Activities calendar

08 July 2015

21:30 - July 8, 2015

హైదరాబాద్ : మున్సిపల్‌ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిమాండ్ల పరిష్కారానికి మరికొంత సమయం కావాలని అడిగామని సమస్యలు పరిష్కరిస్తామని లిఖిత పూర్వకంగా రాసిస్తామన్నా వినకుండా కార్మిక సంఘం నేతలు వెళ్లిపోయారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రంజాన్‌ నెలలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్న నాయిని కార్మికులు దిగిరాకుంటే చెత్త తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.   
ఏ హామీ రానందుకే..
వేతనాల పెరుగుదలపై ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రానందునే సమ్మె కొనసాగిస్తున్నట్లు మున్సిపల్‌ కార్మిక సంఘం నేతలు చెప్పారు. ఏడు కార్మిక సంఘాలు ఈ సమ్మెను కొనసాగిస్తున్నాయని వివరించారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని మున్సిపల్‌ కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. కాగా మున్సిపల్ కార్మికుల సమ్మెతో కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. వీరి సమస్యలు పరిష్కారమై సమ్మె త్వరగా ముగిసినట్లయితే తమ వీదుల్లోని చెత్త తొలగిపోతుందని ప్రజలు కోరుకుంటున్నారు. 

మోడీ పుతిన్ భేటీ..

హైదరాబాద్ : భారత ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. రష్యా పర్యటనలో భాగంగా కజకిస్థాన్ నుంచి రష్యా చేరుకున్న ప్రధాని మోడీ రష్యాలో జరుగనున్న బ్రిక్స్ సదస్సు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొననున్నారు. రష్యా పర్యటనలో భాగంగా చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్, పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో మోడీ భేటీ కానున్నారు.

ఈ నెల 29 నుంచి ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాయి. వరంగల్, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ రవిరాజు వెల్లడించారు. ఆయన బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 3వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 4,5 తేదీల్లో ఆర్మీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, పీఎంసీ కోటా కింద అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. రాష్ట్రంలో 2,550 మెడికల్, 1000 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా జేఎన్‌టీయూ సాంకేతిక శాఖ సహకారంతో కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగించనున్నారు.

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర వద్ద 12 ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపేలా రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. పుష్కరాల దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. నేటి రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు మరియు శుక్రవారం మధ్యాహ్నం 3.45గంటలకు తిరుపతి-కాకినాడ ప్రత్యేక మరో రైలు నడవనుంది. 

పోలీసుల లాఠీఛార్జీతో విద్యార్థి మృతి..

ఇంఫాల్ : ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ జులపించడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మణిపూర్ లో చోటుచేసుకుంది. మణిపూర్ లోకి ఇతరుల ప్రవేశంపై కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇంఫాల్‌లో ఆందోళనకు దిగాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఝులిపించారు. లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సరిహద్దు వద్ద హై అలర్ట్....

జమ్మూకాశ్మీర్ : ఎల్ ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనే సమాచారంతో భారత ఆర్మీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. 

నీతి ఆయోగ్ కు బాబు..కేసీఆర్...

హైదరాబాద్ : ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఈనెల 15వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

 

ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ తేదీల ఖరారు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి. హైదరాబాద్, వరంగల్, ఎన్టీఆర్ వర్సిటీ కేంద్రాల్లో ఈనెల 29 నుండి ఆగస్టు 3 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. ఆగస్టు 4, 5 తేదీల్లో ఆర్మీ, ఎన్ సీసీ, క్రీడా విభాగాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 

ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ తేదీల ఖరారు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి. హైదరాబాద్, వరంగల్, ఎన్టీఆర్ వర్సిటీ కేంద్రాల్లో ఈనెల 29 నుండి ఆగస్టు 3 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. 

విష జ్వరాల ఘటనలో ముగ్గురు అధికారుల సస్పెండ్...

కృష్ణా : చల్లపల్లి (మం) మాజేరులో విష జ్వరాల ఘటనలో ముగ్గురు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ, గ్రామ కార్యదర్శి ఏఎన్ఎమ్ లపై వేటు వేశారు.

 

ఐఆర్డీఏఐ ఛైర్మన్ తో కేటీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథార్టీ ఛైర్మన్ విజయన్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. రైతు కమతాల యూనిట్ గా పంట బీమా ఉండాలని విజయన్ ను కేటీఆర్ కోరారు. ఈనెల 11న ఇన్య్యూరెన్స్ కంపెనీలతో సమావేశం జరుగనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 

విద్యార్థినిపై ప్రిన్స్ పాల్ అఘాయిత్యం...

ప్రకాశం : దర్శిలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థిపై ప్రిన్స్ పాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆమె గర్భవతితో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తనను ప్రిన్స్ పాల్ జాయ్ లొంగదీసుకున్నట్లు బాలిక వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జాయ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

ప్రతి మరణానికి వ్యాపంకు లింక్ పెట్టవద్దు - చౌహాన్..

ఢిల్లీ : వ్యాపం స్కాంలో మృతుల ఘటనలపై సీబీఐ విచారిస్తుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. కానీ ఈ మధ్యన జరుగుతున్న మరణాలకు స్కాంకు లింక్ పెట్టవద్దని ఆయన ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

గిరిజన ప్రాంతాలకూ గోరు ముద్దల పథకం..

హైదరాబాద్ : గోరు ముద్దల పథకాన్ని గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరింప చేస్తామని ఏపీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. టేక్ హోం రేషన్ కార్యక్రమం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం చేపట్టనున్నట్లు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వేతనాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

విశాఖ ఆర్మి రిక్రూట్ మెంట్ లో విషాదం..

విశాఖపట్టణం : ఆర్మీ రిక్రూట్ మెంట్ లో విషాదం చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థి నీలబాబు మృతి చెందాడు. పరుగులో అర్హత సాధించి అనంతరం నీలబాబు సొమ్మసిల్లిపడిపోయాడు. తరువాత కేజీహెచ్ లో చికిత్స కు తరలించారు. అక్కడి నుండి కేర్ కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. గుండె సంబంధిత సమస్య తలెత్తటంతో చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇతను శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పోడి ప్రాంతానికి చెందిన వాడు. 

ఎస్మా ప్రయోగానికైనా సిద్ధం - జలమండలి..

హైదరాబాద్ : వాటర్ బోర్డు పీఆర్సీ అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగులు అందరూ విధుల్లో చేరాలని సూచించారు. లేనిపక్షంలో ఎస్మా ప్రయోగించడానికి వెనుకాడమని జలమండలి పేర్కొంది.

 

జులై నెలాఖరు కల్లా మూడో విడత రుణమాఫీ - ప్రత్తిపాటి..

విజయవాడ : అన్ని జిల్లాల రైతు సంఘాల నేతలతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జరిపిన సమావేశం ముగిసింది. జులై నెలాఖరు కల్లా మూడో విడత రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నకిలీ విత్తనాల సమస్యల పరిష్కారానికి చట్టంలో మార్పులు చేయాలని రైతులు సూచించారని తెలిపారు. మూడో విడత రుణమాఫీలో 2.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులకు ఫార్కర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్ ద్వారా ఆన్ లైన్ మార్కెటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. అరటి బోర్డుకు ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, రైతు మిత్ర గ్రూపులకు రూ.574 కోట్ల మేర రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. 

18:18 - July 8, 2015

తిరుపతి : టిడిపికి..పవన్ అభిమానుల మధ్య దూరం పెరుగుతోందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుకోవాలి. పవన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎంపీలు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. విజయవాడ, తిరుపతిలో పార్టీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చారు. ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. తిరుపతిలో నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విజయవాడలో నాని రాజీనామా చేయాలని, జనసేన పార్టీ కార్యకర్తపై గెలువాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మద్దతిచ్చారా? లేదా ? అనేది ప్రజలకు తెలుసని, సొంత రాజకీయాలు, పబ్లిసిటీ కోసం పవన్ ను విమర్శించే హక్కు లేదన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో పవన్ సపోర్టు ఇచ్చారన్నారు. ప్రతి రోజు ప్రశ్నిస్తారని జవాబు చెప్పాల్సింది వారేనని పేర్కొన్నారు. 

18:17 - July 8, 2015

ఢిల్లీ : త్వరలోనే కేంద్రం నుండి ఏపీకి నిధులు వస్తాయని, ఓపిక పట్టాలని ఎపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ పరిష్కారమౌతాయని, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ నెరవేర్చడంలోకేం ద్రం సానుకూలంగాఉంద న్నారు. ఏపీ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన ప్రాజెక్టులను..పథకాలను ఆయన వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పలేదని, బీహార్ ఎన్నికల తరువాత కేంద్రం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వివాదాస్పదం చేయాల్సినవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధికి ఎవరు సలహా ఇచ్చినా తీసుకుంటామని కంభంపాటి పేర్కొన్నారు.

 

18:09 - July 8, 2015

విజయవాడ: పాతబస్తీలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్‌కల్యాణ్‌పై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ధర్నా చేశారు. పవన్‌ ప్రచారంతోనే ఎన్నికల్లో టీడీపీ గెలించిదని విమర్శించారు. పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రోడ్లపై తిరగనివ్వమని జనసేన నేతలు హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

ఇంగ్లండ్ : యాసెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొలి టెస్టు నుంచే తమ ఆదిపత్యాన్ని నిలబెట్టుకునే వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 

కాంగ్రెస్ తన రాజీనామాను కోరుకొంటోంది - చౌహాన్..

ఢిల్లీ : కాంగ్రెస్ తన రాజీనామాను మొదటి నుండి కొరుకొంటోందని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ తెలిపారు. అలాగే ప్రతిపక్షం నిందలు వేస్తోందని విమర్శించారు. 

మున్సిపల్ కార్మికులతో టి.సర్కార్ చర్చలు..

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులతో మంత్రి నాయినీ చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా పాల్గొన్నారు. వేతన సవరణతో పాటు 16 డిమాండ్లపై చర్చలు జరుగుతున్నాయి. 

సూరారం మార్కెట్లో హిజ్రాల దాడి..

హైదరాబాద్ : సూరారం మార్కెట్లో బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యాపారులపై హిజ్రాలపై దాడి చేశారు. డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో వ్యాపారస్తులు నిరాకరించారు. దీనితో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అనంతరం పోలీసులు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. 

రష్యా పర్యటనలో పాక్ అధ్యక్షుడితో భేటీ కానున్న మోడీ..

రష్యా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో నవాజ్ షరీఫ్ తో భేటీ కానున్నారు. 

జింబాబ్వే చేరిన భారత టీం..

జింబాబ్వే : రహానే నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు మంగళవారం రాత్రి జింబాబ్వేకు చేరుకుంది. రహానేతో పాటు 15 మందితో కూడిన భారత జట్టు ఈనెల 10 నుండి జింబాబ్వేతో జరుగనున్న సిరీస్ లో భాగంగా ఈ పర్యటనకు వెళ్లింది. 

16:56 - July 8, 2015

హైదరాబాద్ : ఆనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులపై టి.కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై హరీష్ రావు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోతిరెడ్డి పాడు అక్రమంగా కడుతుంటే నేతలు మాట్లాడలేదని, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులపై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడేందుకు నీళ్లు రాని ప్రాజెక్టులు..కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలు మాపై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అక్రమం అని నెల రోజులు అసెంబ్లీని స్తంభింపచేసినట్లు గుర్తు చేశారు. టీఆర్ఎస్ చేపడుతున్న ప్రాజెక్టులను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును వైఎస్ అక్రమంగా తవ్వుతుంటే ఉత్తమ్, భట్టి ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. సమైక్య రాష్ట్రంలో కల్వకుర్తికి నీళ్లు ఇచ్చేందుకు 90 రోజులు పడితే రాయలసీమకు మాత్రం 19 రోజుల్లో నీళ్లు తీసుకెళ్లారని తెలిపారు.
ఆదిలాబాద్ కు నీళ్లు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారు...
తుమ్మిడిహెట్టు నుండి కాళేశ్వరంకు మార్చడం ద్వారా నీళ్లు రావు అని ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల కింద తూర్పు ఆదిలాబాద్ కు 56వేల ఎకరాలు మాత్రమే ఆనాడు చెప్పారని తెలిపారు. ఈ రోజు కేసీఆర్ సర్కార్ 1.56 ఎకరాలు చేయబోతున్నట్లు చెప్పారు. నీళ్లు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తుమ్మిడి హెట్టు వద్ద ఎలాంటి ముంపు లేకుండా బ్యారేజీ నిర్మించి ఉన్నటువంటి కాలువ ద్వారా నీళ్లు అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. రైతాంగానికి మంచినీళ్లు ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారని, పులిచింతల ప్రాజెక్టు కట్టి ఉత్తమ్ నియోజకవర్గంలోని ప్రజలను ముంచెత్తుతుంటే ఆయన మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణ గొంతు ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకెళుతుంటే మాట్లాడలేదని తూర్పారబట్టారు. మిడిమిడి జ్ఞానంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని అనుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 

16:26 - July 8, 2015

హైదరాబాద్ : టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ వాదనను తోసిపుచ్చింది. రెండు రోజుల పాటు షరతులతో కూడిన కస్టడీ ఇస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30గంటల పాటు అడ్వకేట్ ఎదుట విచారించవచ్చని, విచారణలో థర్డ్ డిగ్రీ చేయవద్దని ఆదేశించింది. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయంలోనే సండ్రను ఉంచాలని, మంచి భోజనం పెట్టాలని సూచనలు చేసింది.
14 రోజుల రిమాండ్...
ఓటుకు నోటు కేసులో సండ్రకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సండ్ర మే 30, 31వ తేదీల్లో రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అతన్ని విచారించేందుకు ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు హైదర్ గూడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సండ్ర ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. ఆ తరువాత స్పందించిన సండ్ర తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని విచారణకు పది రోజుల తరువాత హజరవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. అయితే సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో సండ్ర ఏసీబీ ఎదుట హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి..సెబాస్టియన్, ఉదయ్ సింహాలు అరెస్టయి బెయిల్ పై విడుదల సంగతి తెలిసిందే. మరి విచారణలో సండ్ర ఎలాంటి విషయాలు చెబుతారనే ఉత్కంఠ నెలకొంది. 

సండ్రకు రెండు రోజుల కస్టడీ..

హైదరాబాద్ : టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర కస్టడీపై కోర్టు తీర్పు వెలువరించింది. సండ్రను రెండు రోజుల పాటు కస్టడీ విధిస్తున్నట్లు వెల్లడించింది.

వ్యాపం కేసు సీబీఐ విచారణనను కొట్టివేసిన హైకోర్టు..

మధ్యప్రదేశ్ : వ్యాపం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రభుత్వం వేసిన పిటిషన్ ను జబల్ పూర్ హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణనను జులై 20 తేదీకి వాయిదా వేసింది. వ్యాపం కేసుపై గురువారం సుప్రీంలో విచారించనుంది.

ఓయూ ప్రోఫెసర్ మహంతీ రాజకు మూడేళ్ల జైలు శిక్ష..

హైదరాబాద్ : ఓయూ ప్రోఫెసర్ మహంతీ రాజకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి హై కోర్టు తీర్పు వెల్లడించింది. పీహెచ్ డీ విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో తీర్పు వెలువరించింది. రూ.ఐదు వేల జరిమాన విధించింది.

 

ఖమ్మం..వరంగల్ లో హరితహారంలో పాల్గొననున్న సీఎం..

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మం, ఎల్లుండి వరంగల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు ఉదయం హెలికాప్టర్ లో ఖమ్మంకు బయలుదేరి రాత్రికి వరంగల్ లో కేసీఆర్ బస చేయనున్నారు. శుక్రవారం వరంగల్ ప్రెస్ క్లబ్ భవనం ప్రారంభించిన అనంతరం హరితహారం కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. శనివారం ఉదయం పటన్ చెరులో హరితహారం, స్వచ్ఛ హైదరాబాద్ సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం నిజాం కాలేజీలో నిర్వహించే ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు.

 

రాజస్తాన్ సర్కార్ కు హెచ్చార్సీ నోటీసులు..

రాజస్తాన్ : రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. జైపూర్ - ఆగ్రా మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంపై నివేదిక కోరింది. 

దావూద్ పిటిషన్ విచారణకు నో అన్న సుప్రీం..

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

15:45 - July 8, 2015

ఢిల్లీ : జైపూర్‌ - ఆగ్రా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బిజెపి ఎంపి హేమామాలిని తొలిసారిగా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై మృతి చెందిన చిన్నారి తండ్రినే దోషిగా నిలిపారు. మృతి చెందిన చిన్నారి తండ్రి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని, పాప బతికేదని అన్నారు. పాప చనిపోవడం తనను కలచివేసిందని హేమమాలిని పేర్కొన్నారు. హేమమాలిని ట్విట్టర్‌పై స్పందించిన పాప తండ్రి హనుమాన్‌ మహాజన్‌ తాను ఎలాంటి తప్పిదం చేయలేదన్నారు. బైపాస్‌ రోడ్డుపైకి వెళ్లడానికి తాను 8 నిముషాలు వెయిట్‌ చేశానని, రోడ్డు ఖాళీగా కనిపించగానే ఇండికేటర్‌ ఇస్తూ రోడ్డు క్రాస్‌ చేశానని, ఇంతలో 10-15 సెకన్ల వ్యవధిలోనే హేమమాలిని కారు వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. తనకన్నాముందు ఓ వాహనం కూడా వెళ్లిపోయిందన్నారు.

15:43 - July 8, 2015

మధ్యప్రదేశ్ : వ్యాపం స్కాంలో సంబంధమున్నట్లు ఆరోపణలున్న మెడికల్ విద్యార్థి నమ్రతా దామోర్ 2012 జనవరిలో హాస్టల్‌ నుంచి అదృశ్యమైపోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె ఉజ్జైన్‌లో రైలు పట్టాలపై శవమై తేలింది. దీన్ని అప్పట్లో ఆత్మహత్య కేసుగా నమోదు చేసి 2014లో మూసివేశారు. ముగ్గురు డాక్టర్ల బృందం మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ 2012 జనవరి 9న నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా నమ్రత మృతిపై తిరిగి విచారణ జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. పోలీసులు మాత్రం వారి చర్యలు సమర్థించుకుంటున్నారు. మర్డర్‌గా భావించేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు. ఒకవేళ ఆధారాలు దొరికితే మళ్లీ ఇన్వెస్టిగేట్ చేస్తామని స్పష్టం చేశారు. 

15:41 - July 8, 2015

మధ్యప్రదేశ్ : వ్యాపం స్కాంపై సీబీఐ విచారణకు.. మధ్యప్రదేశ్‌ సర్కారు సిఫార్సు చేయటంతో ఆ కుంభకోణంతో సంబంధమున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు..ఇలా ఎంతో మందితో జాబితా ఉంది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ప్రముఖ మెడికల్ కాలేజ్‌ జీఎస్ వీ ఎమ్ లో సుమారు 54 మంది వ్యాపం స్కాంలో భాగంగానే అడ్మిషన్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను గతంలో విచారణ కోసం మధ్యప్రదేశ్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. విద్యార్థులో అందులో భాగంగా అరెస్టయ్యారు. వీరిలో 22 మంది బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ కాలేజ్‌లో జాయిన్ అయ్యారు. ఆరుగురు ఇప్పటికీ జైల్లో వున్నారు. 8 మంది ఆచూకీ మాత్రం లేదు. వీరంతా 2013 ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ పొందారు. కొన్ని నెలలుగా వీరు కాలేజ్‌కు రావటం లేదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం వాళ్ల విషయాలు ఏమీ తెలీవని స్పష్టం చేస్తోంది. 

15:38 - July 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పుష్కరాలకు వెళ్తున్నారా? పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలకు సన్నాహాలు చేసుకుంటున్నారా? ఎందుకంటారా తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల బాంబు పేల్చనుంది. ప్రజల నెత్తిపై ఛార్జీల పిడుగు పడనుంది. ప్రత్యేక బస్సుల పేర 50 శాతం అదనపు ఛార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులపై భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చుక్కలు చూపించేందుకు ఆర్టీసీ రెడీ అయింది. సాధారణ ఛార్జీల కన్నా 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక బస్సులు, అదనపు సౌకర్యాల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది.
స్నాన ఘట్టాల వరకు బస్సులు..
గోదావరి తీరం వెంట ఉన్న పుణ్య క్షేత్రాలు, పవిత్ర స్థలాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తోంది. భక్తులను స్నాన ఘట్టాల వరకు బస్సుల్లో తీసుకెళ్తామని తెలంగాణ ఆర్టీసీ జెఎండీ రమణారావు చెబుతున్నారు. పుష్కరాలు నిర్వహిస్తున్న 5 జిల్లాల్లో అంతర్గత సర్వీసులతో పాటు బాసర, ధర్మపురి, భద్రాచలం, కాళేశ్వరం క్షేత్రాలకు హైదరాబాద్ నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం మొత్తం 2270 బస్సులు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంపు..
ఆదిలాబాద్‌ జిల్లాకు 310 బస్సులు, నిజామాబాద్ జిల్లాకు 300, కరీంనగర్‌ జిల్లాకు 415, వరంగల్‌ జిల్లాకు 355, ఖమ్మం జిల్లాకు 360 బస్సు సర్వీసులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇక ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలిపేందుకు.. పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. 

భారత్..కజకిస్తాన్..ఐదు ఒప్పందాలు..

కజకిస్తాన్ : రక్షణ రంగంలో భారత్, కజకిస్తాన్ పరస్పర సహకారంపై అవగాహన కుదిరింది. దీనిని స్వాగతిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు నజర్ బయేవ్ తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఐదు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 

ముగిసిన టిపిసిసి సమావేశం..

హైదరాబాద్ : గాంధీభవన్ లో టి.పిసిసి సభ్యుల సమావేశం ముగిసింది. ఈనెల 11న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాలన్న వీహెచ్ ప్రతిపాదనపై సమావేశంలో చర్చించడం జరిగిందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. దీనిపై పిసిసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక బరిలో మాజీ స్పీకర్ మీరా కుమార్ ను బరిలో దించాలని ఒకరిద్దరు నేతలు అభిప్రాయాలు చెప్పారని, దీనిపై ఎలాంటి చర్చ జరుగలేదని తెలిపారు.

15:18 - July 8, 2015

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మంలో పుష్కర పనులను మంత్రి తుమ్మల స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివిధ ఘాట్ల నిర్మానం, పార్కింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో పుష్కరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని చెప్పుకున్నామని, అంతకంటే పెద్ద ఎత్తున వస్తారని అంచాన వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ప్రయాణ సౌకర్యాలు..దేవస్థానం దగ్గర దర్శన ఏర్పాట్లు..గోదావరి నది తీరాన సౌకర్యాలును కల్పిస్తున్నట్లు తెలిపారు. కోటి మంది వచ్చినా ఏ లోటు ఉండదన్నారు. ఎంతైనా ఖర్చు అయినా సరే ఘాట్లు, రహదారులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు పుష్కర పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంటామని తుమ్మల తెలిపారు. 

15:14 - July 8, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విమర్శలు గుప్పించారు. బుధవారం తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ పార్టీలో చేరిక సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు..విభజన జరిగిపోయింది..ఇదంతా చరిత్ర అని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏడాది బిడ్డ అని పేర్కొన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ప్రతి పనికి అడ్డు పడడం సరికాదని, హైదరాబాద్ పై ఎడతెగని పంచాయతీ సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మా బతుకు మమ్మల్ని బతనివ్వండి..పక్క రాష్ట్రంలో సమస్యలు లేవా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చురకలంటించారు.

ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేపడుతాం - అనంత్ కుమార్..

బీహార్ : రాష్ట్ర ఎన్నికల్లో కార్మికులు..పేద ప్రజల దగ్గరకు వెళ్లి ప్రచారం చేపడుతామని కేంద్ర మంత్రి అనంత కుమార్ పేర్కొన్నారు.

 

అతిసారతో ముగ్గురు గిరిజనుల మృతి..

తూర్పుగోదావరి : మన్యంలో అతిసార విజృంభిస్తోంది. వై.రామవరం మండలం మల్లంపాడు అటవీప్రాంతంలో అతిసారతో ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడ్డారు.

నకిలీ పాస్ పుస్తకాల స్కామ్ లో దర్యాప్తు ముమ్మరం...

అనంతపురం : నకిలీ పాస్ పుస్తకాల స్కామ్ లో దర్యాప్తు ముమ్మరం చేశారు. డిప్యూటి కలెక్టర్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలతో 20 బృందాలు ఏర్పాటయ్యాయి. బ్యాంకుల్లోనూ, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు వీఆర్వోలు, వీఆర్ఏలను సస్పెండ్ చేశారు. 

మన్యంలో పేలుడు పదార్థాల లభ్యం..

తూర్పుగోదావరి : మన్యంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 128 జిలిటెన్ స్టిక్స్, 118 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు.

 

14:39 - July 8, 2015

తన బిడ్డ సంరక్షురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేసిన ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. తన బిడ్డకు తనను ఏకైక సంరక్షక్షురాలిగా..తన లావాదేవీలన్నిటికీ తన బిడ్డను నామినీగా గుర్తించాలని ఒక అవివాహిత తల్లి చేసిన విజ్ఞప్తిని విచారణ కోర్టు, ఆ తరువాత హైకోర్టు తిరస్కరించడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అవివాహిత తల్లులు..ఒంటరి తల్లుల బిడ్డల విషయంలో..ఆ బిడ్డకు సంబంధించి బాధ్యతలను విస్మరించిన తండ్రుల చట్టబద్ధమైన హక్కుల కన్నా..ఆ బిడ్డ సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ అంశంపై 'మానవి' వేదికలో న్యాయవాది పార్వతి విశ్లేషణ చేశారు. అలాగే పలువురు వ్యక్తపరిచిన న్యాయ సందేహాలను ఆమె నివృత్తి చేశారు. 

ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన...

ఢిల్లీ : మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హస్తినలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చివరకు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

14:21 - July 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డి.శ్రీనివాస్ తో పాటు నిజామాబాద్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, డీఎస్ అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.                                                                    
బంగారు తెలంగాణ కోసమే - డీఎస్..
బంగారు తెలంగాణ కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో ఎదురయ్యే ఆటంకాలను రాజ్యాంగబద్ధంగా ఎదిరించేందుకు తాను కృషి చేస్తానని, తన సహాకారం అందిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే కేసీఆర్ చాలా అభిమానమని, అలాగే సోనియాకు కూడా కేసీఆర్ అంటే చాలా అభిమానం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఇప్పటిది కాదని, ఎంతో మంది బలిదానాల తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని గుర్తు చేశారు. ఉద్యమం కోసం కేసీఆర్ ప్రాణాలు లెక్క చేయకుండా దీక్ష చేశారని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయన్నారు. అనంతరం ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని పలుమార్లు కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదని, అభివృద్ధి జరగాలంటే ఒక్క రోజులో జరిగే పని కాదన్నారు. అభివృద్ధి కోసం తాను పార్టీలో చేరడం జరిగిందని, ఎవరిని తాను బ్లేమ్ చేయదలుచు కోలేదన్నారు. వారు చేస్తున్న విమర్శలను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎవరిని ప్రలోభ, బలవంతం చేయలేదని, నా వెంట వచ్చిన వారికి ఆహ్వానం పలుకుతానన్నారు. వారి మంచి చెడ్డల బాధ్యత తనదేనని డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. 

మున్సిపల్ కార్మికులను చర్చలకు ఆహ్వానం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంత్రి నాయినీ ఛాంబర్ లో మంత్రి ఈటెల, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు చర్చించనున్నారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు ఈ చర్చలు జరుగనున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 

మరోసారి పవన్ ట్వీట్..

హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీలు చేసిన విమర్శలపై సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. ''ఎంపీలు వ్యాపారము చేయడడము తప్పు కాదు, కేవలం 'వ్యాపారమే' చేయడము తప్పు' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. నన్ను తిడితే స్పెషల్ స్టేటస్ రాదని పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ లో చేరిన డీఎస్...

హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. 

13:36 - July 8, 2015

గుంటూరు:కోడితాడిపర్రులో రైతుల ఆత్మహత్యల ఘటనపై గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే స్పందించారు. రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రైతుల నుంచి భూమిని తీసుకోబోమని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రైతుల ఆత్మహత్యల ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

 

విజయవాడ పాతబస్తీలో జనసేన ఆందోళన

విజయవాడ: పాతబస్తీలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్‌కల్యాణ్‌పై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా...వారు ధర్నా చేశారు. పవన్‌ ప్రచారంతోనే ఎన్నికల్లో టీడీపీ గెలించిదని విమర్శించారు. పదవులకు రాజీనామా చేసి ....ఎన్నికల్లో గెలవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే...రోడ్లపై తిరగనివ్వమని జనసేన నేతలు హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అదృశ్యమైన గురుకుల పాఠశాల విద్యార్థిని క్షేమం...

కృష్ణా: గుడివాడ మండలం మోటూరులో అదృశ్యమైన నాగలక్ష్మి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 18న గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన నాగలక్ష్మిని కాసేపట్లో గుడివాడ రూరల్ పీఎస్ కు తీసుకువచ్చే అవకాశ ఉన్నట్లు సమాచారం. 

తూ.గో జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం...

తూ.గో:జిల్లాలోని మారేడుమిల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో భారీగా పేలుడు పద్దార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 128 జిలెటిన్‌ స్టిక్స్‌, 118 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజమండ్రి, చింతూరు, మారేడుమిల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.

చిట్టీల పేరుతో ఘరానామోసం..బాధితుల ఆందోళన

హైదరాబాద్:మదీనాగూడలో చిట్టీల పేరుతో రూ.12 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడిన మాధవి, వెంకటేశ్వర్లును అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు.

భారీ నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 450 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 150 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 266 పాయింట్ల నష్టం, నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి.

తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా:సీపీఎం నేత తమ్మినేని

హైదరాబాద్:కేసీఆర్ పాలన అస్థవ్యస్థంగా తయారైందని తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా .. తానేం చెప్పినా వినాలనే వైఖరి అవలంభిస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండి పడ్డారు. ఎస్వీకేలో కార్మికులు, ఉద్యోగుల ఆందోళనలపై సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్, ఉపాధి హామీ కార్మికుల సమ్మెపై టీఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం సమ్మెను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని:జనసేన నేత

విజయవాడ:జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎంపీలకు నిజంగా ఆంధ్రప్రదేశ్‌పై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని జనసేన నాయకుడు పోతిన మహేష్‌ అన్నారు. అంతేకాని పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

12:56 - July 8, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటీషన్ పై విచారణను ఏసీబీ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అరెస్టైన వెంటనే నిన్న ఉదయం సండ్ర తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని నేడు విచారిస్తామని నిన్న చెప్పిన న్యాయస్థానం, తాజాగా ఈ పిటీషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, సండ్రను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలన్న ఏసీబీ పిటీషన్ పై కోర్టులో కొద్దిసేపటి క్రితం వాదనలు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం 4 గంటలకు కస్టడీపై తీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.  

12:47 - July 8, 2015

హైదరాబాద్: టిడిపి ఎంపీల విమర్శలకు పవన్‌ కళ్యాణ్ కౌంటరిచ్చాడు. తాను జైలుకు వెళ్లటానికైనా, కోర్టులను ఎదుర్కునేందుకైనా సిద్ధమని ట్విటర్‌లో స్పందిచాడు. మరోవైపు విజయవాడలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దమ్ముంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలంటూ...టిడిపి నేతలను డిమాండ్ చేస్తున్నారు.

సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. ఈ క్రమంలో సండ్ర తరపు న్యాయవాదులు ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సండ్ర బెయిల్ పిటిషన్‌పపై విచారణ రేపటికి వాయిదా పడింది.

ఎమ్మెల్యే భూమాకు బెయిల్

కర్నూలు:నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ డీఎస్పీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదుతో నెల 4వ తేదీన భూమాపై ఈ సెక్షన్ 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

సండ్ర కస్టడీ పిటిషన్ పై ముగిసన వాదనలు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ అభ్యర్థనపై వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును సాయంత్ర 4 గంటలకు వాయిదా వేసింది.

టిడిపి విమర్శలకు పవన్ కౌంటర్

హైదరాబాద్: టిడిపి విమర్శలకు పన్ కౌంటర్ ఇచ్చారు. జైలుకైనా, కోర్టు కైనా నేను సిద్ధం అని, త్వరగా తగిన ఏర్పాట్లు చేస్తే మంచిదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

 

సండ్ర కస్టడీ పిటిషన్ పై వాదనలు ప్రారంభం

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీకి ఇవ్వాలన ఏసీబీ అభ్యర్థనపై వాదనలు ప్రారంభమయ్యాయి.

ఉస్మానియా ఆస్పత్రి ఉద్యోగుల నిరసన

హైదరాబాద్: పెంచిన వేతన సవరణను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు.

ఆలయభూములు సాగుచేస్తున్న రైతులకే పట్టాలు: కలెక్టర్

గుంటూరు:వామపక్షాలు చేపట్టిన ఆందోళనకు కలెక్టర్ కాంతిలాల్‌ దండే స్పందించారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి అయిదు లక్షల రూపాయల ఆర్థికసాయం అందిస్తామని కలెక్టరు చెప్పారు. వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామి ఇచ్చారు. ఆలయభూములు సాగుచేస్తున్న రైతులకే పట్టాలు ఇస్తామని కలెక్టరు ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు.

ఎమ్మెల్సీగా పయ్యావుల కేశవ్ ప్రమాణం...

హైదరాబాద్:టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏపీ శాసన మండలి సభ్యుడి(ఎమ్మెల్సీ)గా ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి కొద్దిసేపటి క్రితం పయ్యావుల చేత ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ శాసన మండలిలో టీడీపీ బలం మరింత పెరిగింది. 

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన నాగం జనార్థన్ రెడ్డి

మహబూబ్‌నగర్‌:జిల్లాలోని నెట్టంపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన నాగం బృందం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ధరూర్‌ మండలం ర్యాలంపాడు రిజార్వాయర్‌ లిఫ్ట్‌లో నాగం బృందం ఇరుక్కుపోవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జేఎన్టీయూ

హైదరాబాద్:ఇంజినీరింగ్ కళాశాలలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ జెఎన్టీయూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 25 కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం విదితమే. ఈ 25 కళాశాలల అనుమతిపై జెఎన్టీయూ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం లంచ్ మోషన్‌లో పిటిషన్ విచారణకు రానుంది.

రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గరవ్నర్, సీఎం

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది ముగిసింది. పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి నేడు ఢిల్లీ తిరిగి వెళ్లారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పూలబొకేలు ఇచ్చి రాష్ట్రపతికి తుదివీడ్కొలు పలికారు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి పాదాభివందనం చేశారు. హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం...

హైదరాబాద్:ముంబైలోని మలాడ్ ఎస్వీ రోడ్డులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో బాటా షోరూమ్ పూర్తిగా కాలిపోయింది. 25,000 జతల షూ కాలిపోయాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది.

12:04 - July 8, 2015

అతివల అందానికే మరింత అందం తీసుకువచ్చేది చీర. అందుకే భారతీయ మహిళలు.. అందులో తెలుగువాళ్లకు చీర అంటే మహా ఇష్టం. చీరల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అణువణువునా కనిపిస్తుంది. అయితే నేతన్నల నైపుణ్యం వారి కడుపులు మాత్రం నింపలేకపోతుంది. చాలీచాలని సంపాదనతో ఎలా బతకాలో అర్ధం కాక నేతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఉప్పాడ చీరలు నేసే చేనేత కార్మికుల వెతలపై 10టీవీ ప్రత్యేక కథనం.
ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి మూడొందల ఏళ్ల చరిత్ర
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి గ్రామం. చేనేత వస్త్రాల తయారీలో మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జామ్దానీ చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని మరో చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామ్దానీ చీరలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే. చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం.. 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశస్థాయిలో ప్రాచుర్యం పొందింది.
చీర తయారీకి 10 రోజుల నుంచి రెండు నెలలు .....
ఇంత ప్రాచుర్యం ఉన్న ఉప్పాడ చీరల వెనుక చేనేత కార్మికుల కఠోర శ్రమ అంతా ఇంతా కాదు. జామ్దానీ చీర తయారీకి 10 రోజుల నుండి రెండు నెలల వరకు పడుతుంది. ఈ చీరల తయారీలో స్వచ్చమైన జరీతో పాటు.. బెంగళూరుకు చెందిన సన్నటి పట్టును వినియోగిస్తారు. అన్ని పట్టువస్త్రాల మాదిరిగా కాకుండా ఈ చీరపై ఉన్న డిజైన్‌.. ఇరువైపులా ఉండడం దీని విశిష్టత. అంతేగాక కంచి, ధర్మవరం పట్టుచీరల కంటే బరువు తక్కువగా ఉండటం మరో విశేషం.
చీర తయారీకి శ్రమించనున్న ముగ్గురు కార్మికులు ........
ఈ చీర తయారీకి ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు రోజుకు 10 గంటలు నిర్విరామంగా శ్రమిస్తారు. ఈ చీరను నేసేందుకు డిజైన్‌ వేసుకోవడం.. సిల్క్‌ దారాలు అల్లడం.. మగ్గంపై నేయడం వరకు కార్మికులు ఎంతో శ్రమిస్తారు. అయితే ఇంతటి అందమైన చీరలను తయారు చేసే నేతన్నల బతుకులు మాత్రం దుర్భరంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశ, విదేశాల్లో జామ్దానీ చీరలకు గిరాకి.....
దేశ, విదేశాల్లో జామ్దానీ చీరలకు గిరాకి పెరుగుతున్నా చీరను తయారుచేసే నేతన్నలకు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎంతోమంది ప్రముఖులు వీరి నైపుణ్యాన్ని మెచ్చుకొని ఈ చీరలను కొని ప్రాచుర్యం పెంచినప్పటికీ.. చీరలను తయారుచేసే నేతన్నలను గుర్తించడం లేదు. ఇక వ్యాపారులు నేతన్నల అవసరాన్ని ఆసరాగా చేసుకుని.. చాలీచాలని కూలీలు ఇస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన నేతలు మాత్రం వాటిని అమలుచేసిన దాఖలాలు లేవు. దీంతో చేనేత కార్మికులు ఎలాంటి ఆదరణ లేక ఇదే వృత్తిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్ధికంగా స్థోమత లేకపోవడంతో చేనేత కార్మికులు తమ పిల్లలను సైతం చదవించుకోలేకపోతున్నారు. వీళ్లు సైతం చేసేందుకు వేరే పని లేక ఉన్న కులవృత్తినే నమ్ముకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.
తయారీలో నైపుణ్యం ఉన్నప్పటికీ....
ఎన్నో తరాలుగా ఈ చీరల తయారీలో నైపుణ్యం ఉన్నప్పటికీ.. కార్మికులు బతకడం కష్టంగా మారింది. నమ్ముకున్న వృత్తి కడుపు నింపలేక.. ఆదుకుంటామని ఊదరగొట్టిన పాలకులు పట్టించుకోకపోవడంతో చేనేత కార్మికులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు. 

11:58 - July 8, 2015

ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో చంద్రబాబు చేనేత కార్మికులకు ఎన్నో హామిలిచ్చారు. నేతన్నల తలరాతలను మారుస్తానని మాటిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా చేనేత కార్మికుల రుణం తీర్చుకోలేదు. ఏపీలో అతిపెద్ద చేతివృత్తి పరిశ్రమ అయిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే సంక్షోభంలోకి కూరుకుపోయింది. కష్టాల కడగండ్లను అధిగమించలేక కృష్ణా జిల్లా నేతన్నలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.ఔ
అప్పుల ఊబితో నేతన్నల ఆత్మహత్యలు....
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం,అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల పరిధిలో చేనేత కార్మికుల పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. లక్షలాది నేతన్నలు, చేనేత విభాగాల కార్మికులు అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం. మీకోసం అంటూ చంద్రబాబు చేసిన పాదయాత్రలో ఎన్నో హమీలు కురిపించారు. బాబు మాటలతో తమ జీవితాలు బాగుపడతాయని భావించారు కార్మికులు. వెయ్యి కోట్లతో మూలధనం ఏర్పాటు చేసి, ప్రతి ఏటా బడ్జెట్‌లో మరో వెయ్యి కోట్లు కేటాయిస్తామని, రుణాలు మాఫీ చేస్తామంటూ వాగ్దానాలు కుమ్మరించడంతో నేతన్నలు సంతోషించారు. కానీ ఏడాది గడిచినా హామీల నెరవేర్పు ఊసేలేదు. చేనేత కార్మికుల జీవితాల్లో సంతోషం లేదు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు....
అటు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యపు జబ్బు వీడటం లేదు. చేనేత కార్మిక వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీజీ ఎన్నోసార్లు చేనేత రంగం గురించి....
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ ఎన్నోసార్లు చేనేత రంగం గురించి మాట్లాడారని గుర్తు చేస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు. ఆయన బాటలోనే నడుస్తున్నామంటున్న నరేంద్రమోదీ,చంద్రబాబులు చేనేత కార్మికులకు ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
పాలకులు తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని....
ఇప్పటికైనా పాలకులు తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. కేరళ తరహాలో ప్రభుత్వమే చేనేత వస్త్రాలను కొని, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలంటున్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న చేనేత కళారంగాన్ని కాపాడాలని చెబుతున్నారు. లేదంటే చేనేతరంగం అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

11:55 - July 8, 2015

వ్యవసాయం, చేనేత దేశానికి రెండు కళ్లన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. మొదటి కన్ను చూపు కోల్పోతోంది. మరో కంటికి అంతా అంధకారమే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ చేనేత కార్మికుడిని తట్టినా కన్నీటి వ్యధలే కనిపిస్తాయి. ప్రేమనే దారంతో మమకారమనే మగ్గంతోనే చీరలను, వస్త్రాలను నేసే నేతన్నకు ఇప్పుడు దిక్కే లేకుండా పోతోంది. గుంటూరు మంగళగిరి నేతన్న మగ్గంపై చావలేక, బతకలేక జీవచ్చవంలా బతుకు పయనం సాగిస్తున్నాడు.
మూగబోతున్న చేనేత మగ్గాలు...
ఆధునిక సమాజంలో వస్త్ర అలంకరణపై ప్రతి ఒక్కరు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు..ఫంక్షన్, పార్టీలకు, సాధారణ సందర్బాలకు రకరకాల దుస్తులు వేసుకుంటారు. డబ్బులు పెడితే గుడ్డలకు కొదవ అన్న చందంగా ఫ్యాషన్ వస్త్రాలు ధరిస్తున్నారు. కాని నేటి ఫ్యాషన్ టెక్నాలిజీకి పునాది అయిన చేనేత కళను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. భవిష్యత్ లో చేనేత వస్త్రాలంటే ఎగ్జిబిషన్స్ లో మాత్రమే కనబడే విధంగా ఇప్పుడు చేనేత పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత కార్మికులను ఒక్కసారి కదిలిస్తే కష్టాల కడగండ్లే కనిపిస్తాయి.
మంగళగిరి చేనేతకు 1980 దశకం స్వర్ణయుగం ....
మంగళగిరి చేనేతకు 1980 దశకం స్వర్ణయుగం అని చెబుతారు. అప్పటి నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు మంగళగిరి చేనేత తన రాజసం చూపించింది. మంగళగిరి చేనేత కోసం ఎక్కడి నుండో వచ్చి మరి కొనుగోలు చేసేవారు. చుట్టుపక్కల ఎలాంటి శుభకార్యం జరిగినా మంగళగిరి వచ్చి బట్టలు కొనుక్కునేవారు. చేతి నిండా పనితో ఇంటి నిండా ఆనందంతో చేనేత కార్మికులు నిత్యం సంతోషంగా చేనేత పని చేసుకునే వారు. అయితే ప్రస్తుతం మంగళగిరి నేతన్నల జీవనం కష్టాల సుడిగుండాల నడుమ సాగుతోంది.
మనసంతా బాధతోనే మగ్గం ఆడించాల్సిన పరిస్థితి.....
రెక్కాడుతున్నా, డొక్కాడని పరిస్థితి నేతలన్నలది. ఒకవైపు ప్రభుత్వం ప్రోత్సాహమివ్వడం లేదు. మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. ఆదరణ తగ్గిపోతోంది. మనసంతా బాధతోనే మగ్గం ఆడించాల్సిన పరిస్థితి. అయినా చేతులెప్పుడూ మగ్గంపైనే. ఎందుకంటే తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న వృత్తి. బయటకెళితే మగ్గం నేసిన ఈ చేతులు బరువును మోయగలవా అన్న ఆవేదన కార్మికులది.
చేనేత రుణమాఫీ హామీని నెరవేర్చని ఏపీ ప్రభుత్వం.....
ఏపీ ప్రభుత్వం చేనేత రుణమాఫీ హామీని నెరవేర్చలేదు. వడ్డీతో పెరుగుతుండటంతో నడ్డీ విరిగేదాకా మగ్గం వేస్తున్నా ఇబ్బందులు గట్టెక్కడటం లేదు. సొంత మగ్గాలు లేకపోవడంతో అనేక మంది షావుకారుల వద్దే కూలీలుగా పనిచేస్తున్నారు. మంగళగిరి చుట్టుపక్కల ఒకప్పుడు 16 వేలమంది చేనేత కార్మికులుంటే ఇప్పుడు పట్టుమని రెండు వేలు లేరు. తరతరాలుగా వస్తున్న వృత్తిని తమతోనే ఆపేయడం మంచిదనే భావనతోనే ,వారి పిల్లలను ఇతర పనులకు పంపుతున్నారు.
చేనేత సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణం.....
దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి గొప్ప వృత్తిగా పేరున్న చేనేత ఇప్పుడు ఇన్ని కష్టాలు పడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని చేనేత కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. చేనేత వృత్తి కుంటుపడ్డానికి కారణం నైపుణ్యం లేక కాదని, ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జౌళి
ఉపాధి కోల్పోతున్న చేనేత కార్మికులను ఆదుకోండి....
ప్రస్తుతం రాజధాని రూపంలో చేనేత మరింత పతనాస్థవకు చేరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మిక సంఘం నేతలు. నిరుద్యోగ ఉద్యోగులకు ఉపాధి కల్పించే ముందు , ఉపాధి కోల్పోతున్న చేనేత కార్మికులను ఆదుకుని వారికి దారి చూపాలని చెబుతున్నారు.
మగ్గాల మాటున దాగిన మంగళగిరి చేనేత కార్మికుల కష్టాలు....
ఇదీ మగ్గాల మాటున దాగిన మంగళగిరి చేనేత కార్మికుల కష్టాలు. చేనేత వస్త్రం చూడడానికి, ధరించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. కాని నేతన్న జీవితం ఇలా కష్టాల నడుమ సాగుతోంది. చేనేత వస్త్రాలు కొనుక్కోవడానికి వచ్చే ఎంతో మంది , వీరి కష్టం చూసి, వీరి కళను చూసి ఓ పదిరూపాయలు ఎక్కువే ఇస్తారు. కాని ప్రభుత్వ పెద్దలకు మాత్రం నేతన్న కష్టాలు, వారి జీవన వ్యధ పట్టడం లేదు..ఇంతటి గొప్ప కళ అంతరించుకుపోతే , ఆ పాపం కేవలం పాలకులదే అవుతుంది.

11:49 - July 8, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు....సమ్మెను విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు. కార్మికుల సమ్మెను పోలీసులు అణచివేస్తున్నారు.

11:48 - July 8, 2015

గుంటూరు: రైతులు ఆందోళన చేస్తున్నారు. అమృతలూరు మండలం కోడితాడిపర్రులో ఆలయ భూముల వేలం నిరసిస్తూ .... రోడ్డెక్కారు. రైతుల మృతితో కోపోద్రిక్తులైన రైతులు ....ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి వామపక్ష పార్టీలతో పాటు పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. మెయిన్‌రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. రైతుల మృతికి కారణమైన...దేవాదాయ అధికారులపై హత్యకేసు నమోదు చేసి...కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనతో గుంటూరులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు భారీగా మోహరించారు.

11:45 - July 8, 2015

గుంటూరు: అమృతలూరులో విషాదం నెలకొంది. కోడితాడిపర్రులో ఆలయ భూముల వేలం నిరసిస్తూ రెండు రోజుల క్రితం....ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సత్తయ్య అనే రైతు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ మృతిచెందాడు. కోడితాడిపర్రులో చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన వ్యవసాయ భూములను...ఆలయ అధికారులు వేలం వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామ రైతులకు, ఆలయ అధికారుల మధ్య వివాదం జరిగింది. దీంతో ఆరుగురు రైతులకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ... అదే రోజు ఓ రైతు చనిపోయాడు. ఇవాళ మరో రైతు సత్తయ్య మృతిచెందాడు. 

11:20 - July 8, 2015

హైదరాబాద్:జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ హైదరాబాదులోని సనత్ నగర్ శాసనసభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు మీడియాలో వర్తాలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... 2014 ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ వ్యక్తిగత సర్వే చేయించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే సనత్ నగర్ స్థానం, ఎంపీగా పోటీ చేయాలనుకుంటే మల్కాజిగిరి స్థానం అయితే సేఫ్ అని సర్వేలో తేలిందట. ఈ నేపథ్యంలో, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ ఎమ్మెల్యే) రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే... ఆ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ యోచిస్తున్నారు. అయితే సదరు పత్రిక కథనం ఎంతమేర వాస్తవ రూపం దాలుస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు. 

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు...

అనంతపురం: జిల్లాలోని ముల్కలచెరువులో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 400 కిలోల అల్యూమినియం, 90 కిలోల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నారు.

మున్సిపల్ కార్మికులతో మధ్యాహ్నం భేటీ కానున్న సీఎం కేసీఆర్!

హైదరాబాద్:జీహెచ్‌ఎంసీ పరిధిలో మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఒప్పంద, ఔట్ సోర్సింగ్ కార్మికుల సర్వీసులను క్రమబద్దీకరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాలుగా రూ. 14,170 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

మున్సిపల్ కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత మూడు రోజులుగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. వీరి సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. రేపు కోర్టు ఈ పిటిషన్ విచారణకు రానున్నట్లు సమాచారం.

శ్రీరాంపూర్ ఆర్‌కే 7 గనిలో కార్మికుడు మృతి

ఆదిలాబాద్:మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ ఆర్‌కే 7 గనిలో ప్రమాదం జరిగింది. మ్యాన్ రైడింగ్‌పై నుంచి కిందపడి కార్మికుడు మృతి చెందాడు. దీంతో మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కార్మికులు సంతాపం ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్ లో హై అలర్ట్

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుండ పోత వర్షాలతో పడతుండడంతో జన జీవనం స్తంభించిపోయింది. దీంతోఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది.

సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ తీవ్ర అనారోగ్యం...

హైదరాబాద్:ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్(87) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆయనను కొన్ని రోజుల కిందటే చెన్నైలోని అడయార్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ గతరాత్రి విశ్వనాథన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దాంతో ఐసీయూకి మార్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిసింది. అయితే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

హైదరాబాద్:ఉత్తరాఖండ్‌లో వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి. డెహ్రాడూన్‌లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యాయి. ఉదమ్‌సింగ్ నగర్‌లో కుండపోత వర్షాలు కురిస్తున్నాయి. చెట్లు నేలమట్టం అయ్యాయి. రోడ్లన్నీ అస్తవ్యస్థంగా మారిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. మరోవైపు సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పలుచోట్ల నష్ట నివారణ చర్యలపై అధికారులు దృష్టిసారించారు.

 

10:41 - July 8, 2015

హైదరాబాద్:జపాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. జపాన్ రాజధాని టోక్యోలో చంద్రబాబు బృందం పర్యటించింది. సుమారు గంట పాటు నగరాన్ని పరిశీలించారు. 2020లో ఒలింపిక్స్‌ జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. షింబసీ స్టేషన్‌ నుంచి షింటోయెసు వరకు బాబు మెట్రో రైల్‌లో ప్రయాణించారు. తోషిబా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా గ్రిడ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. విద్యుత్‌ నిర్వహణపై తోషిబా కంపెనీ ఆసక్తి చూపింది. ఆ తర్వాత హోండా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు.

10:39 - July 8, 2015

హైదరాబాద్‌:నగర మెట్రో వాటర్‌ బోర్డు ఉద్యోగుల నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. నగరవ్యాప్తంగా సేవరేజ్‌ పనులు నిలిచిపోయాయి. పీఆర్సీని అమలు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు అంటున్నారు. ఎండీ గారి వైఫల్యం వల్లే పీఆర్సీ అందడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. 6వ తేదీ నుండి సమ్మె చేస్తున్నా....జలమండలి ఉద్యోగుల పై ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు.

10:37 - July 8, 2015

హైదరాబాద్‌:ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. రెండో భార్యతో కలిసి కన్నకూతురిపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు తండ్రి. ఆనంద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రమేష్‌, సరళాదేవి దంపతులు కుటుంబ కలహాలతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రమేష్‌, చాముండేశ్వరిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు ప్రత్యూషను తొలుత అనాధాశ్రమంలో చేర్పించిన రమేష్‌.. గతేడాది ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ప్రత్యూషను తండ్రి, సవతి తల్లితో కలిసి తీవ్ర వేధింపులకు గురిచేశారు. యాసిడ్ పోసి, సిగరెట్లతో కాల్చి, వైర్లు, కర్రలతో కొట్టి బంధించారు. సమాచారం తెలుసుకున్న చైల్డ్ లేబర్ కమిషన్ అధికారులు అక్కడికి చేరుకుని తండ్రి చెర నుంచి విముక్తి కల్పించారు. రమేష్‌ ప్రభుత్వ టెలికాం డిపార్ట్‌మెంటులో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

చిన్నారి పై తండ్రి, సవతి తల్లి కర్కశత్వం

హైదరాబాద్: ఎల్బీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిని సొంత తండ్రి రమేష్, సవతి తల్లి శ్యామల చిత్రహింసలకు గురిచేశారు. బాలిక వంటి నిండా వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం పోలీసుల సాయంతో బాలికను చెర నుంచి విడిపించారు. పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకోగా రమేష్ పరారీలో ఉన్నాడు. రమేష్ టెలికాంశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు.

09:57 - July 8, 2015

హైదరాబాద్: జక్కన్న చెక్కిన శిల్పం 'బాహుబలి'పై ఓ వివాదం చెలరేగుతోంది. ఈ సినిమాలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ డిమాండ్ చేసింది. యూట్యూబ్ లో మాలలను కించపరుస్తూ ఉన్న ఈ క్లిప్పింగ్స్ సేకరించి పోలీసులకు అందిస్తూ, ఇప్పటికే ఫిర్యాదు చేశామని జేఏసీ చైర్మన్ బి. దీపక్ కుమార్ వివరించారు. ఈ దృశ్యాలను తొలగించకుంటే చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.  

విశాఖకు సీఎస్ కృష్ణారావు, డీజీపీ రాముడు

హైదరాబాద్: విశాఖ నగరంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలనూ సీఎస్ కృష్ణారావు, డీజీపీ రాముడు పరిశీలించనున్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200, నిఫ్టీ 85 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి.

సండ్ర బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ అభ్యర్థనపై న్యాయస్థానంలో నేడు విచారణ జరగనుంది. డబ్బుఎవరు ఇచ్చారనే అంవంతో పాటు కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున న ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. కస్టడీకి ఇవ్వాలన్న అబ్యర్థనపై సండ్ర అభ్యంతరం వ్యక్తం చేవారు. ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్ పై కూడా న్యాయస్థానంలో నేడు విచారణ జరగనుంది.

నేడు టిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్న డీఎస్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డీఎస్, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు

కడప:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వజయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

చిలకలగూడ కిడ్నాప్‌ ఘటనలో కొత్తకోణం

హైదరాబాద్‌:చిలకలగూడ కిడ్నాప్‌ ఘటనలో కొత్తకోణం వెలుగుచూసింది. కిడ్నాప్‌నకు గురైన అంజలి, లక్ష్మీ, నరసింహారావు, శ్రవణ్‌లు ఛీటింగ్‌ కేసులో నిందితులని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెప్పారు. ఓ కేసులో వారిని అదుపులోకి తీసుకున్నామని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెప్పారు. దీంతో కిడ్నాప్‌ అయ్యారనే మిస్టరీ వీడింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు సత్తయ్య మృతి

గుంటూరు:అమృతలూరు మండలం కోడితాడిపర్రులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు సత్తయ్య మృతి చెందాడు. ఆలయ భూముల వేలంను నిరసిస్తూ రెండు రోజుల క్రితం రైతు సత్తయ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 350 గ్రాముల బంగార పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి నుంచి 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

08:34 - July 8, 2015

యూపీఏ హయాంలో కుంభకోణాలకంటే వ్యాపం కుభకోణం ప్రమాదకరమైందని, దీనిపై ప్రధాని మోడీ మౌనం వీడాలని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో అన్నారు. వ్యాపం కుంభకోణం అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న 48 మంది చనిపోయారు. వ్యాపం కుభకోణం పై సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదు? సుప్రీం కోర్టు పర్యవేక్షణలోసీబీఐ విచారణ జరిగితే కొన్ని విషయాలు అయినా బయటకు వస్తాయని తెలిపారు. మరో వైపు తెలంగాణ లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వాయిదా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టిడిపి ఎంపీల స్పందన వంటి అంశాలపై నాగేశ్వర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వినాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:07 - July 8, 2015

హైదరాబాద్:నేటి నుంచి తెలంగాణలో జరగాల్సిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. అనుమతులు కోల్పోయిన కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీలను కూడా చేర్చాలని జేఎన్ టీయూ ని కోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టులో అప్పీల్‌ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధమయింది.                                                         
ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైకోర్టులో ఊరట ....
జేఎన్టీయూ వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజీ వాదనల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జేఎన్‌టీయూ అనుబంధం రద్దు చేసిన 25 కాలేజీలతో పాటు కోర్సులను రద్దు చేసిన మరో 35 కాలేజీలు యూనివర్సీటి తీరును తప్పుపడుతూ హైకోర్టును ఆశ్రయించాయి. జేఎన్‌టీయూ పరిధిలో మొత్తం 290 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. 45 కాలేజీలు తాము నడపలేమని స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. మరో 25 కాలేజీల్లో వసతులు సరిగ్గా లేవని జేఎన్‌టీయూ రద్దు చేస్తూ 220 కాలేజీలకు వెబ్ ఆప్షన్స్‌లో అనుమతినిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ.. రద్దయినా 25 కాలేజీలు.. కోర్సులను తొలగించిన మరికొన్ని కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి.
జెఎన్‌టీయూ తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణ రెడ్డి వాదనలు .....
జెఎన్‌టీయూ తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణ రెడ్డి వాదనలు వినిపించారు. ఐదేళ్లుగా ఈ కాలేజీలు ఏఐటిఈసీ నిబంధనలు పాటించడం లేదని లెక్కలు చూపించారు. గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లి.. తాత్కాలిక అనుమతి తీసుకొచ్చారని, ఆ తర్వాత మళ్లీ నిబంధనలు పాటించలేదని తెలిపారు. తనిఖీల పేరుతో యూనివర్శిటీ ఇబ్బందులకు గురి చేస్తోందని ఇంజనీరింగ్‌ కాలేజీల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోసారి తనీఖీలు నిర్వహించి.. నివేదిక ఇవ్వాలని ఆదేశం....
ఇరు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రద్దయినా కాలేజీలన్నింటికి అవకాశం కల్పించాలని అదేశించింది. మరోసారి తనీఖీలు నిర్వహించి.. నివేదిక సమర్పించాలని జేఎన్‌టీయూకు అదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కాలేజీలన్నీ రెండవ దఫా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా హైకోర్టు తాజా తీర్పుతో 25 కళాశాలల్లో కౌన్సిలింగ్‌కు మార్గం సుగమమైంది.
కౌన్సెలింగ్‌ వాయిదా
అయితే కోర్టు తీర్పుతో నేటినుంచి జరగాల్సిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. అంతేగాక కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. దీంతో త్వరలోనే కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 

08:02 - July 8, 2015

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రసుత్త పరిణామాలపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కామెంట్లలో స్పష్టత లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు 'న్యూస్ మార్నింగ్' చర్చలో అన్నారు. తెలంగాణ లో టిడిపి ని లేకుండా చేయాలని టిఆర్ ఎస్ చూస్తోందా? టిఆర్ ఎస్ కుట్రలో భాగంగానే సండ్ర, రేవంత్ లు అరెస్టు అయ్యారా? ఓటుకు నోటు కేసు బలహీనమౌతోందా? కేసీఆర్ తో పవన్ కల్యాణ్ కాళ్ల బేరానికి వచ్చారా? వంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈచర్చలో సీతారమారాజు తో పాటు తాడూరి శ్రీనివాస్ టిఆర్ ఎస్, దయాకర్ రెడ్డి టి.కాంగ్రెస్ నేత, రాజేంద్ర ప్రసాద్ టిడిపి ఎమ్మెల్సీ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో వినాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

07:57 - July 8, 2015

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ గర్జించే సింహం అని..సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకి ఆర్థం లేదన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది..సారీ పిల్లిలా మాట్లాడుతోంది అని పవన్ ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు. సింహంలాంటి పవన్ కి నా విన్నపం ఒకటే పిల్లిలా ఉండకండి, అభిమానులు మీ నుంచి పులి గర్జనలు కోరుకుంటున్నారని తెలిపారు. మేకకి, మోక్కకి తేడా తెలియని సింహం సింహం కాదు అని వర్మ అన్నారు. ఇంకా ఏమన్నారంటే...సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి..తన గర్జనలో అంతరార్ధం కుక్కలకు వివరించకూడదు..సింహం జూ లో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు..కానీ కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయగలదని..సింహం గర్జనలో అర్ధం వెతకడం కుక్కల మోరుగుల్లో లాజిక్ వెతకడం లాంటిది..పవన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉండాలని ఆశిస్తున్నాను అని వర్మ ట్విట్ చేశారు.

గోదావరి పుష్కరాలకు 114 ప్రత్యేక రైళ్లు...

హైదరాబాద్:గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ మార్గాల్లో మరో 114 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు.

విశాఖలో ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అపశృతి

హైదరాబాద్: విశాఖలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి పరుగుపందెంలో సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. సొమ్మసిల్లి పడిపోయిన అభ్యర్థి పొన్నాడ వీరబాబుగా గుర్తించారు.

వంతెన పై నుంచి కారు బోల్తా:ఇద్దరి మృతి

గుంటూరు: ఒంగోలునుండి హైదరాబాద్ వెళ్తున కారు దాచేపల్లి మండలం పొందుగల వద్ద అదుపు తప్పి వంతెనపై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... ఒకరికి గాయాలయ్యాయి.

పీఎస్ ఎల్ వీ సీ-28 కౌంట్ డౌన్

నెల్లూరు:పీఎస్‌ఎల్‌వీ సీ-28 రాకెట్ ప్రయోగ కౌంట్‌డౌన్ ఈ ఉదయం 9.28 గంటలకు ప్రారంభంకానుంది. శుక్రవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శార్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఐదు వాణిజ్య శాటిలైట్లను ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన శాటిలైట్ల ప్రయోగం ఇదే. రాకెట్ ప్రయోగ నేపథ్యంలో శ్రీహరికోట షార్‌సెంటర్‌లో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు.

07:07 - July 8, 2015

తిరుపతి:టిటిడి మరో వివాదాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని.. మరోసారి అభాసుపాలవుతోంది. మైనార్టీ విద్యార్థులపై వివక్ష చూపడంపై సర్వత్రా విమర్శలు పెల్లుబికుతున్నాయి. టిటిడి కి చెందిన విద్యాసంస్థల్లో హిందూయేతర విద్యార్థులకు అడ్మిషన్లను నిలిపివేయడంతో వివాదం తలెత్తింది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో ఇలాంటి వివక్షను సహించేదిలేదని మైనార్టీ సంఘాలు ఏకమయ్యాయి.
తిరుపతిలో టీటీడీకి అనేక విద్యా సంస్థలు.....
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. టిటిడి కి తిరుపతిలో అనేక విద్యాసంస్థలున్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, జూనియర్ కళాశాలు, గోవింద రాజస్వామి ఆర్ట్స్ కళాశాల, పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలున్నాయి. అంతేకాదు.. పాలిటెక్నిక్, ఓరియంటల్, సంగీత కళాశాలలు, పాఠశాలలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ విద్యాసంస్థల్లో అన్ని మతాల, కులాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. కేవలం నామమాత్రపు అడ్మిషన్ ఫీజు మినహా టీటీడీ విద్యా సంస్థల్లో అదనపు ఫీజులు వసూలు చేయరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ విద్య అంతా ఉచితమే. ఈ కారణంగానే ప్రతి ఏడాది వీటిలో అడ్మిషన్లకు విపరీతమైన పోటీ ఉంటుంది.
మైనార్టీ విద్యార్థులకు హాస్టల్లో ప్రవేశం నిషేధం....
టీటీడీ విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్‌లో రెండేళ్ల క్రితం మైనార్టీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అన్యమత ప్రచార నిరోధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో టీటీడీ ప్రకటించింది. దీనిపై మైనార్టీ సంఘాలు ఉద్యమించినా టీటీడీ వెనక్కు తగ్గలేదు. ఈ వివాదం మర్చిపోకముందే తాజాగా టీటీడీ పెద్దలు మరో వివాదానికి తెరలేపారు. టీటీడీ కళాశాల, పాఠశాల్ల్లో హిందూయేతర విద్యార్థులకు ఏకంగా అడ్మిషన్లు నిలిపివేశారు. ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు కాల్‌ లేటర్లు పంపి, తీరా ఇంటర్వ్యూ సమయంలో సీట్లు ఇవ్వమంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లిం, క్రిస్టియన్‌ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. టీటీడీ చర్యలపై ముస్లిం పెద్దలు మండిపడుతున్నారు.
టీటీడీ జేఈవో నుంచి ఆదేశాలు....
ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను వివరణ కోరగా.. టీటీడీ జేఈవో నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో మైనార్టీ విద్యార్థులకు అడ్మిషన్లను నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎప్పటిలానే తమ పిల్లలకు టీటీడీ విద్యాసంస్థల్లో సీట్లు ఇవ్వకుంటే న్యాయ పోరాటం చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదాన్ని సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. 

07:03 - July 8, 2015

హైదరాబాద్‌: నగరంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది ముగిసింది. ప్రతి ఏడాది శీతాకాలంలో విడిదికి విచ్చేసే రాష్ట్రపతి ఈసారి వర్షాకాలంలోనే వచ్చారు. హాయిగా గడిపేందుకు నగరానికి వచ్చిన ప్రణబ్‌కు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నేతలు సమస్యలతో స్వాగతం పలికారు. రాష్ట్రపతిని కలిసిన అనేక మంది నేతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
10 రోజులపాటు కళకళలాడిన రాష్ట్రపతి భవన్....
హైదరాబాద్‌ బొల్లారంలో రాష్ట్రపతి భవన్‌ 10 రోజులపాటు కళకళలాడింది. విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జూన్‌ 29న నగరానికి విచ్చేశారు. ప్రణబ్‌ ముఖర్జీకి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు.
రాజ్‌భవన్‌ విందు......
రాష్ట్రపతి ప్రణబ్‌ రాక సందర్బంగా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరు కావాల్సి ఉన్నప్పటికి.. అనారోగ్యం హాజరుకాలేకపోయారు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలతో ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చర్చిస్తారని అందరూ భావించినప్పటికీ అది సాధ్యపడలేదు.
తిరుమలకు ప్రణబ్‌....
ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన ప్రణబ్‌కు అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రణబ్‌కు తీర్ధప్రసాదాలు అందించారు. అదేవిధంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ దర్శించుకున్నారు. ప్రణబ్‌తో పాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించారు.
ఇక రాష్ట్రంలోని సమస్యలపై....
ఇక రాష్ట్రంలోని సమస్యలపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారంపై ప్రణబ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలోని సమస్యలను దాదా దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు తెలిపారు. అదేవిధంగా ప్రణబ్‌ముఖర్జీని తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజాపరిస్థితులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని నేతలు ప్రణబ్‌ను కోరారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని తెలంగాణ మండలాలు ఏపీలో కలిశాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతిని కలిసి విన్నవించారు. తన నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని.. అందుకు తనకు ఏపీ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం కూడా కల్పించాలని కోరారు.
ప్రణబ్‌ను ఏపీ కాంగ్రెస్‌ నేతలు, ఏపీ మంత్రులు.....
ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ను ఏపీ కాంగ్రెస్‌ నేతలు, ఏపీ మంత్రులు కూడా విడివిడిగా కలిశారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా అనేకమంది ప్రముఖులు కూడా ప్రణబ్‌ను కలిసినవారిలో ఉన్నారు. నగరంలో దాదాపు 10 రోజులు గడిపిన ప్రణబ్‌ ముఖర్జీ.. వర్షాకాల విడిది ముగించుకుని నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. 

06:58 - July 8, 2015

హైదరాబాద్: జపాన్‌ పర్యటన రెండో రోజు ఏపీ బృందం... జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యింది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ నుంచి కూడా ఆహ్వాన లేఖ వస్తుందని తెలిపారు. తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, స్వామి వారి లడ్డూ ప్రసాదాలు బహూకరించారు. పలువురు జపాన్‌ మంత్రులతోనూ ఏపీ బృందం సమావేశమైంది. ఏపీ రాజధాని అభివృద్ధి, నిర్వహణ సంస్థతో ఈక్విటీ భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు.. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యోచి మియజవా తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే.. పూర్తి స్థాయి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం... అమరావతి శంకుస్థాపనకు జపాన్‌ ప్రధానితో పాటు రావాలని విజ్ఞప్తి చేశారు.
మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో భేటీ....
పలు బ్యాంకు ప్రతినిధులతోనూ ఏపీ బృందం వరుసగా సమావేశమైంది. ముందుగా మిజుహో బ్యాంక్ ప్రతినిధులను కలిశారు. మిజుహో బ్యాంక్ జపాన్‌లో నూరేళ్ల చరిత్ర వున్న అతి ప్రాచీనమైన, రెండో అతిపెద్ద బ్యాంక్. ఏపీ రాజధాని అమరావతిలో ఆ బ్యాంక్ శాఖను ఏర్పాటు చేసి... ఈ శాఖను భారతదేశానికి కేంద్ర కార్యాలయంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మిజుహో బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
సాప్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధులతో సమావేశం....
బ్యాంక్‌ ఆఫ్‌ టోక్యో, మిత్సుబిషి, సాప్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధులతోనే ఏపీ బృందం సమావేశమైంది. ఏపీలో సోలార్ ప్యానళ్ల తయారీని చేపట్టబోతున్నట్లు... సాప్ట్‌ బ్యాంక్ ఛైర్మన్ మసయోషి సోన్‌ వెల్లడించారు. త్వరలోనే 20 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పనున్నట్లు వివరించారు. సోలార్ పవర్‌పై స్పెషలైజేషన్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించటానికి సిద్ధంగా వున్నట్లు చెబుతూనే... ఏపీలో నెలకొల్పనున్న సంప్రదాయేతర ఇంధన వనరుల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తామని మసయోషి ప్రకటించారు.
జపాన్‌లో వున్న ప్రవాసాంధ్రులతో ఏపీ బృందం.....
అనంతం జపాన్‌లో వున్న ప్రవాసాంధ్రులతో ఏపీ బృందం సమావేశమైంది. సుమారు 500మందిని ఒకేచోట కలిసి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
జపాన్, ఏపీ సంబంధాల బలోపేతానికి టాస్క్‌ఫోర్స్‌....
జపాన్, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు... ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్‌లో జైకా, జెట్రో, జేబీఐసీ, నెడో తదితర సంస్థలు వుంటాయని తెలిపారు. ఆరు నెలలకు ఓసారి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగేలా కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. 

06:55 - July 8, 2015

హైదరాబాద్:రాజకీయ దుమారం రేపిన పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ఏపీ పార్లమెంట్ సభ్యులు గట్టిగానే సమాధానమిచ్చారు. పార్లమెంట్ సభ్యులు వ్యాపారం చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. చిరంజీవి కూడా కాంగ్రెస్ ఎంపీ అని... ఆయన వ్యాపారాలు చేయడం లేదా అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ సహా ఎవరైనా మంచి సలహాలిస్తే స్వీకరిస్తామని..ఎంపీల పనితీరును నియోజకవర్గ ప్రజలే చెప్తారని పేర్కొన్నారు.
ఎంపీ కేశినేని తనదైన శైలిలో పవన్‌కు కౌంటర్‌.....
ఇక విజయవాడ ఎంపీ కేశినేని తనదైన శైలిలో పవన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. సెక్షన్‌ 8 వద్దని పవన్‌ ఎలా చెబుతారు? హైదరాబాద్‌లో ఏపీ ప్రజల కష్టాలు ఆయనకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం, మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తుంటే సెక్షన్‌ 8 వద్దంటారా అని మండిపడ్డారు. విభజన చట్టంలో సెక్షన్‌ 8 సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హక్కు అని స్పష్టం చేశారు నాని. తెలంగాణలో సినిమాలు ఆడించుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్‌ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
విభజన చట్టం అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం:కొనకళ్ల
ఏపీకి రావాల్సిన నిధులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తూనే ఉన్నామన్నారు ఎంపీ కొనకళ్ల నారాయణ. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు. మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ ఎంపీలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామన్న ఆయన.. విభజన వల్ల ఏర్పడిన నష్టాలను పూరించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. మిత్రపక్షమని జనసేనాని వ్యాఖ్యలపై ఇన్నాళ్లూ ఆచితూచి స్పంచిందిన టీడీపీ నేతలు.. తాజాగా సంధించిన వాగ్భాణాలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

06:52 - July 8, 2015

హైదరాబాద్:తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్నా.. ఎలాంటి పురోగతి లేదు. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె యాథావిధిగా కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.
కనీస వేతనం రూ.14,170 చెల్లించాలని డిమాండ్‌....
తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో కొనసాగుతున్నారు. తమకు కనీస వేతనం 14 వేల 170 రూపాయలు చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోవాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
గతంలో సమ్మెను వాయిదా వేసిన కార్మిక సంఘాలు.....
గత నెల 25నే కార్మికులు సమ్మెకు సిద్ధమైనప్పటికీ తమకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో సమ్మెను వాయిదా వేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్లాయి. కానీ, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మున్సిపల్‌ కార్మిక సంఘాల నేతలో ప్రభుత్వ తరపున మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఈటల రాజేందర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్చలు జరిపారు. అయితే చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె విరమించేందుకు కార్మిక సంఘాలు అంగీకరించలేదు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘ నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
సమ్మెలో 40 వేలమంది కార్మికులు........
తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రోడ్లు అధ్వానంగా మారాయి. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదలజల్లుతోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరోసారి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి.. వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మొత్తంగా సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె ఆపేది లేదంటున్నారు మున్సిపల్‌ కార్మికులు. 

06:49 - July 8, 2015

హైదరాబాద్: మధ్యాహ్న భోజనం ప్రయివేట్‌ ఏజెన్సీల గుప్పెట్లోకి వెళ్తోందా? మధ్యాహ్న భోజనంతో కార్పొరేట్‌ సంస్థల బొజ్జలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారా? మధ్యాహ్న భోజనం పథకంలో ఏం జరుగుతోంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజనం వర్కర్ల యూనియన్‌ నేత స్వరూపరాణి పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరు వినాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

06:45 - July 8, 2015

 హైదరాబాద్: మధ్యాహ్న భోజనాన్ని తమకు కావాల్సినవారికి, కార్పొరేట్‌ ప్రభువులకీ కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు వ్యూహ రచన చేస్తున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనాన్ని ఇస్కాన్‌ సంస్థకు అప్పగించడం తీవ్ర వివాదస్పదమైంది .
కొన్ని పథకాలు ప్రభుత్వాల కీర్తి ప్రతిష్టలను పెంచుతుంటాయి...
కొన్ని పథకాలు ప్రభుత్వాల కీర్తి ప్రతిష్టలను పెంచుతుంటాయి. కానీ, ఆయా పథకాల విజయవంతానికి కృషి చేస్తున్న సిబ్బంది విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ ప్రభుత్వ స్కూళ్లల్లోని మధ్యాహ్న భోజన పథకమే. ఈ పథకం మన దేశంలో ప్రతి రోజూ దాదాపు 12 కోట్ల మంది పిల్లలకు పిడికెడు అన్నం పెడుతోంది. ఈ పథకమే లేకపోతే వీరిలో ఎంతమంది పిల్లలు చదువులకు దూరమయ్యేవారో?. ఆకలితో నకనకలాడేవారో?. న్యాయస్థానంలో పౌరహక్కుల సంఘాలు సాగించిన పోరాటాల కారణంగా వచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. మన దేశంలో 12 లక్షల 65వేల స్కూళ్లల్లో ఇది అమలవుతోంది. ఈ పథకానికి కేంద్రం 75శాతం నిధులిస్తే, 25శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి వుంటుంది. బడికెళ్లని పిల్లలను బడిలోకి ఆకర్షించడం, మధ్యలోనే చదువుమానేసివారి సంఖ్యను తగ్గించడం, బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించడం లాంటి ఉదాత్త ఆశయాలతో ప్రారంభించిన పథకమిది. ఈ పథకం అమలులో ఎన్ని లోపాలున్నప్పటికీ గత పదేళ్లలో అనేక సానుకూల మార్పులొచ్చాయి. కరువు, దుర్భిక్షంతో అల్లాడే ప్రాంతాల్లో సైతం విద్యార్థుల డ్రాపవుట్స్‌ తగ్గడం ఓ సంతోషకర పరిణామం.
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఎన్నో ఉత్తమ ఫలితాలు....
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధించిన మధ్యాహ్న భోజన పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదనడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనం. అన్నం, పప్పు, కూర, సాంబారు, కోడిగుడ్డు, అరటి పండు అంటూ నోరూరించే మెనూ ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి కనీసం అయిదు రూపాయలైనా కేటాయించడం లేదు. ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి కేవలం నాలుగు రూపాయల ముప్పై పైసలు చొప్పున ఇస్తోంది. పప్పు, ఉప్పు, కారం, నూనె, కట్టెలు ఇలాంటివన్నీ వీటితోనే సరిపుచ్చాలి. వారానికి రెండుసార్లు కోడిగుడ్డు కూడా ఈ డబ్బులతో కొనుక్కురావాలి. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా విద్యార్థులకు కేటాయించే మొత్తాలు పెంచకపోతే పోషక విలువలున్న నాణ్యమైన భోజనం పెట్టడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వాలకే తెలియాలి. ఇక కేంద్రం తన వంతుగా సరఫరా చేసే గోధుమలు, బియ్యం అత్యంత అధ్వాన్నంగా వుంటున్నాయి. . ముక్కిపోయి, పురుగులు పట్టిన దొడ్డుబియ్యం, పుచ్చిపోయిన గోధుమలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆహార గిడ్డంగుల సంస్థ సరఫరా చేస్తోంది. ఎఫ్‌సీఐ సరఫరా చేసే బియ్యం, గోధుమలు ఒక్కొక్కసారి పశువులు కూడా ముట్టడం లేదన్న ఫిర్యాదులున్నాయి.
పథకం అమలులోకి వచ్చి పదేళ్లయినా.....
మధ్యాహ్న భోజన పథకం అమలులోకి వచ్చి పదేళ్లయినా అత్యధిక స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ సమకూర్చకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 67శాతం స్కూళ్లలో కనీసం వంట గదులైనా నిర్మించలేదంటే ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎంత మొక్కుబడిగా నడుపుతున్నాయో అర్ధమవుతోంది. దీంతో చెట్ల కింద, గోడల వెంట, సెప్టిక్‌ ట్యాంక్ లపక్కన , మురుగు కాలువల పక్కన పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో మధ్యాహ్న భోజనం వండి, వడ్డించాల్సిన దుస్థితి అనేక స్కూళ్లలో కనిపిస్తోంది. అపరిశుభ్ర వాతావరణంలో భోజనాలు వండి పెడితే, అవితిన్నవారి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుండడమే కలవరపెడుతోంది.
వంట గదులే కాదు స్టోర్‌ రూమలూ లేవు.....
వంట గదులే కాదు స్టోర్‌ రూమలూ లేవు. వంట సామ్రగి, సరుకులు భద్రపరచడానికి ప్రత్యేక ఏర్పాట్లేవీ లేని దుస్థితి అనేక స్కూళ్లలో కనిపిస్తుంది. దీంతో హెడ్మాస్టర్ల రూమ్‌ లోనో, ఆఫీసు రూంలోనో వీటిని ఓ మూలన పడేయాల్సి వస్తోంది. మరో ముఖ్యమైన విషయం నీళ్లు...... మధ్యాహ్న భోజన పథకంలో ఆహార పదార్థాలతో పాటు మరో ముఖ్యమైన విషయం నీళ్లు. చాలా స్కూళ్లలో వంట చేయడానికి, పిల్లలు తాగడానికి కనీసం మంచినీళ్లు దొరకవు. ట్యాంక్‌లు శుభ్రం చేయించరు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 16వేలకు పైగా స్కూళ్లలో మంచినీటి సౌకర్యం లేకపోవడం ఓ ప్రమాద సంకేతం.
అననుకూలతల మధ్య ఈ పథకం విజయవంతంగా....
ఇన్ని అననుకూలతల మధ్య ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందంటే అందుకు ఏకైక కారణం మధ్యాహ్న భోజనం వర్కర్లు ప్రదర్శిస్తున్న వృత్తి నిబద్దతే. అయితే, వీరి సమస్యలు తీర్చి, ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి బదులుగా మధ్యాహ్న భోజనాన్ని కార్పొరేట్‌ సంస్థల, బడా నాయకుల, స్వచ్ఛంద సేవ పేరుతో వ్యాపారాలు సాగించే సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు కొంతకాలంగా వ్యూహరచన చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కోట్ల మంది పిల్లల జీవితాలతో ముడిపడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రయివేట్‌ సంస్థల, ఏజెన్సీల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం ఎంత వరకు న్యాయం.

చిలకలగూడలో కిడ్నాప్ కలకలం

హైదరాబాద్: చిలకలగూడలో కిడ్నాప్ కలకలం రేగింది. క్రైం బ్రాంచ్ పోలీసుల పేరుతో నలుగురిని కిడ్నాప్ చేశారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కిడ్నాప్ కు గురైన బంధువులు ఆందోళన చెందుతున్నారు.

మూడో రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

హైదరాబాద్:తెలంగాణలో మూడో రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా చెత్త పేరుకుపోయింది. రంజాన్ నేపథ్యంలో సమ్మె విరమించాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు.

మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బంధువు నివాసంలో భారీ చోరీ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బంధువు నివాసంలో భారీ చోరీ జరిగింది. కోటి రూపాలయ విలువైన బంగారు ఆభరణాలను దుండగులు దోచుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మళ్ళీ వాయిదా పడింది. జేఎన్టీయూ అఫిలియేషన్ నిరాకరించిన ఇంజినీరింగ్ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు మంగళవారం ఆదేశించగా.. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అప్పీలు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు.

Don't Miss