Activities calendar

10 July 2015

నింగిలోకి పిఎస్ ఎల్ వి-సి28

శ్రీహరికోట: పిఎస్ ఎల్ వి-సి28 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్త్రో.. పిఎస్ ఎల్ వి-సి28 రాకెట్ ను ప్రయోగించింది. బ్రిటన్ కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి తీసుకెళ్తోంది. ఐదు ఉపగ్రహాల బరువు 1,440 కిలోలు. ఇస్త్రో చరిత్రలో ఇదే అత్యధిక భారీ వాణిజ్య ప్రయోగం. 

రాత్రి 9.58 గంటలకు నింగిలోకి పిఎస్ ఎల్ వి-సీ28

శ్రీహరికోట: పిఎస్ ఎల్ వి-సీ28 రాత్రి 9.58 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఒకేసారి ఐదు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఐదు ఉపగ్రహాల బరువు 1440 కిలోలు. ఇస్త్రో చరిత్రలో ఇదే అత్యధిక భారీ వాణిజ్య ప్రయోగం. 

దుబ్బాక శ్రీనివాస థియేటర్ లో కూలిన సీలింగ్

మెదక్: దుబ్బాక శ్రీనివాస థియేటర్ లో సీలింగ్ కూలింది. మహిళకు గాయాలయ్యాయి. దీంతో బాహుబలి సినిమా ప్రదర్శనను నిలిపి వేశారు. 

21:37 - July 10, 2015

హారారే: జింబాబ్వేతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అజింక్యా రహానే నాయకత్వంలోని టీమిండియా బోణీ కొట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగిన తొలివన్డేలో టీమిండియా.... 4 పరుగులతో జింబాబ్వేను ఓడించింది. 1-0 ఆధిక్యం సంపాదించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 255 పరుగులు చేసింది. తెలుగుతేజం అంబటి రాయుడి ఫైటింగ్ సెంచరీతో ఈ స్కోరు నమోదు చేయగలిగింది. సమాధానంగా 256 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా విజయంలో ప్రధానపాత్ర వహించిన రాయుడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జింబాబ్వే కెప్టెన్ ఎల్టన్ చిగుంబురా ఫైటింగ్‌ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ...4 పరుగుల ఓటమి తప్పలేదు.

 

21:34 - July 10, 2015

లండన్: వింబుల్డన్ మహిళల డబుల్స్ ఫైనల్స్ కు టాప్ సీడ్ జోడీ సానియా మీర్జా- మార్టీనా హింగిస్ చేరుకొన్నారు. సెమీఫైనల్లో అమెరికాజోడీ రాక్వెల్ స్పియర్స్, కోప్స్ ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. లండన్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో జరిగిన ఈ సెమీస్ సమరంలో... ప్రపంచ నెంబర్ వన్ సానియా జోడీకి పోటీనే లేకుండా పోయింది.

 

21:25 - July 10, 2015

హైదరాబాద్: ముస్లిం సోదరులకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఏపీ తరపున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ముస్లిం సోదరులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలెవరూ హాజరుకాలేదు.

 

ఉత్తరాఖండ్ లో ఐఎఎస్ అకాడమీలో కాల్పులు..

ఉత్తరాఖండ్: ముస్సోరిలోని ఐఎఎస్ అకాడమీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఐటిబిపి జవాను... సహచరుడిపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఐటిబిపి జవాను మృతి చెందాడు.

 

తొలివన్డేలో భారత్ విజయం..

హారారే: తొలివన్డేలో భారత్ విజయం సాధించింది. నాలుగు పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అంబటి రాయుడును వరించిది. జింబాబ్వే చివరి బంతి వరకూ పోరాడి ఓడింది. జింబాబ్వే కెప్టెన్ చిగుంబర సెంచరీ వృధా అయింది. భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
భారత్: అంబటి రాయుడు-124(నాటౌట్), బిన్నీ-77, జాదవ్-5, తివారి-2, పటేల్-2, మురళీ-1, ఊతప్ప-0.
జింబాబ్వే: చిగుంబర-104(నాటౌట్), సికిందర్ రాజా-37, మసకద్జా-34, సిబాండ-20, క్రెమర్-27.

 

వైసిపిలో చేరనున్న డొక్కా మాణిక్యవరప్రసాద్..?

హైదరాబాద్: మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసిపిలో చేరనున్నారు. ఈనెల 13న జగన్ సమక్షంలో చేరనున్నారు.

 

20:14 - July 10, 2015

కర్నూలు: జిల్లా ఎస్పీ రవికృష్ణ.. తన ఉద్యోగానికి రిజైన్ చేసి... టీడీపీ చేరిలో మంచిదని వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సలహా ఇచ్చారు. బాబు మెప్పు పొందేందుకు తమపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. కర్నూలు బదులు నంద్యాలలోనే ఉంటానన్న ఎస్పీకి వైసీపీ తరపున మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతామన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

 

20:08 - July 10, 2015

హైదరాబాద్: తెలంగాణలో పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పుష్కర ఘాట్ల దగ్గర మెడికల్ క్యాంపులను నిర్వహణ ఉంటుందని చెప్పారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. 5 జిల్లాల్లో నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.

20:00 - July 10, 2015

మహబూబ్‌నగర్‌: పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునే కుట్రలకు వ్యతిరేకంగా... మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. బంద్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. వేకువజాము నుంచే టీఆర్ఎస్ శ్రేణులు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బంద్‌ సంపూర్ణమైంది. అన్ని మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.

19:56 - July 10, 2015

హైదరాబాద్: పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు నిజాం కాలేజీ ప్రాంగణం సిద్ధమవుతోంది. ఇఫ్తార్‌ విందును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు, రాష్ట్ర ప్రముఖులు, ముస్లిం మత పెద్దలు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 2వేల మంది హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అతిథులకు హలీం వడ్డించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

 

ఫైనల్ కు చేరిన సానియా జోడీ

ఢిల్లీ: వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా జోడీ ఫైనల్ కు చేరింది. సెమీస్ లో అమెరికా జోడీ జోన్స్-స్పియర్స్ పై 6-1, 6-2 తేడాతో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది.

 

రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు

హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, సీపీ మహేందర్ రెడ్డి, ఎసిబి డీజీ ఎకె.ఖాన్, ఎపి ఎపి డిప్యూటీ సీఎం కేఈ, మండలి ఛైర్మన్ చక్రపాణి హాజరయ్యారు.

చెన్నైలో విమాన ప్రమాదం...

తమిళనాడు: చెన్నైలోని ఎయిరో బ్రిడ్జిని గోఎయిర్ విమానం ఢీకొట్టింది. ప్రయాణికులంగా సురక్షితంగా ఉన్నారు. విమాన పాక్షింగా దెబ్బతింది.

 

సమ్మె కొనసాగుతుంది: మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె విరమణతో తమకు సంబంధం లేదని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. సమ్మె కొనసాగుతుందని చెప్పారు. 

నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

హారారే: భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 94 పరుగుల వద్ద విలియమ్స్(0) ఔట్ అయ్యారు. 

19:17 - July 10, 2015

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి...వారం నుంచి ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న ఇదే మాట ఇదే చర్చ...తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఈ సినిమాకు వచ్చినంత హైప్ ఏ సినిమాకి రాలేదు అలాంటి భాహుభలి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా...ఇప్పుడు చూద్దాం.
కథ:
ప్రమాదకర పరిస్థితులలో ఒక చంటి పిల్లాడిని కాపాడి జలపాతానికి దిగువున నివసిస్తున్న కొండజాతి దగ్గరకు చేర్చి ప్రాణాలు విడుస్తుంది శివగామి.శివుడు అని పేరు పెట్టుకుని ఆ పిల్లాడిని తమతో పాటే పెంచుకుంటారు ఆ గిరిజన తెగ వర్గం.ఇక అప్పటినుంచి ఆ తెగలో ఒకడిగా బ్రతుకుతున్న శివుడికి జలపాతానికి పైన ఉన్న రహస్యాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తుంటాడు. అలా ఒక రోజు జలపాతం పై నుంచి ఒక అమ్మాయి ముసుగు క్రింద పడుతుంది. దీంతో జలపాతం పైన ఎవరో ఉన్నారనే సందేహం బలపడిన శివుడు అ జలపాతాన్ని ఎక్కేయడం ఆ అమ్మాయి అవంతిక అని తెలుసుకోవడం అవంతిక ప్రేమలో పడిపోవడం చక చకా జరిగిపోతాయ్. అ తర్వాత అవంతిక సాధారణ అమ్మాయ్ కాదని ఆ అమ్మాయికి ఒక లక్ష్యం ఆశయం ఉందని తెలుకున్న శివుడు, ప్రేమించిన అవంతిక కోసం ఆ బాధ్యతను తన బుజాల మీద వేసుకుంటాడు.అవంతిక కోరిక మేరకు లక్ష్య సాధన కోసం బయలుదేరిన శివుడుకి అసలు నిజం తెలుస్తుంది ..అసలు నిజం ఏంటి శివుడు తన లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది మిగిలిన కథ...
విశ్లేషణ:
కాసేపు సినిమా సంగతి పక్కన పెట్టి భారత దేశాన్ని ఒక్కసారిగా టాలీవుడ్ వైపు మరల్చిన రాజమౌళిని ముందుగా అభినందించాలి. తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమాకి కూడా ఇంతలా చర్చ జరగలేదేమో...రొటీన్ సినిమాలతో బోరు కొట్టి విషయం ఉన్న సినిమాలు ఎవరు తీయలేరా అని ప్రేక్షకులు బాధ పడుతున్న సమయం లో నేనున్నాను అంటూ రాజమౌళి ముందుకొచ్చాడు. వైవిద్యభరితమైన చిత్రాలతో హిట్ల మీద హిట్లు ఇచ్చాడు.ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడుకుంటూ బహుభాలి లాంటి మరో అసాధారణమైన చిత్రం తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు రాజమౌళి. కానీ ఈసారి మాత్రం బహుభాలి చిత్ర విషయంలో రాజమౌళి ప్రయత్నం తన స్థాయిని అందుకోలేదేమో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి పరంగా, ఆర్ట్ వర్క్ పరంగా, గ్రాపిక్స్ పరంగా రాజమౌళి టాలీవుడ్ ని మరో మెట్టు ఎక్కించాడు. కానీ కథ విషయం లో కథనం విషయం ఎంతో పక్కగా ఉండే రాజమౌళి ఈసారి మాత్రం నిరాశపరిచాడు.సినిమా మొదటి బాగాన్ని అధ్బుతంగా మొదలెట్టి ఇంటర్వెల్ కే అసలు పాయింట్ ని రివీల్ చేసేసి రెండవ బాగం ఏమాత్రం ఆసక్తి లేకుండా రూపొందించాడు.దీంతో సినిమా ఇంటర్వెల్ కే అయిపొయింది అనే భావన కల్పించారు. అంతే కాకుండా రాజమౌళి సినిమాలన్నింటికీ అద్బుత సంగీతాన్ని ఇచ్చే కీరవాణి కూడా ఈసారి విచిత్రంగా జస్ట్ మమ అనిపించాడు.కథ కథనం నాసిరకంగా ఉన్నప్పుడు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా ఎక్కడో వెలితిగా ఉంటుంది. ఈ సినిమాలో ఇదే జరిగింది. అధ్బుతమైన టెక్నికల్ వాల్యూస్ తో సినిమాని తెరకెక్కించినా కథ కథనాల లోపం తో సినిమా ఓ స్థాయికే పరిమితం అయింది.కానీ నటీనటుల పనితీరు మాత్రం అద్బుతం.రమ్యకృష్ణ అనుష్క రానా ప్రబాస్ ఒక్కరేమిటి నటీనటులందరూ ఇరగదీసారు.ఏది ఏమైనా కథ కథనానికి తప్ప మూడున్నరేళ్ళ రాజమౌళి కష్టానికి రాజమౌళి వైవిధ్యానికి రాజమౌళి విజన్ కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. సెంథిల్ సినిమాటోగ్రఫి కోసం సబు సిరిల్ ఆర్ట్ వర్క్ కోసం శ్రీనివాస్ మోహన్ అందించిన గ్రాపిక్స్ కోసం మాత్రం బహుభాలి చిత్రాన్ని తప్పక చూడచ్చు.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫి
ఆర్ట్ వర్క్
గ్రాఫిక్స్
నటీనటుల అభినయం
మైనస్ పాయింట్స్
కథ
కథనం
సంగీతం
నేరేషన్
పోరాట సన్నివేశాలు
టెన్ టివి రేటింగ్.. 3/5

 

19:14 - July 10, 2015

ఢిల్లీ: జపాన్ పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని ఎసి సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జపాన్ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనేక కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతామని జపాన్ పారిశ్రామకవేత్తలు అన్నారని ఆయన చెప్పారు. పలు రాంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలు అంగీకారించారని వెల్లడించారు. తిరుపతిని సేఫ్ సిటీగా చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. రాజధాని పౌండేషన్ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీతోపాటు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించనున్నట్లు వివరించారు.

 

ఎపి మున్సిపల్ కార్మికులతో చర్చలు ఎల్లుండికి వాయిదా..

విజయవాడ: మున్సిపల్ కార్మికుల సమస్యలపై రేపు జరగాల్సిన చర్చలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మంత్రి నారాయణ ఆకస్మికంగా చర్చలను వాయిదా వేశారు. సీఎం పర్యటనలో తానూ పాల్గొనాల్సి ఉన్నందున చర్చలను వాయిదా వేయాల్సి వచ్చిందని నారాయణ ప్రకటించారు. చర్చలను అర్ధాంతరంగా వాయిదా వేయడంపై మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ... సమ్మె కొనసాగుతుందని మున్సిపల్ జేఏసీ నాయకుడు కె.ఉమామహేశ్వరరావు తెలిపారు.

 

టీ.మున్సిపల్ కార్మిక సంఘాల మధ్య సర్కార్ చిచ్చు...

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘాల మధ్య టీసర్కార్ చిచ్చు పెడుతోంది. జీహెచ్ ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ తో సమ్మె విరమింపచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయించింది. అయితే ఇతర కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మె కొనసాగుతుందని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. 

ఈనెల 12న ముస్లీం ఉద్యోగులకు హాఫ్ డే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు సందర్భంగా.. ఈనెల 12.. ఆదివారం రోజున ముస్లీం ఉద్యోగులకు అత్యవసర విధుల నుంచి మినహాయింపు ఇచ్చింది. హాఫ్ డే ప్రకటించింది.

 

చింతమనేనిని అరెస్టు చేయాలి: వెంకటేశ్వర్లు

విజయవాడ: మంత్రి దేవినేని ఉమాతో రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశమైంది. తహశీల్దార్ పై దాడి చేసిన చింతమనేనిని అరెస్టు చేయాలని ఆసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తహశీల్దార్ వనజాక్షికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. 

17:35 - July 10, 2015

కడప: జిల్లాలో యువతుల ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టైంది. మాయమాటలతో మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దించేందుకు తీసుకెళ్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 25మంది యువతులను కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ లో తరలిస్తుండగా... రక్షించారు. రైల్వే స్టేషన్ కు వచ్చిన ఓ మహిళా మండలి అధ్యక్షురాలు వారిని చూసి విచారించారు. అమ్మాయిలు పొంతనలేని సమాధానాలు చెప్పండంతో... అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. 

17:30 - July 10, 2015

మహిళా వార్తల సమాహారంతో ఈవారం మానవి మీ ముందుకు వచ్చింది.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

17:20 - July 10, 2015

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌ మీదుగా వాయుగుండం పయనించనుంది. మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జార్ఖండ్‌ నుంచి తెలంగణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

17:02 - July 10, 2015

జింబాబ్వే: భారత్-జింబాబ్వే తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ జోరు కొనసాగుతోంది. భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 255 పరుగుల చేసింది. అంబటి రాయుడు సెంచరీతో చెలరేగాడు. 10 బౌండరీలు, ఒక సిక్సర్ తో సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్ లో రాయుడుకు ఇది రెండో సెంచరీ. స్టూవర్ట్ బిన్నీతో కలిసి... ఆరో వికెట్ కు రాయుడు సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్ లో బిన్నీ తొలి హాఫ్ సెంచరీ చేశారు. భారత్ బ్యాటింగ్: రాయుడు (124) నాటౌట్, బిన్నీ (77), కేదార్ జాదవ్ (5), అక్షర్ పటేల్ (2), ఊతప్ప(0).

 

సెంచరీతో చెలరేగిన రాయుడు...

జింబాబ్వే: భారత్-జింబాబ్వే తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జోరు కొనసాగుతోంది. అంబటి రాయుడు సెంచరీతో చెలరేగాడు. భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 255 పరుగుల చేసింది. భారత్ బ్యాటింగ్: రాయుడు (124) నాటౌట్, బిన్నీ (77), కేదార్ జాదవ్ (5), అక్షర్ పటేల్ (2), ఊతప్ప(0).

16:44 - July 10, 2015

విజయవాడ: తహశీల్దార్‌ వనజాక్షిపై జరిగిన దాడి ఘటనను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. తహశీల్దాదర్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ ఘటనపై మంత్రి దేవినేనిని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు అంగీకరించిన మంత్రి.. పూర్తిస్థాయిలో విచారించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏ.. చర్యలు తీసుకునేది సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని దేవినేని అన్నారు. సీఎం... బాధిత తహశీల్దార్ ను సోమవారం కులుస్తారని చెప్పారు. తహశీల్దార్ పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. 

 

 

ఎమ్మార్వోపై దాడికి పాల్పడినవారిపై చర్యలు: దేవినేని ఉమా

విజయవాడ: తహశీల్దాదర్ వనజాక్షిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎపి మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై ఏ.. చర్యలు తీసుకునేది సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని దేవినేని అన్నారు. తహశీల్దార్ పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. బాధిత తహశీల్దార్ ను సోమవారం సీఎం.. కులుస్తారని చెప్పారు. 

16:36 - July 10, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కస్టడీ ముగిసింది. సండ్రకు ఈ నెల 21 వరకూ కోర్టు రిమాండ్‌ విధించింది. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న ఏసీబీ రెండు రోజుల పాటు విచారించింది. ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న సండ్రను విచారించిన ఏసీబీ సండ్ర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. కస్టడీ ముగియడంతో సండ్రను ఉస్మానియాలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అనంతరం సండ్రను కోర్టులో హాజరుపరచి, చర్లపల్లి జైలుకు తరలించారు. 

సండ్రకు ఈనెల 21 వరకు రిమాండ్

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఈనెల 21 వరకు రిమాండ్ విధిస్తు.. ఎసిబి కోర్టు తీర్పు వెలువరించింది. సండ్ర వెంకటవీరయ్య ఎసిబి కస్టడీ ముగిసింది. ఓటుకు నోటు కేసులో రెండు రోజులపాటు సండ్రను ఎసిబి విచారించింది. వైద్య పరీక్షల కోసం సండ్రను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక ఎసిబి అధికారులు సండ్రను ఎసిబి కోర్టులో హాజరు పరిచారు. ఈమేరకు ఎసిబి కోర్టు... సండ్రకు ఈనెల 21 వరకు రిమాండ్ విధించింది. సండ్రను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.

 

జపాన్ పర్యటన సంతృప్తికరం:చంద్రబాబు

ఢిల్లీ: జపాన్ పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని ఎసి సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనేక కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతామని జపాన్ పారిశ్రామకవేత్తలు అన్నారని ఆయన చెప్పారు.

16:06 - July 10, 2015

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎసిబి కస్టడీ ముగిసింది. ఓటుకు నోటు కేసులో రెండు రోజులపాటు సండ్రను ఎసిబి విచారించింది. వైద్య పరీక్షల కోసం సండ్రను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక ఎసిబి అధికారులు సండ్రను కోర్టులో హాజరు పర్చనున్నారు. అనంతరం సండ్రను చర్లపల్లి జైలు తరలించే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో తాను ఎవరితో మాట్లాడలేదని విచారణలో సండ్ర తెలిపినట్లు తెలుస్తోంది. 

16:01 - July 10, 2015

కృష్ణా: జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సమ్మె రెండోరోజుకు చేరింది. ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి నిరసనగా ఉద్యోగులు విధులు బహిష్కరించారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

15:54 - July 10, 2015

మహబూబ్ నగర్: సీఎం కేసీఆర్ పై టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన అనంతరం కొండంగల్ లో రేవంత్‌రెడ్డి తొలిసారి మీడియాతో మాట్లాడారు. పాలమూరు బంద్ ను ప్రభుత్వమే ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు తెర లేచిందన్నారు. జరం ముసుగులో కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడని విమర్శించారు. కమీషన్లకు ఆశపడి...కెవిపి రామచంద్రరావుకు ప్రాజెక్టులు అండగట్టారని ఆరోపించారు. వైఎస్సార్..ఆత్మ కేసీఆర్ ను ఆవిహించిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉద్దేశించి తెలంగాణలో యాసలో మాట్లాడుతూ.. 'తాసీలోడు తెలంగాణకు తగులుకున్నాడు' అని వ్యంగాస్త్రాలు సందించారు. పాలమూరు ప్రజలను టీఆర్‌ఎస్‌ మభ్యపెడుతోందని విమర్శించారు. కృష్ణాబోర్డు అనుమతితోనే ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టులు కట్టాలని రేవంత్‌ అన్నారు. పాలమూరు ప్రాజెక్టును ఆపాలని ఏపీ ప్రభుత్వం చెప్పలేదని రేవంత్‌ తెలిపారు. ప్రభుత్వమే బంద్‌కు పిలుపునివ్వడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

 

పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ కుట్ర:రేవంత్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ఈమేరకు రేవంత్ మీడియాతో మాట్లాడారు. పాలమూరు బంద్ ను ప్రభుత్వమే ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 

15:42 - July 10, 2015

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతి నిర్మాణానికి జాతీయ ప్రాధాన్యత ఉందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అటవీ భూములు డీనోటిఫై చేయడానికి కేంద్రం అంగకరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమమయ్యారు. రాజధాని నిర్మాణానికి అటవీ భూములు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలోనూ అటవీ భూములివ్వాలని ఉందన్న చంద్రబాబు...ఇదే విషయాన్ని ప్రకాశ్‌ జవదేకర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో ఆ.. భూములను డీనోటిఫై చేయడంతో పాటు చట్టపరమైన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామని హామి ఇచ్చారని చంద్రాబాబు వెల్లడించారు.

 

15:36 - July 10, 2015

మాస్కో: రష్యాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇరువురు నేతల మధ్య ఉగ్రవాదం, కాశ్మీర్‌ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరుదేశాలకు చెందిన మత్స్యకారులను విడుదల చేసేందుకు ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. ఉగ్రవాది లఖ్వి విడుదలను నిరసిస్తూ ప్రధాని మోదీ పాక్‌ ముందు ప్రస్తావించారు. పాకిస్తాన్‌లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరు కావాలని నవాజ్‌షరీఫ్‌ మోడీని ఆహ్వానించారు. వచ్చే ఏడాది ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. 

సండ్రకు ముగిసిన ఎసిబి కస్టడీ..

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎసిబి కస్టడీ ముగిసింది. ఓటుకు నోటు కేసులో రెండు రోజులపాటు సండ్రను ఎసిబి విచారించింది. వైద్య పరీక్షల కోసం సండ్రను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక ఎసిబి అధికారులు సండ్రను కోర్టులో హాజరు పర్చనున్నారు. 

గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని టీ.కాంగ్రెస్ నిర్ణయం

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. 

13:32 - July 10, 2015

హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా, నాజర్ లాంటి స్టార్ కాస్ట్ తో నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ, హిందీ బాషల్లో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడుసంవత్సరాల పాటు తీసిన బాహుబలి సినిమా పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరి ఆ సినిమాఎంత వరకు ఆకట్టుకుంది, హిట్టా.. ఫట్టా అనే అంశంపై 'టెన్ టివి' చర్చను చేపట్టింది. ఈ చర్చలో విశ్లేషకులు పి.శ్రీధర్ బాబు, సతీష్ లు పాల్గొని విశ్లేషణ చేశారు. బాహుబలిని విశ్లేషిస్తూ వారు చేసిన ఆసక్తికరమైన చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయాల్సిందే.

'అమరావతి నిర్మాణానికి సహకరిస్తానానని జవదేకర్ తెలిపారు'

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నివిధాల సహకరిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ఉన్న న్యాయపరమైన వివాదాలపై చట్టప్రకారం నడుచుకుంటామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశ్ జవదేకర్ తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జవదేకర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో ఎక్కువ శాతం అడవులు పోతున్నందున పరిహారంగా మరింత ఎక్కువ విస్తీర్ణంలో అడవులను పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు.

సోల్ మన్ దీవుల్లో భూకంపం

సిడ్నీ : దక్షిణ పసిఫిక్‌లోని సోలోమన్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.5గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. పది సెకన్ల పాటు భూమి కంపించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు.

 

13:00 - July 10, 2015

హైదరాబాద్:గవర్నర్ ఇచ్చే ఇప్తార్ విందు ప్రాధాన్యం సంతరించుకుంటోంది..? ఈ కార్యక్రమానికి రానున్న ఇద్దరు చంద్రులపైనే అందరి చూపులు ఉండనున్నాయి.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు పలకరించుకుంటారా..? లేదంటే అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తారా..?ఇదే అంశం ఆసక్తికర మారుతోంది...                                         
ఇద్దరు సీఎంల విమర్శల పర్వం....
ఓటు కు నోటు వ్యవహారం ఇద్దరు చంద్రుల మధ్య దూరాన్ని పెంచింది... గతేడాదిగా తెలుగు రాష్ట్రాల సీఎంలు అడపా దడపా ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం ఎత్తుకు పైఎత్తులు వేయడం జరుగుతూనే ఉంది.. కానీ చాలా సందర్బాల్లో చంద్రబాబు, చంద్రశేఖర్ రావు బాగానే పలకరించుకున్నారు.. నాగార్జున సాగర్ వివాదం వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకొని రాజ్ భవన్ వేదికగా సామరస్య సంకేతాలు పంపారు... ఆ తర్వాత గవర్నర్ తో ఇద్దరి భేటీలోనూ ఏపీ కొత్త రాజధాని వాస్తు బాగుందంటూ కేసీఆర్ బాబుతో అన్నారు.. గతంలో ప్రణబ్ వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులోనూ అనుకున్నది సాధించావ్ అంటూ కేసీఆర్‌తో బాబు అన్నారు.. కానీ ఇప్పుడా పలకరింపులు ఉంటాయా...
టీఆర్ఎస్‌-టీడీపీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు....
ఓటుకు నోటు వ్యవహారం జరిగిన తర్వాత అటు తెలుగుదేశం ఇటు టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇద్దరూ సీఎంలు ఎక్కడా తగ్గడం లేదు.. ప్రణబ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్ సాదర స్వాగతం పలికారు.. అయితే చంద్రబాబు మాత్రం ప్రోటో కాల్ కారణం చూపిస్తూ హాజరు కాలేదు... మరుసటి రోజు గవర్నర్.. ప్రణబ్ రాక సందర్బంగా ఏర్పాటు చేసిన విందు సమావేశానికి జ్వరంగా ఉందంటూ కేసీఆర్ గైర్హాజరయ్యారు.. చంద్రబాబు హాజరయ్యారు... అయితే ఇద్దరు ఎదురు పడేందుకు ఇష్టం లేక ఈ రెండు సందర్బాల్లో హజరు కాలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది... కానీ ఇద్దరు హజరుకావాల్సిన సందర్బం ఇప్పుడు వచ్చింది..
శుక్రవారం గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు....
గవర్నర్ నరసింహాన్ శుక్రవారం ఇప్తార్ విందు ఇస్తున్నారు.. ఇద్దరు సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, స్పీకర్లు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.. మరి ఇక్కడ ఎదురుపడితే చంద్రబాబు, చంద్రశేఖర్ రావు హావభావాలు ఎలా ఉంటాయి.. ఒకరికొకరు ఉభయకుశలోపరి భావాలు పంచుకుంటారా.. పుష్కరాల ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయంటూ మాట్లాడుకుంటారా అనేది హాట్ టాఫిక్కే....
ఇఫ్తార్‌ విందుకు దూరంగా కాంగ్రెస్‌....
అయితే ఇఫ్తార్ విందుకు హజరుకావొద్దని టీ కాంగ్రెస్ నిర్ణయించింది.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలికే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత జానారెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం పంపలేదట... దీంతో ఆ పార్టీ నిరసనగానే వెళ్లకూడదని డిసైడ్ అయ్యింది.. మరోవైపు వీడ్కోలు కార్యక్రమానికి, తేనేటీ విందుకు కొన్ని మీడియా సంస్థలకు మాత్రం సమాచారమిచ్చారని గవర్నర్ తీరును కొందరు ప్రశ్నిస్తున్నారు.

12:55 - July 10, 2015

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో... ఆ మాటకొస్తే యావత్ దేశంలోనే తమకంటూ ఓ ఎమ్మెల్యే లేని ప్రజలు ఎక్కడైనా ఉన్నారా..? అసలు ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా..?? ఎక్కడాలేని దుస్థితి ఇక్కడ నెలకొంది..! తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు..! తమ ఇబ్బందులపై ఎవరు స్పందిస్తారో అర్థం కావట్లేదు..! తమ డిమాండ్లను ఎవరు నెరవేరుస్తారో అంతుబట్టట్లేదు..! తమకంటూ ఓ ప్రతినిధి లేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇక్కడి ప్రజానీకం...
ఎక్కడా కనీవినీ ఎరుగని వైపరీత్యం...
స్వతంత్ర భారతంలోనే ఇలాంటి దుస్థితి ఎవ్వరికీ దాపురించి ఉండదు... ఆ గిరిజనులకు తప్ప, ఏ ప్రాంతానికీ ఈ దౌర్భాగ్యం దాపురించి ఉండదు... ఏడు మండలాలకు తప్ప..!వారు ఓట్లేసిన ప్రజాప్రతినిధి వారికి కాకుండా పోయాడు. తనకు ఓట్లు వేసిన వారి సమస్యలపై మాట్లాడే అవకాశం ఆ ప్రజాప్రతినిధికి లేకుండా పోయింది..! ఎక్కడా లేని, ఎన్నడూ ఎదురుకాని ఈ సమస్య ప్రస్తుతం పోలవరం ముంపు ప్రాంతాల్లో నెలకొంది. అడకత్తెరలో పోకచెక్కలా ప్రజలు నలిగిపోతుంటే, ఏం చేయాలో అర్థంకాక వారి ఎమ్మెల్యే ఇబ్బంది పడుతుంటే.. చోద్యం చూస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.
పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడంతో ఈ సమస్య...
ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడంతో ఈ సమస్య పుట్టుకొచ్చింది. పోలవరం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేసింది. ఈ ఏడు మండలాలు గతంలో తెలంగాణలోని భద్రాచలం, అశ్వారావుపేట, బూర్గంపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రాంతాలు. అయితే.. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో.. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజలకు ప్రాతినిథ్యం వహించలేని పరిస్థితి నెలకొంది. ముంపు ప్రాంతాల్లో సుమారు లక్షా పదివేల మంది ఓటర్లున్నారు. వీరికి ప్రస్తుతం ప్రజాప్రతినిధి లేకుండా పోయారు. అత్యధికులు గిరిజనులు ఉండే ఈ ప్రాంతంలో.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక స్థానికులు అవస్థలు పడుతున్నారు.
ప్రజాప్రతినిధుల సమస్యతోపాటు....
ప్రజాప్రతినిధుల సమస్యతోపాటు, తాజాగా కొత్త సమస్యను సైతం ఈ ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి. ముంపు ప్రాంతాల్లో పనిచేసే తెలంగాణా ఉద్యోగులు తిరిగి తెలంగాణకు వచ్చేశారు. ఉపాధ్యాయులు, ఐటిడిఏ, విద్యుత్తు, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మూడు వేల మంది వరకు తెలంగాణకు వెనుతిరిగారు. అయితే.. ముంపు మండలాల్లో ఖాళీ అయిన పోస్టులను ఏపీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు భర్తీ చేసే పరిస్థితి లేదు. దీంతో.. ఆ ప్రాంతాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోయింది.
ఉపాధ్యాయులు లేక ....
ఉపాధ్యాయులు లేక 70 పాఠశాలల తెరిచే పరిస్థితి లేదంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇక, వర్షాకాలంలో దేశంలోనే అత్యధికంగా మలేరియా కేసులు ఈ ఏజెన్సీలో నమోదవుతుంటాయి. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్థానికత లేదన్న కారణంగా ఈ ప్రాంతాలకు చెందిన 250 మంది యువకుల దరఖాస్తులను తిరస్కరించారు. ఈ విధంగా ఒకటికాదు, రెండు కాదు.. ఎన్నో సమస్యలు గిరిజనులను పీడిస్తున్నాయి. అయినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకూడా లేకపోవడం గమనార్హం.
పోరాడుతున్న భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే
ఈ పరిస్థితిపై భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే పోరాడుతున్నారు. విషయాన్ని చంద్రబాబు దృష్టికీ, చివరకు రాష్ట్రపతి దృష్టికీ తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీలో తనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినా.. ఏపీ సర్కారు ఇప్పటికీ స్పందించలేదు. ఇకనైనా స్పందించకపోతే.. అమాయక గిరిజనులు మరింత అవస్థల పాలయ్యే ప్రమాదం పొంచిఉంది.

12:48 - July 10, 2015

హైదరాబాద్:రష్యాలోని యుఫాలో ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీయ్యారు.. రెండు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు... వివిధ అంశాలపై చర్చించారు.. దాదాపు 50 నిమిషాలపాటు చర్చలు కొనసాగాయి.. దాదాపు ఏడాదితర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు.. శిఖరాగ్ర సమావేశాలకోసం ఇద్దరు ప్రధానులు రష్యావచ్చారు..

బంగ్లాదేశ్ లో తొక్కిసలాట:23 మంది మృతి

బంగ్లాదేశ్ : పవిత్ర రంజాన్ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ మైమెన్‌సింగ్ పట్టణంలో ఉచితంగా వస్ర్తాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీంతో అక్కడికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. భారీగా ముస్లింలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 23 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

వనజాక్షితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు..

హైదరాబాద్: ముసునూరు తహశీల్దార్ వనజాక్షితో ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు తహశీల్దార్ ఫోన్ లో మాట్లాడారు. ఇసుక రీచ్ గొడవపై సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇటు రెవెన్యూ ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను సీఎం ఆదేశించారు.
 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే

హరారే: భారత్-జింబాబ్వే జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి వెన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్‌ను ఎంచుకుంది.
 

రెవెన్యూ ఉద్యోగులతో మంతనాలు జరుపుతున్న ఏపీ మంత్రులు...

విజయవాడ:రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన విరమింపజేసేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. రెవెన్యూఉద్యోగ సంఘాలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేనితో మాట్లాడిస్తామని ముసునూరు తహశీల్దారు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.

 

నందిగామ తహశీల్దార్ కార్యాలం ఎదుట ఉద్యోగులు ఆందోళన

కృష్ణా: నందిగామ తహశీల్దార్ కార్యాలం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మైలవరం, జి. కొండూరు. ఇబ్రహీంపట్నం, రెడ్డి గూడెం తహశీల్దారు కార్యాలయాలకు తాళాలు వేసి రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేపట్టారు.

సిమ్లాలో సమీపంలో రోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి

హిమాచల్‌ప్రదేశ్ :సిమ్లా సమీపంలోని రాంపూర్ వద్ద వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు.

అమర్ నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్: దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో పహల్ గమ్, బాల్తల్ దారులను వర్షాల కారనంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అమర్ నాథ్ యాత్ర నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

11:50 - July 10, 2015

హైదరాబాద్:తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఐటియు ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు.కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, బోనస్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత చుక్కారాములు, రాజారావు, సాయిబాబు పాల్గొన్నారు.

11:46 - July 10, 2015

విజయవాడ:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిఐటియు, ఏఐటియూసీ, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ సంఘాల నేతలు పాల్గొన్నారు. ధర్నాకు మున్సిపల్ కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
తిరుపతిలో కొనసాగుతున్న ఆందోళన
తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. సిఐటియు నేత వీరికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులు చేసిన సేవ ఎవరూ చేయలేరని కార్మికులు కోరుతున్న న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక మంత్రిగా ఉన్న నారాయణ తుళ్లూరు మంత్రి.. ఇప్పుడు జపాన్ మంత్రి అయిపోయారు. ప్రజారోగ్యం నష్టపోక ముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.
విశాఖ లో..
జీవీఎం సీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. రేపటి లోగా తమ సమస్యలు పరిష్కరించపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గుంటూరులో
నగర కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న 2500 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. పదో పీఆర్సీ అమలు అయిన తరువాత కనీస వేతనం చెల్లించాలని వుంది. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

11:40 - July 10, 2015

హైదరాబాద్:మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు సమ్మెను విరమించేది లేదంటున్నారు. మరో వైపు సమ్మెతో హైదరాబాద్‌ నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు.

ప్రభాస్ ఫ్లెక్సీకి పాలభిషేకం చేసిన అభిమానులు

నల్గొండ: నగరంలోని వెంకటేశ్వర థియేటర్‌లో ప్రభాస్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాహుబలి సినిమా కథానాయకుడు ప్రభాస్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మరోవైపు ఇదే జిల్లాలోని భువనగిరిలో ఓంకార్‌ థియేటర్ వద్ద బాహుబలి సినిమా విడుదల సందర్భంగా మేకను బలి ఇచ్చారు.

12 నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు: రాం చరణ్

హైదరాబాద్: విమానయాన రంగంలో సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ అడుగు పెట్టాడు. ఈనెల 12 నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు రాం చరణ్ మీడియాకు తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్షయయంగా ట్రూజెట్ డొమెస్టిక్ సర్వీసులు హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రికి నడపున్నట్లు తెలిపారు. 15 నుంచి చెన్నై- రాజమండ్రి సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. 26నుండి రెగ్యుల్ సర్వీసులు ప్రారంభమౌతాని పేర్కొన్నారు. షిర్డీ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖ, చెన్నైకి ట్రూజెట్ సర్వీసులు నడపనున్నామని రాం చరణ్ తెలిపారు.

నవాజ్ షరీఫ్ తో ముగిసిన ప్రధాని మోడీ భేటీ

హైదరాబాద్: రష్యాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. సుమారు గంట పాటు జరిగిన చర్చల్లో ముంబై దాడులపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాకు వెల్లడించనున్నారు.

ఏపీ లో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

కృష్ణా: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిఐటియు, ఏఐటియూసీ, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ సంఘాల నేతలు పాల్గొన్నారు.

కూకట్ పల్లిలో 'బాహుబలి' చూసిన రాజమౌళి

హైదరాబాద్: కూకట్ పల్లి భ్రమరాంబిక, మల్లికార్జున సినీ కాంప్లెక్స్ లో దర్శకుడు రాజమౌళి తన సినిమా బాహుబలిని వీక్షించారు. ఆయన తో పాటు భార్య రమ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆయన భార్య శ్రీవల్లి, హీరోయిన్ అనుష్క తదితరులతో కలసి వచ్చారు. మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరగా నమస్తే పెట్టి నిష్ర్కమించారు.

వసుంధర రాజే రాజీమానా చేయాలి:టి.కాంగ్రెస్

రంగారెడ్డి:రాజస్థాన్ సీఎం వసుంధర రాజే రాజీమానా చేయాలని డిమాండ్ చేస్తూ వనస్థలిపురం చెక్ పోస్టు వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ వీహెచ్, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. వీరి ఆందోళనతో రెండుకిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారని అభిమానులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న అభిమానులపై బౌన్సర్ లు, పోలీసులు లాఠీఛార్జి చేశారు.

కనకదుర్గ ఆశ్రమం పీఠాధిపతి రామానంద భారతి కన్నుమూత

పశ్చిమగోదావరి:నల్లజర్ల మండలం అనంతపల్లిలో కనకదుర్గ ఆశ్రమం పీఠాధిపతి రామానంద భారతి (101) కన్నుమూశారు. పీఠాధిపతి మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

కృష్ణా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చంద్ర బాబు భేటీ

ఢిల్లీ: జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు.

తల్లీ కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి

గుంటూరు: నర్సరావు పేటలో తల్లీ కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

10:12 - July 10, 2015

హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ బాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ వెర్షన్‌లో ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 4,000 థియేటర్లలో సినిమా విడుదలైంది. అర్థరాత్రి నుంచే ప్రత్యేక షోలు వేశారు. టిక్కెట్ల విక్రమాల్లో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. దీంతో సామాన్యుడు సినిమా చూసే అవకాశాలు లేకుండా పోయాయి. మరో వైపు థియేటర్ల దగ్గర టికెట్ల కోసం వీక్షక్షులు భారీగా క్యూలు కట్టారు. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. టికెట్ల దక్కించుకునే క్రమంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు....

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 30 పాయింట్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి.

10:04 - July 10, 2015

హైదరాబాద్: ఎల్ బినగర్లో హంగామా చేశారు బాహుబలి అభిమానులు.. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారంటూ విజయలక్ష్మి థియేటర్ అద్దాలు ధ్వసం చేశారు.. గంటలకొద్దీ క్యూ కట్టినా టికెట్లు ఇవ్వడంలేదని ఆరోపించారు.. అలాగే టికెట్ క్యూలదగ్గరకోపంతో థియేటర్‌పై రాళ్లు విసిరారు.. వెంటనే పోలీసులు అభిమానులపై స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.. అటు టికెట్ క్యూలదగ్గర తోపులాట జరిగింది..

10:02 - July 10, 2015

హైదరాబాద్: మూడేళ్ల నిరీక్షణకు తెర పడింది. వెండితెర చరిత్రను తిరగరాయడానికి బాహుబలి వచ్చేశాడు. మైమరిపించే అవంతిక అందాలు.. ఆ అందాల కోసం యుద్ధానికి దిగే బాహుబలి వీరత్వం.. ఆ బాహుబలిని బలి తీసుకోవాలని చూసే రుద్రావతారుడు భళ్లాలదేవ.. కాపాడాలని చూసే రాజమాత మాహిష్మతి... అదే బాహుబలి కోసం దీనంగా ఎదురుచూసే దేవసేన... ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు.. మరెన్నో పాత్రలు. థియేటర్లో ప్రేక్షకులకు షడ్రుచులను అందించడానికి బాహుబలి వచ్చేశాడు. సినీ పరిశ్రమ రేంజ్‌పైనే యుద్ధం ప్రకటించిన ఈ జక్కన్న శిల్పం ఎంత అందంగా రూపుదిద్దుకుందో ఇప్పటికే కొందరు చూడగా.. మరికాసేపట్లో అందరూ చూడబోతున్నారు. ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా అద్భుతంగా తెరకెక్కించిన రాజమౌళి పాసయ్యాడో..ఫెయిలయ్యాడో మరికాసేపట్లో తేలిపోనున్నది.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధాని మోదీ భేటీ

హైదరాబాద్: రష్యా ఉఫాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

భద్రాచలంలో టీఎస్ మంత్రుల పర్యటన

ఖమ్మం:భద్రాచలంలో టీఎస్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డిలు పర్యటించారు. భద్రాద్రి రామాయలంలో ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం పుష్కర ఘాట్ల పనుల పై అధికారులతో సమీక్షించారు.

పబ్లిసిటీలోనూ ‘బాహుబలి’ ట్రెండ్‌సెట్టర్....

హైదరాబాద్:బాహుబలి చిత్ర నిర్మాణం మొదలైనప్పటి నుంచి అనధికారిక లీక్‌లు, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో సమాచారం వెల్లడించడం మినహా ప్రత్యేకించి ఖర్చుపెట్టి, పబ్లిసిటీ చేయలేదు. మీడియాను విభజించి, ఎంపిక చేసుకున్న కొన్ని పేపర్లకూ, టీవీలకు మాత్రం యూనిట్ ఇంటర్వ్యూలిచ్చింది. మీడియా వెంట తాను పడకుండా, మీడియానే తన వెంట పడేలా చేసుకోవడానికి నిర్మాతలు, ఈ చిత్ర బృందం చూపిన తెలివితేటలు, తద్వారా సినిమాకు సృష్టించిన హైప్ అనూహ్యం.

రెండో రోజు ప్రారంభమైన సండ్ర ఏసీబీ విచారణ

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు విచారణ ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటల వరకు విచారణ కొనసాగనుంది. విచారణ ముగిసిన అనంతరం సండ్రను ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

నటనా వైదుష్యాన్ని ప్రదర్శించిన రమ్యకృష్ణ

హైదరాబాద్: 'బాహుబలి' సినిమా మొదటి సీన్ లో రమ్యకృష్ణ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. సెకండాఫ్ లో వివగామిగా రమ్య కృష్ణ తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించింది. తర్వాత వాటర్ ఫాల్స్ నేపథ్యంలో ఆరడుగుల, ఆరు ప్యాక్ ల హీరో ప్రభాస్ శివుడిగా ఎంట్రీ ఘనంగా కనపడుతుంది. ఎవ్వడంట ఎవ్వడంట పాట. ఆ తర్వాత పాల జలపాతాల నేపథ్యంలో మిల్కీబ్యూటీ తమన్నా.. అవంతికగా దర్శనం ఇస్తుంది. కిట్టప్పగా సత్యరాజ్, అస్లాంఖాన్ పాత్రలో సుదీప్ ఎంట్రీలు కూడా స్క్రీన్ నిండుగా ఉంటాయి.. మాహిష్మతి రాజ్య వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. విలన్ పాత్రధారి రానాకు కూడా దర్శకుడు రాజమౌళి మంచి ఎంట్రీ బుల్ ఫైట్ తో ఇచ్చారు.

తెలంగాణ లో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేతనాల పెంపు కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరింది. వేతనాల పెంపుతో పాటు 16 డిమాండ్ల పరిష్కారానికి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో జరిపిన చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొనడంతో సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటికి పరిష్కారం చూపేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల నాయకులు తేల్చిచెబుతున్నారు. కార్మికుల సమ్మెతో వీధుల్లో చెత్త, చెదారం పేరుకు పోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

ఎల్బీనగర్ విజయలక్ష్మీ థియేటర్ పై దాడి

హైదరాబాద్‌:నగరంలోని ఎల్బీనగర్‌లో ఉన్న విజయలక్ష్మీ థియేటర్‌పై అభిమానులు దాడి చేసి థియేటర్‌ అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనలో నాలుగురికి గాయాలు కాగా అందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. దీంతో పలు థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకోవడం ఈదాడికి కారణమని తెలుస్తోంది.

బాహుబలికి మేక బలి

రంగారెడ్డి:నేడు విడుదలైన బాహుబలికి అభిమానులు మేక బలి ఇచ్చినట్లు ఫ్యాన్స్‌ పెట్టినట్లుగా చెబుతున్న ఓ ఫోటో వాట్సప్‌లో హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ పట్టణంలోని సినిమాక్స్‌ థియేటర్‌లో బాహుబలి మొదటి షోకు ఫ్యాన్స్‌ మేకను బలిచ్చారని చెబుతున్నారు. ఓ సినిమా కోసం మేకను బలి ఇవ్వడం కలకలం రేపింది.

 

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి..

హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ బాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ వెర్షన్‌లో ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 4,000 థియేటర్లలో సినిమా విడుదలైంది. అర్థరాత్రి నుంచే ప్రత్యేక షోలు వేశారు. టిక్కెట్ల విక్రమాల్లో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. దీంతో సామాన్యుడు సినిమా చూసే అవకాశాలు లేకుండా పోయాయి. మరో వైపు థియేటర్ల దగ్గర టికెట్ల కోసం వీక్షక్షులు భారీగా క్యూలు కట్టారు.

గ్రేటర్ పరిధిలో భారీగా పేరుకుపోయిన చెత్త

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా చెత్త పేరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది.

08:34 - July 10, 2015

తెలంగాణ వ్యాప్తంగా లక్ష మంది మున్సిపల్ కార్మికులు సమ్మెలో వున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనేపరిష్కరించాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' ప్రోగ్రాంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ డిమాండ్ చేవారు. రూ.7,500 లతో బంగారు తెలంగాణ సాధించలగమా? పాలమూరు కట్టడం అక్రమమని సీడబ్ల్యుసీకి చంద్ర బాబు లేఖ రాశారు. తెలంగాణ లో ప్రాజెక్టులు కట్టడం పై ఏపీ ప్రభుత్వం అడ్డుచెప్పడం సరికాదు. 'బాహుబలి సినిమా' పైరసీ పై మాట్లాడే సినిమా టీమ్ బ్లాక్ మార్కెటింగ్ పై ఎందుకు మాట్లాడటం లేదు? సినిమా పరిశ్రమ 4గురు పెద్దల చేతిలో ఉంది? సినిమా పరిశ్రమను మాఫియా నుండి విడుదల చేయాలి అని నాగేశ్వర్ అన్నారు. మరింత విశ్లేషణాత్మక చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

07:58 - July 10, 2015

హైదరాబాద్:మున్సిపల్ కార్మికులు సమస్యలు పట్టించుకోకుండా అధికారుల రివ్యూలతో స్వచ్ఛ తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది అని న్యూస్ మార్నింగ్ చర్చలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కార్మికుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? కార్మికులతో ప్రభుత్వం చర్చిస్తున్న తీరు సరిగా వుందా? ఇది ఒక్క కార్మికుల సమస్యేకాదు... ప్రజలతో ముడి పడి ఉందా?
బాహుబలి సినిమా టిక్కెట్ల అమ్మకాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో ఈ సినిమా టిక్కెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నతీరుపై తీవ్ర చర్చే జరుగుతోంది. సినిమా లపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదా? సమాజ సేవ గురించి సినిమాలు వస్తున్నాయా? చిన్న నిర్మాతలు బతకగలిగే పరిస్థితి వుందా? ప్రభుత్వాలు కొల్యూడ్ అయ్యాయా? ఇదే అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్యతో పాటు బిజెపి నేత పాదూరి కరుణ, కాంగ్రెస్ నేత కైలాస్, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

మహబూబాబాద్ లో సినిమా థియేటర్ వద్ద ఉద్రిక్తత

వరంగల్:మహబూబాబాద్ లో 'బాహుబలి' థియేటర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా ప్రేక్షకులు చొచ్చుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తమను నిలువరించే క్రమంలో లాఠీలకు పనిచెప్పిన పోలీసులపై ప్రేక్షకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

07:14 - July 10, 2015

హైదరాబాద్:భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం. మరో భారీ వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి రాత్రి పీఎస్ ఎల్వీ సి -28 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ 5 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. బుధవారం ఉదయం 7గంటల 28నిమిషాలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 62 గంటల 30 నిమిషాలు నిరంతరాయంగా కొనసాగి, నింగిలోకి దూసుకెళ్లనుంది.
నెల 10 రాత్రి 9 గంటల 28 నిమిషాలకు....
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో మరో అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ నెల 10న రాత్రి 09గంటల 28నిముషాలకు పీఎస్ ఎల్వీ సి-28 నింగిలోకి పయనమవుతుంది.
భారీ ఆదాయాన్ని సమకూర్చనున్న పీఎస్ ఎల్వీ సి-28....
ఇప్పటి వరకు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షానికి మోసుకెళ్లిన పీఎస్ ఎల్వీ ప్రస్తుతం జరగబోయే ప్రయోగంతో ఇస్రోకు భారీ ఆదాయాన్ని సమకూర్చనుంది. ఈ ప్రయోగం లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్ లాంచింగ్ ద్వారా ఇస్రోకు దాదాపు 14వేల 44 కోట్ల ఆదాయన్ని సమకూర్చే ఈ భారీ వాణిజ్య ప్రయోగానికి గత రెండు నెలలుగా ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు.
బుధవారం 7 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్.....
బుధవారం ఉదయం 7గంటల 28 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైన 62 గంటల 30 నిమిషాల తర్వాత అంటే రాకెట్ ఈ నెల 10న రాత్రి 09 గంటల 58 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైన అరగంటకు అంటే 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల 55 నిమిషాల వరకు రాకెట్‌కు నాలుగోదశ ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. నేడు రాకెట్‌కు అనుసంధానమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తారు. అనంతరం 10వ తేదీ తెల్లవారుజామున 4గంటల 28 నిమిషాల నుంచి మధ్యాహ్నం 11గంటల 20 నిమిషాల దాకా రాకెట్‌లోని లోని రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఆ ప్రక్రియతో ఇంధనం నింపే పని పూర్తవుతుంది. ఆ తర్వాత తుది విడత తనిఖీలు నిర్వహించి రాకెట్‌లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థను అప్రమత్తం చేయడం, నైట్రోజిన్, హీలియమ్ గ్యాస్ నింపడం లాంటి పనులు చేసి ప్రయోగానికి సన్నద్ధం చేస్తారు. అనంతరం రాత్రి 9 గంటల 58నిమిషాలకు పీఎస్ ఎల్వీ సి-28ను నింగిలోకి పంపుతారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ పీఎస్ ఎల్వీ సి-28 రాకెట్ ఎత్తు 49 మీటర్లు. బరువు 395 టన్నులు.
కెనడాకు చెందిన 14 వేల40 కిలోల ఐదు ఉపగ్రహాలు...
భారీ వాణిజ్య ప్రయోగంగా ఉన్న పీఎస్ ఎల్వీ సి-28 ఉపగ్రహ వాహక నౌకలో కెనడాకు చెందిన 14వేల 40 కిలోల బరువున్న ఐదు ఉపగ్రహాలను భూమికి 647 కిలో మీటర్ల ఎత్తులో సూర్యానవర్తన ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. డిఎమ్‌సీ-3 అనే మూడు శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఒక్కో శాటిలైట్ బరువు 447 కిలోల వరకు ఉంటుంది. వీటితో పాటు 97 కిలోల బరువున్న సిబిటిఎన్ -1 అనే ఉపగ్రహాన్ని, 7 కిలోల బరువున్న డి-ఆర్బిట్ శైల్ అను ఎక్స్ పెరిమెంటల్ శాటిలైట్‌ను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్ వి సిరీస్ లో 30వ ప్రయోగంగా పిఎస్ ఎల్ విసి-28 రాకెట్ ను ప్రయోగించనున్నారు. మొదటి ప్రయోగం మినహా ఈ సిరీస్ లో మిగిలిన అన్ని ప్రయోగాలు విజయవంతం కావడంతో పిఎస్ ఎల్ వి రాకెట్ ఇస్రోకు తిరుగులేని విజయాలను అందించిన బ్రహ్మాస్త్రంగా పేరు తెచ్చింది.
భవిష్యత్తులో భారత్ మరిన్ని దేశాల ఉపగ్రహాలను...
ఈ ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్తులో భారత్ మరిన్ని దేశాల ఉపగ్రహాలను ఇక్కడ నుంచి పంపించేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది. తద్వారా ఇస్రోకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం ప్రయోగించే కెనెడా ఉపగ్రహాల ద్వారా ఆ దేశ సమాచార, సాంకేతిక వ్యవస్థకు ఎనలేని ప్రయోజనం సమకూరనుంది. ఇప్పటి వరకు ఇస్రో ఇలాంటివి 40కి పైగా వాణిజ్య ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. దీంతో ఈ సంఖ్య 45కు చేరనుంది.

07:11 - July 10, 2015

హైదరాబాద్:గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినేట్‌ భేటీ కానుంది. ఈ నెల 11న జరగనున్న కేబినేట్‌ భేటీలో వయోపరిమితి పెంపుపై నిర్ణయం, ఉద్యోగ ప్రకటనల జారీపైనా చర్చించనున్నారు. దీంతో పాటు మంత్రుల పనితీరుపైనా... సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపే అవకాశం ఉంది.                                 
తెలంగాణ పుష్కరాల నిర్వహణకు 600 కోట్ల కేటాయింపు....
తెలంగాణ రాష్ట్రంలో తొలి పుష్కరాలను భారీగా జరపాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీనికోసం 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది సర్కారు. ఐదు జిల్లాల పరిధిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే గోదావరి పుష్కరాల పనులను మంత్రులంతా స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని సీఎం కోరారు. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరగనుంది.
ఉద్యోగాల భర్తీపైనా చర్చ జరిగే అవకాశం....
పుష్కరాలతో పాటు ఉద్యోగాల భర్తీపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. జూలైలో 25వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తామని పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రకటనల పైనా కేబినేట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. 5ఏళ్ల పాటు వయోపరిమితి పెంచాలని కేబినేట్‌ సబ్‌కమిటీ సూచించింది. దీనికి మంత్రి వర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసే ఛాన్స్‌ ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేబినేట్‌లో చర్చించే అవకాశం ఉంది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం....
ప్రాణహిత చేవెళ్ల అంశం మరోసారి వివాదాస్పదమై తెరపైకి వచ్చింది. గతంలో నిర్దేశించిన స్థానంలో కాకుండా వేరే ప్రదేశంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారు చేయాలని వ్యాప్కోస్‌ అనే సంస్థను కోరింది ప్రభుత్వం. దీనిపై కేబినేట్‌లో ఆమోదముద్ర వేయనున్నారు. ఇక సచివాలయాన్ని హైటెక్‌ సిటీ పరిసరాల్లోకి తరలించాలని సర్కారు భావిస్తోంది. దీనిపై కూడా కేబినేట్‌లో సమీక్ష జరిపే అవకాశం ఉంది.
హరిత హారం, స్వచ్ఛ హైదరాబాద్‌లపై చర్చించే అవకాశం....
మంత్రుల పనితీరుపైనా కేబినేట్‌లో సీఎం సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హరిత హారం, స్వచ్ఛ హైదరాబాద్‌ లపై రివ్యూ జరపనున్నారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి, కేంద్ర నిధులు రాబట్టడంలో తెలంగాణ సర్కారు వైఫల్యంపై కేబినేట్‌లో చర్చించే వీలుంది.

07:07 - July 10, 2015

హైదరాబాద్:జపాన్‌ టూర్‌ పూర్తయి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యేందుకు హస్తినకు వెళ్లారు. తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకే చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారని సమాచారం.                        
గోదావరి పుష్కరాలకు కేంద్రమంత్రులకు ఆహ్వానం....   
నాలుగు రోజుల జపాన్‌ పర్యటన ముగించుకుని.. హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వనించనున్నారు. పనిలో పనిగా ఆయా శాఖల వారీగా రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల వివరాలను కేంద్రమంత్రులకు తెలిపి.. సహాయాన్ని కోరనున్నారు.
ఉదయం 9 : 30కు పీయూష్‌ గోయల్‌తో బాబు భేటీ....
ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కేంద్ర బొగ్గు, విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం కానున్నారు. జపాన్‌ పర్యటన వివరాలను ఆయనకు వివరించనున్నారు. రాష్ర్టంలో విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ చూపిస్తున్న ఆసక్తిని పీయూష్‌కు చంద్రబాబు వివరించనున్నారు. తర్వాత 11 గంటలకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో చంద్రబాబు బృందం భేటీ కానుంది. నూతన రాష్ర్టంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు అనుమతులు పర్యావరణ అనుమతులను కోరనున్నట్లు సమాచారం.
రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షాతో భేటీ అయ్యే అవకాశం....
మధ్యాహ్నం ఒకటిన్నరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ర్టంలో కొత్తగా చేపట్టిన నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని ఉమాభారతిని బాబు కోరనున్నారు. సమయం కుదిరితే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షాతోనూ వేర్వేరుగా సమావేశమై.. గోదావరి పుష్కరాలకు ఆహ్వానించడంతో పాటు రాష్ర్ట పరిస్థితులను వారికి వివరించనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్‌-8 అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ టూర్‌ సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

06:59 - July 10, 2015

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో బాహుబలి మేనియా ఆవహించింది. కొంతకాలంగా ఈ సినిమా చుట్టూ సాగిన ప్రచారం సినీ ప్రేక్షకుల్లో అంతులేని ఉత్సుకతను పెంచింది. మరోవైపు టిక్కెట్ల అమ్మకాలు సాగిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారన్నది బహిరంగ రహస్యం. బాహుబలి సినిమా విడుదల సందర్భంగా జరుగుతున్న తంతుపై ఇవాళ్టి జనపథం చర్చను చేపట్టింది. ఈ చర్చలో సినీ ప్రేక్షక సంఘం అధ్యక్షుడు నరసింహారావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావనకు తీసుకువచ్చారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇచ్చారు వంటి అంశాలను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

06:56 - July 10, 2015

బాహుబలి సినిమా టిక్కెట్ల అమ్మకాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో ఈ సినిమా టిక్కెట్లను బ్లాక్‌్ లో విక్రయిస్తున్నతీరుపై తీవ్ర చర్చే జరుగుతోంది. ఇష్టమొచ్చినట్టు నిబంధనలు ఉల్లంఘించి, టిక్కెట్లు బ్లాక్‌్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది?
సినీ రంగం ట్రెండ్‌్ మారుతోందా!
సినీ రంగం ట్రెండ్‌్ మారుతోంది. నేటి సినిమాలు ప్రతిష్టిస్తున్న విలువల మీద, అవి అందిస్తున్న సందేశాల మీద తీవ్ర విమర్శలే వున్నాయి. దీనికి తోడు సినిమా నిర్మాణ బడ్జెట్‌్ విపరీతంగా మారుతోంది. 50 కోట్లు, వంద కోట్లు, 150 కోట్లు ఇలా పోటీలు పడి నిర్మాణ ఖర్చు పెంచుకుంటూ పోతున్నారు. తాము పెట్టిన ఖర్చంతా ఒకట్రెండు రోజుల్లోనే రాబట్టుకునేలా నిర్మాతలు ప్లాన్‌్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్‌్ దశ నుంచే విపరీతమైన పబ్లిసీటి ప్రారంభించడం, రిలీజ్‌్ ముహూర్తం నాటికి అంతులేని హైప్‌్ సృష్టించడం నేటి ట్రెండ్‌్ గా మారింది. బాహుబలి విషయంలోనూ అక్షరాల ఇదే జరిగింది . ఇవాళ తెలుగు నేల మీద బాహుబలి గురించి చర్చించుకోని వారంటూ లేరు.
సగటు మనిషిలో ఉత్సుకత....
ఒక పద్ధతి ప్రకారం సగటు మనిషిలో ఉత్సుకత పెంచడం, తొలి రోజు తొలి ఆట చూడాలన్న బలీయమైన ఆకాంక్షను వారిలో సృష్టించి, ఆ బలహీనతను క్యాష్‌్ చేసుకోవడమనే విద్యలో సినీ రంగం ఆరితేరింది. ఈ పరిణామం చివరకు ఏ దుష్పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నవారు సినీ పరిశ్రమలోనే వున్నారు. అంతులేని హైప్‌ సృష్టించి, భారీ సంఖ్యలో టిక్కెట్లు బ్లాక్‌్ చేసి, ఒక్కొక్క టిక్కెట్‌్ ని నాలుగైదు వేల రూపాయలకు నిర్మాతలే అమ్ముకుంటూ పోతే , కడుపు మండిన ప్రేక్షకులు తమ థియేటర్ల మీద దాడులకు తెగబడితే, తమ పరిస్థితి ఏమిటన్న ఆవేదన, ప్రశ్న అనేక మంది థియేటర్ల యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాతల తీరు మీద వ్యక్తిగత సంభాషణల్లో తమ ఆవేదననీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేస్తున్న థియేటర్ల యజమానులు, సిబ్బంది తమ ప్రతిస్పందనను ఏదో ఒక రోజు బహిరంగంగానే వ్యక్తం చేయొచ్చు.
అధికార యంత్రాంగం నిద్ర నటిస్తుండడమే తీవ్ర ఆందోళన...
తమ అభిమానుల సినిమాల విడుదల నాడు క్యూ లైన్లలో నిల్చుకోవడం, కొట్టుకోవడం, పోలీసులు లాఠీ చార్జి చేయడం, తొక్కిసలాటలో మరణించడం లాంటి సంఘటనలు మన తెలుగు మీద గతంలో జరిగాయి. విషాద సంఘటనలు తర్వాత కూడా అధికార యంత్రాంగం నిద్ర నటిస్తుండడమే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
టిక్కెట్లు బ్లాక్ చేసి...
టిక్కెట్లు బ్లాక్‌్ చేసి, ఒక్కొక్కటి అయిదారువేల చొప్పున అమ్ముకుంటున్నారన్నది బహిరంగ రహస్యంగా మారిన తర్వాత కూడా అలాంటి అక్రమాలను నిరోధించాల్సిన అధికార యంత్రాంగం తమకేమీ తెలవన్నట్టుగా నిర్లప్తంగా వ్యవహరించడం ఏ మాత్రం క్షమించడానికి వీలులేని వ్యవహారం. బాహుబలి టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలను నిరోధించాలంటూ వివిధ యువజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరో వైపు హైకోర్టులో పిల్‌్ దాఖలైంది. అయిన్నప్పటికీ ఈ బాగోతం మీద అధికార యంత్రాంగం ఎందుకు నిష్ర్కియా పరత్వం ప్రదర్శిస్తున్నదో ఎవరికీ అర్ధం కాదు.
నిర్మాతలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కానే కాదు....
నిజానికి సినిమా నిర్మించడం, దానిని విడుదల చేయడం ఆయా నిర్మాతలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కానే కాదు. ప్రతి సినిమా విడుదల సందర్భంలోనూ, టిక్కెట్ల ధరల విషయంలోనూ పాటించాల్సిన నిబంధనలు స్పష్టంగా వున్నాయి. తాము వసూలు టిక్కెట్ల ధరలకు తగిన పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఇలాంటి నిబంధనలన్నింటినీ ఇష్టమొచ్చినట్టు ఉల్లంఘించే బరితెగింపు సినీ పరిశ్రమకు ఎలా వస్తోంది? యాభైకో, వందకో, నూటాయాభైకో అమ్మాల్సిన టిక్కెట్‌్ ను అయిదారువేలకు అమ్ముకునే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వస్తోంది. దీనిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? తమను అభిమానించే ప్రేక్షకుల నుంచే వక్రమార్గంలో అడ్డంగా దోచుకున్న సొమ్మును ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారు? థియేటర్ల దగ్గర జరగరానిదేదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

తహశీల్దార్ దాడి ఘటనపై విచారం వ్యక్తం చేసిన చింతమనేని

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడి ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తహశీల్దార్ పూ తాను ఎలాంటి దాడి చేయలేదన్నారు. బలివె ఇసుక రేవు పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో వుందని, అక్రమ మైనింగ్ కు ఆస్కారమే లేదన్నారు. డ్వాక్రా సంఘాలు, రెవెన్యూ అదికారుల మధ్య జరిగిన ఘర్షణను తాను అడ్డుకున్నట్లు చెప్పారు.

నేడు నుండి ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నేటి నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మరో వైపు తెలంగాణ లో కార్మికుల సమ్మెతో తెలంగాణ అంతా చెత్తతో కంపు కొడుతోంది.

నేడు మహబూబ్ నగర్ జిల్లా బంద్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలమండలికి లేఖ రాయడాన్ని ఖండిస్తూ టీఆర్‌ఎస్ శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

హైదరాబాద్ -గన్నవరం మధ్య ఎయిర్ ఇండియా విమానం

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ -గన్నవరం మధ్య ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం నడవనుంది. హైదరాబాద్ లో ఉదయం 6.30 గంటలకి బయల్దేరి 7.30 గంటలకు గర్నవరం చేరుకుంటుంది. గవర్నవరం నుండి ఉదయం 8.00గంటలకు బయలు దేరి 9గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

Don't Miss