Activities calendar

09 July 2015

చురుగ్గా పుష్కరాల ఏర్పాట్లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి పేర్కొన్నారు. పుష్కరాలకు 6-8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

నల్గొండ : జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో నిఖిత (17) విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాసరలో ట్రిపుల్ ఐటీ చదువుతోంది. 

21:30 - July 9, 2015

హైదరాబాద్ : బాహుబలి..బాహుబలి..బాహుబలి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా వినిపిస్తున్న జక్కన్న జపం ఇది. సినీ ప్రేక్షకులు కళ్లలో లక్షల ఒత్తులేసుకుని మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వేల కోట్ల టర్నోవర్‌ నడిపిస్తున్న సినీ పరిశ్రమ జరగబోయే అద్భుతాన్ని చూడటానికి ఉత్కంఠతో చూస్తున్నారు. వెండితెరే ఆశ్చర్యపోయేలా బాహుబలి చిత్రం సెల్యూలాయిడ్‌ పైకి ఎక్కిందని చెప్పుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో బాహుబలి బలమెంతో అది ప్రేక్షకులను మైమరిపించే రేంజెంతో తేలిపోనున్నది. 4 వేల థియేటర్లు, 4 భాషలు, 250 కోట్ల బడ్జెట్‌, 25 కోట్ల శాటిలైట్‌ రైట్స్ అన్నీ రికార్డులే. ప్రేక్షకుల మనుసును ఏ మాత్రం మురిపించినా బాహుబలి బద్దలుకొట్టే రికార్డులకు హద్దే ఉండదు. మూడేళ్ల ఎదురుచూపుల తర్వాత ప్రేక్షకులముందుకొస్తున్న బాహుబలి తెరపై చూపులకు కరువవుతోంది. రికార్డ్ స్థాయి థియేటర్లలో బాహుబలి విడుదలవుతున్నా డిస్ట్రిబ్యూటర్ల అత్యాశకు టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కౌంటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోగా, వేల రూపాయలు పెట్టి బ్లాకులో కొనలేక ఆడియెన్స్ తిరుగుముఖం పడుతున్నారు.
కార్పొరేట్ బొమ్మ...
తెలుగు సినిమా ఖ్యాతిని దేశానికి చాటుతున్న బాహుబలి సొంత ప్రేక్షకులకు చేరువకాలేకపోతున్నాడు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల దురాశకు కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. జానపథ కశాంథంతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అరుదైన సినిమా కార్పొరేట్ బొమ్మగా మారిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, హిందీ, మళయాలం, ఓవరీస్ భాషల్లో విడుదలవుతున్న బాహుబలికి కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్ జరిగింది. ఈ అత్యధిక పెట్టుబడే ఇప్పుడు ప్రేక్షకులు పాలిట వారం పాటు శాపంలా మారుతోంది.
తెలంగాణలో భారీ డిమాండ్...
ముఖ్యంగా తెలంగాణలో బాహుబలికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నిర్మాత దిల్ రాజు 23 కోట్ల రూపాయలకు నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులకు తీసుకున్నారు. సుమార్ 400 థియేటర్లలో బాహుబలి రిలీజ్ చేస్తున్నారు. అయితే నైజాంలో పదిహేను కోట్ల రూపాయలే హయ్యెస్ట్ కలెక్షన్లు కాగా దిల్ రాజు దురాశకు తోడు ఇంత పెద్ద మొత్తం అతన్ని భయానికి గురి చేస్తోంది. దీంతో తన లీజులో ఉన్న థియేటర్లతో పాటు హైదరాబాద్ లోని మల్టిఫ్లెక్సుల్లో సగానికి పైగా టికెట్లను బ్లాక్ చేశాడు దిల్ రాజు. ప్రసాద్ ఐమాక్స్ లో లాంటి మల్టిఫ్లెక్సుల్లో అయితే ఏకంగా రోజుకు నాలుగు స్క్రీన్లు తమ స్పెషల్ షోలుగా తీసుకున్నారు. పోలీసులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇలా థియేటర్ల యాజమాన్యాలకున్న సవాలక్ష ఆబ్లిగేషన్స్ పోను కేవలం పదిశాతం టికెట్లు మాత్రమే కౌంటర్లలో అమ్ముతున్నారు.
పట్టుదలగా ఉన్న నైజాం బయ్యర్ దిల్ రాజు...
బాహుబలి శుక్రవారం విడుదలవుతుండగా శుక్ర, శని, ఆది వారాల్లో మూడు రోజుల్లోనే సగానికి పైగా పెట్టుబడి లాగేయాలని నైజాం బయ్యర్ దిల్ రాజు పట్టుదలగా ఉన్నాడు. అందుకే సగానికి పైగా టికెట్లను బ్లాక్ చేయడంతో పాటు షోలకు షోలు బుక్ చేసి వాటిని కార్పొరేట్ కంపెనీలకు టికెట్ వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇదీగాక హైదరాబాద్ లో దాదాపు 25 థియేటర్లలో బాహుబలి బెనిఫిట్ షోలు ఈ రాత్రి నుంచే ప్రదర్శితం కాబోతున్నాయి. వీటి ద్వారా ఇప్పటికే 2 కోట్ల రూపాయల ఆదాయం దిల్ రాజుకు దక్కింది. ఓ వైపు రిలీజ్ కు ముందే రిటర్న్స్ వస్తున్నా ఈ నిర్మాతను ఆశ బాగా తొందరపెడుతోంది.
బాహుబలి విషయంలో దిల్ రాజు దురాశ...మల్టిఫ్లెక్సులతో వివాదానికి దారి తీస్తోంది. బాహుబలి ప్రదర్శనకు సిద్ధమవుతున్న మల్టిఫ్లెక్సులు కార్పొరేట్ షోలు వేసుకునేందుకు పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఇలాంటి షోలు వేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ గా తనకే హక్కుందంటూ మల్టీ ఫ్లెక్సులు తనకు చెప్పకుండా షోలు వేయొద్దంటూ లెటర్ లు పంపించాడు దిల్ రాజు. కొన్ని మల్టిఫ్లెక్సులు దిల్ రాజు లెటర్లను తిరస్కరించగా మరికొన్ని అంగీకరించాయి. బయ్యర్ల వైఖరిని ప్రభాస్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బ్లాక్ చేసిన టికెట్లను తిరిగి ఇవ్వకుంటే తగిన పాఠం చెబుతామంటున్నారు.
డబ్బున్న వాళ్లకేనా ?
భారీ బడ్జెట్ తో సినిమా చేసినా అత్యధిక సొమ్ముతో ప్రదర్శన హక్కులు కొనుక్కున్నా బాహుబలిని తమకు దూరం చేయడాన్ని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లుగా సినిమా కోసం ఎదురు చూస్తున్న బాహుబలి డబ్బున్న వాళ్లకేనా అంటున్నారు. ప్రస్తుతం మల్టీఫ్లెక్సులతో పాటు సాధారణ థియేటర్లలోనూ వారం రోజులు పాటు బాహుబలి చూసే అవకాశం లేనట్లే.

21:23 - July 9, 2015

హైదరాబాద్ : మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మూడోసారీ విఫలమయ్యాయి. సమస్యను వాయిదా వేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో పరిష్కారం కావటం లేదు. ఇప్పటికే అనేకసార్లు వాగ్దానభంగం జరగటంతో ఈసారి పక్కాగా సెటిల్‌ చేస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు గల్లిగల్లికీ తిరిగిన ముఖ్యమంత్రి, మంత్రులు.. కోట్లకు కోట్లు బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించిన అమాత్యులు మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు కదలటం లేదు. చర్చలంటూ పిలిచి రంజాన్‌ పండగ ఇబ్బందులవుతాయని ఏకరువు పెట్టడమే తప్ప అసలు సమస్య తేల్చటం లేదు. కార్మిక యూనియన్లు మాత్రం డిమాండ్‌ నెరవేరిస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పాయి. 11వ తేదీ ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగసభలో ప్రజలకు తమ సమస్యలను వివరిస్తామంటున్నాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం..
ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి ముందుకు రాని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతోంది. ఇతర డిపార్ట్ మెంట్లలోని కార్మికులను దీనికి వాడతామంటోంది. ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వం కార్మికులకు వాగ్దానం చేసి అమలు చేయకపోవడంతో.. పక్కాగా జీవో ఇస్తామంటేనే ఈసారి సమ్మె విరమిస్తామని యూనియన్లు చెబుతున్నాయి. 

21:20 - July 9, 2015

హైదరాబాద్ : ఏపీలో యాక్షన్‌కు తెలంగాణలో రియాక్షన్‌ ఎదురవుతోంది. ఇటు తిరిగి అటు తిరిగి తెలంగాణ తమ్ముళ్లను ఇరకాటంలో పడేస్తోంది. చంద్రబాబు వైఖరి ఏం సమాధానం చెబుతారోనని నిలదీసేలా చేస్తోంది. తాజాగా పాలమూరు వ్యవహారం రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాల మధ్య వైరాన్ని మరింత పెంచుతోంది.
మహబూబ్‌నగర్‌ జిల్లా బంద్‌ పిలుపు..
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అగ్గిరాజేస్తోంది. ఇప్పటికున్న జలజగడాలకుతోడు ఇది కొత్తగా తోడవుతోంది. పాలమూరు ప్రాజెక్టు అక్రమమంటూ సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖ రాశారంటూ పాలమూరులో టీఆర్ఎస్‌ నేతలు రోడ్డెక్కారు. ఏపీ సీఎం తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. శుక్రవారం నాడు మహబూబ్‌నగర్‌ జిల్లా బంద్‌కు పిలుపిచ్చారు. ప్రజలు, విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌ను సక్సెస్‌ చేసి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రాజెక్టు కట్టి తీరతామన్నారు పాలమూరు జిల్లా నేతలు.
దత్తత తీసుకుని ఏం చేశారని బాబుకు ప్రశ్నలు..
పాలమూరు ప్రాజెక్టు కొత్తదేమీ కాదంటున్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అన్ని అనుమతులు లభించాయంటున్నారు. డిండి ప్రాజెక్టుకు సైతం 2008లోని గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందంటున్నారు. 8 ఏళ్లు దాటినా పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఫిర్యాదుకు ధీటుగా సీడబ్య్లూసీకి సమాధానమిచ్చామన్నారు హరీశ్‌. కృష్ణాబోర్డు ఆదేశాల ప్రకారం రాష్ట్ర వాటా 299 టీఎంసీల నీటిని ఎక్కడైనా ఎలాగైనా వాడుకునే హక్కు తెలంగాణకు ఉదంటున్నారు. పాలమూరును అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గతంలో 9 ఏళ్లు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న బాబు వలసల కేంద్రంగా మార్చారని ఫైరయ్యారు హరీశ్‌.
వచ్చే నెలలో పాలమూరుకు టెండర్లు, అథారిటీ..
మూడో పంటకు నీటికోసం పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినా తాము మానవత్వంతో ఉన్నామన్నారు తెలంగాణ అధికారపక్షం నేతలు. వలసల జిల్లాకు ఒక్కపంటకు నీరు అవసరం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు తాగునీరు అవసరం లేదా అని నిలదీశారు. ప్రపంచంలో ఎవరైనా తానున్న ప్రాంతానికి నీళ్లు తీసుకురావద్దంటారా అంటూ చంద్రబాబుకు హరీష్ చురకలంటించారు. పాలమూరు ప్రాజెక్టు పనుల కోసం వచ్చేనెలలో టెండర్లు పిలుస్తామన్న తెలంగాణ ప్రభుత్వం. భూసేకరణ కోసం అథారిటీ ఏర్పాటు చేస్తామంది. పాలమూరు ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా పనిచేస్తామంది.

21:16 - July 9, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మొదటి రోజుల కస్టడీ ముగిసింది. ఉదయం చర్లపల్లి నుండి తీసుకొచ్చిన అధికారులు న్యాయవాది సమక్షంలో విచారించారు. ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఆ వర్షంలో సండ్ర మునిగారో తేలారో ఏసీబీ నివేదిక వచ్చాకే తెలుస్తోంది. ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్‌ ఇది తప్పుడు కేసంటూ ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారని.. తన ఫోన్‌లో ఏ సంభాషణ రికార్డు కాలేదని స్పష్టం చేశారు. టీడీ జనార్ధన్‌ టీడీపీ పార్టీ వ్యవహారాలు చూస్తారు కాబట్టే తాను కలిసినట్లు ఆయన వివరించారు. కావాలనే కేసును సృష్టించారని.. జగన్‌ కేసీఆర్‌ కుమ్మక్కై ఈ కుట్ర పన్నారని సెబాస్టియన్‌ ఆరోపించారు. సండ్ర కస్టడీ మరొక్కరోజే ఉండటంతో.. ఏసీబీ పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సండ్ర బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు ఏసీబీ కోర్టును గడువు కోరింది. కస్టడీ ముగిశాకే బెయిల్‌పై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

పవన్ ను కొంతమంది రెచ్చగొడుతున్నారు - సోమిరెడ్డి..

హైదరాబాద్ : పవన్ ఆవేశ పరుడే కాని వ్యక్తిగా మంచివాడని ఎమ్మెల్సీ సోమిరెడ్డి పేర్కొన్నారు. కానీ పవన్ ను కొంతమంది రెచ్చగొడుతున్నారని, ఇద్దరు వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే చిరంజీవి కాంగ్రెస్ లో కలిశారన్నారు. రాంగోపాల్ వర్మ మనుషుల భాష కాకుండా జంతువుల భాష మాట్లాడుతున్నారని, ట్విట్టర్ లో వర్మ సలహాలు పిచ్చి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ఇంకా సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తున్నారని, బాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడం సరికాదన్నారు. 

పాడేరు ఎస్ బీఐ బ్యాంకులో నకిలీ నోట్లు...

విశాఖ : పాడేరు ఎస్ బీఐ బ్యాంకులో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. రూ.35,500 నకిలీ నోట్లు డిపాజిట్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. బ్యాంకు సిబ్బంది గుర్తించడంతో ఆ వ్యక్తి పరారయ్యాడు. అనంతరం బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రెవెన్యూ సిబ్బంది చర్చలు సఫలం..

హైదరాబాద్ : రెవెన్యూ సిబ్బందితో సీఎస్ రాజీవ్ శర్మ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. భూ పరిపాలన కమిషనరేట్ కార్యాలయంలో ఈ చర్చలు జరిగాయి. రెవెన్యూ సిబ్బంది డిమాండ్లపై సీఎస్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా రెవెన్యూ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ లేఖ..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ పాలమూరు ఎత్తిపోతల పథకంపై లేఖ రాసింది. పాలమూరు ఎత్తిపోతల అంశంలో నిబంధనలను ఉల్లంఘించలేదని 2013లోనే ఈ పథకానికి పాలనాపరమైన అనుమతులు వచ్చాయని లేఖలో పేర్కొంది. 

ముగిసిన సండ్ర విచారణ..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తొలిరోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. చర్లపల్లి జైలు నుండి ఏసీబీ కార్యాలయానికి సండ్రను తీసుకొచ్చిన అధికారులు న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టారు. అనంతరం ఆయన్ని సిట్ కార్యాలయానికి తరలించారు. 

20:29 - July 9, 2015

హైదరాబాద్ : ప్రముఖ పిల్లల ఆసుపత్రి 'రెయిన్ బో' నాలుగో శాఖ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రారంభమైంది. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు ఈ ఆసుపత్రిని గురువారం ప్రారంభించారు. చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రెయిన్ బో గొప్ప పేరు తెచ్చుకుందని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి కితాబిచ్చారు. హైదరాబాద్ ను మెడికల్ హబ్ గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం పాటు పడుతుందని, కూకట్ పల్లిలో ఏర్పాటు కావడం స్థానికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కొనసాగిస్తున్న ఆన్ లైన్ విధానాన్ని ఆసుపత్రుల ఏర్పాటుకు వర్తింప చేస్తామన్నారు. తన కూతురు పుట్టింది ఈ ఆసుపత్రిలోనే అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

20:11 - July 9, 2015

విజయవాడ : ఎవరు ఏమైపోయినా ఫరవాలేదు.. మేము బాగుంటే చాలు.. అనుకునే రోజులివి.. ఇక ఉద్యోగంనుంచి రిటైర్ అయినవాళ్లయితే మరింత హ్యాపీగా రిలాక్స్ కావాలనుకుంటారు.. ఆ టీం మాత్రం అలా విశ్రాంతి తీసుకోలేదు.. ఓ వినూత్న ఆలోచనను అమల్లో పెట్టారు..విజయవాడ ఎస్‌బీఐ ఆఫీసర్స్ కాలనీ ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. తోటివారికి.. నిరుపేదలకు సహాయం చేసేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అదే వీధి అంగడి. ఓ అంతర్జాతీయ మ్యాగజిన్‌ కథనంతో స్ఫూర్తిపొందిన రామకృష్ణారావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. మరో 50 మందితో కలిసి ఈ స్టోర్స్ ను నడిపిస్తున్నారు.
స్ట్రీట్ స్టోర్స్ తో ప్రదర్శన..
సాధారణంగా కొన్ని వస్తువులు బాగానే ఉన్నా ఇంట్లో వినియోగించుకోకుండా పక్కన బెట్టేస్తూ ఉంటారు. ఇంట్లో ప్లేస్ సరిపోక అటకపై ఎక్కించేస్తారు. అలాంటి వాటిని సేకరించి పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు ఈ విశ్రాంత ఉద్యోగులు. తమకు తెలిసినవారందరికీ విషయం చెప్పారు. అలా తీసుకొచ్చిన వస్తువులను ప్రతినెల ఆఖరు ఆదివారం స్ట్రీట్ స్టోర్ పేరుతో ప్రదర్శనకు పెడుతున్నారు. ఇందులోని వస్తువులను ఎవరైనా ఉచితంగా తీసుకోవచ్చు.
విశేష స్పందన...
ఈ ప్రదర్శనకు నగరంలో విశేష స్పందన వస్తోంది... రెండునెలలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ స్ట్రీట్ స్టోర్స్ లో బట్టలు, వంటసామాన్లను చాలామంది తీసుకువెళుతున్నారని చెబుతున్నారు నిర్వాహకులు. వస్తువుల సేకరణతో పాటు తీసుకునే వాళ్ల కోసం కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తున్నామంటున్నారు. వీధి అంగడిగురించి తెలుసుకున్న దాతలు తమ వస్తువులను ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు. వృధ్యాప్యంలోనూ నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న ఈ ఉద్యోగులను అందరూ అభినందిస్తున్నారు.

20:10 - July 9, 2015

హైదరాబాద్ : ఆ పథకాన్ని జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అప్పుడు వీధి వీధిలో బ్యాండ్‌బజాయించి విస్తృత ప్రచారం చేసింది. కాని అది ఆ కొత్త ఊపులోనేనని ఇప్పుడు తేటతెల్లమైంది. అప్పుడు ఎంత అట్టహసంగా చేపట్టిందో ఇప్పుడు అంత నీరుగారుస్తోంది. కాదు కాదు నీరు గార్చింది కూడా. ఆ పథకంపై ఆధారపడ్డ వేలాది మంది ఇప్పుడు ఆకలిమంటతో ఆవేదన చెందుతున్నారు. భోజనామృత్. సరిగ్గా ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ విపరీత ప్రచారం చేసింది. నగరంలో అర్థాకలితో బతుకులీడుస్తున్న కొందరికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయలకే ప్లేటు భోజనం అనే ఈ పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రవేశపెట్టారు. అప్పుడు ఏ ఉద్దేశంతోనైతే ప్రారంభించారో ఇప్పుడది ఎప్పుడో కనుమరుగైంది.
ఇప్పుడు కేవలం అన్నం, పప్పు, నీళ్ల మజ్జిగ..
హైదరాబాద్ నగరంలో మొత్తం 34 భోజన కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో 300 మందికి భోజన సరఫరా చేసేవిధంగా అవకాశం కల్పించారు. ఈ పథకం ద్వారా పేదలకు, అర్ధాకలితో అలమటించే వారికి అతి తక్కువ ధరతో కడుపునింపుతామని అప్పుడు సర్కార్ భారీ ప్రచారం చేసిది. ఈ పథకం ప్రారంభమయిన కొత్తలో భోజనం కాస్త మంచిగా..రుచిగా ఉండేది. మొదట్లో అన్నం, పప్పు, కూర, చట్నీ, మజ్జిగ ఉండేది. రానురాను భోజనంలో నాణ్యత పూర్తిగా తగ్గింది. ఇప్పుడు కేవలం అన్నం, పప్పు, మజ్జిగ మాత్రమే అందిస్తున్నారు. అదీ కూడా పుచ్చిపోయిన పప్పుతోనే పప్పు చేస్తున్నారు. ఈ పథకంపై ఆధారపడ్డ పేదలు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఆకలి మంటకు మాత్రమే భోజనం చేస్తున్నామని చెబుతున్నారు. నగరంలోని చిక్కడపల్లిలో ఉన్న సిటీ సెంట్రల్‌ లైబ్రరీ. ఇక్కడ పోటీ పరీక్షలకు చదువుకోవడానికి వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. వారంతా మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తుంటారు. నాణ్యత లోపించిన భోజనాన్ని కూడా సరిపడినంతా పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాల హృదయంతో సర్కార్‌ చేపట్టిన ఈ పథకానికి కాంట్రాక్టర్‌లు, అధికారులు గండి కొడుతున్నారని విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు స్పందించి వెంటనే భోజనంలో నాణ్యత పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.

20:09 - July 9, 2015

హైదరాబాద్ : వచ్చే నెల నుంచి హెల్మెట్ లేనిదే రోడ్డెక్కారా ?అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడబోతోంది. పోలీసుల నుండి తప్పించుకుంటాం అంటారా ? అయితే సరే..మీకు ఫైన్ పడనుంది. పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నా ఇంటికి ఫైన్ నోటీసు వస్తుంది. గతంలో కాకుండా ఈసారి కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. వచ్చే నెల ఒకటినుంచి ఈ రూల్‌ను కఠినంగా పాటించేలా చర్యలు చేపట్టారు పోలీసులు. ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలతో ఎక్కువ మంది మృతి చెందారని పోలీసులు గుర్తించారు. హెల్మెట్లు ధరించి ఉంటే వారి ప్రాణాలు దక్కేవని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదాలపై వాహనదారుల్లో అవగాహన పెంచి హెల్మెట్ ధరించేలా చేయాలని చూస్తున్నారు.
హెల్మెట్ దుకాణాల వద్ద రద్దీ..
గతంలో హెల్మెట్‌ పెట్టుకోవాలన్న నిబంధన ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా వాహనదారుల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగే పోలీసుల చెకింగ్ టైంలోమాత్రం కొందరు హెల్మెట్ పెట్టుకొని ఆ తర్వాత తీసివేయడం చేశారు. మరికొంత మంది మాత్రం పోలీసులకు దొరక్కుండా వేరే దారిలో వెళ్లి తప్పించుకున్నారుఈసారి ఇలాంటి గిమ్మిక్కులు చెల్లవంటున్నారు పోలీసులు. భయంతో కాకుండా అవగాహనతో హెల్మెట్‌ ధరించేలా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై అవగాహన పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అప్పటికీ మారకపోతే భారీగా చలాన్ విధించేందుకు రంగంసిద్ధం చేస్తున్నారు. ఒకవేళ తప్పించుకున్నా వాహనాల నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఇంటికి ఫైన్ కట్టాలంటూ నోటీసులు పంపబోతున్నారు. హెల్మెట్ నిబంధన సమాచారంతో ఈ షాపుల దగ్గర క్యూ పెరిగింది. నిబంధనలు అమల్లోకొచ్చాక ధరలు పెరుగుతాయని ముందే కొనేస్తున్నారు వాహనదారులు.  

20:07 - July 9, 2015

హైదరాబాద్ : మీకు పుస్తకాలు చదవడమంటే ఇష్టమా ? ఏయే పుస్తకాలు కావాలో ఎంపిక చేసుకోండి. ధర గురించి బెంగే వద్దు. అవి ఎంత తూగితే అంతకే డబ్బు చెల్లించండంటూ పుస్తక విక్రయ కేంద్రాలు అందరికీ ఆహ్వనం పలుకుతున్నాయి. వినడానికి కొత్తగా ఉన్నా ... ప్రస్తుతం భాగ్యనగరంలో హల్ చల్ చేస్తోన్న నయా ధోరణి ఇది. ట్రెండ్ మారడంతో పుస్తక దుకాణాల్లో కొనుగోళ్లు మందగించాయి. ప్రముఖ బుక్ స్టాల్స్ మూతబడే స్థాయికి అమ్మకాలు తగ్గిపోయాయి. బిజినెస్ ఏదైనా నయా ట్రెండ్‌కు తగ్గట్లు మార్చుకుంటే సేల్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇదే పద్దతి ఫాలో అయ్యారు హైదరాబాద్‌లోని కొందరు షాపుల యజమానులు. మీకు నచ్చిన బుక్స్ తూకం వేయండి. బరువునుబట్టి ధర చెల్లించండి అంటూ కొత్త స్కీం ప్రకటించారు.. పుస్తకాల ఎంపికను బట్టి కిలోకు వంద నుంచి 300 వరకు ధర నిర్ణయించారు. ఈ కొత్త ధోరణి మార్కెటింగ్ గిమ్మిక్కే అయినా పుస్తక ప్రియులనుమాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పుస్తకం ధరకు మూడు పుస్తకాలు రావడంతో కిలోల కొద్దీ బుక్స్ కొనేస్తున్నారు జనాలు.

 

మళ్లీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం - నితీష్ కుమార్...

బీహార్ : తాను మళ్లీ అధికారంలోకి వస్తే మద్యంపై నిషేధం విధిస్తానని సీఎం నితీష్ కుమార్ ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

బారాముల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. బారాముల సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జెట్ ఎయిర్ వేస్ విమానానికి బాంబు బెదిరింపు..

మస్కట్ : జెట్ ఎయిర్ వేస్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. ముంబై నుండి దుబాయ్ విమానం వెళుతోంది. విమానంలో 54 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. జెట్ ఎయిర్ వేస్ విమానంలో భద్రత సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని నిర్ధారించడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. 

శుక్రవారం బాబు ఢిల్లీ పర్యటన..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ -8 అంశాలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో..అంతర్ రాష్ట్ర జలవివాదాలప కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. 

19:02 - July 9, 2015

ముంబై : బాలీవుడ్ బాద్ షా నటించిన తాజా చిత్రం 'ఫ్యాన్' టీజర్ గురువారం రిలీజైంది. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. షారుఖ్ కు జంటగా ఇలియానా, వాణికపూర్ లు నటిస్తున్నారు. ఇక ఈ వీడియోలో గత ఏడాది షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసం ఎదుట అభిమానులు చేసిన హడావుడిని చేర్చారు. టీజర్ ఆఖరులో 'మై ఆగయా..గౌరవ్' అంటూ క్యాప్షన్ ను జోడించారు. ఒకే రోజులో ఈ టీజర్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ టీజర్ సినిమా హైప్ ను పెంచేసిందని బాలీవుడ్ టాక్. 

రాష్ట్రపతితో కేంద్ర హోం మంత్రి భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. వ్యాపంపై సుప్రీంకోర్టు నోటీసుల వ్యవహారాన్ని రాష్ట్రపతికి వివరించనున్నారు. 

బ్లాక్ లో 'బాహుబలి' టికెట్లు..

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నాడు బాహుబలి రిలీజ్ అవుతోంది. దీనితో ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఉత్సుహకత ప్రదర్శిస్తున్నారు. దీనిని ఆసారగా తీసుకున్న పలు థియేటర్ల యజమానులు బ్లాక్ లో టికెట్లు విక్రయించడం ప్రారంభించారు. చైతన్యపురం మహా లక్ష్మి థియేటర్ లో ఒక్కో టికెట్ రూ.300 నుండి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. సరూర్ నగర్ మెగా థియేటర్ లో బ్లాక్ లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ వోటి పోలీసులు అదుపులోకి తీసుకుని 66 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ సత్యనారాయణ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు.

 

18:44 - July 9, 2015

పశ్చిమగోదావరి : ముసునూరు తహశీల్దార్ దాడి ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని హెచ్చార్సీ సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 13వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ కృష్ణా రావు, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
తవ్వకాలు అడ్డుకున్నందుకు దాడి...
పశ్చిమగోదావరి జిల్లా భూభాగం..కృష్ణా జిల్లా సరిహద్దుల్లోనూ తవ్వకాలు ఇష్టారీతిన జరుగుతుండడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతోపాటు తహశీల్దార్‌ చొరవ తీసుకొని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం తగదంటూ వనజాక్షి గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన అనుచరులతో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకొని దౌర్జన్యకాండ సాగించారు. దీనిపై చింతమనేని, అతని అనుచరులపై ఇప్పటికే తహశీల్దార్‌ ఫిర్యాదుతో కేసు కూడా నమోదయ్యింది. వివాదాలకు పెట్టింది పేరుగా మారిన చింతమనేని తీరుపై చాలామంది మండిపడుతున్నారు. గట్టిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తహశీల్దార్ దాడిని సుమోటోగా తీసుకున్న హెచ్చార్సీ..

పశ్చిమగోదావరి : ముసునూరు తహశీల్దార్ దాడిని హెచ్చార్సీ సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 13వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ కృష్ణా రావు, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 

జపాన్ పర్యటన విజయవంతం..

ఢిల్లీ : జపాన్ పర్యటన విజయవంతమైనట్లు ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. ఏపీలో అనుకూలతలపై చంద్రబాబు జపాన్ ప్రతినిధులకు వివరించారని, పెట్టుబడులు పెట్టడానికి జపాన్ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అమరావతి శంకుంస్థాపనకు జపాన్ ప్రధానిని బాబు ఆహ్వానించారని పేర్కొన్నారు. 

కాళేశ్వరం వెనుక రహస్య ఏజెండా - తమ్మినేని..

హైదరాబాద్ : కాళేశ్వరం వెనుక రహస్య ఏజెండా ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరానికి మార్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈసమావేశంలో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లు అనడం సరికాదని, ఈ ప్రాజెక్టును సర్వే చేసిన వ్యాప్కోస్ సంస్థపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులను సంపాదన మార్గాలుగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని, తుమ్మిడి హెట్టి వద్దనే ప్రాణహిత - చేవెళ్లను నిర్మించాలన్నారు.

18:27 - July 9, 2015

హైదరాబాద్ : చిన్న చిన్న సమస్యలతో కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లులే.. కన్నబిడ్డల ప్రాణాలను తీస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు.. ఇతర కారణాలతో ఆత్మన్యూనతా భావంతో పసిపిల్లల భవిష్యత్‌ను కాలరాస్తున్నారు. తాము చనిపోతే పిల్లల భవిష్యత్‌ ఎక్కడా అంధకారమవుతుందని భావిస్తున్న తల్లులు.. తమతోటే పిల్లలను అనంత లోకాలకు తీసుకెళ్లడం అందరిని కలిచివేస్తోంది.                                                            
కర్నూలులో..
ఆలుమగల మధ్య చిన్న వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. కర్నూలు నగరంలోని శరీఫ్‌నగర్‌లో ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవ ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. బంధువులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది.
గుంటూరులో..
గుంటూరు జిల్లా బాపట్లలోనూ ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. చెరువు జమ్ములపాలెంకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా పినవేమలిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో తలెత్తిన మనస్పర్ధలతో పదేళ్ల కుమారుడు చరణ్‌తేజ, నాలుగేళ్ల కుమార్తె చిట్టితో కలిసి బావిలో దూకి బంగారమ్మ ఆత్మహత్య చేసుకుంది.
మహిళలపై పిల్లల పోషణ భారం..
భర్త నుంచి కానీ.. ఆత్తవారింటి నుంచి కానీ పుట్టింటి నుంచి కానీ ఆదరణ కరువైనప్పుడు మహిళలు ఇలాంటి పనులకు ఒడిగడతారని మానసిక వైద్యనిపుణులంటున్నారు. ఒకపక్క ఆర్ధిక భారం, పిల్లల పోషణ భారం కావడంతో చేసేదేమీ లేక ఇలాంటి అఘాయిత్యాలు చేసుకుంటారంటున్నారు. తాము చనిపోతే పిల్లల భవిష్యత్‌ ఏంటి ? అని ఆలోచించి పిల్లలను కూడా తమతో పాటే అనంతలోకాలకు తీసుకెళ్తారంటున్నారు.
ఆదరణ కావాలి..
ఆత్మహత్య చేసుకోవడమంటే ఆత్మను హత్య చేయడమే... తనకు తాను ఎందుకు జీవితాన్ని ముగించాలని ఒక్కసారి ఆలోచిస్తే సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయాన్ని గమనించలేనివారు అనంత లోకాలకు వెళ్తున్నారు. సమస్యలను భూతద్ధంలో చూస్తూ ఘోరానికి పాల్పడుతున్నారు. వీళ్లు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను సైతం చిదిమేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మహిళలకు పురుషులతో పాటు కుటుంబ సభ్యుల ఆదరణ కావాల్సిందే. 

18:15 - July 9, 2015

చిత్తూరు : గోదావరి పుష్కరాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గోదావరికి సమర్పించడానికి శ్రీవారి ఆలయం నుంచి సారె రాజమండ్రికి బయలుదేరింది. స్వామి వారి విగ్రహం, పసుపు, కుంకుమ తదితర పూజాసామాగ్రితో కూడిన ప్రత్యేక వాహనం రాజమండ్రికి బయలదేరింది. వాహనం తిరుచానూరు, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడల మీదుగా రాజమండ్రి పుష్కర ఘాట్‌కు చేరుకుంటుంది. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా గోదావరికి సారెను సమర్పిస్తారు. అంతేగాకుండా పుష్కరాల సందర్భంగా శ్రీవారి నమూన ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఉత్సవ విగ్రహాలను తీసుకెళుతున్నట్లు టీటీడీ పేర్కొంది.

18:13 - July 9, 2015

పశ్చిమగోదావరి : అతడు చట్టసభల్లో సభ్యుడు...కానీ చట్టాలంటే అస్సలు గిట్టదు. అధికార పార్టీ ఎమ్మెల్యే..అయినా అధికారులంటే అలుసు. తాజాగా మహిళా ఎమ్మార్వోపైనే దాడికి దిగి తన దౌర్జన్యాన్ని చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి దెందులూరుకు చెందిన ఈ ఎమ్మెల్యే తీరుతో ఇప్పడు అధికార టిడిపికి తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా చింతమనేని ప్రభాకర్‌ వ్యవహరించిన తీరు చాలా మందిని విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై అధికార పక్ష విప్‌గా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్‌ దురుసుగా వ్యవహరించడం పెద్ద వివాదంగా మారింది.
ఇసుక మాఫియాపై అధికారుల చర్యలు..
ఇసుక మాఫియాపై అధికారి కన్నెర్ర చేయడం చింతమనేనికి చిర్రెత్తుకొచ్చింది. నిజానికి అధికారుల తీరు తమకు అంగీకారం కాని పక్షంలో చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలి. కానీ ఈ శాసన సభ్యుడు మాత్రం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంపై దురుసుతనం ప్రదర్శించారు.
తమ్మిలేరు ఇసుక తవ్వకాలకు అడ్డొచ్చినందుకే దాడులు..
తమ్మిలేరు వాగులో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతించకపోవడం చింతమనేనికి సమస్యగా కనిపించింది. అంతే అనుచరులతో కలిసి స్థానిక సిబ్బందిని చొక్కాలు చిరిగేలా కొట్టడమే కాకుండా, ఎమ్మార్వో హోదాలో ఉన్న మహిళా ఆఫిసర్‌పై సైతం దాడికి పాల్పడడం ఇసుక మాఫియా తీరుకు అద్దం పడుతోంది.
ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షి..
తమ్మిలేరు వాగులో ఇసుక తవ్వకాలకు పెదవేగి మండలానికి చెందిన డ్వాక్రా గ్రూపు మహిళలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ ముసుగులో కొందరు అధికారపక్ష నేతలు మాఫియా చక్రం తిప్పుతున్నారు. ఇటు పశ్చిమగోదావరి జిల్లా భూభాగంలోనే కాకుండా అటు కృష్ణా జిల్లా సరిహద్దుల్లోనూ తవ్వకాలు ఇష్టారీతిన సాగించడం మొదలుపెట్టారు. దానిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతోపాటు తహశీల్దార్‌ చొరవ తీసుకొని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం తగదంటూ వనజాక్షి గట్టిగా హెచ్చరించారు.
చింతమనేనిపై ఫిర్యాదు చేసిన మహిళా ఎమ్మార్వో..
ఇది గిట్టని చింతమనేని ప్రభాకర్‌ తన అనుచరులతో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకొని దౌర్జన్యకాండ సాగించడం ఇప్పుడు పెద్దవివాదానికి దారి తీసింది. చింతమనేని సహా ఆయన అనుచరులపై ఇప్పటికే తహశీల్దార్‌ ఫిర్యాదుతో కేసు కూడా నమోదయ్యింది. అయితే డ్వాక్రా మహిళల ముసుగులో సాగుతున్న ఇలాంటి అక్రమాలపై పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..
పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి వివాదాలకు పెట్టింది పేరుగా మారిన చింతమనేని తీరుపై చాలామంది మండిపడుతున్నారు. గట్టిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలో ఏపీ సీఎస్ భేటీ

హైదరాబాద్: ఉద్యోగ సంఘాల నేతలో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు. వీరి భేటీలో ప్రధానంగా ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీ విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

'బాహుబలి'టిక్కెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్: మల్కాజ్ గిరి రాఘవేంద్ర థియేటర్ వద్ద బాహుబలి సినిమా టిక్కెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి వద్ద నుండి భారీగా సినిమా టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

జపాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ చంద్రబాబు జపాన్ నుండి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 అంశం, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జల వివాదాలపైన బాబు మాట్లాడనున్నారని తెలిసింది. వారితో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ లతోనూ చంద్రబాబు సమావేశమవనున్నారు. 

17:53 - July 9, 2015

హైదరాబాద్ : వాటర్ బోర్డులో సమ్మె కొనసాగుతోంది. పీఆర్సీ అమలు కోసం మూడు రోజులుగా హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజి కామ్ గార్ యూనియన్ సమ్మె చేస్తోంది. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మె ఉధృత స్థాయికి చేరింది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుండగా మరో పక్క వాటర్ బోర్డు కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. 
తమ సమస్యలు పరిష్కరించాలని మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందిచంకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నగరానికి వచ్చే నీటి సరఫరాను నిలిపివేస్తామని పేర్కొనడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. 750 ఎంజీడీల నీరు అవసరం ఉండగా కేవలం 390 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది. వాటర్ బోర్డు కార్మికులు సమ్మె చేస్తుండడంతో నగర ప్రజలు అవస్థలు ఎదుర్కొననున్నారు. 

'మున్సిపల్ కార్మికుల సమ్మె నివారణకు సీఎం చర్యలు తీసుకోవాలి'

హైదరాబాద్: రేపటి నుంచి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తలపెట్టిన సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటి విజ్ఞప్తి చేసింది. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల డిమాండ్లు న్యాసమ్మతమైనవే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని మధు డిమాండ్ చేశారు.

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులతో ముగిసిన రాహుల్ భేటీ

ఢిల్లీ:మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులతోరాహుల్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కొత్తగా ఎన్నికైన మహిళా అధ్యక్షులను పరిచయం చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవినీతికి పాల్పడం, పాల్పడనివ్వం అంటూ చెప్పిన మోదీ ఇప్పుడు చేస్తున్నదేమిటని రాహుల్ ప్రశ్నించారు. లలిత్ మోదీని తిరిగి దేశానికి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో జరుగుతున్న అవినీతి సంగతేంటి? అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు.

మొజాంజాహీ మార్కెట్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: మొజాంజాహీ మార్కెట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

17:28 - July 9, 2015

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టును అడ్డుకోవడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే పాలమూరు ప్రజల ఉసురుతాకుతుందని శాపనార్థాలు పెట్టారు. హరీష్ రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే..
వలసలు..ఆకలతో అలమటిస్తున్నారు...
''పాలమూరు జిల్లాలో 16 లక్షల మంది వలసలు పోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. భారత దేశంలో ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే మొట్టమొదటి కట్టాల్సిన ప్రాజెక్టు ఇది. పేదరికం..వలసలు..తాగునీటి, ఫ్లోరైడ్..ఇతరత్రా అవసరాల మీద ప్రాజెక్టులు కడుతారు. జిల్లాకు సాగునీరు అందించి..ఆకలి తీర్చాలని ఇంతకాలం ఎవరు చేయని పనిని పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే దానిని అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
కిరణ్ హాయాంలోనే జీవో...
కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న హాయంలో జీవో నెంబర్ 72(08-08-2013)లో జీవో ఇచ్చారు. ఈ జీవో చెల్లదా ? జీవోలో పేర్కొన్న విధంగా పది లక్షల ఎకరాలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ వాసులకు తాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. వీరికి నీళ్లు ఇవ్వవద్దని బాబు పేర్కొంటున్నారు. నీళ్లు లేకపోతే బాబు హెరిటేట్ పాలు తాగి బతుకుతాడు. కానీ ఇతర ప్రజల సంగతేంటి ? హైదరాబాద్ అభివృద్ధి కాకుండా బాబు కుట్రలు పన్నుతున్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే హైదరాబాద్ లోని ప్రజలు బాబును తరిమికొడుతారు.
ద్రోహం చేశాడు...
పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి బాబు లేఖ రాస్తున్నారు. తెలంగాణ ముఖ్య కార్యదర్శికి లేఖ రాస్తున్నారు. బాబు దత్తత తీసుకుని చేసింది ఏమీ లేదు. పలకలు..మొక్కలు నాటి ద్రోహం చేశారు. తెలంగాణ ద్రోహి. మహబూబ్ నగర్ జిల్లా వాసుల ద్రోహి. ఇంతకంటే ఏదైనా పదం ఉంటే అన్నా తక్కువే. కొత్త ప్రాజెక్టు అని బాబు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు ప్రచారం చేర వేస్తున్నారు. నోటికాడ బుక్కను ఎత్తికొడుతున్నాడు. ఏ అనుమతి లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందర పడలేదు. మూడో పంట కోసం పట్టిసీమను కట్టుకోవచ్చు కానీ ఒక్క పంట కోసం అల్లాడుతున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టకూడదా ? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా ? మనస్సున్న వారు ఇలా చేస్తారా ? అబద్ధాల్లో బాబుకు నోబెల్ బహుమతి ఇవ్వవచ్చు.'' అని హరీష్ రావు పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన డీజీ ఏకేఖాన్,హోంశాఖ కార్యదర్శి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అవినీతి నిరోదక శాఖ డీజీ ఏకేఖాన్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది సమావేశమయ్యారు. ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలను సీఎంతో చర్చించినట్లు సమాచారం. ఏసీబీ కోర్టు అనుమతితో ఈ కేసులో ఐదో నిందితుడు సండ్ర వెంకటరమణ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

పాలమూరు ప్రాజెక్టును అడ్డుకొనేందుకు బాబు ప్రయత్నం - హరీష్..

హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పథకాన్ని అడ్డుకొంటే పాలమూరు వలస కూలీల ఉసురు తాకుతుందన్నారు. ప్రాజెక్టును అడ్డుకొనేందుకు బాబు కేంద్రానికి లేఖ రాశారని, మహబూబ్ నగర్ ప్రజల పాలిట చంద్రబాబు ఒక ద్రోహి అని హరీష్ రావు విమర్శించారు.

ఆప్ ఎమ్మెల్యేకు రిమాండ్..అరెస్టు

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే కొండ్లి మనోజ్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు రెండు రోజుల పాటు రిమాండ్ విధించింది. గురువారం అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భూ ఆక్రమణకు సంబంధించి రెండు నెలల క్రితం ఇతనిపై కేసు నమోదైంది. 

రేపు హస్తినకు చంద్రబాబు!

హైదరాబాద్: ఏపీ చంద్రబాబు రేపు హస్తిన బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 అంశం, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జల వివాదాలపైన బాబు మాట్లాడనున్నారని తెలిసింది. వారితో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ లతోనూ చంద్రబాబు సమావేశమవనున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయలుదేరిన బాబు ఈ రాత్రికి నగరానికి చేరుకోనున్నారు. 

కార్మికులు సమ్మె విరమించాలి: జీహెచ్ ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికలు, ఉద్యోగులు చేపట్టిన సమ్మెను విరమించాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమ్మెతో జీహెచ్ ఎంసీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శానిటేసన్ సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి స్వచ్ఛ యూనిట్ కు ఒక లారీ, నలుగురు కూలీలను ఇస్తున్నామని, 20 మంది తాత్కాలిక కార్మికులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల వేతనాల పెంపు అంశం ప్రభుత్వ పరిధిలోనిది అని, విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చిత్ర హింసలకు గురి చేసిన సవతి తల్లి శ్యామల అరెస్టు

హైదరాబాద్: ఎల్బీ నగర్ లో ప్రత్యూషను చిత్ర హింసలకు గురి చేసిన సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా 14 రోజుల రిమాండ్ విధించారు.

ప్రాజెక్టు మార్పు వెనక ఏదో మతలబు ఉంది: ఉత్తమ్

హైదరాబాద్:తుమ్మిడి హెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టు మార్చడం సరికాదని... ప్రాజెక్టు స్వరూపమే మార్చడం వెనుక ఏదో మతలబు ఉందని టి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు గాంధీభవన్ లో జరిగిన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుపై మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్న మంత్రి హరీష్ రావు మాటలకు టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్, హరీష్ కే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. 

16:29 - July 9, 2015

మహబూబ్ నగర్ : పాలమూరు ప్రాజెక్టుకు ఎవరూ అడ్డు వచ్చినా పనులు ఆగవని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. అందుకనే మహబూబ్ నగర్ జిల్లాకు బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను అడ్డుకుంటే ఊరుకొనేది లేదని, సమైక్య రాష్ట్రంలో 2013న జీవో 72 ప్రకారమే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పాలమూరు పథకాన్ని అడ్డుకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని మంత్రి జూపల్లి హెచ్చరించారు. 

వ్యాపం స్కామ్ మధ్యప్రదేశ్ కే పరిమితం కాలేదు:కాంగ్రెస్

హైదరాబాద్:వ్యాపం స్కామ్ మధ్యప్రదేశ్ కే పరిమితం కాలేదని, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్ లోనూ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.

16:22 - July 9, 2015

హైదరాబాద్ : నగరంలో పేరుకపోయిన చెత్తను ఏరివేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఔట్‌సోర్స్ కార్మికుల జీతాల పెంపు.. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు వెంటనే మోక్షం కలించాలన్న మొత్తం 16 డిమాండ్లతో ఎనిమిది కార్మికసంఘాలతో ఏర్పడిన ఐక్యకార్యచరణ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. రంజాన్..బోనాలు పండుగలు సమీపిస్తున్నాయని కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వం వారి డిమాండ్లు పరిష్కరించడానికి సానుకూలంగా ఉందని తెలిపారు. నగరంలో భారీగా చెత్త పేరుకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర శాఖల కార్మికులను రప్పిస్తున్నట్లు, నోడల్ ఆఫీసర్ చురుకుగా పాల్గొనాలని సూచించడం జరిగిందన్నారు. ప్రతి సర్కిల్ లో డిప్యూటి కమీషనర్ ..ఇతర అధికారులు ఒక కోర్ టీం ఏర్పడి శానిటేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించినప్పుడు కొంతమంది యాక్టివ్ గా పాల్గొనడాన్ని గుర్తించడం జరిగిందని, వీరిని చెత్త ఏరివేసే కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూస్తామని, కార్మికులు సమ్మెను విరమించాలని కమిషనర్ సోమేశ్ కుమార్ సూచించారు. 

దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు...

శ్రీకాకుళం:ఆముదాలవలస పట్టణంలో దొంగనోట్ల చలామణీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.37,600 విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్టు సీఐ నరేందర్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల కిందట ఖమ్మం జిల్లాలో నకిలీనోట్లను చలామణి చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. 

జీహెచ్ ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

హైదరాబాద్: కార్మికుల సమ్మెతో జీహెచ్ ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. డ్వాక్రా మహిళలను, యువ డ్రైవర్లను తాత్కాలిక పద్ధతిలో విధుల్లో నియమించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి.

ఇచ్చాపురం మండలం తేలుకుంచిలో విషాదం

శ్రీకాకుళం: ఇచ్చాపురం మండలం తేలుకుంచిలో విషాదం నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ మోహన్ రావు మృతి చెందాడు. కుమారుడు మోహన్ రావు మరణ వార్త విని తల్లి దమయంతి గుండెపోటుతో మృతి చెందింది.

16:14 - July 9, 2015

హైదరాబాద్ : నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పి ప్రస్తుతం చెత్త హైదరాబాద్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఔట్‌సోర్స్ కార్మికుల జీతాల పెంపు.. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు వెంటనే మోక్షం కలించాలన్న మొత్తం 16 డిమాండ్లతో ఎనిమిది కార్మికసంఘాలతో ఏర్పడిన ఐక్యకార్యచరణ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగింది. దీనితో నగరంలో ఎక్కడ చెత్త అక్కడనే నిలిచిపోయింది. దీనితో పలు ప్రాంతాలు దుర్ఘందం వెదజల్లుతున్నాయి. సమ్మె కారణంగా నాలుగు రోజుల నుంచి నగరంలో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి. ముఖ్యంగా రోడ్లు ఊడ్చే కార్మికులు ఎక్కువ సంఖ్యలో విధులు నిర్వర్తించకపోవటంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసినా, అవి సరైన ఫలితానివ్వడం లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు చిక్కడపల్లి రహదారిపై ఓ మ్యాన్ హోల్ పొంగిపొర్లుతోంది. సమీపంలో ఉన్న కాలనీల్లోకి ఈ నీరు పారుతోంది. దీనితో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై వెంట వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇక్కట్లకు గురవుతున్నారు. 

ఓటుకు నోటు వ్యవహారమంతా జనార్థన్ కు తెలుసు:సెబాస్టియన్

హైదరాబాద్: ఏసీబీ కార్యాలయం వద్ద ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారమంతా జనార్థన్ కు తెలుసని... జనార్థన్ కు తెలియకుండా ఎవరూ ఏమీ చేయలేదని. పార్టీ, చంద్రబాబు పనులన్నీ జనార్థనే చక్కబెడతారని సెబాస్టియన్ అన్నారు.

ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనం ఢీ:ఆర్టీసీ డ్రైవర్ మృతి

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

16:00 - July 9, 2015

ఢిల్లీ : ఆమాద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఎమ్మెల్యే కొండ్లి మనోజ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు అయ్యారు. భూ ఆక్రమణకు సంబంధించి రెండు నెలల క్రితం ఇతనిపై కేసు నమోదైంది. ఎలాంటి సమన్లు అందచయకుండా అరెస్టు చేశారని మనోజ్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మనోజ్ కుమార్ తన వ్యార భాగస్వామిని రూ.6 లక్షల మేర మోసం చేశారని ఆయనపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

విజయవాడలో రెవెన్యూ ఉద్యోగుల భేటీ

విజయవాడ:తహశీల్దార్ వనజాక్షి పై దాడి కేసులో ఎమ్మెల్యే చింతమనేని పై చర్యలు తీసుకోకపోతే ఆందోళలను ఉధృతం చేయాలని, కలెక్టరేట్లతో సహా రెవెన్యూ కార్యాలయాలన్నింటినీ మూసివేస్తానని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. అంతేకాక భవిష్యత్ కార్యాచరణ పై చర్చించేందుకు విజయవాడలో భేటీ అయ్యారు.

న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది - నమ్రత తండ్రి..

భోపాల్ : తన కుమార్తె మృతి కేసులో జరిగే సీబీఐ విచారణలో న్యాయం జరుగుతుందని నమ్రత దామర్ తండ్రి ఎంఎస్ దామోర్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణం కేసులో నమ్రత దామర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

 

ఇంఫాల్ లో విద్యార్థుల ఆందోళన..

మణిపూర్ : ఇంఫాల్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మణిపూర్ లోకి ఇతరుల ప్రవేశంపై కఠిన చట్టాలు తీసుకరావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలో పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో విద్యార్థి మృతి చెందడంతో గురువారం విద్యార్థులు నిరసన నిర్వహించారు. 

గూడవల్లి శ్రీచైతన్య కాలేజ్ లో ఫుడ్ పాయిజనింగ్:80కి అస్వస్థత

విజయవాడ: గూడవల్లి శ్రీచైతన్య కాలేజ్ శ్రీ చక్ర క్యాంపస్ లో కలుషితాహరం తిని 80 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అస్వస్థతకు గురైన విద్యార్థులకు క్యాంపస్ లోనే రహస్యంగా యాజమాన్యం చికిత్స అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

బెంగళూరు రాజ్ భవన్ వద్ద న్యాయవాదుల ఆందోళన..

బెంగళూరు : రాష్ట్రంలోని రాజ్ భవన్ ఎదుట న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

 

 

15:33 - July 9, 2015

హైదరాబాద్: బుల్లి తెరపై లంగా వోణి వేసుకొని యాంకరింగ్ చేసే ఈ అమ్మాయిని చూస్తే అచ్చు పదహారణాల తెలుగు అమ్మాయిని చూసినట్లు అనిపిస్తుంది. ఆ ముద్దుగుమ్మే యాంకర్ ప్రశాంతి. యాంకర్ ప్రశాంతి ఇప్పుడు 'ఎఫైర్ ' చిత్రంలో నటిస్తోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే 'ఇల్లీగల్ ఎఫైర్' కథతో ఈ సినిమా రూపొందుతోంది. సస్పెన్స్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రశాంతి పచ్చిపచ్చిగా రెచ్చిపోయిదంట. గీతాంజలి, ప్రశాంతి కలిసి నటించిన ఈ 'ఎఫైర్ 'చిత్రం ట్రైలర్, స్టిల్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో హాలీవుడ్, బాలీవుడ్ లో ఇద్దరు అమ్మాయిల మధ్య అక్రమ సంబంధం గురించి వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ తెలుగులో ఇప్పటి వరకు ఈ తరహా చిత్రాలు రాలేదు. ఈ ఇద్దరూ రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్న స్టిల్స్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

15:32 - July 9, 2015

రష్యా : భారత ప్రధాన మంత్రి రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తో మోడీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన వీరు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. మోడీ బంగ్లాదేశ్ పర్యటన అనంతరం మయన్మార్ లో సైనిక చర్య చేపట్టింది. ఈ సమయంలో ఆక్రమిత కాశ్మీర్ లో ఇదే తరహా చర్యలు చేపట్టాలని దేశంలో వినిపించింది. అయితే మయన్మార్ చర్యను పాక్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక పాక్ పార్మమెంట్ లో దీనిపై వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు ప్రధానుల మధ్య జరిగే భేటీలో టెర్రరిజంపైనే చర్చ ఉంటుందని తెలుస్తోంది. 

బాసరలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఆదిలాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర పుణ్యక్షేత్రానికి రోజుకు 5 లక్షల మంది వస్తారని అంచానే వేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు. బాసరలో పుష్కరాల ఏర్పాట్లను ఈ రోజు ఆయన పర్యవేక్షించారు. సరస్వతి అమ్మవారిని గంటలకు 9-10 వేల మంది దర్శించుకునేలా మూడు క్యూలైన్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

15:15 - July 9, 2015

ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ మారింది. ముఖ్యంగా ఆర్మమెంట్ లో రోజుకో ట్రెండ్ మనముందుకు వస్తోంది. అటువంటి ట్రెండ్ ఏమిటో ఇయర్ రింగ్స్ ఎలాంటి హల్ చల్ చేస్తున్నాయో ఇవాల్టి మానవి 'సొగసు'..

15:04 - July 9, 2015

ప్రతి క్షణం ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళలు తమ ఆరోగ్యం..ఆహార్యం విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపరనేది వాస్తవం. ఫలితంగా దేశంలో 80 శాతం మహిళలు అనేక రోగాల బారిన పడుతున్నారు. పోషకాహార లేమితో బాధ పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజు ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు. అలాంటి వివరాలను మానవి 'హెల్త్ కేర్' లో సుజాత స్టీఫెన్ స్టన్ (డైటీషియన్) వివరించారు. 

15:04 - July 9, 2015

ఐదంకెలతో మొదలయ్యే వేతనాలు..వారానికి ఐదు రోజుల పనిదినాలు...తక్కువ వ్యవధిలో ప్రమోషన్స్..వీకెండ్ పార్టీలు..విదేశీ ప్రయాణాలు..ఇది సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే వారి ఒక పార్శం. మరోవైపు మితిమీరిన పని వత్తిడి..రాత్రి..పగలు తేడా లేని పని వేళలు. ఫలితంగా అస్త్యవస్థంగా మారుతున్న జీవన విధానం. అయితే వీటిన్నింటి మించి మహిళలకు భద్రత లేదు. దశాబ్దకాలంగా యువతను ఆకర్షిస్తున్న రంగాలలో సాఫ్ట్ వేర్ అగ్రస్థానంలో నిలుస్తోంది. చదువులు అయిపోగానే కొలువులు అందిస్తూ కాసుల వరాలు కురిపిస్తోంది. యువతలో ఈ రంగంపై మంచి క్రేజ్ ఉంది. బయటకు కనిపిస్తున్న సాఫ్ట్ గా వీరి భద్రత ఉంటోందా ? అంటే పెదవి విరుపే సమాధానం అవుతోంది. ఈ అంశంపై మానవి 'ఫోకస్'..

ఐదు జిల్లాలోని పాఠశాలలకు పుష్కర సెలవులు

హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని ఐదు జిల్లాల పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు గుర్తించిన పాఠశాలలకు మాత్రమే సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సెలవులను ఏప్రిల్ 2016 వరకు ప్రతి రెండో శనివారంను పనిదినంగా మార్చి భర్తీ చేస్తామని తెలిపింది. 

ఎన్ ఎంఆర్ లను క్రమబద్దీకరించాలి: ఏపీ ఎండబ్ల్యు అండ్ఈయూ

హైదరాబాద్: కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎన్ ఎంఆర్ లను క్రమబద్దీకరించాలని, విస్తరణకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూని నేత ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.

యువతిని మోసం చేసిన నైజీరియన్ అరెస్ట్

హైదరాబాద్ : పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన నైజీరియన్ ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. యూకే డాక్టర్ గా పని చేస్తున్నానంటూ ఆన్ లైన్ లో యువతితో పరిచయం పెంచుకుని రూ.4లక్షలు వసూలు చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ ను తొలగించే అవకాశం!

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ అయ్యారు. వీరి భేటీ లో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ వ్యవహారం పై చర్చిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ ను తొలగించే అవకాశం కూడా ఉందని రాజకీవిశ్లేషకులు భావిస్తున్నారు.

సినీ పరిశ్రమపై ద్వేషం లేదు:ఎంపీ కవిత

హైదరాబాద్ : సినీ పరిశ్రమపై టీఎస్ సర్కార్ కు ద్వేషం లేదని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. తెలుగు సినీ పరివ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. తెలంగాణ బిడ్డలకు సినిమా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాది భత్కల్ వింత ప్రవర్తన:పోలీసులు...

రంగారెడ్డి : దిల్ సుఖ్ నగర్ లో 2013లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాసిన్ భత్కల్ ను గురువారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి ఎదుట గులాబీ పువ్వుతో హాజరయిన భత్కల్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా భత్కల్ వింతగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఉగ్రవాది భత్కల్ వింత ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి - ఎంపీ కవిత..

హైదరాబాద్ : సినీ పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్లు ఎంపీ కవిత వెల్లడించారు. సినీ పరిశ్రమపై టీఎస్ ప్రభుత్వానికి ధ్వేషం లేదని, తెలంగాణ బిడ్డలకు సినిమా అవకాశాలు కల్పించాలని సూచించారు.

 

శుక్రవారం నుండి ఏపీలో మున్సిపల్ సమ్మె...

విజయవాడ : ఏపీలో శుక్రవారం నుండి మున్సిపల్ సమ్మె జరుగనుంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, జీఎంఎస్, స్వతంత్ర సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనున్నాయి. కనీస వేతనం రూ.15,432 ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమి స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని..కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విస్తరణకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని ఎపి ఎండబ్ల్యూ మరియు ఈయు ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. 

ఉక్రెయిన్ లో నల్గొండ వాసి మృతి..

నల్గొండ : ఉక్రెయిన్ లో జిల్లా వాసి శ్రీకాంత్ రెడ్డి మృతి చెందాడు. ఇతను రామన్నపేట మండలం దుబ్బాకు చెందిన వాడు. ఏంబీబీఎస్ కోసం మూడు సంవత్సరాల క్రితం శ్రీకాంత్ రెడ్డి ఉక్రెయిన్ వెళ్లాడు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీకాంత్ రెడ్డి మృతదేహం స్వదేశానికి తెప్పించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

 

రాష్ట్రం ఏర్పడినా బాబు అవాంతరాలు - జూపల్లి..

మహూబూబ్ నగర్ : ఉద్యమంలో ఇబ్బందులు సృష్టించిన బాబు రాష్ట్రం ఏర్పడినా అవాంతరాలు సృష్టిస్తున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను అడ్డుకుంటే ఊరుకొనేది లేదని, సమైక్య రాష్ట్రంలో 2013న జీవో 72 ప్రకారమే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పాలమూరు పథకాన్ని అడ్డుకుంటే మరో ఉద్యమానికి సిద్ధహని హెచ్చరించారు. 

పుష్కరాల సందర్భంగా పాఠశాలలకు హాలీడేస్..

హైదరాబాద్ : తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈనెల 13 నుండి 20వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయ. గోదావరి పరివాహక ఐదు జిల్లాలకు స్కూళ్లకు ఈ సెలవులు వర్తించనున్నాయి. 

ఏపీ మోసం కేంద్రం దృష్టికి - ఎంపీ జితేందర్ రెడ్డి...

మహబూబ్ నగర్ : ఏపీ మోసపూరిత ప్రకటనను కేంద్రం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళుతామని ఏంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. బ్రిజేష్ ట్రిబ్యూనల్ ప్రకారమే తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకుంటున్నామన్నారు.

'బాహుబలి' టికెట్ల విక్రయాలపై హైకోర్టులో పిల్

హైదరాబాద్ : బాహుబలి సినిమా టికెట్ల విక్రయాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. థియేటర్ల దగ్గర తోపులాట, లాఠీచార్జ్ పై పిటిషన్ వేశారు. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

జమ్మూ కాశ్మీర్ లో ఆగంతకుడి కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : షోపైన్ ప్రాంతంలోని కోర్టు వద్ద ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భద్రతను చేపట్టారు. దుండగుడి కోసం గాలింపులు చేపట్టారు. 

భత్కల్ ను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..

హైదరాబాద్ : 2013 దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సూత్రధారి భత్కల్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా కోర్టులో హాజరుపరిచారు.

 

సీబీఐ విచారణ తొందరగా చేపట్టాలి - చౌహాన్..

ఢిల్లీ : వ్యాపం కుంభకోణం కేసులో విచారణ తొందరగా జరిపించాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ సీబీఐను కోరారు. అప్పుడే నిజ నిజాలు బయటపడుతాయని తెలిపారు. 

నిషేధం దిశగా హల్దీరాం ఉత్పత్తులు!

హైదరాబాద్:హల్దీరామ్ ఉత్పత్తుల్లో పెస్టిసైడ్స్, బాక్టీరియా సాల్మోనెల్లాలు మోతాదుకు మించి ఉన్నాయని అమెరికాలో హల్దీరామ్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. మహారాష్ట్రలో హల్దీరామ్ ఉత్పత్తులకు విపరీత ప్రజాదరణ ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం హల్దీరామ్ స్నాక్‌లు, స్వీట్లను తనిఖీ చేయండంటూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) అధికారులను కోరింది. హల్దీరామ్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించండని ఎఫ్డీఏ సహాయ మంత్రి విద్యా ఠాకూర్ సంబంధిత శాఖ కమీషనర్ హర్ష్‌దీప్ కాంబ్లేను ఆదేశించారు. 

ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయాలి: సీపీఎం

విజయవాడ: ఎమ్మార్వో పై ఎమ్మెల్యే చింతమనేని దాడిని నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆందోళన చేపట్టింది. వెంటనే చింతమనేనిని అరెస్టు చేయాలడని డిమాండ్ చేస్తూ బందర్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రేపు మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు టిఆర్ ఎస్ పిలుపు

హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నందుకు నిరసనగా శుక్రవారం టిఆర్ ఎస్ మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చింది.

13:45 - July 9, 2015

ఢిల్లీ: వ్యాపం స్కాం కేసు విచారణ బాధ్యత సీబీఐకి అప్పగిస్తూ... సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వాగతించింది. దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరిపించాలని కోరింది. ఐతే ఈ కేసులో గవర్నర్ రామ్‌నరేష్‌ యాదవ్‌ను... బీజేపీ ఎందుకు ప్రొటెక్ట్‌ చేస్తుందో వెల్లడించాలని... ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఆశిష్‌ కేతన్‌ డిమాండ్ చేశారు.

 

చింతమనేని తక్షణమే అరెస్టు చేయాలి మండలి హనుమంతరావు

విజయవాడ: ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి మండలి హనుమంతరావు డిమాండ్ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని తెలిపారు. చింతమనేని తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ మహిళా అధ్యక్షురాలు జ్ఞానమణి డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే వ్యతిరేకంగా మహిళలంతా ఎమ్మార్వోకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చింతమనేనిని అరెస్టు చేయాలని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

13:40 - July 9, 2015

హైదరాబాద్: బాహుబలి సినిమా టిక్కెట్లు.. ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్నాయి. టిక్కెట్ల అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. ఒక్కో టిక్కెట్ ను రూ. 7వేలకు కొనుగోలు చేస్తున్నారు. బాహుబలి సినిమా టికెట్ల రేట్లను తగ్గించాలని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సంధ్య, సుదర్శన్‌ థియేటర్ల దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సంరద్భంగా నేతలు మాట్లాడుతూ ఆధిక రేట్లతో ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బాహుబలి సినిమా టికెట్ల రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. బ్లాక్ టిక్కెట్లను అరికట్టాలని చెప్పారు. సినిమాపై అత్యంత హైప్ ను క్రియేట్ చేస్తూ.. టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు.

 

13:33 - July 9, 2015

కృష్ణా: తహసీల్దార్‌పై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనపై.... కృష్ణా జిల్లావ్యాప్తంగా దుమారం రేగుతోంది. జిల్లాలోని తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది...కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్‌పై దాడి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ బాబు చెప్పారు. ఇసుక ర్యాంపు ఏ జిల్లాకు సంబంధించిందో తేల్చిన తర్వాత.... తుదుపరి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రెవిన్యూ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులను అరెస్టు చేయకపోతే...భారీ ఎత్తున ఆందోళన చేస్తామని తేల్చిచెప్పారు. అవసరమైతే గోదావరి పుష్కరాల విధులనూ బహిష్కరిస్తామని హెచ్చరించారు.

 

13:24 - July 9, 2015

మధ్యప్రదేశ్ : ''మీ సహాయం మాకు వద్దు..మాకు న్యాయం కావాలి..ఆరోగ్యంగా ఉన్న కొడుకు ఎలా మృతి చెందాడు' అంటూ మృతి చెందిన జర్నలిస్టు కుటుంబసభ్యులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీశారు. ఇటీవల వ్యాపం కుంభకోణం స్కాంను పరిశోధించేందుకు ఆజ్ తక్ విలేకరి అక్షయ్ సింగ్ వెళ్లి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో విపక్షాలు ముఖ్యమంత్రి చౌహాన్ పై పలు విమర్శలు చేశాయి. అక్షయ్ సింగ్ కుటుంబీకులను పరామర్శించేందుకు గురువారం సీఎం చౌహాన్ ఢిల్లీకి వచ్చారు. ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం తెలిపారు. తమకు ప్రభుత్వం సహాయం ఏమీ అవసరం లేదని...న్యాయం కావాలని సింగ్ కుటుంబసభ్యులు తెలిపారు. తమ కొడుకు ఇంటి నుండి వెళ్లినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని..అక్కడకు వెళ్లిన తరువాత అకస్మాత్తుగా ఎలా మృతి చెందాడో తమకు తెలియాలంటూ డిమాండ్ చేశారు. 

'బాహుబలి' టికెట్ల అమ్మకాలపై హైకోర్టులో పిల్

హైదరాబాద్‌: 'బాహుబలి' టికెట్ల విషయంలో రగడ ముదురుతోంది. బాహుబలి చిత్రానికి సంబంధించి టికెట్ల అమ్మకాలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. బాహుబలి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాహుబలి చిత్రానికి సంబంధించి పెద్దఎత్తున హైప్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఉభయ రాష్ర్టాల్లో వేల మంది అభిమానులు టికెట్ల కోసం గొడవలకు దిగుతున్నారు. గతంలో మగధీర చిత్రానికి సంబంధించి ఇదే విధంగా జరగడంతో ఏడుగురు మరణించారని కావున ప్రేక్షకుల ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనను పరిమితం చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

దండేపల్లి మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో

ఆదిలాబాద్‌:కడెం రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని గోదావరి పుష్కరాల కోసం విడుదల చేయవద్దని కోరుతూ ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కంట తడి పెట్టిన తహశీల్దార్ వనజాక్షి....

విజయవాడ:ఎమ్మెల్యే చింతమనేని తన కుటుంబ విషయాలను ప్రస్తావించాడంటూ తహశీల్దార్ వనజాక్షి కంట తడి పెట్టింది. దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే చింతమనేని పై రెవెన్యూ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం లోగా చింతమనేని సహా ఆయన అనుచరులను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు బహిష్కరిస్తాం.... అవసరమైతే గోదావరి పుష్కరాల విధులనూ బహిష్కరిస్తామని ఏపీ రెవన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.

ఏసీబీ పట్టుబడ్డ అసిస్టెంట్ సబ్ ట్రెజరీ అధికారి రమేష్

రంగారెడ్డి: రాజేంద్ర నగర్ సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ దాడి చేసింది. రూ.8వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ సబ్ ట్రెజరీ అధికారి రమేష్ పట్టు బడ్డాడు.

12:30 - July 9, 2015

ఢిల్లీ: వ్యాపం స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకూ నడుస్తోన్న కేసులన్నీ... సీబీఐకు అప్పగించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తుందని తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, గవర్నర్‌, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 

12:24 - July 9, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరుకుంది. హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. రంజాన్ మాసం కారణంగా చార్మినార్ పరిసరాల్లో చెత్తాచెదారం పెద్ద మొత్తంలో పేరుకుపోయింది. దీంతో చేసేదేమి లేక... పోలీసులే చీపుర్లు పట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌లు అంతా కలిసి రోడ్లను శుభ్రం చేస్తున్నారు. 

కడపలో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

కడప:రైల్వేకోడూరు మండలం తుముకొండ చెక్‌డ్యాం సమీపంలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లనను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.10 లక్షల విలువగల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు

12:16 - July 9, 2015

కృష్ణా: విజయవాడలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షకు దిగారు. పీడీఎఫ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. టీచర్ల అక్రమ బదీలలకు వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, అంతర్‌ జిల్లాల బదిలీలను అనుమతించాలని, రాజకీయాల పైరవీలను అరికట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

 

వ్యాపం కేసు విచారణను సీబీఐకి అప్పగించిన సుప్రీం..

ఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన 'వ్యాపం' కేసు విచారణనుసుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల మరణాలపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కుంభకోణం పై మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్ కు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ దిగ్విజయ్‌సింగ్, కుమార్ విశ్వాస్ సహా దాఖలు చేసిన 9 పిటిషనన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాపం కుంభకోణంలో అనధికారికంగా ఇప్పటివరకు 50 మంది మృతిచెందారు.

ప్రయివేటు సిబ్బందితో చెత్త తొలగిస్తున్నాం:టి.సర్కార్

హైదరాబాద్:జీమెచ్ఎంసీ పరిధిలో చెత్తలో పేరుకుపోయిందని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రయివేటు సిబ్బందితో చెత్త తొలగిస్తున్నామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వ్యాఖ్యలను హైకోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

బాహుబలి సినిమాపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: బాహుబలి సినిమాపై హైకోర్టులో నర్సింహారావు పిల్ దాఖలు చేశారు. టిక్కెట్ల కోసం ప్రాణాలు కోల్పోతున్నారనీ, సినిమాకు హైప్ సృష్టించి దోచుకుంటున్నారని పిల్ లో పేర్కొన్నారు. గతంలమగధీర సినిమాకు ఏడుగురు చనిపోయారని... ఇప్పుడు ఆ సమస్య రాకుండా ఆదేశించాలని పిల్ లో పేర్కొన్నారు.

తహశీల్దార్ పై దాడి విషయాన్ని పరిశీలిస్తున్నాం: కలెక్టర్

కృష్ణా: తహశీల్దార్ పై దాడి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ఏ.బాబు తెలిపారు. ఇసుక ర్యాంపు ఏ జిల్లాకు సంబంధించింనదో తేల్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమస్య ముసిగిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.

12:00 - July 9, 2015

హైదరాబాద్: ఓటుకు నోటుకు కేసులో... టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

11:58 - July 9, 2015

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీమాంధ్ర నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని మాటల తూటాలు పేల్చారు. ఎపి విభజన చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభలో ఎంతమంది ఉన్నారని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకున్న సమాచారం మేరకు ఐదుమందే ఉన్నారని తేల్చి చెప్పాడు.

విశాఖలో నాలుగు సినిమా థియేటర్ల పై అభిమానుల దాడి

విశాఖ:బాహుబలి సినిమా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ అభిమానులు విశాఖలో శ్రీకన్య, ఊర్వశి, లక్ష్మీనరసింహ, జ్యోతి సినిమా హాళ్ల పై దాడులు చేశారు. దాడిలో సినిమా హాళ్లలో ఉండే అద్దాలు ధ్వంసం అయ్యాయి

11:53 - July 9, 2015

విశాఖపట్టణం: జీకేవీధి పీఎస్‌లో మిస్ ఫైర్ కలకలం సృష్టించింది. తుపాకీని శుభ్రం చేస్తుండగా...ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ అజయ్‌కుమార్‌ మృతి చెందారు. ఐతే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సహచరులు భావిస్తున్నారు.

 

రొయ్యల చెరువు తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు.. ఉద్రిక్తత

ప.గో: పాలకోడేరు మండలం గుబ్బలవారి పాలెంలో ఉద్రికత్తత నెలకొంది. రొయ్యల చెరువు తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులను నిలువరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులూ, స్థానికులకు మద్య తోపులాట జరిగి ఒకరికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు.

11:49 - July 9, 2015

కృష్ణా: ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని రక్షించేందుకు... ఏపీ మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగారు. చింతమనేనిపై చేసిన ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులపైనా టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. ఐతే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ... నూజివీడులో తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. మరోవైపు బాధిత తహసీల్దార్‌ వనజాక్షిపైనా కేసు నమోదైంది. పెదవేగి పీఎస్‌లో డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేశారు. తమపై తహసీల్దార్ దౌర్జన్యం చేశారని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు.

 

టీచర్ల అక్రమ బదిలీలకు నిరసనగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ దీక్ష

విజయవాడ: టీచర్ల అక్రమ బదిలీలకు నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పీడీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు దీక్ష చేపట్టారు. బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని అంతర్ జిల్లాల బదిలీలు అనుమతించాలని, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, రాజకీయాల పైరవీలు అరికట్టాలని, కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు, గేయానంద్, బాలసుబ్రహ్మణ్యం, వైశ్రీనివాసులు రెడ్డి, రామసూర్యారావులు పాల్గొన్నారు.

11:42 - July 9, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేశారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదని అంటున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో నగరంలో చెత్త చెదారం పేరుకుపోయింది.

 

సీమాంధ్ర ఎంపీల ప్రశ్నించిన పవన్

హైదరాబాద్:ట్విట్టర్ లో సీమాంధ్ర ఎంపీలపై మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో వామబాణాలు పేల్చాడు. విభజన సవరణ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు ఎంత మంది ఎంపీలు ఉన్నారని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. కేవలం సభలో ఐదుగురే ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. మిగతా ఎంపీలు ఏమయ్యారని, ప్రత్యేకంగా ఎంపి కేశినేని హాజరు వివరాలను ట్విట్టర్ లో పెట్టారు. కేశినేని సభలో వ్యవహరించిన తీరును పవన్ వివరించారు.

చీపురు పట్టిన చార్మినార్ పోలీసులు

హైదరాబాద్:చార్మినార్ పోలీసులు చీపురు పట్టారు. నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తుండడంతో చీపురుతో చార్మినార్ వద్ద పోలీసులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు.

11:21 - July 9, 2015

హైదరాబాద్: సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయాన్నే చర్లపల్లి జైలుకెళ్లిన అధికారులు సండ్రను తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండ్రోజుల పాటు విచారించనున్నారు.

 

చింతమనేని అనుచరులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన

ప.గో:ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మద్దతుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద అనుచరులు ఆందోళనకు దిగారు.

ముసునూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నా

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభార్, అతని అనుచరులనూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

హైదరాబాద్: ఎమ్మెల్యే సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేశారు. కౌంటర్ పై వాదనలు వినిపించేందుకు ఏసీబీ సమయం కోరింది. 

ముసునూరు ఎమ్మార్వో పై దాడిని ఖండిస్తున్నాం:రఘువీర

కృష్ణా: రాష్ట్రంలో ఆటవికా పాలన కొనసాగుతోందరి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ముసునూరు ఎమ్మార్వో పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాహుల్ పర్యటన ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

11:09 - July 9, 2015

భారతదేశానికి చెందిన రాజకీయపార్టీ దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేసే హక్కు, స్వేచ్ఛ ఉందన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'చంద్రబాబుకు హైదరాబాద్ లో ఏం.. పని' అని సీఎం కేసీఆర్ అనడం సరికాదన్నారు. తెలంగాణలో టిడిపి కూడా ఉంది కాబట్టి చంద్రబాబు ఇక్కడ తిరిగే, రాజకీయం చేసే హక్కు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ .. పదేళ్లు.. ఉమ్మడి రాజధానిగా ఉంది... కావున హైదరాబాద్ లో చంద్రబాబుకు తిరిగే హక్కు, ప్రచారం చేసే హక్కు, రాజకీయం చేసే హక్కు ఉందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదాపై మాట్లాడాలి..
ఎంపీలపై పవన్ విమర్శలు చేయడం సబబే..కానీ విమర్శలు చేసే అర్హత పొందాలని సూచించారు. పవన్ కళ్యాణ్.. ట్వీట్టర్ లో మాత్రమే కామెంట్లు చేస్తే సరిపోదన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదాపై మాట్లాడాలని విరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జర్నలిస్ట్ అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చౌహాన్

హైదరాబాద్:మధ్యప్రదేశ్ లో వ్యాపం కుభకోణంలో అనుమానాస్పందగా మృతిచెందిన జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సివరాజ్‌సింగ్ చౌహాన్ నేడు పరామర్శించారు. జర్నలిస్ట్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవడంతో పాటు ఆర్థికసాయం, ఉద్యోగం కల్పిస్తాం. అక్షయ్‌సింగ్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా చౌహాన్ ఆఫర్‌ను అక్షయ్ కుటుంబ సభ్యులు తిరస్కరించారు.

10:40 - July 9, 2015

నెల్లూరు: జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ఇప్పుడు యూరియా కొనుక్కోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలు భవిష్యత్‌లో ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితం కాకపోవచ్చు.
నెల్లూరు జిల్లాలో కొత్త విధానం
ఓ వైపు కాలం నెత్తి మీద కొచ్చినా తగినన్ని వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి, మరిన్ని కష్టాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ దృశ్యమే కనిపిస్తోంది. సబ్సిడీ ఎరువులు కొనుక్కోవడం పెద్ద ప్రహసనంగా మారుతోంది.
వ్యవసాయానికి పెట్టింది పేరు నెల్లూరు జిల్లా
వ్యవసాయానికి పెట్టింది పేరు నెల్లూరు జిల్లా. నెల్లి అంటే తమిళంలో వరి అని అర్ధం. ఎక్కువగా ఇక్కడ వరిని సాగు చేస్తారు కాబట్టే ఈ జిల్లాకు నెల్లూరు జిల్లా అని పేరు కూడా వచ్చింది. జిల్లాలో సుమారు 8 లక్షల మంది రైతులకు వ్యవసాయమే జీవనాధారం. అయితే వీరిలో ఎక్కవ మంది చిన్న సన్న కారు రైతులే. రెండేళ్ల నుంచి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అటు వర్షాలు లేక, పంటలు పండక కరువుతో అల్లాడిపోయారు ఈ జిల్లా రైతులు. సాధారణ వర్షపాతం కూడా 50శాతం తక్కువ నమోదైంది. గత ఖరీఫ్, రబీ సీజన్ లో కనీసం 50 శాతం పంటలు కూడా పండలేదు. ఇంతటి తీవ్ర మైన కరువు పరిస్థితిని మొన్నటి వరకు రైతులు ఎదుర్కొన్నారు.
యూరియా-కాంప్లెక్స్ ఎరువులు దొరకడం గగనం
ఈ సీజన్ లో నెల్లూరు జిల్లాలో 8 నుంచి 10 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. ఎక్కువ శాతం వరి పంటనే సాగు చేస్తారు. అయితే ఈ ఖరీఫ్ లో డిమాండ్ కు తగ్గట్లు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు దొరకడం కష్టంగా మారుతోంది.
కలెక్టర్ జానకి.. కొత్త విధానం
యూరియా పంపిణీ విషయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు . ఏపిలో ఎక్కడాలేని ఈ విధానాన్ని మొదటి సారిగా జిల్లాలో అమలు చేస్తున్నారు. దీని ప్రకారం గతంలో మాదిరి రైతు.. సొసైటీలు, డీలర్ల దగ్గరకు నేరుగా వెళ్లి యూరియా తీసుకునే అవకాశం ఉండదు. రైతు యూరియా తీసుకోవాలంటే ముందుగా మండల కేంద్రంలో వున్న వ్యవసాయాధికారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలంటే రైతు తన పొలంకు సంబంధించిన పాస్ పుస్తకాలు కాని, టెన్ 1 అడంగళ్ కాని, మరేదైనా ధృవీకరణ పత్రం కాని చూపాలి. అవి చూపిస్తేనే ఏ.ఓ పర్మిషన్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు . ఆ తరువాత పర్మిషన్ ఇచ్చిన లెటర్ ను మీసేవ కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ యూరియాకు డబ్బులు కట్టి ఆ చలానాను డీలర్ల దగ్గరకు తీసుకెళ్తే యూరియా లభిస్తుంది. రైతులకు ఎరువులను సక్రమ పంపిణీ కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని అధికారులు చెబుతున్నా ఈ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
500 మంది ప్రైవేటు డీలర్లు.. ఎరువుల అంగళ్లు
నెల్లూరు జిల్లాలో సుమారు 500 మంది ప్రైవేటు డీలర్లు ఎరువుల అంగళ్లు నిర్వహిస్తున్నారు. 99 సొసైటీలు గ్రామాల్లో ఎరువుల అంగళ్ల ద్వారా రైతులకు ఎరువులను చేరవేస్తున్నారు. ఈ సారి జిల్లాకు ఈ సీజన్ లో 41,000 మెట్రిక్ టన్నుల యూరియా విడుదల కాగా, దాంట్లో 50 శాతం ప్రైవేటు డీలర్లకు, మిగతా 50 శాతం మార్క్ ఫెడ్ కిచ్చారు. అయినా రైతులకు ఈ కొత్త విధానం వల్ల ఎరువులు సక్రమంగా అందడంలేదు.
60 శాతం మంది కౌలు రైతులే
60 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. ఈ కొత్తవిధానం వల్ల వీరికి సబ్సిడీ ఎరువులు దొరకడం దుర్లభమే. . రైతులు యూరియా కొనుగోలు చేయాలంటే తమ పొలంకు సంబంధించిన పత్రాలు చూపాలని రూల్ పెట్టారు. అయితే కౌలు రైతులకు ఎలాంటి పత్రాలు ఉండవు. వాళ్లు కేవలం అసలు రైతుతో మాట్లాడుకుని పొలాన్ని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. తాజా నిబంధన కౌలు రైతులకు మరో శాపంగా మారుతోంది.
కొత్త విధానం.. రైతులు అప్పుల పాలు
జిల్లా ఉన్నతాధికారులు చేపట్టిన ఈ విధానంతో రైతులు మరింత అప్పులు పాలయ్యే అవకాశం వుందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అటు డీలర్లు కూడా ఈ వ్యాపారం చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతు సంఘాలతో చర్చించి రైతులకు ఇబ్బంది కలగని రీతిలో వ్యవహరించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

 

అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం:పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్

హైదరాబాద్:తమ దేశ మనుగడ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ అన్నారు. 'అణుబాంబులను ఉపయోగించడం మాకు ఉన్న ఐచ్ఛికాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం ఉంచడం లేదు. అవసరమైతే కచ్చితంగా అణుబాంబులను ఉపయోగిస్తాం. కానీ, ఆ అవసరం ఉత్పన్నం కాకూడదని ప్రార్థిస్తున్నాం' అని ఓ వార్తా చానల్‌తో పేర్కొన్నారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండటం భారత్, పాక్‌ల మధ్య పరోక్ష యుద్ధానికి దారి తీస్తోందన్నారు.

సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్ టూర్ వాయిదా

హైదరాబాద్:నేడు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జరిగే హరితహారంలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది.

తుపాకీ మిస్‌ఫైర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

విశాఖపట్నం:ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అవడంతో ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జీకేవీధి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అజయ్‌కుమార్ తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది.

తహసీల్దార్ వనజాక్షిపై పెదవేగి పీఎస్ లో కేసు నమోదు...

కృష్ణా:ముసునూరు మండలం రంగంపేటలో తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో తహశీల్దార్ ఫిర్యాదుతో ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదైంది. తాజాగా తహశీల్దార్ పై కౌంటర్ కేసు నమోదైంది. నిబంధనలకు లోబడే ఇసుక తరలిస్తున్న తమపై తహశీల్దార్ వనజాక్షి తన సిబ్బందితో కలిసి అకారణంగా దాడి చేశారని డ్వాక్రా మహిళలు పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పెదవేగి పోలీసులు వనజాక్షిపై కేసు నమోదు చేశారు.

10:20 - July 9, 2015

కృష్ణా: అక్రమార్జనే లక్ష్యంగా ఇసుక మాఫియా నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. రెవెన్యూ సిబ్బందిని నిలువరించేందుకు, మహిళా అధికారులపై సైతం దాడి చేసేందుకు కూడా వెనుకడుగువేయలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు మండల తహశీల్దారు వనజాక్షిపై... పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తన అనుచరులతో కలిసి దాడి.. చేసి.. తహశీల్దార్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చేసిన ఘటనపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణమైన ఎమ్మెల్యే చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదైంది. మరో వైపు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులు కాసేపట్లో కలెక్టర్‌ను కలవనున్నారు.

 

10:17 - July 9, 2015

విశాఖ: 'బాహుబలి' దెబ్బకు థియేటర్లు బలవుతున్నాయి. విశాఖలో బాహుబలి అభిమానులు హల్‌చల్‌ చేశారు. బాహుబలి మూవి ప్రదర్శించటం లేదని....ఓ థియేటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. దొండపర్తిలోని శ్రీకన్య థియేటర్‌పై అభిమానులు దాడి చేశారు. థియేటర్లు అద్దాలు ధ్వంసమయ్యాయి. అభిమానులపై యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

24న అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన

అనంతపురం:జిల్లాలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఈ నెల 24న మడకశిర, ఓబులదేవరచెరువుల్లో రాహుల్ పర్యటించనున్నారు.

ఎమ్మెల్యే చింతమనేని పై కేసు నమోదు...

పశ్చిమ గోదావరి:టీడీపీ నేత, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని, తన అనుచరులతో కలిసి నిన్న దాడి చేసిన సంగతి తెలిసిందే. తహశీల్దార్ తో పాటు ఆమె వెంట వచ్చిన రెవెన్యూ సిబ్బందిపైనా చింతమనేని అనుచరులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై తహశీల్దార్ వనజాక్షి ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

ఏసీబీ కార్యాలయానికి సండ్ర

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ తమ అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కోర్టు సండ్రను విచారణ నిమిత్తం రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. 80 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం....

హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండగా...సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

'వ్యాపం' పై నేడు సుప్రీంలో విచారణ

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన వ్యాపం కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. వ్యాపం కుంభకోణంపై దిగ్విజయ్‌సింగ్, కుమార్ విశ్వాస్ సహా దాఖలు చేసిన 9 పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారించనుంది. సీబీఐ విచారణ కోరుతూ ఇతర పిటిషన్లు సైతం దాఖలైయ్యాయి. వ్యాపం కుంభకోణంలో అనధికారికంగా ఇప్పటివరకు 50 మంది మృతిచెందారు. ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు రోజుకొకరు చొప్పున అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతున్న విషయం తెలిసిందే.

నగరంలో కొత్తగా 11 వైఫై హాట్ స్పాట్స్

హైదరాబాద్‌ : ఇంటర్నెట్‌ ప్రియుల కోసం నగ రంలోని ప్రధాన కూడళ్లలో వైఫై హాట్‌ స్పాట్స్‌తో పాటు కొత్తగా 11 వైఫై హాట్‌ స్పాట్‌ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ టెలికం జిల్లా(హెచ్‌టీడీ) పీజీఎం కె.దామోదరరావు తెలిపారు.

ఓ హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్ :చిన్నారికి గాయాలు...

గుంటూరు:క్రోసూరు మండలం ఎర్రబాలెంలో ఓ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఓ చిన్నారికి గాయాలు కాగా... హోటల్ మొత్తం దగ్ధమయ్యింది.

09:46 - July 9, 2015

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగల మహేష్, టిడిపి నేత సతీష్ మాదిగ, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి, హెచ్ ఎంఎస్ నేత రామారావులు పాల్గొని, మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు దేవుళ్లన్న సీఎం కేసీఆర్... కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధుల జీతాలు పెంచారు తప్పా.. కార్మికుల వేతనాలు పెంచడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

 

నేటి నుంచి ఎసిబి కస్టడీకి ఎమ్మెల్యే సండ్ర

హైదరాబాద్: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను నేటి నుంచి ఎసిబి అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారించనున్నారు. 

ప్రారంభమైన గోదావరి పుష్కరాల సారె శోభయాత్ర..

తిరుపతి: తిరుమల నుంచి గోదావరి పుష్కరాల సారె శోభయాత్ర ప్రారంభమైంది. పూజ సామాగ్రితో ప్రత్యేక వాహనంలో టిటిడి సిబ్బంది బయల్దేరింది. ఈనెల 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోదావరి పుష్కరాలకు టిటిడి సారె సమర్పించనున్నారు.

 

09:23 - July 9, 2015

నెల్లూరు జిల్లాలో యూరియా పంపిణీలో కొత్త విధానం అమలు చేయడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని రైతు సంఘం నేత శ్రీరాములు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'అన్నదాతకు మరో కష్టం వచ్చింది. యూరియా పంపిణీ విషయంలో నెల్లూరు జిల్లా అధికారులు కొత్త విధానానికి తీసుకొచ్చారు. నెల్లూరులో పెట్టిన కొత్త పద్ధతేమిటి? దీని వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? వంటి అంశాలపై శ్రీరాములు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విశాఖలో ప్రభాస్ అభిమానుల అందోళన

విశాఖ: థియేటర్ లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించకపోవడంతో ప్రభాస్ అభిమానుల ఆందోళన శ్రీకన్య థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు.

 

ఎమ్మెల్యే చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడికేసులో ఎమ్మెల్యే చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు అయింది. తహశీల్దార్ పై దాడి కేసులో చింతమనేని పై చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు నేడు కలెక్టర్ ను కలవనున్నారు.   

వ్యాపం కేసులో మరో సాక్షి మృతి

మధ్యప్రదేశ్: వ్యాపం కేసులో మరో సాక్షి మృతి చెందారు. కానిస్టేబుల్ సంజయ్ సిన్హా రెండు వారాల క్రితమే మృతి చెందారు. యూపిలోని హమీర్ పూర్ లో అనారోగ్యంతో మరణించారు. 

కొనసాగుతోన్న మున్సిపల్ కార్మికుల సమ్మె

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసాగుతోంది. సివరేజ్ కార్మికులందరూ సమ్మెలో ఉండటంతో రోడ్లపై మురుగునీరు పారుతోంది. వాటర్ బోర్డు సమ్మె కారణంగా నగరంలో నీటి పరఫరా బంద్ అయింది.

 

08:11 - July 9, 2015

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం కావడంతో.. కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వం సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తుందో.. ఎలా పరిష్కరిస్తుందో చెప్పడం లేదని కార్మిక సంఘ నేతలంటున్నారు.
కార్మికులు విధుల్లో చేరాలని కోరిన నాయిని
కార్మికుల జీతాలు పెంచేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని.. అయితే కొంత సమయం కావాలని కోరారన్నారని నాయిని తెలిపారు. కాబట్టి కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఒకవేళ విధుల్లో చేరకపోతే ప్రభుత్వం తమ పని తాము చేస్తామన్నారు.
పేరుకుపోయిన చెత్త
తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్‌లోనూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో.. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఆయా ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. సమ్మెలో భాగంగా కార్మికులు జోనల్‌ కార్యాలయాలను ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని.. అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె విరమించాలని తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ కల్పించుకొని మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్‌ దుర్గంధంగా మారడం ఖాయమని పలువురంటున్నారు.

 

07:52 - July 9, 2015

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు.. తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. పవన్‌కు టీడీపీ నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎంపీలు స్పెషల్‌ స్టేటస్‌ మరిచి వ్యాపారాలు చేసుకుంటున్నారన్న ఆయన మరోసారి ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. తనను తిట్టినంత మాత్రాన ఏపీకి ప్రత్యేక హోదా రాదని చురకలంటించారు. కేసులు పెడితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమంటూ టీడీపీ నేతలకు సవాలు విసిరారు.
మాటల తూటాలు
ఒకప్పుడు కలిసి తిరిగినవాళ్లే ఇప్పుడు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ స్టేటస్‌పైన దృష్టి పెట్టకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారన్న పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఎంపీల తీరుపై జనసేనాని మరోసారి ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. తనను తిట్టినంతమాత్రాన ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ రాదని కేశినేని నానిని ఉద్దేశించి పవన్‌ చురకలంటించారు. ఎంపీలు వ్యాపారం చేయడం తప్పు కాదన్న ఆయన.. వ్యాపారం మాత్రమే చేయడం తప్పన్నారు. తాను మాట్లాడిన దానిపై కొందరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెడుతున్నారని.. అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు. సీమాంధ్ర ఎంపీలు పౌరుషం చూపాల్సింది తనపై కాదని.. కేంద్రంపై చూపాలని ట్వీట్‌ చేశారు.
జనసేనా సైన్యాన్ని కదిలించిన పవన్‌ ట్విట్టర్‌ కామెంట్లు
పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ కామెంట్లు జనసేనా సైన్యాన్ని కదిలించాయి. కేశినేని నాని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. పవన్‌ మద్దతు లేకుండా రాజీనామా చేసి గెలవాలంటూ ఎంపీలకు సవాలు విసిరారు. అటు తిరుపతిలోనూ జనసేనా కార్యాకర్తలు కేశినేని నాని తీరును నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పవన్‌ ఫోటోలు పెట్టుకుని గెలిచిన వాళ్లు ఇప్పుడు ఆయనను తిట్టడంపై మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ కేశినేని నాని కామెంట్లపై జనసేన అభిమానులు విరుచుకుపడ్డారు. ఎంపీలు ఇప్పటికైనా ఏపీ అభివృద్ధికోసం పాటుపడాలన్నారు.
పవన్‌ కామెంట్లను వివాదం చేయొద్దు: కంభంపాటి
మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కామెంట్లను పెద్ద వివాదం చేయొద్దని ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు అన్నారు. కలిసి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆయన స్పెషల్‌ స్టేటస్‌ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు కొంచెం ఓపిక పెట్టాలని హితవుపలికారు. మొత్తానికి స్పెషల్‌ స్టేటస్‌ అంశం టీడీపీ- పవన్‌ కళ్యాణ్‌కు మధ్య అగాథాన్ని మరింత పెంచుతోంది. వీరి మాటల యుద్ధం ఎందాక వెళ్తుదో చూడాలి.

 

07:45 - July 9, 2015

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు బృందం జపాన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. చంద్రబాబు బృందం టోక్యో నగరాన్ని సందర్శించింది. షింబసీ స్టేషన్ నుంచి షింటో యొసు స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించారు. టోక్యోలో 2020 ఒలింపిక్స్ జరిగే ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. అనంతరం తోషిబా కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
ఏపీలో విద్యుత్ నిర్వహణపై తోషిబా ఆసక్తి
ఎనర్జీ వర్సిటీ ఏర్పాటులో తోషిబా భాగస్వామ్యం కావాలని ఏపీ సీఎం కోరారు. విశాఖ కేంద్రంగా గ్రిడ్‌పై పనిచేయాలని తోషిబా ప్రతినిధులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ నిర్వహణపై తోషిబా ప్రతినిధులు ఆసక్తి చూపారు. అంతకు ముందు చంద్రబాబు బృందం హోండా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్‌ కార్పోరేషన్‌ సందర్శన
అనంతరం చంద్రబాబు బృందం జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్‌ కార్పోరేషన్‌ను సందర్శించింది. వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఈ కంపెనీ పేరొందింది. ఏపీలో సైతం రెండు వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై సీఈవో హిసనోరి కనోవు ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది. సీఎం చంద్రబాబు ఏపీలోని ఏడు నగరాలలో వేస్టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు టెండర్లలో పాల్గొనాలని జేఎఫ్ఈ కంపెనీని ఆహ్వానించారు. జపాన్‌ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ ప్రతినిధి బృందంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు జపాన్‌ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి పయనమయ్యారు.  

07:41 - July 9, 2015

హైదరాబాద్: పాలనకు కేంద్ర బిందువు సచివాలయం. సీఎం, మంత్రులతో ఎప్పుడూ కళకళలాడాల్సిన సెక్రటేరియట్ వెల వెలబోతోంది. సీఎం కేసీఆర్‌ మొదటి నుంచి కూడా ఈ సచివాలయాన్ని ఇష్ట పడటం లేదు. వాస్తు దోషం ఉందని...బేగంపేట క్యాంప్‌ నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అప్పట్లో సీఎం అడపా దడపా సచివాలయానికి వచ్చే వారు. కానీ ఈ మధ్య పూర్తిగా రావడం మానేసారు. మిషన్ కాకతీయ, స్వచ్ఛ హైదరాబాద్, హరిత హరం వంటి కార్యక్రమాల్లో బయట బీజీగా ఉంటున్నారు. మహా అయితే నెలకు మూడు-నాలుగు రోజులకు మించి సచివాలయం వైపు చూడట్లేదు. దీంతో సీఎం పేషీల్లో ఫైల్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
ప్రజలను బాధిస్తోన్న సీఎం తీరు
సీఎం వ్యవహరం ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది. జిల్లాల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు కేసీఆర్‌ దర్శన భాగ్యం దొరకటం లేదు. సీఎం అయ్యాక ప్రతి రోజూ సామాన్యుల బాధలు తీర్చేందుకు గంట కేటాయిస్తానన్న ఆయన సంవత్సరం దాటినా... అలాంటి ప్రయత్నాలు చేయలేదు. విజిటర్ పాస్‌లను తగ్గించేశారు. మంత్రుల పేషీలకు తప్ప సీఎం పేషీ పాసులు ఇవ్వడం లేదు.
పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం...
సీఎం సచివాలయానికి రాకపోవడంతో డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె తీవ్రత ప్రభుత్వానికి తెలిసి రావడం లేదు. మున్సి పల్ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె బాటలో ఉన్నా పరిష్కారం కాలేదు. మంత్రులు చర్చలు జరిపినా.. డిమాండ్లు ముఖ్యమంత్రితో ముడిపడి ఉండటంలో చర్చలు కొలిక్కి రాలేదు. ఇక రెవిన్యూ సిబ్బంది కేవలం 8 గంటలే పనిచేస్తామని వర్క్ టు రూట్ నోటీసు ఇచ్చినా.. వాళ్లతో చర్చలు జరిపే నాథుడే లేడు. సీఎం అందుబాటులో లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. హెల్త్ సిబ్బంది, ఉపాధి హమీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు...ఇలా కార్మిక వర్గం సమ్మె బాటలో పయనిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రులు పరిస్థితి కూడా అంతే...
సీఎం సచివాయానికి రాకపోవడంతో.. మంత్రులు కూడా సెక్రటేరియట్‌కు ఎప్పుడొస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదు. జిల్లా నుంచి వచ్చిన పార్టీ కాడర్‌కే మంత్రులు అందుబాటులో ఉండనప్పుడు.. సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొందరు మంత్రులు శాఖ పరమైన సమీక్షల కోసం గంట రెండు గంటల కోసం సచివాలయానికి వస్తున్నారు. మిగతా సమయాల్లో ప్రారంభోత్సవాలు, సన్మానాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అధికారుల ఇష్టారాజ్యం
మరోవైపు మంత్రులు సచివాలయానికి రావడం తగ్గిపోవడంతో..అధికారులు కూడా తామేం తక్కువన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సమయ పాలన పాటించాలని ఆ మధ్య మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. తమపై పర్యవేక్షణ లోపించడంతో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రజా దర్బారు నిర్వహించాలంటున్న ప్రజలు
క్యాంప్ కార్యాలయానికే పరిమితం కాకుండా సీఎం సచివాలయానికి వస్తే..ఆటో మెటిగ్గా మంత్రులు, అధికార యంత్రాంగమంతా పాలనపై దృష్టి కేంద్రికరిస్తుందని.. సామన్యులంటున్నారు. దాంతో పాటు సీఎం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజా దర్బారు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

 

నేడు పుష్కర అఖండ స్వాగతజ్యోతియాత్ర ప్రారంభం

తూ.గో: నేడు పుష్కర అఖండ స్వాగతజ్యోతియాత్రను ఎపి డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అయినవిల్లిలో యాత్రను ప్రారంభించనున్నారు. 

నేడు పీడీఎఫ్ ఎమ్మెల్యే సామూహిక నిరాహార దీక్ష...

విజయవాడ: ఉపాధ్యాయుల అక్రమ బిదిలీలను నిరసిస్తూ నేడు పీడీఎఫ్ ఎమ్మెల్యే ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష చేయనున్నారు.

Don't Miss