Activities calendar

06 July 2015

అడ్డగుట్ట బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్..

హైదరాబాద్: అడ్డగుట్ట మహీంద్రాహిల్స్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది. 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

క్వార్టర్స్ కు చేరుకున్న రోహన్ బోపన్న జోడి..

లండన్ : రోహన్ బొపన్న జోడి వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. మూడో రౌండ్ లో కుబోట్ జోడితో హోరాహోరీగా సాగిన పోరులో 7-6, 6-7, 7-6 సెట్ల తేడాతో విజయం సాధించారు. 

21:36 - July 6, 2015

హైదరాబాద్ : రాజకీయంగా బలపడటానికి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా నేతలకు గులాబీ కండువా కప్పేస్తున్నారు. దాని కోసం వారికి మంత్రి పదవో.. మరో పదవో.. ఇచ్చేస్తున్నారు. పదవులు బయటివారికేనా ఎప్పటినుంచో ఉద్యమంలో పని చేసినవారికి లేవా అనే అసంతృప్తి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. గ్రేటర్‌ కిరీటం దక్కేవరకు గులాబీపార్టీకి ఇన్‌కమింగ్‌ తప్పితే నో అవుట్‌గోయింగ్‌ అనేది గులాబీబాస్‌ స్కెచ్‌లా కనపడుతోంది. అప్పటివరకు పార్టీలో ఉన్నవారిని కన్విన్స్‌ చేయడానికి మంత్రివర్గ మార్పులనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
నివ్వెరపరుస్తున్న కేసీఆర్ వ్యూహాలు...
గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు పొలిటికల్‌ పండిట్లను సైతం నివ్వెరపరుస్తున్నాయి. సెటిలర్స్‌ ఓట్లను రాబట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. వలస నేతలను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి వర్గాన్ని విస్తారిస్తామని ఓ సారి.. ఇక కేబినెట్‌ మంత్రులకు వణుకు పుట్టించేందుకు మంత్రి వర్గాన్ని ప్రక్షాళిస్తామని మరోసారి...ఇలా ఏ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు కల్వకుంట్ల. అన్ని సామాజిక వర్గాల ఓట్లను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసేందుకు హైదరాబాద్‌ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. స్వచ్ఛ్‌ హైదరాబాద్‌, విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇఫ్తార్‌ విందులు ఇందులో భాగమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సెటిలర్స్ ఓట్లు రాబట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు..
మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల పనితీరుపై ఆయన తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినా ఇప్పటికీ కొందరు మంత్రులు వారి శాఖలపై పట్టు సాధించకపోవడంపై సీరియస్‌గా ఉన్న సీఎం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రుల పని తీరుపై తీవ్ర అసంతృప్తి..
మంత్రులుగా ఉండి కేవలం తమ శాఖ కార్యదర్శులు చెప్పినట్లు నడుచుకుంటున్నారు తప్ప స్వయంగా చొరవ చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. శాఖాపరమైన నిర్ణయాలను సైతం అమలు చేయలేకపోతున్నారనేది మరో ఆరోపణ. ఏ చిన్న సమస్య వచ్చినా తననే సంప్రదించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఏ సమస్య వచ్చినా సీఎం దగ్గరికి పరుగులు..
ఇక జిల్లాలపై అమాత్యులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పట్టు సాధించకపోవడం కేసీఆర్‌కు చికాకు తెప్పిస్తోంది. విపక్షాలను ఎదుర్కొవడంలోనూ, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి టీమ్‌ వర్క్‌ చేయడంలోనూ వారు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ ఏడాది ముగిసే లోపే కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటిస్తారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు అటుఇటుగా ముహుర్తం ఉంటుందంటున్నారు. కరీంనగర్ హరితహారం కార్యక్రమంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఖాయమని కేసీఆర్‌ చెప్పడం ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. 

21:28 - July 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్, సీఎం, స్పీకర్ లపై రాష్ట్రపతికి టి.కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేసి ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ను సోమవారం టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కలు కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని, సీఎం ప్రలోభాలకు గురి చేస్తున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పార్టీ మారిన నేతలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఈ విషయంలో గవర్నర్ కూడా మౌనంగా ఉంటున్నారని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మౌనంగా వారు ఉండడం మంచి పద్ధతి కాదని, వెంటనే గవర్నర్ కు సలహా ఇవ్వాలని తాము రాష్ట్రపతిని కోరడం జరిగిందన్నారు. 

21:21 - July 6, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు కావడం పట్ల ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. కావాలనే ప్రభుత్వం ఇలా చేస్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన సండ్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న టిడిపి నేతలు మాగంటి గోపినాథ్, ఎల్ రమణ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వేర్వేరుగా మీడియాతో వారు మాట్లాడారు.
దళిత నాయకుడు -మాగంటి..
ఒక దళిత నాయకుడైన సండ్రపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. దళితుడని అని చూడకుండా బాబు జగ్జీవన్ రాం వర్థంతి రోజునే సండ్రను అరెస్టు చేశారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని, కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రాలేదని విమర్శించారు.
కుట్రలను తిప్పి కొడుతాం - ఎల్ రమణ..
ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొడుతామని ఎల్ .రమణ పేర్కొన్నారు. టిడిపిని బలహీనపర్చాలని కుట్ర చేస్తోందని, తుమ్మల నుండి కేసీఆర్ వరకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు లొంగకపోతే అక్రమంగా కేసులో ఇరికించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఘాటైన విమర్శలు చేశారు.

కిందపడిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి..

అస్సాం : రాష్ట్రంలోని దిబ్రుగర్హ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. అకస్మాత్తుగా వేదిక కూలిపోవడంతో ఆయన కిందపడిపోయారు. 

రాష్ట్రపతి నిలయంలో నక్షత్ర వాటిక ప్రారంభం..

హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నక్షత్ర వాటికను ప్రారంభించారు. 

పులిగుండా ప్రాజెక్టులో యువకుడి మృతదేహం..

ఖమ్మం: పెనుబల్లి మండలం బ్రహ్మళ్లకుంట అటవీ ప్రాంతంలో ఉన్న పులిగుండాల ప్రాజెక్టులో యువకుడి మృతదేహం లభ్యమైంది.

 

త్వరలో కామారెడ్డి జిల్లా - కేసీఆర్..

నిజామాబాద్: త్వరలో కామారెడ్డి జిల్లా కాబోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కామారెడ్డి జిల్లా కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని త్వరలో ఆ కళ నెరవేరబోతోందని తెలిపారు.

 

మధ్యప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు - ఉమా భారతి..

న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణానికి సంబంధించిన అనుమానాస్పద మరణాలపై మధ్యప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. 

భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ ఎత్తివేత..

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. 

20:57 - July 6, 2015

విజయవాడ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దళితుల సమస్యలు పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని దళిత సంఘం నాయకులు కోరారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకురావాలని దళిత సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 24 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 

20:56 - July 6, 2015

ఆదిలాబాద్ : తంగేడు ఆకులపై తెలంగాణ చరిత్ర రాసి అభిమానం చాటుకున్నాడు ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కి చెందిన ఓ విద్యార్థి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వినయ్‌ కుమార్‌ అనే విద్యార్థి తెలంగాణ చరిత్రపై అభిమానం పెంచుకుని.. దాని గొప్పతనాన్ని చాటాలనుకున్నాడు. దీంతో తెలంగాణ పుష్పమైన తంగేడు ఆకులను ఎంచుకున్నాడు. దాదాపు 30 వేల తంగేడు ఆకులపై 1969 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ చరిత్రను రాశాడు. ఈ చరిత్రను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందిస్తానంటున్నాడు వినయ్‌. ఈ విద్యార్థి గతంలోనూ చింతాకు పై హనుమాన్‌ చాలీసా రాసి.. అందర్నీ ఆకట్టుకున్నాడు. తనను ప్రభుత్వం ప్రొత్సహిస్తే.. మరిన్ని ఇలాంటి ప్రయోగాలు చేస్తానని చెబుతున్నాడు. 

20:54 - July 6, 2015

అనంతపురం : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో సీపీఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల హామీలను సర్కార్‌ విస్మరిస్తోందని ఆరోపించారు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పవర్‌ లూమ్స్‌ మగ్గాలను నియంత్రించకపోవడం వల్లే చేనేత మగ్గాలు మూలనపడ్డాయని, చేనేత కార్మికులకు ఉపాధి చూపించాలని వారు డిమాండ్‌ చేశారు. చేనేత కుటుంబాలకు రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. 

20:52 - July 6, 2015

అనంతపురం : పోలీసులను దూషించిన కేసులో అరెస్టు అయిన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బెయిల్‌ కోసం కోర్టు పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ రేపు విచారణకు వస్తుందని ఎమ్మెల్యే అఖిల ప్రియ తెలిపారు. భూమా నాగిరెడ్డిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా భూమాను హైదరాబాద్‌ తరలించాలని అఖిలప్రియ కోరారు.

20:50 - July 6, 2015

కడప : జిల్లాలో ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోనంటూ మోహం చాటేయడంతో బాధితురాలు కడప జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం దాసరి పల్లెకు చెందిన దళిత యువతి అదే గ్రామంలోని చిత్తా శౌరిరెడ్డి మెమోరియల్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరస్పాండెంట్ బంధువు చిత్తా రాజమోహన్ రెడ్డి తాను ప్రేమిస్తున్నానని పెళ్లా చేసుకుంటానంటూ చెప్పి సంవత్సరం పాటు యువతి వెంటతిరిగాడు. ఈ విషయం అందరికి తెలియడంతో తనను పెళ్లి చేసుకోమని బాధితురాలు ఒత్తిడి తెచ్చింది. దీంతో చిత్తారాజమోహన్ రెడ్డి అసలు రంగు బయటపడింది. అగ్రవర్ణానికి చెందిన తాను తక్కువ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోనంటూ చెప్పాడు. దీంతో బాధితురాలు.. చిత్తా రాజమోహన్ రెడ్డితో వివాహం జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. ఈమెకు దళిత, బహుజన సంఘాలు అండగా నిలిచాయి.

 

20:48 - July 6, 2015

నెల్లూరు : ఆత్మకూరులో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్‌ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపును వెంటనే ఎత్తివేయాలంటూ కాలనీకి చెందిన మహిళలు డిమాండ్‌ చేశారు. షాప్‌ను తెరవనీయకుండా ఎక్సైజ్‌ సిబ్బందిని అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకుని మద్యం షాపును తొలగించాలంటూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంతంగా ఉండే తమ కాలనీలో మద్యం షాపు పెట్టినప్పటి నుంచి నిత్యం తాగుబోతుల ఆగడాలు ఎక్కువయ్యాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులకు స్పందించి.. వైన్‌ షాపును తొలగించాలని విజ్ఞప్తి చేశారు. 

గూడవల్లి వద్ద రెచ్చిపోయిన ఆకతాయిలు..

విజయవాడ : గూడవల్లి వద్ద ఆకతాయిలు రెచ్చిపోయారు. శారదా కాలేజీ బస్సును అడ్డుకుని విద్యార్థినిలను ఈవ్ టీజింగ్ చేశారు. ఇందులో ఓ విద్యార్థినిని చితకబాదారు. గన్నవరం పోలీసులకు విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. 

ఏసీబీ కార్యాలయానికి టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఏసీబీ కార్యాలయానికి టిడిపి నేతలు వచ్చారు. కానీ వారిని పోలీసులు లోనికి అనుమతించలేదు. దీనితో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని టిడిపి నేతలు ఎల్. రమణ, మాగంటి పేర్కొన్నారు. సండ్ర అరెస్టు అక్రమమని తెలిపారు. 

 

రాష్ట్రపతిని కలిసిన సీపీఎం నేతలు..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీపీఎం నేతలు కలిశారు. భద్రాచలం నియోజకరవర్గం సగం ఏపీలో కలిసిందని, ఓ ఎమ్మెల్యేగా తనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చినట్లు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య మీడియాకు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరడం జరిగిందన్నారు. విలీన మండలాల సమీక్షా సమావేశాలకు..అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం తనను కూడా ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. 

20:26 - July 6, 2015

గుంటూరు : రాజధాని భూసేకరణకోసం హామీలమీద హామీలు గుప్పించిన ప్రభుత్వం వీటి అమలుకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో స్కిల్స్ పెంచే కార్యక్రమం మొదలైంది. ఈ ట్రైనింగ్‌పై హర్షం వ్యక్తమవుతున్నా జాబ్ కు గ్యారంటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్లకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొమ్మిది గ్రామాలకు చెందిన రైతుల పిల్లలు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. వీరికి ట్రైనింగ్ పూర్తయ్యాక ప్రైవేటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.
పేర్లు నమోదుచేయించుకుంటున్న విద్యార్థులు..
ఈ శిబిరం మొదలైనప్పటినుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇందులో తమపేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌తోపాటు ఆధునిక సౌకర్యాలతో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో తాము చాలా విషయాలు నేర్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
కొన్ని రకాల కోర్సులకు శిక్షణలేదంటున్న అధికారులు..
అయితే కొన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు మాత్రం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కోర్సులకు ఇక్కడే శిక్షణ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక ఉపాధికి గ్యారంటి ఇవ్వకపోవడంపై నిరుద్యోగుల నుంచి అందోళన వ్యక్తమవుతోంది.
చదువురాని వారికి శిక్షణపై క్లారిటీ లేదు..
మరో వైపు చదువురాని వారికి ఏ తరహా ట్రైనింగ్ ఇస్తారన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. కార్మికులు, కౌలు రైతులు, కూలీలు, భూములు కోల్పోయిన వారంతా ప్రస్తుతం తమ ఇళ్ల దగ్గరే కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఎక్కడ ఉపాధి చూపుతారన్న దానిపై క్లారిటీ లేదు. తాము చేయగలిగిన పనులకు సంబంధించి శిక్షణ ఇవ్వాలని వీరంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

20:21 - July 6, 2015

గుంటూరు : ఏపీ నూతన రాజధానిలో కొలువుల జాతర మొదలైంది. సీఆర్డీఏలోని ఈ ఉద్యోగాలభర్తీలో సిఫార్సులుకూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. అయితే ఈ ఉద్యోగాలను అర్హులకే ఇస్తారా? సిఫార్సులకే పెద్దపీట వేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఉద్యోగాలకోసం జోరుగా లాబీయింగ్..
ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థలో ఉద్యోగాల కోసం పైరవీలు జోరుగా సాగుతున్నాయి.. తమకు తెలిసిన ఉన్నతాధికారుల ద్వారా కొందరు సిఫార్సులు చేయించుకుంటున్నారు.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలద్వారా మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
778 ఉద్యోగాలభర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
సీఆర్డీఏలో ప్లానింగ్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో 778 ఉద్యోగాలను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో తీసుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 శాతం ఆ తర్వాత దశల వారీగా మిగిలిన పోస్టులు భర్తీ చేసుకోవాలని ఆదేశించింది. ఇందులోభాగంగా వివిధ విభాగాల్లోని 278 పోస్టుల భర్తీకి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. మొదటి విడతలో 51 పోస్టులు, తర్వాత 210, అవి భర్తీఅయ్యాక మరో 17 మంది నియామకానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 51 పోస్టుల ఎంపిక ప్రక్రియను స్వయంగా చేపట్టింది సీఆర్డీఏ. ఆ తర్వాత దశలోని 227 ఉద్యోగుల భర్తీమాత్రం ఆంధ్రా విశ్వవిద్యాలయంతో కలసి చేయబోతోంది.
పారదర్శకంగా చేపట్టాలనే వినతులు...
ఈ ఉద్యోగులభర్తీని పారదర్శకంగా చేపట్టాలని కోరుతున్నారు నిరుద్యోగులు. ఎలాంటి సిఫార్లుకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు నిరుద్యోగుల డిమాండ్లు.. అటు సిఫార్సులతో సీఆర్డీఏలో హంగామా నడుస్తోంది. ఈ ఉద్యోగాల్లో అర్హులనే నియమిస్తారా? పైరవీలకే పెద్దపీట వేస్తారా? అన్నది వేచి చూడాలి.

20:17 - July 6, 2015

విజయవాడ : పదవతరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభచూపిన పోలీస్ కుటుంబాల పిల్లలను సత్కరించారు విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు. బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి మహల్ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. నూట ఎనిమిదిమంది విద్యార్థులను అభినందించిన సీపీ వారికి పారితోషికాలు అందజేశారు. చివర్లో పోలీస్ కమిషనర్ దత్తత తీసుకున్న కృష్ణలంక మున్సిపల్ స్కూల్ విద్యార్థులు చేసిన యోగా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 

20:15 - July 6, 2015

హైదరాబాద్ : పచ్చటి పార్కులు కబ్జాసురుల కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. చిన్నారుల ఆటపాటలతో సందడిగా ఉండాల్సిందిపోయి నిర్మాణాలకు నిలయంగా మారుతున్నాయి. డబ్బుదాహానికి బలైపోతున్న పార్కుల దీనస్థితిపై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్‌లో ఆక్రమణలకుగురైన పార్కులపై టెన్ టీవీ క్షేత్రస్థాయిలో స్టడీచేసింది. కబ్జాలు ఇన్నిరకాలుగా చేయొచ్చా అన్న రీతిలో జరిగిన ఈ ఆక్రమణలను వెలుగులోకితెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. వేగంగా విస్తరిస్తున్న ఈ నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. యాభైగజాలుంటే చాలు లక్షాధికారన్న రేంజ్‌లో ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కొండలు, గుట్టలు, నాలాలు, చెరువులు అన్నతేడా లేకుండా భూములన్నీ అక్రమణలకు గురవుతున్నాయి. ఆఖరికీ పార్కు స్థలాలనూ వదలడంలేదు కబ్జాసురులు. నేతలు, అధికారుల అండదండతో మరింత రెచ్చిపోతున్నారు.
1600 గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు..
సరస్వతి నగర్ కాలనీ పార్క్. చింతల్ కుంట సమీపంలో జాతీయ రహదారికి అతి సమీప ప్రాంతం. ఇక్కడ మూడు కోట్ల విలువైన 1600గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. చిన్నా పెద్దా ఆహ్లాదంగా సేదతీరుతున్న ఈ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. ఈ ప్లేస్ తమదంటూ పత్రాలు సృష్టించారు. నిర్మాణాలు చేపట్టారు. చివరికి ఈ అంశం కోర్టుకు చేరింది. ఈ పార్క్ కాలనీ సంక్షేమ సంఘానికి చేందుతుందటూ 2008లో తీర్పుచెప్పింది న్యాయస్థానం. అయినా అక్కడి నిర్మాణాలు తొలగించలేదు గ్రేటర్ అధికారులు. గ్రీన్ ఎస్టేట్ పార్క్ పరిస్థితి ఇలాగే ఉంది.
అక్రమార్కులకు అధికారుల సహాయం..
జిహెచ్ ఎంసి పార్కు స్థలాలను ఇతరులకు కట్టబెట్టడంలో మేముసైతం అంటూ చేయికలుపుతున్నారు అధికారులు. అక్రమార్కులకు సహకరిస్తూ భూములను మాయం చేస్తున్నారు. ఈ స్థలం తమదంటూ చిన్న స్టే తెచ్చుకుంటే చాలు అటువైపే చూడట్లేదు మన గ్రేటర్ అధికారులు. వెంకటేశ్వర కాలనీలోని ఓ స్థలం కబ్జా అయిందంటూ అసిస్టెంట్ సిటీ ప్లానర్ స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై అధికారి మాత్రం దానిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు.
సాగర్ ఎన్ క్లేవ్ పార్కుదీ అదే దుస్థితి..
ఈ పార్కు సాగర్ ఎన్‌క్లేవ్ కాలనీకి చెందింది. 2వేల 800గజాలున్న ఈ స్థలంలోని 600 గజాలను జివో 166 ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు అప్పగించారు రెవెన్యూ అధికారులు. ఇందులోని 120గజాల్లో ఇలా ఇంటిని నిర్మించారు వాళ్లు. ఇల్లు కడుతున్నంత సేపూ అటువైపేరాని అధికారులు అంతా పూర్తయ్యాక ఇలా తూతూమంత్రంగా కూల్చేశారు.
మరోసారి లే అవుట్ కు ఛాన్స్ ఉంటుందా ?
సాధారణంగా లేఅవుట్ పూర్తై అన్ని నిర్మాణాలు పూర్తయ్యాక మరోసారి లేఅవుట్‌కు ఛాన్స్ ఉండదు. మన హైదరాబాద్‌లోమాత్రం అది సాధ్యమవుతుంది. హస్తీనాపురం నార్త్ ఎక్స్ టేన్షన్‌లో ఎకరం ఎడుగుంటల పార్క్ స్థలం ఉంది. అధికారుల నిర్వహకంతో అదికాస్తా ప్రయివేటు పరమైంది. అందులో మళ్లీ లేఅవుట్‌కు ప్లాన్ వేశారు. దీనిపై ఫేడరేషన్ అఫ్ కాలనీస్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. 4కోట్ల విలువైన ఈ స్థలంపై హైకోర్టుకు అప్లీల్ చేయలేదు అధికారులు. పైగా సంక్షేమ సంఘాలు వేసిన కేసులో కూడా ఇంప్లీడ్ కాకపోవడం మన జిహెచ్ ఎంసి అధికారులకు చెల్లుతుంది.
మియాపూర్ లో..
ఇక మియాపూర్‌లోని 77ఎకరాల విశాలమైన ప్రాంతంలో దీప్తి శ్రీనగర్ హౌజింగ్ సోసైటి ఉంది. ఇందులో దాదాపు ఏడెకరాలవరకూ ఓపెన్ స్థలాలున్నాయి. ఇందులోని స్థలాలనూ కాజేశారు అక్రమార్కులు. దీనిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్... జీహెచ్ ఎంసి కమీషనర్‌కు లీగల్ నోటిసులు పంపించారు.
నగరం నడిబొడ్డులో..
శివారు ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబోడ్డునా ఖాళీ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. ముషీరాబాద్ శ్రీకృష్ణా కాలనీలో 6కోట్ల విలువ చేసే 1100గజాల పార్క్ స్థలం ఉంది. 2007లో ఇక్కడ పార్క్ నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా మన అధికారులు పట్టించుకోలేదు. కొద్దిరోజులక్రితం 15లక్షల ఖర్చుతో ఇక్కడ ప్రహారీగోడ నిర్మాణాలు మొదలయ్యాయి. 75శాతం పనులుపూర్తయ్యాక మళ్లీ స్టే తెచ్చారు ప్రయివేటు వ్యక్తులు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా స్టే వెకేట్ చేయించడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. ఇలా జాగా కనిపిస్తేచాలా పాగా వేస్తున్నవారిని ఏమాత్రం పట్టించుకోవడంలేదు అధికారులు.. పైగా వారికే సపోర్ట్ ఇస్తూ కోట్లరూపాయల విలువైన స్థలాలు ప్రైవేటు వ్యక్తులపరమయ్యేలా చేస్తున్నారు.

20:12 - July 6, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుతో పాటు చాలా అంశాలపై పవన్‌ స్పందించడం లేదన్న నేతల కామెంట్లకు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రియాక్ట్‌ అయ్యారు పవర్‌స్టార్‌. తెలంగాణ సాధించినందుకు ఆ ప్రాంత నేతలను అభినందించారు పవన్‌. అదే సమయంలో ఏపీకి ఏమీ సాధించలేకపోతున్నారంటూ ఎంపీలపై విరుకుచుపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏపీ ఎంపీలు కనబరచడం లేదన్నారు. ఇందుకు వాళ్లు వ్యాపారులు కావడమే కారణంటూ మండిపడ్డారు పవన్‌. సెక్షన్‌ 8కు వ్యతిరేకమంటూ తెలంగాణ నేతల నుంచి విమర్శలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఓటుకు నోటు కేసులో మధ్యేమార్గంగా మాట్లాడి ప్రశ్నించడం పక్కనపెట్టారు.
విభజనవాదంలో టీఎంపీలు సక్సెస్‌..
రాష్ట్ర విభజనపైనా పవన్‌ కళ్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు. విభజన వాదనలు వినిపించడంలో తెలంగాణ ఎంపీలను అభినందించారు. సీమాంధ్ర ఎంపీలు మాత్రం వ్యాపారాలే పరమావధిగా ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు పవన్‌. విభజన తర్వాత సత్తా చాటుతాం ఏపీకి న్యాయం చేస్తామన్న ఎంపీలు కేంద్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి దిక్కులు చూస్తున్నారని ఫైరయ్యారు. మోడీ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చెయాలన్నారు పవన్.
ఉమ్మడి రాజధానిలో ప్రత్యేక వ్యవస్థ..
సెక్షన్‌ 8 అమలుకు తాను వ్యతిరేకమన్నారు పవన్‌. అలాంటి ప్రయత్నాలు రెండు ప్రభుత్వాల తీరుతోనే వస్తున్నాయన్నారు. పోలీసులే కొట్టుకుంటుడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీ తెగేందుకు ప్రత్యేకంగా పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్‌. అలాగే నేరుగా ప్రధాని కార్యాలయానికే రిపోర్ట్ చేసేలా హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీస్‌ స్టేషన్లు పెడతామన్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు పవన్‌. న్యాయం జరగకపోతే ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
సెక్షన్-8 ఇలాగే వస్తుందని చురకలు..
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు, కేసీఆర్‌తో పాటు మిగతా నేతలు వాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్లు అని విమర్శించడం సరికాదన్నారు. ఆంధ్రా అంటే కేవలం టీడీపీ, కేసీఆర్‌ కాదని స్పష్టం చేశారు. ఇలాంటి భాష వల్ల సామాన్యుల మధ్య అంతర్యుద్ధం తలత్తె ప్రమాదం ఉందన్నారు పవన్. చంద్రబాబుపై కేసులు మోపితేనో మరేదో చేస్తేనో సెక్షన్ 8 అమలు కాదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే అలాంటి పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు జనసేనాని.
అన్యాయాన్ని కేంద్రం సరిచేయాలి..
రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. 1960ల్లోనే రాష్ట్రాన్ని విడదీస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఏమీ మాట్లాడనని ఎంపీలు.. పార్టీ మారినా అలాగే మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు పవన్‌.
రాజకీయంగా పరిమితులున్నాయని వివరణ..
ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ లాంటి రాజధాని నిర్మించాలంటే కనీసం 50 ఏళ్లైనా పడుతుందన్నారు. భవనాలు నిర్మించినా జనం రావడానికి కనీసం 25 ఏళ్ల సమయమైనా కావాలన్నారు. ఏపీకి విభజన హామీలు నెరవేర్చే బాధ్యత ఎంపీలపైనే ఉందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు అన్ని అంశాలపైనా కేంద్రం నుంచి సమాధానం రాబట్టాలన్నారు. రాజకీయంగా పరిమితమైనపాత్ర పోషిస్తున్నందున తనకు ప్రశ్నించేందుకు ఎలాంటి అధికారాలు లేవన్నారు పవన్‌.

20:11 - July 6, 2015

హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్‌ వేషధారణ మారింది.. అలాగే డైలాగ్‌ డెలవరీ చేంజ్‌ అయింది.. మహాభారతంలో కృష్ణుడిలా.. కర్తవ్యాన్ని గుర్తుచేసే సైనికుడిలా.. రెండు రాష్ట్రాల ప్రజలకు శ్రేయోభిలాషిలా.. అందిరి మంచి కోరే వాడిలా.. ఒక్కసారిగా ఎవరూ ఊహించనంతగా మార్పువచ్చింది.. ప్రశ్నిస్తానని చెప్పిన నేత ఉన్నట్టుండి తెల్లజెండా ఊపారు.. గొడవలు మాని కలిసిమెలసి ఉండంటూ శాంతి సందేశం ఇచ్చారు.. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్లుగా ప్రెస్‌మీట్‌పెట్టారు పవన్‌.
బాధ్యతగా మాట్లాడుతున్నానని వివరణ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పెద్దమనిషి పాత్రను పోషించారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. ఇద్దరు చంద్రులకు సుతిమెత్తగా చురకలంటించారు. ఓటుకు నోటు కేసుతో పాటు చాలా అంశాలపై పవన్‌ స్పందించడం లేదన్న నేతల కామెంట్లకు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రియాక్ట్‌ అయ్యారు పవర్‌స్టార్‌. పార్టీ పెట్టిన ఏడాదిన్నర నుంచే తాను తక్కువగా మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాధ్యతగా మాట్లాడాల్సిన కర్తవ్యం అందరిపైనా ఉందన్నారు. ఎలా పడితే అలా మాట్లాడటం తనకు ఇష్టముండదన్నారు పవన్‌.
సీఎంలు బాధ్యతగా వ్యవహరించాలి..
తెలుగుజాతి ఐక్యత దేశ సమగ్రత అని మోడీ గతంలోనే తనతో చెప్పారన్నారు. రాష్ట్రం విడిపోయినపుడు తనకు ఇలాంటి భయాలే వేశాయన్నారు పవన్‌. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరుతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రేగే ప్రమాదం కనిపిస్తోందన్నారు. ఇద్దరు సీఎంలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు పవన్‌.. యాదాద్రి డెవలప్‌మెంట్‌ ప్లాన్‌కోసం విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్‌సాయిని ఆర్కిటెక్చర్‌గా కేసీఆర్‌ ఎన్నుకోవడం తనకు ఆనందం కలిగించిందన్నారు. ఈ చర్య ద్వారా కేసీఆర్‌ పెద్దమనసును చాటుకున్నారని అభిప్రాయపడ్డారు పవన్. ప్రస్తుతం నేతలందరి తీరు ఒకేరకంగా ఉందని అభిప్రాయపడ్డారు.
రేవంత్‌ ఎపిసోడ్‌పై లైట్‌ రియాక్షన్‌..
రేవంత్‌ వ్యవహారంలో ఆరోపణలకు అందరూ బాధ్యులే అన్నట్లుగా స్పందించారు జనసేనాని. ఇందులో టీడీపీని ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నట్లుగా కామెంట్లు చేశారు. పార్టీలు మారుతున్న నేతలకు చురకలంటించారు. తలసాని పార్టీ మారిన అతన్ని గెలిపించిన ప్రజల మద్దతు కూడగట్టగలరా అని ప్రశ్నించారు పవన్‌. ఓటుకు నోటు కేసులో సర్ధుకుపోవాలని వేదాంత ధోరణితో చెప్పారు పవర్‌స్టార్‌.
సున్నిత పరిస్థితుల్లో ఆచితూచి స్పందన..
రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్‌ చీవాట్లు పెట్టారు. సున్నితమైన సమస్యల్లో ఉన్న ప్రజల మధ్య ఏది మాట్లాడితే తప్పు ఏది మాట్లాడితే ఒప్పు అనే విధంగా పరిస్థితి ఉందన్నారు. ప్రజల అవసరాలకన్నా పార్టీల ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ముందుపెడితే వచ్చే సమస్యల్లాగే రెండు రాష్ట్రాల్లో ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం మాని నెల రోజుల నుంచి సమయం వృధా చేశారని మండిపడ్డారు. అలాగే ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి అండగా మాట్లాడారు పవన్. ట్యాపింగ్‌ జరిగిందో జరగలేదో అనే అంశం తేలాల్సి ఉన్నా ఇలాంటి పరిణామాలు మంచివికావన్నారు.`
మీడియాపై నియంత్రణ సరికాదు..
మీడియా స్వేచ్చను హరించేలా రెండు ప్రభుత్వాలు వ్యవహరించరాదన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారిపై స్పందించడంలో కొంత మనోభావాలు దెబ్బతిన్నా మీడియాపై నియంత్రణ సరికాదన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలోనూ మీడియాను నియంత్రించాలన్న ఇందిరాగాంధీ ప్రయత్నం నెరవేరలేదన్నారు పవన్‌.

అదనపు కట్నం కోసం భార్య..కొడుకు నిర్భందం..

తూర్పుగోదావరి : మండపేట (మం) ఆర్తమూరులో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యనూ..కుమారుడిని మూడు నెలలుగా గదిలో భర్త రాంరెడ్డి నిర్భందించాడు. పోలీసులకు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. 

తీహార్ జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్..

ఢిల్లీ : తీహార్ జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఇద్దరు ఖైదీల పరారీతో సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకున్నారు.

 

జులై 20 వరకు తొమర్ కు జ్యుడిషియల్ కస్టడి..

ఢిల్లీ : నకిలీ డిగ్రీ కేసులో అరెస్టయిన తోమర్ కు జులై 20వరకు జ్యుడిషియల్ కస్టడి పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. న్యాయశాస్త్రంలో నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

వ్యాపమ్ పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు - రాజ్ నాథ్..

న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్సినవసరం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తుపట్ల మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు సంతృప్తిగానే ఉన్నాయని పేర్కొన్నారు.

ముగిసిన మంత్రులు..కార్మికుల చర్చలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో మాట్లాడి కార్మికుల డిమాండ్లపై మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు నాయినీ..ఈటెల పేర్కొన్నారు. సోమవారం కార్మికుల డిమాండ్లపై చర్చించారు. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.

 

బాబుకు మధు లేఖ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. కేజీ బేసిన్ చమురు, సహజ వాయువుల రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. చమురు, సహజ వాయువులపై రాయల్టీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని లేఖలో కోరారు. 

ఉజ్బెకిస్తాన్ ప్రధాన మంత్రితో మోడీ...

తాష్కెంట్ : భారత ప్రధాన మంత్రి మోడీ ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధానితో మోడీ భేటీ అయ్యారు. 

18:45 - July 6, 2015

మళయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని రామ్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే 'ప్రేమమ్‌' చిత్రానికి సంబంధించి రీమేక్‌ రైట్స్ ను నిర్మాత స్రవంతి రవికిషోర్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. 'పండగ చేస్కో' చిత్రం తర్వాత రామ్‌ 'శివమ్‌', 'హరికథ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సరైన విజయాలు లేని రామ్‌కి ఈ సరికొత్త రీమేక్‌ చిత్రమైనా విజయాన్ని అందిస్తుందో.. లేదో చూడాలి.

భూముల వేలం పాట వద్దంటూ ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెన్నకేశవస్వామి ఆలయ భూముల వేలం పాటను అధికారులు నిర్వహిస్తున్నారు. వేలం పాట వేయవద్దని స్థానికులు కోరారు. కానీ అధికారులు వేలం పాటను కొనసాగించడంతో ఐదుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

అరుణ్ శర్మ మృతి వెనుక కుట్ర లేదు - బాసి..

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణంతో సంబంధం ఉన్న జబల్ పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బాసి పేర్కొన్నారు. 

18:40 - July 6, 2015

అక్షరుకుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా అన్నదమ్ములుగా కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న 'బ్రదర్స్' చిత్రంలోని ఓ స్పెషల్‌ మాస్‌ మసాలా సాంగ్‌లో కరీనా కపూర్‌ మెరవనుంది. 'మేరా నామ్‌ మేరీ' అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌లో అందాల్ని ఆరబోస్తూ స్పైసీగా ఉన్న కరీనాకపూర్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను నిర్మాత కరణ్‌ జోహార్‌ విడుదల చేశారు. 'ఫెవికాల్‌ సే...' ఐటమ్‌ సాంగ్‌తో ఓ ఊపుఊపేసిన కరీనా, ఈ చిత్రంలో సైతం హాట్‌ హాట్‌గా కనిపించనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య ఈ స్పెషల్‌ మాస్‌ మసాలా సాంగ్‌ను 2015 చికినీ చమేలీగా అభివర్ణించడం విశేషం. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, జాకీష్రాఫ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈచిత్రాన్ని ఆగస్ట్‌ 14న విడుదల చేసేందుకు నిర్మాత కరణ్‌జోహార్‌ సన్నాహాలు చేస్తున్నారు.

క్వార్టర్ ఫైనల్స్ కు సానియా, హింగిస్ జోడి..

లండన్ : వింబుల్డన్ లో మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జోడి క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. స్పెయిన్ జోడి అరెంట పార సాంటాన్జియా అనబెల్ మెడినా గ్యారగన్ లపై 6-3, 6-4 తేడాతో విజయం సాధించారు.

 

యూపీలో విద్యుత్ ఘాతం..ముగ్గురు చిన్నారుల మృతి...

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్ షాక్ గురై ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన స్థానిక బాహోజోయ్ లోని కుమ్రన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

18:34 - July 6, 2015

హైదరాబాద్ : వాటర్ బోర్డులో సమ్మె సైరన్ మోగింది. పీఆర్సీ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన ప్రభుత్వం తమకు అమలు చేయమంటే కాలయాపన చేస్తోందని గుర్తింపు యూనియన్ అధ్యక్షులు సతీష్ కుమార్ విమర్శించారు. సమ్మె చేస్తామంటూ గత నెలలోనే మంత్రి నాయినీకి చెప్పినా సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయలేదని విమర్శించారు. ఈనెల 9వరకు సీవరేజ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని, ప్రభుత్వం స్పందించకుంటే నీటి సరఫరాను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు.

18:33 - July 6, 2015

భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'అజహర్‌' పేరుతో బాలీవుడ్‌లో సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో అజహర్‌ పాత్రలో ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. అజారుద్దీన్‌ భార్య సంగీత బిజ్లానీ పాత్ర కోసం నర్గీస్‌ ఫక్రీని సంప్రదించారట. కథ నచ్చి నర్గీస్‌ కూడా అంగీకారం తెలపడంతో సినిమాపై మరికొంత ఆసక్తి నెలకొంది. తొలుత ఈ పాత్ర కోసం కరీనాకపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నిమ్రత కౌర్‌ని తీసుకోవాలనుకున్నప్పటికీ పలు కారణాలు వల్ల ఈ అవకాశం నర్గీస్‌కు దక్కిందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 'సాహసం' అనే తమిళ చిత్రంలో ప్రత్యేక పాటలో నర్గీస్‌ అందాల్ని ఆరబోయనుందని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

రేవంత్ కేసులో పొలిటికల్ గేమ్:పవన్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి కేసులో పొలిటికల్ గేమ్ ఉందనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. 'ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నేను మాట్లాడకుండా తప్పించుకుంటున్నాను' అని కొంతమంది అన్నట్లు తెలిపారు. 'ఓటుకు నోటు కేసు కోర్టు పరిధిలో ఉందని.. నేను మాట్లాడితే.. కోర్టును అవమానించినట్లవుతుంది' అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ అంశమన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే.. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబిఐ విచారణతోనే నిజాలు బయటికి వస్తాయిని చెప్పారు. 

18:15 - July 6, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టయ్యారని తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు ఏసీబీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. ఆయన నియోజకవర్గమైన ఖమ్మం జిల్లా నుండి భారీగా కార్యకర్తలు తరలివస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో విచారణలో భాగంగా సోమవారం ఆయన ఏసీబీ ఎదుట హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ విచారణలో ఆయన కీలక సమాచారం ఇవ్వడం లేదని భావించే సండ్రను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన్ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తారా ? లేదా అనేది తెలియ రావడం లేదు.
అక్రమ అరెస్టు - విద్యార్థి సంఘం..
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేయడం అక్రమమని పార్టీ విద్యార్థి సంఘం నేత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఏసీబీ కార్యాలయం ఎదుట టెన్ టివితో మాట్లాడారు. ఈ అరెస్టును పార్టీ తరపున..విద్యార్థి విభాగం తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు. కేవలం టిడిపి అణగదొక్కాలని, పేరు, ప్రతిష్టలను దెబ్బతీయాలనే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సండ్ర అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున నిరసనలు తెలియచేస్తామన్నారు. 

ఉజ్బెకిస్తాన్ చేరుకున్న మోడీ

ఉజ్బెకిస్తాన్: భారత ప్రధాని నరేంద్రమోడీ ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. తాష్కెంట్ విమానాశ్రయంలో ఆ.. దేశ ప్రధాని షౌకాత్ మోడీకి ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతానికి కృతజ్ఞతలు తెలుపుతూ.... మోడీ ట్విట్టర్ లో స్పందించారు. 

పారా మెడికల్-వైద్య పోస్టులు భర్తీ చేస్తాం: రావెల

హైదరాబాద్: ఏపీ ఎజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలపై పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యామని.. పారా మెడికల్, వైద్యుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. 232 పారామెడికల్ పోస్టులను అడ్ హక్ పద్ధతిలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఒక్క విశాఖ ఏజెన్సీలోనే 2 శాతం మలేరియా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.

 

కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న సీపీఎం నేతలు

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాపేపట్లో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కలవనున్నారు. రాజయ్యతోపాటు మాజీ ఎంపీ మిడియం బాబూరావు, పలువురు ఎంపీపీలు రాష్ట్రపతిని కలవనున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో ముంపు మండలాల అభివృద్ధి, ఎపి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని సున్నం రాజయ్య రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

కాలేజీల పిటిషన్ లపై హైకోర్టులో ముగిసిన వాదనలు

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు సాయంత్రం 4 గంటలకు కోర్టు తీర్పు ఇవ్వనుంది. సౌకర్యాలు లేవని జెఎన్ టియు 20 కాలేజీలను రద్దు చేసింది. దీంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. 

17:40 - July 6, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు జిమ్మి ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. దీనితో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. సోమవారం ఏసీబీ ఎదుట హాజరైన సండ్రను ఏడు గంటల పాటు ప్రశ్నించారు. రేవంత్ తో ఎక్కువసార్లు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారని ఏసీబీ భావిస్తోంది. విచారణలో పలు ప్రశ్నలకు సండ్ర దాట వేస్తున్నారని ఏసీబీ భావించినట్లు సమాచారం. దీనితో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
నోటీసులు జారీ చేసినా...
ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నోటీసులు తీసుకోని సండ్ర వెంకట వీరయ్య తాను అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. తన గడువు పొడిగించాలని పలుమారు అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో అరెస్టయిన టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం ఖమ్మం జిల్లాలో సండ్ర వెంకట వీరయ్య ప్రత్యక్షం కావడం..తనను ఏసీబీ విచారించుకోవచ్చని అధికారులకు లేఖ రాయడం జరిగిపోయాయి. అనంతరం ఏసీబీ మరోమారు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సెక్షన్41(ఎ) కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అరెస్టయిన సండ్రను ఎక్కడకు తరలిస్తారనే విషయం కొద్దిసేపట్లో తెలియనుంది.

17:33 - July 6, 2015

హైదరాబాద్ : నేను ఏది పడితే అది మాట్లాడనని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు రాజకీయాలు కొత్త అని, దేశం పట్ల నాకు అవగాహన ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై కూడా ఆయన అభిప్రాయాలు తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో దృష్టి పెట్టాలని కోరారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేయడం మంచిది కాదని సూచించారు. ఓటుకు నోటు వ్యవహారంలో సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8 అంశం..సీమాంధ్ర ప్రజల భద్రత..మీడియా స్వేచ్ఛ..హైదరాబాద్ రాజధాని..ఏపీ ప్రత్యేక హోదా, సీమాంధ్ర ఎంపీల తీరు..ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 

 

 

సెక్షన్-8కు నేను వ్యతిరేకం: పవన్

హైదరాబాద్: 'నేను సెక్షన్-8 అమలుకు నేను వ్యతిరేకం' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సెక్షన్-8 అమలు చేసి.. మళ్లీ తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించొద్దని హితవు పలికారు. రాష్ట్రం వచ్చిన అనందం లేకుండా చేయోద్దని విజ్ఞప్తి చేశారు. మీడియా స్వేచ్ఛను హరించవద్దని... ఇలా చేసి వాస్తవాలను బయటకు రాకుండా చేయలేరని చెప్పారు.

 

ఓటుకు నోటు కేసులో మరో మలుపు...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మరో మలుపు తిరిగింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్టు చేశారు. సండ్రను సీబీఐ ఏడు గంటల పాటు ప్రశ్నించింది. విచారణ అనంతరం సండ్రను అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ తో పలుమార్లు ఫోన్లో మంతనాలు జరిపినట్లు సండ్రపై ఆరోపణలున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలున్నాయని.. సండ్ర విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. అయితే ఆరోగ్యం కుదుట పడడంతో ఎసిబి పిలుపు మేరకు.. విచారణ నిమిత్తం ఇవాళా సీబీఐ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

 

అన్ని పార్టీల్లో అందరూ నిజాయితీపరులే లేరు:పనన్

హైదరాబాద్: ప్రతిపార్టీకి సమస్యలు ఉన్నాయని.. అన్ని పార్టీల్లో అందరూ నిజాయితీపరులే లేరని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు రాష్ట్రాలకు చాలా సమస్యలు ఉన్నాయని... ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదన్నారు. పొలిటికల్ గేమ్ కు అలవాటు పడడంతోనే పరిపోతుందని.. మరి ప్రజా సేవ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఓ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు కానీ.. ఆ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొనలేరని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు అంతర్యుద్ధానికి దారి తీస్తాయని మోడీకి వివరించినట్లు చెప్పారు. టిడిపిని గానీ, పవన్ కళ్యాణ్ గానీ తిట్టాలంటే తిట్టండి.. కానీ ఆంధ్రా పేరుతో తిట్టకండని కోరారు.

17:16 - July 6, 2015

ఖమ్మం : గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ లోపాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకోలేదు. భక్తులకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పుష్కరాలు సమీపిస్తున్న కొద్ది పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. కాంట్రాక్టర్లు యదేచ్చగా అందినకాడికి దోచుకుంటున్నారు. భద్రాచలంతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి పనులు చివరిదశకు చేరుకోలేదు. 

17:08 - July 6, 2015

వరంగల్ : అమ్మాయిలను ఎరగా వేసి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేకరుల గుట్టు రట్టైంది. ఎనిమిది మంది ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. నాలుగు నెలల క్రితం వరంగల్ జిల్లాలో ఎనిమిది మంది ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసుకున్నారు. ఓ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకుని మీడియాకు చెందిన లోగోలు చూపించుకుంటూ అమ్మాయిలను ఎరగా వేశారు. వీరి నుండి వసూళ్లకు పాల్పడ్డారు. ఇందులో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫుడ్ శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారి. డీఆర్డీఏ అధికారులున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఇందులో ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కాగా మిగతా వ్యక్తులు వరంగల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. 

అవసరమున్నప్పుడే ప్రశ్నిస్తా.. పవన్

హైదరాబాద్: 'నేను ఏది పడితే ఆది మాట్లాడనని.. అవసరమున్నప్పుడే ప్రశ్నిస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి అభివృద్ధికి కోసం ఆంధ్రాకు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ను నియమించిన సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతారణం మంచింది కాదన్నారు.

వ్యాపం కేసులో సిట్ విచారణ: రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ: వ్యాపం కేసులో సిట్ విచారణ కొనసాగుతోందని కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. హైకోర్టు కనుసన్నల్లో విచారణ జరుగుతోందన్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వ్యాపం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సిట్ విచారణ తర్వాత సిబిఐ విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టు అక్షయ్ సింగ్ మృతిపై రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. 

16:42 - July 6, 2015

కడప : ఆసుపత్రిలో ఉన్న వారిని చూద్దామని వెళ్లిన బంధువులు ఆసుపత్రి పాలయ్యారు. నగరంలోని హిమాలయ మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ రోప్ తెగిపడడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. లిఫ్ట్ మూడో అంతస్తుకు వెళ్లగానే రోప్ ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీనితో వేగంగా లిఫ్ట్ కిందకు పడిపోయింది. ఆ సమయంలో అందులో 13 మంది ఉన్నారు. ఎనిమిది మందికి నడుం..చేతులు..కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. లిఫ్ట్ లో ఆపరేటర్ లేకపోవడం..పరిమితికి మించి ఎక్కడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే లిఫ్ట్ రోప్ వేపై ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోలేదని తెలిపారు. 

కుత్బుల్లాపూర్ జీహెచ్ ఎంసిలో అవినీతి భాగోతం..

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ జీహెచ్ ఎంసిలో అవినీతి భాగోతం వెలుగుచూసింది. ఫోర్టరీ సంతకాలతో సిబ్బంది రూ.41 లక్షలు డ్రా చేసింది. ఓ కాంట్రాక్టర్ కు బదులుగా మరో కాంట్రాక్టుర్ డబ్బులు డ్రా చేశాడు. జీడిమెట్ల పిఎస్ లో కేసు నమోదు అయింది.

 

16:33 - July 6, 2015

విజయవాడ : నెల రోజుల పాటు సముద్రంలో చిక్కుకపోయిన మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. వీరు సోమవారం విజయవాడ నగరానికి చేరుకున్నారు. వీరిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంగా హత్తుకున్నారు. మచిలీపట్నంకు చెందిన వారు ఇద్దరు..ప్రకాశం జిల్లాకు చెందిన వారు ఒకరు..నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఇద్దరు మత్స్యకారులున్నారు.
వీరంతా జూన్ 15వ తేదీన చేపల వేటకు వెళ్లారు. కానీ వీరు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరి ఆచూకి కనుగొనాలని అధికారులకు విజ్ఞప్తులు చేశారు. అధికారులు మత్స్యకారుల ఆచూకీ కనుగొనడానికి చర్యలు చేపట్టింది. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో మత్స్యకారులు చిక్కుకపోయారు. కోస్టుగార్డుల సహాయంతో వీరు హల్దియా పోర్టుకు వెళ్లారు. అక్కడి నుండి మత్స్యశాఖ అధికారులు, జిల్లా అధికారుల సహాయంతో విజయవాడకు చేరుకున్నారు. తిరిగి తమ కుటుంబాన్ని చూస్తామని అనుకోలేదని మత్స్యకారులు ఆనంద భాష్పాలు కార్చారు.

తెలంగాణలో నిరుద్యోగం-నిరక్షరాస్యత అధికం: ఎస్ ఈసీసీ

ఢిల్లీ: తెలంగాణలో నిరుద్యోగం, నిరక్షరాస్యత అధికంగా ఉందని సామాజిక-ఆర్థిక-కుల గణన(ఎస్ ఈసీసీ)-2011 నివేదిక వెల్లడించింది. దేశంలో గ్రామీణ నిరక్షరాస్యుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తెలంగాణలో 40.42 శాతం మంది నిరక్షరాస్యులున్నారు. అయితే తెలంగాణ కన్నా మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లలో నిరక్షరాస్యత అధికంగా ఉంది.

 

నిజామాబాద్ జిల్లా గన్నారంలో విషాదం

నిజామాబాద్: డిచ్ పల్లి మండలం గన్నారంలో విషాదం నెలకొంది. స్వప్న అనే మహిళ..తన కూతురు సాత్విక(1)తో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పాప మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

16:20 - July 6, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ ఎదుట హాజరైన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణ కొనసాగుతోంది. సండ్రను ఉదయం నుంచి ఏసీబీ పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు ఐదారు గంటలుగా సండ్రపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సండ్రతో పాటు మరో నిందితుడు జిమ్మీకి కూడా ఈ సాయంత్రంతో గడువు ముగియనుంది. 5 గంటలలోపు ఏసీబీ ఎదుట హాజరు కాకపోతే అరెస్టు వారెంటు జారీ చేసే అవకాశముంది. ఓటుకు నోటు కేసులో కీలక అంశాలను సండ్ర నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో డబ్బులు ఎక్కన్నుంచి వచ్చాయనే కోణంలో విచారణ కొనసాగుతోంది. 

బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు...

వరంగల్: మీడియా ముసుగులో అమ్మాయిలకు ఎరవేస్తూ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ 9టివి, ఎస్ 9 టివి, జెమినీ టివి లోగోలను చూపిస్తూ... ముఠా సభ్యులు.. డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థినులున్నారు. అధికారులు, వ్యాపారుల నుంచి రూ.12 లక్షలకు పైగా వసూలు చేశారు. 

16:16 - July 6, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శేషాచలం ఎన్ కౌంటర్ పై ఉభయ రాష్ట్రాల హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న దానితో కోర్టు విభేదించింది. ప్రస్తుత తరుణంలో ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మూడు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. గత రెండు నెలలుగా జరుగుతున్న విచారణలో ఎలాంటి పురోగతి లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. గంటన్నర పాటు జరిగిన ఈ వాదనలు కొనసాగాయి. పురోగతిపై నివేదిక సమర్పించాలని గతంలో కోర్టు సూచనలు చేసింది కానీ ఈసారి ఎలాంటి నివేదిక సమర్పించ లేదు.
20 మంది కూలీల మృతి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీలను అకారణంగా పొట్టన పెట్టుకున్నారని ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు చెలరేగాయి. ఈ విషయంలో ఎన్ హెచ్చార్సీ జోక్యం చేసుకుంది. సీబీఐ విచారణ జరిపించాలన్న కమిషన్ ఆదేశాలను హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. 

వ్యాపం స్కాంపై సుప్రీంకోర్టులో ఆప్ పిటిషన్

ఢిల్లీ: మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంపై ఆప్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది. కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆప్ నేత కుమార్ విశ్వాస్ పిటిషన్ దాఖలు చేశారు. 

వాటర్ బోర్డు ఆఫీస్ ఎదుట కార్మికుల నిరవధిక నిరాహార దీక్ష

హైదరాబాద్: పీఆర్సీ అమలు చేయాలని వాటర్ బోర్డు కార్యాలయం వద్ద కార్మికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న కామ్ గార్ యూనియన్ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ 3 రోజులపాటు నిరవధిక దీక్ష చేపడతామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందిచకపోతే హైదరాబాద్ లో నీటి పరఫరాను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

 

శేషాచలం ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. మరో మూడు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది. 

15:47 - July 6, 2015

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకున్న భారత మహిళా హాకీ జట్టు సభ్యులు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జట్టు సభ్యులకు భారత హాకీ సమాఖ్య ఘనస్వాగతం పలికింది. బెల్జియంలోని యాంట్వార్ప్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ లీగ్ క్వాలిఫైయింగ్ టోర్నీలో 5వ స్థానం సాధించింది. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన కీలక మ్యాచ్‌లో జపాన్‌ పై భారత్ ఒకే ఒక్కగోల్ తో విజయం సాధించిన భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్‌ రేస్‌లో నిలిచింది. హాకీ వరల్డ్‌ లీగ్‌లో ఆరంభ పోటీల్లో ఓడిపోయినా కీలక మ్యాచ్‌ల్లో నెగ్గడం చాలా ఆనందంగా ఉందని భారత కెప్టెన్‌ రీతూ రాణీతో పాటు జట్టు సభ్యులు పేర్కొన్నారు.

15:44 - July 6, 2015

ఢిల్లీ : కేంద్ర రాష్ట్ర స్థాయిలో బీజేపీ అవినీతిని ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలు ఉక్కుపాదం మోపాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 20న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఆరు ప్రధాన వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అవినీతి, అశ్రితపక్షపాతంలో కూరుకుపోయిన మంత్రులను తొలగించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని ప్రకటించాయి. జాతీయ సీపీఎం ఆధ్వర్యంలో ఆరు ప్రధాన వామపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. సిపిఎం ప్రధాన కార్యాలయంలో సిపిఐ, సిపిఐ ఎమ్‌ఎల్, లిబరేషన్‌, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్-ఏఐఎఫ్‌బీ, ఎస్‌యుసిఐ, సి ఆర్ఎస్పీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీతారం ఏచూరి, ప్రకాశ్‌కరత్‌, సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజా, దిప్నాకర్‌, భట్టాచార్య, స్వపన్‌ ముఖర్జీ, జి.దేవరాజన్, సత్యవన్, పి.శర్మ, అబనీరాయ్‌ హాజరయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం ఆరు వామపక్ష పార్టీలు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
బిజెపి పాలనపై వామపక్షాల విమర్శలు...
బిజెపి పాలనపై ఆరు వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. అవినీతి రహిత పాలన అందించామని బిజేపి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ పలికిన గాంభీరాల నిజస్వరూపం బయటపడిందని మండిపడ్డాయి. ఐపిఎల్‌ కుంభకోణం ప్రధాన నింధితుడు లలిత్‌మోడీకీ సాయం చేయడంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్‌ సీఎం వసుంధరరాజే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు తేటతెల్లమైందని వామపక్షాలు ధ్వజమెత్తాయి. అలాగే మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతిఇరానీ తన విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించాయి. బిజేపి పాలిత మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులు ధనార్జన కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు బయటపడిందని విమర్శించాయి. ఛత్తీస్‌గడ్‌లాంటి రాష్ట్రాల్లోనూ అధికంగా అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అవినీతి కేసులన్నింటిపై తక్షణే న్యాయ పర్యవేక్షణలో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
సెప్టెంబర్ 2న జరిగే కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు..
ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు మద్దతిచ్చేందుకు ఆరు వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పిలుపునివ్వాలని నిర్ణయించాయి. అలాగే త్వరలో జరగనున్న బీహార్‌లో శాసనసభ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని నిర్ణయించాయి.

ఎపిలో నలుగురు ఐఏఎస్ ల బదిలీ...

హైదరాబాద్: ఎపిలో నలుగురు ఐఏఎస్ లు బదిలీ చేశారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కరికాల వళవన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా లవ్ అగర్వాల్, పౌరసరఫరాల శాఖడైరెక్టర్ గా డి.శ్రీనివాసులును నియమించారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ గా పూనం మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

15:37 - July 6, 2015

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పుష్కర పనులు మొదలయ్యాయి. గోదావరిలో పుష్కరాల్లో పాల్గొన్న అనంతరం భక్తులు రామాలయంలో దైవదర్శనానికి వెళ్లనున్నారు. మిథిలా స్టేడియంలో సెక్టార్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు. వచ్చే భక్తుల సంఖ్యకు.. ఆలయంలో దర్శనానికి సంబంధించి.. అధికారులు చెబుతున్న సంఖ్యకు చాలా తేడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీని ఎలా క్రమబద్దీకరిస్తారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

15:34 - July 6, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల రిలీవ్‌ వ్యవహారం ముదురుతోంది. ఉద్యోగుల పంపకాల్లో నెలకొన్న వివాదంతో ఉద్యోగులకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోవడంతో... ఏం చేయాలో తెలియక ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. న్యాయం కోసం కొంతమంది కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 1253 మంది ఉద్యోగులను గత నెల 11 వ తేదీన విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆందోళన రేగింది. విభజన చట్టానికి వ్యతిరేకంగా తమను రిలీవ్‌ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
హైకోర్టును సైతం ఆశ్రయించిన విద్యుత్‌ ఉద్యోగులు..
నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్‌ చేశారంటూ హైకోర్టును సైతం ఆశ్రయించారు ఏపీ ఉద్యోగులు. దీంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దాంతో పాటు రిలీవ్‌ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తమను విధులకు హాజరు కానివ్వడం లేదని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు..
ఉద్యోగాల రిలీవ్‌ అంశంలో రెండు రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలతోనూ, ఇరు ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నా ఎలాంటి లాభం లేకపోయింది. చివరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఉద్యోగులు. మరోవైపు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఉద్యోగులను ఏక పక్షంగా రిలీవ్‌ చేసినందుకు తాము చేర్చుకోమని ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీ విద్యుత్‌ సంస్థల్లో ఎలాంటి ఖాళీలు లేవని అంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 82 ప్రకారం షెడ్యూల్‌ 9లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న వారి విషయంలో ఇరు రాష్ట్రాల సంస్థలు చర్చించుకొని ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు చూపించాలని కోరుతున్నారు. ఈ ప్రక్రియ ఆపాయింటెడ్‌ డేట్‌ నుంచి దాదాపు సంవత్సర కాలంలో ముగిసేలా చర్యలు తీసుకోవాలని విభజన చట్టంలో ఉంది. అంతేకాకుండా ఉద్యోగుల విభజనకు అవసరమైన మార్గ దర్శకాల కోసం ఇద్దరేసి చొప్పున ఇరు రాష్ట్రాలు నలుగురితో కలిపి ఓ కమిటీ కూడా వేశారు. కానీ విభజన జరిగి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఈ కమిటీ భేటీ కాలేదు.  మొత్తానికి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలతో ఉద్యోగులు నలిగి పోతున్నారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రిలీవ్‌ అయిన ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రభుత్వ పనితీరు పరిశీలనా కమిటీని నియమించిన టీపీసీసీ

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ.. ప్రభుత్వ పనితీరు పరిశీలనా కమిటీని నియమించింది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఛైర్మన్ గా 17 మంది సభ్యులతో కమటీ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కమిటీ అధ్యయనం చేయనుంది. విభజన బిల్లులో తెలంగాణకు కల్పించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అడగడం లేదని.. కేంద్ర ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ డైలాగులకే పరిమితం కావొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల్లో తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు.

15:30 - July 6, 2015

ఢిల్లీ : దేశ రాజకీయ పరిస్థితుల గురించి... ఎన్డీఏ ప్రభుత్వ విధానాల గురించి సీపీఎం పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. మోడీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదని సంబరాలు చేసుకున్నారని... సంవత్సరం పూర్తయ్యాక స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శించారు. లలిత్ గేట్ విషయంలో పత్రాలు బయటపడుతున్నా ప్రధాని మోడీ మౌనంగా వ్యవహరిస్తూ అవినీతిని రక్షించే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారని విమర్శించారు. జులై 20న అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని పొలిట్‌ బ్యూరో సమావేశం పిలుపునిచ్చినట్లు రాఘవులు పేర్కొన్నారు. 

15:26 - July 6, 2015

మధ్యప్రదేశ్ : శిక్షణలో ఉన్న ట్రైనీ ఎస్సై అనామిక మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. ఆమె మృతికి వ్యాపం స్కామ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి మరణాన్ని వ్యాపంతో ముడిపెట్టకూడదన్నారు. కుంభకోణానికి పాల్పడ్డవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. 

ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ లపై హైకోర్టులో వాదనలు

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ తరపున ఎజి వాదనలు వినిపిస్తున్నారు. సౌకర్యాలు లేని 20 కాలేజీలను జేఎన్టీయూ రద్దు చేసింది. కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. 

విషజ్వరాల బాధితులకు మంత్రి దేవినేని ఉమా పరామర్శ

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బాధితులను మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. చెరువులో నీరు కలుషితంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులు కొరుకునే చోట మెడికల్ క్యాంపులు కొనసాగిస్తామని తెలిపారు. 

15:11 - July 6, 2015

హైదరాబాద్ : తాను అరెస్టుకు భయపడనని టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తాను చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని, ఏసీబీ అధికారులకు సహకరిస్తానని తెలిపారు. ఏసీబీ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని సండ్ర తెలిపారు.
ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నోటీసులు తీసుకోని సండ్ర వెంకట వీరయ్య తాను అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. తన గడువు పొడిగించాలని పలుమారు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో అరెస్టయిన టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం ఖమ్మం జిల్లాలో సండ్ర వెంకట వీరయ్య ప్రత్యక్షమయ్యారు. తనను ఏసీబీ విచారించుకోవచ్చని అధికారులకు లేఖ రాశారు. అనంతరం ఏసీబీ మరోమారు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సెక్షన్41(ఎ) కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 

14:58 - July 6, 2015

మహిళల అభ్యుదయమే ఆమె లక్ష్యం. వారి శ్రేయస్సే ఆమె గమ్యం. వారి స్వావలంబనే ఆమె సాధన. అందుకే వారి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సుదీర్ఘకాలంగా ఎంతో మంది మహిళలకు ఆధారం ఇస్తూ వారి ఉపాధి కోసం ''లక్ష్మీ వాసన్'' పాటుపడుతోంది.
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని లక్ష్మీ వాసన్ అంటోంది. వారి కాళ్లపై వారు నిలబడే స్థైర్యం ఉండాలని అంటోంది. ప్రతొక్కరూ తమ శక్తి యుక్తులను నిరూపించుకోవాలని అంటోంది. చివరి శ్వాస వరకు అలుపెరుగని కృషి చేయాలని అంటోంది. తాను చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తోంది ''చంటి ప్రసన్న కేంద్రం'' స్థాపకురాలు లక్ష్మీ వాసన్. ఈమెపై ప్రత్యేక కథనం..

14:26 - July 6, 2015

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. వెంటనే లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భజరంగ్ జూట్ మిల్లును అక్రమంగా ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో సుమారు మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సోమవారం నాడు కార్మికులు నిర్వహించిన ఆందోళనలో టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదుగుల టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వాలు వచ్చింది కార్మికులను అన్యాయం చేయడానికి కాదని, మంచి అధికారులు లేకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు. కార్మికుల ప్రయోజాలకు మేలు కలిగే విధంగా అధికారులు ఉంటే ఈ సమస్యలు రావని పేర్కొన్నారు. ఈ ఆందోళనను మిత్రపక్షాలు ముందుకు తీసుకెళ్లడాన్ని అభినందినిస్తున్నట్లు తెలిపారు. చర్చల్లో యాజమాన్యం పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని తాను కమిషనర్ కు సూచించడం జరిగిందన్నారు. ధర్నాలు ఏదైనా ఏజెండా ఒక్కటేనని మోదుగుల తెలిపారు.
ఏడున అఖిలపక్ష సమావేశం..
భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష నిర్వహించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా జూట్ మిల్లు లాకౌట్ ఎత్తివేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఈనెల 7న కార్మికశాఖ మంత్రి సమక్షంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. జూట్ మిల్లు సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా బంద్ పాటిస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు.

14:16 - July 6, 2015

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద హల్ చల్ చేశాడు. కోర్టుకు హాజరైన భత్కల్ ఓ లేఖను పారేశాడు. వెంటనే అక్కడనే బందోబస్తులో ఉన్న పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని..పారిపోతున్నట్లు ప్రచారం చేసి చంపేందుకు కుట్ర పన్నుతున్నారని భత్కల్ లేఖలో పేర్కొన్నాడు. తన కుమారుడిని చంపేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని తల్లి కోర్టు ఎదుట పేర్కొంది. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఇటీవలే భత్కల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
భత్కల్ రిమాండ్ గడువు ముగియడంతో సోమవారం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అతని రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఇదిలా ఉంటే జైపూర్ పేలుళ్ల కేసులో భత్కల్ ను పోలీసులు రాజస్థాన్ కు తీసుకెళ్లనున్నారు. నేడు సాయంత్రం లేదా మంగళవారం ఉదయం తరలించనున్నట్లు తెలుస్తోంది. 

రంగారెడ్డి కోర్టులో భత్కల్ హల్ చల్

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు భత్కల్ రంగారెడ్డి కోర్టులో హల్ చల్ చేశాడు. భత్కల్ తోపాటు మరో నలుగురిని పోలీసులు రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే భత్కల్ ఓ లేఖ రాసి కోర్టు కిటికిలో నుంచి పడేశారు. లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను పారిపోతున్నట్లు ప్రచారం చేసి.. తనను చంపేందుకు కుట్ర పన్నారని భత్కల్ లేఖలో పేర్కొన్నారు.

 

కడప హిమాలయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రమాదం..

కడప: జిల్లాలోని హిమాలయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రమాదం జరిగింది. రోప్ తెగడంతో లిఫ్టు నాలుగో అంతస్తు నుంచి పడిపోయింది. లిఫ్టులోని 13 మందికి గాయాలయ్యాయి.

 

తిరువన్నామళైలో దారుణం..

చెన్నై: తిరువన్నామళైలో దారుణం జరిగింది. ఓ యువకుడు.. నాగుగేళ్ల బాలుడితో మద్యం తాగించాడు. వాట్సప్ లో వీడియో కలకలం సృష్టించింది. పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి.. యువకుల కోసం గాలిస్తున్నారు.

 

భత్కల్ తోపాటు నలుగురికి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులు.. భత్కల్ తోపాటు మరో నలుగురిని పోలీసులు రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు.. నిందితుల రిమాండ్ ను పొడిగించింది.

చంద్రబాబు జపాన్ పర్యటనలో వరుస భేటీలు...

టోక్యో: జపాన్ లో సీఎం చంద్రబాబు తొలిరోజు పర్యటనలో వరుస భేటీలు జరిగాయి. పరిశ్రమల స్థాపన, ఇంధనరంగం, మత్స్యపరిశ్రమ అభివృద్ధి, స్మార్ట్ గ్రామాలు, వార్డులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. విజయవాడ స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం పురోగతిపై సమీక్ష చేశారు. ఎపిలో ప్యూజి బృందం ఆగస్టులో పర్యటించనుంది. విశాఖలో మిత్సుబిషి నేతృత్వంలో జపాన్ ఇన్ఫర్మేషన్ ఆండ్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆక్వా పరిశ్రమకు మయావక చేయూత ఇవ్వనుంది. రాజధాని నిర్మాణంలో ఉన్న బోలెడన్ని అవకాశాలను వినియోగించుకోవాలని పారిశ్రామిక వేత్తలను కోరారు.

వేంనరేందర్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్: వేంనరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ ఓటు చెల్లదంటూ... వేంనరేందర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

వ్యాపం కేసు.. వరుస మరణాలపై సిట్ విచారణకు ఆదేశం

మధ్యప్రదేశ్: వ్యాపం కేసు సంబంధీకుల వరుస మరణాలపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిట్ విచారణకు ఆదేశింశారు. 

13:29 - July 6, 2015

హైదరాబాద్:కేరళ రాజధాని త్రివేండ్రంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠ్యపుస్తకాల పంపిణీలో ఆలస్యంపై....ఎస్ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి నేతలు ధర్నా చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి.... విద్యార్థులను చెదరగొట్టారు.

13:27 - July 6, 2015

ఖమ్మం: జలాన్ని కాపాడుకోవడానికి చేసే క్రతువే పుష్కరం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల 14 నుంచి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర పనుల్లో నాణ్యత లోపాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాసిరకం పనులు చేస్తుండడంపై కాంట్రాక్టర్లపై ఆరోపణలు వస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవేవీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. హడావుడిగా పనులను ప్రారంభించి.. నాణ్యత లేకుండానే పనులను చేపట్టారు. ఇటు అధికారులు కూడా కావాల్సినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
షవర్‌ బాత్‌ల వద్ద భక్తులు స్నానాలు చేస్తే.. ఆ నీరు మళ్లీ గోదావరి నదిలోకి...
భద్రాచలంలోని పుష్కర స్నాన ఘాట్టాల వద్ద అధికార యంత్రాంగం తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా షవర్‌ బాత్‌ల నిర్మాణంలో లోపాలు కనిపిస్తున్నాయి. షవర్‌ బాత్‌ల వద్ద భక్తులు స్నానాలు చేస్తే.. ఆ నీరు మళ్లీ గోదావరి నదిలోకి రానుంది. దీని వల్ల భక్తులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మురుగునీటిని మళ్లీంచేందుకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. 

భత్కల్ ను రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులు.. భత్కల్ తోపాటు మరో నలుగురిని పోలీసులు రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే భత్కల్ ఓ లేఖ రాసి కోర్టు కిటికిలో నుంచి పడేశారు. లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను పారిపోతున్నట్లు ప్రచారం చేసి.. తనను చంపేందుకు కుట్ర పన్నారని భత్కల్ లేఖలో పేర్కొన్నారు.

 

13:12 - July 6, 2015

నిజామాబాద్‌: జిల్లాలోని మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌, ఎంపీలు కవిత, సుమన్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మోతె జెడ్పీ స్కూల్ గ్రౌండ్‌లో కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మోతె గ్రామంపై వరాల జల్లు కురిపించారు. మోతె గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి...రూ. 80 లక్షలు మంజూరు చేశారు. మోతెను 100 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామానికి 250 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

వ్యవసాయ-పశుసంవర్థకశాఖ అధికారులతో సీఎస్ సమావేశం..

హైదరాబాద్: వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులతో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. 

నెల్లూరు జిల్లాలో విషాదం..

నెల్లూరు: బాలాయపల్లి మండలం మన్నూరు బీసీ కాలనీలో విషాదం నెలకొంది. ఓ మహిళ.. తన ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 10 నెలల బాలుడు మృతి చెందాడు. తల్లీ, మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. 

విదేశీ పర్యటనకు బయల్దేరిన మోడీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ మధ్య ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనకు బయల్దేరారు. మొత్తం ఆరు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలవనున్నారు. 

మున్సిపల్ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెపై టీసర్కార్ స్పందించింది. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానించారు. మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, ఈటెల రాజేందర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనార్థన్ రెడ్డిలతో సమావేశం ఏర్పాటు చేశారు.

 

మోతె ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ: కేసీఆర్

నిజామాబాద్: మోతె ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాలోని మోతె గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 'మోతె నా సొంత గ్రామమని పేర్కొన్నారు. 100 శాతం సబ్సిడీ కింద డ్రిస్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామని.. వారం రోజుల్లో మంత్రి పోచారం పనులను ప్రారంభిస్తారని చెప్పారు.

 

12:25 - July 6, 2015

హైదరాబాద్:తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె తలపెట్టిన మున్సిపల్ కార్మికులతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చాంబర్ లో చర్చలకు రమ్మని ప్రభుత్వం నుండి పిలుపు వచ్చింనది సిఐటియు నేత పాలడుగు భాస్కర్ తెలిపారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ....ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే చర్చల్లో స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఒప్పుకునేది లేదని భాస్కర్ స్పష్టం చేశారు. చర్చల పేరు తో కాలయాపన చేయకుండా.... కార్మికులు కోరుతున్న 16 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వ స్పదన చూసిన తరువాత మా యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 40వేల మంది మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కనీస వేతనం రూ.14,170లు చెల్లించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

12:17 - July 6, 2015

హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ అనురాధకు ఓటుకు నోటు సెగ తాకింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులు పలుచోట్లకు బదిలీ అయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ కొత్త చీఫ్‌గా వెంకటేశ్వర రావు నియామకం అయ్యారు. విజిలెన్స్అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా అనురాధ, విజయవాడ సీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

ఎపిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు...

హైదరాబాద్: ఎపిలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎపి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధకు ఓటుకు నోటు సెగ తగలింది. ఎపి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనురాధ బదిలీ అయ్యారు. విజిలెన్స్ ఆండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిజిగా అనురాధను నియమించారు. ఎపి ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు, విజయవాడ సీపీగా గౌతం సవాంగ్ ను నియమించారు. 

 

12:15 - July 6, 2015

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగాలకు కారణమైన వ్యాపం కుంభకోణంలో పలువురి పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తక్షణమే గవర్నర్ పదవి నుంచి రాం నరేశ్ యాదవ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పిటీషన్ స్వీకరించింది. రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. 
మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం ...
మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపం కుంభకోణం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కుంభకోణంలో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న జర్నలిస్ట్... నిన్న మెడికల్ డీన్‌... తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ట్రైనీ ఎస్‌ఐ చనిపోయింది. సాగర్‌లో అనామిక కుష్వాహా అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీస్‌ అకాడమీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. గతంలో వ్యాపం రిక్రూట్‌మెంట్‌ ద్వారానే ఈమె ఎస్‌ఐగా సెలక్ట్ అయింది. వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. వ్యాపం స్కామ్‌లో మొత్తం మృతుల సంఖ్య 48కి చేరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆయన తప్పుబట్టారు. వ్యాపం స్కామ్‌ను బయటపెట్టేందుకు తక్షణమే... సీబీఐ విచారణ చేపట్టాలని మరో కాంగ్రెస్ నేత పీసీ చాకో డిమాండ్ చేశారు. శిక్షణలో ఉన్న ట్రైనీ ఎస్సై అనామిక మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. ఆమె మృతికి వ్యాపం స్కామ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి మరణాన్ని వ్యాపంతో ముడిపెట్టకూడదన్నారు. కుంభకోణానికి పాల్పడ్డవారికి శిక్ష తప్పదని శివరాజ్ సింగ్ చౌహన్

 

పిటిషనర్ వాదనలు వినేందుకు సుప్రీం అంగీకారం

ఢిల్లీ: వ్యాపం కుంభకోణం నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్ ను తప్పించాలన్న ఓ పిటిషనర్ వాదనలను వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

భత్కల్ ను రాజస్థాన్ కు తరలించనున్న అధికారులు

హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉన్న ఉగ్రవాది భత్కల్ ను అధికారులు రాజస్థాన్ కు తరలించనున్నారు. జైపూర్ పేలుడు కేసులో భత్కల్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. 

ఎస్ వి యూనివర్సిటీలో రాసలీలలు...

తిరుపతి: ఎస్ వి యూనిర్సిటీలో రాసలీలలు సాగుతున్నాయి. సహకార స్టోర్ లో స్టోర్ మేనేజర్, స్వీపర్ సీసీ టీవీకి చిక్కారు. ఉన్నతాధికారులు ఆ... ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

 

కృష్ణా జిల్లా కొత్తమాజేటిలో విషజ్వరాలు

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం కొత్తమాజేటిలో విష జ్వరాలు ప్రబలాయి. నెల రోజుల్లో 25 మంది మృతి చెందారు. 200 మంది అస్వస్థతకు గురయ్యారు.

 

మొక్కలు నాటిన కేసీఆర్-కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

నిజామాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూరు మండలం మోతెలో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మొక్కలు నాటారు.
 

కాసేపట్లో విదేశీ పర్యటనకు బయల్దేరనున్న మోడీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. ఆరు దేశాలలో ప్రధాని పర్యటించనున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మోడీ కలవనున్నారు.

 

ఇవాళా సాయంత్రం 4.30గంటలకు పవన్ ప్రెస్ మీట్...

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఇవాళా సాయంత్రం 4.30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది. 

ఎపిలో కొందరి చేతుల్లోనే భూమి: ఎన్ ఈసీసీ

హైదరాబాద్: ఎపిలో కొందరి చేతుల్లోనే భూమి ఉన్నట్లు సామాజిక, ఆర్థిక, కుల గణన నివేదిక-2011 లో వెల్లడయిందని ఎన్ ఈసీసీ తెలిపింది. ఎపిలో మొత్తం 4.58 కోట్ల ఎకరాలు భూమి ఉంది. 73 శాతం కుటుంబాలకు సెంటు భూమీ లేదు. 27 శాతం కుటుంబాల వద్దే భూమి కేంద్రీకృతమైంది. గ్రామాల్లో 92.97 లక్షల కుటుంబాల నివసిస్తున్నారు. 79.53 శాతం కుటుంబాలు రూ. 5 వేల లోపు ఆదాయంలో జీవితం వెళ్లదీస్తున్నాయి. ఆదాయంలో బీహార్ కన్నా ఎపి వెనుకబాటులో ఉంది.

 

భజరంగ్ జూట్ మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని భజరంగ్ జూట్ మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు, టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. సాయంత్రం లోగా జూట్ మిల్లు లాకౌట్ ఎత్తివేస్తూ జీవో వచ్చేలా చూస్తానని ఆయన హామీ అన్నారు. రేపు హైదరాబాద్ లో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కార్మికసంఘాలు, యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మిల్లు యజమాని సమావేశానికి రాకపోతే...అరెస్టు చేసి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కార్మికశాఖ అధికారుల అవినీతి కారణంగానే కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు.

సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం

ఢిల్లీ: సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు సమావేశాలు జరుగునున్నాయి. నవంబర్ లో కొల్ కతాలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలు, బీజేపీ అవినీతిపై ఆందోళనలు, బీహార్ ఎన్నికలు, వామపక్షాల ఐక్యత వంటి పలు అంశాలపై చర్చించున్నట్లు తెలుస్తోంది. 

 

మోడీ కార్మిక వ్యతిరేక ప్రధాని:తపన్ సేన్

విశాఖ: నరేంద్రమోడీ కార్మిక వ్యతిరేక ప్రధానని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విమర్శించారు. ఈమేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక చట్టాల పేరుతో కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ పేరుతో కార్మిక సంఘాల మధ్య అయోమయం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్మికులకు కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీరామమూర్తి కన్నుమూత

విశాఖ: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీరామమూర్తి మరణించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక ఎంపిగా ఆయన పని చేశారు.  

గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం..

గుంటూరు: యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని ఓ అయిల్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

 

10:28 - July 6, 2015

హైదరాబాద్‌:అంబర్‌పేట లాల్‌బాగ్‌లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. పాత ఇనుము, ప్లాస్టిక్‌ దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమీపంలోని అపార్ట్ మెంట్ లోకి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్ని ప్రమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

 

10:25 - July 6, 2015

హైదరాబాద్: నేడు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణ...ఏసీబీ విచారణకు హాజరవుతారు. ఆయనతో పాటు జిమ్మీబాబును కూడా ఏసీబీ ఇవాళ విచారించనుంది. ఓటుకు నోటు కేసులో జిమ్మీబాబును కీలకవ్యక్తిగా ఏసీబీ భావిస్తోంది. సండ్ర తన నివాసం నుండి ఏసీబీ ఆఫీసులకు బయలు దేరారు.

వ్యాపం కుంభకోణంలో మరో అనుమానాస్పద మృతి

మధ్యప్రదేశ్:సంచంలనం సృష్టించిన వ్యాపం కుంభకోణంలో మరో అనుమానాస్పద మృతి సంభవించింది. శిక్షణ లో ఉన్న ఎస్ ఐ అనామిక కుష్వాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాగర్ జిల్లాలోని పోలీసు శిక్షనా కేంద్రం వద్ద చెరువులో కుష్వాహా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కుష్వాహా మృతితో ఈ కుంభకోణంలో మృతుల సంఖ్య 48కి చేరింది.

10:22 - July 6, 2015

హైదరాబాద్:మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపం కుంభకోణం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కుంభకోణంలో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న జర్నలిస్ట్... నిన్న మెడికల్ డీన్‌... తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ట్రైనీ ఎస్‌ఐ చనిపోయింది. సాగర్‌లో అనామిక కుష్వాహా అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీస్‌ అకాడమీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. గతంలో వ్యాపం రిక్రూట్‌మెంట్‌ ద్వారానే ఈయన ఎస్‌ఐగా సెలక్ట్ అయింది. వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. వ్యాపం స్కామ్‌లో మొత్తం మృతుల సంఖ్య 48కి చేరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

అవినీతి పై వామపక్షాల సమరం

ఢిల్లీ: ఈనెల 20న అవినీతికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళ కార్యక్రమాలు చేపట్టాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. బీహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని, సెప్టెంబర్ 2న జరగనున్న కార్మిక సంఘాల జాతీయ సమ్మెకు మద్దతు తెలియజేయాలని నిర్ణయించాయిం. అంతే కాకుండా వ్యాపం మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

బస్సును ఢీకొట్టిన ఇసుకలారీ:ఒకరిమృతి

మహబూబ్ నగర్: ఆగి ఉన్న బస్సును ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలో పద్దమందడి మండలం వెల్దూరు సమీపంలో జరిగింది. 

కుటుంబ కలహాలతో భర్తను హతమార్చిన భార్య

కృష్ణా:కుటుంబ కలహాలతో భర్తను భార్య హతమార్చిన సంఘటన ముదినేపల్లి మండలంలోని అన్నవరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోజూ మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఈ రోజు ఉదయం భార్య సుజాత పచ్చడి బండతో తలపై మోదింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్క మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

09:44 - July 6, 2015

హైదరాబాద్: జలాన్ని కాపాడుకోవడానికి చేసే క్రతువే పుష్కరం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల 14 నుంచి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర పనుల్లో నాణ్యత లోపాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాసిరకం పనులు చేస్తుండడంపై కాంట్రాక్టర్లపై ఆరోపణలు వస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవేవీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. హడావుడిగా పనులను ప్రారంభించి.. నాణ్యత లేకుండానే పనులను చేపట్టారు. ఇటు అధికారులు కూడా కావాల్సినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అంబర్ పేట్ లో ఇనుము, ప్లాస్టిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: అంబర్ పేట్ లాల్ బాగ్ లోని పాత ఇనుము, ప్లాస్టిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్ట పోయాయి.

09:31 - July 6, 2015

నల్గొండ: డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు రెండు లక్షల విలువైన పేపర్‌ బండిల్స్‌ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెం మండలం దురాజ్‌పల్లి దగ్గర జరిగింది. చిల్లకల్లు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్‌ బండిల్స్‌ మొత్తం కాలి బూడిదయ్యాయి. ఇంజన్‌ వేడెక్కి మంటలు ఎగిసిపడ్డాయని వాహన డ్రైవర్‌ అంటున్నారు.

09:29 - July 6, 2015

వరంగల్‌: తొర్రూర్‌ మండలం నాంచారిమడూరులో....అకస్మాత్తుగా చేపల కుప్పలు ప్రత్యక్షమయ్యాయి. ఎస్సీరెస్పీ కెనాల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కొరమీను చేపలను డంపింగ్‌ చేశారు. దీంతో గ్రామస్తులు ఎస్ఆర్ ఎస్పీ కెనాల్‌కు క్యూకట్టారు. భారీ సంఖ్యలో చేపలు ఉండటంతో...వాటిని తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. సంచుల కొద్ది చేపలను ఇళ్లకు పట్టుకెళ్లారు.

09:28 - July 6, 2015

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు... ఇవాళ పలు జపాన్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దిగ్గజ కంపెనీలతో చర్చించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు...ఫ్యుజి ఎలక్ట్రిక్‌ కంపెనీ ఆర్డీ యోషియో ఒకునోతో సమావేశమవుతారు. ఆ తర్వాత పది గంటలకు మిత్యుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. పదిన్నరకు మయెకవా కంపెనీ, పదకొండున్నరకు యోకోహమా పోర్టు ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఇక ఆ తర్వాత పన్నెండున్నరకు సుమిటోమో కార్పొరేషన్ ఛైర్మెన్‌ కజువో ఓమొరితో భేటీ అవుతారు.

 

రెండు ఎంపీటీ ఉప ఎన్నికల్లో టిడిపి విజయం

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, మహబూబ్ గనర్ జిల్లాల్లో నిర్వహించిన రెండు ఎంపిటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టిడిపి అబ్యర్థులు గెలుపొందారు. 

ఆర్టీసీ బస్సు, వ్యాస్ ఢీ: ఒకరు మృతి

చిత్తూరు: చిన్నగొట్టుగల్లు మండలం భాకరాపేట చెక్ పోస్టు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, పేపర్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ సుధాకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

విజయనగరం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దదరు పిలల్లతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తినవేమలి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వీరిఆ త్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

నేడు హెచ్ సీయూలో మూడు కోర్సులకు అడ్మిషన్లు...

గచ్చిబౌలి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి మూడు కోర్సులకు సంబంధించి సోమవారం అడ్మిషన్లు జరగనున్నాయి. వర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లోని కాలేజీ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టడీస్‌లో ఉదయం 9 గంటలకు ఐఎమ్మెసీ సైన్సెస్‌, ఎర్త్‌ సెస్సెస్‌, 11 గంటలకు ఐఎంఏ సోషల్‌ సైన్సెస్‌, మధ్యాహ్నం 2గంటలకు ఎంటెక్‌ సీఎస్‌, ఏఐ, ఐటీ కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు.

08:34 - July 6, 2015

తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికు చేపట్టారు. వారు చేస్తున్న సమ్మె న్యాయమైనదని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. ఓటుకు నోటు కేసు ఒక సాధారణ కేసు కాదా? ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రనా? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాంకేతికంగా టిడిపిలో ఉన్నారు. ఇది సాధ్యమేనా? ఇలాంటి అంశాలపై విశ్లేషణాత్మక వివరణ చేశారు. మరి మీరు కూడా ఆ విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

విజయవాడలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

విజయవాడ: ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం చేసిన ఏజెంట్‌ బాగోతం బట్టబయలైంది. విజయవాడలో ఉద్యోగాలిప్పిస్తామంటూ 80 మంది నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలను వసూలు చేసిన ఏజెంట్‌ రవిరెడ్డి పరారయ్యాడు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు ఐదురోజులపాటు ముంబయిలో ఉంచి ఏజెంట్‌ పరారయ్యాడు.

 

08:01 - July 6, 2015

నేటి నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. వారు కోరుకుంటున్న కనీస వేతనం అమలు పర్చాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కారించాలని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజల విశ్వాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి వ్యాఖ్యానించారు. అంతర్ రాష్ట్ర నీటి వివాదాలకు వైఎస్ ఆర్ కారణమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం వుందా? లేదా? తెలంగాణ లో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో వున్నాయా? టిఆర్ ఎస్ పార్టీ ప్రాజెక్టుల పై పోరాటం చేసిందా? కేసీఆర్ పబ్బం గడుపుకోవటానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? జల వివాదాలకు కేసీఆర్ కారణమా? అవినీతికి పెద్ద పీట వేసింది చంద్రబాబేనా? ప్రాజెక్టుల పై పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదా?ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింటి. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు తెలకపల్లి రవి, టిడిపి నేత సూర్యప్రకాష్, వైసీపీ అధికార ప్రతినిధి గౌతం రెడ్డి , టిఆర్ ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాసరావు, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

ఫుజి,. మిత్సుబిషి ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

హైదరాబాద్: జపాన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని టోక్యో నగరంలో ఫుజి ఎలక్ట్రిక్ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. 

12న మసీదుల్లో ఇఫ్తార్ విందు:ఏకే ఖాన్

హైదరాబాద్: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరఫున 1.95 లక్షల మంది ముస్లింలకు ఈ నెల 12న మసీదులో భోజనంతో పాటు నూతన వస్త్రాలను పంపిణీ చేయనున్నట్లు రంజాన్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ ఏకే ఖాన్‌ పేర్కొన్నారు. నాంపల్లిలోని హాజ్‌ భవన్‌లో మసీదు కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, మైనారిటీ కమిషన్‌ స్పెషల్‌ సెక్రటరీ మహ్మద్‌ జలీల్‌ అతిథులుగా హాజరయ్యారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ....

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్‌లలో నిండిపోయారు. వెలుపల వరకు క్యూలో నిలబడ్డారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 

సరిహద్దుల్లో కాల్పులు: భారత్ జవాన్ మృతి

శ్రీనగర్ : కశ్మీర్ వ్యాలీలోని నౌగామ్ సెక్టార్‌లో పాకిస్థాన్ బలగాలు భారత జవాన్లపై కాల్పులు జరిపాయి. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి చెందాడు. పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. బీఎస్‌ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. 25 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

నేటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

హైదరాబాద్:ఇరు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికులు మరోసారి సమ్మెబాట పట్టారు. గతకొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్లపై మొత్తుకున్నా సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా కాలేదు. ఇప్పటికీ వారి సమస్యలపై సర్కార్ స్పందించ లేదు. దీంతో నేటి నుంచి సమ్మెకు దిగాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 

అసోంలో 6 జిల్లాలకు వరద హెచ్చరికలు...

హైదరాబాద్:ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన అసోంను మరోసారి వరదలు ముంచెత్తనున్నాయి. అసోంలోని 6 జిల్లాలకు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో అసోంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 6 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన...

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా, మధ్య ఆసియా దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. మోడీ పర్యటన ఈ నెల 13 వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి.

గ్రీస్‌లో ముగిసిన రెఫరెండం

హైదరాబాద్: వ్యతిరేకత ఓటు వేస్తే నష్టపోతారు. మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. ఆపై మీ ఇష్టం అంటూ అప్పులిచ్చిన వారు త్రిశంకు స్వర్గం చూపారు. నిష్పాక్షికంగా ఓటు వేయాలనుకున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.కానీ అవేవీ ప్రజాభిప్రాయం ముందు నిలువలేవని గ్రీస్‌ రెఫరెండం తేల్చి చెప్పింది.

నేడు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్:తెలంగాణ సిఎం కేసీఆర్ నేడు నిజామాబాద్‌ జిల్లో పర్యటించనున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం సొంత గ్రామం మోతే నుంచి ఈ పర్యటన ప్రారంభంకానుంది. సీఎం పర్యటన కోసం పార్టీ శ్రేణులు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

06:46 - July 6, 2015

విజయవాడ: ఆస్పత్రిలో వున్న పేషెంట్లను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేదీ, టైం ప్రకారం మందులు, ఇంజక్షన్‌లు ఇచ్చేది నర్సులు లేదా సిస్టర్స్‌ . వైద్యరంగంలో వీరి సేవలు అన్యన్యసామాన్యం. అత్యంత ఓర్పు సహనాలతో సేవలందించే నర్సులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది? వృత్తి నిర్వహణలో వీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరికి నిత్యం ఎదురయ్యే అనుభావాలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్‌ నేత విజయకుమారి పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:41 - July 6, 2015

విజయవాడ:మన దేశంలో నర్సుల కొరత తీవ్రంగా వుంది. ఐదారుగురు నర్సులు చేయాల్సిన పనిభారాన్ని ఒకే ఒక్క నర్సు మోయాల్సి వస్తోంది. అత్యంత ఓర్పు, సహనంతో చేయాల్సిన వృత్తి నర్సింగ్‌. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకునేదీ నర్సులే. ఆపరేషన్‌కు ముందు, ఆపరేషన్‌ తర్వాత అవసరమైన వైద్య సేవలన్నీ అందించేదీ వీరే. తమ దగ్గరకు వచ్చే పేషెంట్లను అమ్మ కంటే ఓపికగా లాలించే ఎందరో నర్సులు మనచుట్టూ వున్నారు. నర్సింగ్‌లో అత్యుత్తమ సేవలందించిన నైటింగేల్‌కు ప్రపంచం ఇప్పటికీ చేతులెత్తి నమస్కరిస్తుంది.
ఒకప్పుడు నర్సింగ్‌ వృత్తి మీద చిన్నచూపు.....
ఒకప్పుడు నర్సింగ్‌ వృత్తి మీద చిన్నచూపు వుండేది. అగ్రవర్ణాలవారు, ఆర్థికంగా ఎదిగినవారు ఈ వృత్తిలోకి వచ్చేవారు కాదు. 20 ఏళ్ల క్రితం దళిత, బలహీన వర్గాలకు చెందినవారే ఈ వృత్తిలోకి ప్రవేశించేవారు. సమాజం చిన్నచూపు చూసిన నర్సింగ్‌ వృత్తిని ముందుగా ముద్దాడినదీ, ఆ వృత్తిలోని మానవీయతను, ఆ వృత్తి నిర్వహణకు కావాల్సిన సహనాన్ని, ఓర్పునూ, దయను, ప్రేమనూ మనకు పరిచయం చేసినదీ దళిత, బలహీనవర్గాల స్త్రీలే కావడం విశేషం. కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆస్పత్రుల్లో కేరళ నర్సులే ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు తెలుగమ్మాయిల సంఖ్య పెరిగింది.
నర్సింగ్‌ వృత్తిని చూసే ధోరణిలో మార్పు....
పది పదిహేనేళ్ల నుంచి నర్సింగ్‌ వృత్తిని చూసే ధోరణిలో మార్పు వస్తోంది. ఇప్పుడు ఈ వృత్తిలో అగ్రవర్ణాలవారు సైతం కెరీర్‌ మెట్లను వెదుక్కుంటున్నారు. దీంతో ఈ వృత్తిలోకి అన్ని కులాలవారూ ప్రవేశిస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో నర్సింగ్‌ చేసినవారికి మంచి డిమాండ్‌ వుండడంతో అదొక క్రేజ్‌గా కూడా మారుతోంది. దీంతో నర్సింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో సీట్లన్నీ భర్తీ అయి కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో ప్రతి ఏటా మూడు వందల మంది ట్రయినింగ్‌ పూర్తి చేసుకుంటున్నారు. బిఎస్సీ నర్సింగ్‌ కోర్సుతో పాటు ప్రయివేట్‌ నర్సింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారి సంఖ్య దాదాపు పదివేల దాకా వుంటుందని అంచనా.
అవసరాలకు తగిన రీతిలో నర్సుల సంఖ్య పెరగడం లేదు.....
అయితే, మన దేశ అవసరాలకు తగిన రీతిలో నర్సుల సంఖ్య పెరగడం లేదు. ఇప్పటికీ నర్సుల కొరత తీవ్రంగానే వుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక నర్సు అవసరం. కానీ, మన దేశంలో ప్రతి పదకొండు వందల మందికి ఒక నర్సు వున్నారు. ఆస్పత్రిలో ప్రతి ఐదుగురు రోగులకు ఒక నర్సు చొప్పున సేవలందించాల్సి వుంటుంది. కానీ, మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 మంది రోగులకు ఒక నర్సు సేవలందించాల్సి వస్తోంది. అంటే, ఒక్కొక్కనర్సు ఐదు రెట్ల పనిభారాన్ని తమ భుజస్కందాలపై వేసుకుంటున్నారు. ఇలా పనిభారం పెరగడం వల్ల చిరునవ్వుతో వైద్య సేవలందించే ఆ సేవామూర్తుల్లోనూ అప్పుడప్పుడూ విసుగు కనిపిస్తోంది. కొన్ని రకాల ప్రమాదకర కేసులకు సేవలందించే సందర్భంలో తాము కూడా ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే అవకాశం వున్నప్పటికీ , చిరునవ్వుతో ఆ బాధ్యతను మోస్తున్న నర్సులెందరో మనకు కనిపిస్తారు. ఇక ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో వీరికిస్తున్న వేతనాలు అతి తక్కువగా వున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో నెలకు అయిదు వేల రూపాయలకు మించి ఇవ్వడం లేదు. తాము పొందిన సేవలకు కృతజ్ఞతా భావంతో పేషెంట్లు చేతిలో పెట్టే కొద్దిపాటి మొత్తమే చాలామంది నర్సుల జీవితాలకు ఆలంభనగా నిలుస్తోంది. మానవత్వపు పరిమళాన్ని తమ సేవాభావంతో గుబాళింపచేస్తున్న నర్సుల మీద పనిభారం పెరగకుండా, న్యాయమైన వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నది. 

06:34 - July 6, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఊపందుకుంటోంది. టీడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు సిద్దమయిన ఏసిబి అధికారులు... ఆయన ఇచ్చే సమాచారంతో మరికొందరికి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఈ జాబితాలో 10 మంది అధికార పార్టీ ఎమ్యెల్యేలు ఉన్నట్లు సమాచారం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రణాళికలు రచించినట్లు ఏసిబి వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేశారనేది ఆరోపణ.. దళిత, గిరిజన శాసన సభ్యులకు వల వేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఏసీబీ దగ్గర సమాచారం ఉందని లీకులు వస్తున్నాయి. అరెస్టయిన ఎమ్మెల్యే కాల్ డేటాలో డెలిట్ చేసిన మెసేజ్ రికవరిల్లో ఈ మేరకు కీలక సమాచారం సంపాందించారట. పలువురు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడినట్లు ఏసీబీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయట. ఈ సమాచారంతో మరి కొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.. 
ఏసీబీ ముందుకు సండ్ర, సెబాస్టియన్‌ ఫ్రెండ్‌ జిమ్మిబాబు ....
సోమవారం ఏసీబీ ముందు సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ స్నేహితుడు జిమ్మిబాబు హాజరు కానున్నారు. జిమ్మిబాబు పాత్రపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న జిమ్మిబాబు కరీంనగర్ జిల్లా గోదావరిఖని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన తెరవెనుక ఫైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా ఏసిబి అనుమానిస్తోంది. జిమ్మిబాబు రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో... డబ్బుకు సంబంధించి రేవంత్ నుంచి రాబట్టలేని విషయాలను అతడి నుంచి కూపీ లాగేందుకు సిద్దమవుతున్నారు.
ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై ఏసిబి లోతుగా....
అయితే ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మరెంత మందికి వల విసిరేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై ఏసిబి లోతుగా విచారించనుంది. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టే అవకాశాలు ఉంటాయా? తదితర విషయాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

06:24 - July 6, 2015

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బొగ్గు కుంభకోణానికి పాల్పుడుతోందా..? పాత టెండర్లను కొనసాగిస్తూ ప్రజాధనం కొల్లగొడుతోందా..? లోపాయకారి ఒప్పందాలతో దొడ్డిదారిలో నేతలు డబ్బులు జేబులో వేసుకుంటున్నారా..? అంటే అవును అనే చెబుతున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు.. తమ హయాంలో జరిగిన ఒప్పందం టీడీపీ ఎలా క్యాష్‌ చేసుకుంటోందో వివరిస్తున్నారు.. అయితే అధికారపక్షం నేతలు మాత్రం అది కాంగ్రెస్‌ నేతలకు అలవాటు అని గట్టిగా బదులిస్తున్నారు..
మాజీ ప్రధానికి అంటిన బొగ్గుమసి....
బొగ్గు కుంభకోణం యూపీఏను ఓ కుదుపు కుదిపింది.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సైతం మసి అంటుకుంది.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. కోల్‌ స్కాంలో కోట్లాది రూపాయల దేశ సంపద లూఠీ జరిగిందనే ప్రధానమైన ఆరోపణ.. తాజా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలే చేస్తోంది ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ.. బొగ్గు కొనుగోల్‌లో గోల్‌మాల్‌ జరుగుతోందని లెక్కలతో సహా బయటపెడుతోంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ సర్కార్‌ కొనసాగించడం వల్ల ఖజానాకు భారం పడుతోందని వివరిస్తోంది.
6 మే 2013లో బొగ్గు కొనుగోలుకు టెండర్లు....
2013 మే 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా కోసం టెండర్లు పిలిచారు.. అప్పట్లో 72 డాలర్లుగా ధరను నిర్ణయించారు.. బొగ్గును సరఫరా చేసే కంపెనీలు థర్మల్‌ ప్రాజెక్టుల వరకు చేర్చేలా నిబంధనలు టెండర్లలో చేర్చారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇదే ఒప్పందాన్ని సాకుగా చూపి బొగ్గు కొనుగోలు చేస్తోందంటున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు.. అవసరం లేకున్నా బొగ్గును దిగుమతి చేసుకుంటూ ఖజానాకు నష్టం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. పైగా పాత టెండర్ల నిబంధనలు ఉల్లఘించారని చెబుతున్నారు.. జెన్‌కో నిబంధనల ప్రకారం సరఫరాకు 20 శాతం అధికంగా మాత్రమే తీసుకోవాల్సి ఉన్నా.. 200 శాతం ఎక్కువగా.. అంటే ఏకంగా 32 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచారంటున్నారు.
బొగ్గు సరఫరా చేసే దేశాల క్యూలు....
ప్రపంచవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్‌ పడిపోయిందని లెక్కలు చెబుతున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు.. బొగ్గును అత్యధికంగా వినియోగించే చైనా పూర్తిగా వాడకం తగ్గించిందంటున్నారు.. కోల్‌ ప్రధాన సరఫరాదారులైన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా బొగ్గు ఇచ్చేందుకు క్యూ కడుతున్నారని చెబుతున్నారు.. అంతర్జాతీయంగా 50 డాలర్ల ధర ఉన్నా కొత్తగా టెండర్లకు వెళ్లకపోవడం వెనక మతలబు ఉందంటున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు.. అదానీ, మహేశ్వరి బ్రదర్స్‌ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు.. అలాగే గత ఒప్పందంలో లేని దామోదర సంజీవయ్య థర్మల్‌ ప్లాంట్‌కు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా జరిగిందంటున్నారు.. కృష్ణపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో లేని కంపెనీకి సైతం ఒకే ధర ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు..
25 శాతం తేమతోనూ కొనుగోలు ఆరోపణలు.....
బొగ్గు నాణ్యతలోనూ లోపాలున్నాయంటోంది ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ.. 25 శాతం వరకు తేమ ఉన్నా ఎలా తీసుకుంటున్నారని నిలదీస్తోంది.. ఇందులోనూ తమకు అనుకూలమైన వారిని నియమించుకున్నారని ఆరోపిస్తోంది.. రాష్ట్రంలో బొగ్గు సరఫరా చేయగలిగిన 10 కంపెనీలున్నా కేవలం ఆదానీ గ్రూప్‌కు లబ్ది చేకూరేలా టెండర్లలో మార్పులు చేశారంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. ఇటీవల టెండర్లలో పాల్గొనలేమని చెప్పిన ఆదానీ గ్రూప్‌ బొగ్గును ఎలా సరఫరా చేసిందని ప్రశ్నిస్తున్నారు.. మొత్తం బొగ్గు కొనుగోలు వ్యవహారంలో వెయ్యికోట్ల మేర కుంభకోణం జరిగిందంటున్నారు.. ఆ భారాన్ని ఇటీవల కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మోపారని ఆరోపిస్తున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు..
అభివృద్ధిని చూసి ఓర్వేలేకేనంటున్న టీడీపీ.....
ఏపీ కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు అవాస్తవమంటోంది అధికారపక్షం టీడీపీ.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటున్నారు.. 24 గంటల నిరంతర విద్యుత్‌ అందుబాటులోకి తేవడం వాళ్లకు ఇష్టం లేదంటున్నారు.. అవినీతికి పాల్పడేది ఎవరో ప్రజలందరికీ తెలుసంటున్నారు టీడీపీ నేతలు... గతంలో విద్యుత్‌ లేక రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచారని మండిపడుతున్నారు.. ఇప్పుడు ముందుచూపుతో బొగ్గు నిల్వ చేసినా అవినీతేనా అని ఎదురుదాడి చేస్తున్నారు.. నిరాధారంగా ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నారు తమ్ముళ్లు..
ఆధారాలతో బయటపెడతామంటున్న హస్తం.....
ఏపీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం అన్ని అంశాలు త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని చెబుతున్నారు.. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమంటున్నారు.. ప్రజాధనం అవినీతి రూపంలో జేబులో వేసుకుంటే చూస్తూ కూర్చోబోమంటున్నారు హస్తం నాయకులు.. ప్రపంచమార్కెట్‌లో 50 డాలర్ల ధర ఉంటే 72 డాలర్లు చెల్లించడమంటే ఎవరి ప్రయోజనం కోసమని నిలదీస్తున్నారు.

06:18 - July 6, 2015

అనంతపురం: జిల్లా కేంద్రంగా నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా చలామణి చేసే ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 1.13కోట్లరూపాయలు విలువ చేసే 17వేల నకిలీ పాసుపుస్తకాలతో పాటు మహేంద్ర కారు, లక్ష రూపాయల నగదు, కంప్యూటర్లు,ప్రింటర్లు, స్టాంపులు, వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాసుపుస్తకాలతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వివిధ మార్గాల్లో కాజేయడంతో పాటు బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు పొందారని పోలీసుల విచారణలో తేలింది.
వాహనాలు తనిఖీలు చేస్తుండగా ....
వాహనాలు తనిఖీలు చేస్తుండగా పాస్‌ పుస్తకాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భారీగా నకిలీ పాసుపుస్తకాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలోని ధర్మవరం, బత్తలపల్లి, ఉరవకొండ ప్రాంతాలకు సంబందించిన 12మంది ముఠాసభ్యులను జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నకిలీ పట్టాదారు పుస్తకాల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు, రాజకీయనేతల హస్తముందని పోలీసుల అనుమానిస్తున్నారు. నకిలీ పట్టాదారు పుస్తకాల ముఠా ఎక్కడెక్కడ ఇంకా అక్రమాలకు పాల్పడిందో విచారణలో తేలుస్తామన్నారు పోలీసులు. ప్రత్యేక బృందం చేత దర్యాప్తు చేయిస్తామని ఎస్పీ చెప్పారు.

06:15 - July 6, 2015

హైదరాబాద్: తమ సమ్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించారు. కాని వీరి సమస్యలు పట్టించుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైంది. అయితే గతనెల 25 నుంచే సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అయితే తమకు కొంత సమయం కావాలని సర్కార్‌ కోరింది. దీంతో సమ్మెను 10 రోజుల పాటు వాయిదా వేశారు. కాని ఇప్పటికీ వారి సమస్యలపై స్పందించలేకపోయింది. దీంతో...ఇవాళ నుంచి కార్మికులు సమ్మెకు దిగాలని నిర్ణయించారు.
40 వేల మంది కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ మున్సిపల్ కార్మికులు
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 40 వేల మంది కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ మున్సిపల్ కార్మికులున్నారు. ఇందులో 27 వేల మంది జిహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు. ఈ సమ్మెలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా పర్మినెంట్‌ కార్మికులు సైతం సమ్మెలో పాల్గొంటారని కార్మిక నేతలు చెబుతున్నారు. తమకు పిఆర్‌సీ నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం 14వేల 170 రూపాయలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ స్పందించి మున్సిపల్ కార్మికుల డిమాండ్‌లు పరిష్కరించే వరకు సమ్మెవీడబోమని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే సమ్మె ప్రభావం జంటనగరాల మీద పడకుండా జీహెచ్ ఎంసీ ప్రత్యామ్నాయమార్గాలపై దృష్టి పెట్టింది.

06:12 - July 6, 2015

హైదరాబాద్:హరితహారం పథకంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, సదాశివనగర్, కామారెడ్డి, రామాయంపేట్‌లలో కేసీఆర్ పర్యటన ఖరారైంది. జిల్లాలోని మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం ఈజిల్లాలో పర్యటించడం రెండోసారి. సీఎం పర్యటన కోసం గులాబీ శ్రేణులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉద్యమ సమయంలో మోతే మట్టిని తీసుకెళ్లిన కేసీఆర్....
సీఎం కేసీఆర్ సొంత గ్రామమైన మోతే నుంచి పర్యటన ప్రారంభంకానుంది. ఉద్యమ సమయంలో మోతే మట్టిని తీసుకెళ్లిన కేసీఆర్ రాష్ట్రం ఆవిర్భవించి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అదే మట్టిని తిరిగి మోతే గ్రామంలో ప్రతిష్టించారు. ఇప్పుడు ఈ గ్రామప్రజలను కేసీఆర్ మరోసారి కలవనున్నారు. మోతే నుంచి నేరుగా కేసీఆర్ ఆర్మూర్‌కు వెళ్తారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్‌ పట్టణానికి చేరుకొని అక్కడి పర్యటిస్తారు. అనంతరం నిజామాబాద్ అర్బన్‌, రూరల్‌లో పర్యటిస్తారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయానికి వెళ్తారు.
యూనివర్సిటీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం....
హరితహారంలో భాగంగా యూనివర్సిటీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో...ఇప్పటికే వర్సిటీని జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించింది. యూనివర్సిటీలో ఉన్న 577 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. సుమారుగా 5 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వర్సిటీలో మొక్కలు నాటిన అనంతరం నేరుగా సదాశివనగర్ మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా కామారెడ్డికి, రామాయంపేట్ మీదుగా నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు.

Don't Miss