివరించారు.. కాంగ్రెస్‌ పార్టీకి సోనియాగాంధీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.. తన జీవితంలో ఇది బాధాకరమైన రోజన్నారు డీఎస్‌..
దిగ్విజయ్‌పై డీఎస్‌ ఆగ్రహం....
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై నిప్పులు చెరిగారు డీఎస్‌.. అతను ఓ మోసకారి అని విమర్శించారు.. ఆకుల లలితకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చే విషయం తనకు చెప్పలేదన్నారు.. అయినా ఆమె విజయం కోసం శాయశక్తులా కృష్టిచేశానన్నారు డీఎస్‌.. కాంగ్రెస్‌ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని చురకలంటించారు.. ముఖ్యమంత్రి పదవి తప్పు తాను అన్నింటిని చేపట్టానన్నారు.. ఎమ్మెల్సీ పదవి కోసమే పార్టీ మారుతున్నారన్న ఆరోపణలపై మండిపడ్డారు డీఎస్‌..
ఏపీ అడ్డుపడుతోందంటున్న డీఎస్‌...
.బంగారు తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించారు డీఎస్‌.. తెలంగాణ అభివృద్ధికి ఏపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు.. గులాబీ కండువా ఎప్పుడు వేసుకునే తేదీ త్వరలోనే చెబుతానన్నారు.. కేసీఆర్‌ చాలా కమిట్మెంట్‌తో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.. కాంగ్రెస్‌ పార్టీలో పదవులూ అనుభవించాను.. అవమానాలు ఎదుర్కొన్నాన్నారు డీఎస్..

16:29 - July 2, 2015

ప.గో:ఆంధ్రప్రదేశ్‌ను కరువురహిత ప్రాంతంగా చేయడమే తమ లక్ష్యమన్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు.. గోదావరి, కృష్ణా జలాలను సమర్ధవంతంగా వినియోగించుకున్నప్పుడే నీటి సమస్య తీరుతుందని చెప్పుకొచ్చారు.. ఈ రెండు నదులను అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని బాబు తెలిపారు.

15:58 - July 2, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హద్దు మీరి మాట్లాడారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతలు స్వలాభం కోసం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు భిన్నంగా నడుచుకుంటుందని వివరించారు. టీడీపీని బజార్లో అమ్ముతారని తాను ఆనాడే చెప్పానని పేర్కొన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. జైలు నుంచి వస్తే స్వాతంత్ర సమరయోధుడు వచ్చినట్టు స్వాగతం పలికారని విమర్శించారు. మహాత్మా గాంధీకి కూడా ఇలా చేసినట్టు తాను చరిత్రలో చదవలేదన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం తెలుగు జాతి గౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల తీరును చూసి తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొన్నారు.

15:54 - July 2, 2015

హైదరాబాద్:టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఆపార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి జూపల్లి కృష్ణరావు మండిపడ్డారు. ఈమేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని..సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసే అర్హత రేవంత్‌కు లేదన్నారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. వచ్చిన తెలంగాణను మీ పచ్చ జెండా వెనక్కి పంపిన విషయం ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పచ్చ పార్టీ కుట్రలు మానడంలేదన్నారు. అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

15:50 - July 2, 2015

హైదరాబాద్: సీనియర్ నేత డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని టి. కాంగ్రెస్ నేతలు తెలిపారు. టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు గురువారం మీడియాతో మాట్లాడారు. పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రతీసారీ పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదన్నారు. డీఎస్ ది అనాలోచిత నిర్ణయం అని జానా అన్నారు.

కంపు రాజకీయాలతో బంగారు తెలంగాణ అసాధ్యం: తమ్మినేని

హైదరాబాద్: కంపు రాజకీయాలతో బంగారు తెలంగాణ అసాధ్యమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రభుత్వాలు పుష్కరాళ్ల పేరుతో ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి ఆలోచించకుండా.. గుళ్లు, గోపురాల కోసం.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. హరితహారం పేరుతో పేదలు, దళితుల భూములను ప్రభుత్వం ఆక్రమించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు.. రాజకీయ అవినీతి, అవకాశవాదాన్ని గమనించి.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల వైపు ఆలోంచించాలని కోరారు.

 

కేసీఆర్ తో నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తో నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపులు, రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రేవంత్ ఆటలు సాగవ్:జూపల్లి

హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆటలు సాగవని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్ అపకీర్తి తెస్తున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో రేవంత్ పౌరుషం ఎక్కడపోయిందని ప్రశ్నించారు. దొంగతనం బయటపడ్డాక కూడా అన్యాయంగా ఇరికించారనడం సరికాదన్నారు.

 

14:25 - July 2, 2015

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్‌ అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లో పవన్‌కి ఆంటీగా సింగర్‌ సునీత నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. నిజానికి సింగర్‌ సునీతని చాలామంది దర్శకులు సినిమాల్లో ఇంట్రడ్యూస్‌ చేయడానికి ప్రయత్నించారు. కాని అవేవీ వర్కవుట్‌ కాలేదు. నిజానికి మహేష్‌బాబు మూవీలో నటిస్తుందనే వార్తలొచ్చాయి. కాని అవేవీ నిజం కాలేదు. తాజాగా త్రివిక్రమ్‌ మూవీలో పవన్‌ పిన్నిగా నటించడానికైతే ఓకే చెప్పినట్లు సమాచారం. 

కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి వద్ద పేలుడు...

కరీంనగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్రమంగా డిటోనేటర్లు తరలిస్తుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రయాణికుడిపై డీఎంకే నేత స్టాలిన్ దాడి

చెన్నై: ఓ ప్రయాణికుడిపై డీఎంకే నేత స్టాలిన్ దాడికి పాల్పడ్డారు. మెట్రో రైలులో ప్రయాణికుడిపై స్టాలిన్ చేయిచేసుకున్నారు.

 

కేసీఆర్ తో సీఎస్, జీహెచ్ ఎంసీ కమిషనర్ భేటీ..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తో సీఎస్ రాజీవ్ శర్మ, జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సమావేశం అయ్యారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు సుప్రీంకోర్టు ఆశ్రయించాలనే అంశంపై చర్చ చేస్తున్నట్లు సమాచారం.

 

పుష్కర పనులపై చంద్రబాబు సమీక్ష

ప.గో: పుష్కర పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగితే సహించనని చెప్పారు. యాత్రికులకు పూర్తిస్థాయి సదుపాయం కల్పించాలని సూచించారు.

 

కలెక్టర్లతో సీఎం ఓఎస్డీ వీడియోకాన్ఫరెన్స్...

హైదరాబాద్: హరితహారంపై జిల్లా కలెక్టర్లతో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

రాజధాని నిర్మించాలని చూస్తే ఉరుకోం:మధు

గుంటూరు: పోలీసులతో పేదలు, కార్మికుల నోళ్లు మూయించి..రాజధాని నిర్మించాలని చంద్రబాబు చూస్తే ఉరుకోబోమని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. తుళ్లూరులో సీపీఎం ఆధ్వర్యంలో పేదలు సీఆర్ డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మోసపూరిత మాటలతో పేదలకు అన్యాయం చేసి... రాజదధానిని నిర్మించాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచైనా పేదలు, కూలీలు, కార్మికులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రాజధాని సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

13:47 - July 2, 2015

హైదరాబాద్ : రాజకీయ వ్యవస్థలో అవినీతి పరాకాష్టకు చేరుకుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కొనడానికి రూ.50లక్షలు అడ్వాన్స్ గా లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పై విడుదల అయ్యారని, కానీ రాజకీయ అవినీతి పాల్పడిన నేతలు క్షమాపణ చెప్పాల్సింది పోయి హీరోయిజం ప్రదర్శించడం పట్ల రాజకీయాలు ఎటు వెళుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. అవినీతిమయమైన రాజకీయాలు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని నీతివంతమైన రాజకీయాల స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఈనెల 6 నుంచి తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మె

హైదరాబాద్: ఈనెల 6 నుంచి తెలంగాణలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. అధికారులు, మంత్రుల హామీలు అమలు కానందునే సమ్మెకు దిగుతున్నామని మున్సిపల్ కార్మికుల జేఏసీ తెలిపింది. 4న తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని నేతలు చెప్పారు. 5న సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు.

 

13:35 - July 2, 2015

గుంటూరు : రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో ఉపాధి కూలీల సమస్యలపై సీపీఎం సమరభేరీ మోగించింది. వారు పడుతున్న ఇబ్బందులు..కష్టాలను దూరం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. కూలీలు..మహిళలు పెద్ద ఎత్తున్న ఆందోళనకు తరలివచ్చారు. వీరు సీఆర్డీఏ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు, కార్మికులకు నెలకు రూ.9వేలు చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేసింది. తుళ్లూరు పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయడంతో రెండు నెలలుగా కూలీలు ఉపాధి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.
ప్రభుత్వమే వాగ్ధానం ఇచ్చింది - మధు..
రాజధాని ప్రాంతంలో భూ సేకరణ వల్ల కూలీలకు ఎలాంటి నష్టం కలుగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు టెన్ టివితో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం చేసే సందర్భంలో అన్ని తరగతుల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం వాగ్ధానం ఇచ్చిందన్నారు. నెలకు రూ.2500వేలు చెల్లిస్తామని సర్కార్ చెప్పిందని, ఇది ఏ మూలకు సరిపోదని కూలీలు పేర్కొన్నారని గుర్తు చేశారు. కొంతమంది రైతులకు చెక్కులు ఇచ్చి కూలీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కొంతమంది రైతుల్లో కూడా అసంతృప్తి నెలకొందన్నారు. క్రమంగా పనులు కోల్పోతుండడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యారని, రాబోయే రోజుల్లో వామపక్షాలు మరింత ఉధృతం చేస్తాయన్నారు. చంద్రబాబు చెప్పే మాట ఒకటి..చేసేదొకటి అని విమర్శించారు. రాజధాని వస్తే 50 లక్షల మందికి ఉపాధి చూపిస్తామని చెప్పారని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. కానీ ఉన్న ఉపాధి పోయిందని, శంకుస్థాపన తరువాత..ముందు రాజధాని సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పని ఇవ్వండి..లేదా నెలకు 9వేలు ఇవ్వాలని మరో నేత డిమాండ్ చేశారు. 

13:27 - July 2, 2015

హైదరాబాద్ : జేఈఈ ర్యాంకుల రాకపోవడంపై విద్యార్థులు..తల్లిదండ్రులు గందరగోళంలో పడిపోయారు. విద్యార్థులకు ర్యాంకులు రాకపోవడంపై తల్లిదండ్రులు..విద్యార్థులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేశారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మాకు అన్యాయం జరిగిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంకుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపించారు. సాయంత్రంలోగా ర్యాంకుల కేటాయింపు జరగాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల రెండు వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సమాచారం. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన తెలియచేయడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. 

రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కు చంద్రబాబు క్లాస్

తూర్పుగోదావరి: రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ మురళికి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనులు చేపట్టడంపై ఆయనను సీఎం మందలించారు.

పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు ఆగ్రహం

రాజమండ్రి: పుష్కర ఏర్పాట్లు, పనులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నదిపై నాలుగో వంతెన పనులు పూర్తికాకపోవడంపై గామన్ కంపెనీ ప్రతినిధులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పనులు త్వరితగతిన పూర్తి చేయకపోతే గామన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.

 

13:17 - July 2, 2015

ఖమ్మం : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియా ఎదుట వచ్చారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు తీసుకోకుండా కొన్ని రోజుల పాటు సండ్ర అజ్ఞానంలో ఉన్న సంగతి తెలిసిందే. గురువారం ఖమ్మంలో మీడియాతో సండ్ర మాట్లాడారు. తన ఆరోగ్యం కుదుటపడిందని..విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఏసీబీకి తాను లేఖ రాయడం జరిగిందన్నారు. తాను విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు.
ఓటుకు నోటు వ్యవహారంలో సండ్ర వెంకట వీరయ్య కీలకం అని ఏసీబీ భావిస్తోంది. కానీ నోటీసులను తీసుకోకపోవడంతో ఆయన నివాసం ఉంటున్న క్వార్టర్స్ కు నోటీసులు అందించారు. కానీ ఆరోగ్యం బాగా లేదని గడువు పెంచాలని పలుమార్లు కోరారు. ఇదిలా ఉంటే ఈ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డికి బెయిల్ లభించిన తరువాత సండ్ర స్పందించడం గమనార్హం.

హిమాచల్ ప్రదేశ్ లో జడ్జి సస్పెండ్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో జడ్జిపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న మహిళా జడ్జి ఫిర్యాదుతో నిందితుడిపై హైకోర్టు చర్య తీసుకుంది. 

మోపిదేవి గురుకుల పాఠశాల హాస్టల్ లో విషాహారం తిని విద్యార్థులకు అస్వస్థత

కృష్ణా: మోపిదేవి గురుకుల పాఠశాల హాస్టల్ లో విషాహారం తిని వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లోనే విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోపిదేవి గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 

12:56 - July 2, 2015

రాజమండ్రి : ''ఐ డోన్ట్ వాంట్ లిజనింగ్...డోన్ట్ విత్ ప్లే..దేర్ ఈజ్ ఏ కంప్లైంట్..దేర్ ఈజ్ ఏ కంప్లైంట్..యూ టేక్ కేర్..యూ ఆర్ అనెఫిషియెట్ దెన్ క్విట్..యూ ఆర్ కేపబుల్ ..యూ ఆర్ డూ ఇట్..అదర్ వైస్ డోన్ట్ ప్లే విత్ మి..వచ్చే వరకు సరి చేయాలి..లేకుంటే ప్రాపర్ స్థానంలో ఉంటావు..బీ కేర్ ఫుల్''..ఇవన్నీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. గురువారం రాజమండ్రికి వచ్చిన ఆయన పుష్కర పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి నదిపై 9ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న నాలుగో బ్రిడ్జి పనులను ఇంకా పూర్తి చేయకపోవడంపై గామన్ కంపెనీ ప్రతినిధులపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పనులు చేపట్టకపోతే బ్లాక్ లిస్టులో పెడుతానంటూ హెచ్చరించారు. పుష్కరాల ప్రారంభానికి అంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల విజయవంతం కోసం మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం బాబు వెల్లడించారు.

వామపక్ష కార్మిక సంఘాల నేతల అరెస్టు..

అనంతపురం: తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో సమస్యలపై నిజనిర్ధారణకు వెళ్లిన వామపక్ష కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కరించాలని పది రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

12:47 - July 2, 2015

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇచ్చిన హైకోర్టు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ సుప్రీంను ఆశ్రయించింది. గురువారం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రేవంత్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో ఏసీబీ కోరింది. ఈ కేసులో ఇంకా పలువురు కీలక వ్యక్తులను విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో రేవంత్ కు బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో కూడా కొన్ని కేసుల్లో కూడా హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసిందని ఏసీబీ పేర్కొంటోంది. కేసును ప్రభావితం చేసే విధంగా నేతలు మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. దీనిపై శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కీలక వ్యక్తులను ఇంకా విచారించాల్సి ఉంది. 

12:42 - July 2, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ..సోనియా గాంధీ తనకు ఎన్నో ఇచ్చారని..వారికి రుణ పడి ఉంటానని పేర్కొన్నారు. వెళ్లే ముందు బురద చల్లడం సబబు కాదని డీఎస్ తెలిపారు. 2014 సంవత్సరంలో విలీనం చేసేందుకు కేసీఆర్ సానుకూలంగానే ఉన్నారని, కానీ ఢిల్లీ స్థాయిలో కరెక్టుగా మేనేజ్ మెంట్ చేయలేకపోయారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటాల్లోనే..
చాలా బాధగా ఉంది..
''నా జీవితంలో బాధకరమైన రోజు. 1969లో గాంధీ భవన్ లో కాలు పెట్టా. ఆ నాటి నుండి ఈ ఆనటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఇందిరా గాంధీ..రాజీవ్ గాంధీ హాయాంలో పనిచేశాను. కాంగ్రెస్..సోనియాగాంధీ మధ్య తనకు ఒక అనుబంధం..ఒక అభిమానం ఉంది. సోనియాచూపెట్టిన అభిమానం..ఎన్నడూ మరవలేను. పార్టీకి సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటా. కానీ పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారాల్సి వచ్చింది.
తెలంగాణ కోసం పోరాటం చేశా..
ఏ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నా పాత్రకు సర్టిఫికేట్ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై 2000 సంవత్సరంలో అసెంబ్లీలో మూడు గంటల పాటు ప్రసంగించడం జరిగింది. టీఆర్ఎస్ జత కట్టడంలో కృషి చేయడం జరిగింది. హై కమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేశాను. అధికారంలో ఉంది కనుక రోడ్లపై చేయలేదు. చివరకు సాధించుకోవడం జరిగింది. ఈ ఘనత నాయకత్వం వహించిన ఘనత మొత్తం కేసీఆర్ కు దక్కుతుంది. సోనియా ఇచ్చారనే నగ్నసత్యం ప్రజలు కూడా గుర్తించారు. ఈవిషయాన్ని కేసీఆర్ కూడా పలుమార్లు గుర్తు చేశారు.
బంగారు తెలంగాణ కోసం పోతున్నా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వందలాది మంది ఉద్యమం చేసి ప్రాణాలర్పించారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ? ఏ రకంగా డెవలప్ మెంట్ చేయాలని అనుకున్నాం ? రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు..ఇన్ ఫ్రా స్ట్రకర్ పెరిగిపోవడం..ఉపాధి పెరుగుతందని అనేక ఆశలు పెట్టుకున్నారు. అనుకున్న రకంగా జరగాల్సిన అంత స్పీడుగా జరగడం లేదు. ఆటంకాలు వస్తున్నాయి. సీఎం దగ్గర మాత్రం క్లారిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం..ప్రజలు ముఖ్యమని పార్టీలకతీతంగా అందరూ ఆలోచించాలి. సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీనవర్గాల యొక్క మేలు అయ్యే విధంగా..ముఖ్యమంత్రికి సహకరించడం..బంగారు తెలంగాణ అభివృద్ధికి తనవంతు సహకరించాలనే ఉద్ధేశ్యంతో తాను టీఆర్ఎస్ లో పార్టీలో చేరుతున్నా. నిన్న జరిగిన భేటీలో నా ఆలోచనను సీఎం కేసీఆర్ తో చెప్పాను. ఏ పదవి ఆశించి పోవడం లేదు. రాష్ట్ర అభివృద్ధి చెంది వెనుకబడిన తరగతుల వారికి న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష.
దిగ్విజయ్ ఒక లోఫర్..
నాకంటే ఆయన (దిగ్విజయ్)చెప్పిడంట..నేను పేరు చూశానంట పేర్కొంటూ పేపర్ లో వార్తలు వచ్చాయి. ఆకుల లలితకు టికెట్ ఇవ్వడంలో ఎలాంటి బాధ లేదు. ఆమె గెలుపు కోసం కృషి చేశా. ముఖ్యమంత్రి పదవి తప్పించి అన్ని పదవులు అనుభవించా. నాకు ఎమ్మెల్సీ ఒక లేక్కనా ? దిగ్విజయ్ సింగ్ ఒక లోఫర్. నాతో మాట్లాడ్సిన బాధ్యత ఆయనకు ఉంది. అపోజిషన్ లీడర్ గా ఉన్నా. దిగ్విజయ్ చెప్పుడు మాటలు వినే రకం. ఎమ్మెల్సీ ఇష్యూ కాదు. కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. విమర్శలు చేస్తున్న వారంతా దిగజారి మాట్లాడుతున్నారు. నా గురించి మాట్లాడే మొనగాడు లేడు. ఒకవేళ మాట్లాడితే వారి విజ్ఞతకే వదిలేస్తా.
ఎవరిని విమర్వించను..
డి.శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం సబబే అని అందరూ అంటున్నారు. పార్టీని వీడనాడాలని ఎవరి చెప్పను. చెప్పే అవసరం లేదు. ఉత్తమ్..మల్లు భట్టి విక్రమార్కలు వచ్చి రెండే మాసాలైంది. వారిపై ఏం మాట్లాడను.'' అని డి.శ్రీనివాస్ పేర్కొన్నారు... 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ఏసీబీ

ఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిందితుల బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది. ఏసీబీ వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

జీహెచ్ఎంసీని సందర్శించిన ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం

హైదరాబాద్: జీహెచ్ఎంసీని 36 మందితో కూడిన ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం సందర్శించింది. జీహెచ్ ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ సోమేష్ కుమార్ ఫ్రెంచ్ బృందానికి వివరించనుంది. జీహెచ్ ఎంసీతో కలిసి పని చేసేందుకు ఫ్రెంచ్ బృందం అంగీకారం తెలిపింది. కాపేపట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. 

 

కాంగ్రెస్ కు డీఎస్ గుడ్ బై..

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఇది నా జీవితంలో బాధాకరమైన రోజు' అని తెలిపారు. 'సోనియా నాపట్ల చూపిన అభిమానం, విశ్వాసాన్ని మరువలేను' అని చెప్పారు. కాంగ్రెస్, సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ కోసం తన వంతు పాత్ర పోషించానని పేర్కొన్నారు. అందరి ప్రయత్నాల వల్లే తెలంగాణ సాధించామని వెల్లడించారు. తెలంగాణ సాధన క్రెడిట్ కేసీఆర్ కు చెందుతుందన్నారు. 

11:58 - July 2, 2015

నిజామాబాద్ : గిరిపుత్రులు. అనగానే పోడు వ్యవసాయం...సంచారజీవనం గడుపుతారని అందరికి తెలుసు. కాని వీరిలోనూ కళానైపుణ్యం దాగుందని చాలా కొద్దిమందికే తెలుసు. ఔసులవారికి ధీటుగా ఆభరణాలు తయారు చేస్తూ...అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతగా అంటే వారి తండా పేరే ఇప్పుడు ఔసుల తండాగా మారిపోయింది. దగదగ మెరుస్తున్న డ్రెస్‌లను ఇప్పటి పెద్దపెద్ద డిజైనర్లు తయారు చేసింది కాదు. మామూలు గిరిజనవాసులు చేసినవే.
నిజామాబాద్ డిచ్ పల్లి...
ఇంతటి కళానైపుణ్యానికి నిలయం ఈ "ఔసుల తండా" ఇదే. నమ్మశక్యంగా లేదుకదా..కాని ఇది నిజం. ఈ డ్రెస్‌లపై ఉన్న రకరకాల నగలు తయారు చేసింది ఈ తండా వాసులే. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో ఈ తండా ఉంది. ఇక్కడ నివాసముండేది కేవలం గిరిజనులు మాత్రమే. ఈతండాలో మొత్తం 40 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ 40 కుటుంబాలు ఓకే వ్యక్తికి చెందినవి కావటం విశేషం. రూప్ సింగ్ అనే పెద్ద మనిషి బతుకుదెరువు కోసం ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు. అంతే కాదు పూర్వం బీబీపూర్‌గా పిలువబడే ఈ తండా నేడు ఔసుల తండాగా మారిపోయింది.
దేశనలుమూలల నుంచి తయారీ వస్తువుల కొనుగోలు..
గిరిజనవాసులు ధరించే ప్రతి సాంప్రదాయ ఆభరణాలు ఈ తండావారు తయారు చేసినవే. దేశ నలుమూలల నుంచి సైతం ఇక్కడకు వచ్చి వీరు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ మధ్యనే హిందీ సీరియల్లు, సినిమాల్లో నటించే నటీనటులు ధరించే నగలను సైతం ఇక్కడ నుంచే తీసుకెళ్లారు. వీరు ఏ వస్తువును తయారు చేసినా చేతులతోనే తయారు చేస్తారు. ఎంతటి ఆర్డరునైనా..వారం రోజుల్లోనే రెడీ చేసి ఇస్తారు. కుటుంబమంతా కలిసి ఈ ఆభరణాలు తయారు చేస్తారు. లంబాడి మహిళలు ధరించే టాక్లీలు, గుగ్రీలు, హస్‌త్లీలు, చేతికడాలు, నడుము పట్టీలు, కాళ్లకడాలు, మర్కీజుండే, గజివీటి వంటి నగలను వీరే ఎంతో ఒర్పుతో తయారు చేస్తారు. అంతేకాదు నగల ఈ తయారీకి జర్మనీ సిల్వర్‌ను మాత్రమే వాడటం వీరి ప్రత్యేకం.
సమస్యల్లో గిరిజనులు..
అయితే....ఇంత కళానైపుణ్యం ఉన్న ఈ గిరిజన వస్త్ర కళాకారులు సమస్యల వలయలో చిక్కుకున్నారు. ధగధగమెరిసే వస్త్రాలను తయారు చేసే వీరు తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నారు. ప్రధానంగా పెట్టుబడి విషయంలో సతమతమవుతున్నారు. వ్యవసాయం చేద్దామన్నా...వీరికి గుంట భూమిలేదు. ప్రభుత్వమే స్పందించి సాంప్రదాయ నగల తయారీ కాలగర్భంలో కలిసిపోకుండా..ప్రత్యేక గిరిజన వస్త్ర మార్కెట్‌ను ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలు ఇప్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

11:34 - July 2, 2015

హైదరాబాద్ : బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి. బాలలను పనికి పంపొద్దు.. బడిలో చేర్పించాలి. ఇవి నిత్యం ప్రభుత్వాలు చెప్పే మాటలు.. నీతులు. అందుకే ఓ స్వచ్చంద సంస్థ బడా బాబులు నివాసం ఉంటున్న ప్రాంతంలో పేదలకు చదువు చెప్పేందుకు ముందుకొచ్చారు. కానీ ఆ పేద విద్యార్థుల పాఠశాలను అధికారులు కూలగొట్టారు. దీనితో విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారు. అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది. ఆ పేద విద్యార్థులు ఎవరు ? అనేది తెలుసుకోవాలంటే చదవండి.
పనిచేసే పిల్లలకు చదువులు..
అల్పా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ.. జూబ్లీహిల్స్ ఇళ్లల్లో పనిచేసే వారి పిల్లలకు చదువు చెప్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేకంగా పాఠశాలను నెలకొల్పింది. పార్కు పక్కనే ఉన్న కొంత స్థలంలో పాఠశాలను నిర్మించి.. పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందిస్తోంది. భారమైనా.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ ప్రాంతంలో ఉంటున్న పెద్దలు, సంస్థల నుంచి పుస్తకాలు, బ్యాగులు సేకరించి పేద పిల్లలకు సేవలందిస్తోంది అల్పా ఫౌండేషన్‌. ఆల్ఫా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్‌ 23లో గత కొన్నేళ్లుగా పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలను రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు అకారణంగా కూల్చేశారు. దీంతో బాలలు వీధిన పడ్డారు. పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి..
తోడ్పాటు అందించాల్సిన అధికారులు.. ఉన్నపళంగా పాఠశాలను కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా.. గుర్తింపు లేదంటూ రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పేదల పాఠశాలను కూలగొట్టారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పాఠశాలను పడగొట్టడం సరికాదని చైల్డ్‌ రైట్స్ ప్రొటెక్షన్‌ కమిషన్ సభ్యులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. ఉన్నతాధికారులు స్పందించి పేద పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా.. బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రత్యామ్నాయంగా సమీప ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరోసారి దయానిధి మారన్ ను ప్రశ్నించనున్న సీబీఐ

ఢిల్లీ: దయానిధి మారన్ ను మరోసారి సీబీఐ ప్రశ్నించనుంది. నిన్న ఏడు గంటలపాటు మారన్ ను సీబీఐ ప్రశ్నించింది.

11:26 - July 2, 2015

గుంటూరు : నిన్నటి వరకు గుంటూరు తెలుగు తమ్ముళ్లు కాలర్‌ ఎగరేసి తిరిగారు. ప్రస్తుతం తమ్ముళ్లు కాస్తా తలలు పట్టుకుంటున్నారు. మీరు కల్పించుకోకుంటే తీరని నష్టం జరుగుతుందంటూ అధినేత దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు. తెలుగుదేశం గ్రూపు తగాదాలతో రగిలిపోతోంది. సమన్వయంతో పనిచేయాల్సిన పార్టీ నేతలు వర్గ రాజకీయాలతో తలలు పట్టుకుంటున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయకుండా ఈ తగాదాలతోనే సరిపోతోందని వాపోతున్నారు.
హవా నడిపిస్తున్న కోడెల, పత్తిపాటి..
అన్ని జిల్లాలలాగానే గుంటూరు జిల్లాలో కూడా టిడిపిలో గ్రూపు రాజకీయాలకు కొదవలేదు. స్పీకర్ కోడెలశివ ప్రసాద్‌, మంత్రి పత్తిపాటి పుల్లారావు పార్టీ అధికారంలోకి రాకముందు,వచ్చిన తర్వాత హవా నడిపిస్తున్నారు. కోడెలకు స్పీకర్ పదవి వచ్చిన తర్వాత తన ప్రత్యర్ధి వర్గమంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ కోడెల మాత్రం రాజకీయాలను, నర్సరావుపేటతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గాల బాధ్యతలను ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణకు అప్పగించారు. దీంతో శివరామకృష్ణ ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అధికార,అనధికార కార్యక్రమాలను అన్నీ తానై నడిపిస్తున్నారు.
ఇది పార్టీకి తీరని నష్టమని ఫిర్యాదులు..
ఇదే ఇప్పుడు కోడెల ప్రత్యర్ధి వర్గానికి కంటగింపుగా మారింది. కోడెల కుమారుడు అన్నింట్లో తలదూరుస్తున్నారని, ట్రాన్స్ ఫర్ల నుంచి పోలీస్‌ స్టేషన్‌ సెటిల్‌మెంట్ల వరకు అన్నింట్లో తలదూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే జరిగితే పార్టీకి గడ్డుకాలమని మంత్రి పత్తిపాటి పుల్లారావుతో పాటు అధినేత చంద్రబాబు వద్దకు కూడా వెళ్లి వాపోయినట్లు సమాచారం. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పత్తిపాటి పుల్లారావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శివరామకృష్ణ లోకేష్‌కు సన్నిహితంగా మెలుగుతుండటంతో చంద్రబాబు కూడా డెసిషన్ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.అయినా కోడెల వైరి వర్గం మాత్రం శివరామకృష్ణ దూకుడుకు కళ్లెం వేయాల్సిందేనని పట్టుపడుతున్నట్లు పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నాయి.
అయితే కోడెల వర్గం మాత్రం ప్రత్యర్ధుల ఆరోపణలను కొట్టి పారేస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో కోడెల ఉండటం మూలాన, క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఆయన తనయుడు శివరామకృష్ణకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఓర్వలేకనే, కడుపుమంటతో ప్రత్యర్ధులు అనవసర ఆరోపణలకు దిగుతున్నారని మండిపడుతున్నారు.

కేంద్ర సహాయమంత్రి రిజుజు కోసం విమానం నిలిపివేత

ఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజుజు కోసం ఎయిర్ ఇండియా సిబ్బంది గంటపాటు విమానాన్ని నిలిపివేశారు. కేంద్రమంత్రి కోసం విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులను ఎయిర్ ఇండియా సిబ్బంది దింపి వేసింది. కేంద్రమంత్రి, ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

1031 హెల్ప్ లైన్ అంశంలో ఎలాంటి సమాచారం లేదు - బీజేపీ..

ఢిల్లీ : 1031హెల్ప్ లైన్ వ్యయానికి సంబంధించిన అంశాలు ఏవీ లేవని ఆర్టీఐ సూచిస్తోందని బీజేపీ నేత హరీష్ ఖురానా ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

హోటల్ లో చైనా బృందంతో సీఆర్డీఏ కమిషనర్, కలెక్టర్ భేటీ..

విజయవాడ : చైనా బృందంతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబులు ఓ హోటల్ లో సమావేశమయ్యారు. రాజధాని ప్రాంతంలో చైనా బృందం పర్యటించనుంది. 

మహబూబ్ నగర్ లో పనగరియా..

మహబూబ్ నగర్ : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా జిల్లాకు చేరుకున్నారు. కొత్తూరు (మం) నందిగామలో మిషన్ కాకతీయ పనులను ఆయన పరిశీలించారు. 

సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న మారన్..

ఢిల్లీ : మాజీ మంత్రి దయానిది మారన్ సీబీఐ ప్రధాన కార్యలయానికి చేరుకున్నారు. రెండో రోజు ఆయన్ను సీబీఐ అధికారులు విచారించనున్నారు. 

మోడీ మౌనం వీడాలి - పీఎల్ పునియా..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి మోడీ మౌనం వీడాయాలని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మోడీ స్టాండ్ తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. 

గురువారం రాష్ట్రపతి షెడ్యూల్..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పలువురు కలువనున్నారు. మధ్యాహ్నాం 12.30 గంటలకు గవర్నర్ నరసింహన్ కలువనున్నారు. ఒంటి గంటకు మిలటరీ అధికారులు...1.15 గంటలకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.

 

10:15 - July 2, 2015

రాజమండ్రి : జులై 14...తెలుగు రాష్ట్రాల్లో పావన గోదావరి తీరంలో పుష్కరాలు ప్రారంభమయ్యే రోజు. సర్వపాపహరణి.. గోదావరి పుష్కరిణి. ఆ నదీమ తల్లికి పుష్కర పుణ్య ఘడియలు వచ్చాయంటే యావత్ భారతావనే దక్షిణ గంగలో మునకేసేందుకు పరితపిస్తుంది. అలౌకిక ఆనందం పొందేందుకు గోదారి తీరానికి పరుగులు తీస్తుంది. ఈ క్రతువులో పాలుపంచుకోలేని భక్తుల కోసం తపాలశాఖ పుష్కర జలాభిషేకం చేసేందుకు ముందుకు వచ్చింది. దేశం నలుమూలలతో పాటు, ఖండాతరాలకు పుష్కర జలం పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది.
తపాల శాఖ సరికొత్త ప్రయోగం...
చారిత్రక రాజమండ్రి నగరం గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ పుష్కర స్నానాలు చేసేందుకు ఏపీ నుంచే కాకుండా.. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, కర్నాటక, మహరాష్ట్ర, ఒడిషా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలతో పాటు అటు ఉత్తర భారతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. పుష్కర స్నానాలకు గోదారి తీరానికి రాలేని భక్తులకు, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళిన భారతీయుల ఇంటి ముంగిటకు పావన పుష్కర జలాలను చేరవేసే విధంగా తపాలశాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెండు తెలుగురాష్ట్రాల్లోని హెడ్ పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసులు, తపాలా బ్రాంచి కార్యాలయాల్లోనూ అరలీటరు పుష్కర జలాన్ని ఇంటికి అందజేసేలా ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వారే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల్లో నివసించే వారు పుష్కర జలం కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇప్పటికే ఈ ముందస్తు బుకింగ్ విధానంలో 6లక్షల 64వేలకు పైగా పుష్కర జలాలకోసం తపాలకార్యాలయాల్లో, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు చేసుకున్నారు. అరలీటరు బాటిల్‌లో నింపిన పుష్కర జలాన్ని పోస్ట్‌మెన్ ఇంటికి చేర్చడానికి 20రూపాయలు చెల్లించాలని తపాలశాఖ అధికారులు చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారికి, విదేశాల్లో నివాసమున్న వారికైతే దూరభారాన్ని బట్టి అదనపు పోస్టల్ సొమ్మును వసూలు చేస్తారు.
అరలీటర్ బాటిల్...
ఇక పుష్కరాలు ప్రారంభమయ్యే జులై 14 నుంచి 12 రోజులపాటు తపాలశాఖకు పుష్కరజలాలను సీసాల్లో నింపుకునేలా కడియం మండలం వేమగిరిలో ఒక ఘాట్‌ను కేటాయించారు. అరలీటరు బాటిల్‌లో 12 రోజుల పాటు ఈ పుష్కర నీటిని నింపుతారు. పుష్కర నీటిని శుద్దిచేసి తపాలశాఖ కార్యాలయానికి అప్పగించే కాంట్రాక్ట్‌ను సఫైర్ వాటర్ కంపెనీ సంస్ధ పొందింది. గోదావరి నీటిని సరిగా శుద్దిచేస్తున్నది లేనిదీ తపాలాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు.
7.50 లక్షల బుకింగ్ లక్ష్యం..
పుష్కర జలాలను యావత్ భారతావనితో పాటు, ఖండతరాలకు సరైన సమయానికి చేర్చాలని తపాలశాఖ అధికారులు ముందస్తు వ్యూహంతో రంగంతోకి దిగుతున్నారు. పుష్కరాలు ప్రారంభం నాటికి తపాలశాఖ టార్గెట్‌గా పెట్టుకున్న 7.50 లక్షల బుకింగ్ లక్ష్యాన్ని దాటతామనే అంచనాతో అధికారులు ఉన్నారు. మొత్తంగా పుష్కర పావన జలాలు తపాలశాఖ సరికొత్త ప్రణాళికతో భక్తకోటి వాకిలిని పునీతం చేయనుంది.

10:09 - July 2, 2015

భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లకు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లను కేటాయించింది. కుంభమేళ తరహాలో పుష్కరాలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. కానీ ప్రభుత్వం ఒకటి తలిస్తే మరొకటి అవుతోంది. నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం పుష్కర ఘాట్లపై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అప్పటికే అక్కడ ఉన్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై పరుగులు తీశారు. సుమారు 200 మీటర్ల వరకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పుష్కరాల కోసం ఈ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లోనే విద్యుత్ స్తంభాలు నేలకొరగడం పట్ల యాత్రికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్రమాలు..నాసిరకమైన పనులు జరుగుతుండడానికి ఇదే నిదర్శనమంటున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాసిరకంగా పనులు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే బీఎస్ ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయాయి. 

రైలు కింద పడి తల్లి..ఇద్దరు పిల్లల ఆత్మహత్య..

గుంటూరు : బాపట్లలో ఇద్దరు పిల్లలతో తల్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు చెరువుజమ్ముపాలెం వాసులుగా తెలుస్తోంది.

 

పుష్కరఘాట్ల వద్ద కూలిన విద్యుత్ స్తంభాలు..

ఖమ్మం : భద్రాచలం పుష్కరఘాట్ల వద్ద విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీనితో విద్యుత్ తీగలు తెగిపడడంతో యాత్రికులు భయంతో పరుగులు తీశారు. నాసిరకం పనులపై యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పుష్కర ఏర్పాట్లపై బాబు సమీక్ష..

తూర్పుగోదావరి : రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం బాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, చిన రాజప్ప, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 

శుక్రవారం కర్నూలు జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక..

కర్నూలు :జిల్లాలో శుక్రవారం స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాన్ని చేజిక్కించుకొనేందుకు అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీ వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..విరిగిపడుతున్న కొండచరియలు..

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హల్ద్వానీ - రామ్ నగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. 

మల్కన్ గిరిలో భద్రత కట్టుదిట్టం..

ఒడిశా : మావోయిస్టులు నిరసన వారం తెలుపుతుండడంతో పలు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రీన హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు నిరసన వారంకు పిలుపునివ్వడంతో మల్కన్ గిరి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

09:28 - July 2, 2015

హైదరాబాద్ : ఏపీ జెన్‌కోలో విదేశీ బొగ్గు స్కామ్‌ కొనసాగుతోంది. టెండర్‌ గడువు ముగిసినప్పటికీ కొత్త టెండర్లు పిలవకుండా పాతవారినే కొనసాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతోంది. దీంతో ప్రజలపై ఛార్జీల భారం పడుతోంది. ఒకపక్క ప్రభుత్వ పెద్దలు.. మరోపక్క విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలోని ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో గత రెండేళ్లుగా ఈ భారీ స్కామ్‌ కొనసాగుతూనే ఉంది.
రెండేళ్లు గడిచినా టెండర్లు పిలవని ఏపీ జెన్‌కో..
థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనికిగాను 2013 జూన్‌ 28న టెండర్లు పిలిచారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ మార్కెటింగ్‌ ఏజెన్సీలైన పీఈసీ, ఎంఎస్సీ టిసి లిమిటెడ్‌ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం 2013 డిసెంబర్‌ వరకు బొగ్గును సరఫరా చేయాలి. కానీ టెండర్‌ గడువు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా నూతన టెండర్లు పిలవకుండా ఇంకా అవే సంస్థల నుండి ఏపీ జెన్‌కో బొగ్గును కొనుగోలు చేస్తోంది.
పిఇసి, ఎంఎస్ టిసి కంపెనీల నుంచి కమీషన్లు..
ఇక 2013 డిసెంబర్‌ తర్వాత ఏపీ జెన్‌కో 2014లో రెండుసార్లు టెండర్లు పిలిచినా అందులో ఆచరణ సాధ్యం కాని నిబంధనలు పెట్టడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకురాలేదనే ఆరోపణలున్నాయి. అంతేగాక పీఈసీ, ఎంఎస్‌టీసీ కంపెనీల నుంచి ఏపీ జెన్‌కోలోని ఉన్నతాధికారులు కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్లే వేరే కంపెనీలకు టెండర్లు దక్కకుండా చూస్తున్నారని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఎంతో నష్టం చేకూరుతుందంటున్నారు. ఈ వ్యవహారంపై గతంలో పాలకులపై ప్రతిపక్ష నేతలు అనేక ఆరోపణలు చేశారని వారంటున్నారు.
ప్రభుత్వానికి 500 కోట్లు నష్టం ?..
ఇక గత రెండేళ్లుగా ఏపీ జెన్‌కో వాస్తవ ధర కంటే అధిక ధరకు బొగ్గును కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. 2013లో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసుకున్న సమయంలో టన్ను బొగ్గు ధర 69.15 డాలర్లుగా ఉంది. 2014 నుండి ఆ ధర తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం బొగ్గు టన్ను విలువ 52.40 డాలర్లుగా ఉన్నప్పటికీ ఏపీ జెన్‌కో పాత ధర ప్రకారమే 69.15 డాలర్లు చెల్లిస్తుందనే ఆరోపణలున్నాయి. అంతేగాకుండా.. వాస్తవ వినియోగం కంటే ఎక్కువ బొగ్గును దిగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రాష్ట్రంలో బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వంలోని పెద్దలు, జెన్‌కోలోని కొందరు అధికారులు కుమ్మక్కై విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అక్రమాలపై విచారణ జరిపించాలి...
గత రెండేళ్ల నుంచి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి బొగ్గును దిగుమతి చేసుకుంటే దాదాపు 500 కోట్ల రూపాయల మేర ఖర్చు తగ్గేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి దుబారా ఖర్చుల ప్రభావం ప్రజలపై పడుతోంది. సంస్థకు వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని విద్యుత్‌ రంగ నిపుణులంటున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఏపీ విద్యుత్‌ రెగ్యులేషన్‌ కమిషన్‌ కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ స్కామ్‌ కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని విద్యుత్‌ రంగ నిపుణులు కోరుతున్నారు. 

టి.ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న సీతానగరం గ్రామస్తులు..

పశ్చిమగోదావరి : చింతలపూడి (మం) సీతానగరంలో గ్రామస్తులు తెలంగాణ ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఏపీ విద్యార్థుల బస్ పాస్ లు అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. 

నేడు కేబినెట్ వివరాలు తెలియచేయనున్న కేంద్ర మంత్రులు..

ఢిల్లీ : కేబినెట్ తీసుకున్న వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ లు మీడియాకు తెలియచేయనున్నారు. ఉదయం 11.00గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

భార్యను బంధించి భర్త అపహరణ..ఆపై హత్య..

మెదక్ : జిల్లాలోని చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు భార్యను బంధించి భర్తను అపహరించుకపోయారు. అనంతరం అతడిని హత్య చేసి ఇంటి ఎదుట పడేసి వెళ్లిపోయారు. 

రాజమండ్రిలో ఏపీ మంత్రి నారాయణ..

రాజమండ్రి : ఏపీ మంత్రి నారాయణ రాజమండ్రిలో పర్యటించారు. మంచినీటి సరఫరాపై సీవీ మార్కెట్ లో ప్రజల అభిప్రాయాలు సేకరించారు. 

శంషాబాద్ లో మూడు కిలోల బంగారం స్వాధీనం..

రంగారెడ్డి : శంషాబాద్ విమానాశ్రయంలో మూడు కిలోల బంగారాన్ని కస్టమ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో ఓ ప్రయాణీకుడి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

08:34 - July 2, 2015

అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడాల్సిందేనని ద హాన్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్ గద్దె దించేంతవరకు పోరాడుతానని టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆవేశ పూరితంగా ప్రసంగించారు. మరోవైపు డీఎస్ టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేప్ కేసులలో నిందితులు..బాధితుల మధ్య రాజీ ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ అంశాలపై టెన్ టివి గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..
''ఆకర్షించే విధంగా కొంతమంది నేతలు మాట్లాడుతుంటారు. పవర్ ఫుల్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రచారంలో ఒక భాగం. టిఆర్ఎస్ - టిడిపి మధ్య జరుగుతున్న సంకుల సమరంలో ఇదంతా జరుగుతోంది. రేవంత్ విడుదల సందర్భంగా టిడిపి వ్యూహాత్మకంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ లా చేసింది. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల వల్ల టిడిపిలో ఉత్సాహం కలిగించవచ్చు. రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు ఏమీ లేవు. రాజకీయాల్లో సానిహిత్యం ఉండదు. డీఎస్ సుదీర్ఘ పదవులు అనుభవించారు. ఆయన సూచించిన అభ్యర్థికే కేటాయించినట్లు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. రాజకీయంగా అవకాశవాదంగా చేర్చుకుంటారో అదే అవకాశవాదం కారణంగా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు విలువలు లేవు. వ్యక్తులకు విలువలు లేవు. ఎప్పుడైనా చేర్చుకుంటున్నారు. 
డిజిటల్ ఇండియా ప్రారంభం..
భారతదేశంలో సాంకేతిక విప్లవం తీసుకొస్తానంటే స్వాగతించాల్సిందే. జీవన విధాన స్వరూప స్వభావాలను మార్చవేయనుంది. రిలయెన్స్ ఇండస్ట్రీ వారు శాసించేస్థాయికి వస్తున్నారు. ప్రైవేటీకరణను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఉండాలి. డిజిటల్ డివైడ్ లో వర్గ విబేధాలు తొలగించాలి.
అత్యాచారాలపై సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించదగినదే. పరిస్థితుల రీత్యా..సమాజం బెదిరించడం వల్ల..ఇతరత్రా కారణాల వల్ల ఒప్పుకోవచ్చు. అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష పడాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు''. 

07:55 - July 2, 2015

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని రాజకీయాల నుండి తరిమికొడుతానని ఓటుకు నోటు కేసులో జైలు నుండి విడుదలైన టిటిడిపి ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలో రేవంత్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. మరో వైపు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం ఇచ్చిన బంద్ విజయవంతమైంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో చిలకమర్రి నర్సింహ (టీఆర్ఎస్), శ్రీరాములు (టిడిపి), శ్రీధర్ రెడ్డి (బీజేపీ), వకులా భరణం కృష్ణ మోహన్ (కాంగ్రెస్), పిన్నమనేని మురళీ కృష్ణ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు.

అమర్ నాథ్ యాత్రకు రెండో బ్యాచ్..

జమ్మూ : అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే ఒక బ్యాచ్ యాత్రకు వెళ్లగా గురువారం రెండో బ్యాచ్ యాత్రకు బయలుదేరి వెళ్లింది. 

నేడు మీడియా ఎదుట డీఎస్..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డి.శ్రీనివాస్ నేడు మీడియా ముందుకు రానున్నారు. ఉదయం 11.30గంటలకు మీడియా సమావేశంలో రాజీనామాకు దారి తీసిన పరిణామాలు వెల్లడించనున్నట్లు సమాచారం. 

సదాశివపేట మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం...

మెదక్: జిల్లా సదాశివపేట మార్కెట్ యార్డ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి గోడౌన్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 3 కోట్ల విలువ చేసే పత్తి దగ్ధమైనట్లు సమాచారం. 

తిరుమలలో అతి సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ..

చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

నేడు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం..

ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు జరగనుంది. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి తెలిపారు.

 

07:07 - July 2, 2015

తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలోకి దిగారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు పంచాయితీ కార్మికులు పెడుతున్న డిమాండ్సేమిటి? గతంలో వీరికి ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలుతీరు ఎలా వుంది? ఈ అంశంపై జనపథంలో సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్‌, ఐఎఫ్‌టీయూ నేత ఎస్‌ఎల్‌ పద్మ మాట్లాడారు.

07:05 - July 2, 2015

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లయినా గ్రామపంచాయితీలలో ఇంకా వెట్టి చాకిరీ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ కష్టాలు తప్పడం లేదు. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. ఈ రోజుల్లో కూడా అయిదు వందలు వెయ్యి రూపాయల జీతాలతో సరిపెడుతున్నారంటే దానిని వెట్టి చాకిరీ అనక మరేమంటారు? గ్రామ పంచాయితీలలో విభిన్న రకాల విధులు నిర్వర్తించే సిబ్బంది వుంటారు. నీటి సరఫరా, వీధి లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, బిల్లుల వసూళ్లు ఇలా వివిధ రకాల బాధ్యతల నిర్వహణలో ఈ సిబ్బంది తలమునకలై వుంటారు. ఇతర ఉద్యోగుల మాదిరిగా వీరికి నిర్ణీత పని వేళలంటూ వుండవు. ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తే అక్కడకు ఉరకాల్సిందే. మంచినీటి సరఫరా విభాగంలో పనిచేసేవారి బాధలు వర్ణణాతీతం. గ్రామాల్లో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంట్‌ వచ్చిన్నప్పుడల్లా ట్యాంక్‌లు నింపేందుకు ఉరకాలి. కరెంట్‌ పోయిన్నప్పుడల్లా అది వచ్చే దాకా ట్యాంక్‌ల దగ్గరే కాపలాకాయాలి. పైప్‌లైన్‌లు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. నీటి సరఫరాలో లోపాలు సరిచేయడం కోసం వీధివీధి తిరగాలి. టైం ప్రకారం నీటి సరఫరా చేయలేకపోతే జనం అవస్థపడాల్సి వస్తుంది. విద్యుత్‌ సరఫరా విషయంలో ఎన్ని అవరోధాలున్నా టైమ్‌ ప్రకారం నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత వీరిదే.
పారిశుధ్యం ప్రమాదకరమైన వృత్తి..
ఇక పారిశుద్ధ్యం పని అత్యంత ప్రమాదకరమైన వృత్తి. గ్రామ పంచాయితీలలో పనిచేసేవారికి ఏవిధమైన రక్షా కవచాలుండవు. మాస్క్‌లుండవు. గ్లౌజులుండవు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఒక్కొక్కసారి చేతులతోనే ఎత్తిపారేయాల్సి వస్తుంది. తరచూ వీరికి చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. వీరు ఒక్కరోజు పనిచేయకపోయినా ఊరు ఊరంతా మురికికంపు కొడుతుంది.
రాజకీయ ఒత్తిళ్లు..
ఇక బిల్‌ కలెక్టర్లు, కారోబార్‌లు ఒకటినాలుగుసార్లు ఇల్లుఇల్లు తిరిగితే తప్ప వసూళ్లు పూర్తికాని పరిస్థితి. గ్రామాల్లో అత్యంత ఓపికతో సాగించాల్సిన వృత్తి ఇది. ఈ వృత్తిలో అత్యంత మానసిక ఒత్తిడి తప్పదు. ఇలా చెప్పుకుంటే పోతే, గ్రామ పంచాయితీలో పనిచేయడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. వీరి మీద స్థానిక రాజకీయాల ప్రభావమూ ఎక్కువే. అనుక్షణం రాజకీయ ఒత్తిళ్లుంటాయి. ఏమాత్రం ఉద్యోగ భద్రత వుండదు. సర్పంచ్‌లు మారిన్నప్పుడల్లా ఉద్యోగాలు పోతుంటాయి. సర్పంచ్‌కి కోపం వస్తే ఇంక అంతే సంగతి.
45వేల సిబ్బంది..
తెలంగాణ గ్రామపంచాయితీలలో దాదాపు 45 వేల మంది సిబ్బంది వుంటే అందులో 35వేలమంది టెంపరరీ బతుకులే. కనీసం కాంట్రాక్ట్‌ సిబ్బందికి వుండే రక్షణలు కూడా వీరికి వుండవు. వీరికిచ్చే జీతాలు నామమాత్రం. వీరిలో చాలామంది డిగ్రీ పీజీలు చేసినవారూ వున్నారు. మైనర్‌ గ్రామపంచాయితీలలో అయిదు, వందలు వెయ్యి రూపాయలు జీతాలు పొందుతున్న సిబ్బందే ఎక్కువ. రెండు మూడు వేల జీతం వస్తే అదే మహాభాగ్యం. మూడు వేలకు పైగా జీతం వున్నవారి సంఖ్య చాలా తక్కువ. పొద్దస్తమానం శ్రమపడ్డా దక్కుతున్న ఫలితమిదే. అవి కూడా నెలనెలా రావు. ఆరు నెలలకో, ఏడాదికోసారో ఇస్తుంటారు. గ్రామ పంచాయితీ ఆదాయం నుంచే వీరికి ఎడ్జస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వీరికి నయా పైసా ఇవ్వదు.
పర్మినెంట్ చేస్తారన్న ఆశ..
ఏదో ఒక రోజు తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తారన్న ఆశతోనే అనేక మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యేయేట్లు కూడా ఇంత తక్కువ జీతంతో సరిపెట్టుకుంటున్నారు. గ్రామాల్లోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి, ఎన్ని ఇబ్బందులున్నా వేళ ప్రకారం నీటి సరఫరా కొనసాగిస్తూ, వీధి దీపాల నిర్వహణలో అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తూ, బిల్లు వసూళ్లలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలను తీర్చడానికి, వారి బాధలు అవలోకించడానికి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రయత్నించాలి. 

07:01 - July 2, 2015

ఢిల్లీ : నేడు అంతర్జాతీయ క్రీడాపాత్రికేయుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంఘాలు స్పోర్ట్స్ జర్నలిస్టు డే..వేడుకలను ఘనంగా జరుపుకోడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడారంగానికి అసాధారణ సేవలు అందించిన ప్రముఖులను సత్కరించుకోబోతున్నాయి. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

06:57 - July 2, 2015

ఢిల్లీ : ఎన్డీఏ యూపీఏ అనే తేడా లేకుండా అందరినీ తన ట్వీట్లతో ఖంగారెత్తిస్తున్నాడు లలిత్‌ మోడీ. సుష్మా స్వరాజ్‌ తో మొదలైన లలిత్ గేట్‌ వ్యవహారం సుష్మా కుటుంబసభ్యులను, వసుంధర రాజే, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాలను తాకి వారందరినీ సంజాయిషీ ఇచ్చుకొనేలా చేసింది. తాజాగా ఆ లిస్టులో బీజేపీ యువ ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా చేరాడు. అంతేకాదు తనకు సహకరించిన సుష్మా భర్త స్వరాజ్‌ కౌషల్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చినట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న లలిత్‌ గేట్‌ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లలిత్‌ కు పోర్చుగల్‌ వెళ్లేందుకు సహకరించిన వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆరోపణలతో నిండా మునిగిపోయారు. ఇప్పుడు తాజాగా సుష్మా భర్త స్వరాజ్‌ కౌషల్‌కు లలిత్‌ మోడీ ఇచ్చిన ఓ బంపర్‌ ఆఫర్‌ విషయం వెలుగుచూసింది.
బయటపడ్డ స్వరాజ్‌ కౌషల్‌ ఆఫర్‌ లెటర్‌..
సుష్మా తనకు సహకరిస్తే అందుకు ప్రతిఫలంగా లలిత్‌మోడీ ఆమె భర్త స్వరాజ్‌ కౌషల్‌కు తన గ్రూపు కంపెనీల్లోని ఒక దానిలో డైరక్టర్‌ పదవి ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. ఈ విషయం లేఖ రూపంలో స్వరాజ్‌ కౌషల్‌ కు ఆఫర్‌ చేసినట్లు ఓ వార్తా సంస్థ బయటపెట్టింది. ఈ లేఖతో లలిత్ గేట్‌ కుంభకోణంలో సుష్మా మరింత ఇరుకున పడ్డారు. లలిత్‌ ఇచ్చిన ఆఫర్‌ విషయమై సుష్మా భర్త స్వరాజ్‌ కౌషల్‌ స్పందించారు. తాను లలిత్‌ మోడీకి గత 20 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నానని, ఇండో ఫిల్‌ బోర్డ్‌ కు తనను డైరక్టర్‌గా ఉండమని కోరారని తెలిపారు. తాను లలిత్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. కాగా ఇండోఫిల్‌ బోర్డు స్వరాజ్‌ కౌషల్‌కు తాము డైరక్టర్‌ పదవి ఆఫర్‌ను 2014 ఏప్రిల్‌ 15న చేసినట్లు తెలిపింది. దీంతో స్వరాజ్‌కౌషల్‌, లలిత్‌ మోడీ నడుమ క్విడ్‌ ప్రో కో సాగిందనే వార్తలు ఊపందుకున్నాయి.
వరుణ్ గాంధీని ట్వీట్లతో ఇరికించిన లలిత్‌ మోడీ..
ఇక వరుస ట్వీట్లతో రోజుకో పేరు బయట పెడుతున్న లలిత్‌ మోడీ ఈ సారి మాత్రం బీజేపీ యువ ఎంపీ వరుణ్‌ గాంధీ గురించి ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం లండన్‌లో తాను వరుణ్‌గాంధీని కలిశానని, కేసుల విషయమై తాను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దుతానని భరోసా సైతం ఇచ్చినట్లు లలిత్‌ చెప్పుకొచ్చారు.
సోనియా సోదరిని కలవమని లలిత్‌కు వరుణ్‌ సలహా..
అంతేకాదు తనను ఇటలీలో నివసిస్తున్న సోనియా సోదరిని కలవమని వరుణ్‌ సలహా ఇచ్చాడని లలిత్‌ ట్వీట్‌లో తెలిపాడు. తాను ఆమెని కలవగా తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేసేందుకు సోనియా ద్వారా వీలైన సహాయం చేస్తారని సోనియా సోదరి తెలిపిందని లలిత్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా అందుకు గానూ మొత్తం 60 మిలియన్‌ డాలర్లు డిమాండ్‌ చేసినట్లు తన ట్వీట్‌ లో లలిత్‌ మోడీ ఆరోపించారు.
లలిత్‌ ఆరోపణలు నిరాధారం - వరుణ్‌ గాంధీ..
ఇదిలా ఉంటే తనపై లలిత్‌ చేసిన ఆరోపణలను వరుణ్‌ ఖండించారు. మూడేళ్ల క్రితం తాను లలిత్‌ ను కలిసిన మాట వాస్తవమేనని తెలిపారు. కానీ లలిత్‌ ను కేసుల నుంచి బయట పడేసేందుకు తాను సోనియా ద్వారా సహాయం చేస్తాను అనే మాట అవాస్తవమని వరుణ్‌ అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సోనియా కుమార్తె ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రాలను సైతం లలిత్‌మోడీ తన ట్వీట్‌లతో ఇబ్బందుల పాలు చేశారు.  

06:35 - July 2, 2015

ఢిల్లీ : ఎన్డీఏ సర్కార్‌పై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వం విధానాలనే ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. యూపీఏ స్కాంలు బయటపడటానికి ఏడేళ్లు పడితే ఎన్డీఏ స్కాంలు వెలుగుచూడటానికి ఎక్కువ సమయం పట్టలేదన్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు కళంకిత మంత్రులు పదవుల్లో ఉండరాదన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఈసారి లలిత్ గేట్‌ వివాదం కుదిపేయనుందని సీతారాం ఏచూరి అన్నారు. సుష్మాస్వరాజ్, వసుంధర రాజే వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షాలన్నీ గళం వినిపించనున్నందున.. పార్లమెంట్ సమావేశాలు స్తంభించే అవకాశముందన్నారు. ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల పొత్తులు అన్న అంశంపై ఏచూరీ మాట్లాడారు. చట్ట వ్యవహారాల్లో పార్లమెంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వ తీరు చాలా ప్రమాదమకరమైందన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధులు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అవినీతి ఆరోపణలపై మోడీ స్పందించాలి..
అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమంటూ అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్‌...తన పార్టీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించాలన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు కచ్చితంగా పదవుల్లో ఉండరాదని చెప్పారు. లలిత్, సుష్మా, రాజే కేసుపై సమగ్ర విచారణ జరగాలని ఏఏ అంశాల్లో వారి ప్రమేయముందో అందరికీ తెలియాల్సిన అవసరముందన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్ధాయి విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
సంక్షోభంలో వ్యవసాయం..
మోదీ ఏడాది పాలనలో ధరలు చుక్కలనంటుతున్నాయన్న ఏచూరీ... ప్రజలపై ఎడా పెడా భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్థికాభివృద్ధికి పట్టుకొమ్మలైన మూడు రంగాలు తిరోగమనంవైపు నెట్టబడ్డాయన్నారు. వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో కూరుకోపోయిందన్నారు. భూ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ నివేదిక రైతులకు వ్యతిరేకంగా ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారాయన. కమిటీ నివేదిక రైతులకు అనుకూలంగా ఉంటే మద్దతిస్తామని.. లేకుంటే నిలదీస్తామని చెప్పారు. ల్యాండ్‌ బిల్లుకు వ్యతిరేకంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సాగిస్తున్న భూమి అధికార్ ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
సార్వత్రిక సమ్మెకు మద్దతు..
సెప్టెంబర్‌ 2న కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తున్నామన్నారు సీతారాం ఏచూరీ. ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్ట్‌ 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. మతోన్మాదులతో కేరళకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఏచూరీ డిమాండ్ చేశారు.

06:29 - July 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళ తరహాలో పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 14 నుంచి 25 వరకు జరిగే ఈ పుష్కరాలకు 2వేలకు పైగా ఆర్టీసీ బస్సులను, 84 రైళ్లను, రెండు హెలిక్యాప్టర్లను సిద్ధం చేసింది. 600 కోట్ల రూపాయలను పుష్కరాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందుకోసం 106 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తోంది. భద్రత కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 18 వేల మంది పోలీసు బలగాలను రప్పిస్తోంది. వీటితో పాటు పుణ్య క్షేత్రాల్లో ఆధ్యాత్మిక, భక్తి కార్యాక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి ప్రవహించే నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో 106 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది. ఘాట్ల నిర్మాణం పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. పుణ్యక్షేత్రాలైన బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంలో ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.
ఏపీకి రూ.100 కోట్లు..తెలంగాణకు రూ.50 కోట్లే..
ఇక పుష్కరాల కోసం పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది. గతంలో వచ్చిన భక్తుల కంటే ఈసారి రెట్టింపు భక్తులు వస్తారని సర్కారు భావిస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. మరోవైపు పుష్కర ఏర్పాట్ల కోసం.. నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఏపీకి 100 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం 50 కోట్లే ఇచ్చిందని అన్నారు. తక్కువ నిధులు కేటాయించడం వివక్ష చూపడమేనన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి.

06:26 - July 2, 2015

రంగారెడ్డి : శుక్రవారం 'హరితహారం' కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ హరితహారం పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. శుక్రవారం నుంచి నాలుగురోజుల పాటు ఆరు జిల్లాల్లో కొనసాగనున్న కేసీఆర్‌ పర్యటన.. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో దైవ దర్శనం చేసుకుని మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఈనెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
చిలుకూరులో హరితహారం ప్రారంభం..
శుక్రవారం రోజున సీఎం కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా చిలుకూరులో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలుత బాలాజీ దేవాలయంలో దేవుడిని దర్శించుకుని అనంతరం మొక్కలు నాటనున్నారు. అక్కడినుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మేడిపల్లి, నారపల్లిలో కేసీఆర్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
4వ తేదీన మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన..
ఇక 4వ తేదీన మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ హరిత హారం కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తూంకుంట, షామీర్‌పేట, తుర్కపల్లి, సిద్దిపేట, మిట్టపల్లి, పాలమాకుల, బద్దిపడ్గా, బస్వాపూర్‌లలో కేసీఆర్‌ మొక్కలు నాటుతారు. అనంతరం కరీంనగర్‌ జిల్లాకు చేరుకుంటారు. హుస్నాబాద్‌, చిగురుమామిడి, కొత్తపల్లి, తిమ్మాపూర్‌లలో నిర్వహించే హరితహారంలో సీఎం పాల్గొంటారు. అదేరోజు రాత్రి ఎల్‌ఎండీ డ్యామ్‌ వద్ద కేసీఆర్‌ బస చేస్తారు.
5వ తేదీన కరీంనగర్‌ జిల్లా నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు..
ఇక 5వ తేదీన కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి, ధర్మారం మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటకు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి నేరుగా జన్నారం, కడెం, ఖానాపూర్‌, నిర్మల్‌లలో జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొంటారు. అదేరోజు రాత్రి నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో బస చేస్తారు. 6వ తేదీన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌, మోతే, ఆర్మూర్‌, నిజమాబాద్‌ అర్బన్‌, సదాశివనగర్‌, కామారెడ్డిలో పర్యటిస్తారు. ఆ తర్వాత మెదక్‌ జిల్లా రామాయంపేటలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్‌ మొక్కలు నాటుతారు. 

06:23 - July 2, 2015

విశాఖపట్టణం :వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు వైఎస్‌ జగన్‌ విశాఖపట్టణం చేరుకుంటారు. అక్కడినుంచి అచ్యుతాపురం చేరుకుని.. ఇటీవల ఓ ప్రైవేట్‌ వాహనం నదిలో పడి 22 మంది మృత్యువాతపడ్డ కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శిస్తారు. అనంతరం అచ్యుతాపురం నుంచి తునికి చేరుకుంటారు. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు పెరుమాళ్లపురం, హుకుంపేట మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపట్నం, రామన్నపాలెంలో ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. తొలిరోజు కాకినాడలో బస చేస్తారు.
మత్స్యకార కుటుంబాలకు పరామర్శ..
జులై 3న కాకినాడలోని పరాడపేట, ఉప్పలంక, పగడాలపేటలో మరో ఏడుగురు మత్స్యకార కుటుంబాలను జగన్‌ ఓదారుస్తారు. అదేరోజు రంపచోడవరం నియోజకవర్గంలోని సూరంపాలెం పెళ్లి బృందం ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఇక చివరోజైన 4వ తేదీన... పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి పొగాకు రైతులతో వైఎస్‌ జగన్‌ సమావేశమవుతారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అదేరోజు రాత్రి మూడు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారు. అయితే చాలా రోజుల తర్వాత జగన్‌ మరో పర్యటనకు శ్రీకారం చుట్టడంతో దాన్ని సక్సెస్‌ చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

06:21 - July 2, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన డీఎస్‌... ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగాలనుకున్నా పార్టీలోని పరిణామాలతో తప్పుకోవాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని లేఖలో వివరిస్తూ సోనియాకు ఫ్యాక్స్ చేశారు. కొందరు అసమర్థ నాయకుల వల్ల తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయామన్నారు. కొందరు స్వార్థపరుల ఫిర్యాదులతో తన వంటి నిజాయితీ పరులైన నాయకులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నేతకు టీపీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వడంతో చాలా నష్టపోయామన్నారు.
అవమానించారన్న డీఎస్..
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతగా అందరితో పాటు తాను ఎంతో ఒత్తిడిని, వ్యధను అనుభవించానన్నారు. రాష్ట్రం ఏర్పాటు ఆలస్యమవుతున్న కొద్దీ ప్రజల నుంచి నిరసనలు, తిరస్కరాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో జరిగిన జాప్యం తెలంగాణలో పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎన్నటికీ పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చిందన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన జానారెడ్డి, జీవన్‌ రెడ్డి వంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెట్టి... తన లాంటి సీనియర్లను అవమానించారన్నారు డీఎస్‌. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్నారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు మండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ ఇబ్బందులు పెట్టారని తెలిపారు. దిగ్విజయ్‌ సింగ్‌ తనపై కక్ష గట్టారని ధర్మపురి శ్రీనివాస్‌ వాపోయారు. పార్టీలో రాహుల్‌ గాంధీ శకం నడుస్తోందని...ఈ శకంలో రాజు, రావులదే హవా సాగుతోందన్నారు. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హృదయంతో పార్టీని విడుతున్నట్లు లేఖలో తెలిపారు డీఎస్.
తెలంగాణ ఉద్యమ ఘనత కేసీఆర్ కే..
14 ఏళ్లు పోరాడి తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు డీఎస్‌. అందుకే తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. విభజన జరిగినా ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు సాగుతుండటం ఇక్కడి ప్రజలకు ఇంకా సంపూర్ణ తెలంగాణ ఏర్పడలేదన్న భావన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు గట్టిగా పోరాడాల్సి ఉందన్నారు. 

06:16 - July 2, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమంటూ ఆవేశంతో ఊగిపోయారు. అవసరమైతే అలుపెరుగని పోరాటం చేస్తానన్నారు. కేసీఆర్ వస్తున్నా కాసుకో అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్‌ సహా ఆయన మంత్రివర్గంపై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలై ఇంటికి ర్యాలీగా బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై తిట్ల దండకం అందుకున్నారు. అడుగడుగుకు విమర్శలు గుప్పిస్తూ ముందుకు కదిలారు. కేసీఆర్‌ సర్కార్‌ తనపై కుట్రపూరితంగా కేసు పెట్టిందని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ తనపైనే ప్రయోగించి కేసులో ఇరికించారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను సీఎం గద్దె నుంచి దింపే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. 30 ఏళ్లు కేసీఆర్ మీదే పోరాటం చేసేందుకు రెడీ అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి...
సీఆర్‌ నిజంగా తెలంగాణ బిడ్డే అయితే టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. వారిని మళ్లీ గెలిపించుకోగలితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని... ఒక వేళ కేసీఆర్ ఓడిపోతే క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానన్న వ్యక్తి... పావురాల గుట్టలో పావురమై పోయాడంటూ పరోక్షంగా వైఎస్సార్‌నుద్దేశించి విమర్శించారు. ఇటీవల ఏలూరులో బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని అక్కడివారు తొక్కి చంపినట్లే కేసీఆర్ కుటుంబాన్ని కూడా తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి చేసే రోజు వస్తుందన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమికొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తానన్నారు.
అంతా బిల్డప్ అంటున్న గులాబీ దళం..
కేసీఆర్‌పై పాస్ పోర్టు కుంభకోణం కేసులు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. అప్పట్లో పోలీసులెక్కడ పట్టుకెళ్లిపోతారోనని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం 5.30కు బయల్దేరిన ర్యాలీ అర్ధరాత్రి తర్వాత రేవంత్‌ ఇంటికి చేరింది. మరోవైపు రేవంత్‌ రెడ్డి ఆరోపణలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఏం ఘనకార్యం చేసి రేవంత్ జైలుకు వెళ్లారో జనానికి తెలుసన్నారు. జైలుకు వెళ్లిన వారు పశ్చాత్తాపపడి బుద్ధి తెచ్చుకుంటారని... కానీ రేవంత్‌ నిర్దోషిలా బయటపడినట్లు బిల్డప్‌ ఇస్తున్నారని చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు కేవలం బెయిల్‌ మాత్రమే వచ్చిందని.. నిర్దోషిగా తీర్పు రాలేదని గుర్తుచేశారు.
టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో ?
ఇన్నాళ్లు జైలులో ఉండి కేసీఆర్‌ పాలనలో అవినీతిపై స్టడీ చేశానంటున్న రేవంత్‌..ఎలాంటి విషయాలు బయటపెడతారన్న ఆంశం ఆసక్తి రేపుతోంది. మరోవైపు రేవంత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో చూడాలి మరి. 

రేవంత్ బెయిల్ రద్దుకు రేడు సుప్రీంలో పిటిషన్..

ఢిల్లీ : ఓటకు నోటుకు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైదరాబాద్ హై కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ ను దాఖలు చేయనుంది. 

రేపు చేవెళ్లలో హరితహారం ప్రారంభం..

రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చిలుకూరులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణ రాష్ట్రానికి రానున్న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు..

హైదరాబాద్ : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా ఒక రోజు పర్యటనకోసం రాష్ట్రానికిరానున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు, ఫరూక్ నగర్ మండలాల్లో పనగరియా పర్యటిస్తారు. మధ్యాహ్నాం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. 

Don't Miss