Activities calendar

11 July 2015

22:01 - July 11, 2015

రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. హర్షకుమార్ ను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతకముందు హర్షకుమార్‌ తన రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు, క్రైస్తవ సంఘాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం...

యాషెస్ సిరీస్: తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. 169 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది.
ఇంగ్లండ్: 430 ఆండ్ 289, ఆస్ట్రేలియా: 308 ఆండ్ 242.

21:49 - July 11, 2015

హైదరాబాద్: ముస్లింలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ముస్లిం సోదరులకు ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొని, మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎప్పటివరకు ఇస్తారో కేసీఆర్‌ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు కావాల్సింది విందులు, గిఫ్ట్ లు కాదని.. బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. ముస్లింలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

 

21:27 - July 11, 2015

ఇంగ్లండ్: అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆరోసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ నెగ్గి తనకు తానే సాటిగా నిలిచింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్ లో ముగిసిన ఫైనల్స్ లో టాప్ సీడ్ సెరెనా వరుస సెట్లలో 20వ సీడ్ గార్బిన్ మురుగుజాను చిత్తు చేసింది. 33 ఏళ్ల సెరెనా అపారఅనుభవం ముందు..19 ఏళ్ల మురుగుజా తేలిపోయింది. తొలిసెట్లో గట్టిపోటీ ఎదుర్కొన్న సెరెనా 6-4తో నెగ్గి శుభారంభం చేసింది. రెండో సెట్లో దూకుడు పెంచిన సెరెనా 6-3తో సునాయాసంగా నెగ్గి..ట్రోఫీతో పాటు 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకొంది. సెరెనా కెరియర్ లో ఇది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టైటిల్స్ సాధించిన సెరెనా..వచ్చేనెలలో జరిగే అమెరికన్ ఓపెన్ సైతం నెగ్గితే..రెండోసారి కెరియర్ స్లామ్ పూర్తి చేయగలుగుతుంది.

 

21:24 - July 11, 2015

కైరో: హాలీవుడ్‌లో తొలితరం మేటి నటుడు ఒమర్ షరీఫ్‌ ఇకలేరు. చివరి రోజుల్లో గత కొంతకాలంగా అల్జీమర్స్ తో బాధపడ్డ ఆయన.. మంగళవారం ఈజిప్టు రాజధాని కైరోలోని ఆస్పత్రిలో తీవ్రమైన గుండెపోటుతో మరణించారు.
1932లో ఒమర్ షరీఫ్‌ జననం..
ఈజిప్టులో తుక్కు వ్యాపారం చేసే వారి ఇంట 1932లో ఒమర్ షరీఫ్‌ జన్మించారు. కళల పట్ల కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు లండన్‌కు పంపించారు. షరీఫ్ అక్కడి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమిటిక్ ఆర్ట్ సంస్థలో శిక్షణ పొందారు. హాలీవుడ్‌లో అడుగు పెట్టిన షరీఫ్‌కు తొలి అవకాశం మాత్రం ఈజిప్టు చిత్ర పరిశ్రమే ఇచ్చింది.
సిర్రా ఫిల్-వాడి చిత్రంతో ఒమర్ తెరంగేట్రం
సిర్రా ఫిల్-వాడి చిత్రంతో 1954లో తెరంగేట్రం చేసిన ఒమర్ షరీఫ్.. అనతికాలంలోనే ఈజిప్టు నటనవర్గంలో అగ్రతారగా ఎదిగారు. ఆ తర్వాత డేవిడ్ లీన్‌ దర్శకత్వంలో 1962లో షరీఫ్.. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటించారు. నిప్పులు చెరుగుతున్న ఎడారుల్లో ఒంటెపై దౌడు తీస్తుండగా షరీఫ్‌పై తొలి షాట్స్ తీశారు. తన నట విశ్వరూపంతో ఈ చిత్రానికి రెండు గోల్డెన్ గ్లోబ్‌లను సొంతం చేసుకున్నారు. ఇదే సమయంలో ఒమర్ షరీఫ్‌ పేరు ఆస్కార్‌ అవార్డు గడప దాకా వెళ్లింది.
వీరులకు మరోసారి జీవం పోసిన ఒమర్
ఎడారుల్లోంచి వెండితెరపైకి వెళ్లిన ఒమర్ షరీఫ్‌.. మరో మూడేళ్ల తర్వాత డాక్టర్ జివాగోతో మరోసారి సంచలనం సృష్టించారు. రష్యన్ విప్లవంలో చిక్కుకుపోయిన వైద్యుని పాత్రలో ఒమర్ జీవించి ముచ్చటగా మూడోసారి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్నారు. ఇక చంఘిజ్‌ ఖాన్, చేగువెరా చిత్రాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేవని సినీ ప్రేమికులు అంటారు. ఈ రెండు సినిమాలలో ఒమర్ షరీఫ్ నటించి.. చరిత్రలో జీవించిన వీరులకు మరోసారి జీవం పోశారు. అయితే అగ్రనటుడిగా ఉండగానే.. నటన పట్ల విముఖత పెంచుకున్న ఆయన.. చివరిగా 2003లో ఫ్రెంచి సినిమా మొన్సేర్ ఇబ్రహీంలో నటించారు.

21:00 - July 11, 2015

కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేకవిధాలను వ్యతిరేకిస్తూ... కర్నూలులో ఈనెల 20న నిరసన కార్యక్రమాన్ని చేపట్టుతున్నట్లు వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా... డ్వాక్రా మహిళలను, రైతులను మోసం చేశారని అన్నారు.

20:57 - July 11, 2015

ప్రకాశం: సీఐటియూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఒంగోలులో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఇవాళ రేపు రెండు రోజుల పాటూ జరగనున్నాయి. ఈ కౌన్సిల్ సమావేశాల్లో పలు తీర్మాణాలు చేశారు. వీటిలో కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడిని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఈ నెల 14న అన్ని మున్సిపల్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శలు చేపట్టాలని తీర్మాణం చేశారు. కార్మిక చట్టాల అమలుకై సెప్టెంబరు 2న అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతున్నట్టు నాయకులు ప్రకటించారు.

 

20:54 - July 11, 2015

గుంటూరు: వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నప్పటికీ మనసుమార్చుకున్నానని.. వైసిపిలో చేరడం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలిపారు. అంబటి రాంబాబుకు క్షమాపణలు చెప్పారు. ఎంపీ రాయపాటి సాంబశివరావుతో సంప్రదింపులు జరిపిన డొక్కా అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో కొనసాగాలని అనుకోవట్లేదని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం స్పష్టంగా తీసుకోలేదని డొక్కా ప్రకటించారు. రాజకీయాలను ఎంచుకోవాలా ...రాయపాటి స్నేహాన్ని ఎంచుకోవాలా అంటే తాను రాయపాటి వైపే ఉంటానని డొక్కా స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమరణదీక్ష భగ్నం

రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. హర్షకుమార్ ను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈనేపథ్యంలో పోలీసులు, క్రైస్తవ సంఘాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు క్రైస్తవ సంఘాల నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు.

 

20:41 - July 11, 2015

అనంతపురం: జిల్లా కేంద్రంలో నకిలీ పాసు పుస్తకాల పరంపర కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం భారీ స్థాయిలో నకిలీ పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకోగా.. నేడు మరికొన్ని పాస్‌పుస్తకాలను పోలీసులు, విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కె.ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తికి శివకాశి నుంచి ఈ నకిలీ పాసు పుస్తకాలు వచ్చాయి. వీటిని అధికారులు ఓ ప్రైవేట్‌ ట్రాన్స్ పోర్ట్ లో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

 

వింబుల్డన్ మహిళ సింగిల్స్ విజేత సెరెనా

ఢిల్లీ: వింబుల్డన్ మహిళ సింగిల్స్ విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచింది. ఫైనల్ లో 6-4, 6-4 తేడాతో స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజపై సెరెనా గెలుపొందింది. సెరెనా.. ఆరోసారి వింబుల్డన్ టైటిల్ సాధించారు.

 

వైసిపిలో చేరాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నా: డొక్కా

గుంటూరు: టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు సూచనలతో వైసిపిలో చేరాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. ఎంపి రాయపాటితో కలిసి డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జగన్, అంబటి రాంబాబుకు డొక్కా క్షమాపణలు చెప్పారు. రాజకీయ భవిష్యత్ పై త్వరలో ప్రకటన చేస్తానని పేర్కొన్నారు.

 

ఐపిఎల్ స్కాంలో ఈనెల 14న సుప్రీం తీర్పు...

ఢిల్లీ: ఐపిఎల్ కుంభకోణంలో ఈనెల 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటు, రాజ్ కుంద్రా, గురునాథ్ మియప్పన్ లకు శిక్ష ఖరారుతో పాటు చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలపై చర్యలు తీసుకునే అంశంపై కోర్టు ప్యానెల్ తీర్పు ఇవ్వనుంది. 

19:42 - July 11, 2015

శ్రీకాకుళం: జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం ఎదురుగా బైఠాయించి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది అంటూ పోడియం వద్ద నిరసన తెలిపారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్న చోట నిధులు ఇచ్చి మళ్లీ వెనుకకు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

19:31 - July 11, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో అధికారులపై సీఎం మండిపడ్డారు. సంబంధిత విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

 

19:27 - July 11, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుతో టీసర్కార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. సచివాలయంలో కార్మిక సంఘాలతో హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి చర్చలు జరిపారు. కార్మికుల ఏ.. ఒక్క డిమాండ్ కు కూడా నాయిని స్పష్టమైన హామి ఇవ్వలేదు. సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం చెబుతామని నాయిని చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తామని మౌఖికంగా చెప్పారు...కానీ వ్రాత పూర్వకంగా, జీవోల రూపంలో ఇవ్వలేదు. క్రమబద్ధీకరణతోపాటు పలు డిమాండ్లపై నాయిని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కార్మికుల డిమాండ్లపై మంత్రి నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. అయితే నాయిని.. కార్మిక సంఘాలతో ఇదివరకే మూడు సార్లు చర్చలు జరిపారు. 

ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు కార్యాలయంపై పోలీసులు-విజిలెన్స్ దాడులు

అనంతపురం: ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు కార్యాలయంపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. భారీగా నకిలీ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు శివకాశి నుంచి కె.ఆనంద్ కుమార్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు ట్రాన్స్ పోర్టు కార్యాలయానికి వచ్చాయి.

క్షీణించిన హర్షకుమార్ ఆరోగ్యం

రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోగ్యం క్షీణించింది. క్రైస్తవుల స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని హర్షకుమార్.. రెండు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్నారు.

మున్సిపల్ కార్మిక సంఘాలతో నాయిని చర్చలు విఫలం

హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డితో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు విఫలం అయ్యాయి. కార్మికుల డిమాండ్లపై నాయిని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో సమ్మె కొనసాగుతోందని నేతలు ప్రకటించారు.

 

హైదరాబాద్ జలమండలి కార్మికుల సమ్మె విరమణ

హైదరాబాద్: నగర జలమండలి కార్మికులు సమ్మె విరమించారు. సమస్యలను పరిష్కారం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు జలమండలి కార్మిక సంఘాలు ప్రకటించాయి. జలమండలిలో పీఆర్ సీ అమలు చేయాలని..గత ఆరు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. 

సీబీఎస్ ఈ పరీక్షల్లో కొత్త నిబంధనలు

ఢిల్లీ: సీబీఎస్ ఈ పరీక్షల్లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. పరీక్షల్లో తొలిసారి డ్రెస్ కోడ్ ను ప్రవేశపెట్టారు. తేలికపాటి, ఆఫ్ స్లీవ్స్ డ్రస్ లే వేసుకోవాలని, దుస్తులకు పెద్ద బటన్స్ ఉండరాదని, నగలు వేసుకోరాదని సీబీఎస్ ఈ నిబంధన విధించింది. షూతో వస్తే.. పరీక్షకు అనుమతి నిరాకరిస్తామని తెలిపింది. స్లిప్పర్స్ తోనే పరీక్షకు రావాలని నిబంధన పెట్టింది. మాస్ కాపీయింగ్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సీబీఎస్ ఈ పరీక్షల్లో కొత్త నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

 

చంద్రబాబుపై టీ.అడ్వకేట్ జెఎసి ఫిర్యాదు

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ లో ఎపి సీఎం చంద్రబాబుపై తెలంగాణ అడ్వకేట్ జెఎసి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేయడానికి సింగపూర్ నుంచి ట్యాపింగ్ మిషన్లు కొనుగోలు చేశారని ఆరోపించారు..

 

కాపేపట్లో డొక్కా ప్రెస్ మీట్..

గుంటూరు: కాసేపట్లో టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

18:22 - July 11, 2015

హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలులోనే ఉందని మహబూబ్‌నగర్‌ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అయితే అందులో క్లాజ్‌ 3, 4 ప్రకారం శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి ప్రాణహాని ఉందని భావిస్తేనే గవర్నర్‌ అధికారాలను చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. అయితే గవర్నర్‌కు అధికారాలు సైతం తెలంగాణ కేబినేట్‌ సిఫార్సు మేరకే తీసకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8ను అమలు చేయాలని చంద్రబాబు.. కేంద్రానికి లేఖ రాసి తన కుట్రను బయటపెట్టారని ఆయన విమర్శించారు.

 

18:15 - July 11, 2015

గుంటూరు: వైసిపిలో చేరే ఆలోచన లేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నట్లు తెలుస్తోంది. డొక్కా.. మనసు మార్చుకున్నారు. టిడిపిలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. రాయపాటి సాంబ శివరావు నివాసంలో సమావేశం అయ్యారు. రాయపాటి, లోకేష్ లు డొక్కాకు సర్దిచెప్పారు. గుంటూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి... పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. 

18:01 - July 11, 2015

హైదరాబాద్: 2015 ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ సమరానికి తమజట్టు సిద్ధమని తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. సూపర్ రైడర్ రాహుల్ చౌదరి నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ సరికొత్త లోగో...స్ఫూర్తిదాయక గీతంతో పోటీలకు సిద్ధమయ్యింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్ లోగోను తెలంగాణా మంత్రి కేటీఆర్ రామారావు ఆవిష్కరించారు. ఆగస్టు 4 నుంచి 7 వరకూ జరిగే హైదరాబాద్ అంచె పోటీలను గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ లో పాల్గొంటున్న తెలుగు టైటాన్స్ జట్టుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి ప్రకటించారు.

 

17:57 - July 11, 2015

కాకినాడ: ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. కాకినాడలో మధు మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన తర్వాత సెక్షన్‌-8 గుర్తొచ్చిందా.. అని విమర్శించారు. ఏపీలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మధు పూర్తి మద్దతు ఉటుందన్నారు. ఈ నెల 31న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి డ్వాక్రా సంఘాల ఆందోళనకు సీపీఎం మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

శ్రీలంకపై పాక్ విజయం..

దంబుల్లా: తొలి వన్డేలో శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. మహ్మద్ హఫీజ్ 103 పరుగులతో పాక్ ను గెలిపించాడు. శ్రీలంక: 255/8, పాకిస్తాన్:259/4

 

17:11 - July 11, 2015

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. గత రెండురోజులుగా ఉత్తరకాశి, రుద్రప్రయాగ్, నైనిటాల్ తదితర ప్రాంతాలో కురుస్తున్న వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. హరిద్వార్‌లో గంగానది డేంజర్‌ మార్క్‌ దాటి ప్రవహిస్తోంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. గత రాత్రి నుంచి ఢిల్లీలో వర్షాలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలో 90 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

 

17:09 - July 11, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికులతో టీసర్కార్ చర్చలు జరుపుతోంది. సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి చర్చలు జరుపుతున్నారు. సమస్యలు పరిష్కారం చేస్తామని చెబుతున్నారు... కానీ.. నిర్ధిష్టమైన హామీలు మాత్రం ఇవ్వడం లేదు. సమస్యల పరిష్కారం కోసం.. మున్సిపల్ కార్మికులు 6 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 

16:58 - July 11, 2015

హైదరాబాద్: టీ.టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపి కవిత అన్నారు. ఈమేరకు ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆర్డీఎస్ నుంచి రాయలసీమకు నీరు దోచుకెళ్తుంటే.. చంద్రబాబు నోరు మూసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబులా.. ప్రజలను వంచించే అలవాటు కేసీఆర్ కు లేదని ఆమె చెప్పారు. కేసీఆర్ కు కేవలం తెలంగాణ ఆత్మనే ఆవిరించి ఉంటదన్నారు. మహబూబ్ నగర్ లో ఇప్పుడున్న ప్రాజెక్టును పూర్తి చేస్తే... పది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని చెప్పారు.

 

సాయంత్రం మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసితో టీసర్కార్ చర్చలు

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసిని చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం 4.30 గంటలకు మంత్రి నాయిని సమక్షంలో చర్చలు జరుగనున్నాయి. సమస్యల పరిష్కారం కోసం.. మున్సిపల్ కార్మికులు 6 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 

ముసునూరు ఘటనపై విజిలెన్స్ విచారణ: సెర్ప్ సీఈవో..

కృష్ణా: ముసునూరు ఘటనపై విజిలెన్స్ విచారణ చేయనున్నట్లు సెర్ప్ సీఈవో తెలిపారు. డ్వాక్రా గ్రూపులు నిర్వహిస్తున్న ఇసుక రీచ్ లపై ఇతర వ్యక్తుల పెత్తనంపై విచారణకు ఆదేశించింది. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఈవో తెలిపారు.

 

ప్రజలను వంచించే అలవాటు కేసీఆర్ కు లేదు: కవిత

హైదరాబాద్: చంద్రబాబులా.. ప్రజలను వంచించే అలవాటు కేసీఆర్ కు లేదని టిఆర్ ఎస్ ఎంపి కవిత అన్నారు. మహబూబ్ నగర్ లో ఇప్పుడున్న ప్రాజెక్టును పూర్తి చేస్తే... పది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని చెప్పారు. ఆర్డీఎస్ నుంచి రాయలసీమకు నీరు దోచుకెళ్తుంటే.. చంద్రబాబు నోరు మూసుకున్నారని పేర్కొన్నారు.

 

16:35 - July 11, 2015

మధ్యప్రదేశ్: వ్యాపం స్కాంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. భోపాల్‌లో కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అవినీతిపై మాట్లాడే ప్రధాని నరేంద్రమోది శివరాజ్‌సింగ్‌ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

 

16:32 - July 11, 2015

కాకినాడ: ఎపి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని కాకినాడలో మహిళలు ఆందోళనకు దిగారు. రామారావుపేట నైట్‌ హోటల్‌ సెంటర్‌లో ధర్నాకు దిగిన మహిళలకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబుపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడిన మాట తప్పారని..మోసగాడని ఘాటుగా విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే.. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక.. విస్తరింపచేసే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. మహిళల అందోళనకు రాజకీయ పక్షాలు పూర్తి మద్దతిస్తున్నాయని చెప్పారు. ఇదే విషయంలో సాయంత్రం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలుస్తామని చెప్పారు. అదే విధంగా మహిళల ఆధ్వర్యంలో జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మద్యం షాపు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు.

 

16:04 - July 11, 2015

యుపి: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌ హజ్రత్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ములాయంసింగ్‌ ఫోన్‌లో హెచ్చరికలు చేశారని అమితాబ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ములాయంతో రెండు నిముషాలపాటు మాట్లాడిన ఆడియో రికార్డును అమితాబ్‌ ఠాకూర్‌ భార్య నూతన్‌ ఠాకూర్‌ విడుదల చేశారు. తాను ఫిర్యాదు చేసినా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, తనకు ములాయం నుంచి ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని ఐపిఎస్‌ అధికారి మీడియా ముందు పేర్కొన్నారు.  

15:55 - July 11, 2015

హైదరాబాద్: ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో బిజీ బిజీగా ఉన్నారు. పటాన్‌చెరులో బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. 

 

 

15:51 - July 11, 2015

గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శ్రీనగర్‌కాలనీకి చెందిన ఎరువుల వేస్టేజ్‌ను కొందరు కూలీలు లారీలో తరలిస్తున్నారు. ఈపూరు మండలం కొండ్రుముట్లకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి.. లారీ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో వేస్టేజ్‌ కూలీల మీద పడడంతో... వెంకటేశ్వర్లు, సుందరమ్మ, మంగమ్మ, రజాక్‌, వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ప్రకాశం జిల్లా దోర్నాల మండలం వాడంపల్లికి చెందినవారిగా గుర్తించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పల్లారావు ఘటనపై ఆరా తీస్తున్నారు.

 

పుష్కరాల ఏర్పాట్లపై చంద్రబాబు అసంతృప్తి..

రాజమండ్రి: పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సీఎం మండిపడ్డారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 

ఎస్ బిహెచ్ ఎటిఎంలో చోరీకి విఫలయత్నం..

హైదరాబాద్: కుషాయిగూడ... నేతాజీ నగర్ లోని ఎస్ బిహెచ్ ఎటిఎంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఎటిఎంను ధ్వంసం చేసి.. వైర్లను తగలబెట్టారు.

 

రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

గుంటూరు: జిల్లాలోని ఈపూర్ మండలం కొండ్రముట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ.. బైకును తప్పించబోయి.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలోని ఏడుగురు మృతి చెందారు. 

జానారెడ్డిని తప్పిస్తున్నారన్న వార్తలు అవాస్తవం: కుంతియా

హైదరాబాద్: సీఎల్పీ బాధ్యతల నుంచి జానారెడ్డిని తప్పిస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఎఐసిసి కార్యదర్శి ఆర్ సీ కుంతియా స్పష్టం చేశారు. అధికారం లేకుండా ఉండలేనివారే పార్టీని వీడుతున్నారని విమర్శించారు. రెండు సార్లు పిసిసి పదవి ఇచ్చి గౌరవించిన పార్టీని వీడడంపై డీఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

 

మంత్రి జూపల్లిపై రావుల ఆగ్రహం

హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమన్నారు. జూపల్లి చర్చకు వస్తాడేమోనని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూశామని తెలిపారు. టిడిపి... పాలమూరు ప్రాజెక్టులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు మొదటి జీవోలు ఎవరు ఇచ్చారో జూపల్లి తెలుసుకోవాలన్నారు.

 

రాహుల్ పై గాలి ఫైర్..

హైదరాబాద్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపై రాహుల్ కు ఇప్పుడే ప్రేమ పుట్టిందా అని ప్రశ్నించారు. ఏపీకి రావాలని అనుకుటే రాహుల్ క్షమాపణలు చెప్పాలని, కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజల్లో కోపం పోలేదన్నారు. రాహుల్ ను సీఎం చేయాలని సోనియా రాష్ట్ర విభజన చేశారని విమర్శించారు. 

ప్రభుత్వం చెడు ప్రచారం - మంత్రి యనమల...

హైదరాబాద్ : వికిలీక్స్ కథనం పేరిట కొన్ని మీడియా ఛానెళ్లలో ప్రభుత్వంపై చెడు ప్రచారం జరుగుతోందని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. ఆ కథనంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని, తెలంగాణ ప్రభుత్వంలోని కొందరి ఫోన్ లు ట్యాప్ చేయడానికి సింగపూర్ కు చెందిన సంస్థతో ఒప్పందం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

 

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం రసాభాస..

శ్రీకాకుళం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. పోడియం ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. జన్మభూమి కమిటీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

 

రాజమండ్రికి చేరుకున్న సీఎం బాబు..

రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రికి చేరుకున్నారు. కాసేపట్లో పుష్కర పనులను బాబు పరిశీలించనున్నారు.

గాంధీభవన్ లో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం..

హైదరాబాద్ : గాంధీభవన్ లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పనితీరు - పరిశీలన కమిటీ సమావేశం జరుగుతోంది. 

13:43 - July 11, 2015

చెన్నై : ఆత్యాచార బాధితురాలు మధ్యవర్తిత్వం ద్వారా రాజీకి ప్రయత్నించాలంటూ వివాదస్పదమైన ఆదేశం ఇచ్చిన మద్రాసు హైకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.దోషికి మంజూరు చేసిన బెయిల్ ను కూడా రద్దు చేసింది. రేప్ కేసులో బాధితురాలు ముద్దాయి మధ్య రాజీ ప్రయత్నం పెద్ద తప్పిదమని...ఇలాంటి రాజీ సూచనలు మహిళల ఆత్మగౌరవానికి భంగకరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడంతో మద్రాసు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మద్రాసు హైకోర్టు జడ్జి మహిళా సంఘాలు, మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరకు అలాంటి దుర్మార్గుడిని వివాహం చేసుకోవడం ఏంటనీ బాధితురాలు ప్రశ్నించింది. 

13:38 - July 11, 2015

శారీరక సమస్యలు ఎంత సాధారణమో మానసిక ఆరోగ్య సమస్యలు అంతే సాధారణం. కానీ మన సమాజంలో మానసిక సమస్యలు చూసే తీరు భిన్నంగా ఉంటుంది. ఆ అపోహలు తొలగాల్సిన అవసరం ఉంది. సమస్య ఎదురైనప్పుడు చికిత్స తీసుకోవాల్సినవసరం ఉంది. అలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్స అందించాలి ? మార్గాలు ఏంటీ అనే వాటిపై మానవి 'నిర్భయ'లో డా.సుధ (సైకియాట్రిస్టు) విశ్లేషించారు. 

13:38 - July 11, 2015

ప్రత్యేక సందర్భాలలో ఇంటిని నచ్చిన విధంగా అలకరించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి వారి కోసం మానవి 'సొగసు' లో కొత్త రకమైన ముగ్గుల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:32 - July 11, 2015

హైదరాబాద్ : పారిశుధ్య కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమేనని పలువురు నేతలు పేర్కొన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మిక సంఘాలు (జెఎసి) చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆరు రోజులవుతున్నా ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం పట్ల కార్మిక సంఘం నేతలు..కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీపీఎం, టిడిపి, సీపీఐ ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వైఖరిని వీరు తీవ్రంగా తప్పుబట్టారు. కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
కేసీఆర్ పంతాలు..పట్టింపులకు పోతున్నారు - సీపీఐ...
పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉంటే సీఎం కేసీఆర్ పంతాలు..పట్టింపులకు పోతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని డిమండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి - టిడిపి..
తెలంగాణ వస్తే కార్మికులకు కడుపు నిండా భోజనం కలుగుతుందని ఇతరత్రా హామీలు ఇచ్చారని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ పేర్కొన్నారు. వారికిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కార్మికుల సమ్మె న్యాయసమ్మతమైంది - సీపీఎం..
పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయసమ్మతమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వీరి సమ్మెకు సీపీఎం తెలంగాణ కమిటీ సంపూర్ణంగా సమర్థిస్తుందన్నారు. కాంట్రాక్టు మాట వినిపించదని కార్మికులు..ఉద్యోగులు పూర్తి స్థాయి ఉద్యోగిగా ఉంటాడని చెప్పిన మనిషి ఏడాది దాటినా కాంట్రాక్టు కార్మికులు ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

13:20 - July 11, 2015

మెదక్ : జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామ పరిధిలో నెలకొల్పిన డెక్కన్ బస్ బాడీ యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం చేసిన బస్సు డిజైన్ చాలా బాగుందని వరంగల్ లో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న ఎండీ ఇక్కడ సంస్థను ఓపెన్ చేయడం అభినందనీయమన్నారు. గతంలో విద్యుత్ సమస్య అధికంగా ఉండేదని, అనంతరం ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో పవర్ కట్స్ లేవన్నారు. 4,320 గా ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రానున్న నాలుగు సంవత్సరాల్లో 25వేల మెగా వాట్ల ఉత్పాదన అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నూతన పారిశ్రామిక విధానం ఏర్పాటు చేయడం జరిగిందని, పరిశ్రమల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 రోజుల్లో అనుమతిపత్రాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవలే అధికారి శాంతకుమారి ఆధ్వర్యంలో 11 రోజుల్లోనే 17 కంపెనీలకు రికార్డు స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక అధికారి ఆలస్యం చేస్తే ఒక రోజుకు వేయి రూపాయల జరిమాన విధించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లాంట్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. 

బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ను ప్రారంభించిన కేసీఆర్..

మెదక్ : జిల్లాలోని డెక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమలో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

ములాయంపై ఐపీఎస్ అధికారి ఫిర్యాదు..

లక్నో : సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పై ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కొట్టారని ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

దుబాయ్ లో సనత్ నగర్ యువతి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : సనత్ నగర్ కు చెందిన యువతి సఫియా ఖాన్ దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లింది. సీపీ మహేందర్ రెడ్డికి యువతి తండ్రి ఫిర్యాదు చేసింది. 

12:28 - July 11, 2015

హైదరాబాద్ : కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి ఘటనలో ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీ వేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది. తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేనని, అతని అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా పరిగణించి విధులను బహిష్కరించారు. రానున్న పుష్కరాల్లో సైతం పాల్గొనబోమని తేల్చిచెప్పారు. దీనితో ప్రభుత్వం వారితో చర్చలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబుతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు, తహశీల్దార్లు భేటీ అయ్యార. ఈభేటీలో ఎమ్మెల్యే చింతమనేని, తహశీల్దార్ వనజాక్షి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన విషయాలను బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై బాబు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. అక్రమాలను అడ్డుకుంటే దాడి చేయడం కరెక్టు కాదని ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు పేర్కొన్నారు. దాడికి సంబధించిన ఫొటోలు కొన్ని దృశ్యాలను బాబుకు చూపించారు. ఈ సందర్భంగా వనజాక్షి డిమాండ్ మేరకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో ఒక కమిటీని వేయడానికి బాబు అంగీకరించారని రెవెన్యూ ఉద్యోగ సంఘం నేతలు పేర్కొన్నారు. విచారణ అధికారిని త్వరగా నియమించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశించారు. బోర్డర్ నిర్ధారణ కాకపోవడంపై ఈ సమస్య ఏర్పడిందని బాబు భావించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని బాబు సూచించారు.
చిన్నమనేనికి బాబు వార్నింగ్...?
ఈ భేటీలో ఎమ్మెల్యే చిన్నమనేనికి సీఎం బాబు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా చేయడం కరెక్టు కాదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మందలించినట్లు తెలుస్తోంది. బోర్డర్ సమస్యను పరిష్కరించేందుకు వెళ్లానని, అక్కడ ఘర్షణ జరుగుతుంటే తాను ఆపడానికి ప్రయత్నించానని చిన్నమనేని బాబుకు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రెవెన్యూ ఉద్యోగులు, తహశీల్దార్లు తమ ఆందోళనను విరమించారు.

స్వచ్చ హైదరాబాద్ పై కేసీఆర్ సమీక్ష వాయిదా..

హైదరాబాద్ : ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నాం 2గంటలకు జరిగే స్వచ్ఛ హైదరాబాద్ పై సీఎం కేసీఆర్ నిర్వహించతలపెట్టిన సమీక్ష వాయిదా పడింది. మెదక్ జిల్లా పర్యటనే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

ముగిసిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల చర్చలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో రెవెన్యూ ఉద్యోగులు జరిపిన సమావేశం ముగిసింది. అనంతరం బాబు రాజమండ్రికి బయలుదేరారు. 

పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారు - ఆప్..

ఢిల్లీ : పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారని ఆప్ నేత ఆశీష్ కేతన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ మహిళపై అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడన్న దానిపై ఆయన పై విధంగా స్పందించారు. 

అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కు జ్యుడిషియల్ కస్టడీ..

ఢిల్లీ : 23 సంవత్సరాల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణతో అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. 

ఇంఫాల్ లో కర్ఫ్యూ సడలింపు..

మణిపూర్ : ఇంఫాల్ లో కర్ఫూను కొద్ది గంటల పాటు సడలించారు. ఉదయం 5గంటల నుండి 10గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. కేవలం ఐదు గంటల పాటు కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం పరుగులు పెడుతున్నారు. మణిపూర్ లోకి ఇతరుల ప్రవేశంపై కఠిన చట్టాలు తీసుకరావాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఆందోళనల్లో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో ఓ విద్యార్థి మృతి చెందాడు. దీనితో విద్యార్థి సంఘాలు ఆందోళనలను ఉధృతం చేశాయి. 

షా పర్యటన నిరసిస్తూ ఎస్పీ నేతల నిరసన..

కాన్పూర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా పర్యటనను నిరసిస్తూ ఎస్పీ పార్టీ నేతలు నల్లటి బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. 

కోల్ కతా కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..

కోల్ కతా : ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. 

ఉట్నూరులో భూ ప్రకంపనలు..

ఆదిలాబాద్ : ఉట్నూరులో శనివారం ఉదయం 11గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. మూడు సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. ఫకీర్ గుట్ట, శాంతినగర్, పాత ఉట్నూర్, లక్కారం ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

 

నెల్లూరులో రైతు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన వెంకయ్య..

నెల్లూరు : జిల్లాలోని వెంకటాచలంలో రైతు శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 

11:31 - July 11, 2015

విశాఖపట్టణం : నగరంలో పారిశుధ్య కార్మికులు కదం తొక్కారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడనే నిరసన ప్రదర్శనలు..మానవహారాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగే చర్చల్లో పురోగతి లేకపోతే అత్యవసర సేవలను కూడా బంద్ చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. 5వేల మున్సిపల్ కార్మికులు విశాఖలో సమ్మె చేస్తున్నారని, పీఆర్సీ అమలతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. సమ్మెను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బయటి వ్యక్తులతో పనులు చేయిస్తోందన్నారు. గోదావరి పుష్కరాలకు కొంతమంది కార్మికులను నియమించడం జరిగిందని, డిమాండ్లు నెరవేర్చకపోతే వాళ్లు పుష్కరాలకు వెళ్లరని స్పష్టం చేశారు. 72 వార్డుల్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనలో పాల్గొంటారని, జరిగే పరిణామాలకు ప్రభుత్వం, మున్సిపల్ శాఖ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 

11:27 - July 11, 2015

హైదరాబాద్ : పారిశుధ్య కార్మికులతో ధర్నా చౌక్ నిండిపోయింది. తమ డిమాండ్ల పరిష్కారానికై మున్సిపల్ కార్మికులు గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. దీనితో కార్మిక సంఘం నేతలు కార్మికులతో ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా..ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నాకు విపక్ష నేతలు హాజరు కానున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం వల్ల నగరం కంపు కొడుతోందని, వెంటనే ప్రభుత్వం కార్మిక సంఘ నేతలతో చర్చించి సమ్మెను విరమింప చేయాలని పలువురు సూచనలు చేస్తున్నారు.
సోమేశ్ కుమార్ తప్పుదోవ పట్టిస్తున్నారు..
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పోలీసులతో శుభ్రం చేయడం సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

11:21 - July 11, 2015

హైదరాబాద్ : తహశీల్దార్ వనజాక్షి దాడి ఘటనలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు పట్టు వీడడం లేదు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో రెవెన్యూ ఉద్యోగ సంఘం నేతలు, తహశీల్దార్ లు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యే చింతమనేని, తహశీల్దార్ వనజాక్షిలు కూడా హాజరయ్యారు. రెవెన్యూ ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దాడికి సంబంధించిన విషయాలను బాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ దాడిపై బాబు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా మెలుగుతోందని, ఇందుకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడమే నిదర్శనమని బాబు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇరువురూ సానుకూలంగా వెళ్లాలని బాబు సూచించినట్లు తెలుస్తోంది. కానీ రెవెన్యు ఉద్యోగులు, తహశీల్దార్లు ఒప్పుకోవడం లేదని సమాచారం. చింతమనేనిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చింతమనేనిని అరెస్టు కాకుండా పార్టీ చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. 

లక్నోకు చేరుకున్న అమిత్ షా..

లక్నో : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లక్నోకు చేరుకున్నారు. కాన్పూర్ లో జరిగే పార్టీ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఇదిలా ఉంటే కాన్పూర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమీత్ షా పోస్టర్ లపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. 

చెరువులో ఏడో తరగతి విద్యార్థిని మృతదేహం లభ్యం..

అనంతపురం : గుత్తి (మం) జక్కచెరువులో ఏడో తరగతి విద్యార్థిని ఉమాదేవి మృతదేహం లభ్యమైంది. నిన్న స్కూల్ లో మధ్యాహ్నా భోజన అనంతరం అస్వస్థతకు గురైందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 

మిషన్ కాకతీయకు క్రెడాయ్ విరాళం..

హైదరాబాద్ : మిషన్ కాకతీయకు క్రెడాయ్ సంస్థ రూ.5.50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మంత్రి హరీష్ రావుకు క్రెడాయ్ ప్రతినిధులు చెక్ ను అందచేశారు. మిషన్ కాకతీయ కోసం క్రెడాయ్ ఇప్పటి వరకు రూ.80లక్షలు విరాళం ఇచ్చినట్లైంది.

 

మోడీకి ఫడ్నవీస్ లేఖ..

మహారాష్ట్ర : భారత ప్రధాన మంత్రి మోడీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ లేఖ రాశారు. జ్యోతిబాపూలే, సావిత్రి పూలేలకు భారతరత్న ఇవ్వాలని లేఖలో విజ్ఙప్తి చేశారు. 

తహశీల్దార్ దాడిని ఖండిస్తున్నాం - మధు..

కాకినాడ : తహశీల్దార్ దాడిని ఖండిస్తున్నట్లు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. తహశీల్దార్ పై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలని, ఆయనకు సీఎం బాబు సహకరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తరువాత సీఎంకు సెక్షన్ 8 గుర్తొచ్చిందా అని మధు ప్రశ్నించారు.

సర్పంచ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు...

తిరుపతి : రంగన్నగారిగడ్డ సర్పంచ్ రమణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. చెరువు కబ్జా విషయంలో తనను కులం పేరుతో దూషించాడని సర్పంచ్ పై చిన్నగొట్టికల్లు ఎమ్మార్వో నారాయణమ్మ ఫిర్యాదు చేశారు. 

నార్త్ ఈస్ట్రన్ సీఎంలతో రాజ్ నాథ్ సమావేశం..

అస్సాం : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నార్త్ ఈస్ట్రన్ ప్రాంతాలకు చెందిన ముఖ్యమంతులతో గౌహతిలో భేటీ అయ్యారు. 

ములాయం కొట్టారంటున్న ఐపీఎస్ అధికారి..

ఉత్తర్ ప్రదేశ్ : సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనను కొట్టారని ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ ఆరోపించారు. 

ఉత్తరాఖండ్ లో విరిగి పడుతున్న కొండచరియలు..

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తర కాశీ - గంగోద్రి మార్గంలో కొండచరియలు విరిగిపడుతుండడంతో ఛార్ ధామ్ యాత్రికులు నిలిచిపోయారు. 

10:17 - July 11, 2015

హైదరాబాద్ : డబ్బులిస్తావా..లేదా నీ భార్యను చంపేయాలా అంటూ ఓ ఆగంతకుడు బెదిరింపులు చేస్తున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహితను నిర్భంధించిన దృశ్యాలను వాట్సప్ ద్వారా ఆమె భర్తకు పంపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూ. మూడు లక్షలిస్తేనే ఆమెను వదిలిపెడుతానని, లేదంటే చంపేస్తానని భర్తను బెదిరించాడు. దీనికి తోడు ఆమెను నిర్భందించిన, ఆమె శరీరం నుండి రక్తం కారిన చిత్రాన్ని వాట్సప్ లో పోస్టు చేశాడు. చిత్రాల్లో ఆమె బురఖాలో ఉంది. హనుమాన్ టెంపుల్ కు వెళతానని చెప్పిన వివాహిత మళ్లి ఇంటికి చేరుకోలేదు. అనంతరం ఆమెను కిడ్నాప్ చేసినట్లు..డబ్బులివ్వాలని దుండగుడు డిమాండ్ చేస్తున్నాడు. దుండగుడు పాతబస్తీలోని భవానీనగర్ కు చెందిన వాడిగా తెలుస్తోంది. 

మోడీ, అమీత్ షా పోస్టర్లకు నల్ల రంగు...

ఉత్తర్ ప్రదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమీత్ షా పోస్టర్ లపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. ఈ ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. 

పవన్ మరో ట్వీట్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. ఈసారి రాజకీయ పార్టీ నేతలపై కాకుండా ప్రముఖులు వ్యక్తపరిచిన కోటేషన్స్ ను ఆయన ట్వీట్ చేశారు. ''యువతరానికి ఏ సంపద విడిచి పెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు కలలు కలలు తప్ప, పిరికితనం మోసం తప్ప''.అంటూ ట్వీట్ చేశారు.

తెరవని భజరంగ్ జూట్ మిల్లు..

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు తెరకవపోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరినా నేటికీ మిల్లును తెరవలేదు. దీనితో తక్షణమే మిల్లు తెరవాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. వీరికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. 

పుష్కర ఏర్పాట్లు పూర్తి - ఇంద్రకిరణ్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కర ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి ఇంద్రకిరణ్ ప్రకటించారు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో పుష్కరఘాట్లను ఆయన పరిశీలించారు. 

తిరుపతిలో మద్యం, మాసం నిషేధించాలి - టీజీ వెంకటేష్..

తిరుపతి : తిరుమలతో పాటు తిరుపతిలో కూడా మద్యం, మాంసం వంటివి నిషేధించాలని మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఇస్త్రో శాస్త్రవేత్తలకు మోడీ శుభాకాంక్షలు..

ఢిల్లీ : ఇస్త్రో శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పీఎస్ ఎల్ వి -సి 28 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

09:34 - July 11, 2015

హైదరాబాద్ : తహశీల్దార్ దాడి ఘటనకు పుల్ స్టాప్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ పై ఎమ్మెల్యే చింతమనేని, అతని అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనితో విజయవాడ కేంద్రంగా ఉద్యోగులు విధులను బహిష్కరిస్తున్నారు. రెవెన్యూ సంఘం ఉద్యోగులు ఆందోళన కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తహశీల్దార్లు హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. సోమవారం భేటీ కావాలని అనుకున్న పరిస్థితి తీవ్రత దృష్ట్యా నేడు భేటీ అయ్యారు. ప్రధానంగా ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. లేకుంటే చింతమనేనికి షోకాజ్ నోటీసు ఇచ్చి ఉద్యోగ సంఘాలను తృప్తిపరిచే ప్రయత్నం చేస్తుందా ? అనేది కొద్దిసేపట్లో తేలనుంది. 
సిఎం వైఖరి బట్టి కార్యాచరణ : రెవెన్యూ అసోసియేషన్‌
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం జరిగే చర్చల్లో ఆయన తీసుకునే చర్యలను బట్టి తమ కార్యాచరణ ప్రకటిస్తామని రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంత్రి ఉమాతో శుక్రవారం చర్చల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఎంఎల్‌ఎ చింతమనేని విషయం ముఖ్యమంత్రి చూస్తారని మంత్రి ఉమా పేర్కొన్నారని తెలిపారు. రెవెన్యూ సిబ్బందిపై పెట్టిన కేసులు ఎత్తేస్తామని ప్రకటించారని, పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. సోమవారంలోపు ఈ దాడి ఘటనలో ఎంఎల్‌ఎను మినహా మిగిలిన దోషులను అరెస్టు చేస్తే సోమవారం నుండి విధులకు హాజరవుతామని, లేకపోతే వర్క్‌ టూ రూల్‌ పాటిస్తామని ప్రకటించారు.

09:27 - July 11, 2015

హైదరాబాద్ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మిక సంఘాలు (జెఎసి) చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మిక సంఘాలను బెదిరింపులతో లొంగదీసుకొనే చర్యలన్నీ పటాపంచలయ్యాయి. బేరసారాలను తిప్పికొట్టాయి. కనీస వేతనాలు ఇచ్చేంత వరకు తాము సమ్మెను విరమించేది లేదని ప్రకటించాయి. కానీ సమ్మెలోకి రెండో రోజు వచ్చిన జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ మధ్యలోనే వెళ్లిపోయింది. సమ్మె ప్రభావంతో నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్థంగా మారిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ అందులో విఫలమైంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు స్పష్టం చేశారు. నగరంలోని రాంనగర్ లో భారీ ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాపార్కు వద్ద కార్మికులు భారీ ధర్నా చేపట్టనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తొత్తుగా ఉన్న సంఘం గుర్తింపే లేదని సీపీఎం నేత పేర్కొన్నారు. రెట్టింపు జీతం ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొంటున్నారని, ఆ డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సబబు కాదన్నారు. వెంటనే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్ లో కేసీ రస్తోగి..

ఉత్తర్ ప్రదేశ్ : వివిధ దేశాల నుండి అగ్గిపెట్టేలను సేకరిస్తున్న కేసీ రస్తోగి లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఇప్పటి వరకు 185 దేశాల నుండి 85వేల అగ్గిపెట్టేలను సేకరించారు. వస్త్ర వ్యాపారియైన రస్తోగి 32 సంవత్సరాల నుండి అగ్గిపెట్టేలను సేకరిస్తున్నారు. 

ఐటిబిపి జవాన్ కాల్పులు..ఒకరి మృతి..

ముస్సోరి : ఐటిబిపి (ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్) జవాను జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. లాల్ బహదూర్ శాస్త్రీ జాతీయ అకాడమీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

తెలంగాణలో ఆరో రోజుకు చేరిన పారిశుధ్య కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. వీధుల్లో చెత్త పేరుకపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందిరాపార్కు ఎదుట పారిశుధ్య కార్మికులు భారీ ధర్నా..ప్రదర్శన నిర్వహించనున్నారు. 

ఆశారం కేసులో మరో సాక్షిపై దాడి..

లక్నో : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాబు
కేసులో మరో సాక్షిపై దాడి జరిగింది. ఈకేసులో కీలక సాక్షిగా ఉన్న క్రిపాల్ సింగ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పలకు తెగబడ్డారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షి ప్లేటు ఫిరాయించిన సంగతి తెలిసిందే. 

07:58 - July 11, 2015

కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. వనజాక్షితో నేరుగా మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో కాకుండా నేరుగా బాధిత అధికారితో ముఖ్యమంత్రి మాట్లాడడం వివాదస్పదమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలనే నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ అంశాలపై జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కరణం ధర్మశ్రీ (వైసీపీ), వకుళా భరణం కృష్ణమోహన్ (కాంగ్రెస్), వర్ల రామయ్య (టిడిపి), ఉమా మహేశ్వరరావు (ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం నేత) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న మంత్రి పోచారం..

ఖమ్మం : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి జిల్లాలోని కూసుమంచి మండలంలోని పాలేరుకు చేరుకోనున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రేజ్ ఫిష్ కల్చర్ సాగు ప్రాజెక్టును మంత్రి ప్రారంభించనున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 27 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి స్వరదర్శనానికి 12గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలు, ఉద్యోగ నోటిఫికేషన్ అంశాలపై కేబినెట్ చర్చించనుంది.

 

రెండో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె...

విశాఖపట్టణం : ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. విశాఖలో చెత్త ఎక్కడికక్కడ పేరుకపోయింది. దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేడు జోన్ల వారీగా కార్మికులు నిరసనలు కొనసాగించనున్నారు. మానవహారాలు నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 

07:16 - July 11, 2015

హరారే : పునరావృతం అవుతుందేమో అనిపించిన గతం తృటిలో తప్పిపోయింది. బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర పరాభవం మరోసారి క్రికెట్‌ అభిమానుల కళ్లముందు కదలాడింది. అయితే.. అదృష్టం కలిసిరావడంతో ఒడ్డునపడింది టీమిండియా. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఓటమి కోరల్లోకి వెళ్లిన భారత జట్టు.. చివరకు విజయం సాధించింది. అంబటిరాయుడు సత్తా చాటడంతో ఓటమి ప్రమాదం తప్పిపోయింది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే జట్టు.. టీమిండియాకు చుక్కలు చూపించింది. చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లిన ఆతిథ్య జట్టు విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 256 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. టీమిండియాకు దడ పుట్టించింది. మొదట్లో త్వరగా వికెట్లు కోల్పోయినా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన చిగుంబురా సెంచరీతో వీరవిహారం చేశాడు.
విజయం దిశగా దూసుకెళ్లిన జింబాబ్వే..
అయితే.. చిగుంబురాకు ఇతర ఆటగాళ్లనుంచి సరైన సహకారం లభించలేదు. ఏడో వికెట్‌కు 86 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జింబాబ్వే విజయం దిశగా దూసుకెళ్లింది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో.. భువనేశ్వర్‌ కుమార్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఓటమి నుంచి బయటపడింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 251 పరుగులు చేసింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో స్టువర్ట్‌ బిన్నీ, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్‌, భువనేశ్వర్‌, కులకర్ణి తలోవికెట్‌ దక్కించుకున్నారు.
అష్టకష్టాలు పడిన భారత్..
అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. అష్టకష్టాలు పడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ మెన్‌ ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో టీమిండియా స్కోరు బోర్డు నత్త నడకను తలపించింది. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారతజట్టును అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్ని ఆదుకున్నారు. పట్టుదలతో క్రీజులో పాతుకుపోయిన రాయుడు.. ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. సెంచరీతో పోరాటం సాగించిన రాయుడికి.. 77 పరుగులు చేసిన బిన్నీ చక్కటి సహకారం అందించాడు. దీంతో.. టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మొత్తానికి జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ గెలిచినా.. చావుతప్పి, కన్ను లొట్టపోయిన చందంగా తయారైంది పరిస్థితి. జింబాబ్వే జట్టు భారత్‌ను బెంబేలెత్తించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి, రానున్న మ్యాచుల్లో భారత ఆటతీరు ఎలా ఉంటుందో చూడాలి.

07:11 - July 11, 2015

రష్యా : భారత- పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయా? ఇరుదేశాల ప్రధానులు రష్యాలో జరిపిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. సరిహద్దు వివాదం, ఉగ్రవాదంపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పాకిస్తాన్‌లో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోడీని నవాజ్‌షరీఫ్‌ ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ రష్యాలోని ఉఫా నగరంలో సమావేశమయ్యారు. గంటకు పైగా సాగిన సమావేశంలో సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, తదితర అంశాలపై వీరివురు చర్చించారు. సరిహద్దులో ఉద్రిక్తతలను సడలించడానికి భారత, పాక్‌లకు చెందిన ఉన్నతస్థాయి ఆర్మీ అధికారుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించి విచారణను వేగవంతం చేయడానికి ఇరుదేశాల ప్రధానులు అంగీకరించారు. కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకుండానే టెర్రరిజంపై ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
మత్స్యకారుల విడుదలకు అంగీకారం..
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి లఖ్వీని పాక్‌ విడుదల చేసిన విషయాన్ని మోడీ షరీఫ్‌తో ప్రస్తావించారు. భారత్‌ సరైన ఆధారాలు చూపకపోవడం వల్లే లఖ్వీని విడుదల చేసినట్టు షరీఫ్‌ పేర్కొన్నారు. ఇరుదేశాల్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను 15 రోజుల్లోగా విడుదల చేయాలని భారత్‌- పాక్‌లు నిర్ణయించాయి.
2016లో పాకిస్తాన్‌లో పర్యటించనున్న మోడీ..
పాకిస్తాన్‌లో జరిగే సార్క్‌ సదస్సుకు హాజరుకావాలని నవాజ్‌ షరీఫ్ ప్రధాని మోడీని ఆహ్వానించారు. షరీఫ్‌ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోడీ 2016లో పాకిస్తాన్‌లో పర్యటించడానికి అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన డిన్నర్‌లో భారత పాక్‌ ల ప్రధానులు హాజకు కావడం ద్వారా వీరి మధ్య చర్చలకు మార్గం సుగమమైంది. గత ఏడాది ఖాట్మండులో జరిగిన సార్క్‌ సమావేశంలో మోడీ, నవాజ్ షరీఫ్‌ కలుసుకున్నారు. కానీ అధికారికంగా సమావేశం కాలేదు... ద్వైపాక్షిక చర్చలు జరపలేదు.
ఓ వైపు చర్చలు, మరోవైపు కవ్వింపు చర్యలు...ఇది పాకిస్తాన్‌ నైజం. ఇరు దేశాల నేతలు చర్చలు జరపడానికి ఒకరోజు ముందు కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్తాన్‌- ఓ బిఎస్‌ఎఫ్‌ జవాను కాల్చి చంపింది. రష్యా వేదికగా జరిగిన చర్చలపై పాకిస్తాన్‌ నిజాయితీగా కట్టుబడి ఉంటుందా? లేదా అన్నది కాలమే చెబుతుంది.

07:09 - July 11, 2015

ఆదిలాబాద్ : మహా పండుగ అతిసమీపంలోనే ఉంది. ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహా క్రతువులో పాలు పంచుకుని పుణ్యం సంపాదించుకునేందుకు యావత్‌ ప్రజలు సిద్ధమైపోయారు. అంతా బాగానే ఉంది కానీ.... అసలు విషయమే వెక్కిరిస్తోంది. ప్రధాన వనరే పరిహాసాలాడుతోంది. చెప్పటమే కాదు చేసి చూపించేందుకు టీఎస్‌ సర్కార్‌ కోట్లకు కోట్లు బడ్జెట్ విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు, పుష్కరాలకు వచ్చే భక్తులకు దాదాపు సకల సౌకర్యాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సర్కార్‌ అన్నీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ వరుణుడి శాపం పుష్కరాలకు ప్రధాన అడ్డంకిగా మారింది.
బాసర వద్ద అడుగంటిన నీటిమట్టం..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వచ్చిన పుష్కరాలు కావటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కానీ నీరు ఆశించినంత స్ధాయిలో లేదు. ముఖ్యంగా బాసర పుణ్యక్షేత్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. సింగూరు, నిజాంసాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి నీరు వదిలితే కింద ఉన్న పుష్కర ఘాట్లలో కాస్తా నీరువచ్చే అవకాశం ఉంది. బాసరకు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం కనికరిస్తేనే ఇక్కడకు నీరు వస్తుంది. బాసరలో పుష్కరాలు ఘనంగా జరగాలంటే కనీసం 2 లేదా 3 టీఎంసీల నీరు విడుదలవ్వాలి. అయితే బాసరకు ఎగువన ఉన్న బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టం లేదు. వాటికి ఎగువన జైక్వాడీ ప్రాజెక్టులో మాత్రమే కాస్తా నీటి నిల్వ ఉంది. బాసరకు 450 కి.మీల దూరంలోని ఈ ప్రాజెక్టు నుంచి నీరు వదిలితే 3రోజుల్లో బాసరకు వస్తుంది. అందుకే జైక్వాడీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించేందుకు టీఎస్‌ గవర్నమెంట్‌లోని ఓ ముఖ్య అధికారిని దూతగా పంపింది తెలంగాణ సర్కార్‌.
మహారాష్ట్ర మన్నిస్తుందా ?
మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు కూడా తెలంగాణ సర్కార్‌ పరిస్ధితి వివరించింది. ఆయన కూడా తెలంగాణకు చెందిన వారే కావటంతో పరిస్ధితిలో మార్పు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కేసీఆర్‌ పలు మార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి మహారాష్ట్ర సర్కార్‌ తెలంగాణ విన్నపాన్ని మన్నిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

07:08 - July 11, 2015

వరంగల్ : రాష్ట్రంలో తొలిసారి జ‌రగ‌నున్న గోదావ‌రి పుష్కరాల‌కు తెలంగాణ సర్కార్ విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు.. గోదావ‌రి పరివాహ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. వరంగల్ జిల్లా నుంచి పుష్కర ఘాట్లకు ఆర్టీసీ 14 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడపనుంది. తెలంగాణలో ఈనెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో జరగనున్న పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో స్నానాల ఘాట్లు, అత్యవసర సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణవ్యాప్తంగా 2015 ప్రత్యేక బస్సులు..
పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణవ్యాప్తంగా 2015 ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక వరంగల్‌ జిల్లాలో 14 రోజుల పాటు 355 ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో పుష్కరాలు జరిగే ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముళ్ల కట్ట, మల్లూరులకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రామన్నగూడెంకు హన్మకొండ నుంచి 35 బస్సులు, నర్సంపేట నుంచి 10 బస్సులు నడపునున్నారు. అదేవిధంగా కాళేశ్వరానికి జనగామ నుంచి 45, తొర్రూరు నుంచి 20, హన్మకొండ నుంచి 50, మహబూబాబాద్‌ నుంచి 10, పరకాల నుంచి 40, భూపాలపల్లి నుంచి 25 బస్సులు నడపునున్నారు. ఇక ముల్లకట్టకు నర్సంపేట నుంచి 20, హన్మకొండ నుంచి 50 బస్సులు నడపాలని మంగపేటకు నర్సంపేట నుంచి 10 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక బస్సులు..
పుణ్య స్నానాలకు భక్తులు ఉదయం పూటే ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండడంతో ఉదయం 4 గంటల నుంచే బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. వీకెండ్‌, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ పెరిగితే తదనుగుణంగా అదనపు బస్సులు నడిపే విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా నుంచి కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి, బాసర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలపారు.
అదనపు చార్జీలు..
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడానికి సిద్ధమైనా.. ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. సాధారణ రోజుల్లో కంటే ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకునే కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం సురక్షితమని అధికారులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడిపి ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 

07:07 - July 11, 2015

కృష్ణా : ముసునూరు తహశీల్దార్‌పై దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చర్చలు జరిపారు. వనజాక్షిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు దేవినేని హామీ ఇచ్చారు. అయితే చింతమనేనిని అరెస్ట్‌ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేయగా.. సోమవారం నాడు చంద్రబాబుతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన..
గత రెండు రోజులుగా కృష్ణాజిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ముసునూరు తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అవసరమైతే పుష్కరాల విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనకు విపక్షాలు మద్దతు తెలిపాయి. దీంతో రంగంలోకి దిగిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు.
వనజాక్షిపై కేసులు ఎత్తివేయాలి..
విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. అదేవిధంగా ముసునూరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని, వనజాక్షిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు.
వనజాక్షిపై కేసులు ఎత్తివేత..
తహశీల్దార్‌ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను మంత్రి దేవినేని ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సోమవారం సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతారని తెలిపారు. ముసునూరు ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వనజాక్షిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని మంత్రి తెలిపారు.
ఈ ఘటనపై ఆర్టీఐ కమిషనర్‌ విజయ్‌బాబు స్పందించారు. తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ చింతమనేనిని విప్‌ పదవి నుంచి తొలగించాలన్నారు. అదేవిధంగా ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ చింతమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎమ్మెల్యే చింతమనేనిపై ఎలాంటి తీసుకుంటారో తెలియాలంటే సోమవారం వరకు వేచిచూడాలి. 

07:05 - July 11, 2015

నెల్లూరు : ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. ఇప్పటి వరకూ సొంత ప్రయోగాలతోనే సత్తాచాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తాజాగా విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన ఘనత సాధించింది. తన ప్రస్థానంలోనే భారీ వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. మరో భారీ వాణిజ్య ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో దాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-28 రాకెట్‌.. దిగ్విజయంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో బుధవారం ఉదయం 7 గంటలా 28 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌ డౌన్‌.. శుక్రవారం రాత్రి 9 గంటలా 58 నిమిషాలకు ముగిసింది. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్‌ఎల్వీ రాకెట్‌.
5 ఉపగ్రహాలు..
పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 30వ ప్రయోగం చేపట్టిన ఇస్రో బ్రిటన్‌కు చెందిన 5 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన డీఎంసీ-3, సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌ సెయిల్‌ ఉపగ్రహాల మొత్తం బరువు 1440 కిలోలు. డీఎంసీ-3లో ఉన్న ఒక్కొక్క ఉపగ్రహం బరువు 447 కిలోలు. ఇక, సీబీఎన్‌టీ-1 బరువు 91 కిలోలు కాగా.. డి-ఆర్బిట్‌ సెయిల్‌ ఉపగ్రహం బరువు 7 కిలోలు. వీటిని నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌.. భూమికి 647 కిలోమీటర్ల ఎత్తులో ధృవ కక్ష్యలో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
ఆనందంలో శాస్త్రవేత్తలు..
ఇదిలా ఉంటే.. ఇంత బరువు కలిగిన వాణిజ్య ప్రయోగాన్ని ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి. ఇదో వినూత్న ప్రయత్నమని, ఈ ప్రయోగం ద్వారా.. భారత్‌కు 180 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. భవిష్యత్‌ ప్రయోగాలకు ఈ విజయం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు.

ఛత్తీస్ గఢ్ - జార్ఖండ్ సమీపంలో వాయుగుండం..

విశాఖపట్టణం : ఛత్తీస్ గఢ్ - జార్ఖండ్ సమీపంలో వాయుగుండం ఏర్పడింది. ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రానున్న 24గంటల్లో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

06:26 - July 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 15వేలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరుతూ లేబర్‌ కమీషన్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరు పట్ల కార్మిక నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ తమ పక్షమో..? పారిశ్రామికవేత్తల పక్షమో..? తేల్చుకోవాలంటున్నారు కార్మిక నేతలు. సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. తమ హక్కుల పరిరక్షణ కోసం నినదించారు. కనీస వేతనాల అమలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
కార్మికుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు..
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై నేతలు మండిపడ్డారు. కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని... సంవత్సరం గడిచినా... సమస్యల పరిష్కారం దిశగా సర్కార్ ఆలోచించడం లేదంటూ మండిపడ్డారు. గ్రామ పంచాయితీ మున్సిపల్‌, ఉపాధి హామీ కార్మికులు, సమ్మెలు చేస్తుంటే వారి సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేదన్నారు.
మూతపడిన పరిశ్రమలు తెరిపించి ఉపాధి కల్పించాలి..
తెలంగాణ వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించినా పట్టంచుకునే నాథుడే లేకుండా పోయారని నేతలు తెలిపారు. అనేక పరిశ్రమలు మూతపడ్డాయని వాటిని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక పోరుయాత్ర చేపట్టి కార్మికుల సమస్యలు తెలుసుకున్నామని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని నేతలు తెలిపారు.కార్మికుల సమస్యలు పరిష్కరించలేని మంత్రి నాయినికి ఆ పదవి ఎందుకని మహాధర్నాలో విమర్శించారు.

06:24 - July 11, 2015

హైదరాబాద్ : స్వచ్ఛ్ హైదరాబాద్ అంటూ... వారం క్రితం వరకు ఊదరగొట్టిన రాజధాని నగరం... ఇప్పుడు కంపుకొడుతోంది. మున్సిపల్ ఉద్యోగుల సమ్మె, జీహెచ్ఎంసీ పాలకుల నిర్లక్ష్యంతో... భాగ్య నగరంలో ఎక్కడ చూసిన చెత్తే కనిపిస్తోంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతూ... వరదనీటిని తలపిస్తున్నాయి. దీంతో నగరవాసులు రోడ్లపైకి రావలంటే... ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. మరోవైపు సమ్మె విరమించేది లేదంటూ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కార్మికుల మధ్య చిచ్చు పెట్టొదంటూ నాయినిని హెచ్చరించింది. తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఐదోరోజుకు చేరింది. ఎక్కడకక్కడ పెరుగుపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతోంది. 5రోజులుగా చెత్త తొలగించకపోవడంతో నగరం కంపు కొడుతోంది. ఈ వీధి చివరన చూసిన చెత్తకుప్పలతో ప్రజలు ముక్కుమూసుకొని వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు వాటర్ బోర్డ్ కార్మికులు కూడా సమ్మెను కొనసాగిస్తుండటంతో మురుగునీరు రోడ్డుపై పారుతోంది. పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది.
సీఎం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం..
శానిటేషన్ కార్మికులు దేవుళ్లు అంటూ కీర్తించిన ముఖ్యమంత్రి ఇప్పుడు తమ సమ్మెను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు కార్మిక నేతలు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న కార్మిక సంఘాలు ఇందిరాపార్క్ వద్ద శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించాయి. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్మిక నేతలు. తమను కాదని ప్రత్యామ్నాయ కార్మికులను తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు కార్మిక నేతలు.
ప్రత్యామ్నాయ చర్యలు..
మరోవైపు సమ్మె విరమణ జరిగిందంటూ వచ్చిన వార్తలను మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ తోసిపుచ్చింది. జీహెచ్ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటనతో తమకెలాంటి సంబంధం లేదని జేఏసీ నేతలు ప్రకటించారు. కార్మిక నాయకుడిగా ఉన్న నాయిని.. ఇలా తమ మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు కార్మిక నేతలు. మరోవైపు గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు పెద్దగా ప్రభావం చూపలేదు. స్వచ్ కమిటీల్లో ఉన్న సభ్యులు కూడా గ్రేటర్ అధికారులకు సహకరించకపోవడం సమ్మె ఉధృతికి అద్దం పడుతోంది. 

06:22 - July 11, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నేటితో ఏసీబీ కస్టడీ ముగిసింది. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు. ఎమ్మెల్యే సండ్రను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ నెల 21 వరకూ సండ్రకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.  ఓటుకు నోటు కేసుల టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు విధించిన ఏసీబీ కస్టడీ ముగిసింది. అంతకు మునుపు కేసు విచారణలో భాగంగా సండ్రను కస్టడీకి అప్పగించాలని ఏసీబీ న్యాయస్థానాన్ని కోరింది. 5 రోజుల పాటు సండ్రను కస్టడీకి అప్పగిస్తే విచారణ చేస్తామని ఏసీబీ కోర్టును అనుమతి కోరింది.
న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశం..
కానీ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సండ్రను కేవలం రెండు రోజుల పాటు కస్టడీలో తీసుకునేట్లు ఏసీబీకి అనుమతి ఇచ్చింది. అయితే విచారణలో థర్డ్‌ డిగ్రీ ఉపయోగించరాదని, న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం తెలిపింది.
మౌనాన్ని ఆశ్రయించిన సండ్ర..?
విచారణలో భాగంగా ఏసీబీ సండ్రపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సెబాస్టియన్‌తో ఫోన్‌ సంభాషణల గురించి ఏసీబీ అధికారులు సండ్రను అడిగినట్లు సమాచారం. దీనిపై సండ్ర మౌనంగా వహించినట్లు తెలుస్తోంది. సండ్ర విచారణలో డబ్బులు ఎవరు కూర్చారు అనే విషయంలో ఏసీబీ అధికారులు కొంత కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ఈనెల 21 వరకూ న్యాయస్థానం రిమాండ్‌..
ఇదిలా ఉంటే రెండు రోజుల పాటు ఏసీబీ విచారణ ఎదుర్కొన్న సండ్రను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు స్మానియాలో సండ్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సండ్రను కోర్టుకు తరలించారు. సండ్రకు ఈ నెల 21 వరకూ న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 

06:21 - July 11, 2015

ఢిల్లీ : జపాన్ పర్యటన విజయవంతమైందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. జపాన్ ప్రభుత్వంతో పాటు ఎన్నో దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. జపాన్‌ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు బృందం...కేంద్రమంత్రులతోనూ సమావేశమయ్యారు. రాజధానికి అటవీ భూములు అప్పగించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణం, పరిశ్రమలు,పెట్టుబడులు ఆకర్షించేందుకు ఐదు రోజుల పాటు జపాన్‌లో పర్యటించింది చంద్రబాబు బృందం. టూర్ ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు పర్యటన వివరాలు మీడియాకు వివరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా అక్కడి పారిశ్రామికవేత్తలను కోరామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను జపాన్‌ పారిశ్రామికవేత్తలకు వివరించామన్నారు. నూతన రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు, జపాన్ ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు ఆసక్తికనబరిచాయని బాబు చెప్పారు.
అక్టోబర్‌ 22న అమరావతి అట్టహాసంగా శంకుస్థాపన..
తోషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యామన్న చంద్రబాబు...ఎనర్జీ యూనివర్శిటీ ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరినట్లు వెల్లడించారు. స్మార్ట్‌ మీటర్లు, స్మార్ట్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌పై తోషిబా ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కొపరేషన్‌ జేబిక్‌ శ్రీకాకుళంలో మెగా పవర్‌ ప్రాజెక్టు ఫైనాన్స్‌ కోసం ముందుకు వస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే మిజుహో బ్యాంక్‌ అమరావతిలో ఒక బ్యాంక్‌ పెట్టమని కోరామన్నారు. ఏపీలో 20 గిగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నెలకొల్పేందుకు సాఫ్ట్‌ బ్యాంక్‌ ముందుకు వచ్చిందని, అంతేకాకుండా సోలార్‌ పవర్‌పై స్పెషలైజేషన్‌ చేసే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా అందించేందుకు బ్యాంక్‌ సుముఖత వ్యక్తం చేసిందన్నారు. జైకా, బెబిక్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడినట్లు సీఎం చెప్పారు. ఇదిలాఉంటే అక్టోబర్‌ 22న ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన అట్టహాసంగా జరుపుతామని చంద్రబాబు ప్రకటించారు.
రాజధాని నిర్మాణానికి అటవీ భూములు ఇవ్వాలని కోరిన బాబు..
ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, ఉమాభారతితో సమావేశమయ్యారు చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి అటవీ భూములు ఇవ్వాలని ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో ఆ భూములను డీనోటిఫై చేయడంతో పాటు చట్టపరమైన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామని హామి ఇచ్చారని వెల్లడించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతి నిర్మాణానికి జాతీయ ప్రాధాన్యత ఉందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అటవీ భూములు డీనోటిఫై చేయడానికి కేంద్రం అంగకరించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.

06:18 - July 11, 2015

మహబూబ్ నగర్ : ప్రస్తుతం గులాబీ పార్టీ రాజకీయమంతా పాలమూరు చుట్టే తిరుగుతోంది. ఓటుకు నోటు వ్యవహారంతో మొదలైన రాజకీయ దుమారం ఇప్పుడు సాగునీటి వరకు చేరుకుంది. నీటిపైనే టీడీపీ, టీఆర్ఎస్ లీడర్లు మంటలు పుట్టిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా... సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. పాలమూర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలమండలికి లేఖరాసినందుకు నిరసనగా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి దగ్గరుండి బంద్‌ను నిర్వహించారు.
ఉద్యమం ఉధృతం చేస్తామన్న గులాబీ నేతలు...
అన్ని మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా బస్సు డిపోల్లో బస్సు సర్వీసులను నిలిపివేసి బంద్‌ పాటించారు. ఏపీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఉద్యమాలు చేస్తామని టీఆర్ఎస్‌ నేతలు హెచ్చిరంచారు.
టీఆర్‌ఎస్‌వి అసత్య ప్రచారాలు - రేవంత్‌ రెడ్డి..
ఇదిలా ఉంటే కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. టీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పాలమూరు డీపీఆర్‌లు ఇప్పించాలని మాత్రమే కోరింది తప్ప... ప్రాజెక్టును నిలిపివేయాలని కోరలేదన్నారు. కేంద్ర విభజన చట్టం ప్రకారం కృష్ణానదిపై ఏ ప్రాజెక్టు చేపట్టినా ఇరురాష్ట్రాలు ప్రాజెక్టు రిపోర్టులు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. గతంలో ఎక్కడా ప్రభుత్వాలు బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాలు లేవని.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక బంద్‌లకు పిలుపునిస్తోందని రేవంత్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో బంద్‌లే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు..
పాలమూరు ఎత్తిపోతలపై టీడీపీ, చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి..
మరోవైపు పాలమూరు ఎత్తిపోతల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్ చేసారు. మంత్రి హరీశ్‌రావుపై తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వెకిలిగా మాట్లాడటం సరికాదన్నారు. ఆయనకు పాలమూరు ప్రాజెక్టు అవసరం లేదా? అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలకు ఎవరూ అడ్డుపడొద్దని.. అడ్డుపడితే రంగారెడ్డి జిల్లాలోనూ ఉద్యమం చేపడతామని టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరించారు. 

మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు రెట్టింపు వేతనం..

హైదరాబాద్ : నేటి నుండి విధులకు హాజరయ్యే ఔట్ సోర్సింగ్ కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వనుంది. సమ్మెలోని ఔట్ సోర్సింగ్ కార్మికులపై అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. పారిశుధ్య కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నేడు వర్కింగ్ డేగా ప్రకటించింది. 

నేడు డైట్ సైట్ -2015 ప్రకటన..

హైదరాబాద్ : నేడు డైట్ సైట్ -2015 ప్రకటన వెలువడనుంది. ఈనెల 14 నుండి 27 వ తేదీ వరకు ఆన్ లైన్ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ దరఖాస్తుకు జులై 28 చివరి తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 14 నుండి హాల్ టికెట్లు పంపిణీ జరుగనుంది. 23న రాతపరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10 నుండి తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

 

నేడు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్...

ఇంగ్లండ్ : నేడు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా - మరుగుజలు ఢీకొననున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది.

 

 

ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..

హైదరాబాద్ : నేడు ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన జరుగనుంది. ఉదయం రాజమండ్రి..సాయంత్రం కొవ్వూరులో సమీక్షా సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. 

ఒంగోలులో సీఐటీయు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు..

ప్రకాశం : నేడు, రేపు ఒంగోలు సుందరయ్య భవన్ లో సీఐటీయు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి. 

మెదక్ లో సీఎం పర్యటన..

మెదక్ : జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పటన్ చెరులో హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. జిన్నారం మండలం కొడకంచిలో డెక్కన్ ఆటో బస్ బాడీ బిల్డింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు.

ఏపీ మున్సిపల్ సమ్మెపై స్పందించిన సర్కార్..

హైదరాబాద్ : ఏపీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సాయంత్రం చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులు యనమల, నారాయణ సమక్షంలో చర్చలు జరుగనున్నాయి. 

Don't Miss