Activities calendar

03 July 2015

కొమ్మూరు పాఠశాల హెచ్ ఎం సస్పెన్షన్

గుంటూరు: కొమ్మూరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. సహ ఉపాద్యాయుడు వివాహానికి పాఠశాలకు సెలవు ఇవ్వడం ఆమె పై చర్యలు తీసుకున్నారు.  

టీమిండియా నయాకోచ్ గా రవిశాస్త్రి?

హైదరాబాద్:టీమిండియా చీఫ్ కోచ్ ఎవరో ...జింబాబ్వే పర్యటన తర్వాతే తేలనుంది. ప్రస్తుతం టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్ గా జంటపాత్రలు పోషిస్తున్న మాజీ కెప్టెన్ రవిశాస్త్రి..పూర్తిస్థాయి కోచ్ గా పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయంటూ..క్రికెట్ వర్గాలలో ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్టుపై రవిశాస్త్రిని కోచ్ గా నియమించడానికి బిసిసిఐ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. జాన్ రైట్, గ్రెగ్ చాపెల్,గ్యారీ కిర్ స్టెన్, డంకన్ ఫ్లెచర్ లాంటి విదేశీకోచ్ ల తర్వాత...మేడిన్ ఇండియా క్రికెటర్ నే కోచ్ గా నియమించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది.

21:38 - July 3, 2015

హైదరాబాద్:కెనడియన్‌ ఓపెన్‌ డబుల్స్ టైటిల్‌ సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన భారత స్టార్‌ డబుల్స్‌ క్వీన్ గుత్తా జ్వాలను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి పద్మారావు సత్కరించారు. మహిళల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో ఎన్నో అరుదైన విజయాలు సాధించిన....జ్వాలకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సహకారాన్నందిస్తూనే ఉంటుందని మంత్రి పద్మారావు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సాహాన్నందించాలన్న మంచి ఉద్దేశ్యంతో సేవలందిస్తున్న మంత్రికి జ్వాల కృతజ్ఞతలు తెలిపింది. 

21:36 - July 3, 2015

హైదరాబాద్:టీమిండియా చీఫ్ కోచ్ ఎవరో ...జింబాబ్వే పర్యటన తర్వాతే తేలనుంది. ప్రస్తుతం టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్ గా జంటపాత్రలు పోషిస్తున్న మాజీ కెప్టెన్ రవిశాస్త్రి..పూర్తిస్థాయి కోచ్ గా పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయంటూ..క్రికెట్ వర్గాలలో ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్టుపై రవిశాస్త్రిని కోచ్ గా నియమించడానికి బిసిసిఐ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. జాన్ రైట్, గ్రెగ్ చాపెల్,గ్యారీ కిర్ స్టెన్, డంకన్ ఫ్లెచర్ లాంటి విదేశీకోచ్ ల తర్వాత...మేడిన్ ఇండియా క్రికెటర్ నే కోచ్ గా నియమించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ వ్యాఖ్యాతగా, టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి ఏడాదికి 5 కోట్ల రూపాయలకు పైగా ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తో ముగిసిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను టీమిండియా 1-2తో చేజార్చుకొన్న సమయంలో టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్ గా రవిశాస్త్రే వ్యవహరించాడు.

 

21:35 - July 3, 2015

ఢిల్లీ :జైలులో టార్చర్‌ మామూలుగా ఉండదని ప్రొఫెసర్‌ సాయిబాబా తను జైలు అనుభవాన్ని ప్రస్తావించారు. జైల్లో ఉన్న ఖైదీలను కొట్టడం, తిట్టడం, అవమానించడం సర్వసాధారణమన్నారు. అక్కడి టార్చర్‌ను తాను స్వయంగా చూడడం వల్ల తన ఆరోగ్యం పాడైందని చెప్పారు. ఓ మనిషి స్వేచ్ఛను ఎలా కోల్పోతారన్నది తాను స్వయంగా అనుభవించానని ప్రొఫెసర్‌ సాయిబాబా తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిజా నిజాలను కోర్టులోనే తేలుతుందన్నారు. కేసు నమోదు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్న ట్రాయల్‌ ప్రారంభించకుండా జైళ్లోనే ఉంచడం ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతోందన్నారు. నేను 14 నెలలుగా జైల్లో ఉన్నాను..ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలామంది జైలులోనే మగ్గుతున్నారని తెలిపారు. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ సాయిబాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనారోగ్యం కారణంగా బెయిలుపై బయటకు వచ్చారు.

21:34 - July 3, 2015

మధ్యప్రదేశ్: చదువుకోవాలన్నా...ఉద్యోగం చేయాలన్నా...బ్యాంక్ ఖాతా తెరవాలన్నా...సంక్షేమ పథకాలు అందాలన్నా...అన్నింటికీ ఆధార్‌ లింక్‌ తప్పనిసరైంది. అందుకే ఆధార్‌ కోసం ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని మహమ్మద్ అజాంఖాన్ కాస్త భిన్నంగా ఆలోచించాడు. ప్రభుత్వం ప్రతిదానికి ఆధార్‌ కార్డు అనుసంధానం తప్పనిసరి చేస్తుండటంతో... ప్రాణంగా చూసుకుంటోన్న పెంపుడు కుక్కకు కూడా అవసరమేమో అని భావించాడు. అనుకున్నదే తడువుగా దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు పరిశీలించిన అధికారులు ఆధార్ కార్డ్ జారి చేసేశారు. పైగా కుక్క పేరు టామీ సింగ్, తండ్రి పేరు షేరు సింగ్, పుట్టిన తేది 26-11-2009గా... వ్యక్తిగత వివరాలు పొందుపరిచి అందరికి లాగే... 12 అంకెల ఆధార్ కార్డ్ ఇచ్చేశారు. పైగా అజాంఖాన్‌ ఆధార్‌ కార్డుల నమోదు కేంద్రంలో పనిచేసే వ్యక్తి కావటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

21:33 - July 3, 2015

హైదరాబాద్: ఇందిరగాంధీ హయాంలో రాజకీయంగా పెను సంచలనాలకు కారకుడైన ఆమె కుమారుడు సంజయ్‌గాంధీపై సినిమా రూపొందించనున్నారు. జాతీయ అవార్డు పొందిన సినీ నిర్మాత హన్సల్‌ మెహతా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. వినోద్‌ మెహతా రాసిన 'ద సంజయ్‌ స్టోరీ' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలపై బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ రుద్దడానికి సంజయ్‌ గాంధే ప్రధాన కారకుడు. భారత ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీ జీవితం, మరణం ఓ మిస్టరీ అని దీన్ని ఛాలేంజ్‌గా తీసుకుని సినిమా తీయనున్నట్టు మెహతా పేర్కొన్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని వచ్చే యేడు ప్రారంభించనున్నారు. 

21:32 - July 3, 2015

ఢిల్లీ: ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని శాస్త్రిభవన్‌ ఎదుట విద్యార్థులు నిరసనకు దిగారు. గజేంద్ర చౌహాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కాషాయీకరణను ఆపాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన 2 వందల మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజెపికి చెందిన చౌహాన్‌ను ఫిలిం ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌గా చైర్మన్‌గా కేంద్రం నియమించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు గత 22 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గజేంద్ర చౌహాన్‌ 'మహాభారత్‌' సీరియల్‌లో పాండవ రాజు యుధిష్టరుడి పాత్ర పోషించాడు. ఈ అంశంపై కేంద్ర సమాచార ప్రసారశాఖ అధికారులతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు.

21:27 - July 3, 2015

శ్రీకాకుళం: జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. పోడియం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు వంశధార ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సభలో పరిస్థితి సద్ధుమణిగింది.

21:25 - July 3, 2015

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు వైసీపీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో పార్టీని ముందుకు న‌డిపించే నేతలు లేకపోవడం.. మ‌రికొన్ని జిల్లాల్లో పార్టీ మ‌రింత బ‌ల‌హీనంగా ఉండ‌టంపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. వాటిని స‌రిదిద్దేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో పార్టీ పటిష్టం చేయాలని యోచిస్తున్న అధ్యక్షడు జగన్‌.. ఉత్తరాంధ్ర మెద‌లు అన్ని జిల్లాల్లోను బలమైన నాయకుల కోసం ఆరా తీస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలతో పాటు.. రాజకీయ నిరుద్యోగులుగా ఉండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు.
దేవినేని నెహ్రూతో పాటు మ‌ల్లాది విష్ణును....
కృష్ణా జిల్లాలో ఇప్పటికే దేవినేని నెహ్రూతో పాటు మ‌ల్లాది విష్ణును పార్టీలోకి ఆహ్వానించారు. మ‌ల్లాది విష్ణుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌కవ‌ర్గం ఇస్తామ‌ని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇక దేవినేని నెహ్రూ ఎంట్రీపై పార్టీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. నెహ్రూ కుటుంబం పార్టీలోకి రావడాన్ని వంగ‌వీటి రాధా, కొడాలి నాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో 30 వేల కాపు సామాజిక ఓట్లు ఉండటంతో కొడాలి నాని కూడా వంగవీటికి ఈ విషయంలో మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేవినేని నెహ్రూ పార్టీలోకి రావ‌డం వల్ల పార్టీకి క‌లిగే లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌ని సీనియ‌ర్ నేత‌లు అంటున్నట్లు తెలుస్తోంది.
విశాఖలో వైసీపీకి చెప్పుకోద‌గిన నాయ‌కుడు లేరు...
ఇక విశాఖలో వైసీపీకి చెప్పుకోద‌గిన నాయ‌కుడు లేరు. కొణ‌తాల పార్టీని వీడిన త‌రువాత జిల్లాలో నాయ‌క‌త్వ లోపం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో పార్టీ ముఖ్యనేత విజ‌య‌సాయిరెడ్డి నేరుగా జిల్లా వ్యవ‌హారాల‌ను చూసుకుంటున్నారు. అయితే జిల్లా నుంచి పార్టీలోకి ఎవ‌రిని తీసుకు వ‌స్తే బాగుంటుంద‌నే దానిపై తీవ్రంగా చ‌ర్చిస్తున్నారు. కొణ‌తాల రామ‌కృష్ణను పార్టీలోకి తిరిగి తీసుకురావ‌డానికి ప్రయ‌త్నాలు చేస్తున్నా.. గండిబాబ్జీతో కలిసి రావడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉండ‌వ‌ల్లితో పాటు మరో ఇద్దరు.....
ఇక ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉండ‌వ‌ల్లితో పాటు మరో ఇద్దరు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నేత‌ల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మరి పార్టీ ప‌టిష్ట ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పార్టీకి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌తాయో వేచి చూడాలి.

21:23 - July 3, 2015

హైదరాబాద్:ఐఐటీ- జేఈఈ రాసిన తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. ఇంటర్ బోర్డు ద్వారా సమాచారం తీసుకుని... తక్షణమే ర్యాంకులు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈకి ధర్మాసనం సూచనలు చేసింది. 

21:21 - July 3, 2015

అనంతపురం: జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ఆయన.. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు.

21:20 - July 3, 2015

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అక్కడే కొందరికి మొక్కలు పంపిణీ చేశారు.. అంతకుముందు చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు కేసీఆర్..                                                              
హరితహారం ప్రభుత్వ కార్యక్రమం కాదు...
హరితహారం ప్రభుత్వ కార్యక్రమం కాదని.. ఇది ప్రజలదని చెప్పుకొచ్చారు టీసీఎం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితవనం చేయాలని కోరారు.. పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చెట్లను పెంచుకోవాలని సూచించారు..
భాగ్యనగర్‌లో మొక్కలు నాటిన కేసీఆర్...
అక్కడినుంచి రంగారెడ్డి జిల్లా నారపల్లికివెళ్లారు కేసీఆర్.. భాగ్యనగర్‌లో మొక్కలు నాటారు.. వాటికి నీళ్లు పోశారు.. ఎక్కడ ఖాళీఉంటే అక్కడ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.. సీఎం రాకతో చిలుకూరు, నారపల్లి సందడిగా మారాయి.. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..  

21:16 - July 3, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు ఎపిసోడ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. ఎపిసోడ్‌.. ఎపిసోడ్‌కు ఉత్కంఠను రేపుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేపుతోంది. జైలు నుంచి విడుదలకు హైకోర్టు లైన్ క్లియర్ చేస్తే.. తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. అయితే అక్కడా ఏసీబీకి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు రేవంత్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టివేసింది. మరి సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏసీబీ ఏంచేయబోతోంది? దూకుడుగా వ్యవహరిస్తుందా.. లేక ఎపిసోడ్‌కు బ్రేక్‌ ఇస్తుందా? ఇంతకీ ఏసీబీ తదుపరి సంచనాలేంటీ?
మల్లగుల్లాలు పడుతున్న ఏసీబీ .....
రేవంత్‌రెడ్డి బెయిల్‌ రద్దును అడ్డుకుని దూకుడుగా వ్యవహారించాలనుకున్న తెలంగాణ ఏసీబీకి.. దేశ సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. రేవంత్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఓటుకు నోటు కేసులో ముందుకెళ్లేందుకు ఏసీబీ ఇప్పుడు మల్లగుళ్లాలు పడుతోంది.
ఎలాంటి సంచలనాలు లేకుండానే....
ఎఫ్ఎస్ఎల్ తుది నివేదికలో కీలక సమాచారం ఉందని భావిస్తున్న ఏసీబీ.. తదుపరి ఎలాంటి సంచలనాలు లేకుండానే దర్యాప్తు కొనసాగించేలా కనిపిస్తుంది. అయితే చంద్రబాబు వాయిస్ రీ-రికార్డు చేయించడంలో మాత్రం వెనకడుగు వేయకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక పత్రాలను కోర్టు ద్వారా తీసుకున్న ఎలక్షన్ కమిషన్..
మరోవైపు ఏసీబీ దాఖలు చేసిన కీలక పత్రాలను కోర్టు ద్వారా తీసుకున్న ఎలక్షన్ కమిషన్.. కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో సాంకేతిక కారణాల వల్ల తిరస్కరించిన మెమోను ఈసారి అనుమతి ఇస్తూ.. అన్ని రాతపూర్వక డ్యాకుమెంట్లను అందజేశాయి. ఇందులో రేవంత్, స్టేబాస్టియన్, ఉదయ్ సింహాలు ఇచ్చిన కస్టడీ రిపోర్టులతో పాటు.. స్టిఫెన్ సన్, మార్కెంటేలర్, స్టిఫెన్ కూతురు ఇచ్చిన సీఆర్పీసి 164 స్టేట్‌మెంట్‌ను ఎలక్షన్ కమిషన్ కోర్టు ద్వారా తీసుకుంది.
సుప్రీంకోర్టు బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టివేసినా..
సుప్రీంకోర్టు బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టివేసినా.. ఏసీబీ మాత్రం ముందుకెళ్లాలని భావిస్తోంది. సుప్రీం తీర్పుతో ప్రస్తుతం సరైన ఆధారాలు లభించే అవకాశం ఉండదని భావిస్తున్న ఏసీబీ అధికారులు.. ఉన్న ఆధారాలతో చంద్రబాబు వాయిస్‌ రికార్డింగ్ చేయించేందుకు కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించాలని చూస్తున్నారు. అయితే త్వరలో చంద్రబాబు విదేశీ పర్యటన ఉంది. దీంతో తిరిగి వచ్చే సమయానికి చంద్రబాబును నేరుగా ఎఫ్ఎస్ఎల్‌కు తీసుకెళ్లేలా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని ఏసీబీ వ్యూహరచనలు చేస్తోంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌ ఏమవుతోందో చూడాలి.

ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్...

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ కోసం కేంద్రం ప్రకటించిన 'టార్గెట్ ఒలింపిక్ పోడియం 'పథకానికి గుత్తాజ్వాల, అశ్విని పొన్నప్పలను ఎంపిక చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా :ఒకరు మృతి

ప్రకాశం: త్రిపురాంతకం మండలం సిద్దన్న పాలెం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి.

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

అనంతపురం:భార్య హత్య కేసులో భర్త నిజాముద్దీన్‌కు గుత్తి కోర్టు జీవితఖైదు విధించింది. రూ.వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. 2013లో తాడిపత్రిలో భార్యపై నిజాముద్దీన్ కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశాడు. ఈ కేసులో కోర్టు నిజాముద్దీన్‌కు ‌జీవిత ఖైదే సరైన శిక్ష అని నిర్ణయించింది.

 

పుష్కరాలలో పరిశుద్ధ్యం కోసం నిధులు విడుదల...

హైదరాబాద్:ఈ నెల 14న ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల పనులు వేగవంతం అయ్యాయి. పుష్కరాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామీణ నీటి సరఫరా విభాగం రూ. 6.49 కోట్లు విడుదల చేసింది. 5 జిల్లాల్లో 42 ఘాట్లలో పారిశుద్ధ్య నిర్వహణ, మూత్రశాలల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.

బిజెపి జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జిగా పురంధేశ్వరి

న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరిని నియమించారు. కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇంఛార్జ్ గా మురళీధరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ గా సిద్ధార్థ్ నాథ్ సింగ్, తెలంగాణ ఇంఛార్జ్ గా కృష్ణదాసులను నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నియామకాలను ఖరారు చేశారు.

19:54 - July 3, 2015

విశాఖ: మున్సిపల్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు చెందిన అభ్యర్థులు...ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు తరలివచ్చారు. తొలి రోజు విశాఖ సిటీ, అనకాపల్లి సబ్ డివిజన్ ప్రాంతాలకు సంబంధించిన యువతకు టోకెన్ నంబర్లు అందజేశారు. 4న నర్సీపట్నం, పాడేరు, 5న శ్రీకాకుళం, 6న టెక్కటి సబ్ డివిజన్, 7న పాలకొండ, 8న విజయనగరం, 9న పార్వతీపురం, 10న పశ్చిమగోదావరి, యానం, 11న తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు టోకెన్లు జారీ చేస్తారు. తొలిరోజు ఆర్మీ సెలక్షన్స్‌కు అభ్యర్థులు భారీగా తరలిరావటంతో... విశాఖ మున్సిపల్ స్టేడియం సందడిగా మారింది.

19:52 - July 3, 2015

అనంతపురం: జిల్లా కదిరిలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. మరకత మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలోనే భారీ చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఆలయం వెనుక ద్వారం నుంచి ప్రవేశించి.. అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదు దొంగిలించారు. ఆలయ సిబ్బంది సమాచారం మేరకు... క్లూస్‌ టీం ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని మైసూరు పీఠాధిపతి సచ్చిదానంద స్వామిజీ నిర్మించారు.

 

19:50 - July 3, 2015

అనంతపురం: జిల్లా పుట్టపర్తిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్లపొదల్లో వేశారు దుర్మార్గులు. దీంతో చిన్నారి శరీరాన్ని చీమలు విపరీతంగా కుట్టాయి. శిశువు అరుపులు విన్న ఓ కానిస్టేబుల్‌... స్థానిక మహిళ సాయంతో... పాపను సత్యసాయి జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శరీరానికి చీమలు కుట్టడంతో.. ఒంటినిండా దద్దుర్లు వచ్చాయి. పాపను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. 

19:48 - July 3, 2015

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1087 ఓటర్లు ఉండగా.. 1080 ఓట్లు పోలయ్యాయి..
కర్నూలు జిల్లాలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా ముగిశాయి. కర్నూలు, ఆదోని, నంద్యాల పోలింగ్ కేంద్రాలలో మొత్తం 1087 ఓటర్లు ఉండగా.. 1080 ఓట్లు పోలయ్యాయి. నంద్యాలలో ఒకరు, కర్నూలులో ఒకరు, ఆదోనిలో ఐదుగురు మొత్తం ఏడుగురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా 99.67 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఫైర్.....
మరోవైపు.. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఫైర్ అయ్యారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిలు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులపై మండిపడ్డారు. నంద్యాలలో ఓట్ హక్కు వినియోగించుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, కూతరు అఖిల ప్రియ.. ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రం వద్ద ఉండటంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీనిపై అక్కడే ఉన్న భూమా నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, భూమాల మధ్య వాగ్వాదం జరిగింది. భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లాలో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ....
ప్రకాశం జిల్లాలో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. దీంతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ పడుతుండగా.. వైసీపీ నుంచి అభ్యర్ధి వెంకటేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే.. ఈనెల 7వ తేదీ వరకు ఆగాల్సిందే. 

19:44 - July 3, 2015

హైదరాబాద్: పేదలకు రాయితీల కోత విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ బిల్లులను ఆమోదించే ఎంపీలపై ప్రేమ మాత్రం టన్నుల కొద్దీ ప్రేమ కురిపిస్తోంది. పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ రేట్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడమే కాదు...ఇప్పుడు వారి జీతాన్ని డబుల్ చేయాలని భావిస్తోంది. శాలరీలు, పెన్షన్లతో పాటు అనేక సదుపాయాలు ఎంపీలకు కల్పించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసులు చేసింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే ప్రజాధనంతో ఎంపీలకు రాజభోగాలు మరింత పెరిగే అవకాశముంది. ఇదే అంశం పై 'హెడ్ లైన్ షో' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్, శ్రీధర్ రెడ్డి బిజెపి, టి.పీసీసీ నేత మహేష్ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:43 - July 3, 2015

పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, వసతుల పెంపుపై ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో జాయింట్ కమిటి వేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని నెలల నుంచి దీనిపై కసరత్తు చేస్తున్న కమిటీ దాదాపు 65 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుంచినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపాదనల్లో ఎంపీల జీతం డబుల్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. పెన్షన్ కూడా భారీగా పెంచాలని, విమానం, రైల్వే రాయితీలివ్వాలు మరింత కల్పించాలంటూ అనేక సిఫారసులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పార్లమెంటేరియన్లకు కూడా ఆటోమేటిక్ వేతన సవరణ యంత్రాంగముండాలని రికమండ్ చేసింది. ఈ సిఫారసులు ఆమోదం పొందితే..ప్రస్తుతం నెలకు 50 వేల రూపాయలున్న ఎంపీల జీతం లక్ష రూపాయలు కానుంది.
ఉచిత డొమెస్టిక్ విమాన ట్రిప్పులు ఏడాదికి 20 నుంచి 25 వరకు...
మాజీ ఎంపీల ఉచిత డొమెస్టిక్ విమాన ట్రిప్పులు ఏడాదికి 20 నుంచి 25 వరకు పెంచాలని కోరింది కమిటీ. పెన్షన్ కూడా నెలకు 20 వేల నుంచి 35 వేలకు పెరగాలని సిఫారసు చేసింది. ఇప్పటికే భార్యతో పాటు ఫ్రీ ఏసీ రైల్వే టికెట్ పొందుతున్న ఎంపీకి..తనతో పాటు వచ్చే మరొకరికి ఫ్రీటికెట్ ఇవ్వాలని తెలిపింది. పార్లమెంటు సమావేశాలకు హాజరైనందుకు ప్రతిరోజు ఎంపీలకిచ్చే రెండు వేల రూపాయలను కూడా క్రమంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది కమిటీ.
65 ప్రతిపాదనలపై కేంద్రం తర్జనభర్జనపడుతున్నట్టు తెలుస్తోంది....
యోగి ఆదిత్యనాథ్‌ ప్యానల్ సమర్పించిన 65 ప్రతిపాదనలపై కేంద్రం తర్జనభర్జనపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో 18 సిఫారసులకు ఒప్పుకోవడం లేదని, 15 వాటికి సమ్మతం కాదని, మరో మూడింటికి త్వరలో నిర్ణయిస్తామని, నాలుగు అంశాలకు ఇంతకు ముందున్న పద్దతి అనుసరించాలని కేంద్రం కమిటీకి చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఎంపీల జీతం 25 వేలు పెంచి మొత్తం 75 వేలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. యోగి ఆదిత్యనాథ్‌ కమిటీ జూలై 13న మరోసారి సమావేశమై ఫైనల్ రిపోర్ట్‌కు తుది మెరుగులు దిద్దాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఎంపీలకు రాయితీలపై ఇప్పటికే దుమారం....
పార్లమెంటు క్యాంటీన్లో ఎంపీలకు రాయితీలపై ఇప్పటికే దుమారం రేగుతోంది. ఇప్పుడు తాజాగా జీతభత్యాలు పెంచాలని పెంచాలని యోచిస్తున్న మోదీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్‌ క్యాంటీన్లో ఇడ్లీ రెండు రూపాయలు, దోశ ఆరు రూపాయలు, మటన్ కట్లేట్ 18 , ఫుల్ మిల్స్ పది రూపాయలకు ఎంపీలకు లభిస్తోంది. మొన్న మార్చిలో పార్లమెంటు క్యాంటీన్‌ కు ఆకస్మికంగా విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వెజిటేరియన్ తాలీ, ఫ్రూట్ సలాడ్ తిని చెల్లించిన మొత్తం కేవలం 24 రూపాయలు. క్యాంటీన్లో దొరికే ఆహారపదార్థాలు బయటితో పోల్చితే దాదాపు 80,90 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ రేట్లతో బయట సామాన్యులకు ఒక్క ప్లేట్ టిఫిన్ కూడా రాదు. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టంతో వివరాలు అడగడటంతోనే ఈ వివరాలన్నీ బహిర్గతమయ్యాయి.
క్యాంటీన్లో సబ్సిడీలకు ఖర్చయింది అక్షరాల 60 కోట్లు.....
గత ఐదేళ్లలో పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీలకు ఖర్చయింది అక్షరాల 60 కోట్లు. ధనవంతులైన ఎంపీలకు ప్రజాధనంతో రాయితీలు కల్పించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సబ్సిడీ రేట్లతో ప్రభుత్వమే క్యాంటీన్లు ప్రారంభిస్తే ఆకలి మరణాలు తగ్గుతాయని సూచిస్తున్నారు. కనీసం రెండు పూటలైనా కడుపారా భోజనం చేస్తారని చెబుతున్నారు.

ఒరిజనల్ టీఆర్ ఎస్ నేతలు తిరగబడాలి:శ్రవణ్

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ సేవలందిస్తున్న ఒరిజనల్ నేతలు తిరగబడాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తిరగబడితేనే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పదవులు దక్కకుండా ఉంటాయని అన్నారు. డీఎస్ తన ఆత్మను నమ్ముకుని టీఆర్ఎస్ లో చేరబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన ఒక కోవర్టు అని, అలాంటి వ్యక్తి పార్టీని వీడడం సంతోషంగా ఉందని శ్రవణ్ తెలిపారు. బీసీల కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని డీఎస్ చెప్పడం ఆత్మవంచనేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ లో దగా పడింది బీసీలేనని ఆయన స్పష్టం చేశారు.

చేతబడి చేశాడంటూ గొడ్డలితో నరికేశారు..

గుంటూరు: జిల్లాలో దారుణ జరిగింది. మాచర్ల మండలం తాళ్లపల్లిలో చేతబడి చేశాడంటూ ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కారును ఢీకొట్టిన లారీ:ముగ్గురు మృతి

కడప: రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద కారును లారీ ఢీ కొట్టడింది. ఈ ప్రమాదంలో ముగ్గు మృతి చెందారు. మరో ముగ్గు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈనెల 31న 'బ్లూమూన్'

హైదరాబాద్:జూలై నెలలో రెండు చందమామలు దర్శనమివ్వనున్నారు. సాధరణంగా ప్రతీనెలలో మనం ఒక చంద్రున్ని చూస్తుంటాం. కానీ ఈ జూలై నెలలో మనం రెండు చంద్రుల్లను చూడబోతున్నాం. జూలై 1న పున్నమి చంద్రుడిని చూశాం. మళ్లీ జూలై 31న రెండో చంద్రున్ని చూడబోతున్నాం. భౌగోళిక పరిభాషలో ఈ దృగ్విషయాన్ని ‘బ్లూమూన్’ అని పరిగణిస్తారు. ఒకే నెలలో రెండు పున్నమిలు వచ్చినపుడు ఇలా పేర్కొంటారు.

18:32 - July 3, 2015

కర్నూలు:వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన భూమాను త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. ఆయనపై 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యింది. భూమా అభిమానులు పీఎస్ వద్దకు భారీగా తరలి వచ్చారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. తనను టచ్ చేయవద్దంటూ భూమా పొగరుగా వ్యవహరించారని డీఎస్పీ దేవదానం పేర్కొన్నారు. అంతకుముందు, నంద్యాలలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగిరెడ్డి తనయ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పోలీసులు వెళ్లిపోవాలని కోరారు. ఆ సందర్భంగా ఆమెకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న నాగిరెడ్డి అక్కడికి చేరుకుని, తన కుమార్తెను వెళ్లమని చెప్పడానికి మీరెవరంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు.  

పాక్ లో కాలువలో పడ్డ రైలు: 17 మంది మృతి

హైదరాబాద్: పాకిస్థాన్ లోని వజీరాబాద్ లో రైలు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వంతెన దెబ్బతినడంతో రైలు అదుపు తప్పి కాలువలో పడిపోయిందని మిలటరీ అధికారులు తెలిపారు.

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు...

హైదరాబాద్:ఓటుకు నోలు కేసులో కీలక పరిణాలమాలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చేతికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కాపీ అందింది. ప్రిన్సిపల్ కోర్టు ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్లు పొందింది. ఈ కేసుకు సంబంధించిన కాల్ డేటాను కూడా ఎలక్షన్ కమిషన్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదిక పొందడానికి ఈసీ కోర్టును కోరనుంది. ఈ మొత్తం వ్యవహారం సోమవారంలోగా పూర్తి చేయాలని ఈసీ ప్రయత్నిస్తుంది. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం విధించే అవకాశం ఉంది.

వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అరెస్టు

కర్నూలు:వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. ఈ మేరకు ఆయన్ని అరెస్టు చేసి త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. భూమా అభిమానులు పీఎస్ వద్దకు భారీగా తరలి వచ్చారు.

 

 

టీ.ఎంసెట్ కౌన్సెలింగ్ లో స్వల్ మార్పులు...

హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 6వ తేదీకి బదులు 8వ తేదీ నుంచి ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ నెల 12న ఆప్షన్ల ఎంపికలో మార్పులకు అవకాశం ఉంది. ఈ నెల 15న విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేస్తారు. ఈ నెల 23, 24న రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ నెల 25న రెండో విడత కౌన్సెలింగ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించారు. ఈ నెల 28న రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

భూమా నాగిరెడ్డి ఇంటిని చుట్టు ముట్టిన పోలీసులు

కర్నూలు: వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై కేసు నమోదైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. తనను టచ్ చేయవద్దంటూ భూమా పొగరుగా వ్యవహరించారని డీఎస్పీ దేవదానం పేర్కొన్నారు. అంతకుముందు, నంద్యాలలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగిరెడ్డి తనయ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పోలీసులు వెళ్లిపోవాలని కోరారు. ఆ సందర్భంగా ఆమెకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది.

17:39 - July 3, 2015

హైదరాబాద్:తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు కేసీఆర్ కొత్త వాహనం సిద్ధమైంది. అత్యాధునిక సౌకర్యాలతో బస్సును సిద్ధం చేశారు. బస్సు లోపలికి వెళ్తే... ముఖ్యమంత్రి ఆఫీసులోకి వెళ్లినట్లే ఉంది. అందులో ప్రయాణానికి కావాల్సిన... అన్ని సౌకర్యాల్ని ఏర్నాటు చేశారు. బస్సులోనే ఉండి ఆఫీస్‌ను రన్ చేయగలిగే విధంగా అన్ని హంగుల్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ బస్సులోంచి వచ్చే హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రగతిరథం బస్సుకు యాదగిరిలో గుట్టలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సును తయారు చేశారు. ఈ బస్సు తయారీకి 5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని అధికారులు తెలిపారు. 

17:37 - July 3, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో...ముందునుండి అన్ని విషయాలు తెలిసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలిసారిగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదంటూనే కొన్ని కీలక వాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు కల సాకారమైందని, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ గా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఇక ప్రజలంతా దేశ అభివద్ధి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రణబ్.
హైదరాబాద్‌ కేవలం ఒక ప్రాంతానికో,రాష్ట్రానికో పరిమితిం చేసి చూడలేం....
అయితే దేశంలో తెలంగాణ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యమైందన్నారు రాష్ట్రపతి. అందులోనూ హైదరాబాద్ కేవలం ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితిం చేసి చూడలేమని చెప్పారు. ఐటీ టెక్నాలజీతో ఇది హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటిగా మారిపోయిందని, అంతకు మించి ఎడ్యూకేషన్ హబ్ అన్నారు. హైదరాబాద్ అభివద్ధి ఫలాలు దేశమంతటా విస్తరించాయని, అందుకే ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలూ ఉంటున్నారని వ్యాఖ్యానించారు.
పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేం....
తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని స్పష్టం చేశారు ప్రణబ్ ముఖర్జీ. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా...కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అన్నారు. అదే చరిత్ర చెప్పిన పాఠమని స్పష్టం చేశారు.
తెలుగు రాష్టాలకు దిశా నిర్దేశం...
మొత్తానికి మహారాష్ట్ర గవర్నర్ ఉనికి పుస్తక పరిచయ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్టాలకు దిశా నిర్దేశం చేశారు...ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. అయితే రాష్ట్రపతి సూచనతోనైనా ఇరు రాష్ట్రాధినేతలు మెల్కొంటారా...మళ్లీ పాత పద్దతుల్లోనే వ్యవహరిస్తారా అనేది ఆచరణలోనే చూడాలి.

17:34 - July 3, 2015


హైదరాబాద్:తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ కొనసాగుతునే ఉంది. ఎన్ని సీట్లు ఉంటాయో.. ఎన్ని కాలేజీలు రద్దు అవుతాయోననే అయోమయం నెలకొంది. 25 కాలేజీలను రద్దు చేసిన జెఎన్టీయూ.. సుమారు..40 వేల సీట్లకు కోత విధించింది. వసతులు లేని కాలేజీలకు కొన్ని కోర్స్ లను పూర్తిగా రద్దు చేసింది.                                                                       
తనీఖీల పేరుతో కాలేజీల్లో పర్యటించిన యూనివర్సీటీ బృందం..
తనీఖీల పేరుతో కాలేజీల్లో పర్యటించిన యూనివర్సీటీ బృందం.. కాలేజీ యాజమాన్యాలు తీరు మార్చుకోవాలని గతంలో పలు మార్లు చెప్పారు. మార్పు కనబడకపోవడంతో.. 25 కాలేజీల గుర్తింపు రద్దు చేసింది జెఎన్టీయూ..
హైకోర్టును ఆ్రశయించిన 25 కాలేజీల యాజమాన్యాలు....
అయితే 25 కాలేజీలు హై కోర్టును ఆశ్రయించాయి. కోర్సులను రద్దు చేసిన మరో 20 కాలేజీ యాజమాన్యాలు నేడు పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నాయి. కోర్టులో జెఎన్టీయూకు కాలేజీలను రద్దు చేసే అనుమతి లేదని ఇంజనీరింగ్ కాలేజీలు వాదనలు వినిపించాయి. ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం యూనివర్సీటికి రద్దు చేసే అవకాశం లేదని వాదించారు.అయితే సౌకర్యాలు లేని కాలేజీలకు ఎట్టిపరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించారు. జెఎన్టీయూకి కాలేజీల గుర్తింపు రద్దు చేసే అధికారాలు ఉన్నాయని .. గతంలో పలు సార్లు ఈ అంశం పై కోర్టులో విచారణ జరిగిందని వాదించారు.
కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో గందరగోళం....
మొత్తానికి ఇరు వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే జేఈఈ ప్రవేశాల్లో అయోమయం అవుతున్న విద్యార్ధులు 6 నుంచి ప్రారంభం అయ్యే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు ఎన్ని కాలేజీలకు ఆఫ్షన్స్ ఉన్నాయి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలా అనే టెన్షన్ కొనసాగుతునే ఉంది. 

17:30 - July 3, 2015

హైదరాబాద్: నిన్నటి దాకా ఏపీ తమ్ముళ్లంతా టార్గెట్ చేశారు. ఆయన పద్దతి బాలేదని పబ్లిక్‌లోనే ఫైరయ్యారు. పక్షపాత వైఖరిని మానుకోవాలని ఘాటుగా విమర్శించారు. ఇరురాష్ట్రాలను సమానంగా చూడాలని మండిపడ్డారు. ఇపుడు తాజాగా ఓ తెలంగాణ నేత గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే... పదవి నుంచి తప్పుకోండని పరోక్షంగా ఓ లేఖను సంధించారు.                                            
నేరుగా నరసింహన్‌కే ఓ లేఖ....
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ వైఖరిని టీ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ రాజ్యాంగేతర చర్యలకు గవర్నర్‌ కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవహార శైలిని నిశితంగా విమర్శిస్తూ... నేరుగా నరసింహన్‌కే ఓ లేఖ రాశారు.
తలసానిని మంత్రిగా కొనసాగించటంపై ఆగ్రహం...
ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను...కేబినెట్‌లో మంత్రిగా కొనసాగించటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్‌ ...సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. కానీ... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తలసాని చేత... మంత్రిగా మీరు ప్రమాణస్వీకారం చేయించారని దుయ్యబట్టారు. 2014 డిసెంబర్‌ 16న ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల తర్వాత కూడా ఆయన పదవిలో కొనసాగడం రాజ్యాంగ, చట్ట విరుద్ధమని మర్రి శశిధర్‌ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు.
పదో షెడ్యూల్‌లోని 2-ఎ ను టీఆర్ఎస్ ఉల్లంఘించింది:మర్రి....
రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పేరాగ్రాఫ్‌ (2)(ఎ)ను తలసానితోపాటు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఉల్లంఘించిందని శశిధర్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌గా మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్నారు. ఐనా తలసానిపై వేటు వేయకుండా....విధి నిర్వహణలో విఫలమయ్యారు.రాజ్యాంగ విలువలను, గౌరవాన్ని, నిబంధనలను కాపాడలేకపోయారని... తలసానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని గవర్నర్‌ తీరును నిరసించారు.
పదవిలోఉండాలో..వద్దో..మీరే నిర్ణయించుకోండి-మర్రి
టీఆర్‌ఎస్‌ అనైతిక, నీతిరహిత విధానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇందులో మీరు కూడా భాగస్వామి అయ్యారు. ఈ పరిస్థితుల్లో కళంకిత ముద్రతో.... మీరింకా గవర్నర్‌ పదవిలో ఉండాలా.. లేదా అనే నిర్ణయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను' అని మర్రి శశిధర్‌ రెడ్డి సూటిగా చెప్పారు.
గవర్నర్‌పైనా కోర్టులో రిట్ వేయవచ్చు:మర్రి
చివరగా ఒక మాటంటూ... ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీపైనా కోర్టులో రిట్‌ వేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీని మేరకు మీరు రాజ్యాంగ పదవిలో ఉండకూడదు'' అని తెలిపారు. తగిన చర్యలు తీసుకుని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించండి. లేనిపక్షంలో... మీ విధులను, బాధ్యతలను మీకు గుర్తు చేసేందుకు రాజ్యాంగపరమైన నిబంధనల మేరకు చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడను'' అంటూ మర్రి శశిధర్‌ రెడ్డి తన లేఖను ముగించారు.

రసాయన కర్మాగారంలో పేలుడు:ఆరుగురి మృతి

సియోల్ : దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నగరంలో ఉన్న హన్వా రసాయన పరిశ్రమలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. వ్యర్థ పదార్థాలను నిల్వ చేసిన ప్రదేశంలో వెల్డింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

నైజీరియాలో జంట పేలుళ్లు:ఏడుగురు మృతి

హైదరాబాద్: ఈశాన్య నైజీరియాలో జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఈ పేలుళ్లకు పాల్పడ్డారని స్థానిక భద్రతా దళ అధికారులు తెలిపారు. మలారీ గ్రా ప్రధాన రహదారిపై ఓ మహిళ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో 13 మందికి గాయాల్యయాయి. మైదుగురి జాతీయ రహదారి సమీపంలో రద్దీగా ఉన్న మార్కెట్లో మరో బాంబు పేలుడు సంభవించింది.

17:03 - July 3, 2015

హైదరాబాద్: నెలల పసికందు నుండి పండు ముదుసలి వరకు కామాంధుల ఆగడాలకు బలవుతున్నారు. అయిన వారే చిన్నారులపై తెగబడుతున్నారు. ఈ స్థితి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? పిల్లలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి నిర్భయలో డాక్టర్ సుధ సైక్రియాటిస్టు తెలియజేశారు. ఆ వివరాలను ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:00 - July 3, 2015

హైదరాబాద్:ఆడపిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు, జీన్స్ ధరించకూడదు, సోషల్ మీడియా వినియోగించకూడదంటూ రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాలోని గ్రామపంచాయితీ విధించిన ఆంక్షలను ఖండిస్తూ మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం పలుకుతున్నాం.
అత్యాచార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు.....
అత్యాచార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన కేసుకు సంబంధించి సుప్రీం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కారిడార్ లో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రత్యేక సేవలతో ముందుకొచ్చింది. వారి సౌకర్యం కోసం కొత్త యాప్ లను కూడా ప్రవేశపెట్టింది.
ఇంటి పనివారి కోసం కొత్త పథకం....
తెలంగాణ ప్రభుత్వం ఇంటి పనివారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉంది. వారికి గుర్తింపు కార్డులు జారీచేసి సామాజిక భద్రత కల్పించేందుకు అడుగులు వేయనుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం రిజర్వేషన్లను అమలు చేయనుంది. పోలీసు నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తోంది.
 

16:57 - July 3, 2015

హైదరాబాద్: ఫ్యాషన్ ను ఫాలో అవటంలో టీనేజర్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త దనాన్నీ కోరుకుంటారు. అలాంటి టీనేజర్స్ కోసం లాంగ్ ఫ్రాక్స్ తో ఇవాళ్టి సొగసు నారాయణ గూడలోని సనా క్రేజీ ఫ్యాషన్స్ మీ ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

రసాభాసగా మారిన భద్రాచలం ఎంపీపీ ఎన్నిక

ఖమ్మం:భద్రాచలం ఎంపీపీ ఎన్నిక రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌ నేతలు తమ పార్టీతో పాటు సీపీఐకి చెందిన సభ్యులను ప్రలోభ పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు.

ప్రకాశం, కర్నూలు జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్: ఏపీలోని ప్రకాశం, కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కర్నూలు జిల్లాలో 1087 ఓట్లకు గాను 1080 ఓట్లు పోలయ్యాయి. 99.67శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 76 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 992 ఓట్లకు గాను 755 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

16:46 - July 3, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత్య ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఒక మహాయజ్ఞమని సీఎం కేసీఆ అన్నారు. ఇవాళ ఆయన రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఇవాళ చిలుకూరు బాలాజీకి పూజలు చేసి స్వామి ఆశీస్సులతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. హరిహారం అంటే మనిషికి నాలుగు చెట్లు పెట్టుడు.. వాటిని సక్కగా సాదుడే... అంతకంటే ఏమీ లేదు. చాలా చిన్న పని.. కానీ దీనిలో చాలా మతలబు వుందన్నారరు.. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు... ప్రజా కార్యక్రమం అని తెలిపారు. హరితహారం అంటే తెలంగాణకు ఆకుపచ్చ చెట్ల దందా అని చెప్పారు. ఒక నియోజకవర్గానికి సంవత్సరానికి 40 కోట్ల మొక్కలు నాటాలని చెప్పారు.

16:39 - July 3, 2015

హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం... సర్వే బృందం భూ పరిశీలనకు వచ్చింది. వారిని బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమ భూముల్లోకి రావద్దంటూ అధికారులను అక్కడి నుంచి తరిమివేశారు. చీపుర్లు, కర్రలు పట్టుకొని సర్వే సిబ్బందిని ఊరిబయటకు వెళ్లగొట్టారు. మరోవైపు కారిగొల్లపేట గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి, తహశీల్దారతో గొడవకు దిగారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. లేకుంటే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

16:38 - July 3, 2015


హైదరాబాద్: పోలీసులకు వారాంతపు సెలవులు అందని ద్రాక్షగానే మిగిలింది. రోజుకు గంటల తరబడి విధులు నిర్వహించే పోలీసులకు.. ఒక్కరోజైనా సెలవు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీక్లీ ఆఫ్‌ కావాలని దశాబ్ధాల తరబడి అడుగుతున్నా.. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామని తెలంగాణ సర్కార్‌ హామీ ఇచ్చి ఏడాది గడిచినా.. అది ఇంకా అమలుకు నోచుకోలేదు.
పోలీసులను వెంటాడుతున్న కష్టాలు .....
నిత్యం ప్రజల భద్రత కోసం పని చేసే పోలీసులకు అనేక కష్టాలు వెంటాడుతున్నాయి. శాఖలో ఉద్యోగుల కొరత.. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతలు కావడంతో పోలీసులు రోజుకు గంటల తరబడి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారానికి ఒక్కరోజు సెలవు కూడా దక్కడం లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. నిత్యం విధులతో సతమతమయ్యే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు ఇస్తానని ప్రకటించారు. దీంతో తమకు మంచి రోజులు వస్తున్నాయని పోలీసులు సంబరపడ్డారు. అయితే హామీ ఇచ్చి ఏడాది గడిచినా అమలుకు నోచుకోకపోవడంతో పోలీసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరతతో సమస్యలు ....
ప్రస్తుతం వీవీఐపీల సంఖ్య పెరగడం.. సిబ్బంది కొరత వల్ల మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేయాలంటే కనీసం 30 శాతం సిబ్బంది అదనంగా కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పోస్టుల్లోనే 35 శాతం ఖాళీలున్నాయి. వీటికితోడు తప్పనిసరి పరిస్థితులు, అనారోగ్య కారణాలతో 5-10 శాతం సిబ్బంది సెలవుల్లో ఉంటున్నారు. దీంతో విధుల్లో ఉన్న సిబ్బందిపైనే అదనపు పని భారం పడుతోంది. మరోపక్క హైదరాబాద్‌, సైబరాబాద్‌ ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడంతో.. 80 శాతం సిబ్బంది ఉదయం మూడు గంటల నుంచే విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి ఉంది. వీళ్లు దాదాపు 16 గంటల పాటు పనిచేస్తూ ఎప్పుడో రాత్రిళ్లు ఇంటికి చేరుతున్నారు.
రంజాన్‌, గణేష్‌ ఉత్సవాలు, బోనాల సమయాల్లో మరింత ఒత్తిడి.....
ఇక రంజాన్‌, గణేష్‌ ఉత్సవాలు, బోనాలు, అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రపతి, కేంద్రమంత్రుల పర్యటనల సమయంలో పోలీసులపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్‌ డ్యూటీ చేసేవారికి మాత్రం కొంత విశ్రాంతి దొరుకుతుంది. కానీ మిగతా విధుల్లో ఉండే పోలీసులు ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక 10 వేల పోస్టుల భర్తీకి పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఆరేడు నెలలు గడుస్తున్నా ఇంకా ఆ ఫైల్‌ సచివాలయంలోనే ఉంది.
ప్రతిరోజు 14 నుంచి 16 గంటలపాటు విధులు...
ఇక పోలీసులు ప్రతిరోజు 14 నుంచి 16 గంటలపాటు విధులు నిర్వహిస్తుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులంటున్నారు. ఎక్కువ సమయం విధులు నిర్వహించడం వల్ల వారి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇచ్చే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి.. తమకు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 

16:35 - July 3, 2015

కడప: స్కూల్‌ హెడ్‌మాస్టర్-టీచర్ల మధ్య స్కూల్‌ గ్రాంట్లపై జరిగిన గొడవ ఓ స్కూలుకు తాళాలు పడేలా చేసింది. ఈఘటన కడప జిల్లా జమ్మల మడుగు మండలం గూడెం చెరువులో చోటుచేసుకుంది. స్కూల్‌ హెడ్మాస్టర్ శాంతకుమారి, మరో ఇద్దరు టీచర్లు సుధాకర్, స్వర్ణకుమారీలకు స్కూల్‌కు వచ్చే గ్రాంట్ల విషయంలో గొడవ పడ్డారు. అయితే ఈ గొడవ ఎప్పటి నుంచో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో..టీచర్లు పాఠశాలకు తాళం వేశారు. దీంతో..స్థానికంగా చర్చనీయంశమయంది. ఈ విషయం జిల్లా మండల విద్యాఅధికారి చిన్నయ్యకు తెలియడంతో వెంటనే జోక్యం చేసుకొని తాళం తీయించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానన్నారు.

16:32 - July 3, 2015

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ పార్టీపై తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...జైలు నుంచి విడుదలైన రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు టిడిపి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తే కావాలనే కేసులు పెడుతున్నారని వివేకానంద విమర్శించారు. టీఆరెస్‌ పార్టీలో చేరిన నాయకులు చేపట్టిన ర్యాలీలపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అధికార పార్టీ నేతలు దిగుజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వివేకానంద ధ్వజమెత్తారు.

5న జపాన్ పర్యటనకు సీఎం చంద్ర బాబు

హైదరాబాద్: ఈనెల 5న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. రాజధాని శంకుస్థాపనకు జపాన్ ప్రధానిని ఆహ్వానించేందుకు ఆయన జపాన్ వెళ్తున్నట్లు సమాచారం.

నకిలీ డిగ్రీ కేసు మరో ఆప్ ఎమ్మెల్యే....

న్యూఢిల్లీ: నకిలీ లా డిగ్రీ కలిగిన కేసులో ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తోమర్ వ్యవహారం మరువక ముందే ఆప్ మరోసారి ఇరకాటంలో పడింది. ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే భావనా కౌర్ విద్యార్హతలకు సంబంధించి అఫిడవిట్‌లో తప్పుగా పేర్కొన్నారంటూ ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై స్పందించిన ఢిల్లీ కోర్టు కౌర్‌పై దాఖలైన పిటిషన్ విచారణకు అర్హమైనదేనని స్పష్టం చేసింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పంకజ్‌శర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.

దుర్గ గుడి పురోహితుడిపై ఆరపణలు

విజయవాడ : దుర్గ గుడి పురోహితుడిపై ఓ భక్తుడు ఆరపణలు చేశారు. అమ్మవారికి కానుక గా 3 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని పూజారి తీసుకున్నాడని భక్తుడు ఆరోపించాడు. అప్రమత్తమై ఆలయ అధికారులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆధారాలు లభించకపోవడంతో విచారణ కొనసాగుతున్నది.

హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు.

అనంత్ నాగ్ లో ఉద్రిక్తత

జమ్మూకాశ్మీర్: అనంత్ నాగ్ లో ఉద్రిక్తతచోటు చేసుకుంది. పోలీసులు- గిలానీ మద్దతు దారుల మధ్య ఘర్షణ జరుగుతోంది. పోలీసులపై గిలానీ మద్దతు దారులు రాళ్లు రువ్వుతున్నారు.

విద్యుదాఘాతంతో గృహ నిర్మాణ కార్మికుడు మృతి

నెల్లూరు:విద్యుదాఘాతంతో గృహ నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం నెల్లూరు నగరంలోని జెండావీధి రోడ్డులో చోటు చేసుకుంది. శుక్రవారం జెండావీధిలో నూతనంగా నిర్మిస్తున్న గృహం వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగి అతనిపై పడటంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సుప్రీం కోర్టు నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు:రావుల

హైదరాబాద్‌: టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం టి.సర్కార్ కు చెంపపెట్టు లాంటిదని టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ విడుదలైన తర్వాత సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అన్ని కార్యక్రమాలు నిలిపివేసి రేవంత్‌ కేసు సింగిల్‌ పాయింట్‌గా అధికార పెద్దలు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైన ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. కేసులు మీరే వేస్తారు...తీర్పులు కూడా మీరే రాస్తారా అని ప్రశ్నించారు.

కాసేపట్లో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా చిలుకూరు చేరుకున్న సీఎం బాలాజీని దర్శించుకున్నారు.

పుష్కర పనుల్లో నాణ్యతాలోపం :ఎమ్మెల్సీ పొంగులేటి

హైదరాబాద్:గోదావరి పుష్కరాల పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనబడుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలంలో పుష్కరఘాట్‌ల వద్ద మురుగునీరు కలుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు సోనియాను ఆహ్వానించామని పొంగులేటి వెల్లడించారు.

15:00 - July 3, 2015

అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రవాద ముప్పుందా? పాక్‌ ఉగ్రవాదులు కాశ్మీర్‌లోకి చొరబడ్డారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రికులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. 59 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్ర అత్యంత కఠినమైన యాత్ర.                                                                                      
అమర్‌నాథ్‌ యాత్ర రెండో బ్యాచ్‌లో 1525 మంది భక్తులు
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్‌నాథ్‌ యాత్ర మొదలైంది. 1525 మంది భక్తులతో కూడిన రెండో బ్యాచ్‌కు అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బ్యాచ్‌లో 1074 మంది పురుషులు, 236 మంది స్త్రీలు, పిల్లలు సాధువులు కలిసి 208 ఉన్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరంతా జమ్ములోని భగ్‌వతీనగర్‌ నుంచి 47 వాహనాల్లో బయలు దేరారు. మొదటి బృందంలో 1280 మంది యాత్రికులున్నారు.
యాత్రను అస్థిరపరచడానికి కాశ్మీర్‌లోకి చొరబడ్డ టెర్రరిస్టులు....
అమర్‌నాథ్‌ యాత్రకు అస్థిర పరచడానికి పాకిస్తాన్‌కు చెందిన పదిహేను మంది టెర్రరిస్టులు కాశ్మీర్‌లోకి చొరబడ్డట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి. అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశముందని తెలపింది. దీంతో 'ఆపరేషన్ శివ' పేరిట అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. టెర్రరిస్టులను ఏరివేసేందుకు 7 వేల 5 వందల మంది సైనికులు కాశ్మీర్‌ను జల్లెడ పడుతున్నారు. యాత్రికుల రక్షణ కోసం పదివేల మంది జవాన్లను ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అమర్‌నాథ్‌ యాత్ర భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
హిమాలయాల్లో 3,888 మీటర్ల ఎత్తులో కొలువైన అమరనాథుడు....
దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో 3 వేల 888 మీటర్ల ఎత్తులో కొలువైన అమర్‌నాథుడి గుహవరకు యాత్ర కొనసాగుతుంది. కొందరు కాలినడకన వెళ్తే వృద్ధులు గుర్రాలపై వెళ్తారు. కొండగుట్టల నడుమ ఈ యాత్ర అత్యంత కఠినంగా సాగుతుంది. ఒకో సమయంలో యాత్రికులకు ఆక్సిజన్‌ అందక ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది. యాత్రికుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసే స్థావరాల్లో ఆహారం, నీరు, వైద్యం తదితర సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 59 రోజుల పాటు జరిగే అమర్‌నాథ్‌ యాత్ర పురోషోత్తమ పూర్ణిమ రోజున ప్రారంభమై రక్షాబంధన్‌ రోజున ముగుస్తుంది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు 2 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

14:55 - July 3, 2015

హైదరాబాద్: ప్రజల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేయాలి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఆయన శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు రచించిన 'ఉనికి' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టమున్నా లేకున్నా పొరుగు రాష్ర్టాలతో కలిసి వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ రాజధాని మాత్రమే కాదు..విద్యా కేంద్రమన్నారు. సైబర్‌ సిటీ...ఆధునిక నాగరికతకు కేంద్రమని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్‌లో ఉన్నారని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు.

14:36 - July 3, 2015

ఢిల్లీ:సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీకి చుక్కెదురైంది. రేవంత్ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏసీబీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సెక్షన్‌ 164 కింద రేవంత్‌రెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారని స్పష్టం చేసింది. ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని కొత్తగా విచారించాల్సిందేమీలేదని చెప్పుకొచ్చింది. రేవంత్‌ ఇప్పటికే నెల రోజులు జైల్లో ఉన్నారని...అరెస్టైన ఒక్కరోజులోనే బెయిల్‌ వస్తే పరిశీలించాలని చెప్పింది. బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. ఏసీబీ తరపున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. కేసులో సాక్ష్యులను విచారించాల్సి ఉందని ఆయన వాదించారు. రేవంత్ బయటికొస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆరోపించారు. రేవంత్‌ ఎవరెవరికి ఫోన్‌ చేశారు..? 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి..? మిగతా నాలుగున్నర కోట్లు ఎక్కడి నుంచి తెద్దామనుకున్నారు..? అనే అంశాల్లో విచారించాల్సి ఉందని వాదించారు. మరోవైపు రేవంత్‌ తరపున రాంజెఠ్మలానీ వాదనలు వినిపించారు. విచారణలోనే రేవంత్ అన్ని విషయాలను చెప్పారని...ఆయన వాదించారు. దీంతో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని...సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. టీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న ఏసీబీ పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు కొట్టివేసింది.. రేవంత్ నెలరోజులపాటు జైల్లో ఉన్నారని ధర్మాసనం గుర్తుచేసింది.. అన్ని ఆధారాలు పరిశీలించాకే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని స్పష్టంచేసింది.. ఏసీబీ తరపున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదించారు.. రేవంత్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు నివేదించారు..

 

 

 

ఏసీబీకి సుప్రీంలో చుక్కెదురు

ఢిల్లీ:ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఎసిబి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రేవంత్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏసీబీ వాదనను సుప్రీంకోర్టుతిరస్కరించింది.

14:21 - July 3, 2015

దళితులకు మూడెకరాలు ఇస్తామని ఆయన పార్టీ చెబుతోంది. సార్‌ మాత్రం ఆ దళితుల భూమినే ఆక్రమించేశారు. కేసీఆర్‌ తెలంగాణకు సీఎం అయితే.. తాను తన నియోజకవర్గానికి సీఎం అవ్వాలనుకున్నారు. అందుకే ఆయనలా ఫాంహౌస్‌ కట్టించుకుంటున్నారు. దీని కోసం భూమి, నీరు, విద్యుత్‌ అన్నీ ఒకటి కాదు రెండు కాదు సర్వం అక్రమంగా తెచ్చుకోవటమే. అధికారాన్ని చూపించి దబాయించి పనులు చేయించుకోవడమే. అడిగేవారు లేరు.. ఆపేవారు అసలే లేరు. ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా కథ.. స్పెషల్ రిపోర్ట్.. భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్న పెద్దమనుషులను చూశాం.. భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక, ఇటుక పవర్‌ చూపించి ఫ్రీగా తెచ్చుకునేవాళ్లనూ చూశాం. కాని ఈ సార్‌ రూటు సెపరేటు. సర్వం ఉచితమనే కాన్సెప్ట్‌ను బాగా నమ్ముకున్నట్లున్నారు. అందుకే తన అధికారాన్ని ఉపయోగించి పంచభూతాలను పట్టుకుని లాక్కోవడం మొదలెట్టారు.
ఎమ్మెల్యే భూఆక్రమణలపై విమర్శలు
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి భూదాహంపై జిల్లావ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి.. అధికారంలోకి వచ్చాక ఆయన అక్రమాలకు అంతులేకుండా పోయిందంటున్నారు స్థానికులు... నియోజక వర్గంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా అక్కడ ఏనుగు పాదం మోపుతారని ప్రచారం జరుగుతోంది.. ఇందుకోసం రవీందర్ రెడ్డి ముందే ప్లాన్ చేస్తారు.. సర్కారు భూమి పక్కనే కొంత భూమిని కొనేస్తారు.. అదను చూసి ప్రభుత్వ భూమిని అందులో కలిపేస్తారు..
కేసీఆర్ ఫాంహౌజ్‌లాంటిది కట్టాలని నిర్ణయం
ఈమధ్య కేసీఆర్ ఫాంహౌజ్‌పై మన ఎమ్మెల్యే సార్‌కి తెగ నచ్చేసిందంట. అలాంటిదే జిల్లాలో మరొకటి నిర్మించాలని ఆయన డిసైడ్ అయ్యారు.. భూమికోసం వేట కూడా ప్రారంభించారు.. చివరకు తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు. దీనికీ కారణముందంటున్నారు ఇతర పార్టీల నేతలు.. ఈ భూమి పక్కనే దళితుల అసైన్డ్ తోపాటు.. అటవీ భూములున్నాయి.. వీటిపై ఆయన కన్నేశారు.
దళితుల భూమిపై దృష్టి
ఎప్పట్లాగే ఈ భూములకోసం తన పాత ప్లాన్ అమలు చేశారు మన ఎమ్మెల్యే.. అక్కడినుంచి మోతె గ్రామానికి వెళ్లే రోడ్డుపక్కనున్న భూముల కొనుగోలుకు నిర్ణయించారు.. తన పలుకుబడిని ఉపయోగించి 110 ఎకరాల భూమి కొన్నారు.. తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు.. ఇందుకోసం ఎకరాకు కేవలం ముప్పయి నుంచి యాభై వేలు చెల్లించారు... ఆ తర్వాత దళితుల అసైన్డ్ భూమిపై దృష్టిపెట్టారు.. 602 సర్వే నెంబర్లోని 8 ఎకరాల 19గుంటలు, 578 సర్వే నెంబర్లోని 19 ఎకరాల 10 గుంటలను లాగేసుకున్నారు.. నాలుగెకరాల శిఖం భూమిని కలుపుకున్నారు. పదకొండెకరాల ప్రభుత్వ భూమినీ కబ్జా చేశారు.. అటవీశాఖకుచెందిన ఐదెకరాల భూమిలోనూ పనులు ప్రారంభించారు.. ఇలా మొత్తం 157 ఎకరాల్లో క్షేత్రం సిద్ధం చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఆ భూమిని చదును చేసేందుకు పదుల సంఖ్యలో ప్రొక్లయినర్స్, డోజర్లు, టిప్పర్లను వాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు.
గుట్టుచప్పుడుకాకుండా గుట్టలు తవ్వేశారు
ఈ పనులకు తన అధికారాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు రవీంద్ రెడ్డి.... మిషన్ కాకతీయలో తీసిన వేలాది ట్రాక్టర్ల ఒండ్రు మట్టిని ఇక్కడ పోసి చదును చేయించారు. పనిలో పనిగా చుట్టు పక్కలున్న చెరుకు ఫ్యాక్టరీల వ్యర్ధాలనూ ఇక్కడికి తరలించారు.. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గందం వ్యాపించింది. అటవీభూములనూ వదల్లేదు ఏనుగుల.... చదును పేరుతో పక్కనున్న అటవీ భూముల్లోని చెట్లను యధేచ్చగా నరికేశారు. గుట్టు చప్పుడు కాకుండా గుట్టలను తవ్వేశారు. ఇంత జరుగుతున్నా అటవీ అధికారులు ఇటువైపే రాలేదు.. పేదలు పోడు వ్యవసాయం చేస్తే జైళ్లకు పంపుతున్న అటవీశాఖ... ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి గుట్టను తవ్వినా పట్టించుకోలేదు..
వాగుకు అడ్డంగా చెక్ డ్యాం నిర్మాణం
చెట్ల నరికివేతతో ఆగలేదు ఎమ్మెల్యేగారు.. అర్లోనిగుట్ట, తిరుగుడు గుట్టలమధ్య ప్రవహిస్తున్న వాగునూ వదల్లేదు.. నీటిసరఫరాకోసం ఈ వాగుకు అడ్డంగా చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. మిషన్ కాకతీయలో పనుల్లోభాగంగా ఈ డ్యాం పనులు చేయిస్తున్నారు.. డ్యాం పేరుతో భారీ ఇసుక డంప్‌నుకూడా ఏర్పాటు చేశారు. పేద రైతులు ఒక కరెంట్ పోల్ అడిగితే ఏళ్లకుఏళ్లు తిప్పుకునే మన విద్యుత్ అధికారులు... ఏనుగుల సార్ కోసం పదుల సంఖ్యలో స్తంబాలు పాతారు.. చెక్ డ్యాం వరకూ విద్యుత్ లైన్ వేశారు. ఇలా తన పలుకు బడిని ఉపయోగించి అన్ని శాఖల అధికారులతో సమర్థవంతంగా పనులు చేయించుకుంటున్నారు ఏనుగులవారు..
మందకృష్ణపై దళిత యువకుల దాడి
ఎమ్మెల్యే ఆక్రమణలపై సిపిఎం ప్రజాసంఘాలు, ఎమ్మార్పిఎస్ గళమెత్తాయి. ఎమ్మార్పీఎస్ నేత కృష్ణమాదిగ ప్రజాసంఘాలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు.. దీనిని అడ్డుకునేందుకు దళిత యువకులతో మందకృష్ణపై ఎమ్మెల్యే దాడి చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి..
భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలి:ప్రజలు
ఈ భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా ఊపేక్షించమన్న తెలంగాణ సీఎం తన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. భూ ఆక్రమణపై వస్తున్న ఆరోపణల గురించి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

 

 

13:55 - July 3, 2015

గుంటూరు: ఏపీ రాజధాని గుంటూరులో మహిళా దొంగలు...షాపుల యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. గతకొద్దిరోజులుగా వస్త్రదుకాణాల్లో చాకచక్యంగా చీరల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఒకవైపు షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ధైర్యంగా చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా గుంటూరు నగరంలోని అరండల్ పేటలోని మూర్తీ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంలో నలుగురు మహిళలు కొనుగోలుదారులుగా వచ్చి విలువైన పది పట్టుచీరలను చాకచక్యంగా అపహరించుకుపోయారు. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా..చీరలు సంఖ్య తక్కువగా కావడంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన దుకాణాదారులు ఇది మహిళా దొంగల పనిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

13:50 - July 3, 2015

కర్నూలు : మరోసారి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా తమ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి ఆరోపించారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన ఎంపీటీసీ హుస్సేన్‌ను వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ మీడియా ముందు చక్రపాని వెల్లడించారు. ఎంపీటీసీ ఆచూకీ కనుక్కోవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

13:46 - July 3, 2015

అనంతపురం: జిల్లాలోని బెళుగుప్ప మండలం కొట్టాల గ్రామంలో ఓ వర్గం వారు ఎమ్మార్వోపై దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన ఎమ్మార్వోపై ఈ దాడి జరిగింది. దాడి నుంచి బయటపడిన ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

13:33 - July 3, 2015

హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్, ఉనికి గ్రంథ రచయిత విద్యాసాగర్ రావు... విలక్షణమైన రాజకీయ నాయకుడని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసిసి లో ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యాసాగర్.. ఉన్నత వ్యక్తిత్వమున్న వ్యక్తని పొగిడారు. ఎలాంటి సమస్యనైనా.. విద్యాసాగర్ చిరునవ్వుతో స్వీకరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యాసాగర్ రావుతో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు. విద్యాసాగర్ రావు జీవితమంతా పోరాటాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. 'ఉనికి' అన్న పదం తెలంగాణ ప్రజలకు సుపరిచితమని తెలిపారు. తెలంగాణ సమాజం పోరాటం చేసిందే.. ఉనికి కోసమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర బిల్లుపై ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
ఉనికి పుస్తకాన్ని ప్రణబ్ ఆవిష్కరించడం సంతోషకరం: విద్యాసాగర్ రావు
తాను రాసిన ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించడం సంతోషకరమని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసిపి లో ఉనికి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉనికికే ఉనికి ఏర్పడినట్లుగా ఉందని అభివర్ణించారు. మనుషులే కాదు... పశుపక్ష్యాదులు కూడా తమ ఉనికి కోసం ప్రయత్నిస్తాయని చెప్పారు.

 

13:29 - July 3, 2015

ఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. రేవంత్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఎసిబి వేసిన పిటిషన్ పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. రేవంత్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఎసిబి పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ బయట ఉంటే విచారణకు ఇబ్బందికరమని ఎసిబి వాదన వినిపిస్తుంది. 

రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. రేవంత్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఎసిబి వేసిన పిటిషన్ పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. రేవంత్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఎసిబి పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ బయట ఉంటే విచారణకు ఇబ్బందికరమని ఎసిబి వాదన వినిపిస్తుంది. 

'ఉనికి' పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రచించిన ఉనికి పుస్తకావిష్కరణ నగరంలోని హెచ్ ఐసిపిలో జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీకాంగ్రెస్ నేత జానారెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులు పాల్గొన్నారు. 

ఆయన విలక్షణమైన రాజకీయ నాయకుడు : కేసీఆర్

మహారాష్ట్ర గవర్నర్, 'ఉనికి' గ్రంథ రచయిత విద్యాసాగర్ రావు... విలక్షణమైన రాజకీయ నాయకుడని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసిసి లో 'ఉనికి' పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యాసాగర్.. ఉన్నత వ్యక్తిత్వమున్న వ్యక్తని పొగిడారు. ఎలాంటి సమస్యను అయినా.. విద్యాసాగర్ చిరునవ్వుతో స్వీకరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యాసాగర్ రావుతో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు. విద్యాసాగర్ రావు జీవితమంతా పోరాటాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. 'ఉనికి' అన్న పదం తెలంగాణ ప్రజలకు సుపరిచితమని తెలిపారు. తెలంగాణ సమాజం పోరాటం చేసిందే..

ఉనికి పుస్తకాన్ని ప్రణబ్ ఆవిష్కరించడం సంతోషకరం: విద్యాసాగర్ రావు

హైదరాబాద్: తాను రాసిన ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించడం సంతోషకరమని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసిసి లో ఉనికి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉనికికే ఉనికి ఏర్పడినట్లుగా ఉందని అభివర్ణించారు. మనుషులే కాదు... పశుపక్ష్యాదులు కూడా తమ ఉనికి కోసం ప్రయత్నిస్తాయని చెప్పారు.

 

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలుత మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్‌ ఆ తర్వాత మెల్లగా ఊపందుకుంటోంది. కర్నూల్ లో ఉదయం 10 గంటల వరకు 31 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో 114, ఆదోనిలో 131, నంద్యాలలో 111 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 387 మంది ఓటు వేశారు. జెడ్ పిటిసి, ఎంపిటిసి, వార్డు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డోన్‌ ఎమ్మెల్యే రాజారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ రాజశేఖర్‌ కర్నూలు పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రకాశం...

12:20 - July 3, 2015

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలుత మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్‌ ఆ తర్వాత మెల్లగా ఊపందుకుంటోంది. కర్నూల్ లో ఉదయం 10 గంటల వరకు 31 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో 114, ఆదోనిలో 131, నంద్యాలలో 111 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 387 మంది ఓటు వేశారు. జెడ్ పిటిసి, ఎంపిటిసి, వార్డు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డోన్‌ ఎమ్మెల్యే రాజారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ రాజశేఖర్‌ కర్నూలు పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రకాశం...
ప్రకాశం జిల్లాలో ఉదయం 11 గంటలకు వరకు 23 శాతం పొలింగ్ శాతం నమోదు కాగా.... ఇప్పటి వరకు 30 శాతం నమోదు అయింది. మొత్తం 992 మొత్త ఒటర్లు ఉన్నారు. వైసిపి ఎన్నికలను బహిష్కరించడంతో టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి విజయం లాంఛనమని చెప్పవచ్చు.

 

11:53 - July 3, 2015

సిటీలు పెరుగుతున్నా పార్కులు పెరగడం లేదు. సమాజానికీ, ప్రకృతికీ ఎంతో మేలు చేసే పార్కుల విషయంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పార్కులకు కేటాయించిన భూములు కబ్జా అవుతున్నా అధికారులు నిద్ర నటిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పార్కుల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే ఫలితాలు దారుణంగా వుంటాయి.                                                          
పార్కులను ఏ నాగరిక సమాజమైనా నిర్లక్ష్యం చేయగలదా?
వారాంతపు సెలవుల్లో పార్కుకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనుకోవడం సిటీ పిల్లల సహజ లక్షణం. బండెడు పుస్తకాలతో, బిజీబిజీ క్లాసుల షెడ్యూల్‌తో, క్షణం తీరికలేని హోంవర్కులతో అలసిసొలసిన చిన్నారులను కాస్తంత సేదదీర్చేవీ పార్కులే కదా! కాంక్రీట్‌ జంగిల్‌లో, గజం జాగా కూడా లేని గల్లీల్లో, ఇరుకు ఇరుకు గదుల్లో జీవించే పసిమొగ్గలకు పార్క్‌లు అమ్మ ఒడిలాంటివే కదా! పట్టణంలోని చుట్టాలింటికి వచ్చిన పల్లెటూరి పిల్లల మోముల్లో చిరునవ్వులు పూయించేవీ పార్కులే. చిన్నారుల మోముల్లో కోటానుకోట్ల కాంతిరేఖలు సృష్టించి, సంతోషపు వెలుగులు విరజిమ్మే పార్కుల నిర్వహణను ఏ నాగరిక సమాజమైనా నిర్లక్ష్యం చేయగలదా?
పెద్దలనూ రీచార్జి చేస్తున్నవీ పార్కులే..
ఇప్పుడు పిల్లలనే కాదు పెద్దలనూ రీచార్జి చేస్తున్నవీ పార్కులే. ఈ స్పీడ్‌ యుగంలో కెరీర్‌ పరుగు పందెంలో మానసిక ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కల్పిస్తున్నవీ పార్కులే. స్ట్రెస్‌, బీపీ, షుగర్‌, ఒబేసిటీ ఇలా ఏ ఆపద వచ్చినా, వాటి నుంచి కాపాడే నడక సాగించాలంటే ముందు వెదుక్కునేది పార్కునే కదా! అవును. ఇప్పుడు పార్కులు పిల్లలనే కాదు పెద్దలనీ అమ్మలా లాలిస్తున్నాయి. ఊరడిస్తున్నాయి. కాసేపు నా వాకిట్లో షికారు చేయరా నాయనా నీ ఆరోగ్యాన్ని కాపాడుతానంటూ అభయమిస్తున్నాయి. ఆధునిక యుగంలో ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న పార్క్‌ల నిర్వహణను ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమైనా అలక్ష్యం చేయగలదా?
మానవ సమాజానికి మేలు చేస్తున్న పార్కులు..
పిల్లల ఆట పాటలకీ, పెద్దల వాకింగ్‌కి మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలుగా మానవ సమాజానికి గొప్ప మేలు చేస్తున్నాయి పార్కులు. పట్టణాల్లో వివిధ రకాల పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే వాయు, జల, ధ్వని కాలుష్యాల తీవ్రతను తగ్గించడంలో పార్కులు చేస్తున్న సహాయం చిన్నదేమీ కాదు. అనేక పట్టణాల్లో భూగర్భజలాలను కాపాడడంలోనూ, వరదలను నిరోధించడంలోనూ పార్కులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. వివిధ పరిశ్రమలు, వాహనాలు మనం పీల్చేగాలినీ, తాగే నీటిని కాలకూటవిషంగా మారుస్తున్న వేళ వాటిని శుభ్రం చేసి, మనకు స్వచ్ఛమైన గాలినీ, స్వచ్ఛమైన నీటిని ప్రసాదించేవీ పార్కులే. వాతావరణంలో వేడిని తగ్గిస్తున్నవీ ఇవే.
పార్కులు నిర్వహణను ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం చేయగలదా?
అమెరికాలాంటి దేశాల్లో జరిగిన పరిశోధనలు పార్కులు పర్యావరణానికీ , ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న సహాయాన్ని కళ్లకు కట్టాయి. పట్టణాల్లో పార్కులనేవి లేకపోతే మంచినీటి సరఫరా కోసం మరిన్ని నిధులు వెచ్చించాల్సి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది. అమెరికన్‌ ఫారెస్ట్ ఆర్గనైజేషన్‌ వేసిన అంచనాల ప్రకారం మంచినీటి సరఫరాకు వెచ్చించే ఖర్చులో దాదాపు 400 బిలియన్‌ డాలర్ల నిధులు ఆదా అవుతున్నట్టు తేలింది. పార్కుల వల్ల సామాజిక సంబంధాలు బలపడుతున్నాయనీ, నేరప్రవృత్తి రేటు తగ్గుతోందని, మూడ్స్‌ను మార్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయనీ, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతున్నాయనీ అమెరికాలో జరిగిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే పార్కులు నిర్వహణను ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం చేయగలదా?
పార్కులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు
కానీ, దురదృష్టవశాత్తు పార్కుల నిర్వహణను ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో వివిధ కాలనీల్లో వుండే పార్కుల నిర్వహణను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాటి రక్షణ గురించి ఆలోచించడం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో పార్క్‌ కోసం కచ్చితంగా స్థలం కేటాయించాలన్న నిబంధనలు వాటిని చాలా చోట్ల అమలు చేయడం లేదు. ఒకవేళ స్థలం కేటాయించిన దానిని చూడముచ్చటగా తీర్చిదిద్దడం లేదు. ఆహ్లాదభరితంగా మార్చడం లేదు. కనీసం ఆ స్థలాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలేవీ తీసుకోవడం లేదు. పార్కులకు కేటాయించిన స్థలాలనే కాదు- ఉనికిలో వున్న పార్కులను సైతం కబ్జాదారులు స్వాహా చేస్తున్నా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, అధికారులు నిద్ర నటిస్తున్నారు. పౌరులు స్పష్టమైన ఫిర్యాదులు చేసిన్నప్పటికీ స్పందించని జడత్వం పాలనావ్యవస్థలో పేరుకుపోయింది.
పార్కులను కార్పొరేట్‌ సంస్థలకు వదిలేస్తున్న దీనస్థితే
ఓ వైపు వివిధ కాలనీల్లోని పార్కులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మరోవైపు నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో వుండే పార్కులను వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. సామాన్యుల పిల్లలెవరూ వాటిలో ప్రవేశించలేని, ఎంజాయ్‌ చేయలేని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. చివరకు పార్కుల నిర్వహణను కూడా కార్పొరేట్‌ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్న దీనస్థితే మన చుట్టూ తాండవిస్తోంది.

 

11:38 - July 3, 2015

జేఈఈ ర్యాంకుల విషయంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జేఈఈ ర్యాంకులు ప్రకటించడంలో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వారిని ఉద్యోగాల నుంచి భర్తరఫ్ చేయాలని చెప్పారు. విద్యారంగంలోని వ్యవస్థను ప్రక్షాళన చేసి.. సంస్కరించాలని తెలిపారు. తెలంగాణ వచ్చాక నూతన స్వభావం వస్తుందని ప్రజలు ఆశించారు..కానీ అది జరగకపోవడంతో వారు నిరుత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులకు నెల జీతం డబుల్, రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు, ఔట్ లుక్ పత్రికలో స్మితా సబర్వాల్ కథనం వంటి పలు అంశాలపై నాగేశ్వర్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:18 - July 3, 2015

జైపూర్: రాజస్థాన్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్‌ నటి హేమామాలిని క్రమంగా కోలుకుంటున్నారు. జైపూర్‌ లోని ఫోర్టీస్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. హేమా మాలిని ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు.. యాక్సిడెంట్‌ కేసులో హేమామాలిని డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న కారులోని బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.

 

11:14 - July 3, 2015

అనంతపురం: టీడీపీ మాజీ నేత దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కాలం స్తబ్దుగా ఉన్న దాడి.. టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. రాజకీయ గ్రహణం పట్టడం వల్లే తాను వైసీపీలోకి వెళ్లినట్టు చెప్పారు. చంద్రబాబు ఆహ్వానం కోసం వేచి చూస్తున్నాని పేర్కొన్నారు.

 

 

10:51 - July 3, 2015

చర్లపల్లి జైలు నుంచి విడుదలైనప్పుడు జైత్రయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన సరైనవి కావని వక్తలు తెలిపారు.ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిఆర్ ఎస్ నేత.. రాకేష్ , టిడిపి నేత సతీష్ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ కె.లక్ష్మణ్ రావు మాట్లాడారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన రేవంత్ నిర్దోషి కాదని చెప్పారు. అవినీతికి బ్రేక్ వేయాల్సిన అవసరముందన్నారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

టిడిపి గూటికి దాడి..?

అనంతపురం: వైసీపీ నేత దాడి వీరభద్రరావు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు. టీడీపీతో తనకు 30 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. రాజకీయ గ్రహణం పట్టి తాను వైసీపీలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం కోసం వేచి చూస్తున్నానని పేర్కొన్నారు.

 

అండమాన్ నికోబార్ లో భూప్రకంపనలు

పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ లో ఉదయం నుంచి భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. పోర్టుబ్లెయిర్ కు 246 కి.మీ దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.6గా నమోదు అయింది.

 

ప్రకాశం జిల్లాలో చైనా బృందం పర్యటన

ప్రకాశం: జిల్లాలోని దొనకొండలో చైనా బృందం పర్యటిస్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన ప్రదేశాలను పరిశీలన చేయనుంది.

 

కర్నూలు జిల్లాలో ఎంపిటిసి కిడ్నాప్

కర్నూలు: బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపిటిసి బాలహుస్సేన్ ను గుర్తు తెలియిని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎంపిటిసి బాలహుస్సేన్ కిడ్నాప్ కు గురైనట్లు పీఎస్ లో ఫిర్యాదు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. వైసిపి నేతలే కిడ్నాప్ చేశారని టిడిపి నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

09:48 - July 3, 2015

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో ఎన్నికను వైసీపీ బహిష్కరించడంతో.. అందరి దృష్టీ కర్నూలు జిల్లాపైనే పడింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కర్నూలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉత్కంఠంగా మారింది. ఇరు పార్టీల నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు.

09:43 - July 3, 2015

గుంటూరు: మాచర్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తపల్లి జంక్షన్ సమీపంలోని ఓ డాక్డర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు దొంగలు.. డాక్లరతోపాటు అతని భార్యను తాళ్లతో కట్టేసి... తుపాకీతో బెదిరించి చోరీ చేశారు. 15 సవర్ల బంగారం, రూ. 4 వేల నగదును అపహరించారు.

 

09:39 - July 3, 2015

పార్కుల కబ్జా వెనుక రాజకీయనేతల హస్తముందని ఫ్యాకా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఇరు రాష్ట్రాల్లో పార్కుల నిర్వహణలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. పార్కులను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 'ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్కుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పార్క్‌లు కబ్జా అవుతున్నా అధికారగణం చోద్యం చూస్తోంది. ఈ దుస్థితికి కారణం ఏమిటి? పార్కుల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే కలిగే దుష్పరిణామాలేమిటి? పార్కుల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి'? అనే అంశాలపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:30 - July 3, 2015

తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్ల వద్ద చిరుతలు కలకలం సృష్టించాయి. 1300 మెట్టు దగ్గర ఒక పెద్ద చిరుత పులి, రెండు చిన్న చిరుత పులులు కనిపించాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. నడకదారి భక్తులను నలిపి వేశారు. చిరుతల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

శ్రీవారి మెట్ల వద్ద చిరుత కలకలం...

తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్ల వద్ద చిరుతలు కలకలం సృష్టించాయి. 1300 మెట్టు దగ్గర ఒక పెద్ద చిరుత పులి, రెండు చిన్న చిరుత పులులు కనిపించాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. నడకదారి భక్తులను నలిపి వేశారు. చిరుతల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

వ్యతిరేకంగా సాక్షం చెప్పాడని వీఆర్ ఏ హత్య

కడప: మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. వీఆర్ఏ నాగేశ్వర్ రెడ్డి మృతి చెందారు. తమకు వ్యతిరేకంగా కోర్టులో సాక్షం చెప్పాడని నిన్న నాగేశ్వర్ రెడ్డిపై ఇనుపరాడుతో ప్రత్యర్థులు దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేశ్వర్ రెడ్డి మృతి చెందారు.

 

కర్నూలు-ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం..

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతోంది. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఒంగోలు, కందుకూరు, మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 7న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 

08:02 - July 3, 2015

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. పోలింగ్‌ కేంద్రాలకు పెన్నులు, సెల్‌ఫోన్లు తీసుకురాకూడదనే నిబంధనను విధించారు. ఓటింగ్‌కు వైలెట్‌ కలర్‌ పెన్నులను అధికారులే సమకూర్చనున్నారు. ఈ పెన్నుల ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.
ప్రకాశం జిల్లాలో మొత్తం 992 ఓట్లు
ప్రకాశం జిల్లాలో మొత్తం 992 ఓట్లు ఉన్నాయి. ఎవరికైనా విజయం దక్కాలంటే 497 ఓట్లు రావాల్సి ఉంది. ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపి నుంచి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నుంచి అట్ల చిన వెంకటరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. దీంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపు ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ
ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ అభ్యర్ధి వెంకటేశ్వరరెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. జిల్లాలో మొత్తం 1087 ఓట్లు ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకునే వారిలో 464 మంది పురుషులు, 623 మంది మహిళలు ఉన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీవో కార్యాలయాల్లో మూడు చోట్ల పోలింగ్‌ జరగనుంది. ఓటు ఎలా వినియోగించుకోవాలో ఓటర్లకు అధికారులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాలలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. 100 మీటర్ల దూరంలోపు ఎవరూ ఉండకూడదని పోలీసులు ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. ఆరుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 68 మంది ఎస్‌ఐలు, 193 ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 479 మంది కానిస్టేబుళ్లు, 300 మంది హోంగార్డులను ఎన్నికల విధుల కోసం నియమించారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ-వైసీపీ మధ్య పోటీ
ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎన్నికలను బహిష్కరించడంతో టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. మరోపక్క కర్నూలు జిల్లాలో టీడీపీ-వైసీపీ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే మరో 4 రోజులు ఆగాల్సి ఉంది.

 

07:56 - July 3, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసిబి పోస్టుమార్టం ప్రారంభించింది. చార్జీషీట్ దాఖలు అయ్యేంత వరకు నిందితులకు బెయిల్ రాకుండా విశ్వప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు సుప్రీం కోర్టు గడప తొక్కింది.
కీలక దశలో కేసు దర్యాప్తు
కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. నిందితులు రాజకీయ నేర ప్రవృత్తితో ఉన్నారని ఏసిబి వాదనలు వినిపించింది. పక్క రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నిందితుడు.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉందని సుప్రీం కోర్టు పిటిషన్ లో ఏసీబీ పేర్కొంది.
సుప్రీంలో ఎసిబి పిటిషన్‌
ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్టులను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ- సుప్రీం కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొంది.
కేసు డైరీలో పూర్తి వివరాలు లేవు
ఇదిలా ఉంటే హై కోర్టులో నిందితులకు బెయిల్ రావడానికి గల కారణాల్లో ప్రధానంగా దర్యాప్తులో జరిగిన లొసుగులేనని న్యాయ నిఫుణులు ఏసిబికి సూచించినట్లు తెలుస్తుంది. సీ.ఆర్.పి.సీ 41.ఎ, సెక్షన్ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశామని ప్రకటించాలి. కానీ కేసు డైరీలో ఎక్కడెక్కడ ఎలా జరిగిందో పూర్తి వివరాలు కేసు డైరీలో లేవు. హై కోర్టులో కేసు డైరీ పై న్యాయమూర్తి ప్రశ్నించగా.. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున కేసు డైరీ నిర్వహించలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. అలా అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు కదా అనే ప్రశ్న న్యాయ మూర్తి వేశారు. దీంతో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి సులువు మార్గమయిందని ఏసిబి భావిస్తుంది.
ప్రభుత్వాన్ని కూలదోసే యత్నం చేశారని ఏసీబీ ఆరోపణ
ఇదిలా ఉంటే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం ఇలాంటి కేసుల్లో సహజం. కాని ఏసిబి అలా భావించ లేదు. దర్యాప్తులో ప్రభుత్వాన్నే కూలదోసే ప్రయత్నం చేశారని దీన్ని నిరూపించేందుకు నిందితులు జైల్లో ఉంటేనే సాధ్యమని భావిస్తున్నారు.
సండ్రకు కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించేలా ప్లాన్
ఏసిబి ఇంతకు ముందులాగా దూకుడుగా కాకుండా పక్కా ప్లాన్ తో వెళ్లేందుకు సిద్దమవుతోంది. సండ్ర వెంకట వీరయ్య దగ్గరకు వెళ్లి విచారించకుండా.. కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించేలా ప్లాన్ వేస్తున్నారు. స్కాంలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందని నివేదిక అందితే.. వాయిస్ రీ రికార్డు చేయడం కోసం కోర్టు ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఏసీబీ అధికారులు.
కేసును నిలబెట్టుకోవాలని ఏసిబి యత్నం
స్టీఫెన్ సన్ ఇచ్చిన సీఆర్పీసీ 164 స్టేట్ మెంట్ ను బలమైన సాక్ష్యంగా చేసుకుకొని పక్కా ఆధారాలతో ఎలాంటి తప్పిదాలు లేకుండా కేసును నిలబెట్టుకోవాలని ఏసిబి ప్రయత్నిస్తోంది.

 

నేడు హరితహారం కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: నేడు తెలంగాణలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు చిలుకులూరు బాలాజీ ఆలయం వద్ద హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

 

నేడు ఎఫ్ ఐహెచ్ హాకీ లీగ్ సెమీఫైనల్..

అంట్వెర్స్: నేడు ఎఫ్ ఐహెచ్ హాకీ లీగ్ సెమీఫైనల్ జరుగనుంది. రాత్రి 9.30 గంటలకు భారత్-బెల్జియం మధ్య మ్యాచ్ జరుగనుంది.

 

గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం...

గుంటూరు: మాచర్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తపల్లి జంక్షన్ సమీపంలోని ఓ డాక్డర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి ముగ్గురు దొంగలు చోరీకి చేశారు. 15 సవర్ల బంగారం, రూ. 4 వేల నగదును అపహరించారు. 

హైకోర్టును ఆశ్రయించిన గుర్తింపు రద్దైన కాలేజీ యాజమాన్యాలు

హైదరాబాద్: గుర్తింపు రద్దైన ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. 6 నుంచి జరిగే కౌన్సిలింగ్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తిపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

 

నేడు ప్రకాశం-కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు..

ప్రకాశం: నేడు ప్రకాశం, కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఒంగోలు, కందుకూరు, మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 

07:15 - July 3, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద... బయటకొచ్చిన రేవంత్‌ రెడ్డికి కేసుల ఉచ్చు బిగుస్తోంది. విడుదల సమయంలో రేవంత్‌ ఓవర్‌ యాక్షన్‌ చేశాడని.. మారణాయుధాలు చూపుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడంటూ ఆరు పోలీస్‌స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేశారు.
చిక్కుల్లో రేవంత్
చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌ విడుదలైనప్పుడు తను ప్రదర్శించిన దూకుడు అయన్ను మరిన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన నిర్వహించిన జైత్రయాత్రలో మాట్లాడిన రేవంత్ మాటలే ఆయన్ను కష్టాల్లో నెట్టేలా కనిపిస్తున్నాయి. రేవంత్ విడుదల తర్వాత తమ్ముళ్లు చేసిన హడావుడే తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
రేవంత్ పై ఆరు ఠాణాల్లో కేసులు నమోదు
అభిమానుల కోలహాలం మధ్య కొడగంల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఒక్క రాత్రి గడిచిందో..? లేదో..? ఆయనపై ఆరు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కేసీఆర్‌తో ఎసిబి చీఫ్ ఏకేఖాన్ భేటీ అయిన కాసేపటికే కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, ఓయూ, చిక్కడ్‌పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
జులై 1న సాయంత్రం ఐదున్నరకు రేవంత్ విడుదల
జులై 1న సాయంత్రం ఐదున్నరకు రేవంత్ విడుదలయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు చర్లపల్లి గేటు లోపలే కలిశారు. జైలు పరిసర ప్రాంతంలో ఉన్న 144 సెక్షన్‌ను ఉల్లంఘించారని పోలీసుల వాదన. నిషేధాజ్ఞాలు ఉన్న నేపథ్యంలో ర్యాలీ తీయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపైనా కుషాయిగూడ పోలీసులు 341, 188, 506, 509 IPC సెక్షన్లతో పాటు సిటీ పోలీస్ యాక్ట్ 22 కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారంటూ రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. 341, 188 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడ్‌పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలోనూ రేవంత్‌పై ఇవే కేసులు నమోదయ్యాయి.
రేవంత్ ర్యాలీపై టీఆర్ఎస్ లీడర్లు ముప్పేటదాడి
మరోవైపు రేవంత్ ర్యాలీపై టీఆర్ఎస్ లీడర్లు ముప్పేటదాడికి దిగారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అన్న ఆయన.. విద్యార్థుల ఆత్మహత్యలకు టీడీపీయే కారణమన్నారు. తెలంగాణలో తెలుగుదేశం జెండాలను లేకుండా ప్రజలు చేస్తారని హెచ్చరించారు.
రేవంత్ హద్దుమీరి మాట్లాడారు: మంత్రి తుమ్మల
ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత రేవంత్ హద్దుమీరి మాట్లాడారని మరో మంత్రి తుమ్మల అన్నారు. రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడాలన్నారు. ఇకనైనా రౌడీ వేషాలు మానుకోవాలంటూ రేవంత్‌కు చరకలంటించారు. అద్దెమనుషులతో ఊరేగింపులు చేయడం హీరోయిజం కాదన్నారు తుమ్మల.
కేసీఆర్ గురించి మాట్లాడితే ఖబడ్దార్:మంత్రి మహేందర్ రెడ్డి
కేసీఆర్ గురించి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ మంత్రి మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బెయిలొస్తే ముచ్చట కాదని..అసలు కథ ముందుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పసుపుదళంపై మండిపడ్డారు. చంద్రబాబు గైడెన్స్‌తోనే రేవంత్ మాట్లాడుతున్నారని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్‌ వస్తే కేసీఆర్ జ్వరం వచ్చిందన్న లోకేష్‌ను బర్గర్ బాబంటూ గంగుల కమలాకర్ కామెంట్ చేశారు. మరోవైపు రేవంత్‌రెడ్డికి బెయిల్‌వద్దంటూ ఏసీబీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ నేడు విచారణకు రానుంది.

 

07:02 - July 3, 2015

రంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న హరితహారం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఈనెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేసీఆర్‌ 
శుక్రవారం రోజున సీఎం కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా చిలుకూరులో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలుత బాలాజీ దేవాలయంలో దేవుడిని దర్శించుకుని అనంతరం మొక్కలు నాటనున్నారు. అక్కడినుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మేడిపల్లి, నారపల్లిలో కేసీఆర్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
4వ తేదీన మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన 
ఇక 4వ తేదీన మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ హరిత హారం కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తూంకుంట, షామీర్‌పేట, తుర్కపల్లి, సిద్దిపేట, మిట్టపల్లి, పాలమాకుల, బద్దిపడ్గా, బస్వాపూర్‌లలో కేసీఆర్‌ మొక్కలు నాటుతారు. అనంతరం కరీంనగర్‌ జిల్లాకు చేరుకుంటారు. హుస్నాబాద్‌, చిగురుమామిడి, కొత్తపల్లి, తిమ్మాపూర్‌లలో నిర్వహించే హరితహారంలో సీఎం పాల్గొంటారు. అదేరోజు రాత్రి ఎల్‌ఎండీ డ్యామ్‌ వద్ద కేసీఆర్‌ బస చేస్తారు.
6వ తేదీన నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలో హరితహారం
ఇక 5వ తేదీన కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి, ధర్మారం మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటకు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి నేరుగా జన్నారం, కడెం, ఖానాపూర్‌, నిర్మల్‌లలో జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొంటారు. అదేరోజు రాత్రి నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో బస చేస్తారు. 6వ తేదీన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌, మోతే, ఆర్మూర్‌, నిజమాబాద్‌ అర్బన్‌, సదాశివనగర్‌, కామారెడ్డిలో పర్యటిస్తారు. ఆ తర్వాత మెదక్‌ జిల్లా రామాయంపేటలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని.. కేసీఆర్‌ మొక్కలు నాటుతారు.

 

నేడు రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 

06:42 - July 3, 2015

జైపూర్ : సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, హేమమాలిని గాయపడ్డారు. మధుర నుంచి జైపూర్ వైపు వెళ్తున్న ఆమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆల్టోలో ప్రయాణిస్తన్న నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా హేమమాలిని కుడి కనుబొమ్మ వద్ద గాయమయ్యి, ముఖమంతా రక్తసిక్తమయ్యింది.  క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఫోర్టిస్ ఆసుపత్రితికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నేడే..

హైదరాబాద్ : నేడు ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీనికోసం కర్నూలు ఆదోని, నంద్యాల, ఒంగోలు, కందుకూరు, మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకు కొనసాగుతుంది. 

Don't Miss