Activities calendar

14 July 2015

21:52 - July 14, 2015

హారారే: జింబాబ్వేతో ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో క్లీన్ స్వీప్ సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో టీమిండియా 83 పరుగుల భారీవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు కేదార్ జాదవ్ 87 బాల్స్ లో 12 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో అజేయ సెంచరీ సాధించాడు. మనీష్ పాండే 71 పరుగులతో స్కోరుత కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. 278 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన జింబాబ్వే...42.4 ఓవర్లలో 193 స్కోరుకే కుప్పకూలింది. ఓపెనర్ చిబాబా మినహా మిగిలిన ఏ.. ఆటగాడు టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొనలేకపోయాడు. మీడియం పేసర్లు స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు, మోహిత్ శర్మ2 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. కేదార్ జాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అంబటి రాయుడుకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. సిరీస్ లోని రెండు మ్యాచ్ ల టీ-20 సమరం ఈనెల 17న ప్రారంభమవుతుంది.

 

 

21:47 - July 14, 2015

ఢిల్లీ: ఐపీఎల్ 2013 సీజన్.. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ నిర్వహించిన జస్టిస్ లోథా కమిటీ తన తుదితీర్పును ప్రకటించింది. ఐపీఎల్ మాజీ చాంపియన్లు రాజస్థాన్, చెన్నై ఫ్రాంచైజీలపై రెండేళ్ళ పాటు నిషేధం విధించినట్లు జస్టిస్ లోథా ప్రకటించారు. ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉంటూ భారత క్రికెట్ కే తలవంపులు తెచ్చిన గురునాథన్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రాలపై జీవితకాల నిషేధం విధించినట్లు కూడా ప్రకటించారు. ఫ్రాంచైజీలను, ఓనర్లను వేర్వేరుగా చూడలేమని జస్టిస్ లోథా స్పష్టం చేశారు.

21:34 - July 14, 2015

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాట జరగడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 300లకు పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో పుష్కరాలు, ఉత్సవాలలో జరుగుతున్న తొక్కిసలాట, ప్రమాదాలపై టెన్ టివి 'ఎవరిదీ.. పాపం..' అనే టైటిల్ పేరుతో వైడ్ యాంగిల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలు పుణ్యక్షేత్రాల వద్ద, పుష్కరాలలో తొక్కిసలాటలు, ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి...? ప్రమాదాలకు కారణం ఎవరు...? పుష్కరాలు, ఉత్సవాలు, పండుగలకు అన్ని రకాల సదుపాయాలు కల్సిస్తున్నారా...? ఈ ప్రమాదాలకు బాధ్యత ఎవరిదీ అనే వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:17 - July 14, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకు ఏసీబీ నోటీసులు అందజేసింది. 160 సెక్షన్ కింద నోటీసులు జారీ అయ్యాయి. రేపు ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుకావాలని నోటీసులో తెలిపింది. గత నెల 31న స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇవ్వడానికి ముందు ఉదయ్‌సింహా, సెబాస్టీయన్‌తో కృష్ణ ఫోన్‌లో మాట్లాడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది.

 

పుష్కరాల దుర్ఘటన...చంద్రబాబుపై కేసు నమోదు

కృష్ణా: వన్ టౌన్ పీఎస్ లో సీఎం చంద్రబాబుపై కేసు నమోదు అయింది. పుష్కరాల దుర్ఘటనకు చంద్రబాబే కారణమని వైసిపి నేత మండలి హనుమంతరావు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 

'ఓటుకు నోటు'లో మరొకరికి ఎసిబి నోటీసులు...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరొకరికి ఎసిబి నోటీసులు జారీ చేసింది. వేంనరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. 160 సెక్షన్ కింది నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఎసిబి ఆదేశించింది.

 

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరి పిఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. 

తొక్కిసలాట మృతులకు మంత్రి ఇంద్రకరణ్ నివాళి

తూర్పుగోదావరి: రాజమండ్రి తొక్కిసలాటలో మృతి చెందిన వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. 

జింబాబ్వేపై భారత్ విజయం

హారారే: భారత్, జింబాబ్వే ల మధ్య జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్ 83 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. మూడు వన్డేల సీరీస్ ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. 

20:04 - July 14, 2015

హైదరాబాద్: మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాయి. సమ్మెకు మద్దతుగా రేపటి నుంచి నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించాయి. ఉదయం 9 గంటలకు తమ్మినేని సహా పది వామపక్ష పార్టీల నేతలు దీక్షలో పాల్గొననున్నారు. సమ్మెను అణచివేసేందుకు పోలీసులను ప్రయోగించడం అప్రజాస్వామికమైన చర్య అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

 

రాజమండ్రి ఘటన దురదృష్టకరం:వెంకయ్యనాయుడు

ఢిల్లీ: రాజమండ్రి పుష్కరాల వద్ద తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రమాదం జరిగిందన్నారు. ఒకేసారి భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఏ.. ఘాట్ వద్ద స్నానమాచరించినా పుణ్యమే.. లభిస్తుందని పేర్కొన్నారు. గోదావరిలో నీటి మట్టం తక్కువగా వుందని... నీటి విడుదల కోసం మహారాష్ట్ర సీఎంతో మాట్లాడానని తెలిపారు. ఎం.ఎస్ విశ్వనాథన్ మృతి..సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు.

 

19:37 - July 14, 2015

హైదరాబాద్: విపక్ష పార్టీల నేతలపై టీడీపీ నేత జూపూటి ప్రభాకర్‌ ఫైర్ అయ్యారు. రాజమండ్రి పుష్కర విషాదంపై విపక్షాలు సీఎం చంద్రబాబును నిలదీయడాన్ని ఆయన తప్పుపట్టారు. విమర్శించే వారు ఇప్పటికైనా..కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. 'మీరేమైనా..పుష్కరఘాట్లకు వాలెంటీర్లను పంపారా'..?అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.

 

19:32 - July 14, 2015

రాజమండ్రి: చంద్రబాబు తీరువల్లే రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. వీఐపీలకు కేటాయించిన సరస్వతీ ఘాట్‌లోనే చంద్రబాబు పుష్కర స్నానాలు చేసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. పబ్లిసిటీ కోసం సాధారణ ప్రజలు స్నానాలు చేసే పుష్కర ఘాట్‌లో చంద్రబాబు స్నానాలు చేశారని..భక్తులను రెండున్నర గంటలు ఆపి ఒక్కసారిగా వదలడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి కారణం చంద్రబాబేనని జగన్‌ అన్నారు. చంద్రబాబును అరెస్‌ చేసి జైలుకు పంపాలని జగన్‌ మండిపడ్డారు.

 

రేపటి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు..

హైదరాబాద్: సీఎం చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి వుంది.

 

తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు న్యాయవిచారణకు ఆదేశించారు. 

కెఆర్ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు ఎండీ అరెస్టు...

హైదరాబాద్: కెఆర్ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు ప్రయివేట్ లిమిటెడ్ ఎండీ కూనం రాఘవరెడ్డిని సర్వీస్ ట్యాక్స్ అధికారులు అరెస్టు చేశారు. కూనం రాఘవరెడ్డి రూ.20 కోట్లకు పైగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు. 

17:49 - July 14, 2015

గుంటూరు: ర్యాగింగ్ భూతం ఓ విద్యార్థినిని బలితీసుకుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేడయడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తేజస్విని అనే విద్యార్థిని ఆచార నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా ఆరుగురు సీనియర్ విద్యార్థులు తేజస్వినిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమె ప్రిన్సిపల్ కు కూడా ఫిర్యాదు చేశారు.. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సీనియర్లు అలాగే ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో తీవ్రమనస్థాపానికి గురైన విద్యార్థిని తను ఉంటున్న హాస్టలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 'నా చావు తర్వాతైనా ర్యాగింగ్ ఆగిపోతుందని భావిస్తున్నాను' అని తేజస్విని లేఖలో పేర్కొంది. విద్యార్థినికి ఆత్మహత్యకు సీనియర్ల ర్యాగింగే కారణమని అనుమానిస్తున్నారు. విద్యార్థిని రాసిన సూసైడ్ లేఖ, ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

కూనం రాఘవరెడ్డిని అరెస్టు చేసిన సర్వీస్ ట్యాక్స్ అధికారులు...

హైదరాబాద్:రూ.20కోట్లకు పైగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని కేఆర్ ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు ప్రయివేటు లిమిటెడ్ ఎండీ కూనం రాఘవరెడ్డిని సర్వీస్ ట్యాక్స్ అధికారులు అరెస్టు చేశారు.  

పుష్కరాల రద్దీ దృష్ట్యా 825 ప్రత్యేక రైళ్లు:ద.మ.రైల్వే

హైదరాబాద్: గోదావరి పుష్కరాల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో 825 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే ప్రకటించింది. ఏపీలోని కొవ్వూరు, గోదావరి, రాజమండ్రికి 78 రిజర్వేషన్, 379 రిజర్వేషన్ లేని రైళ్లు, నరసాపురానికి 46 రిజర్వేషన్ లేని రైళ్లు, తెలంగాణ లోని బాసరకు 222 రిజర్వేషన్ లేని రైళ్లు, మంచిర్యాల, రామగుండానికి 56 రిజర్వేషన్ లేని రైల్లు, భద్రాచలం రోడ్ కు 6 రిజర్వేషన్, 38 రిజర్వేషన్ లేని రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్లో పొందుపరిచామని రైల్వే సీపీఆర్ ఓ తెలిపారు.

తొక్కిసలాటలో 29కి చేరిన మృతులు

కాకినాడ:రాజమండ్రి గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటలో మృతుల సంఖ్య 29కి చేరింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 29కి చేరింది. కాగా 25 మృత దేహాలను ఆసుపత్రి వర్గాలు మృతుల బంధువులకు అప్పగించారు.

 

క్షతగాత్రులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు...

తూ.గో:రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను కాంగ్రెస్ నేతలు రఘువీరా, చిరంజీవి, సి.రామచంద్రయ్యలు పరామర్శించారు.

 

17:25 - July 14, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరఘాట్‌ తొక్కిసలాట మృతుల కుటుంబాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని వెంటనే అందజేయాలని, క్షతగాత్రులకు వైద్య సదుపాయాలు అందజేయాలని జగన్‌ కోరారు.

 

చర్లపల్లి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సండ్ర

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఐదో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి కాసేపటి క్రితమే విడుదలయ్యారు.

17:16 - July 14, 2015

అదిలాబాద్‌: జిల్లా బాసరలో గోదావరి పుష్కర స్నానాలు వేకువజాము నుంచే ప్రారంభమైయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా..ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,ఛత్తీస్‌ఘడ్‌తో పాటు పలు రాష్ట్రాలనుండి భక్తులు బాసరకు చేరుకుంటున్నారు. లక్షలాది మంది భక్తులు ...గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో బాసర ఆలయ పరిసరాలు భక్తకోటితో కిటకిటలాడుతోంది. మరోవైపు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:02 - July 14, 2015

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాజమండ్రి పుష్కరాళ్లలో జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ..బాబు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గొప్పగా ప్రచారం చేసిన బాబు ఏర్పాట్లు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

 

16:58 - July 14, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట మృతులకు సీపీఎం ప్రగాఢ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు పరిహారం ఇవ్వాలని సీపీఎం నేతలు చంద్రబాబును అడ్డుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో నిరసన తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

16:53 - July 14, 2015

హైదరాబాద్: పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట పూర్తిగా ఏపి ప్రభుత్వ అసమర్ధత వల్లే జరిగిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మండిపడ్డారు. ప్రచారంపై పెట్టిన శ్రద్ధ ఏర్పాట్లపై పెట్టి ఉంటే విషాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్నానం చేసేందుకు రెండు గంటలు భక్తులను నిర్భంధించినంత పని చేయటం రాజరికానికి అద్దం పడుతుందని తీవ్ర స్ధాయిలో ఫైరయ్యారు.

 

16:49 - July 14, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రిలోని కోటగుమ్మం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పుష్కరాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విషాదమని మంత్రి అన్నారు. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. లక్షలాదిగా తరలివచ్చే పుష్కరాలకు ప్రభుత్వం మరింత పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

 

16:44 - July 14, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు పవన్‌ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. క్షతగాత్రులకు సానుభూతి కలగాలని ఆశిస్తున్నానని పవన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజమండ్రికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నా.. మళ్లీ తొక్కిసలాట జరుగుతుందేమోనని విరమించుకున్నానని పవన్‌ తెలిపారు. పుష్కర సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన కార్యకర్తలకు పవన్‌ సూచించారు.

 

తీహార్ జైలులో ఖైదీ ఆత్మహత్య...

న్యూఢిల్లీ : తీహార్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. మర్డర్ కేసులో నిందితుడైన రవీందర్(27) గతేడాది జులై 8 నుంచి తీహార్ జైలులో ఉంటున్నాడు. రవీందర్ తన సెల్‌లోని ఇనుప చువ్వకు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2004 నుంచి రవీందర్‌కు నేర చరిత్ర ఉందని..... గతంలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 

16:38 - July 14, 2015

రాజమండ్రి: నిర్లక్ష్యం నిలువునా ముంచేసింది. నమ్మకం నట్టేట కలిపేసింది. ఆహ్వానాల్లో ఉన్న ఆర్భాటం.. ఏర్పాట్లలో లేకపోవడంతో అమాయకులు బలయ్యారు. సీఎంతో సహా వీఐపీలంతా ఒకే ఘాట్‌పై అందరి దృష్టి పడేలా చేయడంతో.. అందరి దారి ఆ ఘాట్‌ వైపే వెళ్లింది. ఆ దారి గోదారే అయింది. మూడు గంటలపాటు కట్టిపడేసి ఒక్కసారే వదిలేసిన అధికారుల అలసత్వం.. పెను విషాదానికి కారణమైంది. ఆరాటంలో పరుగులు పెట్టిన యాత్రీకులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఊపిరి ఆడటం లేదని తెలుసుకునేలోపే ఆ ఊపిరి ఆగిపోయింది. స్పృహ తప్పారనుకుని లేపినవారికి.. వారు చనిపోయారనే విషయం అర్థం అవటానికి చాలాసేపు పట్టింది. హహాకారాలు, ఆర్తనాదాలతో కోటగుమ్మం పుష్కరఘాట్‌ తల్లడిల్లిపోయింది. మృతుల సంఖ్య 27గా అధికార వర్గాలు ప్రకటించాయి.
మృతుల వివరాలు....
రాజమండ్రి పుష్కరఘాట్ తొక్కిసలాటలో 27 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వందలమంది గాయపడ్డారు.. వీరిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మృతుల్లో విశాఖ జిల్లా పెందుర్తికిచెందిన గొర్లె మంగమ్మ.... పశ్చిమగోదావరి జిల్లా యండగండికిచెందిన బుద్ధవరపు లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా వేమవరానికిచెందిన దేశినేని కృష్ణకుమారి.... యానాంకుచెందిన కృష్ణయ్య, రత్నం, విజయనగరం జిల్లా పాల్తేరుచెందిన పారమ్మ, పైడితల్లి ఉన్నారు.. అలాగే నెల్లురువాసి జానకమ్మ... విజయవాడకుచెందిన కృష్ణవేణి... విజయనగరం జిల్లా బొబ్బిలికిచెందిన అప్పలస్వామి.... ధవళేశ్వరానికిచెందిన సత్యవతి.... అనంతలక్ష్మి... శ్రీకాకుళం జిల్లాకుచెందిన ప్రశాంత్.... నర్సమ్మ... కొత్తవోలు కళావతి.. విజయనగరం జిల్లా సరసనపల్లివాసి వెంకటయ్యనాయుడు... పార్వతమ్మ, కొత్తవోలు కళావతి... ఆముదాలవలసకుచెందిన పాటూరి అమరావతి... రాజమండ్రికిచెందిన వెంకటలక్ష్మి.... తునివాసి నారాయణమ్మ ఉన్నారు.

 

వింబుల్డన్ గెలుపు జీవితంలో మరిచిపోలేని రోజు:సానియా మీర్జా

హైదరాబాద్: వింబుల్డన్ మహిళల డబుల్స్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రముఖ క్రీడాకాణి సానియా మీర్జా అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాని స్పష్టం చేశారు. వింబుల్డన్ గెలవడం జీవితంలో మరిచిపోలేని రోజుని.. ఈ విజయాన్ని దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నాని సానియా తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించడం గర్వకారణమన్నారు. రియోలో బంగారు పతకం గెలిచేందుకు ప్రయత్నిస్తానని సానియా మీర్జా పేర్కొన్నారు.

తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

హైదరాబాద్:గోదావరి పుష్కరాల సంద్భంగా రాజమండ్రి లో పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

16:29 - July 14, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇన్ని చర్యలు తీసుకున్నా తొక్కిసలాట జరగడం దృరదృష్టకరమని చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను చంద్రబాబు ప్రకటించారు. కంట్రోల్‌ రూం నుంచి ఆయన పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్‌కు ఒకే సారి భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఇతర ఘాట్‌లను కూడా ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. 

జింబాబ్వే విజయలక్ష్యం 277 పరుగులు

హరారే: జింబాబ్వేతో చివరి, మూడో వన్డేలో టీమిండియా 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లనష్టానికి 27 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (105) అజేయ సెంచరీతో చెలరేగగా, మనీష్ పాండే (71) హాఫ్ సెంచరీలతో రాణించాడు. జాదవ్ కిది కెరీర్లో తొలి వన్డే సెంచరీ

నా గొలుసు లాక్కెళ్లిన కోతిని అరెస్టు చేయండి..

హైదరాబాద్: యూపీ కాన్పూర్ నగర పోలీసులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కౌసల్ పురి వాసి ఊర్మిళ సక్సేనా సోమవారం దేవాలయానికి వెళుతుండగా ఓ కోతి ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించింది. అయితే, సగం గొలుసు మాత్రమే కోతి చేతికి వచ్చింది. సగం గొలుసుతో ఆ వానరం అక్కడినుంచి వెళ్లిపోయింది. ఘటనపై బాధిత మహిళ నజీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ కోతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనంటూ పట్టుబట్టడంతో పోలీసులు సంకట స్థితిలో పడ్డారు.

మృతుల కుటుంబాలకు వెంకటసాయి మీడియా అధినేత ఆర్థికసాయం

హైదరాబాద్:రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు వెంకటసాయి మీడియా అధినేత సీహెచ్ రాజశేఖర్ ఆర్థికసాయం ప్రకటించారు. ఒక్కొ కుటుంబానికి రూ.50 వేల చొప్పున సహాయంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

నాగార్జున యూనిర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు:ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే(బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఫస్టియర్ చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి:జగన్

తూ.గో:రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వీఐపీ ఘాట్ లో ఎందుకు పూజలు చేసుకోలేదని జగన్ ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ కోసమే వీఐపీ ఘాట్ ను వదిలి వేరే ఘాట్ కు వచ్చి, తోపులాటకు కారణమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు పూజలు జరుగుతున్నంత సేపు జనాలను ఘాట్ లోకి అనుమతించలేదని... ఆయన వెళ్లిపోయిన వెంటనే, ఒక్కసారిగా వదలడంతో, తొక్కిసలాట చోటు చేసుకుందని అన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం మానవత్వం ఉన్నా కాశీకి పోయి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు.

తొక్కిసలాట ఘటనపై ఎన్ హెచ్ ఆర్సీ లో పిటిషన్

హైదరాబాద్:రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనపై ఎన్ హెచ్ ఆర్సీలో లాయర్ సాయికృష్ణ ఆజాద్ పిటిషన్ దాఖలు చేశారు. సంఘటన పై స్పందించిన ఎన్ హెచ్ ఆర్సీ విచారణకు స్వీకరించింది.

ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం:100 మందికి అస్వస్థత

నల్గొండ:కట్టంగూరు మండలం అయిటిపాముల ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 100 మంది బాలికలు అస్వస్థత గురయ్యారు. 100 మంది విద్యార్థినులు అస్వస్థత చెందినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ వారికి అత్యవసర వైద్య సదుపాయం కూడా కల్పించలేదని వాపోయారు.

పుష్కర బాధితులను పరామర్శించిన జగన్

రాజమండ్రి: గోదావరి పుష్కరాల సంద్భంగా పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులను ఆయన పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని తక్షణం అందజేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన కోరారు.

15:26 - July 14, 2015

అమ్మాయిల అక్రమ రవాణాను అరికట్టాలని వక్తలు తెలిపారు. అమ్మాయిల అక్రమ రవాణా అనే అంశంపై మానవి నిర్వహించిన చర్చా వేదికలో సాధన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మురళీ మోహన్, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ శ్యామలదేవి పాల్గొని, మాట్లాడారు. మనుషులను సరుకుగా చూడడం వల్లనే అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోందన్నారు. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందని వాపోయారు. తల్లిదండ్రులు వీలైనంత మేర పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ పద్ధతులను నేర్పాలని పేర్కొన్నారు. ఆపద నుంచి బయటపడిన పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు తెలియజేయాలని సూచించారు.


 

రాజమండ్రి తొక్కిసలాటపై గవర్నర్ ఆరా

హైదరాబాద్: గోదావరి పుష్కరా సందర్భంగా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట పై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. మృతులకుటుంబాలకు సంతాపం ప్రకటించారు. 

కుంభమేళాలోనూ తొక్కిసలాట :ఇద్దరి మృతి

హైదరాబాద్:ఏపీ గోదావరి పుష్కర ఘాట్ లో చోటు చేసుకున్న దుర్ఘటనే కుంభమేళాలో కూడా చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ రోజు ప్రారంభమైన కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు చనిపోయినట్టు తెలిసింది. మొదటిరోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో కుంభమేళా వద్ద తొక్కిసలాట జరిగింది. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపు చేస్తున్నాయి. 

తొక్కిసలాట జరగడం బాధాకరం:పవన్ కల్యాణ్

తూ.గో:రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. తాను పరామర్శకు రావాల్సి ఉన్నప్పటికీ, తాను వస్తే మళ్లీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున రావటం లేదని పవన్ వివరణ ఇచ్చారు. తాను లేకపోయినా, తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్యం బాధిత కుటుంబాలకు తగిన పరిహారాన్ని ప్రకటించాలని కోరారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

భద్రాచలం ఆలయంలో అర్చకుల ఆందోళన

ఖమ్మం:ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని ఆలయ సిబ్బందిపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ నిరసనగా అర్చకులు ఆలయంలోనే ధర్నా చేపట్టారు. పుష్కరాల సమయంలో ఎన్నడూ లేనంతంగా భక్తుల తాకిడి ఉంటుంది. ఇక్కడి పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కప్పుడు అది కాస్త శ్రుతి మించుతోంది. భద్రాచలంలోని ఆలయ సిబ్బందిపై పోలీసులు దాడి చేశారు. విధులు నిర్వర్తిస్తున్న మాపై పోలీసుల దౌర్జన్యం ఎక్కువవుతోందని అర్చకులు తెలిపారు.

పార్టీ వద్ద నిధుల్లేవు.. సహాయం చేయండి:కేజ్రీవాల్

హైదరాబాద్:తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద నిధులు నిండుకున్నాయని, పార్టీని నడపాలంటే నిధులు అవసరమని, ప్రజలు సాయం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు బహిరంగ విజ్ఞప్తి చేశారు. విరాళాలు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. ప్రస్తుతం పార్టీ రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బుల్లేవని దీనావస్థను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. "ఈ విధంగా విరాళాలు అడుగుతున్నందుకు మీరు అనొచ్చు... ఇతనేం ముఖ్యమంత్రి అని! తప్పడు మార్గంలో నిధులు అందుకునే వీలున్నా, మేం అలాంటి వాళ్లం కాదు. ప్రజలే మాకు నిధులందిస్తున్నారు. అవినీతి సొమ్ముకు ఎప్పుడూ ఆశపడలేదు.

15:01 - July 14, 2015

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాల ప్రారంభం రోజునే మహా విషాదం నెలకొంది. రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రాజమండ్రి పుష్కరఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తీవ్ర తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగానే గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఘటనాస్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పుష్కరాలు పూర్తయిన తరువాత చర్యలుంటాయని సీఎం పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

27 మృతదేహాలకు పోస్టుమార్టం..

తూర్పుగోదావరి: పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో 27 మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

కేసీఆర్ తెలంగాణను పోలీసుల రాజ్యం చేస్తాడా?:తమ్మినేని

హైదరాబాద్:మున్సిపల్ కార్మికుల సమ్మెపై మిలటరీ పోలీసులను ఉపయోగిస్తాన్న సీఎం కేసీఆర్ తెలంగాణను పోలీసుల రాజ్యం చేస్తాడా? అని సీపీఎంతెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మిలటరీ పోలీసులను ఉపయోగిస్తామనడం అహంకార పూరితం, అప్రజాస్వామికం అని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని 10 వామపక్ష పార్టీ నిర్ణయించారు. అంతే కాకుండా బుధవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పుష్కరాలు..పెరుగుతున్న మృతుల సంఖ్య..

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాల ప్రారంభం రోజునే మహా విషాదం నెలకొంది. రాజమండ్రి పుష్కరఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తీవ్ర తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 300 మందికిపైగానే గాయపడ్డారు. వీరందరినీ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘటనాస్థలాన్ని బాబు పరిశీలించారు.

మయప్పన్, రాజ్ కుంద్రాపై జీవిత కాలం నిషేధం

హైదరాబాద్: మయప్పన్, రాజ్ కుంద్రాపై జీవిత కాలం నిషేధం విధిస్తూ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో జస్టిస్ లోధా కమిటీ తీర్పు ఇచ్చింది. ఐపీఎల్ బెట్టింగ్ లో మయప్పన్, రాజ్ కుంద్రాలు దోషులుగాలుగా తేల్చుతూ.. చెన్నై సూపర్ కింగ్స్, రాయస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

13:36 - July 14, 2015

హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న పుష్కరాల్లో తప్పులు జరుగుతాయని ఊహించాం కానీ ఇంత పెద్ద ఘటన జరుగుతుందని ఊహించలేదన్నారు. సి.రామచందయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. అక్కడ కనీసం ఏలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, 14వ తేదీ నాటికి ఏర్పాట్లు కావని కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై తాము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన యనమల రామకృష్ణుడు..మరో మంత్రి నారాయణలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పచెప్పారని తెలిపారు. వీరు గాక ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ రావుకు కీలక బాధ్యతలు అప్పచెప్పారని తెలిపారు. వీరు ముగ్గురిని చంద్రబాబు జపాన్ పర్యటనకు తీసుకెళ్లడం జరిగిందని, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారని రఘువీరా విమర్శించారు. 

తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలు....

తూ.గో:రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు....
రుద్రరాజు లక్ష్మి-(ప.గో జిల్లా యండగండి)

గొర్రెల మంగమ్మ-(విశాఖ జిల్లా పెందుర్తి)

దేశినేని కృష్ణమ్మ-(తూ.గో జిల్లా వేమగిరి)

పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ(శ్రీకాకుళం)

లక్ష్మణరావు( ప.గో జిల్లా తాడేపల్లిగూడెం)

పాండవుల విజయలక్ష్మి( విశాఖ జిల్లా వడ్లపూడి)

పారమ్మ( విజయనగరం జిల్లా బాడంగి మం.పాల్తేరు)

పైడితల్లి( విజయనగరం జిల్లా బాడంగి మం.పాల్తేరు)

తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలు....

తూ.గో:రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు....
రుద్రరాజు లక్ష్మి-(ప.గో జిల్లా యండగండి)

గొర్రెల మంగమ్మ-(విశాఖ జిల్లా పెందుర్తి)

దేశినేని కృష్ణమ్మ-(తూ.గో జిల్లా వేమగిరి)

పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ(శ్రీకాకుళం)

లక్ష్మణరావు( ప.గో జిల్లా తాడేపల్లిగూడెం)

పాండవుల విజయలక్ష్మి( విశాఖ జిల్లా వడ్లపూడి)

పారమ్మ( విజయనగరం జిల్లా బాడంగి మం.పాల్తేరు)

పైడితల్లి( విజయనగరం జిల్లా బాడంగి మం.పాల్తేరు)

13:32 - July 14, 2015

హైదరాబాద్ : పుష్కరాల్లో రాజమండ్రిలో జరిగిన ఘటనపై ఏపీ కాంగ్రెస్ నేత చిరంజీవి స్పందించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనం ఆయన అభివర్ణించారు. ఏపీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. లక్షలాది మంది యాత్రికులు వస్తారని అంచనా లేకపోవడం దురదృష్టకరమన్నారు. యాత్రికులను ఎలా పంపించాలో పక్కా శాస్త్రీయ పద్దతులు అవలించలేదన్నారు. జరుగుతున్న ఏర్పాట్లపై బీజేపీ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అన్ని ఏర్పాట్లు సీఎం చంద్రబాబు చూసుకుంటున్నారని టిడిపి నేత పేర్కొన్నారని తెలిపారు. మరి ఈ ఘటనకు పూర్తి బాధ్యత సీఎం చంద్రబాబు వహిస్తారా ? లేదా ? అని ప్రశ్నించారు. దీనిపై ఎప్పటిలాగానే అధికారులు..ఇతర వారిపై నెపం నెట్టివేస్తారా అని నిలదీశారు.
ఆనాడు ఏమన్నారు..ఈనాడు అది చేస్తారా ?
గతంలో వైఎస్ హాయాంలో జరిగిన కృష్ణా పుష్కరాల్లో చోటు చేసుకున్న ఘటనపై బాబు పలు వ్యాఖ్యానాలు చేశారని, వైఎస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు. మరి ఈ ఘటనపై ఏమనాలని, అంతర్మాతను ఆయన ప్రశ్నించుకోవాలన్నారు. ఎంత డిమాండ్ చేసినా బాబు రాజీనామా చేయడని మాకు తెలుసన్నారు. మహా కుంభమేళాను మించి పుష్కరాలను నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందని కానీ కాకారాయుళ్లను పెట్టుకుని బాబు సమీక్షిస్తారా ? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసం విమర్శలు చేయడం లేదన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే ఎక్స్ గ్రేషియా పది లక్షలు కాకుండా పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపట్లో తాము రాజమండ్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించడం జరుగుతుందని, అక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకుంటామని చంద్రబాబు తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లాలో పుష్కరస్నానానికి వెళ్లి ఇద్దరి మృతి

శ్రీకాకుళం: రేగిడి మండలంలో పుష్కర స్నానం కోసం వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. మండలంలోని పర్సనాపల్లికి చెందిన పైడి రామకష్ణ, అప్పల నర్సమ్మ పుష్కరాలకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ముక్తి కోసం పుష్కరాలకు వెళ్లిన తమ వాళ్లు ఇకరారని తెలిసి వారి కుటుంభ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీళ్ల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

13:21 - July 14, 2015

హైదరాబాద్ : మహాపుష్కరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజమండ్రి పుష్కరఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తీవ్ర తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..వీఐపీలు పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం అందర్నీ కలిచివేసింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రోశయ్య (ఏపీ రెవెన్యూ మాజీ ప్రిన్స్ పల్ సెక్రటరీ), నగేష్ (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే సండ్రకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నియోజకవర్గం దాటి వెళ్లవద్దని, పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది. ఏసీబీ న్యాయస్థానం సండ్రను ఆదేశించింది. 2 లక్షల రూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరించాలని సండ్రను న్యాయమూర్తి ఆదేశించారు. సండ్రకు బెయిల్ మంజూరుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఎమ్మెల్యే సండ్రకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి:సీపీఎం

తూ.గో:రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా క్షత గాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సీఎం చంద్రబాబును అడ్డగించే ప్రయత్నం చేశారు. సీఎం తో పాటు కలెక్టర్ అరుణ్, స్పెషల్ ఆఫీసర్ ధనుంజయ్, పోలీసు అధికారులు ఉన్నారు. అప్రమత్తమైన పోలీసులు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ములాయం మీద కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్

హైదరాబాద్:పార్టీ చీఫ్ యులాయం సింగ్ యాదవ్ పై విమర్శలు గుప్పించడమే కాక, కేసు నమోదు చేసిన ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ములాయంపై కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే ఠాకూర్ పై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. అయితే ఈ కేసును తేలిగ్గా కొట్టిపారేసిన ఠాకూర్ ను ఏకంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అఖిలేశ్ యాదవ్ సర్కారు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రబాబు రాజీనామా చేయాలి:చిరంజీవి

హైదరాబాద్: రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడటంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో సీఎం చంద్రబాబు

రాజమండ్రి:ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఈ ఉదయం పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించనున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలకు ఎక్స్ గ్రేషియా:చంద్రబాబు

తూ.గో:రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో 27మంది మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలయజేస్తూ... వారిని ఆదుకుంటామని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. తొక్కిసలాట వార్త విన్న వెంటనే కంట్రోల్ రూం నుంచి పరిస్థితిన సమీక్షించానని తెలిపారు. యాత్రికులు భారీగా వచ్చారు. అయినప్పటికీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

'వ్యాపం' స్కాం చిన్నదేనంట..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న వ్యాపం స్కాం చిన్న స్కాం అని అధికార పార్టీకి చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాస్ విజయవార్జియా పేర్కొన్నారు. ''ఇది మాకు చిన్న స్కామే. మీకెందుకు పెద్దగా కనిపిస్తుందో అర్థం కావడం లేదు'' అంటూ పేర్కొన్నారు. అంతేగాకుండా ''ఈ కేసులో బాధితుల ఇంటర్వ్యూ కోసం ఢిల్లి నుంచి మధ్యప్రదేశ్ వచ్చి నురగలు కక్కుతూ చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ నా కంటే గొప్పవాడేం కాదు కదా'' అని వ్యాఖ్యానించిన వార్జియా తరువాత నాలిక్కరుచుకున్నారు.

 

పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన బాధాకరం:ఎంపీ కవిత

నిజామాబాద్:రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట ఘటన బాధాకరమని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. పుష్కరాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

రాజమండ్రి పుష్కర సంఘటన దురదృష్టకరం:బివిరాఘవులు

హైదరాబాద్: రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 26 మంది చనిపోవడం దురదృష్టకర సంఘటన అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అని తెలిపారు. యాత్రికుల సంఖ్యను అంచానా వేసి వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం పుష్కర స్నానం పూర్తయిన అనంతరం అధికారులు చేతులెత్తేయండతో ఈ ప్రమాదం జరిగిందని రాఘవులు అభిప్రాయపడ్డారు.

కి.మీ. మేర నిలిచిన పుష్కర యాత్రికుల వాహనాలు..

ప.గో:కొవ్వూరు నుండి పంగిడి వరకూ 10 కి.మీ మేర పుష్కర యాత్రికుల వాహనాలు నిలిచిపోయాయి. మరో వైపు రాజమండ్రిలో బొమ్మూరు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 5 గంటలుగా రోడ్లపైనే యాత్రికులు అవస్థలు పడుతున్నారు.

తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్

హైదరాబాద్ : రాజమండ్రి పుష్కరఘాట్ లో తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ హుటాహుటిన రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. 

రాజమండ్రి ఘటనపై ప్రధాని సంతాపం

హైదరాబాద్: రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలా జరిగి 26 మంది మృతి చెందడం పై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయజేస్తూ... వారిని ఆదుకుంటామని తెలిపారు.

'తొలిరోజు స్నానం చేస్తే పుణ్యం అనేది అపోహే'....

రాజమండ్రి : తొలిరోజు స్నానం చేస్తే పుణ్యమని తప్పుడు ప్రచారం చేశారని స్వరూపానంద చెప్పారు. తొలిరోజే పుష్కరస్నానం చేస్తే పుణ్యం వస్తుందనేది అపోహే అని ఆయన పేర్కొన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు స్నానం చేయవచ్చని ఆయన అన్నారు. 12 రోజులే కాదు ఏడాదిలో ఎప్పుడు స్నానం చేసినా అదే పుణ్యం వస్తుందని స్వామి స్వరూపానంద సరస్వతి వివరించారు.

రాజమండ్రి ఘటనపై సంతాపం తెలిపిన కేసీఆర్

తూ.గో: రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లలో ఒకటైన కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 17 మంది మృత్యువాత పడగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత భక్తి భావంతో, పుష్కర స్నానాలను ఆచరించడానికి వచ్చిన సమయంలో ఇలా జరగడం కలచివేసిందని చెప్పారు. ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భక్తులంతా సంయమనంతో పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు. 

11:46 - July 14, 2015

రాజమండ్రి : కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 26 మంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రదేశం నుండి ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుందని, తమముందే చాలా మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు స్నానం చేసిన అనంతరం ఈ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మెడికల్, పోలీసులు ఫేయిల్ అయ్యారని, సృహ కోల్పోయిన వారికి ఆక్సిజన్ అందిస్తే కొంతమంది ప్రాణాలు బతికేవన్నారు. అన్ని యంత్రాంగాలు దీనికి సంజాయిషీ ఇవ్వాలన్నారు. అధికారుల ఏర్పాట్లు సరిగ్గా లేవని, క్యూ లైన్లు సరిగ్గా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సీఎం సెక్యూర్టీకి ఇంపార్టెంట్ ఇచ్చారే కాని భక్తులకు సరియైన ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక మంత్రులు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. కుంభమేళాలో జరిగన ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

11:26 - July 14, 2015

పౌషికాహారం అందించి భావి పౌరులుగా తయారు చేస్తామని చెప్పారు. ఉద్ధేశ్యం బాగానే ఉంది కానీ ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. నిధులు కేటాయించరు..నిర్వాహణ పట్టించుకోరు. శుచి..శుభ్రత..నాణ్యత గాలికొదిలేశారు. ఆఖరుకు చిన్నారులు..బాలింతలే కాదు వండివార్చే కార్మికులను గాలికొదిలేశారు. సమస్యల వలయంలో చిక్కుకున్న అంగన్ వాడీలు మధ్యాహ్నా భోజన పథకాలపై ప్రత్యేక కథనం..

రెండు లారీలు ఢీ: ఇద్దరు సజీవదహనం

మెదక్:మునిపల్లి మండలం బుదేరా వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. లారీలు మితిమీరిన వేగంతో గుద్దుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఇద్దరు డ్రైవర్లు సజీవదహనమయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

పరిపూర్ణానందస్వామికి చేదు అనుభవం

తూ.గో:రాజమండ్రిలో పరిపూర్ణానందస్వామికి చేదు అనుభవం ఎదురైంది. పుష్కరఘాట్‌లోకి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు అనుమతించలేదు. ఐదు గేట్లలోనూ పరిపూర్ణానందస్వామి ప్రవేశానికి నిరాకరించారు. దీంతో పరిపూర్ణానందస్వామి వెనుతిరిగారు. తెలుగు రాష్ట్రాల్లో తన ఆధ్యాత్మిక ప్రభోదాలతో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న పరిపూర్ణానందస్వామి పట్ల పోలీసులు ఇలా ప్రవర్తించడంపై ఆయన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

11:22 - July 14, 2015

ఎవరు ఏం తినాలో నిర్ధేషిస్తున్నారు. ఏ విశ్వాసాలు ఉన్నతమో వారే నిర్వచిస్తున్నారు. ప్రజలంతా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో బయటకు చెప్పని అజెండా అంతర్లీనంగా ఉందా ? ఒకరు మదర్సాలను క్రమబద్దీకరిస్తామని పేర్కొంటారు. మరొకరు తినే తిండిపై నియంత్రణ విధించాలని అంటారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక కథనం..

నాశిక్ లో ప్రారంభమైన కుంభమేళా

హైదరాబాద్: మహారాష్ట్రలోని నాశిక్ లో కుంభమేళా ప్రారంభమైంది. కుషావర్తం, రామ్ కుండ్ వద్ద గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు.

కొత్తపేటలో ఉన్మాది దాడిలో ఇద్దరు మృతి

హైదరాబాద్: నగరంలోని దిల్‌షుక్‌నగర్ కొత్తపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బీటెక్ విద్యార్థినుల లేఖ్య, యామినిపై ఉన్మాది దాడి చేశాడు. విద్యార్థినులు కాలేజీకి వెళుతుండగా అమిత్ అనే ఉన్మాది వారిపై దాడి చేశాడు. దాడిలో లేఖ్య అక్కడికక్కడే మృతి చెందగా, యామిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

'బొగ్గు స్కాం'లో 9మంది పై అభియోగాలు నమోదు చేయండి'

న్యూఢిల్లీ:దేశంలో సంచనలం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిపై అభియోగాలు ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విచారణలో బొగ్గుశాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తా జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసును కూడా చేర్చాలని స్పష్టం చేసింది. గతంలోనే మధుకోడాకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

పుష్కర యాత్రికులకు 10టివి విజ్ఞప్తి

తూ.గో: రాజమండ్రి.కోటిలింగాల ఘాట్ లవద్ద రద్దీ కారణంగా రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఘాట్ ల వద్ద పుణ్య స్నానం ఆచరించాలని పుష్కర యాత్రికులకు 10టివి విజ్ఞప్తి చేస్తోంది.

11:11 - July 14, 2015

రాజమండ్రి : పుష్కరాల్లో..మహా విషాదం నెలకొంది. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాల్లో ఏపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు. రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 26 మంది దుర్మరణం చెందారు. 300 మంది యాత్రికులు సృహ కోల్పోయారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..ఇతర వీఐపీలు పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘాట్లను అందంగా తీర్చిదిద్దడం..రంగు రంగుల శోభతో అలరింపజేయాలి.. ఆలోచనే తప్ప ప్రభుత్వం పుష్కర స్నానాలకు వచ్చిన వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది ఈ ఘటనతో ప్రస్పుటమౌతోంది. 
ఒకే ఘాట్ వద్దకు భారీగా వచ్చిన భక్తులు..
ఏయే పుష్కర ఘాట్ కు ఎంతమంది భక్తులు వస్తారు ? వారి ప్రవేశం కోసం ఎక్కడ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలి ? స్నానం చేసిన అనంతరం వెళ్లే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ? అనే ముందస్తు వ్యూహం అధికారులు అనుసరించలేదు. కోటగుమ్మం పుష్కర ఘాట్ కు వెళ్లేందుకు..వచ్చేందుకు ఒకే మార్గం ఉండటం తొక్కిసలాటకు కారణమైందని యాత్రికులు పేర్కొన్నారు. ఓ పక్క పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన వారు రాకముందే అప్పటికే ఎదురు చూస్తున్నవారు నెట్టుకొని ముందుకురావడంతో ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి నెలకొందని యాత్రికులు తెలిపారు. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఇలాంటి చర్యలతో వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చిన్న విషయం మరిచిపోయిన సర్కార్..
వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం చిన్న విషయాన్ని మరిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్నానాలు చేయండి..పుణ్యం కట్టుకోండి అంటూ విపరీతంగా ప్రచారం చేసిన సర్కార్ స్నానం చేసి వెళ్లే మార్గంపై దృష్టి సారించలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ప్రచారం చేసింది..ఆచరణలో విఫలం..
గోదావరి పుష్కరాల్లో నగరాన్ని సుందరీకరించడానికే ప్రభుత్వం మొగ్గు చూపిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా పుణ్యస్నానాలు చేయండి..పుణ్యం కట్టుకోండని అంటూ ప్రభుత్వం ప్రచారం చేపట్టిందని, కానీ భక్తులకు సరియైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. ఇటీవల జరిగిన పుష్కరాలు..కుంభమేళాల్లో అనుసరించిన విధానంపై ప్రభుత్వం దృష్టి సారించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలు ఏ రోజు వస్తుందో తెలిసిన ప్రభుత్వం కనీసం స్టడీ కూడా చేయలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నీరేది..
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తామన్న ఏపీ సర్కార్ పై యాత్రికులు మండిపడుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారని ప్రశ్నిస్తున్నారు. నీళ్లు ఎక్కడ అని నిలదీస్తున్నారు. ఉచిత నీరు అంటూ ఏర్పాటు చేసిన ఓ కేంద్రం వద్ద ట్యాంకు ఖాళీగా వెక్కిరించింది. తాము నీళ్లు లేకపోవడంతో ఇక్కట్లకు గురవుతున్నట్లు యాత్రికులు తెలిపారు. ప్రభుత్వం అది చేశా..ఇది చేశాం..అని గొప్పలు చెప్పి మోసం చేసిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పిండ ప్రదానాలకు అనుమతి నిరాకరణ:భక్తుల ఆందోళన

ఆదిలాబాద్:దండెపల్లి, గూడెం పుష్కరఘాట్ వద్ద పటిష్ట భద్రత ఉన్నప్పటికీ పిండ ప్రదానాలను సమర్పించేందుకు గోదావరిలోకి అనుమతినివ్వడం లేదు. దీంతో పుష్కరాలు ప్రారంభమైన మంగళవారం ఇక్కడకు వచ్చిన భక్తులు పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదానాలు వంతెనపై నుంచే నదిలో వేసి తమ ఆసంతృప్తిని తెలిపారు.

తొక్కిసలాటలో 26 మంది మృతి

తూ.గో: పుష్కర ఘాట్ మొదటి ద్వారం వద్ద అపశృతి దొర్లింది. పుష్కర ఘాట్ నుంచి కోటగుమ్మం వెళ్లే దారిలో తొక్కిసలాట జరిగి 26 మంది మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. మరో 300 మంది యాత్రికులు స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్షతగాత్రులనుఆదుకుంటాం:మంత్రి కామినేని

తూ.గో:రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 9మంది మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ఒకే ఘాట్ కు ఎక్కువ మంది రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమైన పని అని... బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశలు ఉన్నాయని తెలుస్తోంది.

పుష్కర పైలాన్ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

కరీంనగర్: ధర్మపురిలోని బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన పుష్కర పైలాన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకముందు గోదావరి పుష్కరాలను ప్రారంభించి, కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు.

కంట్రోల్ రూంలో సీఎం చంద్రబాబు సమీక్ష

తూ.గో:రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇప్పటి వరకు 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, పుష్కరాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

10:35 - July 14, 2015

రాజమండ్రి : ఏపీలో జరిగిన పుష్కరాల్లో మహా ఘోరం నెలకొంది. కన్నుల పండుగగా ప్రారంభమైన రెండు గంటల్లో కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. రాజమండ్రి పుష్కర ఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది యాత్రికులు కన్నుమూశారు. మరెంతో మంది యాత్రికులు గాయాలకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక తప్పిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. తమ బిడ్డ ఎక్కడుందో తల్లికి తెలియదు..అమ్మ ఎక్కడుందో కుమారుడికి తెలియదు..ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఒక్కసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా అందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకే స్ట్రెచర్ పై ఇద్దరి మృతదేహాలు..
మృతి చెందిన యాత్రికులను తరలించడానికి అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడం విచారకరం. సుమారు రెండు గంటల అనంతరం మృత దేహాలను తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. మృతి చెందిన మహిళల మృతదేహాలను ఒక్క స్ట్రెచర్ పైనే పెట్టి తరలించడం చూసిన భక్తులు విస్మయానికి గురయ్యారు. మృతి చెందిన వారిని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
నా భార్యను పోలీసులే చంపేశారు..
తన భార్యను పోలీసులే చంపేశారని ఓ భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇక్కడ ఎలాంటి చర్యలు లేవని వాపోయాడు. ఎలాంటి క్రమశిక్షణ లేదని రోదిస్తూ పేర్కొన్నాడు.
మేల్కోన్న అధికారులు...
ఘటన జరిగిన అనంతరం మేల్కోన్న అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్ సిసి సిబ్బంది, వాలంటీర్లు రంగంలోకి దిగారు. వెంటనే భారీగా వస్తున్న యాత్రీకులను అరికట్టడంలో చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. క్యూ లైన్ లు సక్రమంగా వెళ్లే విధంగా చూడడంలో నిమగ్నమయ్యారు.
మెడికల్ క్యాంపులు లేవు..
ఇక్కడ మెడికల్ క్యాంపులు దూరంగా ఏర్పాటు చేశారని ఓ వాలంటీర్ టెన్ టివితో పేర్కొన్నాడు. ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించాడు.
అధికార యంత్రాంగం విఫలం..
''గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం..భారీగా ఖర్చు పెడుతున్నాం..పుష్కరాల్లో స్నానాలు ఆచరించండి..పుణ్యం సంపాదించుకోండి..భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం'' అంటూ ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. పుష్కరాలు మంగళవారం ఆరంభమయ్యాయి. కానీ ప్రభుత్వం పేర్కొన్నవన్నీ ఉత్తుత్తివే అని తెలిసిపోయింది. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలం చెందింది. సుమారు ఐదు లక్షల జనాభా కలిగిన రాజమండ్రి లో పుష్కరాల్లో ఎంత మంది వస్తారనే అంచనాలో ఘోరంగా విఫలం చెందారు. భక్తులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. రద్దీ పెరుగుతున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది.

10:25 - July 14, 2015

మహిళల సమస్యలపై తక్షణ స్పందన..ఉద్యమాల్లో ప్రత్యేక గొంతుక..ఆపదలో ఉన్న మహిళలకు భరోసా..బాధిత మహిళలకు ఆలంబన..ఒక రచయిత్రి..ఒక జర్నలిస్టు..ఒక స్త్రీ వాది..స్వశక్తిని నమ్మే మహిళ ప్రత్యేక కథనం..

రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద విషాదం..

రాజమండ్రి : పుష్కరాల్లో విషాదం నెలకొంది. మొదటి ద్వారం గుండా కోటగుమ్మానికి వెళ్లే దారిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

 

నేటి నుండి రాష్ట్రపతి నిలయ సందర్శన..

హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు ఆవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో వర్షాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పది రోజుల పాటు ఇక్కడ గడిపి తిరిగి వెళ్లారన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శనకు అనుమతించనున్నట్లు చెప్పారు.

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

చిత్తూరు : తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టిటిడి వైభవంగా నిర్వహించింది. ఈనెల 17న ఆణివార ఆస్థానంను పురష్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశారు. 

ఢిల్లీలో స్కూల్ బస్సు ప్రమాదం..పలువురు విద్యార్థులకు గాయాలు..

ఢిల్లీ : విక్టోరియా గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. కాశ్మీర్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10-12 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిని ట్రామా సెంటర్ ఆసుపత్రికి తరలించారు. 

హైదరాబాద్ చేరుకున్న సానియా..

హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈసందర్భంగా పలువురు అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ వింబుల్డెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను సానియా సాధించిన సంగతి తెలిసిందే. 

09:29 - July 14, 2015

ఖమ్మం: పుణ్యస్నానాల్లో పాల్గొనేందుకు భద్రాచలానికి భారీగా తరలివచ్చారు. 6.20 గంటలకు చిన జీయర్ స్వామి అధికారికంగా పుష్కరాలను ప్రారంభించారు. ఇక్కడ 8 ఘాట్ల నిర్మాణం చేశారు. ఏపీ, ఛత్తీస్ గడ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పిండ ప్రధానాలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే భారీగా వస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు కొంత విఫలమౌతున్నారు. పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులను ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండే సారపాక వద్దన భక్తులు వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీనితో వాహనాల పార్కింగ్ సమస్య ప్రధానంగా మారింది. అక్కడి నుండి భక్తులను ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో పుష్కర ఘాట్ల వద్దకు తరలిస్తున్నారు.

 

పుష్కరాల్లో తొక్కిసలాట ఇద్దరు మృతి..

రాజమండ్రి : పుష్కరాల్లో తొలి రోజు అపశృతి చోటు చేసుకుంది. కోటగుమ్మం వద్ద భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. 

09:21 - July 14, 2015

రాజమండ్రి : పుష్కరాల్లో తొలి రోజు అపశృతి చోటు చేసుకుంది. కోటగుమ్మం వద్ద భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడ జరుగుతున్న పుష్కరాల్లో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకే ఘాట్ కు చేరుకున్నారు. దీనితో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసు యంత్రాంగం చేతులెత్తేశారు. భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. పది లక్షల జనాలు వస్తారని అంచనా వేసినా కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

యానాంలో పుష్కరాలను ప్రారంభించిన పుదుచ్చేరి సీఎం..

యానాం : కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి సీఎం రంగాస్వామి గౌతమి గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. 

ఎం.ఎస్ మృతి పట్ల బాబు సంతాపం..

రాజమండ్రి : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతపం తెలిపారు. దేశం గర్వించదగిన కళాకారుడని కొనియాడారు. 

09:07 - July 14, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.25 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..ధర్మపురిలో సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం చేశారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ ల వద్ద పోలీసు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రత్యేక రైళ్లు, బస్సు సౌకర్యాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఏపీలో 260 పుష్కర ఘాట్లు, 10 నగరాలు..తెలంగాణలో 106 పుష్కర ఘాట్లు, 17 పెద్ద పుష్కర ఘాట్ లు ఉన్నాయి. ఏపీలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుండి 25 వరకు సెలవులు ప్రకటించింది. 

లాలా చెరువు ఎన్ హెచ్ పై భారీ ట్రాఫిక్ జాం..

రాజమండ్రి : లాలా చెరువు ఎన్ హెచ్ పై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పుష్కరాలకు వచ్చిన యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

 

9 రోజుకు విధులకు కాని పారిశుధ్య కార్మికులు..

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 9 రోజుకు పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కాలేదు. ప్రభుత్వం బెదిరింపు ధోరణి సరైంది కాదని కార్మిక సంఘాల జేఏసీ మండిపడ్డాయి. ఇదిలా ఉంటే పలువురు కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల నుండి తొలగిస్తామంటూ కార్మికులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. 

గోష్పాద క్షేత్రంలో పుష్కరాలను ప్రారంభించిన విజయేంద్ర..

రాజమండ్రి : గోష్పాద క్షేత్రంలో పుష్కరాలను కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. గోష్పాద క్షేత్రానికి యాత్రికులు తరలివచ్చారు.

 

బీజేపీ సీనియర్ నేత రాజా నివాసంపై పెట్రోల్ బాంబులు..

తమిళనాడు : బీజేపీ సీనియర్ నేత హెచ్. రాజా నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. వివరాలు తెలియాల్సి ఉంది. 

08:34 - July 14, 2015

ఉభయ రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు ప్రభుత్వాలు భారీగా ఖర్చు పెట్టాయి. ఈపుష్కరాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హాన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..''12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలపై అశుభం మాట్లాడడం సరికాదు. రెండు రాష్ట్రాలు భారీగా ఖర్చు పెట్టాయి. సరిగ్గా పని చేయడం లేదని సీఎం బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర పనుల్లో నాణ్యత, ప్లానింగ్ లోపాలు బయటపడుతున్నాయి. దైవ కార్యక్రమాల్లో నిజాయితీగా చేయాలనే నిబద్ధత కాంట్రాక్టర్లకు ఉండడం లేదు. పౌరపాలన వ్యవస్థలో ఉన్న లోపం తెలియచేస్తుంది. ప్రాజెక్టు మేనేజ్ మెంట్ లో పెద్ద లోపం ఉంది.
భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి. భక్తులు దోపిడికి గురవకుండా..ఆరోగ్యం, రవాణా ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ అర్చక కొరత ఉంది. నది - మనిషి ప్రాధాన్యతను ఒక నాగరికతను సంబంధాన్ని తెలియచేయడానికే ఈ ఉత్సవాలు వచ్చాయి. ఆహార సేకరణ నుండి ఉత్పత్తి దశకు చేరుకొనే వరకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ నీరు అందుబాటులో ఉంటే వ్యవసాయం ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం అద్భుతమైన నాగరికత వెదజెల్లింది. నదులు కాలుష్యం కాకుండా చూడాలి. గోదావరి నీటి వనరులను సమృద్ధిగా వినియోగించుకోవాలి. గోదావరి పరివాహక వ్యవస్థను కాపాడుకోవడంపై ప్రజలు ఆలోచించాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు.

బుధేరా చౌరాస్తా లారీ - వ్యాన్ ఢీ..

మెదక్ : మునుపల్లి (మం) బుధేరా చౌరస్తా వద్ద లారీ - వ్యాన్ ఢీకొన్నాయి. రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీనితో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. 

 

08:01 - July 14, 2015

పారిశుధ్య కార్మికులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఉద్యమ నేత ఉద్యమకారుల పట్ల వ్యవహరించే తీరు మారింది. సమ్మె విరమించకపోతే ఆర్మీని దించుతామని అల్టిమేటం జారీ చేసింది. పొట్ట చేత పట్టుకుని రోడ్డెక్కిన పారిశుధ్య కార్కిములపై పోలీసు, మిలటరీని ప్రయోగించబోతోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే నూతన అధ్యాయానికి తెరలేపినట్లవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఇరు రాష్ట్రాల నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ కుమార్ (విశ్లేషకులు), రాంగోపాల్ రెడ్డి (టిడిపి), వేణుగోపాల్ రెడ్డి (బీజేపీ), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:42 - July 14, 2015

చెన్నె : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. చెన్నెలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1928 జూన్ 24న విశ్వనాథన్ జన్మించారు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలకు స్వరాలందించారు. మూడు భాషల్లో 1200 సినిమాలకు సంగీతం అందించారు. సోలోగా 700 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తమిళంలో 510, మలయాళం 76, కన్నడంలో 3, తెలుగులో 70 సినిమాలకు ఎంఎస్ స్వరసారధ్యం వహించారు.
దేవదాసు, లైలా మజ్నూ సినిమాలకు సీఆర్ సుబ్బరామన్ తో కలిసి పనిచేశారు. వివిధ చిత్రాలకు రామూర్తి, విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించారు. దేవదాసు సినిమాలో 'జగమే మాయ..బ్రతుకే మాయ' పాటను ఎంఎస్ స్వరపరిచారు. చండీరాణి, గుప్పుడు మనస్సు, మరో చరిత్ర, లేత మనసులు, సత్తెకాలపు సత్తయ్య, సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, సింహబలుడు, చిలకమ్మ చెప్పింది, అంతులేని కథ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు.

నర్సాపూర్ లో పుష్కరాలను ప్రారంభించిన సిద్ధేశ్వరానంద..

పశ్చిమగోదావరి : నర్సాపూర్ లో పుష్కరాలను సిద్ధేశ్వరానంద భారతి పుష్కరాలను ప్రారంభించారు. 

అంతర్ వీధిలో పుష్కరస్నానం చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి..

రాజమండ్రి : ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అంతర్ వీధిలో పుష్కర స్నానం ఆచరించారు. 

జనసంద్రమైన రాజమండ్రి..

రాజమండ్రి : జిల్లా జనసంద్రమైంది. యాత్రికులతో రైల్వే కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్లు, హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. పది లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు.

 

కోటిలింగాల పుష్కర ఘాట్ కు భారీగా భక్తులు..

రాజమండ్రి : కోటిలింగాల పుష్కర ఘాట్ కు భక్తులు పోటెత్తారు. పుష్కరాల తొలిరోజు గోదావరి ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూత..

చెన్నె : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. చెన్నెలోని మలార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1928 జూన్ 24న విశ్వనాథన్ జన్మించారు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలకు స్వరాలందించారు. దేవదాసు, లైలా మజ్నూ సినిమాలకు సీఆర్ సుబ్బరామన్ తో కలిసి పనిచేశారు. దేవదాసు సినిమాలో 'జగమే మాయ..బ్రతుకే మాయ' పాటను ఎంఎస్ స్వరపరిచారు. చండీరాణి, గుప్పుడు మనస్సు, మరో చరిత్ర, సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, సింహబలుడు, అంతులేని కథ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. 

పుష్కరాలను ప్రారంభించిన ఎంపీ కవిత..

నిజామాబాద్ : బాల్కొండ (మం) పోచంపాడులో పుష్కరాలను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం, పలువురు శాసనసభ్యులు, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. 

06:51 - July 14, 2015

హైదరాబాద్ : ఉభయ గోదావరి జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక శోభతో పుష్కరఘాట్లు కళకళలాడుతున్నాయి. కాసేపట్లో అఖండ గోదావరి పుష్కరాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనేందుకు... రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. గోదావరి తీరాల్లో పుష్కరాల సంరంభం మొదలైంది. సకల పుణ్య ప్రదాతగా గోదారమ్మ రూపుదిద్దుకుంది. అశేషజనవాహిని తల్లి గోదారమ్మలో పుణ్యస్నానం చేసేందుకు పరుగులు తీస్తున్నారు. అన్నిదారులు గోదారి వైపు మళ్లాయి. భక్తకోటి ముక్తి కోసం గోదావరిపై వడివడిగా అడుగులు వేస్తోంది.
6.26 గంటలకు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు గురుడు సింహరాశిలోకి రావడంతో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఏడాది పాటు సాగే ఈ పర్వణిలో ఆది పుష్కరంగా భావించే తొలి 12 రోజులు, అంత్య పుష్కరంగా పిలిచే తుది 12 రోజులను విశిష్టంగా పరిగణిస్తారు. ముక్కోటి దేవతలతో పాటు పితృదేవతలంతా కూడా స్నానమాచరించే ఈ వేళలో పుష్కరస్నానం చేయాలనేది భక్తుల తపన. అందుకే గోదావరి ఒడ్డునున్న ప్రాంతాలు, గ్రామాలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలన్నీ పుష్కరశోభతో కళకళలాడుతున్నాయి. కొత్త ఘాట్లతో భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో పుష్కర స్నానం చేస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో 165 ఘాట్లు..
మరోవైపు ఉభయగోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 165 పుష్కర ఘాట్లను నిర్మించారు. రాజమండ్రిలో 17, కొవ్వూరులో 10, నరసాపురంలో 9 ప్రధాన స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు కోటి లింగాల రేవు, పుష్కరాల రేవు, మార్కండేయ ఘాట్‌, గౌతమి ఘాట్‌, ధవళేశ్వరంలోని రామపాదాల రేవు, కోటిపల్లి వంటివి ప్రధాన స్నానఘట్టాలగా చెబుతున్నారు. ఇక వీఐపీల కోసం ప్రత్యేకంగా సరస్వతి ఘాట్‌ను కేటాయించారు.
ఏపీ మొత్తం 260 ఘాట్లు..
పశ్చిమ గోదావరి జిల్లాలో 97 పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటిల్లో కొవ్వూరులోని గోష్పదక్షేత్రం, శ్రీకృష్ణ చైతన్య ఘాట్‌, సీతారామ స్నాన ఘట్టం, సుబ్రహ్మణ్యేశ్వర ఘాట్‌, భక్తాంజనేయ ఘాట్‌, వీరినమ్మ ఘాట్‌, వలంధర రేవు, లలితాంబ ఘాట్‌, అమరేశ్వఘాట్‌, కొండలమ్మ ఘాట్‌లు ప్రధానమైనవి. ఈ పుష్కరాలకు దాదాపు 4 కోట్ల మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 260 ఘాట్‌లు సిద్ధంగా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

06:44 - July 14, 2015

హైదరాబాద్ : అశేష జనవాహినికి పెన్నిధి... అనంతానంద జలనిధి. ఇంటింటి సౌభాగ్యాల దీప్తి...ధాన్యసిరులు కురిపించే నదీమతల్లి దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. కలం వీరుల గౌతమీ రూపం... కమనీయ కావ్యాలకు స్ఫూర్తిమంత్రం... గోదారమ్మ తీరం పుష్కర సంబరాలకు ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల్లో వేదంలా ప్రవహించే గోదావరికి పుష్కరశోభ వచ్చింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పండగను 12 రోజుల పాటు నిర్వహించేందుకు ఇరురాష్ట్రాలు సిద్ధమయ్యాయి. పవిత్ర గోదావరి తీరాలు పుష్కర శోభతో వన్నె తీనుతున్నాయి. వేదఘోషతో ప్రారంభమయ్యే వేడుకల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. తొలి స్నానం చేసేందుకు ధర్మపురిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. తెలుగురాష్ట్రాల్లోని అన్నిదారులు గోదావరి తీరాలవైపే మూసుకున్నాయి. పుష్కర మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఇరురాష్ట్రాలు సిద్ధమయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి.
తెలంగాణ ముస్తాబు..
తొలి గోదావరి పుష్కరాలకు తెలంగాణ ముస్తాబైంది. రాష్ట్రవ్యాప్తంగా మహా పుష్కర సంబరం మొదలైంది. గోదారి తీరాలు పుష్కర శోభను సంతరించుకున్నాయి. పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్నారు. మహా పుష్కరాల మహోత్సవానికి గోదావరి తీరాలు అందంగా ముస్తాబయ్యాయి. అశేషజనవాహిని గోదారమ్మలో పుణ్యస్నానం చేసి పులకించేందుకు పరుగులు తీస్తున్నారు.
ఉదయం 06:21కు కేసీఆర్ పుష్కర స్నానం..
పుష్కరాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్...కరీంనగర్ జిల్లా ధర్మపురికి చేరుకున్నారు. గోదావరి నదీ తీరాన్ని, నీటిమట్టం, ఘాట్లు, ఇతర ఏర్పాట్లను సీఎం హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం హరిత హోటల్‌కు వెళ్లి రాత్రంతా అక్కడే బస చేశారు. ఉదయం 6 గంటల 21 నిమిషాలకు కేసీఆర్... ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరస్నానం చేయనున్నారు.
హరిత ప్లాజాలో కేసీఆర్ సమీక్ష..
పుష్కర ఏర్పాట్లపై ధర్మపురి హరిత ప్లాజాలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుపుకోవడం శుభపరిణామమని ఆయన అన్నారు. పుష్కరాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా, బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా నీళ్లు నిరంతరం అందించాలని వారికి సూచించారు.
మొత్తం 106 పుష్కర ఘాట్ల ఏర్పాటు..
గోదావరి ప్రవహించే నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పుష్కరాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 106 పుష్కర ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే గోదావరి తీరంలోని ప్రధాన ఆలయాల దగ్గర భక్తుల సందడి మొదలైంది. ముఖ్యంగా బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం దేవాయలాలకు భక్తుల తాకిడి పెరుగుతోంది.
ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు..
ఇక భక్తుల రాక కోసం ఆర్టీసీ 2300 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అలాగే 84 రైళ్లు, రెండు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. భద్రత కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 18 వేల మంది పోలీసు బలగాలను రప్పిస్తోంది. వీటితో పాటు పుణ్య క్షేత్రాల్లో ఆధ్యాత్మిక, భక్తి కార్యాక్రమాలను ఏర్పాటు చేశారు. 

పుష్కర స్నానం ఆచరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాజమండ్రిలో..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ధర్మపురిలో పుష్కర స్నానం ఆచరించారు. 

కరీంనగర్ లో ప్రారంభమైన శోభాయాత్ర..పాల్గొన్న మంత్రి తలసాని..

కరీంనగర్ : కాళేశ్వరం తూర్పు రాజగోపురం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. 

పుష్కర ఘాట్ కు చేరుకున్న చంద్రబాబు దంపతులు...

రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కర ఘాట్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు జయేంద్ర సరస్వతి కూడా ఉన్నారు. 

అమీన్ పూర్ లో ఆక్రమణల కూల్చివేత..

మెదక్ : పటన్ చెరు (మం) అమీన్ పూర్ శివారులో రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. సర్వేనెంబర్ 947లోని వెంచర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు.

 

ఖమ్మంలో రెండు లారీల ఢీ..ఇద్దరు మృతి..

ఖమ్మం : తిరుమలాయపాలెం (మం) పిండిప్రోలు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులంతా గుంటూరు జిల్లా వాసులకు చెందిన వారు. 

ఉభయ రాష్ట్రాల్లో నేటి నుండి పుష్కరాలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.25 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..ధర్మపురిలో సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించనున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ ల వద్ద పోలీసు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

నేడు సండ్ర బెయిల్ పెటిషన్ పై తీర్పు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయి జైలులో ఉన్న టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన బెయిల్ పిటిషన్ పై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. 

నేడు గుంటూరులో నారా లోకేష్ పర్యటన...

గుంటూరు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పర్యటించనున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని సందర్శించినంతరం సీఎం బాబు కోసం ఏర్పాటు చేస్తున్న అధికారిక గెస్ట్ హౌజ్ ను లోకేష్ పరిశీలించనున్నారు. 

నేడు ఆర్బీఐ అధికారులతో టీఎస్ ఆర్థిక శాఖ భేటీ..

హైదరాబాద్ : నేడు ఆర్ బీఐ అధికారులతో టీఎస్ ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్బీఐ వద్ద బాండ్ లను తనఖా పెట్టి రూ.1500 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోనుంది.

సోంపేట కాల్పుల ఘటనకు ఐదేళ్లు...

శ్రీకాకుళం : నేటితో సోంపేట కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కవిటి, కంచిలి, సోంపేట మండలాల బంద్ కు పర్యావరణ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. బీల ప్రాంతంలో అమరుల స్థూపం వద్ద ప్రజా సంఘాలు నివాళులు అర్పించనున్నాయి. 

నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

తిరుమల : నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. దీనితో టిటిడి అధికారులు పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం 11గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. 17న శ్రీవారి ఆలయంలో అనివార ఆస్థానం నిర్వహించనున్నారు. 

మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా ఏపీలో ఎపిఎస్ డబ్ల్యూఎఫ్ నిరసన..

పశ్చిమగోదావరి : మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఏపీలో ఎపిఎస్ డబ్ల్యూఎఫ్ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. 

విజయవాడలో నేడు వైసీపీ ఇఫ్తార్ విందు...

విజయవాడ : నేడు జిల్లాలో వైసీపీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ హాజరు కానున్నారు. రేపు కొవూరు, రాజమండ్రి పుష్కరాల్లో జగన్ పాల్గొనున్నారు. 

Don't Miss