Activities calendar

04 July 2015

హైదరాబాద్ లో సీసీ కెమెరాలకు రూ.58 కోట్లు...

హైదరాబాద్: నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.58 కోట్లను తెలంగాణ ప్రభుత్వ కేటాయించింది. అలాగే సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ భవన్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టివేత..

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధికారులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టివేశారు. రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలులో 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

టీఎస్ సీఎస్ కు గవర్నర్ లేఖ

హైదరాబాద్: టీఎస్ సీఎస్ రాజీవ్ శర్మకు గవర్నర్ నరసింహన్ లేఖ రాశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలని సూచించారు.

 

ఏలూరులో పసికందు విక్రయానికి యత్నం..

ప.గో: ఏలూరు గణేష్ నగర్ లో దారుణం జరిగింది. ఆరు నెలల పసికందును విక్రయించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. సూత్రధారి రవిప్రకాశ్ ను అరెస్టు చేశారు. 

చిత్తూరు జిల్లాలో దారుణం...

చిత్తూరు: జిల్లాలోని శర్మన్ స్కూల్ లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ప్రధానోపాధ్యాయురాలి భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలోనూ పులువురు చిన్నారులపై అతడు లైంగిక దాడికి ప్పాడినట్లు సిబ్బంది చెబుతున్నారు.

 

21:45 - July 4, 2015

యూపీ: ముజఫర్‌నగర్‌ రోడ్డు ప్రమాదం ఇద్దరు స్కూలు విద్యార్థులను బలితీసుకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ... బంధువులు ఆందోళనకు దిగారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని శాంతింపజేసే క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం మొదలై తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి... జనాలను చెదరగొట్టారు.

 

21:42 - July 4, 2015

హైదరాబాద్: సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్‌ రావటం పట్ల ఇరా సింఘాల్ ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కావాలన్న కల నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇందుకోసం నాలుగేళ్లుగా తీరిక లేకుండా చదివినట్లు స్పష్టం చేశారు. ఈ విజయం సాధించటంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ... పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు వెలువడగానే... హైదరాబాద్‌లో తన... బ్యాచ్‌మేట్లతో కలిసి ఇరా సింఘాల్ సంబరాలు చేసుకున్నారు.

21:38 - July 4, 2015

కడప: 14 రోజుల రిమాండ్‌లో ఉన్న భూమా నాగిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన వైద్యులు నిమ్స్ కు తరలించాలని సూచించారు. అయితే అధికారులు మళ్లీ ఆళ్లగడ్డ సబ్‌జైలుకే తీసుకెళ్లడంతో.. భూమా దీక్షకు దిగారు. ఆహారం, మందులు తీసుకోకుండా నిరసన ప్రకటించారు. సాయంత్రానికి మళ్లీ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి భూమాను తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నిమ్స్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ ఎమ్మెల్యేపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మండిపడుతున్నారు.

 

21:34 - July 4, 2015

వరంగల్‌: జిల్లాలోని కడెవెండిలో దొడ్డి కొమురయ్య వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి 10 వామపక్షపార్టీల నేతలు హాజరయ్యారు. సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకటర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలోని అమర వీరుల స్థూపానికి నేతలు నివాళ్లు అర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నిజాం పరిపాలనపై దొడ్డి కొమురయ్య చేసిన పోరాటాన్ని....ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు.

 

21:33 - July 4, 2015

నల్లగొండ: జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం... గ్రామపంచాయతీ ఉప ఎన్నిక ఫలితం విడులైంది. ఈ ఎన్నికలో సీపీఎం అభ్యర్థి జూలకంటి కొండారెడ్డి విజయం సాధించారు. ఇంతకుముందు సర్పంచ్‌గా ఉన్న పురంధర్‌రెడ్డి....హత్యకు గురికావటంతో ఉప ఎన్నికను నిర్వహించారు. గ్రామంలో మళ్లీ సీపీఎం అభర్థే గెలవటంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

భూమా నాగిరెడ్డి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

కర్నూలు: భూమా నాగిరెడ్డిని ఆళ్లగడ్డ సబ్ జైలు నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

అరవింద్ పనగారియాకు కేంద్రకేబినెట్ హోదా

ఢిల్లీ: నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాకు కేంద్రకేబినెట్ హోదా కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

 

వరంగల్ ఎంపి స్థానానికి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి..?

హైదరాబాద్: వరంగల్ ఎంపి స్థానానికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పది వామపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 20న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై 10 వామపక్ష పార్టీల సదస్సు నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. జరగబోయే ఏ... ఎన్నికల్లోనూ.. బూర్జువా పార్టీలతో పొత్తుపెట్టుకోకూడదని వామపక్ష పార్టీల నేతల నిర్ణయం తీసుకున్నారు.

బాపట్లలో కారు ప్రమాదం..

గుంటూరు: బాపట్ల మండలం అప్పగట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూర్యలంక బీచ్ నుంచి గుంటూరు వస్తుండగా ప్రమాదం సంభవించింది.

 

సీఎంఎల్ ఎస్ లో సత్తా చాటిన వేదితారెడ్డి

శ్రీకాకుళం: జిల్లాకు చెందిన వేదితారెడ్డి.. సీఎంఎల్ ఎస్ లో సత్తా చాటాడు. 71వ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని వేదితారెడ్డి అన్నారు. 'ఐఏఎస్ కావాలనేది నా చిన్ననాటి కల' అని వేదితారెడ్డి తెలిపారు. తల్లిదుండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంక్ సాధించానని పేర్కొన్నారు. 

వైసిపి ఎమ్మెల్యేలు నన్ను టార్గెట్ చేస్తున్నారు: కలెక్టర్ రమణ

కడప: వైసిపి ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రమణ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

రాష్ట్రపతిని కలవాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు

హైదరాబాద్: సెక్షన్-8 తోపాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై రాష్ట్రపతిని కలవాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు.

 

కేసీఆర్ కు అమ్ముడు పోయిన జగన్: ఎమ్మెల్సీ గాలి

హైదరాబాద్: వైసిపి అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఘాటు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కు అమ్ముడు పోయిన జగన్ ఆంధ్ర ప్రజల హక్కుల గురించి ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. వైసిపి నేత భూమా నాగిరెడ్డి కేసీఆర్ దగ్గర రక్షణ పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. నిన్న రాష్ట్రపతి చేసిన వాఖ్యలు కేసీఆర్ ను ఉద్దేశించి చేసినవేనని పేర్కొన్నారు. తన మామకు రాజకీయ జన్మనిచ్చింది...టీడీపీయేనని హరీశ్ రావుకు తెలియదా.. అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ లో 60 శాతం మంది నాయకులు టిడిపి వారే ఉన్నారని తెలిపారు. టీడీపీ ఆంధ్రా పార్టీ కాదని... తెలుగు ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు.

 

19:25 - July 4, 2015

కృష్ణ: విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో కలుషిత ఆహారం తిని 200 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే.. గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించింది. ఉదయం అల్పాహారం తిన్న తర్వాత.. విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తోందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై ఆరా తీస్తున్నారు.

 

19:21 - July 4, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం ముగిసింది. దాదాపు 8 గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించిన సీఎం.. అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. గృహనిర్మాణ రంగంలో అవకతవకలపై సభాసంఘం వేయాలని.. విజిలెన్స్ తోనూ విచారణ జరిపించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

 

19:19 - July 4, 2015

గుంటూరు: జిల్లాలో భజరంగదళ్‌ జూట్‌మిల్లును లాకౌట్‌ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో కార్మికులంతా ఆందోళనకు దిగారు. మిల్లు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

19:17 - July 4, 2015

ఢిల్లీ: ఎంతో ఆతృతగా ఎదురుచూసిన యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మొదటి నాలుగు ర్యాంకుల్లో మహిళే నిలిచారు. ఇరా సింఘాల్ టాప్ ర్యాంకర్. రేను రాజ్‌, నిధి గుప్తా వరుసగా తర్వాతి ర్యాంకుల్లో సాధించారు. సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులూ సత్తాచాటారు. ఎం.సాకేత్‌ రాజా 14వ ర్యాంక్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి 21, సుంకర రాజ్‌గోపాల్ 49, క్రాంతికుమార్ 50, ఎంవీఆర్‌కె తేజ 66, వేదితారెడ్డి 71, టి.లక్ష్మీభవ్య 88, ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ 166వ ర్యాంక్ సాధించారు. ట్యాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన ఇరా సింఘాల్ ఢిల్లీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. రెండో ర్యాంకర్ రేనురాజ్‌ కేరళకు చెందిన వైద్యురాలు. తొలిర్యాంక్ సాధించటం పట్ల సింఘాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తానింకా నమ్మలేకపోతున్నాని చెప్పారు. ఐఎఎస్ అధికారి కావాలన్న కల నెరవేరబోతోందని తెలిపారు.

 

19:09 - July 4, 2015

నల్గొండ: బీబీనగర్‌లో వేస్ట్ నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛ కమిటీ బృందం ఈ ప్లాంట్‌ను సందర్శించారు. 11 వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌.. ఆగస్ట్‌ మొదటివారంలో జనరేషన్‌ ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. 11 వందల టన్నుల చెత్తను దీనికి ఉపయోగిస్తారని వారంటున్నారు. 27 ఎకరాల్లో ప్లాంటు నిర్మాణం చేపడుతున్నారు. ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. 230 కోట్లతో ప్రాజెక్టు డిజైన్ చేశారు. 1850 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్తతల వద్ద చెత్తను మరిగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.

 

18:55 - July 4, 2015

ఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం లొంగుబాటును రిజెక్ట్ చేశారన్న ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్ స్పందించారు. రాంజెఠ్మలాని దావూద్‌ ప్రపోజల్‌ తీసుకొచ్చిన మాట వాస్తవమే కానీ షరతులు పెట్టారన్నారు. దావూద్‌ ఇబ్రహీం ముంబైకి రాగానే అరెస్ట్ చేయకూడదని, హౌస్‌ అరెస్టుకు అనుమతివ్వాలన్న షరతులు పెట్టడం ఎంతవరకు సబబన్నారు. ముంబై బ్లాస్టుతో సహా పలు నేరాల్లో నిందితుడైన దావూద్‌ ఇబ్రహీంను అరెస్ట్ చేయొద్దనడాన్ని ఎలా సమర్థిస్తారని పవార్‌ ప్రశ్నించారు. ఎంతటి వారైనా ఇక్కడి చట్టాలకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని శరద్‌పవార్‌ స్పష్టం చేశారు.

 

18:51 - July 4, 2015

ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై రామ్‌జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముంబై వరుస పేలుళ్లు సహా దావూద్‌పై వున్న నేరాలు అవాస్తవమన్న మాటలపై... కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌... ఎలాంటి వ్యాఖ్య చేయబోనన్నారు. సీపీఐ మాత్రం ఈ విషయంలో నిజానిజాలను వెల్లడించాలని కోరింది. ఆ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో వున్న శరద్‌పవార్‌ వెంటనే వివరణ ఇవ్వాలని సీపీఐ సీనియర్ నేత రాజా డిమాండ్ చేశారు.

 

18:48 - July 4, 2015

హైదరాబాద్: వీర తెలంగాణ రైతాంగ విప్లవ జ్వాలకు పురుడు పోశాడు. నాటి రాజాకార్ల దౌర్జాన్యాలను తన ధీరత్వంతో ఎదురొడ్డి నిలిచాడు. దేశ విముక్తి కోసం, నైజాం నవాబుల దౌర్జన్యాలకు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాడు. అలనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రాణాలర్పించారు. ఆయనే దొడ్డి కొమురయ్య. ఇవాళ ఆయన 69వ వర్ధంతి సందర్భంగా అనాటి పోరాట జ్ఞాపకాల్ని 10 టీవీ గుర్తు చేస్తోంది.
నాడు తెలంగాణలో దొర అకృత్యాలు
అది 1940వ దశకం. గడీలను కేంద్రంగా చేసుకుని దొరలు సాగించిన దారుణాలను మౌనంగా భరించాయి తెలంగాణ పల్లెలు. ఆనాడు వెట్టి పేరుతో ప్రజలను నానా హింసకు గురిచేసేవారు. కులాల వారీగా దొరలకు పనులు చేయాల్సి వచ్చేది. వెట్టి చేయని వారిని కట్టేసి.. కొట్టి చంపిన కర్కశులు ఆనాటి దొరలు. మహిళల రక్షణకు.. ప్రజల ప్రాణాలకు రక్షణలేని రాక్షస రాజ్యం పల్లెల్లో తాండవించేంది. వెట్టిచాకిరీ పేరుతో ప్రజలను బానిసలుగా చేసుకుని భూస్వాములు చేసిన ఆగడాలకు నిజాం ప్రభువు మద్దతు ఉండటంతో ఆనాటి ప్రజలు దిక్కులేని పక్షులయ్యారు.
దొరసాని గుండాల తూటాకు కొమురయ్య బలి
పల్లెల్లో అమానవీయ, అమానుష పరిస్థితులు ఏర్పడిన సమయంలోనే తెలంగాణలో సంఘం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం అనే నినాదం ఇచ్చింది సంఘం. ఊరురా సంఘాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తున్న సంఘం కార్యక్రమాల పట్ల దొరల గుండెల్లో గుబులు మొదలైంది. కడివెండిలో విస్నూర్‌ దొరల పాలనతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. విస్నూర్‌ దేశముఖ్ తల్లి జానకమ్మ ప్రజలతో రాక్షసంగా ప్రవర్తించేంది. వారితో వెట్టి చేయించేంది. ఈ క్రమంలోనే కడవెండిలో దొడ్డి మల్లయ్య నాయకత్వంలో సంఘం కార్యకలాపాలు చురుగ్గా సాగేవి. ఆ సమయంలోనే 1946 జూలై నాలుగున సంఘం ఆధ్వర్యంలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, లెవీగల్లా పేరుతో దొరలు చేస్తున్న పంట దోపిడీకి వ్యతిరేకంగా ఊరేగింపు మొదలైంది. ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న దొడ్డి కొమురయ్యకు దొరసాని గుండాల తూటా తగిలి అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అతని అన్న సంఘం నేత దొడ్డి మల్లయ్యతో సహా పలువురికి తూటా దెబ్బలు తాకాయి. ప్రజలు తిరగబడి ఆయుధాలు లాక్కోవడంతో కిరాయి మూకలు పారిపోయాయి.
ప్రజా వేగుచుక్క దొడ్డి కొమురయ్య
తెలంగాణ చర్రితలోనే పొద్దు పొడుపును సూచించే వేగుచుక్క దొడ్డి కొమురయ్య. వరంగల్‌ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండి. చిన్న గ్రామం. అయితేనేం, చరిత్ర పుటల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ కడవెండి గ్రామంలోనే. వీరభూమిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దొడ్డి కొమరయ్య పుట్టిందీ, పెరిగిందీ, జనం కోసం మరణించింది ఈ గ్రామంలోనే.
రైతాంగ సాయుధ పోరాటానికి అంకుర్పారణ
ఆంధ్ర మహాసభ కార్యకర్తగా.. హైదరాబాద్‌ రాష్ర్ట ప్రజల సాంఘిక, రాజకీయ అభివృద్ధి కోసం జరిగిన పోరాటంలో కొమురయ్య అగ్రభాగన నిలిచాడు. దొడ్డి కొమురయ్య వీర మరణం.. నిజాం ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం.. రైతాంగ సాయుధ పోరాటానికి అంకుర్పారణ జరిగింది. కడవెండి కేంద్రంగా గెరిల్లా సమరం తెలంగాణ అంతటా దావానంలా వ్యాపించింది. దేశ చరిత్రలో మహోన్నతమైన ప్రజా విప్లవ పోరాటంగా 1946 నుంచి 51 వరకు కొనసాగింది.
1946 జూలై 4న కొమురయ్య వీరమరణం
భూ పంపిణి, వెట్టిచాకిరి నిర్మూలన, పాలనలో భాగస్వామ్యం కోసం నిత్యం జరిగిన పోరాటంలో కొమురయ్య పాత్ర అత్యంత కీలకం. ఆంధ్రమహాసభ ద్వారా దేశభక్తి భావాలు పెంపొందించుకున్న దొడ్డి కొమరయ్య తన ప్రాంత విముక్తి కోసం అలుపెరగకుండా పోరుబాట పట్టాడు. ఆనాటి నైజాం నవాబులకు, అటు విస్నూర్‌ దేశముఖ్‌లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాడుతూ, 1946 జూలై 4న వీరమరణం పొందాడు. ఇప్పటికీ దొడ్డి కొమరయ్య అనేకమంది యువకులకు స్పూర్తి కెరటంగా నిలుస్తున్నారు.
కొమురయ్య వీరమరణం ఉద్యమ బాటకు దిక్చూచి
కొమురయ్య వీర మరణం ఉద్యమ బాటగా, కార్మివర్గ శ్రేయో రాజ్యం కోసం నిర్మితమవుతున్న పోరాటాలకు దిక్కూచిగా నిలిచింది. చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్న దొడ్డి కొమురయ్య 69వ వర్ధంతి ఇవాళ. ఆయన స్ఫూర్తినందుకుని.. ప్రజా ఉద్యమాలు నిర్మించడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి. 

కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

కరీంనగర్: హుస్నాబాద్ మండలం బస్వాపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ మొక్కలు నాటారు. 

భజరంగ్ జూట్ మిల్లు లాక్ ఔట్

గుంటూరు: జిల్లాలోని భజరంగ్ జూట్ మిల్లును లాక్ ఔట్ చేస్తున్నట్లు మిల్లు యాజమాన్యం ప్రకటించింది. కార్మికులను బయటకు పంపి.. యాజమాన్యం మెయిన్ గేట్లకు తాళాలు వేసింది. దీంతో జూట్ మిల్లు ఎదుట కార్మికులు, వామపక్ష నేతలు ఆందోళన చేస్తున్నారు.

 

17:04 - July 4, 2015

విజయవాడ: కృష్ణా కరకట్ట పక్కన ఇళ్లన్నీ తొలగిస్తామని హామీలిచ్చి.. ఇప్పుడు అక్కడే ఏపీ సీఎం నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. అందరికీ ఒక చట్టం.. సీఎంకు వేరొక చట్టంలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని... ఇలాంటి పనులుచేసి ప్రజా వ్యతిరేక సంకేతాలు పంపకూడదని బాబూరావు సూచించారు.

 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్

హైదరాబాద్ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతూ వుంది. గృహ నిర్మాణ రంగంలో అవకతవకలపై శాసనసభ హౌసింగ్ కమిటీ వేయాలని, బాధ్యులపై చర్యలకు ముందు విజిలెన్స్ తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కర ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పుష్కరా లేర్పాట్లు సరిగా చేయలేదని, గోదావరి హారితి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించలేదని కేబినెట్ లో సీఎం దేవాదాయశాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిచినట్లు తెలుస్తోంది.

నేను ఖమ్మంలోనే వున్నా: ఎమ్మెల్యే సండ్ర

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు హాజరు కావాలని రెండో సారి హైదరాబాద్ లో సండ్ర ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నేపథ్యంలో స్పందించిన సండ్ర ఖమ్మంలోనే ఉన్నానని సోమవారం ఏసీబీ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

16:54 - July 4, 2015

హైదరాబాద్: గవర్నర్‌ బాధ్యతల నుంచి నరసింహన్ ను వెంటనే తప్పించాలని టీకాంగ్రెస్ నేత మర్రిశశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన కేంద్రహోంమంత్రికి లేఖ రాశారు. లేఖలో గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై మర్రిశశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించటంలో గవర్నర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మంత్రిగా కొనసాగుతున్నారని చెప్పారు. 2003లో సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ఉల్లంఘించారని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తక్షణమే తలసానిని బర్తరఫ్ చేసేలా..గవర్నర్‌కు ఆదేశాలు జారీచేయాలని మర్రి శశిధర్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

 

ప్రభుత్వ కుట్రలో భాగమే భూమా పై కేసులు: బొత్స

హైదరాబాద్:ప్రభుత్వ కుట్రలో భాగంగానే భూమాపై కేసులు నమోదు చేశారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కర్నూలు వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. భూమా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ పట్ల పోలీసుల తీరును బొత్స ఖండించారు.

16:46 - July 4, 2015

హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నుంచి పిలుపొచ్చింది. అధికారులు రెండో సారి సండ్రకు నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు విచారణకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన లేకపోవడంతో.. బయట తలుపుకు అధికారులు నోటీసులు అంటించారు. ఇదిలావుండగా ఓటుకు నోటు కేసులో విచారణ నిమిత్తం గత నెల 16 వ తేదీన సండ్రకు ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆరోగ్యకారణాల రీత్యా సండ్రా ఎసిబిని పది రోజులు గడువు కోరారు. ఆరోగ్యం కుదటపడ్డాక...విచారణకు ఎసిబి ఎప్పుడు పిలిచినా.. వస్తానని సండ్ర చెప్పారు. ఎసిబి అధికారులు అనుమతి ఇచ్చారు. సండ్ర ఆరోగ్యం మెరుగుపడింది. ఈనేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ సండ్రకు ఎసిబి నోటీసులు పంపింది. అయితే తాను ఖమ్మంలో ఉన్నానని.. వారిచ్చిన గడువు లోపు విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తానని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

ఇమామ్, మౌజన్ లకు భృతి కింద రూ.12 కోట్లు విడుదల

హైదరాబాద్: ఐదువేల మంది ఇమామ్, మౌజన్ లకు నెలకు వెయ్యి రూపాయల భృతి ప్రకటిస్తూ టీఎస్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.12 కోట్లు విడుదల చేసింది.

కడవెండిలో దొడి కొమరయ్య 69వ వర్థింతి వేడుకలు..

వరంగల్: దేవరుప్పల మండలం కడవెండిలో దొడి కొమరయ్య 69వ వర్థింతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్నారు. ఉద్యమ సమయంలో కొమరయ్యను కీర్తించిన టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక నవాబులను పొగడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు నిజాం పీడనకు గురయ్యారని పేదల పక్షాన పోరాడేది వామపక్షాలు మాత్రమేనని తమ్మినేని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో నీతి లేదన్నారు.

మద్యం తాగి పాఠశాలకు వచ్చిన హెచ్ ఎం...

శ్రీకాకుళం: పలాస మండలం గురడఖండి ఎంపీపీ స్కూలు హెడ్మాస్టర్‌ దాసరిరామారావు ఉదయాన్నే ఫుల్‌గా మందు కొట్టి పాఠశాలకు వచ్చి తూలుతూ పడిపోయాడు. మందు కొట్టి స్కూలుకు వచ్చిన హెడ్మాస్టర్‌ను చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసిన గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని హెడ్మాస్టర్‌ను ఆస్పత్రికి తరలించారు. గత ఆరేళ్లుగా దాసరిరామారావు ఈ స్కూల్లో పనిచేస్తున్నారు.

భక్తల్ సెల్ పోన్ వాడలేదు:జైళ్లశాఖ డీఐజీ

హైదరాబాద్:యాసిన్ భత్కల్ మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ తెలిపారు. భత్కల్ తన భార్యతో మాట్లాడిన అంశాలు బహిర్గతం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భత్కల్ వద్ద సెల్ ఫోన్ ఉందన్న మాట అవాస్తవమని చెప్పారు. అతడు తన తల్లితోను, భార్యతోను జైలు ఫోన్ నుంచే మాట్లాడాడన్నారు. నిబంధనల ప్రకారం భత్కల్ మాట్లాడిన ప్రతి కాల్ ను రికార్డు చేశామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలందరికీ ల్యాండ్ లైన్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.ఆ ఫోను వాడుకోడానికి కూడా మొదట్లో తాము భత్కల్ కు అనుమతి ఇవ్వలేదని..

అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న మహిళలపై లాఠీచార్జ్

రాజమండ్రి:కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో కొందరు డ్వాక్రా మహిళలు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాలను నిలువరించి నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసుల లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు.

16:13 - July 4, 2015

హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జైలులో తన భార్య, తల్లితో భత్కల్ 27సార్లు మాట్లాడారని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం తాము ల్యాండ్ ఫోన్లో మాట్లాడేందుకు అనుమతించామని తెలిపారు. వారిద్దరితో భత్కల్ ఫోన్ సంభాషణ హిందీ, అరబిక్ భాషలో ఉందని స్పష్టం చేశారు.

 

మరోసారి సండ్రకు మరోసారి ఏసీబీ నోటుసులు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ ఏసీబీ రెండోసారి నోటీసు ఇచ్చింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలలోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని సండ్ర క్వార్టర్స్ కు ఏసీబీ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసు అంటించి వచ్చారు. 

15:51 - July 4, 2015

హైదరాబాద్: తెలంగాణలోని జేఈఈ విద్యార్థులకు ఊరట లభించింది. తెలంగాణ విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ర్యాంకులు వెబ్‌ సైట్‌లో చూసుకోవచ్చని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆప్షన్ల నమోదుకు రేపటి వరకు గడువు ఉందని మంత్రి చెప్పారు. 

15:49 - July 4, 2015

కడప: జిల్లా జెడ్ పి సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. అధికార పార్టీ టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఒకరిని మించి మరొకరు మైకులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. సమావేశంలో కలెక్టర్‌ రమణ-వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పర్యటన సమాచారం జిల్లా కలెక్టర్‌ తమకు ఇవ్వడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. జెడ్పీ ఛైర్మన్‌ గూడూరు రవి అనుమతి లేకుండా వైసీపీ ప్రజాప్రతినిధుల మైక్‌ తీసుకుని కలెక్టర్‌పై వరుసగా దిడి చేయడంతో ఆయన రవిపై అసహనం వ్యక్తం చేశారు. ఇటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి కూడా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడుతూ.. మైకు విరగొట్టారు. దీంతో రఘురామిరెడ్డి తీరుకు నిరసనగా టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి కూడా మైక్‌ విరగొట్టాడు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టర్‌ రమణ జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు.

 

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలి:జగన్

ప.గో: దేవరపల్లిలో పొగాకు రైతులతో వైసీపీ అధినేత జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదో తేదీలోగా గిట్టుబాటు ధర కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని జగన్ హెచ్చరించారు. 

నరసింహన్ ను గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించండి:మర్రిశశిధర్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర హోంమత్రికి టి. కాంగ్రెస్ నేత మరి శశిధర్ రెడ్డి లేఖ రాశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో విఫలమైన గవర్నర్ నరసింహన్ ను గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలని లేఖలో పేర్కొన్నారు. 2003లో సుప్రీం కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మంత్రి గా కొనసాగుతున్నారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షన కోసం తక్షనమే తలసానిని బర్తరఫ్ చేసేలా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో మర్రి పేర్కొన్నారు.

15:01 - July 4, 2015

చెన్నై: తమిళనాడులోని మధురైలో జరిగిన ఓ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. సొంత కూతురికే తాళి కట్టి తన రెండోవ భార్యగా చెబుతూ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ మూర్ఖుడిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. తన 12 ఏళ్ల కూతురిపై ఓ తండ్రి గత ఆరు నెలలకుపైగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతని దారుణంపై ఫిర్యాదు చేసేందుకు భార్య సైతం ధైర్యం చేయలేకపోయింది. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బయపెట్టాడు. ఈ క్రమంలో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. విషయాన్ని గమనించిన ఇరుగు-పొరుగువారు చైల్డ్ లైన్ సంరక్షణ అధికారులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయవద్దు:ఏపీ కేబినెట్

హైదరాబాద్:సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తూ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయవద్దని ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఆధార్ స్థానంలో ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గుంటూరు కేంద్రంగా బేవరేజ్ కార్పొరేషన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు కేంద్రంగా బేవరేజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

గాంధీ భవన్ లో డీఎస్.కెకె, బొత్స పోటోల తొలగింపు

హైదరాబాద్ : గాంధీభవన్ నుండి పార్టీ మారిన పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాసరావు, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణల ఫోటోలను తొలగించారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీ భవన్ ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని వీహెచ్ ఆరోపించారు.

కోర్టు ఆదేశాలతోనే భత్కల్ కు ఫోన్ సౌకర్యం...

హైదరాబాద్:భత్కల్ ఫోన్ సంభాషణలపై డీఐజీ నరసింహ స్పందించారు. 2014 నవంబర్ నుంచి భత్కల్ చర్లపల్లి జైలులో ఉంటున్నా సెల్‌ఫోన్ వాడటం లేదని తెలిపారు. జైలులోని అందరు ఖైదీలకు ల్యాండ్ లైన్ ఫోన్ సౌకర్యం ఉందన్నారు. భత్కల్‌కు ల్యాండ్ లైన్ ద్వారా మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు. ఈ మధ్యనే మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలతో కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేందుకు భత్కల్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఎన్‌ఐఏ, నిఘా విభాగాలు అనుమతించాకే ఫోన్ మాట్లాడేందుకు అవకాశమిచ్చామని స్పష్టం చేశారు. ఐదు నిమిషాల పాటు వారంలో రెండు సార్లు మాత్రమే మాట్లాడేందుకు అనుమతిచ్చామని చెప్పారు.

టిఆర్ ఎస్ పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది:సీపీఐ నారాయణ

హైదరాబాద్‌: ఇతర పార్టీల నాయకులంతా చేరి టీఆర్‌ఎస్‌ పడవ బరువెక్కిందని...అది మునిగిపోయే ప్రమాదం ఉందని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. అసలైన టీఆర్‌ఎస్‌ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, బట్ట కాల్చి ప్రజల మీద వేసి ఫాంహౌస్‌లో ఉండటం కేసీఆర్‌కే చెల్లింద ని నారాయణ విమర్శించారు. రాష్ట్రపతి కాళ్లకు మొక్కడం కాదని...రాష్ట్రపతి సలహాలు పాటించాలని నారాయణ కోరారు.

13:48 - July 4, 2015

ముంబై : అండర్‌ డాన్‌ వరల్డ్ దావూద్‌ ఇబ్రహీం తనకు ఫోను చేసి మాట్లాడారని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. 1993 ముంబై బాంబ్‌ బ్లాస్ట్ తో సహా తనపై చేసిన ఇతర నేరారోపణలన్నీ అవాస్తవాలేనని దావూద్‌ చెప్పినట్టు జెఠ్మలాని పేర్కొన్నారు. తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ లాంటి చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలని కోరినట్టు తెలిపారు. తనను హౌస్‌ అరెస్ట్ చేసి విచారణ జరపాలని, ఒకవేళ తాను తప్పు చేసినట్టయితే ఏ శిక్షకైనా సిద్ధమేనని దావూద్‌ తెలిపినట్టు జెఠ్మలాని వెల్లడించారు. ఈ విషయంలో అప్పటి కేంద్రమంత్రి శరద్‌పవార్‌ను సంప్రదిస్తే ఆయన రిజెక్ట్ చేశారన్నారు. లండన్‌లో దావూద్‌ సన్నిహితుడు చోటా షకీల్‌ను కలుసుకున్నట్టు పత్రికల్లో వచ్చిన వార్తను రాంజెఠ్మలాని ఖండించారు.

13:47 - July 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4వేల మందిలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎమ్‌బీ.భవన్‌లో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని సీపీఎం ఘనంగా నిర్వహించింది. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి సీపీఎం నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

13:46 - July 4, 2015

హైదరాబాద్ :వామపక్షాల విలీనానికి సీపీఐ సిద్ధంగా వుందని ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ అవినీతి పాలనపై కేంద్రకమిటీ సమావేశాల్లో చర్చించామన్నారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని, మిగిలిన వామపక్ష పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని నారాయణ స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎస్ కు రెవెన్యూ ఉద్యోగుల నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మకు రెవెన్యూ ఉద్యోగులు నోటీసులు అందజేశారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ వర్క్ టు రూల్ నోటీసు ఇచ్చింది. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లా 8 గంటల పని విధానమే అమలు చేయాలని, ప్రమోషన్ల ద్వారా తహశీల్దార్ పోస్టులు భర్తీ చేయాలని, అలవెన్సులు పెంచాలనీ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించాలని... స్పందికపోతే 13న సీసీఎల్ఏ ను మట్టుడించబోతున్నట్లు ప్రకటించారు.

13:35 - July 4, 2015

కడప : సమస్యలు తీరుస్తారని ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు మాత్రం సమస్యలను ప్రస్తావించకుండా ఆధిపత్య పోరుకు తెరతీస్తున్నారు. జడ్పీ సమావేశంలో ఈ సారైనా తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్న జిల్లా వాసులకు రిక్తహస్తమే ఎదురవుతోంది. శనివారం నాడు జరిగిన సమావేశం చూస్తే తెలుస్తోంది. సమావేశంలో ఒకరు మైక్ విరగొడితే తామేం తక్కువ తినలేదని అధికార పక్షానికి చెందిన వారు కూడా మైక్ ను విరగ్గొట్టారు.
అధిపత్యం నిరూపించుకోవడానికే..
కడప జిల్లా జడ్పీ సమావేశం ప్రతిసారి అల్లర్లకు..వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అధిపత్యం నిరూపించుకోవడానికి మాత్రమే అధికార పక్ష టిడిపి, ప్రతిపక్షం వైసీపీ ప్రయత్నిస్తోంది. కలెక్టర్ రమణ పై వైసీపీ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా మానిటరింగ్ సమావేశంలో వైసీపీ సభ్యులు కలెక్టర్ పై పలు ఆరోపణలు చేశారు. టిడిపికి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కలెక్టర్ పై వైసీపీ గుర్రు..
ఈ నేపథ్యంలో శనివారం జిల్లా జడ్పీ సమావేశం జరిగింది. బాబు పర్యటనలో తమకు ఆహ్వానం రాలేదని..రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమస్యలపై మాట్లాడుదామని కలెక్టర్ రమణ సూచించారు. కానీ ఏమాత్రం వినిపించుకోని వైసీపీ సభ్యులు కలెక్టర్ పై ఆరోపణలు గుప్పించారు. సభ కంట్రోల్ లేకుండా పోతోందని..మైక్ లు తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పక్కనే ఉన్న జడ్పీ ఛైర్మన్ తో కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మైదుకూరు ఎమ్మెల్యే తన ఎదుట ఉన్న మైక్ ను విరగ్గొట్టారు. మా చేతిలో కూడా మైక్ ఉందని..తాము కూడా విరగ్గొడుతామని టిడిపి సభ్యుడొకరు మైక్ విరగ్గొట్టాడు. వివాదం కాస్తా టిడిపి వర్సెస్ వైసీపీగా మారిపోయింది. టిడిపి, వైసీపీ సభ్యులు విమర్శల వర్షం గుప్పించుకున్నారు. కేకలతో సభా ప్రాంగణం దద్ధరిల్లింది. ఒకనొక దశలో కొట్టుకుంటారా ? అనే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం సరిదిద్దలేదు. చివరిలో వచ్చిన పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

ఇరు వర్గాల మధ్య ఘర్షణ:10మందికి గాయాలు..

పగో: జిల్లాలోని పెరవలి మండలం పిల్లవేమవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థల వివాదంతో పాటు ఓ యువతి పట్ల రెండో వర్గానికి చెందిన వారు అసభ్యంగా ప్రవర్తించడం రగడకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు.

ఆకర్షణీయ నగరాల ప్రతిపాదన రూపకల్పనకు కమిటి

హైదరాబాద్:రాష్ట్రంలో ఆకర్షణీయ నగరాల ప్రతిపాదన రూపకల్పన అమలుపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో పురపాలక శాఖ సంచాలకులు సభ్య కార్యదర్శిగా కొనసాగనున్నారు.

తెలంగాణ జేఈఈ రాసిన విద్యార్థులకు ఊరట

హైదరాబాద్ : జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు గల్లంతైన తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభించింది. ర్యాంకులు గల్లంతైన జేఈఈ విద్యార్థులకు సీబీఎస్‌ఈ అనుబంధ ర్యాంకులు ఇవాళ ప్రకటించింది. ఈ నెల 5న సాయంత్రం వరకు ఐచ్ఛికాలు ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. 1188 మంది విద్యార్థుల అనుబంధ ర్యాంకుల వివరాలను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఉంచారు. ర్యాంకులు గల్లంతైన 1188 మంది విద్యార్థులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగనీయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పిన విషయం విదితమే.

2014 సివిల్స్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: 2014 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి ఐదు ర్యాంకుల్లో నలుగురు అమ్మాయి లు ఉన్నారు.

రేణు రాజ్ - రెండో ర్యాంకు
నిధి గుప్త - మూడో ర్యాంకు
వందనారావు - నాలుగో ర్యాంకు
సుహర్ష భగత్ - ఐదో ర్యాంకు. 

సర్వీస్ సెంటర్ కు కేసీఆర్ కొత్త బస్

మెదక్‌:జిల్లా పర్యటనల కోసం రూ.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ప్రగతిరథం బస్సులో సరైన సౌకర్యాలు లేవంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు ప్రగతిరథంలో మార్పుల కోసం వనస్థలిపురంలోని సర్వీస్‌సెంటరుకు తరలించారు.

ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు:సీఎం కేసీఆర్‌

మెదక్: మూడున్న రేళ్లలో మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు రప్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. తన సొంత డబ్బుతో కాళేశ్వర స్వామికి కిరీటం చేయిస్తానన్నారు. గోదావరి నీటితో మా ఆడబిడ్డల పాదాలు కడుగుతా.. పొలాలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. సిద్ధి పేటకు రైల్వే ప్రాజెక్టు మంజూరైందని... ఆ పనులు కూడా మొదలయ్యాయన్నారు.

13:11 - July 4, 2015

మెదక్ : సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తాను ఇక్కడి వాడినని, ప్రజల దీవెనలతో ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. పంటలు పండించుకోవడానికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని, అలాగే హైదరాబాద్ కు నార్త్ లో విమానాశ్రయం త్వరలోనే వస్తుందన్నారు. సిద్ధిపేటకు రైలు మంజూరైందని, ఈ పనులు జరుగుతున్నాయన్నారు. సిద్ధిపేటను జిల్లా చేయడం..సాగు నీరందించడం..రైలు తేవడం.. ఈ మూడు కల్పిస్తే సిద్ధిపేట అద్భుతంగా ముందుకు పోతుందున్నారు. సిద్ధిపేటలో ప్రతీ గ్రామానికి సాగునీరు అందిస్తామని, కాళేశ్వరం నుంచి సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారు. కాళేశ్వరం దగ్గర జరిగే శంకుస్థాపనకు సిద్ధిపేట నుండి ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరంలో విగ్రహానికి తన సొంత ఖర్చులతో బంగారు కిరీటం చేయిస్తానని తెలిపారు. జిల్లా కేంద్రం ఎక్కడ పెట్టాలో మీరే నిర్ణయించుకోవాలిని, సిద్ధిపేట జిల్లా కేంద్రం, మెదక్ జిల్లా కేంద్రం అవుతుందన్నారు.
చెట్లు నాటాలని సీఎం చెప్పాలా?
చెట్లు నాటాలని సీఎం చెప్పాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్ర వారి పాలనలో ఆగమై పోయినామని, ఈ కాలంలో ఎండలు ఉంటాయా అని తెలిపారు. ఈ కాలంలో వానలు రావలంటే మొక్కలు నాటాలని, అడవుల విస్తీర్ణం పెంచాలని సూచించారు. వానలు రమ్మంటే రావాలి..పొమ్మనప్పుడు పోవాలే అని తెలిపారు. హరితహారం ఒక్కరితో విజయవంతం కాదని, ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందని తెలిపారు. ఈ హరితహారం కార్యక్రమంలో ఐదు కోట్ల గ్రాంట్ ప్రకటించడం జరిగిందని, ఇది సిద్ధిపేట వాసులు కొట్టేయాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 

12:47 - July 4, 2015

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. 1996-97 సంవత్సరంలో సిద్ధిపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ సిద్ధిపేటలో వేలాది మొక్కలు నాటారని గుర్తు చేశారు. ఆనాడే మొక్కలు నాటి సిద్ధిపేటను పచ్చగా చేశారన్నారు. ప్రస్తుతం సీఎం స్థాయిలో కేసీఆర్ మొక్కలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అంతేగాకుండా సిద్ధిపేట వారికి ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, పదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో దీనికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సిద్ధిపేట జిల్లా అవుతుందని....రైళ్లు వస్తుంది..కాలువల ద్వారా నీరు వస్తుందని ఆనాడు కేసీఆర్ పేర్కొంటే ఇది సాధ్యమా అని అన్నారు. ఈ మూడింటిని కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. హరితహారం కార్యక్రమానికి నంగునూరు మండల ఉద్యోగులు ఒక రోజు వేతనం ఇచ్చారని అలాగే ప్రజాప్రతినిధులు కూడా విరాళం ఇస్తామన్నారు. 

12:40 - July 4, 2015

హైదరాబాద్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఎస్ఎఫ్ఐ పోరాటం ఉధృతం చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఐదు వేల రూపాయలకు కుదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఉన్నత విద్యా మండలి ముట్టడికి ప్రయత్నించింది. ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించేందుకు ముందుకు కదిలారు. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం డౌన్..డౌన్..అంటూ విద్యార్థులు నినదించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు అక్కడనే బైఠాయించారు. చివరకు పోలీసులు నేతలను ఈడ్చుకెళ్లారు. వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ దీక్షా పైలాన్ ను ఆవిష్కరించి సీఎం కేసీఆర్...

మెదక్:సిద్ధిపేటలో తెలంగాణ దీక్షా పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ కోసం 1531 రోజులు దీక్ష చేసిన స్థలం దగ్గర పైలాన్‌ను నిర్మించారు. తెలంగాణ దీక్షా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు. అంతకుముందు హరితహారంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయం, బస్ డిపోలో సీఎం మొక్కలు నాటారు.

ఓ ప్రైవేటు కళాశాలలో 200 మంది విద్యార్థులకు అస్వస్థత

విజయవాడ: గూడవల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో విషపూరిత ఆహారం తిని 200 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్ఫాహారం తిన్న వెంటనే విద్యార్థులకు వాంతులు ప్రారండబం అయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా బాధితులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఎమ్మెల్యీగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ తన కార్యాలయంలో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు.

12:21 - July 4, 2015

అనంతపురం : పోలీసులను దూషించిన కేసులో అరెస్టయిన వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ సబ్ జైలులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. భూమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భూమాకు హై బిపి, ఛాతి నొప్పి ఉందని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ జైలు అధికారులు తనకు ఎస్కార్ట్ ఏర్పాటు చేయలేదని, చేసేంత వరకు తాను నిమ్స్ కు తరలివెళ్లేది లేదని భూమా భీష్మించుకూర్చున్నారు. నీళ్లు తాగకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
భూమా ఎందుకు అరెస్టయ్యారు..
కర్నూలులో స్థానిక సంస్థల శాసనసమండలి ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తన కూతురు, ఎమ్మెల్యే అఖిల ప్రియకు ఓటు వేసి వెళ్లాలని పోలీసులు చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఎమ్మెల్యే అని చూడకుండా ఎలా పొమ్మంటారని నాగిరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. నిబంధనలను చూపాలని నిలదీశారు. దీనితో పోలీసులకూ, భూమాకూ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విధులకు ఆటంకపరిచారని, పోలీసులను దుర్భషలాడారని భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసి 353, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్సు డిఎస్ పి దేవదానం దళితుడు కావడంతో దురుసుగా ప్రవర్తించారని సాయంత్రం భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. 

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన హేమమాలిని

హైదరాబాద్: సినీ నటి, బిజెపి ఎంపి హేమమాలిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల కిత్రం హేమమాలిని ప్రయాణిస్తున్న మెర్సిడిన్ కారు కాజస్తాన్ లోని దౌసా వద్ద ఆల్టో కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా హేమమాలినికి గాయాలయిన సంగతి తెలిసిందే...

ఉన్నత విద్యామండలిని ముట్టడించిన ఎస్ ఎఫ్ ఐ

హైదరాబాద్:విద్యారంగలో సమస్యలు పరిష్కరించాలని, ఫీజురీయింబర్స్ మెంట్ ను 5వేల ర్యాంకులకు కుదించడాన్ని నిరసిస్తూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించింది.

12:13 - July 4, 2015

కర్నూలు : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేశారని ఎంపిటిసి బాల హుస్సేన్ శనివారం నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో బుడ్డా రాజశేఖరరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో ఎమ్మెల్యే బుడ్డా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ సైతం స్విచాఫ్ చేసుకున్నారు.
కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో టిడిపికి చెందిన ఎంపిటిసి బాల హుస్సేన్ అదృశ్యమయ్యారు. వైసీపీ నేతలే తమ ఎంపిటిసిని కిడ్నాప్ చేశారని టిడిపి ఆరోపించింది. నాటకీయ పరిణామాల మధ్య బాల హుస్సేన్ నంద్యాల పీఎస్ లో ప్రత్యక్షమయ్యారు. తనను ఎమ్మెల్యే బుడ్డాతో పాటు మరో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. దీనితో కేసును బండి ఆత్మకూరు పీఎస్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

దావూద్ ఇబ్రహీం నాతో ఫోన్ లో మాట్లాడారు:రాంజఠ్మలానీ

ఢిల్లీ: ప్రముఖ న్యాయవాది రాంజఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో జరిగిన ముంబై పేలుళ్లతో తనకు సంబంధం లేదని దావూద్ తనతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. ఎటువంటి విచారణకైనా దావూద్ సిద్ధంగా ఉన్నారని, ప్రాణభయంతోనే భారత్ కు రావడం లేదని తెలిపినట్లు జఠ్మలానీ తెలిపారు.

తూముకుంటలో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి: తూముకుంటలో నిర్వహించిన హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరికాసేపట్లో సీఎం సిద్ధిపేటకు చేరుకోనున్నారు.

స్కూలు విద్యార్థులపై దూసకెళ్లి ట్రక్: ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్: ముజఫర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్థులపై నుండి ఓ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఆరుగురి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరసనగా ఎన్ హెచ్ -58 పై గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో భారీ ట్రాఫిక్ స్థంభించింది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న గ్రామస్థులపై లాఠీ ఛార్జీ చేశారు.

11:42 - July 4, 2015

హైదరాబాద్  : కుంభమేళాకు హెచ్ఐవీ ఎయిడ్స్ కు సంబంధమేమిటి అనే అనుమానం వస్తుంది కదా..! అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే..  ఈ నెల 14 నుంచి నాసిక్‌లో జరుగనున్న కుంభమేళా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మహారాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో కండోమ్స్ స్టాక్ తక్కువగా ఉందట. దీంతో కుంభమేళా సమయంలో ఇబ్బంది అవుతుందని అధికారులు గుర్తించారు. ఈ కుంభమేళాకు సుమారు కోటికిపైగా మంది వస్తారని అంచనా. వీళ్లు ఇక్కడ కనీసం మూడు రోజులు ఉండాల్సి వస్తుంది. కాగా వీళ్లు ఈ మూడు రోజులు రక్షణ లేకుండా సెక్స్ లో పాల్గొంటే హెచ్ఐవీ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో మాట్లాడి తగినన్ని కండోమ్స్ ను తీసుకొస్తున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే నాసిక్ లో 2,000 మంది మహిళా సెక్స్ వర్కర్స్, 560 మంది పురుష సెక్స్ వర్కర్స్, 70 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా కుంభమేళా లో 'కండోమ్స్' గోళ ఏంటని సోషల్ మీడియాలో నెటీజన్లు చర్చించుకుంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై కిడ్నాప్ కేసు...

కర్నూలు: వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి తనను కిడ్నాప్‌ చేశారంటూ బండిఆత్మకూరు మండలం ఈర్లపాడు ఎంపీటీసీ బాలుఉసేని ఆరోపించారు. మాట్లాడుకుందామంటూ ఎమ్మెల్యే అనుచరులు వెంట తీసుకువెళ్లి నిర్బంధించారని ఆయన వివరించారు. దీనిపై నంద్యాల రూరల్‌ పోలీసులకు ఎంపీటీసీ బాలఉసేని ఫిర్యాదు చేశారు.

గుంటూరులో జూట్ మిల్ కార్మికుల ఆందోళన

గుంటూరు:ఐదుగురు కార్మికులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట జూట్ మిల్ కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కడప సర్వ సభ్య సమావేశం రసాభాస

హైదరాబాద్:కడప సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ పై వ్యక్తిగతంగా దూషించారని, ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు.

 

11:29 - July 4, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరికి ఘనంగా నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ పై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి బాబు పూలమాల వేశారు. ఈసందర్భంగా బాబు మాట్లాడారు. ఆయన పోరాటం భావితరాలకు ఎంతో స్పూర్తినిచ్చిందని, 9 ఎకరాల్లో రూ.8 కోట్లతో అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపి తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం జరుగుతుందని, విగ్రహం ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని బాబు తెలిపారు. 

తొర్రూరులో భారీగా గంజాయి పట్టివేత

వరంగల్: వాహన తనిఖీల్లో 30 బ్యాంగుల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్ ను అరెస్టు చేశారు. తూర్పుగోదావరినుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోట్లలో ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

 

11:24 - July 4, 2015

విశాఖపట్టణం : ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో జరుగుతన్న అపశృతులపై డీఎస్పీ వర్మ స్పందించారు. ఆయన శనివారం టెన్ టివితో మాట్లాడారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్వల్ప లాఠిఛార్జి చేయాల్సి వస్తోందని డీఎస్పీ పేర్కొన్నారు. సుమారు 9300 మంది టోకెన్లు తీసుకోవడం జరిగిందని, వీరిలో కొందరు ఇక్కడనే పడుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం జరిగిన పరిస్థితులు పునారవృతం కాకుండా ఉండేందుకు బారికేడ్లు పెంచడం జరిగిందన్నారు. అలాగే దశల వారీగా అభ్యర్థులను పరీక్షలకు పంపించడం జరుగుతోందన్నారు. బారికేడ్లపై పడిపోవడంతో పోలీసులు వారి శరీరంపై కాకుండా బ్యాగులపై లాఠీలతో కొట్టడం జరుగుతోందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇలా చేయాల్సి వస్తోందన్నారు.
ఈనెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి భారీగా అభ్యర్థులు తరలివస్తున్నారు. పదో తరగతి నుండి ఇంజనీరింగ్ చదివిన వారు ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకొంటోంది. దీనితో పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారు.

సీఎం నివాస భవనానికి అనుమతి ఎలా ఇస్తారు:బాబూరావు

విజయవాడ: కృష్ణా కరకట్ట మీద కట్టడాలన్నీ అక్రమమేనన్న మంత్రి దేవినేని ఉమ సీఎం నివాస భవనానికి అనుమతి ఎలా ఇస్తారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీ.హెచ్ బాబూరావు ప్రశ్నించారు. సీఎం అందరికీ ఆదర్శంగా ఉండాలి తప్ప ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు దిగటం సమంజసం కాదన్నారు. పేదల ఇళ్లను తొలగించి బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారని మండి పడ్డారు.

11:14 - July 4, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హాయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న భారీ స్కాంపై చర్చ ప్రధానంగా జరుగనున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 14వ తేదీన నుండి ప్రారంభం కాబోతున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పుష్కరాల ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి..ఇతర కేంద్ర మంత్రులను ఆహ్వానించింది. ఇందుకు రూ.1450 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ పుష్కర పనులు సరిగ్గా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి..పనులు ఎక్కడి వరకు వచ్చాయనే దానిపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో 2 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణపై చర్చిస్తారు. అంతేగాక స్మార్ట్ ఏపీ పథకం, నిత్యావసర సరుకులపైనా మంత్రులు చర్చలు జరపనున్నారు. సమావేశంలో పలు పథకాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐతే ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్చను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

సిరియాలో పేలుళ్లు:25 మంది మృతి

హైదరాబాద్: ఉత్తర సిరియాలోని ఓ మసీదులో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. రంజాన్ మాసాని పుష్కరించుకొని మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.

సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ సబర్వాల్ కన్నుమూత

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యోగేశ్ కుమార్ సబర్వాల్ శుక్రవారం కన్నుమూశారు. 2005 నుంచి 2007 జనవరి వరకూ ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. పోలీస్ శాఖలో సంస్కరణలకు సంబంధించి సబర్వాల్ సంచలన తీర్పు ఇచ్చారు. అలాగే జేఎంఎం కేసులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడంపై సీబీఐకి మొట్టికాయలు వేస్తూ, కొత్త ఎఫ్ఐఆర్ వేయాలని ఆయన సంచలన తీర్పును వెల్లడించారు.

తొలి అమరుడు దొడ్డి కొమరయ్య:తమ్మినేని...

హైదరాబాద్:తెలంగాణ సీపీఎం ఆధ్వర్యంలో ఎంబీ భవన్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం నేతలు దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మీట్లాడుతూ... భూ సమస్య ప్రధాన ఎజెండాగా నాటి తెలంగాణ సాయుధ పోరాటం సాగిందన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో 4వేల మంది అమరులయ్యారని తొలి అమరుడు దొడ్డి కొరయ్య అని తెలిపారు. నిజాం దౌర్జాన్యాలకు, ఆగడాలకూ వ్యతిరేకంగా పోరాడిన అమరుడు కొమరయ్య అని కొనియాడారు.

దేశంలో మూడోవంతు జనం పేదలే: ఎన్ ఈసీసీ

ఢిల్లీ: దేశంలో మూడోవంతు జనం పేదలే అని సామాజిక, ఆర్థిక, కుట గణణ(ఎన్ ఈసీసీ-211) తేల్చి చెప్పింది. అంతే మరకొన్ని వివరాలు ఇలా వుఆన్నయి, అత్యధిక వేతనం రూ.5వేల లోపే వున్నారని, ఆదాయ పన్ను చెల్లింపుదార్లు 4.6 శాతం, సొంత ఇంటి యజమానులు 56శాతం మంది, 5.37 కోట్ల కుటుంబాలకు కూలి పనే ఆధారం, 2.37 కోట్ల కుటుంబాలు ఒకే గది, పూరిగుడిసెలో కాపురం, 18-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మగవారు లేని కుటుంబాలు 65.15 లక్షల మంది, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 3.86 కోట్లు, వికలాంగ మగవాళ్లు ఉన్న కుటుంబాలు 7.16 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది.

సాగర్‌హైవేపై విద్యార్థుల ఆందోళన...

నల్గొండ:జిల్లాలోని చింతపల్లి మండలం మదనాపురం దగ్గర సాగర్‌హైవేపై విద్యార్థులు శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. అదనపు బస్సులు వేయాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రారంభమైన ఏపీ కేబినెట్

హైదరాబాద్: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ భేటీలో గృహ నిర్మాణ రంగంలో మార్పులు, చేర్పులు, కొత్తగా రెండు లక్షల ఇళ్ల నిర్మాణం, పుష్కరాల ఏర్పాట్లు, ఉద్యోగుల బదిలీలు, షెడ్యూల్, 9,10లోని సంస్థలపై చర్చించనున్నారు.

కేసీఆర్ 'నయా నిజాం':దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నయా నిజాం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కోట్ల విలువైన బస్సులు, హంగామాలు, హంగులతో కాలం గడిపేస్తున్నారని మండి పడ్డారు.

సిద్ధిపేటకు బయలు దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్:హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేటకు బయల్దేరారు. సీఎం అధికారిక నివాసం నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి వెళ్లారు. సిద్ధిపేటలో మొక్కలు నాటిన అనంతరం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు వెళ్లనున్నారు. హుస్నాబాద్‌లో హరితహారం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

ఆర్యాపురం వద్ద గోదావరి నదిలోకి మురుగు నీరు

తూ.గో: రాజమండ్రి ఆర్యాపురం వద్ద గోదావరి నదిలోకి మురుగు నీరు చేరుతోంది. మరో పది రోజుల్లో గోదారవరి పుష్కరాలు ప్రారంభం కానుండడంతో పుష్కర యాత్రికులు, నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'టెన్ టివి' ప్రభావంతో మురుగు నీటిని అధికారులు నిలిపివేశారు.

చర్లపల్లి జైలుకు భద్రత పెంపు

హైదరాబాద్: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో చర్లపల్లి జైలుకు భద్రతను పెంచారు.చర్లపల్లి జైలులో ఉన్న ఇండియన్ ముజాహిద్తీన్ తీవ్రవాది యాసిన్ భత్కల్ జైలు అధికారిక ఫోన్ నుంచి తన భార్య, తల్లిదండ్రులతో 10 సార్లు మాట్లాడిన సంభాషణలు జైలు అధికారులు నమోదు చేశారు. భత్కల్ సంభాషణలను క్షుణ్ణంగా పరిశీలించి జాతీయ దర్యాప్తు సంస్థ చర్లపల్లి జైలుకు భద్రత పెంచాలని సూచించింది.

మన్యం వీరుడికి సీఎం చంద్రబాబు నివాళి

హైదరాబాద్:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 118వ జయంతి వేడుకల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి రావుల అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

చెన్నైలోని కోకోకోలా కంపెనీ ఉద్యోగి హత్య

చిత్తూరు: తిరుపతి పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు పిట్టాటూరు నాగరాజు అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు. చెన్నైలోని కోకోకోలా కంపెనీ ఉద్యోగి అయిన నాగరాజును కారుతో గుద్ది, రాడ్లతో మోది హత్య చేశారు. మృతుడికి నాలుగునెలల క్రితమే వివాహం అయింది. అతని భార్య రత్న మూడు నెలల గర్భవతి అని పోలీసులు చెప్పారు. దుండుగులు కారును సైతం సంఘటన స్థలంలోనే కాల్చేశారు.

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

హైదరాబాద్: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో హౌసింగ్ పై కేబినెట్ సబ్ కమిటి చేసిన సిఫార్సులు, రాజీవ్ స్వగృహ అవకతవకలపై చర్చించనున్నట్లు సమాచారం. కొత్తగా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బైరటీస్, ఎర్రచందనం అమ్మకాలు, స్మార్ట్ విలేజ్, నత్యవసర ధరల పెరుగుదల, బేవరేజెస్ కార్పొరేషన్ కు ఆమోదం తెలపనుంది.

 

చలర్లపల్లిజైలుకు దినపత్రికల నిలిపివేత:ఖైదీల ఆందోళన

హైదరాబాద్: చలర్లపల్లిజైలుకు దినపత్రికల నిలిపివేశారు. గత రెండు రోజులుగా పత్రికలు అందక ఖైదీలు ఆందోళన చేపట్టారు.

విజయవాడలో ప్రారంభం కానున్న కుటుంబ న్యాయ సలహా కేంద్రం

విజయవాడ:మోటూరు ఉదయ్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు యువతుల, మహిళల కుటుంబ న్యాయ సలహా కేంద్రం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో కుటుంబ న్యాయ సదనం న్యాయమూర్తి,నిర్మలా గీతాంబ, సీపీ వెంకటేశ్వరరావు, సిఐటియు నేత స్వరూపరాణి పాల్గొననున్నారు.

09:48 - July 4, 2015

హైదరాబాద్ : శనివారం సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పలు పథకాలు అమలు, కొత్త పథకాలపై మంత్రులు చర్చించనున్నారు. ఆయా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కేబినేట్ భేటీ ముగిశాక... సీఎం జపాన్ పర్యటనకు వెళ్తారు. శనివారం ఉదయం 11 గంటలకు సచివాయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ స్వగృహ అవకతవకలు, రాష్ట్రంలో 2 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణపై చర్చిస్తారు. అంతేగాక స్మార్ట్ ఏపీ పథకం, నిత్యావసర సరుకులపైనా మంత్రులు చర్చలు జరపనున్నారు. సమావేశంలో పలు పథకాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐతే ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్చను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
6, 7, 8 తేదీల్లో జపాన్‌లో బాబు పర్యటన...
కేబినెట్ మీటింగ్ తర్వాత చంద్రబాబు జపాన్ టూర్‌కు బయలుదేరుతారు. 6, 7, 8 తేదీల్లో సీఎం జపాన్‌లో పర్యటిస్తారు. 7న సాఫ్ట్ బ్యాంకు సీఈవోతో చంద్రబాబు సమావేశమవుతారు. 8న కసీవా నోహా స్మార్ట్ సిటీని ఆయన పరిశీలించనున్నారు. టూర్‌లో సుముటోమా, ఎస్‌ఎన్‌బీసీ, బ్యాంకింగ్ కార్పొరేషన్, మైకావో సంస్థల ప్రతినిధులతోనూ భేటీ అవుతారు. ఆ తర్వాత జపాన్ ప్రధానిని కలిసి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తారు. జపాన్ ప్రధానితో సమావేశమయ్యాక..రాత్రి భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
పెట్టుబడులు ఆకర్షించేలా బాబు ప్లాన్...
పనిలో పనిగా ఏపీకి భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. జపాన్ టూర్‌లో పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ఏపీ పారిశ్రామిక విధానం, వసతుల కల్పన, వాతావరణం వంటి అంశాలను వారికి వివరించనున్నారు.

సరిహద్దుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం, జవాన్ మృతి

శ్రీనగర్:బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. 

హైదరాబాద్ నిమ్స్ కు భూమా నాగిరెడ్డి తరలింపు

కర్నూలు: నంద్యాల పోలింగ్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ అధికారులతో వాగ్వాదానికి దిగిన భూమా నాగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధిక బీపీ, ఛాతినొప్పితో భూమా బాధపడుతుండటంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

నంద్యాల పీఎస్ లోఈర్నపాడు ఎంపీటీసీ

కర్నూలు: కిడ్నాప్ కు గురైన ఈర్నపాడు ఎంపీటీసీ బాలహుస్సేన్ నంద్యాల పీఎస్ లో ప్రత్యక్షమయ్యారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి సహా మరో నలుగురిని కిడ్నాప్ చేసినట్లుగా పీఎస్ లో బాలహుస్సేన్ ఫిర్యాదు చేశారు.

09:29 - July 4, 2015

విశాఖపట్టణం : ఆర్మీలో రిక్రూట్ మెంట్ ర్యాలీలో అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నగరంలో చేపడుతున్న రిక్రూట్ మెంట్ ర్యాలీలో తోపులాటలు జరుగుతున్నాయి. పలువురు అభ్యర్థులు గాయపడ్డారు. అభ్యర్థులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వస్తోంది. ఆర్మీలో పలు ఉద్యోగాల కోసం ఈనెల 13వ తేదీ రిక్రూట్ మెంట్ ర్యాలీ శుక్రవారం నుండి నగరంలో ప్రారంభమైంది. తొలి రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడం..తొక్కిసలాట చోటు చేసుకుంది. శనివారం కూడా అభ్యర్థులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. తొక్కిసలాట జరగకూడదని పోలీసులు భావించి టోకెన్లు ఇచ్చే వేదికను కూడా మార్చారు. కానీ ర్యాలీలో అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

ఎంపిటిసి బాలహుస్సేన్ పీఎస్ లో ప్రత్యక్షం..

కర్నూలు : కిడ్నాప్ అయిన ఈర్నపాడు ఎంపిటిసి బాలహుస్సేన్ నంద్యాల పీఎస్ లో ప్రత్యక్షమయ్యారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖరరెడ్డితో సహా మరో నలుగురు కిడ్నాప్ చేసినట్లుగా పీఎస్ లో బాల హుస్సేన్ ఫిర్యాదు చేశారు. 

ట్రక్కును ఢీకొన్న గూడ్సు రైలు..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలోని పురులియా ప్రాంతంలో గూడ్సు రైలు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 

టాయిలెట్ నిర్మించలేదని బాలిక ఆత్మహత్య..

జార్ఖండ్ : ఇంట్లో టాయిలెట్ నిర్మించడానికి తల్లిదండ్రులు నిరాకరించారంటూ 17ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దుమ్కా ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.

అమర్ నాథ్ యాత్రలో సమస్యలు సృష్టిస్తారని తెలుసు - కెహెచ్ సింగ్...

జమ్మూ : అమర్ నాథ్ యాత్రలో ఉగ్రవాదులు సమస్యలు సృష్టిస్తారని తెలుసని లెఫ్టినెంట్ జనరల్ కె.హెచ్ సింగ్ పేర్కొన్నారు. 

08:57 - July 4, 2015

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో దశాబ్దాలుగా ఉన్న కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. మార్కెట్ లోని భవనాలు పాతపడడంతో కొత్త భవనాలు నిర్మించేందుకు వీటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలువురు వ్యాపారస్తులు కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ భవనాల కూల్చివేత అంశం పదేళ్ల నుండి నానుతుండడం విశేషం. భవనాల కూల్చివేతపై వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా కోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేయడం ప్రారంభించారు. ఈ కూల్చివేతలపై వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా స్థానికంగా ఉండే రైతు బజార్లలో కూరగాయలు విక్రయించుకోవచ్చని అధికారులు సూచించారు. తమకు ప్రత్యామ్నాయాలు చూపెట్టాలన్న సూచనలు అధికారులు బేఖాతర్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు సూచించిన మార్కెట్ చిన్నదిగా ఉండడం..అప్పటికే అక్కడ కూరగాయాలు విక్రయిస్తుండడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ..అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు. 

08:30 - July 4, 2015

విశాఖపట్టణం : దేశభక్తితో కొందరు..పొట్ట పోషించుకొనేందుకు కొందరు..ఆర్మీలో చేరి ఉపాధి పొందాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు..వివిధ ప్రాంతాల్లో జరిగే ఆర్మీ రికూట్ మెంట్ ర్యాలీలో వీరు పాల్గొంటున్నారు.. కానీ ఈ నిరుద్యోగులకు పరీక్ష కంటే ముందే నరకం కనిపిస్తోంది. అధికారుల సమాచారలోపంతో వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
ఆర్మీలో పలు ఉద్యోగాలకు ఈనెల 13వ తేదీ వరకు రిక్రూట్ మెంట్ ర్యాలీ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు వెలంపేటలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విశాఖ, అనాకపల్లి డివిజన్ల అభ్యర్థులకు టోకెన్లు జారీ చేశారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. రెండో రోజైన శనివారం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. శనివారం 9వేల మంది టోకెన్లు తీసుకున్నారు. నిరుద్యోగుల్లో పదో తరగతి నుండి ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు కూడా ఉన్నారు. 

08:19 - July 4, 2015

హైదరాబాద్ : యాసిన్ భత్కల్..ఒక అంతర్జాతీయ ఉగ్రవాది..ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్ వ్యవస్థాపకుడు..భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడిన అనేక మంది ఉసురు తీసిన ఈ భత్కల్ పారిపోయేందుకు ప్లాన్ రచించినట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఇతను దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో సూత్రధారి కావడం తెలిసిందే. ఇతను చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుండి తప్పించుకొనేందుకు భత్కల్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ కు సాయం చేసేందుకు సిరియాలోని జిహాదీ సంస్థ సిద్ధపడినట్లు గుర్తించింది. పారిపోవడానికి జిహాదీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోందని భార్యతో ఐదు నిమిషాలు ఫోన్ లో సంభాషించినట్లు..ఢిల్లీలో ఉంటున్న భత్కల్ భార్యకు జిహాదీ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు పంపుతున్నట్లు ఫోన్ లో వివరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భత్కల్ పారిపోయేందుకు వ్యూహం రచించడంతో నిఘా వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. 

08:11 - July 4, 2015

కర్నూలు : వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. భూమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనారోగ్యం వల్ల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులతో భూమా వాగ్వాదం..
కర్నూలులో స్థానిక సంస్థల శాసనసమండలి ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తన కూతురు, ఎమ్మెల్యే అఖిల ప్రియకు ఓటు వేసి వెళ్లాలని పోలీసులు చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఎమ్మెల్యే అని చూడకుండా ఎలా పొమ్మంటారని నాగిరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. నిబంధనలను చూపాలని నిలదీశారు. దీనితో పోలీసులకూ, భూమాకూ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విధులకు ఆటంకపరిచారని, పోలీసులను దుర్భషలాడారని భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసి 353, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్సు డిఎస్ పి దేవదానం దళితుడు కావడంతో దురుసుగా ప్రవర్తించారని సాయంత్రం భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అనంతరం భూమా నాగిరెడ్డిని కర్నూలు జిల్లా నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అధిక బిపి, ఛాతి నొప్పి ఉందంటూ వైద్యుల సూచన మేరకు భూమాను నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

07:57 - July 4, 2015

రేవంత్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో తెలంగాణ ఎసిబికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహలకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎసిబి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ ప్రతిపాదికపై రేవంత్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతున్నారని ఎసిబిని కోర్టు ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎసిబి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రయోజనార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పరస్పరం సుహృద్భావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండటం ద్వారా మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాక్షించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

భూమాకు 14 రోజుల రిమాండ్..

కర్నూలు : వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. భూమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యం వల్ల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు. 

భత్కల్ తప్పించుకొనేందుకు ప్లాన్..

హైదరాబాద్ : చర్లపల్లి జైలు నుండి తప్పించుకొనేందుకు ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ కు సాయం చేసేందుకు సిరియాలోని జిహాదీ సంస్థ సిద్ధపడినట్లు గుర్తించింది. పారిపోవడానికి జిహాదీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోందని భార్యతో ఐదు నిమిషాలు ఫోన్ లో సంభాషించినట్లు..ఢిల్లీలో ఉంటున్న భత్కల్ భార్యకు జిహాదీ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు పంపుతున్నట్లు ఫోన్ లో వివరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు అనే సంగతి తెలిసిందే. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపలకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 14గంటల సమయం పడుతుండగా నడక దారి భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. 

06:44 - July 4, 2015

ఢిల్లీ : గ్రామీణ భారతం లెక్క తేలింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా దేశంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల గణనలో మొత్తం 24.39 కుటుంబాలు నమోదయ్యాయి. నివాసం నుంచి ఆదాయం వరకూ.. ఉద్యోగం నుంచి పన్నుల వరకూ... మొత్తం సమగ్ర వివరాలనూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2011 జనాభా లెక్కల్లో అంతర్గతంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక గణన వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ విడుదల చేశారు. స్వాతంత్ర భారత దేశంలో కుల గణన చేపట్టడం ఇదే తొలిసారి. స్వాతంత్ర్యం రాక పూర్వం 1932లో దేశంలోనే మొట్టమొదటి సారి కులగణన చేపట్టారు.
దేశంలో మొత్తం కుటుంబాలు 24.39 కోట్లు..
దేశంలో మొత్తం 24.39 కోట్ల కుటుంబాలుగా తేలింది. గ్రామాల్లో 75 శాతం అంటే 17.9 కోట్ల మంది సొంత నివాసాలు కలిగి వున్నారు. వీరిలో 54 శాతం మంది ఒకటి లేదా రెండు గదుల్లో సర్దుకు పోతున్నారు. ఒక్కో వ్యక్తి నెలసరి ఆధాయం అత్యధికంగా 5వేలే.
ఆదాయ పన్ను చెల్లిస్తోంది 4.6 శాతం కుటుంబాలు..
గ్రామాల్లో 40 శాతం కుటుంబాలకు భూములు లేవు. వీరంతా దినసరి కూలీలుగా బతుకీడుస్తున్నారు. ఇక 70 శాతం ఎస్సీలు... 50 శాతం ఎస్టీలకు సొంత భూములంటూ ఏమీ లేవు. 25 శాతం మందికి ఫోన్‌లు లేవు. 25 శాతం మందికి నీటి సదుపాయం లేదు. కేవలం 8.29శాతం మంది మాత్రమే నెలకు 10వేలకు పైగా సంపాదిస్తున్నారు. 10.69 కోట్ల కుటుంబాలు ఆదాయం లేక ఇబ్బందిపడుతున్నాయి. ఇక కేవలం 4.6 శాతం మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లించగలుగుతున్నారు.
1.11 శాతం కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు..
గ్రామాల్లో 1.11 శాతం కుటుంబాల్లో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు వున్నారు. 11శాతం రిప్రిజిరేటర్స్‌ కలిగి వున్నారు. 20.69 శాతం హౌస్‌ హోల్డర్స్ ఆటోమొబైల్ లేదా ఫిషింగ్‌ బోట్‌ ఏదో ఒకటి కలిగి వున్నారు. అలాగే 20.69 శాతం కుటుంబాలు ఏదో ఒక వాహనం కలిగివున్నాయి.

06:39 - July 4, 2015

ఆదిలాబాద్ : జిల్లాలో గోదావరి పుష్కర పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పుష్కరాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పుష్కరాలు సమీపిస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించడం లేదు. మరోవైపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 15 మండలాల్లో 40 పుష్కరఘాట్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సరస్వతీ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తులకు పుష్కరస్నానాలు చేయడానికి ఘాట్లను ఏర్పాటు చేశారు. ఒక్క బాసరలోనే దాదాపు 800 మొబైల‌్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు ఈసారి పక్కరాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో... వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఐదు జిల్లాల్లో పుష్కర పనులకు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని.. గతంలో 27 పుష్కర ఘాట్లు ఉంటే ఇప్పుడు 106 ఘాట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
పుష్కరాలకు బస్సులు..స్పెషల్ రైళ్లు..
పుష్కరాలకు ప్రత్యేకంగా 2300 బస్సులు, 84 స్పెషల్‌ రైళ్లను, రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 18 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పలు శాఖలకు నిధులు..
ఇరిగేషన్‌శాఖకు 105 కోట్ల 39 లక్షలు, ఆర్‌ అండ్‌ బీ శాఖకు 250 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 75 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు 35 కోట్లు, దేవాదాయశాఖకు 21 కోట్లు, పోలీసు శాఖకు 25 కోట్లు, ఎలక్ట్రిసిటీ శాఖకు 12 కోట్లు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు రెండున్నర కోట్లు, గజ ఈతగాళ్లకోసం రెండున్నర కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యవసర ఖర్చుల నిమిత్తం ఐదు జిల్లాల కలెక్టర్లకు రెండున్నరకోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖకు కోటి రూపాయలు, ప్రచారానికి 6 కోట్లు కేటాయించారు.

06:37 - July 4, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా.... ఢిల్లి పెద్దలకు వీర విధేయుడుగా పేరున్న డి శ్రీనివాస్ పార్టీకి హ్యండివ్వడాన్ని జీర్ణించుకోలేకపోతోంది కాంగ్రెస్. డీఎస్ ఝలక్‌తో ఖంగుతిన్న కాంగ్రెస్.. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్‌పై దృష్టి సారించింది. డీఎస్ పై మాటల దాడి కొనసాగిస్తూనే.. ఆయనతో పాటు కారెక్కేందుకు రెడీ అవుతున్నవారిపై ఆరా తీస్తున్నారు హస్తం నేతలు. ఈ మాజీ బాస్‌వెంట ఎవరూ వెళ్లకుండా బ్రేకులు వేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు..
నాలుగు దశాబ్దాలపాటు పార్టీలో కీలకంగాఉన్న ఈ సీనియర్ నేత జంప్ ప్రభావం... కచ్చితంగా కాంగ్రెస్‌పై ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సగం ఖాళీ అవుతుందంటూ డీఎస్ సన్నిహితులు ఇస్తున్న లీకులతో మరింత బెంబేలెత్తుతున్నారు. ఈ మాజీ పీసీసీ బాస్‌వెంట ఎవరెవరు వెళుతున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. శీనన్న పార్టీ వీడతారని ముందే తెలిసినా ఆయన్ని బుజ్జగించడంలో పార్టీ విఫలమైందని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం..
డీఎస్‌ ఝలక్‌తో మేల్కొన్న కాంగ్రెస్.... కారెక్కేందుకు సిద్ధమవుతున్నవారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. అసంతృప్తి నాయకులతో పీసిసి ముఖ్య నేతలు గ్రూపుల వారిగా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా దానం నాగేందర్, నందీశ్వర్ గౌడ్, కేయం ప్రతాప్ లాంటి నేతలకు నచ్చజెప్పేందుకు చూస్తున్నారని సమాచారం. వీరితోపాటు.. పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటూ టిఆర్ఎస్ వైపు చూస్తున్నవారిపైకూడా దృష్టిపెట్టారు.. ఢిల్లీ పెద్దలతో ఈ లీడర్లను మాట్లాడిస్తున్నారు.అలాగే కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశాడంటూ డీఎస్ పై మాటల దాడిని తీవ్రం చేస్తున్నారు. 
డీఎస్‌తో సన్నిహితంగా మెలిగేవారిపై దృష్టి..
సొంత జిల్లాలో శీనన్న గ్యాంగ్‌కు బ్రేకుల వేయాలని చూస్తోంది హస్తం పార్టీ. ఆయనకు సన్నిహితంగాఉన్న వారితో పీసీసీ ముఖ్యనేతలు కాంటాక్టులో ఉన్నారు. డి.శ్రీనివాస్ తో పాటు వెళ్లేవారిని కట్టడిచేయడం ద్వారా ఆయనపై రివెంజ్ తీర్చుకోవాలని ఆశపడుతున్నారు హస్తం నేతలు. ఇందులో ఎంతవరకూ సక్సెస్ అవుతారో వేచిచూడాలి.

06:33 - July 4, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నేతల కలలు తీరడం లేదు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఆలస్యం కావడంతో నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకపక్క పార్టీలోకి వలసలు పెరుగుతుండడం.. మరోపక్క స్థానిక సంస్థల మండలి ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పదవుల కేటాయింపునకు అడ్డంకిగా మారబోతున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి భారీగా హామీలిస్తుండడంతో.. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారిలో పదవులు దక్కుతాయా ? లేదా ? అనే సందేహం తలెత్తుతోంది.
ఇంకా నాలుగు వేల పోస్టులు భర్తీ ?
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికార పార్టీగా అవతరించిన తర్వాత గులాబీ పార్టీ నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నామినేడెట్‌ పదవులతో తమకు న్యాయం జరుగుతుందని పలువురు భావించారు. కానీ ఇప్పటివరకు కొన్ని నామినేటెడ్‌ పదవులు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా దాదాపు నాలుగువేల నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని గతంలో కేసీఆర్‌ కూడా ప్రకటించారు. కానీ.. ఇప్పటివరకు పదవుల భర్తీకి ఎలాంటి ప్రక్రియ మొదలుకాలేదు.
ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి హామీలు..
జూన్‌ నెలాఖరు నుంచే నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అంతేగాక ఇప్పట్లో ఆ పదవులను భర్తీ చేస్తారనే నమ్మకం కూడా నేతల్లో లేదు. పార్టీలోకి భారీగా వలసలు పెరుగుతున్న నేపథ్యంలో.. పదవులు ఆశిస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి కేసీఆర్‌, ఇతర నేతలు హామీలు ఇవ్వడంతో పార్టీ అవిర్భావం నుంచి పని చేసిన నేతల్లో గుబులు పుడుతోంది.
త్వరలో గ్రేటర్..స్థానిక సంస్థల మండలి ఎన్నికలు...
త్వరలో స్థానిక సంస్థల మండలి ఎన్నికలు, గ్రేటర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తారనే నమ్మకం పార్టీ నేతలకు కలగడం లేదు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలంటే మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాతే నామినేటెడ్‌ పదవుల భర్తీ మొదలవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పదవులు ఆశించేవారు మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. 

06:29 - July 4, 2015

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో మళ్లీ పదవుల పందేరం ప్రారంభం కాబోతోంది. మండలి విప్‌, చీఫ్‌ విప్‌ పదవులను భర్తీ చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో ఆశావహులు పదవులు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. కౌన్సిల్‌లో కీలక పదవులు ఎగరేసుకుపోయేందుకు ఎవరికివారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
మండలిలో పెరిగిన సైకిల్ బలం..
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో టీడీపీ పూర్తి ఆధిక్యత సంపాదించుకుంది. రాష్ట్ర విభజన అనంతరం శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 50గా ఉంది. ఆ సమయంలో టీడీపీకి కేవలం 8మంది మాత్రమే సభ్యులుండేవారు. అయితే మండలి స్థానాల సంఖ్యను 50నుంచి 58కి పెంచిన అనంతరం జరిగిన ఎన్నికలతో సైకిల్‌ పార్టీ బలం పెరిగింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలు దక్కించుకుంది. గవర్నర్‌ కోటాలో 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఆరుస్థానాల్లో ఏకగ్రీవంగా నిలిచిన టీడీపీ.. మరో రెండు స్థానాల్లో ఫలితాలు తెలియాల్సి ఉంది.
విప్, చీఫ్‌ విప్‌ పదవులపై సభ్యుల ఆసక్తి...
మండలిలో టీడీపీకే ఎక్కువ స్థానాలు ఉండటంతో... ఇప్పుడు సభ్యుల దృష్టి విప్‌, చీఫ్‌ విప్‌ పదవులపై పడింది. ఎక్కువ మంది సీనియర్లు ఈ పదవులను ఆశిస్తుండటంతో గట్టి పోటీ నెలకొంది. అయితే విప్, చీఫ్‌ విప్‌ పదవుల ఎంపిక కోసం అధిష్టానం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. వాక్‌ చాతుర్యంతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని సెలెక్ట్‌ చేయాలని చూస్తోంది. మొన్నటి వరకు మండలి చీఫ్‌ విప్‌గా నన్నపనేని రాజకుమారి ఉన్నారు. ఆమె పదవి కాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అంగర రామ్మోహన్‌ రావు ఒక్కరే విప్‌గా కొనసాగుతున్నారు.
సీనియర్లే ఎక్కువ..
మండలికి ఎన్నికైన టీడీపీ సభ్యుల్లో సీనియర్లే ఎక్కువ. గాలి ముద్దుకృష్ణమ, సోమిరెడ్డి, పయ్యావుల కేశవ్, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్‌, ఎంవీఎస్‌ మూర్తి, పప్పుల చలపతిరావు, శమంతక మణి తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవులు, మరికొందరు విప్‌, చీఫ్‌ విప్‌ పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతం విప్‌గా ఉన్న అంగర రామ్మోహనరావు బీసీ వర్గానికి చెందిన వారు కాగా.. చిఫ్‌ విప్‌ కమ్మ సామాజిక వర్గానికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీఫ్‌ విప్‌ పదవి కోసం యలమంచిలి, టీడీ జనార్దన్‌ పోటీ పడుతున్నారు.
మరో ఇద్దరికి విప్ పదవులు..
మరో ఇద్దరికి విప్‌ పదవులు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. కాపు సామాజికవర్గం నుంచి పప్పల చలపతిరావు, అన్నం సతీష్‌ ప్రభాకర్‌ విప్‌ రేసులో ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి రెడ్డి సుబ్రమణ్యం, గౌరగాని శ్రీనివాసులు పేర్లు పరిశీలించే అవకాశాలున్నాయి. అయితే సీనియర్లు విప్‌ పదవులపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జూనియర్స్ కే పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఎవరిని సెలక్ట్ చేస్తారో.. ఎవరిని రిజక్ట్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

06:23 - July 4, 2015

ప్రకాశం : ఏపీలో స్థానిక సమరం ఆట ముగిసింది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఓటింగ్ ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికను వైసీపీ బహిష్కరించగా.. కర్నూలులో అత్యధికంగా 99.67 శాతం పోలింగ్ నమోదయ్యింది. కాగా.. ఈనెల 7న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్నూలులో 99.67 శాతం పోలింగ్...
కర్నూలు జిల్లాలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా ముగిశాయి. కర్నూలు, ఆదోని, నంద్యాల పోలింగ్ కేంద్రాలలో మొత్తం ఒక వెయ్యి 87 ఓటర్లు ఉండగా.. 1080 ఓట్లు పోలయ్యాయి. నంద్యాలలో ఒకరు, కర్నూలులో ఒకరు, ఆదోనిలో ఐదుగురు మొత్తం ఏడుగురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా 99.67 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు.
భూమాపై పోలీసుల కేసు..
మరోవైపు.. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఫైర్ అయ్యారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిలు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులపై మండిపడ్డారు. నంద్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, కూతురు అఖిల ప్రియ.. ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రం వద్ద ఉండటంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీనిపై అక్కడే ఉన్న భూమా నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, భూమాల మధ్య వాగ్వాదం జరిగింది. భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశంలో ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ..
ప్రకాశం జిల్లాలో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. దీంతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ పడుతుండగా.. వైసీపీ నుంచి అభ్యర్ధి వెంకటేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే.. ఈనెల 7వ తేదీ వరకు ఆగాల్సిందే. 

06:19 - July 4, 2015

అనంతపురం : జిల్లాలో హంద్రీనీవా రెండో దశ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. పనులపై కాంట్రాక్టర్ల పని తీరు పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. బ్లాక్‌ లిస్టులో పెడితే తప్ప కాంట్రాక్టర్లు మాట వినేలా లేరంటూ మండిపడ్డారు. వారిని వెనకేసుకొచ్చిన అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న నీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముందుగా జీడిపల్లికి చేరుకున్న చంద్రబాబు జీడిపల్లి, పీఎబీఆర్‌ డ్యాంలను హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రిజర్వాయర్‌ గేట్లను పరిశీలించారు.
శ్రీశైలంలోకి నీరు మొదటి నీటి మళ్లింపు హంద్రీనీవాకే..
హంద్రీనీవా పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15నాటికి పట్టిసీమ మొదటి దశ ద్వారా నీరు అందిస్తామన్నారు చంద్రబాబు. యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవాను పూర్తి చేస్తామని, శ్రీశైలంలోకి నీరు వచ్చి చేరిన వెంటనే మొదటగా నీటి మళ్లింపు హాంద్రీనీవాకే నంటూ సీఎం హామీ ఇచ్చారు.
జిల్లాకు కావాల్సింది నికర జలాలే - జేసీ..
జీడిపల్లి రిజర్వాయర్‌ వద్ద జరిగిన బహిరంగసభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ప్రసంగిచారు. అనంతపురం జిల్లాకు కావాల్సింది నికర జలాలేనని అన్నారు. ఇప్పటికీ శింగనమల తాడిపత్రి ప్రాంతాల్లో తాగునీటి కోసం 20 కిలోమీటర్లు పోవాల్సిన దుస్థితి నెలకొందని జేసీ అన్నారు. జగన్‌ పట్టిసీమను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదని అన్నారు.
హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష..
బహిరంగ సభ అనంతరం హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు సంబంధించి అనంతపురం, చిత్తూరు జిల్లాల ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సమీక్షలలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రాజెక్టుల నిర్మాణ పనులపై అసహనం వ్యక్తం చేశారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రాజెక్టులు పూర్తికి అవసరమైతే మరో 2వేల కోట్ల రూపాయలను సైతం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణ పనులు ఆగకూడదు..
ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగకూడదని, కాంట్రాక్టర్లు కొంతమంది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రతీ 15 రోజులకొకసారి ప్రాజెక్టు నిర్మాణ పనులను సమీక్షించాలని రెండు జిల్లాల ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు.    

06:07 - July 4, 2015

నల్గొండ : విజయవాడ హైవేపై కేశినేని ట్రావెల్స్ బస్సు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కేశినేని ట్రావెల్స్ (ఎపి16 టిసి 3773) బస్సు ఏలూరుకు వెళుతోంది. శనివారం తెల్లవారుజామున చివ్వెంల (మం) గుంపుల వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన 15 మందిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కేశినేని బస్సు బోల్తా..

నల్గొండ : విజయవాడ హైవేపై కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన చివ్వెంల (మం) గుంపుల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి ఏలూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం..

హైదరాబాద్ : నేడు ఉదయం 11గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. రాజీవ్ స్వగృహ అవకతవకలు, కొత్తగా 2 లక్షల ఇళ్ల నిర్మాణం, ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ, స్మార్ట్ ఏపీ పథకంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ప్రైవేటు యూనివర్సిటీలపై చర్చను వాయిదా వేసింది. 

నేడే బాబు విదేశీ పర్యటన..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 6, 7, 8 తేదీల్లో జపాన్ లో బాబు పర్యటించనున్నారు. 7న సాఫ్ట్ బ్యాంకు సీఈవోతో బాబు భేటీ కానున్నారు. 8న జపాన్ లోని కసీవానోహ స్మార్ట్ సిటీ సందర్శించనున్నారు. సుముటోమా, ఎస్ఎన్ బీసీ, బ్యాంకింగ్ కార్పొరేషన్, మైకావో సంస్థల ప్రతినిధులతో బాబు భేటీ కానున్నారు. అమరావతి శంకుస్థాపనకు జపాన్ ప్రతినిధినిని బాబు ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి బాబు పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. 8వ తేదీ భారత్ కు చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు. 

నేడు కరీంనగర్ కు సీఎం కేసీఆర్..

కరీంనగర్ : హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శనివారం హుస్నాబాద్, మానకొండూర్, ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. 

సౌదీలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు భారతీయుల మృతి..

ఢిల్లీ : సౌదీ అరేబియాలోని దమ్మమ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. 

ప్రభుత్వ ఆసుపత్రికి భూమా నాగిరెడ్డి...

కర్నూలు : ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కర్నూలు జిల్లా నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Don't Miss