Activities calendar

05 July 2015

21:34 - July 5, 2015

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమచారం. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన ప్రణబ్ దాదాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

 

21:28 - July 5, 2015

హైదరాబాద్: తెలంగాణలో ఇఫ్తార్ విందును టీ.ప్రభుత్వం వాయిదా వేసింది. 8వ తేదీకి బదులు 12 న అన్ని జిల్లాలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. గ్రేటర్ పరిధిలో 100 చోట్ల, ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ లో 195 మసీదుల్లో, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 95 వేల మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

 

తెలంగాణలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు వాయిదా..

హైదరాబాద్: తెలంగాణలో ఇఫ్తార్ విందును టీ.ప్రభుత్వం వాయిదా వేసింది. 8వ తేదీకి బదులు 12 న అన్ని జిల్లాలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. గ్రేటర్ పరిధిలో 100 చోట్ల, ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ లో 195 మసీదుల్లో, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 95 వేల మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

21:17 - July 5, 2015

వాషింగ్టన్: అమెరికాలో తానా 20వ మహాసభలు అట్టహాసంగా సాగుతున్నాయి. డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరుగుతున్న తానా మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. తెలుగు సినిమా హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు అదరగొట్టె స్టెప్పులతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

 

21:09 - July 5, 2015

సినీనటి, బాహుబలి హీరోయిన్ తమన్నాతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తమన్నా బాహుబలి సినిమా షూటింగ్ అనుభవాలను వివరించారు. సినిమా అద్భుతంగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:01 - July 5, 2015

హైదరాబాద్: బొల్లారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ లీడర్లు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రణబ్‌ను కలిసిన వారిలో ఎల్‌.రమణ, రావుల, మల్లారెడ్డి, పెద్దిరెడ్డి ఉన్నారు. 

20:59 - July 5, 2015

ఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని... సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఎచూరి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో ఆరు వామపక్ష పార్టీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా లెప్ట్ పార్టీలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. జులై 20న అవినీతి వ్యతిరేక నిరసన దినంగా పాటించి.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని తీర్మానించారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ-ఎంఎల్, ఆర్ ఎస్ పి, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్ యుసిఐ పార్టీల నేతలు మీటింగ్‌ కు హాజరయ్యారు.

 

రాష్ట్రపతిని కలిసిన టీటీడీపీ లీడర్లు

హైదరాబాద్: బొల్లారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ లీడర్లు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రణబ్‌ను కలిసిన వారిలో ఎల్‌.రమణ, రావుల, మల్లారెడ్డి, పెద్దిరెడ్డి ఉన్నారు.

 

20:51 - July 5, 2015

ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. గాధీరా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గిరిజనులు గుర్తించారు. ఈ మృతదేహాలను స్థానికులు సాయంత్రం 5 గంటల సమయంలో కనుగొన్నారు. అయితే మావోయిస్టుల మృతికి అంతర్గత కలహాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు ధరించిన దుస్తులు, షూస్ ఆధారంగా వారు మావోయిస్టులగా భావిస్తున్నారు. పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 

ఛత్తీస్‌గఢ్‌ లో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు

ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. గాధీరా అటవీ ప్రాంతంలో ఈ మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. అయితే మావోయిస్టుల మృతికి అంతర్గత కలహాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

20:44 - July 5, 2015

విజయవాడ: సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ విమర్శించారు. విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. చదువుకు తగ్గ గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఎంబిఎ చదివిన విద్యార్థులు హోంగార్డులుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పెట్రోల్ డీలర్లు-లారీ యజమానుల జెఎసి భేటీ..

గుంటూరు: పెట్రోల్ డీలర్లు, లారీ యజమానుల జెఎసి భేటీ అయింది. 28 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపసంఘం సిఫార్సులనూ ప్రభుత్వం పట్టించుకోలేదని జెఎసి అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

ప్రభుత్వ విద్యావ్యవస్థను అవమానించటమే:లక్ష్మీరాజా

కడప: కార్పొరేట్ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించడమంటే.. ప్రభుత్వ విద్యావ్యవస్థను అవమానించటమే అవుతుందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నారాయణ, శ్రీచైతన్య ఫ్యాకల్టీతో మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ఐఐటీ శిక్షణ శిక్షణా కార్యక్రమాన్ని యూటీఎఫ్ నేతలు, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు అడ్డుకున్నారు.

 

20:14 - July 5, 2015

విజయవాడ: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్‌ అయ్యారు. సిమెంట్‌ కంపెనీల పేరుతో జగన్‌ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. జగన్‌కు చెందిన సిమెంట్‌ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దోచుకున్న ప్రజా ధనం ఎక్కడ వుందో బయటికి తీయాలన్నారు.

 

19:59 - July 5, 2015

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెరవలి మండలం ఖండవల్లిలో కుదేలైన అరటి రైతులను సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి. మధు పరామర్శించారు. ఈనెల 6న చేపట్టబోతున్న అరటి రైతు సదస్సుకు ఆయన మద్దతు పలికారు. చెరకు, మిర్చి రైతుల మాదిరే అరటి రైతులకు కూడా రుణ మాఫీ చేయాలని మధు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అరటి రైతు సదస్సును ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సీపీఎం కేంద్రకార్యాలయంలో ఆరు వామపక్షాల సమావేశం..

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయంలో ఆరు వామపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆరు వామపక్ష పార్టీలు.. భవిష్యత్ ఆందోళనలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేయనున్నాయి. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్ ఎస్పీ, ఫార్వర్డు బ్లాక్, ఎస్ యూసీఐ నేతలు పాల్గొన్నారు.

 

యాదాద్రిలో భద్రతా సిబ్బంది మధ్య తోపులాట

నల్గొండ: యాదాద్రి ఆలయ లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద భద్రతా సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. లడ్డూ ప్రసాదం కొనేందుకు పోలీసులు పోటీ పడ్డారు. పోలీసులు.. కౌంటర్ అద్దాలు పగలగొట్టి 120 లడ్డూలను ఎత్తుకెళ్లారు.

 

18:28 - July 5, 2015

వరంగల్: విద్యుత్‌ హై ఓల్టేజీ రెండువందల ఇళ్లల్లో భారీ నష్టం మిగిల్చింది. వరంగల్‌ జిల్లా హన్మకొండ రెడ్డి కాలనీలోని రెండువందల ఇళ్లల్లో విద్యుత్‌ హై ఓల్టేజీ కారణంగా కలర్‌ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్స్‌ లాంటి ఎలక్ట్రానిక్ గృహోపకరాణాలు షార్ట్ సర్క్యూట్‌ అయ్యాయి. గత నెల రోజులుగా సమస్య తలెత్తినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని... ఫలితంగా లక్షలాది రూపాయల నష్టం సంభవించిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

 

 

18:25 - July 5, 2015

నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శూన్యపహాడ్‌లో రామాచారి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఉదయం పూట రామాచారి ఇంటికి వచ్చిన దుండగులు తలుపులు బాదారు. తలుపులు ఎంతకూ తీయకపోవడంతో కిటికీలు ద్వంసం చేసి ఇంట్లోకి చొరబడి రామాచారిని గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది.

 

18:20 - July 5, 2015

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని కమాన్ బజార్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గార్లపాటి మెటల్ స్టోర్స్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టోర్ పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ఎక్కువ ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో... మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులోని వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేస్తున్నాయి. సుమారు కోటిమేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

18:12 - July 5, 2015

హైదరాబాద్: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 64 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాచారం మానిక్‌ చంద్‌ వద్ద ఓ గోదాములో ఎల్‌ బీ నగర్‌, సరూర్ నగర్‌లకు చెందిన పలువురు రేషన్‌ డీలర్లు బియ్యాన్ని తరలించి.. అక్కడి నుంచి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకొని దాడి చేసినట్లు ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అక్రమ డీలర్లు వెంకటేశ్వర్లు, శేఖర్‌ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు.

 

 

18:06 - July 5, 2015

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో గోపాలపురం పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బైక్‌ రేసింగ్‌ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అతివేగంతో బైకులు నడుపుతూ...వాకర్లను ఇబ్బందికి గురిచేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజూ ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో వాకర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు వారం పాటు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. అతివేగంతో బైక్‌లను నడుపుతున్న......పోకిరీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో ఎక్కువ మంది మైనర్లు, లైసెన్స్‌ లేనివారే ఉన్నారు. సుమారు 150ల బైక్‌లను సీజ్‌చేసి... వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

 

18:03 - July 5, 2015

హైదరాబాద్: వాయువేగంతో దూసుకుపోతున్న బైకు రేసర్లకు హైదరాబాద్‌ శివారులోని నార్సింగి పోలీసులు కళ్లెం వేశారు. ఓల్‌ సిటీకి చెందిన పలువురు విద్యార్థులు గండిపేట ప్రాంతంలో బైక్ రేసింగ్‌ నిర్వహించారు. గమనించిన స్థానిక పోలీసులు 31 మందిని అదుపులోకి తీసుకుని 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 20 మంది మైనర్లు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేసిన తర్వాత కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

 

నార్సింగ్ లో బైక్‌ రేసర్లకు చెక్‌ పెట్టిన పోలీసులు

హైదరాబాద్: వాయువేగంతో దూసుకుపోతున్న బైకు రేసర్లకు హైదరాబాద్‌ శివారులోని నార్సింగి పోలీసులు కళ్లెం వేశారు. ఓల్‌ సిటీకి చెందిన పలువురు విద్యార్థులు గండిపేట ప్రాంతంలో బైక్ రేసింగ్‌ నిర్వహించారు. గమనించిన స్థానిక పోలీసులు 31 మందిని అదుపులోకి తీసుకుని 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 20 మంది మైనర్లు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేసిన తర్వాత కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 

18:00 - July 5, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో మలుపు తిరగనుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసుగా పరిగణించే అంశాన్ని ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌ సన్‌తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ వల వేసినట్లు సమాచారం. రేవంత్ బెయిల్ పిటీషన్‌లో ఏజీ ప్రత్యేక వాదనలు వినిపించనుంది. ఏజీ వాదనలకు బలం చేకూరే విధంగా ఆధారాల సేకరణలో ఏసీబీ బిజీగా ఉంది. ఏసీబీ.. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఓటుకు నోటు కేసులో మరో మలుపు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో మలుపు తిరగనుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసుగా పరిగణించే అంశాన్ని ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌ సన్‌తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ వల వేసినట్లు సమాచారం.

 

17:51 - July 5, 2015

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మొత్తం కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు... నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మొత్తం కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు... నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

17:47 - July 5, 2015

హైదరాబాద్: ఓయూ పరిశోధక విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఓయూ పరిశోధక విద్యార్థులు చేపట్టిన నిరవదిక దీక్ష 15వ రోజుకు చేరుకుంది. మెస్‌ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల దీక్షకు నారాయణ సంఘీభావం ప్రకటించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలన్నారు. 7 కోట్ల మెస్‌ బాకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెస్‌ బకాయిల కోసం విద్యార్థులు దీక్ష చేయాల్సి రావడం... తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

 

17:39 - July 5, 2015

హైదరాబాద్: సబ్‌ప్లాన్‌ సాధనకు పూర్తి మద్దతుతో పాటు సీపీఎం ఆధ్వర్యంలో పోరాడుతామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం అన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటే ఏ ఒక్కరికో జరిగే న్యాయం కాదని, కుల ప్రాతిపదికన వివక్ష కొనసాగితే డిమాండ్‌ సైతం కులం ఆధారంగానే పుడుతుందని తమ్మినేని అన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌పై ఏర్పాటు చేసిన సదస్సులో తమ్మినేని ప్రసంగించారు. 

17:12 - July 5, 2015

గుంటూరు: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరం మండల ఎస్సీకాలనీలో.... సుమారు 100 పూరిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో...పూరిళ్లన్నీ కాలిపోయాయి. ప్రమాదంలో ఇళ్లలోని విలువైన వస్తువులతో పాటు నగదు, గ్యాస్‌ బండలు, టీవీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో కాలనీవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు కోటి మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందిచకపోవటంతో...కాలనీ మొత్తం అగ్నికి ఆహుతైంది.

17:09 - July 5, 2015

కరీంనగర్: హరితహారంతో తెలంగాణలోని అన్ని జిల్లాలు పచ్చగా మారతాయని సీఎం కేసీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ చెట్లను పెంచే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

17:01 - July 5, 2015

తూర్పుగోదావరి: గోదావరి పుష్కర ఏర్పాట్లలో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రి కోటి లింగాల రేవులో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న స్నానఘట్టం ఓమత్స్య కారుడిని బలి తీసుకుంది లలలఘాట్‌ నిర్మాణ పనులు పూర్తయినా నదికి అడ్డుకట్ట వేసిన మట్టిని తొలగించడంలో కాంట్రాక్టర్‌ అలసత్వం ప్రదర్శించాడు. ఫలితంగా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఎదుర్లయ్య అనే మత్స్యకారుడు మట్టిలో దిగబడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా విజయం

కేఫ్ టౌన్: దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి.. 148 పరుగులు చేసింది. అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్... నిర్ణీత ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది.

తూ.గో జిల్లాలో గంజాయి పట్టివేత

తూ.గో: గోకవరం మండలం కొత్తపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి అరెస్టు చేశారు.

గోదావరి పుష్కర ఏర్పాట్లలో విషాదం...

తూ.గో: గోదావరి పుష్కర ఏర్పాట్లలో విషాదం నెలకొంది. పుష్కర ఘాట్ నిర్మాణం పనులలో నిర్లక్ష్యం వెలుగు చూసింది. కాంట్రాక్టర్ల అలత్వానికి ఓ మత్స్యకారుడు మృతి చెందారు. నదికి అడ్డంగా వేసిన మట్టిని తొలగించకపోవడంతో ప్రమాదం జరిగింది. మట్టిలో దిగపడి పోయి వ్యక్తి చనిపోయాడు.

16:36 - July 5, 2015

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో ప్రబలిన విషజ్వరాలపై 10 టివి ప్రసారం చేసిన కథనానికి డీఎం మరియు హెచ్ వో స్పందించింది. పంచాయతీ చెరువు నీరు కలుషితం కావడంతో అస్వస్థతకు గురైన 600 మందికి వైద్యం అందించేందుకు డీఎం ఆండ్ హెచ్ వో.. రెండు వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. మరో గంటలో వైద్య బృందాలు.. కొత్తమాజేరు గ్రామానికి చేరుకోనున్నారు. 

కొత్తమాజేరుకు రెండు వైద్య బృందాలు

కృష్ణా: జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో ప్రబలిన విషజ్వరాలపై 10 టివి ప్రసారం చేసిన కథనానికి డీఎం మరియు హెచ్ వో స్పందించింది. పంచాయతీ చెరువు నీరు కలుషితం కావడంతో అస్వస్థతకు గురైన 600 మందికి వైద్యం అందించేందుకు డీఎం ఆండ్ హెచ్ వో.. రెండు వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. మరో గంటలో వైద్య బృందాలు.. కొత్తమాజేరు గ్రామానికి చేరుకోనున్నారు.

 

16:15 - July 5, 2015

హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం 14 వేల 170 రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే పర్మినెంట్‌ చేయాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 40 వేల కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అవసరమైతే రెగ్యులర్ కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని చెప్పారు.

16:11 - July 5, 2015

కృష్ణా: జిల్లా కొత్తమాజేరు గ్రామాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. సుమారు 150 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలుషితమైన చెరువు నీరు సరఫరా చేయడం వల్లే విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు అంటున్నారు.

 

హరితహారంలో అందరూ భాగస్వామ్యమవ్వాలి: సీఎం కేసీఆర్

కరీంనగర్: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. అనంతరం సీఎం మాట్లాడుతూ హరితహారం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని... సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆరు రకాలు మొక్కలు అందిస్తామని చెప్పారు.

 

కృష్ణా జిల్లా కొత్తమాజేరులో విషజ్వరాలు..

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విష జ్వరాలు ప్రబలాయి. పంచాయతీ చెరువు నీరు కలుషితం కావడంతో 600 మంది అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేయాలతో గ్రామస్తులు 20 రోజులుగా మంచం పట్టారు. జిల్లా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకోవడం లేదు.

 

బిసి సబ్ ప్లాన్ కు చట్టం చేయాలి:తమ్మినేని

హైదరాబాద్: బిసి సబ్ ప్లాన్ కు పార్లమెంట్, అసెంబ్లీలలో చట్టం చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'బిసి సబ్ ప్లాన్-గ్రేటర్ హైదరాబాద్' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. బిసి సబ్ ప్లాన్ సాధన ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తమ్మినేని చెప్పారు. అనంతరం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాదు.. సమస్యలు లేని తెలంగాణ కావాలన్నారు. ఈ సదస్సుకు ఇతర వామపక్ష నేతలు హాజరయ్యారు.

 

15:26 - July 5, 2015

రాంచీ: జార్ఖండ్‌లోని దాల్మా వైల్డ్ లైఫ్‌ శాంక్చూరీలో విషాదం నెలకొంది. విద్యుత్‌ తీగలు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే విద్యుత్‌ ప్రసారాన్ని నిలిపివేశారు. దీంతో మరో మూడు ఏనుగులు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అయితే విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన ఏనుగును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

 

15:21 - July 5, 2015

అనంతపురం: జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది ముఠా సభ్యుల నుంచి కోటి 13 లక్షల విలువైన 17 వేల పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా నుంచి లక్ష రూపాయల నగదు, తయారీ సామాగ్రి, ఇన్నోవా వాహనం, వేటకొడవలి లభించింది. ధర్మవరం కేంద్రంలో 15 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

15:13 - July 5, 2015

కృష్ణా: విజయవాడలో ఏపీ సీపీఎం వెబ్‌సైట్‌ను ఆ పార్టీ ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాడటానికి వెబ్‌సైట్ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై మధు మండిపడ్డారు. ప్రతి దానికీ చంద్రబాబు విదేశాలపై ఆధారపడుతున్నారని ఆయన విమర్శించారు. విదేశీ పెట్టుబడులతో భారతదేశ సంపదను కొల్లగొట్టే ప్రమాదముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడుల ఒత్తిడితోనే...గ్రీస్‌లో సంక్షోభం వచ్చిందన్నారు. చంద్రబాబుకు ప్రజలు ఎదురుతిరిగే సమయం...ఆసన్నమైందని ధ్వజమెత్తారు.

 

14:59 - July 5, 2015

హైదరాబాద్: సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తుందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మృతి చెందిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకొని అండగా నిలిచినా వైఎస్‌ జగన్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్‌కు ప్రజలపై ఎలాంటి అభిమానం లేదని.. కేవలం తన కోసమే ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్నారని గాలి ఎద్దేవా చేశారు.

 

14:55 - July 5, 2015

హైదరాబాద్: తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తోందని విమర్శించారు. మేనిఫెస్టోలోని హామీలను అమలుపర్చాలని డిమాండ్ చేశారు. ఐతే కొందరు కాంగ్రెస్ నాయకులపై ఆయన ఆరోపణలు చేశారు. తనను పొమ్మన లేక పొగబెడుతున్నారని విమర్శించారు.

 

14:53 - July 5, 2015

ఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కాం కవరేజీకి వెళ్లి చనిపోయిన రిపోర్ట్ చితికి నిప్పయినా పెట్టలేదు. అప్పుడే మరో అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లోని మెడికల్ కాలేజ్‌ డీన్‌, 64 ఏళ్ల డాక్టర్ అరుణ్‌ శర్మ... ఈ ఉదయం ఢిల్లీలోని ఓ హోటల్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. వ్యాపం రిక్రూట్‌మెంట్‌లో ఇతనికి సంబంధాలు వున్నాయనే ఆరోపణలు వున్నాయి. వ్యాపం స్కాం ద్వారా వైద్యులుగా చేరిన ఫేక్‌ డాక్టర్స్ పై మధ్యప్రదేశ్‌ సర్కారు ఓ విచారణ కమిటీ వేయగా... దానికి అరుణ్‌ శర్మ ఛైర్మన్‌ వున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా అధికారికంగా 25 మంది చనిపోతే.. 40 మందికి పైగా అనుమానాస్పద రీతిలో చనిపోయారని అనధికార లెక్కలు ధృవీకరిస్తున్నాయి.

 

అసోంలో ఆరు జిల్లాలకు వరద హెచ్చరికలు..

అసోం : రానున్న 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. 

అమర్ నాథ్ యాత్రలో విషాదం..

జమ్మూ : అమర్ నాథ్ యాత్ర చేస్తున్న ఓ ప్రయాణీకురాలు గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలు ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతానికి చెందినట్లు తెలుస్తోంది. 

జర్నలిస్టు అంత్యక్రియలకు సీఎం కేజ్రీవాల్, రాహుల్..

ఢిల్లీ : ఆజ్ తక్ ఛానెల్ ప్రత్యేక ప్రతినిధి అక్షయ్ సిన్హా అంత్యక్రియలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ హాజరు కానున్నారు. 

13:29 - July 5, 2015

తూర్పుగోదావరి : జిల్లాలోని మలికిపురం మండలం గూడవల్లికి చెందిన కట్టా సింహాచలం అనే అంధ యువకుడు సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించాడు. జాతీయస్థాయిలో 1,212 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గ్రూప్ - బి అధికారిగా పని చేస్తున్నారు. సింహాచలం టెన్ టివితో తన విజయ రహస్యాలను పంచుకున్నారు. అంధత్వాన్ని జయించి జీవితంలో పైకిరావాలన్న పట్టుదలే ఈ ఉన్నత పరీక్షల్లో విజయం సాధించడానికి తనకు దోహదం చేసిందని సింహాచలం తెలిపాడు. 

రాష్ట్రపతిని కలువనున్న జగన్..టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జిని సాయంత్రం 6.50 గంటలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీ కానున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు టి.టిడిపి నేతలు ప్రణబ్ ను కలువనున్నారు. 

13:09 - July 5, 2015

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఈసారి అద్భుతం ఆవిష్కృతమైంది. సివిల్స్ టాపర్స్ గా ఢిల్లీకి చెందిన వికలాంగురాలు ఇరా సింఘాల్ నిలిచారు. సివిల్స్ టాపర్‌ గా నిలవడం చాలా ఆనందంగా ఉందన్న ఇరా సింఘాల్.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉన్నారు. కూతురు టాప్ ర్యాంక్ సాధించిందని తెలిసిన ఇరా తల్లిదండ్రులు పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఇరా స్నేహితులు కూడా ఆమె సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో సిరా సింఘాల్ మాట్లాడింది. ఆమె అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

'వ్యాపం' స్కాం భయంకరమైంది - చాకో..

ఢిల్లీ : భారతదేశ చరిత్రలోనే వ్యాపం కుంభకోణం అతి భయంకరమైన స్కాం అని కాంగ్రెస్ నేత చాకో ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

12:56 - July 5, 2015

'చిత్తజల్లు వరహాలరావు' ఒక సాంఘీక విప్లవకారుడే కాదు. సాంస్కృతిక రథసారధి. నిజాలను నిగ్గు తేల్చిన నిత్య పరిశోధకుడు. శ్రీశ్రీ కవిత్వం యువతరం గుండెలను ఎలా ఉర్రూతలూగించిందో 'సివి' రచనలు విద్యార్థి, యువజనుల లోకపు మస్తిష్కాలకు పట్టిన ఛాందస భావాల దుమ్ము దులిపింది. వారిని అభ్యుదయం వైపు నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం అంటే అందులో అతిశయోక్తి లేదు. 

శ్రీశైలంలో సీఎం బాబు సతీమణి..

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం ఆలయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు..వేద పండితులు స్వాగతం పలికారు.

తానా మహాసభలకు బాబు వీడియో సందేశం..

హైదరాబాద్ : తానా మహాసభలను పురస్కరించుకుని అమెరికాని ప్రవాసాంధ్రులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వీడియో సందేశాన్ని పంపారు. విదేశాల్లో స్థిరపడిన వారంతా పెట్టుబడులతో తెలుగు రాష్ట్రాలకు తరలి రావాలని కోరారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాల్సినవసరం ఎంతో ఉందని, ఇందులో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకమని బాబు వీడియో సందేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

12:43 - July 5, 2015

'అక్షరం' లక్ష మెదళ్ల కదలిక అని కాళోజీ నారాయణ రావు అన్నారు. ఈ మాట అక్షరాల సాంస్కృతిక విప్లవకారుడు 'చిత్తజల్లు వరహాలరావు'కు వర్తిస్తుంది. 'సివి'గా ప్రసిద్ధి పొందిన వరహాల రావు అభ్యుదయ భావాలతో 'సత్యకామ', 'జాబాలి' లాంటి ఎన్నో గ్రంధాలు రాశారు. కులమత ఛాందస భావాలను తన రచనలో దుయ్యబట్టారు. ఆయన సమగ్ర రచనల సంకలాలను 'ప్రజాశక్తి' బుక్ హౌస్ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల విజయవాడలో 'సివి రచనలను' ఆవిష్కరించారు. సివి రచనల నేపథ్యంలో కులం..వర్ణం..వర్గ భావజాలంపై ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రముఖ వక్తలు ప్రసంగించారు. సివి జీవితం..రచనల సమాహారంపై ప్రత్యేక కథనం..

మీడియా ఎదుట నకిలీ పాస్ పుస్తకాల నిందితులు..

అనంతపురం : నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రిస్తున్న 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వీరివద్ద 17వేల నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ల్యాప్ ట్యాప్ లు, రబ్బర్ స్టాంప్ లు, రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. 
ధర్మవరంలో ఈ పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15ఏళ్లుగా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. 

12:28 - July 5, 2015

నల్గొండ : భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ యాదాద్రికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ప్రణబ్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సన్నిధికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రణబ్ కు అర్చకులు ఆశీర్వదించారు. ప్రణబ్ కు లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటాన్ని సీఎం కేసీఆర్ అందచేశారు. యాదాద్రి అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను రాష్ట్రపతికి ఆలయ అర్చకులు..అధికారులు వివరించారు.
నిఘా నీడలో యాదాద్రి..
రాష్ట్రపతి రాక సందర్భంగా యాదాద్రిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హోంగార్డు నుంచి డీజీ వరకు.. బెటాలియన్ కమాండెంట్ నుంచి ఎయిర్‌ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాల వరకు మకాం వేసి భద్రతా చర్యల్లో మమేకమయ్యారు. పలు సార్లు డీజీ స్థాయి అధికారులు యాదాద్రిని సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. రాష్ట్రపతి కాన్వాయ్ కోసం సుమారు 50వాహనాలను సిద్ధం చేశారు. పర్యటనకు ముందే కాన్వాయ్ ట్రయల్న్ అధికారులు నిర్వహించారు. మూడు వేల మంది పోలీసులు యాదగిరిగుట్టలో మోహరించారు. వడాయిగూడెం నుంచి కొండపై వరకు ఎక్కడ చూసినా ఒక్కో ప్రాంతంలో పదుల సంఖ్యలో పోలీసులు కాపలా ఉన్నారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా బందోబస్తు ట్రయల్‌లో పాల్గొన్నారు. భద్రతలో భాగంగా పలు దుకాణాలను అధికారులు మూసివేయించారు. 

ఢిల్లీకి ఎయిర్ పోర్టుకు చేరుకున్న జర్నలిస్టు మృతదేహం..

ఢిల్లీ : ఆజ్ తక్ ఛానల్ ప్రతినిధి అక్షయ్ సిన్హా మృతదేహం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కాం కవరేజీకి వెళ్లిన అక్షయ్ సిన్హా శనివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

యాదాద్రి సన్నిధికి చేరుకున్న రాష్ట్రపతి..

నల్గొండ  : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధికి చేరుకున్నారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

 

గుంటూరు టిడిపి జిల్లా ఆఫీసు ఇక రాష్ట్ర కార్యాలయం..

గుంటూరు : టిడిపి జిల్లా ఆఫీసును రాష్ట్ర టిడిపి కార్యాలయంగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా టిడిపి కార్యాలయాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 15 రోజుల పాటు జిల్లా కార్యాలయంలో ఉండి పార్టీ, ఎన్టీఆర్ ట్రస్టు కార్యకలాపాలను లోకేష్ పర్యవేక్షించనున్నారు. 

పార్టీ మారను - దానం..

హైదరాబాద్ : పార్టీ మారుతానని వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. పార్టీలోనే కొనసాగుతానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు టీఆర్ఎస్ కలలు కంటోందని, ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను బలహీనపర్చాలని టీఆర్ఎస్ చూస్తోందని, టీఆర్ఎస్ మెనిఫెస్టో అరిచేతిలో స్వర్గం చూపినట్లుందని విమర్శించారు. పార్టీలోనే కొందరు పొమ్మనలేక పొగపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, డీఎస్ కాంగ్రెస్ లోనే ఉంటేనే బాగుంటుందని పేర్కొన్నారు.

 

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల గుట్టు రట్టు..

అనంతపురం : నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల గుట్టు రట్టైంది. ధర్మవరంలో ఈ పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15ఏళ్లుగా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం.

 

వడాయిగూడెం వద్ద రాష్ట్రపతి..గవర్నర్ కు కేసీఆర్ స్వాగతం..

నల్గొండ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి..గవర్నర్ నరసింహన్ లు వడాయిగూడెంకు చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ ఇరువురికి ఘనంగా స్వాగతం పలికారు. 

కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఫైర్ ఆక్సిడెంట్..

హైదరాబాద్ : కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

జర్నలిస్టు మృతి దురదృష్టకరం - చౌహాన్..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో వ్యాపం స్కాం కవరేజ్ కు వెళ్లిన ఆజ్ తక్ ఛానల్ ప్రతినిధి అక్షయ్ సిన్హా మృతి చెందడం దురదృష్టకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకేసులో సిట్ చేత దర్యాప్తు చేయిస్తున్నట్లు వెల్లడించారు. 

వడాయిగూడెంకు చేరుకున్న సీఎం కేసీఆర్...

నల్గొండ : వడాయిగూడెంకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. యాదాద్రిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఏపీ సీపీఎం వెబ్ సైట్ ప్రారంభం..

విజయవాడ : ఏపీ సీపీఎం వెబ్ సైట్ ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా అవసరం ఎంతైనా ఉందని, ప్రజా సమస్యలపై పోరాటానికి వెబ్ చాలా అవసరమని మధు పేర్కొన్నారు. 

10:31 - July 5, 2015

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కంపెనీ శనివారం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చింది. తమకు న్యాయం చేయాలని కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ కు స్థలాన్ని అప్పగించడం వల్లే ఈ లాకౌట్ ప్రకటించారని కార్మికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని, ఆదిత్య కన్ స్ట్రక్షన్ తో కొంతమంది కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.
కుట్రలో భాగంగానే లాకౌట్ - లక్ష్మణరావు..
కుట్రలో భాగంగానే లాకౌట్ ప్రకటించారని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. యాజమాన్యం, ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కార్మికుల చేత బలవంతంగా రాజీనామా చేయించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం..జిల్లా మంత్రి..కార్మిక మంత్రి..కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. వెంటనే లాకౌట్ ను రద్దు చేసి పరిశ్రమను తెరిపించాలని కోరారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు చర్చలు జరుగనున్నాయని లక్ష్మణరావు పేర్కొన్నారు. 

జర్నలిస్టు మృతిపై దర్యాప్తు చేయాలి - కాంగ్రెస్..

మధ్యప్రదేశ్ : జర్నలిస్టు అశోక్ సింగ్ మృతిపై క్షుణ్ణంగా దర్యాప్తు సాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

జబల్ పూర్ మెడికల్ కాలేజీ డీన్ మృతి..

మధ్యప్రదేశ్ : జబల్ పూర్ ఎన్ ఎస్ మెడికల్ కాలేజీ డీన్ మృతి చెందాడు. డా.అరుణ్ శర్మ మృతదేహం ఐజిఐ విమానాశ్రయం సమీపంలోని ఉప్పల్ హోటల్ దగ్గర లభ్యమైంది.

 

జర్నలిస్టు మృతిపై స్వతంత్ర్య దర్యాప్తు చేయాలి - న్యాయవాది వివేక్...

ఢిల్లీ : మధ్యప్రదేశ్ లో జర్నలిస్టు అనుమానస్పదమృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని వివేక్ తన్కా న్యాయవాది డిమాండ్ చేశారు. ఎస్సీ పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలని ఆయన ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతుండగా నడకదారిన వచ్చిన భక్తులకు 8గంటల సమయం పడుతోంది.

రామకుప్పంలో ఏనుగుల బీభత్సం..

తిరుపతి : రామకుప్పం అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తమిళనాడు సరిహద్దులోకి తరిమేందుకు అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. 

అమిత్ షాతో భేటీ కానున్న కిషన్ రెడ్డి..

బెంగళూరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు భేటీ కానున్నారు. బెంగళూరులో నేడు దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 

అనంతపురంలో రాహుల్ పర్యటన ఖరారు..

అనంతపురం :  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈనెల 15, 16వ తేదీల్లో అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు. 

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

అనంతపురం : కనగానపల్లి మండలం కుర్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఓ భర్త గొడ్డలితో భార్యను నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

హాంకాంగ్ చేరుకున్న బాబు..

జపాన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాంకాంగ్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా బాబు జపాన్ పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. బాబుతో పాటు యనమల, నారాయణ, ఐదుగురు ఐఏఎస్ అధికారులున్నారు. 

జర్నలిస్టు మృతిపై రాష్ట్రపతి సంతాపం..

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌ లో 'వ్యాపం' స్కాం కవరేజీకి వెళ్లిన ఆజ్‌తక్‌ ఛానల్‌ ప్రత్యేక ప్రతినిధి అక్షయ్ సిన్హా మృతి చెందడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. సిన్హా కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ట్వీట్ చేశారు.

గచ్చిబౌలిలో డిజిటల్ 5కే రన్...

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగులు నేడు ఉదయం డిజిటల్ 5కే రన్‌ను నిర్వహించారు. మై వే-డిజిటల్ వే పేరిట నిర్వాహాకులు ఈ రన్‌ను చేపట్టారు.

కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పులు..

కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం పది గంటలకు కరీంనగర్ నుండి యాదాద్రికి వెళ్లి మధాహ్నాం పెద్దపల్లికి చేరుకుంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

డ్రంక్ అండ్ డ్రైవ్..18 మందిపై కేసు నమోదు..

హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

08:35 - July 5, 2015

ముంబై : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌. ఆయనను ఇండియాకు రప్పించడానికి కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అలాంటిది కొన్నేళ్ల క్రితమే తాను భారత్‌కు లొంగిపోతానన్న ఆకాంక్షను తనతో వ్యక్తం చేశారంటూ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాంజెఠ్మలాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో దావూద్‌ తనను కలిసిన మాట నిజమేనన్నారు. ముంబై వరుస బాంబు పేలుళ్లతో సహా తనపై వచ్చిన నేరారోపణలన్నీ అవాస్తవాలేనని దావూద్‌ చెప్పినట్టు జెఠ్మలాని పేర్కొన్నారు. తాను అధికారుల ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ లాంటి చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలని కోరినట్టు తెలిపారు. తనను హౌస్‌ అరెస్ట్ చేసి విచారణ జరపాలని, ఒకవేళ తాను తప్పు చేసినట్టయితే ఏ శిక్షకైనా సిద్ధమేనని దావూద్‌ చెప్పినట్టు జెఠ్మలాని వెల్లడించారు. ఈ విషయంలో అప్పటి మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి శరద్‌పవార్‌ను సంప్రదిస్తే ఆయన రిజెక్ట్ చేశారన్నారు. అయితే దావూద్‌ విషయంలో కేంద్రం రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం. లండన్‌లో దావూద్‌ సన్నిహితుడు చోటా షకీల్‌ను కలుసుకున్నట్టు ఓ పత్రికలో వచ్చిన వార్తను రాంజెఠ్మలాని ఖండించారు.
స్పందించిన పవార్..
అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం లొంగుబాటును రిజెక్ట్ చేశారన్న ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని వ్యాఖ్యలపై ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌పవార్ స్పందించారు. రాంజెఠ్మలాని దావూద్‌ ప్రపోజల్‌ తీసుకొచ్చిన మాట వాస్తవమే కానీ షరతులు పెట్టారన్నారు. దావూద్‌ ఇబ్రహీం ముంబైకి రాగానే అరెస్ట్ చేయకూడదని, హౌస్‌ అరెస్ట్ కు అనుమతివ్వాలన్న షరతులు పెట్టడం ఎంతవరకు సబబన్నారు. ముంబై బ్లాస్ట్ తో సహా పలు నేరాల్లో నిందితుడైన దావూద్‌ ఇబ్రహీంను అరెస్ట్‌ చేయొద్దనడాన్ని ఎలా సమర్థిస్తారని పవార్‌ ప్రశ్నించారు. ఎంతటి వారైనా ఇక్కడి చట్టాలకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని శరద్‌పవార్‌ స్పష్టం చేశారు.
ఎలాంటి పురోగతి లేదు..
దావూద్‌ ఇబ్రహీం లొంగుబాటు అంశంపై మాట్లాడడానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిరాకరించారు. దావూద్‌ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రం ఆలోచిస్తోందన్నారు. దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉంటున్నట్టు, డాన్‌ను తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని నరేంద్రమోడీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. భారత్‌ ఆరోపణలను పాకిస్తాన్‌ తిరస్కరిస్తోంది. దావూద్‌ ఇబ్రహీం 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు. దావూద్‌ ఇబ్రహీంను భారత్‌కు రప్పించడం ఓ రాజకీయ అంశంగా మారిందే తప్ప ఇందులో ఎలాంటి పురోగతి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

08:29 - July 5, 2015

జైపూర్ : డ్రీమ్‌గర్ల్ హేమామాలినికి మానవత్వం లేదా? జైపూర్‌లో జరిగిన కారు యాక్సిడెంట్‌లో గాయపడ్డ చిన్నారి పట్ల జాలి చూపలేదా? ప్రమాదంలో గాయపడ్డ బిజెపి నేత తనదారి తాను చూసుకుందే తప్ప బాధితులను పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి బిజెపి ఎంపి హేమామాలిని మెర్సిడిస్‌ బెంజ్‌ కారు ఆల్టో కారు ఢీకొన్న ఘటనలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. రాజస్థాన్‌లోని దౌసా వద్ద గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పాపను ఎందుకు తీసుకెళ్లలేదు ?
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హేమామాలినిని తక్షణమే ఓ డాక్టర్‌ వచ్చి తన కారులో జైపూర్‌లోని ఫార్టీస్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ ఆల్టోకారులోని డ్రైవర్‌ హర్ష్‌ఖండేల్వాల్‌తో పాటు ఐదుగురు బాధితులు మాత్రం సహాయం కోసం 25 నిముషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఆలస్యమే పసిపాప ప్రాణం తీసిందని బాధితులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ నాలుగేళ్ల చిన్నారి సోనమ్‌ను హేమమాలినితో పాటు కారులో తీసుకువెళ్తే పాప ప్రాణాలు దక్కేవని తండ్రి ఆవేదనతో చెప్పారు. తన కూతురు తల్లి ఒడిలోనే మృతి చెందడం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. బిడ్డ చనిపోయిన విషయం తల్లికి ఇంతవరకు చెప్పలేదని తెలిపారు.
చికిత్స పొందుతున్న బాధితులు..
ఖండేల్వాల్‌ భార్య శిఖా, తమ్ముడి భార్య సీమలు జైపూర్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడు కుమారుడు సోమిల్‌ కూడా తీవ్రగాయాలతో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి హేమామాలిని కారు రాంగ్‌ రూట్‌లో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సెలెబ్రిటీకి ప్రమాదం జరగడంపైనే మీడియా ఫోకస్‌ చేసిందే తప్ప బాధితులను పరామర్శించడానికి ఏ ఒక్కరూ రాలేదని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
పాప మృతిపై హేమ..ఈషా డియోల్ దిగ్ర్భాంతి..
పాప మృతిపై హేమామాలిని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడం దురదృష్ట ఘటనగా హేమామాలిని కూతురు ఇషా డియోల్‌ పేర్కొన్నారు. ఖండేల్వాల్‌ ఫిర్యాదు మేరకు హేమామాలిని కారు డ్రైవర్‌ రమేష్‌ చంద్‌ ఠాకూర్‌ను దౌసా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఠాకూర్‌ బెయిలుపై విడుదలయ్యాడు. ఆసుపత్రి నుంచి హేమామాలిని డిశ్చార్జ్ అయ్యారు. బిజెపి ఎంపి జైపూర్‌ నుంచి ముంబైకి వెళ్లిపోయారు.

08:20 - July 5, 2015

కడప : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తెగిపడిన విద్యుత్ వైర్లు ఓ రైతుపై పడిపోయాయి. దీనితో ఆ రైతు అక్కడికక్కడనే సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే...ఆదివారం తెల్లవారుజామున అరటికాయల లోడ్ తో టాటా ఏసీ వాహనం బద్వేల్ నుండి నెల్లూరుకు వెళుతోంది. పీపీ కుంట సమీపంలోకి రాగానే వేగంగా వెళుతున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొటింది. దీనితో విద్యుత్ స్తంభం నెలకొరగడం..11కెవి విద్యుత్ వైర్లు తెగిపడిపోవడం జరిగిపోయాయి. వెనుకనే ద్విచక్రవాహనంపై వస్తున్న రమణారెడ్డిపై వైర్లు పడిపోవడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. వెంటనే మంటలు చెలరేగడంతో రమణారెడ్డి సజీవదహనమయ్యాడు. రమణారెడ్డి మృతి చెందాడన్న తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

నెక్లెస్ రోడ్డులో పోలీసుల స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డుపై గోపాలపురం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అతివేగంతో బైకులను నడుపుతున్న పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 300 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. 

విజయవాడలో రెండు లారీల ఢీ..

విజయవాడ : జిల్లాలోని గుంటుపల్లి వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఇందులో లారీలో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణీకులను స్థానికులు రక్షిస్తున్నారు.

07:40 - July 5, 2015

గ్రీస్‌ : బెయిల్‌ అవుట్ ప్యాకేజీపై నేడు రెఫరెండం నిర్వహించనున్నారు. రుణ సంక్షోభంలో పీకల్లోతుకు కూరుకుపోయిన గ్రీసు దేశ భవిష్యత్‌ నేడు నిర్ధారణ కానుంది. రుణాలిచ్చిన వారి కఠిన షరతులకు అంగీకరించాలా ? వద్దా ? అనే విషయంపై ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్పనున్నారు. గ్రీస్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన రెఫరెండం గేమ్‌లో గెలుపెవరిదో మరికొద్ది గంటల్లో తేలనుంది. 

07:39 - July 5, 2015

మధ్యప్రదేశ్ : 'వ్యాపం' కుంభకోణం వ్యవహారంలో అనుమానాస్పద మరణాల పరంపర కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో చనిపోయిన ఓ యువతి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టించింది. ఝబువా పట్టణానికి సమీపంలోని మేఘనా నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ కుంభకోణం చుట్టూ అలుముకున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌ లో హైప్రోఫైల్‌ వ్యాపం స్కాం కవరేజీకి వెళ్లిన ఆజ్‌తక్‌ ఛానల్‌ ప్రత్యేక ప్రతినిధి అక్షయ్ సిన్హా అనుమానాస్పదరీతిలో మరణించారు. ఈ కేసులో ఇప్పటి దాకా అధికారికంగా 25 మంది చనిపోతే సుమారు 40 మంది అనుమానాస్పదంగా చనిపోయారని అనధికార లెక్కలు ధృవీకరిస్తున్నాయి. కాగా ఇవన్నీ డెత్‌ మిస్టరీగా మారాయి.
కలకలం రేపుతున్న మిస్టరీ డెత్‌...
తాజాగా వ్యాపం కుంభకోణం కవరేజీకి వెళ్లిన సీనియర్‌ జర్నలిస్ట్ హఠాత్తుగా మరణించటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జాబువా సమీపంలో మేఘనగర్‌లో అక్షయ్‌ సిన్హా చనిపోయారని పోలీసుఉన్నతాధికారి ఆబిద్‌ఖాన్‌ ధృవీకరించారు. అయితే ఆయన మృతికి గల కారణాలేంటో ఇప్పటికీ అంతు చిక్కటంలేదు.
యువతి పేరెంట్స్‌ను ఇంటర్య్వూ చేసేందుకు వెళ్లి మృతి..
గతంలో వ్యాపం కుంభకోణంలో నిందితురాలు నమ్రతా దమోర్ అనే యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసేందుకు అక్షయ్‌ సిన్హా వెళ్లారు. నమ్రత తండ్రి మెహతాబ్ సింగ్ దమోర్ కథనం ప్రకారం అక్షయ్‌ సిన్హా తమ ఇంటి బయట నిలబడి ఉండగా ఉన్నట్లుండి నురగలు కక్కుతూ కుప్పకూలిపోయారని, ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందన్నాడు.
సీబీఐ విచారణకు దిగ్విజయ్‌ డిమాండ్..
అక్షయ్ మృతికి కారణాలు స్పష్టంగా తెలియడంలేదని ఇండియా టుడే గ్రూప్ పేర్కొంది. వైద్యులు, దర్యాప్తు అధికారులు నిజానిజాల నిగ్గు తేలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. పోస్ట్‌మార్టమ్‌ నివేదిక వచ్చాకే అక్షయ్ మృతికి కారణాలు తెలుస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విపక్ష కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీబీఐ రంగంలోకి దిగి అనుమానాస్పద మృతుల మిస్టరీని ఛేదించాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది.

యాదాద్రిలో ఆంక్షలు..

నల్గొండ : భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో ఆంక్షలు విధించారు. మధ్యాహ్నాం 2గంటల తరువాత సాధారణ భక్తులను నిలిపివేయనున్నారు. సర్వదర్శనంతో పాటు అన్ని సేవలు నిలిపివేయనున్నారు. వడాయిగూడెం నుండి ట్రాఫిక్ మళ్లించనున్నారు. 

తెగిపడిన విద్యుత్ వైర్లు..వ్యక్తి సజీవ దహనం..

కడప : గోపవరం (మం) నెల్లూరు బైపాస్ రోడ్డులో అదుపు తప్పిన జీపు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీనితో విద్యుత్ వైర్లు బైక్ పై వెళుతున్న వ్యక్తిపై తెగిపడ్డాయి. అతను అక్కడికక్కడనే సజీవ దహనమయ్యాడు. 

నేడు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల సమావేశం..

బెంగళూరు : నేడు బెంగళూరులో అమిత్ షా అధ్యక్షతన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లలలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు 8గంటల సమయం పడుతోంది.

 

నేడు ఆదిలాబాద్ కు కేసీఆర్..

ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

 

06:38 - July 5, 2015

గుంటూరు : పురాతన భజరంగ్‌ జూట్‌ మిల్లుకు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయంతో 3 వేల కార్మికులు రోడ్డున పడ్డారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారం కోసం మిల్లు భూములను విక్రయించారంటూ 20 రోజులుగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించడంతో... ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. యాజమాన్యం తీరును నిరసిస్తూ కార్మికులు కదం తొక్కారు. లాకౌట్‌ నిర్ణయానికి దారితీసిన కారణాలను వివరిస్తూ మిల్లు వద్ద ఓ లేఖను అతికించింది యాజమాన్యం. మిల్లును పూర్తిగా నష్టపరచాలనే ఉద్దేశంతో కార్మికులు వ్యవహరిస్తున్నారని పేర్కొంది. కార్మికులను సూపర్‌ వైజర్లు, మేనేజర్లు క్రమశిక్షణతో పనిచేయాలని కోరినా లక్ష్య పెట్టకుండా బెదిరిస్తున్నారని ఆరోపించింది. మిల్లు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని జూట్‌ మిల్లు పరిరక్షణ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. మిల్లు యాజమాన్యమైన ఈస్ట్‌కోస్ట్ కంపెనీ గుంటూరు జిల్లా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా మారినందున స్థలాలను విక్రయించి రియల్‌ వ్యాపారం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది.
రియల్‌ వ్యాపారం కోసమే ఈ నిర్ణయమని మండిపాటు..
గుంటూరు జిల్లాను ఏపీ రాజధానిగా ప్రకటించడంతో రియల్‌ వ్యాపారుల కన్ను మిల్లు భూములపై పడింది. అంతే ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి మిల్లు స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా కోట్ల రూపాయలకు విక్రయించింది. రాత్రికి రాత్రే రహస్యంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తంతు కూడా పూర్తి చేశారు. అంతేకాదు మాల్స్ నిర్మించేందుకు నగరపాలక సంస్థ నుంచి అనుమతులు పొందినట్లు తెలుస్తోంది.
1934లో భజరంగ్‌ జూట్‌ మిల్లు ప్రారంభం..
యాజమాన్యం గుట్టురట్టు కావడంతో మిల్లు కార్మికులు కదం తొక్కారు. ఆందోళనలు ఉధృతం కావడంతో జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని అక్రమంగా జరిపిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయించారు. ఇక అప్పటి నుంచి మిల్లు మూసివేసేందుకు యాజమాన్యం ఎత్తుకు పై ఎత్తులు వేసింది. కార్మికులను ప్రలోభాలకు గురిచేయడం, విధుల నుంచి తొలగించడం, బలవంతంగా రాజీనామాలు చేయించడం వంటి చర్యలకు పాల్పడింది. ఐదుగురు కార్మికులను సస్పెండ్‌ చేసింది. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ శనివారం ఉదయం కార్మికులు ర్యాలీగా వెళ్లి కార్మిక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు జరిగిన గంటల వ్యవధిలోనే లాకౌట్‌ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు మిల్లు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. 

06:35 - July 5, 2015

హైదరాబాద్ : వారంతా గతంలో పీసీసీ ఛీఫ్ లుగా ఓవెలుగు వెలిగారు. కేకే , బొత్సా, డిఎస్... పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయారు. మరి ఇంకా వారి గుర్తులు మనకెందుకు. పదవులు ఆనుభవించి.. పార్టీకి ద్రోహం చేసిన వారి ఆనవాళ్లు కూడా గాంధీ భవన్ లో ఉండటానికి వీళ్లేదు..అంటూ హన్మంతన్న శివాలెత్తారు. ఆముగ్గురి ఫోటోలను తొలగించేందుకు పీసీసీ పెద్దలు తటపటాయించినా..డొంట్ కేర్ అంటూ.. ఫోటోలను పీకి పారేశారు వీహెచ్. మాజీ పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే పార్టీని వీడి యేడాది దాటిపోయింది. ఇక బొత్స కూడా పార్టీకి హ్యాండిచ్చి.. వైసీపీ లో చేరి రెండు నెలలు కావొచ్చింది. ఇక నిన్నటి వరకు పార్టీకి నమ్మకస్తుడుగా, హైకమాండ్ కు వీరవిధేయుడుగా ఉన్న డీ.శ్రీనివాస్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పి గులాబి గూటికి చేరడంలోసం ముహుర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి పార్టీలో ఉన్నన్నాళ్లు పదవుల్లో ఎంజాయ్ చేసి కష్ట కాలంలో పార్టీ హ్యాండిచ్చిన వీరి గుర్తులు మనకెందుకు అంటున్నారు హస్తం నేతలు. ఇంకెముంది..హన్మంతన్నకు దామన్న తోడయ్యారు. వెతికి వెతికి ఆ ముగ్గురి ఫోటోలను తీసి పారేశారు వీరు.
వెళ్లిన వారి ఆనవాళ్లు ఉండటానికి వీళ్లేదంట..
ఇక నుండి పార్టీని కాదని వెళ్ళిన వారి ఆనవాళ్లు గాంధీభవన్ లో ఉండటానికి వీల్లేదంటున్నారు వీహెచ్. అంతేకాదు మళ్లీ భవిష్యతో వీరిని పార్టీలో చేర్చుకోవద్దని అంటున్న వీహెచ్ దీనిపై పీసీసీ ఓ తీర్మణం చేసి హైకమాండ్ కు పంపుతామంటున్నారు. ఇలా పార్టీపై దెమ్మెత్తి పోసిన వారిని ఇంకా నెత్తిన పెట్టుకుంటే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పోతాయంటున్నారు ఆయన. అంతేకాదు ఇదే ఫార్ములాను గల్లీ నుండి గాంధిభవన్ వరకు వరకు అమలు చేస్తామంటున్నారు వీహెచ్. 

06:31 - July 5, 2015

హైదరాబాద్ : ఐఎస్‌ఐఎస్‌ ముప్పు పొంచి ఉందా..? ముష్కర మూకలు దాడికి తెగబడనున్నాయా..? కిరాతకుల టార్గెట్‌ ఏమిటి..? గతంలో ఇంటలిజెన్స్‌ హెచ్చరికలు నిజం కానున్నాయా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది.. కరడుగట్టిన ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనడం కలకలం రేపుతోంది.
చర్లపల్లి జైలు.. 135 ఎకరాల ఓపెన్‌ఎయిర్‌ .. అందులోనే సెంట్రల్‌ జైల్‌.. 2వేల5 మందికి పైగా ఖైదీలు.. 13 మంది కరడుగట్టిన ఉగ్రవాదుల కస్టడీ.. ఇలాంటి చోట భద్రత ఎలా ఉండాలి..? ప్రతి కదలికపైనా జైళ్ల శాఖ అధికారుల దృష్టి ఎలా ఉండాలి..? అందూలోనూ 40 బాంబు పేలుళ్ల ఘటనలతో సంబంధం ఉన్న ఇండియన్‌ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ వంటి కిరాతకులను ఉంచిన చోట ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలి..? మరి తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు అలాంటి చర్యలు తీసుకుంటున్నారా..? అంటే సమాధానం సందేహాలకు తావిచ్చేలా చేస్తోంది.. యాసిన్‌ భత్కల్‌ జైల్లోంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
నాంపల్లి కోర్టుకు తరలింపులో ఇబ్బందులు..
యాసిన్‌ భత్కల్‌.. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు.. ఎంతో శ్రమించిన ఎన్‌ఐఏ ఈ ముష్కరుడిని అరెస్టు చేసింది. దర్యాప్తు కోసం చెర్లపల్లి జైలుకు తరలించింది. అక్కన్నుంచి విచారణ కోసం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారింది. కోర్టుకు తరలించే సమయంలో దాడులకు దిగి యాసిన్‌ తప్పించుకోవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే జైలు ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. పోలీసుల విజ్ఞప్తి మేరకు భత్కల్‌ కేసును రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదలాయించారు. అయినా భత్కల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఎప్పటికప్పడు ఇంటెలిజెన్స్ వార్నింగ్‌బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఇందుకు బలం చేకూరేలా సమాచారం బయటకు రావడం జైళ్ల శాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఫోన్ సౌకర్యం..
చర్లపల్లి జైలులో ఖైదీలకు కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడుకునే సౌకర్యం ఉంది. ల్యాండ్‌ లైన్‌తో వారానికి రెండుసార్లు ఫోన్‌ చేసుకోవచ్చు. ఇలాగే యాసిన్‌ భత్కల్‌ సైతం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసుకున్నారని చెబుతున్నారు జైళ్ల శాఖ అధికారులు. మరి అందరిలాగే కరడుగట్టిన తీవ్రవాది యాసిన్‌ భత్కల్‌కు కూడా ఫోన్‌ మాట్లాడుకునే అవకాశం ఎలా వచ్చిందంటే ఖాకీలు క్లారిటీ ఇస్తున్నారు. ముందు భత్కల్‌కు ఫోన్‌ మాట్లాడుకునే అవకాశం లేదంటున్నారు. తర్వాత దీనిపై భత్కల్‌ కోర్టును ఆశ్రయించాడంటున్నారు. ఫస్ట్ క్లాస్ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ జడ్జి ఆదేశాలతో ఫోన్‌ మాట్లాడుకునే అవకాశం భత్కల్‌కు లభించిందంటున్నారు. 18 ఫిబ్రవరి 2015 నుంచి భత్కల్‌ కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుకుంటున్నారని చెబుతున్నారు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు.
డీఐజీ కేశవనాయుడు ప్రత్యేక తనిఖీలు..
భత్కల్‌తో పాటు ఎవరు ఫోన్ మాట్లాడుకున్నా అదంతా రికార్డవుతుందని చెబుతున్నారు. అతను ఫోన్ మాట్లాడే విషయం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు కూడా తెలుసంటున్నారు. ఒక కాల్‌ ఐదు నిమిషాల వరకు మాట్లాడవచ్చంటున్నారు. తర్వాత అది ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుందని చెబుతున్నారు జైళ్ల శాఖ అధికారులు. ఇలా మాట్లాడినపుడు రికార్డైన భత్కల్‌ సంభాషణలు సేకరించిన ఎన్‌ఐఏకు వాటి పరిశీలనలో అనేక భయానక అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇందుకు ఐఎస్‌ఐఎస్‌ తనకు సాయం చేస్తోందని భత్కల్‌ తన భార్యతో మాట్లాడినట్లు ఎన్‌ఐ గుర్తించినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని ఐన్‌ఐఏ నుంచి ఆదేశాలు రావడంతోనే వరంగల్‌ జైళ్లశాఖ డీఐజీ కేశవనాయుడు చర్లపల్లిలో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.
పలు అంశాలపై అధికారుల దృష్టి..
ఫోన్‌లో రికార్డైన సంభాషణలు కాకుండా యాసిన్‌ భత్కల్‌ ఇంకా ఎవరెవరితో మాట్లాడాడు. ఎలాంటి పథకం రచిస్తున్నాడనేది కలవరం రేపుతోంది. అతనితో ములాఖత్‌ అయినవారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. భత్కల్‌ కుటుంబ సభ్యులను కూడా ఎవరెవరు కలుస్తున్నారు. గతంలో ఎవరెవరు కలిశారు వాళ్లతో ఉన్న సంబంధాలేమిటి అనే అంశాలన్నింటిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో చర్లపల్లి జైలు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భత్కల్‌ తప్పించుకునేందుకు ఎలాంటి సంకేతాలు లేవని చెబుతూనే బందోబస్తు పెంచడమం అనుమానాలకు తావిస్తోంది.

06:26 - July 5, 2015

హైదరాబాద్ : ఏపీ మంత్రులపై మరోమారు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఈ సారి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌కు క్లాస్‌ పీకారు.. పర్యటనలు కాస్త తగ్గించి...శాఖ పనులు చూసుకోవాల్సిందిగా గట్టిగా సూచించారు. వాస్తవానికి మంత్రి గంటా శ్రీనివాస్‌ కూడా అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరు కావాల్సి ఉంది. అందుకు గానూ జీఎడీ డిపార్ట్‌మెంట్‌ జీవో. ఆర్‌టీ. నంబర్‌ 2038 పేరిట జూలై 3న పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. అయితే చంద్రబాబు క్లాస్‌తో ఖంగుతున్న మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల సమస్యలు పక్కనబెట్టి విదేశీ పర్యటన అవసరమా?..
అయితే గంటాపై చంద్రబాబు ఆగ్రహానికి కారణాలు పరిశీలిస్తే...గత కొంతకాలంగా 9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన వివాదాలలో మంత్రి తీరు సరిగా లేదనేది సీఎం చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఓ పక్క ఉమ్మడి విద్యాసంస్థలలో అడ్మిషన్లు దొరకని పరిస్థితులు నెలకొని ఉంటే మరోపక్క మంత్రి ఆ విషయాన్ని వదిలేసి పర్యటనపై శ్రద్ధ చూపుతున్నారని బాబు భావిస్తున్నారు.
సీఎంతో సంప్రదించకుండానే మంత్రి గంటా సొంత నిర్ణయాలు..
అలాగే ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో మంత్రి దూకుడుగా ఉండటం.. విద్యా ప్రైవేటీకరణ విషయాల్లో మంత్రి సీఎంతో సంప్రదించకుండా సొంతనిర్ణయాలు తీసుకోవడం బాబు కోపానికి కారణమని తెలుస్తోంది. సీఎంకి సమాచారం లేకుండానే వచ్చే కేబినేట్‌లోనే ప్రైవేట్‌ యూనివర్సిటీలపై నిర్ణయం తీసుకుంటామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తెస్తామని మంత్రి గంటా అన్నారు. దీంతో గంటా వ్యాఖ్యలను సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఇలా వరుస సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మంత్రి గంటాపై సీఎం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఖంగుతిన్న మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు మూడు రోజులుగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేస్తున్నారట. 

06:20 - July 5, 2015

హైదరాబాద్ : హైదరాబాద్ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. సుమారు 8 గంటల పాటు సుధీర్గంగా సాగిన ఈ క్యాబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఈ-మెయిల్, ఆధార్ విధానాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై శాసనసభా కమిటీ వేయాలని తీర్మానించింది. కేబినెట్ సమావేశానికి సంబంధించి మంత్రులు మీడియాకు తెలియచేశారు.
నూతన ఈ మెయిల్ విధానం..
నూతన ఈ-మెయిల్ విధానంతో పాటు ఆధార్‌ విధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా కేంద్రంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపించేందుకు భూములు కోరిన వారికి భూముల కేటాయింపుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
ఇళ్ల నిర్మాణాల అవినీతిపై శాసనసభా కమిటీ..
గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై శాసనసభా కమిటీ వేయాలని కేబినేట్ తీర్మానించింది. సుమారు 14 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, 4 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్టు మంత్రివర్గం గుర్తించింది. దీంతో హౌస్ కమిటీ విజిలెన్స్ దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. వీటితో పాటు హుదుద్‌ తుపానుతో దెబ్బతిన్న ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం నిర్ణయించింది.
పుష్కరాల వెబ్ సైట్ ప్రారంభం..
ఇక గోదావరి పుష్కరాల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పుష్కరాల వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పుష్కరాల పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు.. పుష్కర స్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత మంత్రులకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.

06:17 - July 5, 2015

ఆదిలాబాద్ : 'హరితహారం'లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలతో బిజీ బిజీగా సాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ నుంచి బయలుదేరి ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం దండేపల్లి మండలం గూడెంలో 3 టీఎంసీల సామర్థ్యం గల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సభ అనంతరం మొక్కలు నాటి హరితహారంలో పాల్గొననున్నారు.
సీఎం షెడ్యూల్ లో అనిశ్చితి..
అయితే 5న యాదగిరిగుట్ట పర్యటన ఖరారు కావడంతో...సీఎం షెడ్యూల్‌లో కొంత అనిశ్చితి నెలకొంది. మంచిర్యాల, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల మీదుగా సీఎం బస్సుయాత్ర ఉండనుంది. మొదట కేసీఆర్ గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి అక్కడ మొక్కలు నాటుతారు. ఆ తర్వాత గోదావరి నది తీరాన ఏర్పాటు చేసే సభలో పాల్గొంటారు. కడెం మండలం దేవునిగూడెం శివారులోనూ మొక్కలు నాటుతారు.
గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ఆవిష్కరించనున్న సీఎం..
మామడ, లక్ష్మణచాంద మండలం కనకాపూర్, నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, ఐబీ చౌరస్తాలోని నీటిపారుదలశాఖ కార్యాలయం ఎదుట, కొత్త ఆర్డీఓ కార్యాలయం ఎదుట మొక్కలను నాటుతారు. తర్వాత మూడున్నర కోట్లతో నిర్మించిన కొత్త ఆర్డీఓ భవనాన్ని ప్రారంభిస్తారు. గాంధీపార్కులో ప్రజలనుద్ధేశించి ప్రసంగించనున్నారు.
నిర్మల్‌లో కొత్త ఆర్డీఓ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం..
గూడెంలో ఎత్తిపోతల పథకం వద్ద ప్రారంభించే శిలాఫలకాన్ని, బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు. జిల్లా ఎస్పీతో కలిసి కలెక్టర్ జగన్మోహన్ జన్నారం మండలం కిష్టాపూర్, కడెం మండలం దేవునిగూడెంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటే స్థలాలను పరిశీలించారు. కడెంలో అధికారులతో సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్‌ రానుండటంతో... పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

06:14 - July 5, 2015

హైదరాబాద్ : రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు మరోసారి జపాన్‌ బాట పట్టారు. ఇప్పటికే ఏడాది కాలంలో నాలుగు దేశాల్లో పర్యటించిన బాబు రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు మరోసారి జపాన్‌ బాట పట్టారు. శనివారం అర్ధరాత్రి చంద్రబాబు జపాన్‌ పర్యటనకు బయల్దేరారు. రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చిన జపాన్‌ ప్రభుత్వ పెద్దలను.. రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించబోతున్నారు. అలాగే జపాన్‌లోని వివిధ కంపెనీలు, బ్యాంకుల అధినేతలతో సమావేశమై ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చించనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, పలువురు అధికారులు ఉన్నారు. వీరు 6, 7, 8 తేదీల్లో జపాన్‌లో పర్యటిస్తారు.
జపాన్‌ ప్రధాని షింజో అబేకు ఆహ్వానం..
ఇప్పటికే రాజధాని నిర్మాణంలో సహకరిస్తామని జపాన్‌ ప్రభుత్వం ఏపీకి హామీ ఇచ్చింది. అమరావతి నిర్మాణంపై చర్చించడంతో పాటు విజయదశమి రోజు జరిగే రాజధాని శంకుస్థాపనకు రావల్సిందిగా జపాన్‌ ప్రధాని షింజో అబేను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత టోక్యోలో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
దసరా రోజున శంకుస్థాపన..
ఇప్పటికే రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసిన ఏపీ ప్రభుత్వం దసరా రోజున శంకుస్థాపనకు రెడీ అవుతోంది. మరోవైపు సీడ్‌ క్యాపిటల్‌ ప్లాన్‌ చేతికి అందగానే రాజధాని పనులు స్పీడ్‌అప్‌ అవుతాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈలోపే వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ఈ పర్యటన సహకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

06:12 - July 5, 2015

నల్గొండ : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని నేడు సందర్శించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ రాకకోసం అధికార యంత్రాంగం, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేసింది. యాదగిరిగుట్టను తొలిసారిగా సందర్శించనున్న రాష్ట్రపతి దాదాపు గంటపాటు లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపనున్నారు.
ప్రత్యేక కాన్వాయ్‌లో రాష్ట్రపతి..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతికి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటల10 నిమిషాలకు భువనగిరి మండలం వడాయిగూడెం చేరుకుంటారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో గుట్ట ప్రధాన రహదారి గుండా కొండమీదకి వెళతారు.
ఆండాళ్‌ అతిథి గృహంలో బస చేయనున్న ప్రణబ్‌..
ఆలయ అర్చకులు రాష్ర్టపతి ప్రణబ్‌కు పూర్ణ కుంభస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి 11గంటల 50 నిమిషాలకు స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఆండాళ్‌ అతిథి గృహానికి చేరుకొని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం యాదాద్రి చరిత్ర, గుట్ట అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతికి సీఎం వివరిస్తారు. అనంతరం తిరిగి ఒంటి గంటకు రాష్ర్టపతి హైదరాబాద్‌ చేరుకుంటారు.
కేంద్ర, రాష్ట్ర భద్రతా సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లు..
రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర భద్రతా సిబ్బంది పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. సాయుధబలగాలు పహారా కాస్తున్నాయి. యాదాద్రి కొండపై నుంచి భక్తులను ఇప్పటికే అతిథిగృహల నుంచి ఖాళీ చేయించారు. ప్రభుత్వ విప్ గొంగడి సునీత ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ వికే దుగ్గల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

నేడు యాదాద్రికి రాష్ట్రపతి..

నల్గొండ : రాష్ట్రపతి రాకకోసం యాదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

రేపటి నుండి పుంజుకోనున్న రుతు పవనాలు..

న్యూఢిల్లీ : ఆలస్యంగా వచ్చి ఒక్కసారిగా కుంభవృష్టితో తడిపేసిన నైరుతి రుతుపవనాలు మళ్లీ సోమవారం నుండి పుంజుకొనే అవకాశాలున్నట్లు ప్రైవేటు వావతావరణ సంస్థ స్వైమెట్ పేర్కొంది.

 

నేడు తేలనున్న గ్రీస్ భవితవ్యం..

గ్రీస్ : రుణ సంక్షోభంలో పీకల్లోతుకు కూరుకపోయిన గ్రీసు దేశ భవిష్యత్ నేడ తేలబోనుంది. గ్రీసు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన రెఫరెండం గేమ్ లో గెలుపెవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 

నేడు హైదరాబాద్ కు జవదేకర్..

హైదరాబాద్ : కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో జవదేకర్ పాల్గొనున్నారు.

 

Don't Miss