Activities calendar

16 July 2015

బంద్ యథాతథం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి పేరుతో మున్సిపల్ కార్మికుల జీతాలపై వచ్చిన ప్రకటనను వామపక్షాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు సమ్మె చేయగా కేవలం జీహెచ్ఎంసీ కార్మికులకు మాత్రమే జీతాలు పెంచుతున్నట్లు చెప్పడాన్ని నేతలు తప్పుబట్టారు. మున్సిపల్ కార్మికుల పూర్తి డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వామపక్షాల బంద్ యథాతథంగా కొనసాగుతుందన్నారు. డ్యూటీలో చేరిన వారికి మాత్రమే జీతాలు పెంచుతామనడం 'డివైడ్ అండ్ రూల్' పాలసీని తలపిస్తోందన్నారు.

కార్మిక సంఘాల నేతల అత్యవసర భేటీ..

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గందరగోళ ప్రకటన వెలువరించిన నేపథ్యంలో కార్మిక సంఘాలు, వామపక్షాల నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఎంబీ భవన్ లో అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం తమ అభిప్రాయాన్ని వెళ్లడిస్తామని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. 

కేసీఆర్ అహంభావ ప్రకటన..

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల సమ్మెపట్ల సీఎం కేసీఆర్ అహంభావ పూరితమైన ప్రకటన వెలువరించాడని సీపీఎం నేత బి వెంకట్ తెలిపారు. జీతాలు పెంచుతున్నామని చెబుతూ.. కేవలం జీహెచ్ఎంసీ పరిదిలో ఉన్న కార్మికులకు మాత్రమేనని మెలిక పెట్టడాన్ని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేవలం విదుల్లో ఉన్న వారికి మాత్రమే జీతాలు పెంచుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వ వైఖరిని వెంకట్ తప్పుబట్టారు. 3000 మంది విధుల్లో ఉన్నారని మిగతా 20,000 మంది సమ్మెలో ఉన్నారని వీరి పట్ల కేసీఆర్ ఇదే దోరణి ప్రదర్శిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

22:14 - July 16, 2015

తమకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఆరోగ్యభద్రత కల్పించాలని డిమాండ్లతోపాటు మరో 12 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గత 11 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె ఉదృత రూపం దాల్చింది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు రేపు బంద్ కు పిలుపిచ్చాయి. వీరికి బంద్ కు టీఆర్ ఎస్ మినహా మిగిలిన పార్టీలు, మావోయిస్టులు మద్దతు తెలిపాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెపై టెన్ టివి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఆ..వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:01 - July 16, 2015

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో ముగ్గురు విద్యార్థులు చరణ్, శ్రీనివాసరావు, అనీషాలను పోలీసులు అరెస్టు చేశారు. సీనియరు విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడంతో మనస్థాపంతో రిషికేశ్వరి తను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

21:55 - July 16, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై టీసర్కార్ గందరగోళ ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుండగా.. ప్రభుత్వం కేవలం జీహెచ్ ఎంసీ కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచింది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను ప్రభుత్వం పెంచింది. పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47.05 శాతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవర్ల వేతనం రూ. 10,200 నుంచి రూ. 15 వేలకు, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8500 నుంచి రూ. 12, 500 వేలకు పెంచారు. పెంచిన వేతనాలను కార్మికులకు ఈ నెల నుంచే అందించాలని సీఎం అధికారులను ఆదేశించింది. కాగా సమ్మెలో ఉన్న కార్మికులను తొలగిస్తామని.. విధుల్లో ఉన్న కార్మికులకు మాత్రమే జీతాలు పెంచుతున్నట్లు ఈ ప్రకటన సారాంశంగా తెలుస్తోంది. అయితే ప్రకటన చేతి రాతతో ఉండటంతో పూర్తి సమాచారం తెలుసుకుని స్పందిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కాగా స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని వామపక్ష నేతలు వెల్లడించారు. సమ్మెను భగ్నం చేసేందుకే సీఎం కేసీఆర్ గందరగోళ ప్రకటన ఇచ్చారని వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. జీతాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్, ఆరోగ్యభద్రతతో పాటు మరో 12 డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కార్మికుల చేపట్టిన రోజురోజుకు ఉదృత రూపం దాల్చింది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించాయి. పది వామపక్ష పార్టీలు కార్మికులకు మద్దతుగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు టీకాంగ్రెస్, టి.వైసిపి, మావోయిస్టులు మద్దుతు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీసర్కార్ జీహెచ్ ఎంసీ కార్మికులు, డ్రైవర్లకు జీతాలు పెంచుతూ గందరగోళపూరితమైన నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 

కార్గిల్-శ్రీనగర్ రహదారిపై పిడుగుపాటు..బాలిక మృతి

జమ్మూకాశ్మీర్: కార్గిల్-శ్రీనగర్ రహదారిపై పిడుగుపాటుకు బాలిక మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

 

కార్మికుల జీతాలపై కేసీఆర్ గందరగోళ ప్రకటన

హైదరాబాద్ : మున్సిపల్  కార్మికుల జీతాలపై కేసీఆర్ గందరగోళ ప్రకటన చేశారు. మూడు ప్రధాన డిమాండ్స్ తో గత పది  రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు తీవ్ర ఉద్యమం చేస్తుండగా.. జీహెచ్ఎంసీ పరిదిలో ఉన్న మున్సిపల్ వర్కర్ల జీతాలు పెంచుతున్నట్లు కేసీఆర్ గవర్నమెంట్ ప్రకటించింది. కార్మికుల జీతాలను 47.05 శాతం పెంచుతున్నట్లు సీఎం ఆఫీసు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కాగా సమ్మెలో ఉన్న  కార్మికులను తొలగిస్తామని..

రిషికేశ్వరి ఆత్మహత్య.. ముగ్గురు విద్యార్థుల అరెస్టు

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో ముగ్గురు విద్యార్థులు చరణ్, శ్రీనివాసరావు, అనీషాలను పోలీసులు అరెస్టు చేశారు. 

20:58 - July 16, 2015

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి రాష్ట్ర బంద్‌కు రంగం సిద్ధమైంది. మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై పంతానికి పోతున్న సర్కార్‌కు ఇప్పటికే సమ్మెతో స్ట్రోకు తగిలింది. అయినా దిగిరాని ప్రభుత్వ మెడలు వంచడానికి బంద్‌ పిలుపునిచ్చాయి వామపక్షాలు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. రుణమాఫీ ప్రకటనపై మొదట్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కేసీఆర్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఇప్పటికే గుబులు పెట్టుకున్న గులాబీ ప్రభుత్వం దిగొస్తుందా.. తెగే దాకా లాగుతోందో రేపటి బంద్‌తో తేలే అవకాశముంది.
హామీలను మరిచిన టీసర్కార్
అధికారంలోకి రాకముందే మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌.. గద్దెనెక్కాక ఆ హామీలను పూర్తిగా మర్చిపోయింది. డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెపై స్పందించడం లేదు. పైగా వారికి మద్దతు తెలుపుతున్న వామపక్ష నాయకులను అన్యాయంగా అరెస్ట్‌ చేయిస్తోంది. తమ హక్కుల కోసం గళమెత్తిన సామాన్యులపై తన ప్రతాపం చూపుతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణలోని అన్ని వామపక్షాలు మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలుపుతూ.. శుక్రవారం రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి.. డిమాండ్లను సాధించుకునే వరకూ ఆందోళనలు, నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశాయి.
బంద్ కు పలు పార్టీలు మద్దతు
కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ, ఇతర ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు వామపక్షాలు ఇచ్చిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేసేందుకు.. బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొననున్నాయి. బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సహకరించాలని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
వామపక్ష నేతల అరెస్ట్...
శాంతియుతంగా దీక్ష చేస్తున్న వామపక్ష నేతలను అరెస్ట్ లు చేసి.. వారిపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ఎంజిబిఎస్ బస్‌ డిపో వద్ద పది వామపక్షాల నేతలు బంద్‌లో పాల్గొని నిరసన తెలపనున్నారు. ఉదయం 11 గంటలకు నారాయణ గూడ చౌరస్తా నుంచి హిమాయత్‌ నగర్‌ మీదుగా అబిడ్స్ వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. పుష్కరాలు, రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రజలకు కొంత అసౌకర్యం కల్గినా.. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అన్ని వర్గాల ప్రజలు సహకరించి.. రాష్ర్ట బంద్‌లో పాల్గొనాలని తమ్మినేని కోరారు.

 

ప్రపంచబ్యాంకుతో ఎపి సర్కార్ ఒప్పందం..

హైదరాబాద్: ప్రపంచబ్యాంకుతో ఎపి సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. విపత్తులు నివారణ, సహాయక చర్యల కోసం.. రూ. 1600 కోట్ల ఆర్థిక సహాయం ఒప్పందంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంతకాలు చేశాయి.

ఎపి ప్రభుత్వం తరపున రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. 

వామపక్షాల బంద్ కు ఆటో సంఘాల జెఎసి మద్దతు

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్ కు ఆటో సంఘాల జెఎసి మద్దతు తెలిపింది.

 

వామపక్షాల రాష్ట్ర బంద్ కు టి.వైసిపి మద్దతు

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్ కు టి.వైసిపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆ పార్టీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

 

20:34 - July 16, 2015

హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్ట్ కంబాలపల్లి శేఖర్‌ పేరిట నవతెలంగాణ దినపత్రిక ప్రకటించిన స్మారక అవార్డును నవతెలంగాణ దినపత్రిలో పనిచేస్తున్న కార్టూన్‌ ఎడిటర్‌ నర్సిం అందుకున్నారు. ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణతోపాటు, ఐదుగురు సభ్యులతో కూడిన జ్యూరీ నర్సింను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కార్టూనిస్టుగా 30 ఏళ్ల అనుభవం కలిగిన నర్సిం వివిధ పత్రికల్లో పనిచేశారు. తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని నర్సిం అన్నారు.

20:27 - July 16, 2015

హైదరాబాద్: తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఫోన్ మూగబోయింది. సచివాలయంలో ఆయన వాడుతున్న ల్యాండ్ లైన్ బిల్లును చెల్లించకపోవడంతో అవుట్ గోయింగ్ ఫెసిలిటీని కట్ చేసారు. కేవలం ఇన్ కమింగ్ కాల్స్ కే ఆయన ఫోన్ పరిమితమయ్యింది. కాబినెట్ ర్యాంక్ కలిగిన ఆయన పరిస్థితి ఒన్లీ ఇన్ కమింగ్...నో అవుట్ గోయింగ్ అన్నట్లు తయారైంది. స్వయంగా తన ఫోన్ కే అవుట్ గోయింగ్ లేకపోవడంతో....అధికారులపై ఫైర్ అయ్యారు నిరంజన్ రెడ్డి. ఆయనను శాంత పరిచేందుకు బిల్లు చెల్లింపు కోసం హుటా హుటిన జీవో ను జారి చేసింది ప్లానింగ్ శాఖ. అయితే అన్ని శాఖలపై ఆజామాయిషి ప్రదర్శించే ప్లానింగ్ శాఖ అధిపతికే ఫోన్ దిక్కు లేకపోవడం పట్ల అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

 

20:20 - July 16, 2015

గుంటూరు: బంగారు భవిష్యత్‌ను కారు చీకటి కమ్మేసింది..! చిట్టితల్లిపై పెట్టుకున్న ఆశలు ఆవిరై పోయాయి..! రేపటి కలలు నేడే కల్లలుకాగా.. అమ్మానాన్నల ఆశాదీపం అర్ధాంతరంగా ఆరిపోయింది. సీనియర్‌ పేరుతో సాగించిన పైశాచికం.. ఆ విద్యార్థినిని ఉరికొయ్యకు వేళాడదీసింది..! గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల పాశవిక చర్యలు తాళలేక ప్రాణాలు తీసుకున్న రిశికేశ్వరి ఉదంతం, ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కళ్లలో కన్నీళ్లతో పాటు గుండెల్లో ఆవేశం కూడా తన్నుకొస్తోంది.
ఎఎన్ యూలో పెచ్చరిల్లిన ర్యాగింగ్‌ 
దారి చూపాల్సిన వారు.. దారుణానికి ఒడిగట్టారు..! చేయూతనందించాల్సిన వారు.. పరోక్షంగా ప్రాణాలు తీశారు..! గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పెచ్చరిల్లిన ర్యాగింగ్‌ విద్యార్థిని ప్రాణాలు తీసింది. విద్యార్థిని రిశికేశ్వరి ఉరేసుకోవడానికి సీనియర్ల వేధింపులే కారణమని తేలింది. యూనివర్సిటీలో ఏర్పాటైన నిజనిర్థారణ కమిటీ వాస్తవాలను తేటతెల్లం చేసింది. ఈ ఘటనలో విద్యార్థినిని వేధించారన్న కారణంతో.. చరణ్‌, శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు వీసీ సాంబశివరావు ప్రకటించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మిగతా బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ర్యాగింగ్‌ వ్యవహారంలో పలు విషయాలు వెలుగు చూశాయి. సీనియర్ల పేరిట రిశికేశ్వరిపై సహర విద్యార్థులు సాగించిన దాష్టీకాన్ని సూసైడ్‌ నోట్‌ వెల్లడించింది. చదువులో సందేహాలు తీర్చాల్సిన సీనియర్లు.. చెడు సావాసం చేయమంటూ రిశికేశ్వరిని ఒత్తిడి తెచ్చిన వైనం విస్మయపరుస్తోంది. సీనియర్లైన చరణ్‌, శ్రీనివాస్‌తో సన్నిహితంగా మెలగాలని, రిశికేశ్వరిని ఓ సహచర విద్యార్థిని బలవంతం చేసినట్టు సమాచారం. దీన్ని వ్యతిరేకించడం వల్లే రిశికేశ్వరిపై సీనియర్లు కక్షగట్టారని తెలుస్తోంది.
సీనియర్లు చిత్రహింసలు
తాము చెప్పింది వినలేదనే కారణంతో.. మాటలు, చేతలతో రిశికేశ్వరిని సీనియర్లు చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజుకూడా చరణ్‌, శ్రీనివాస్‌తో సినిమాకు రావాలని సదరు సీనియర్‌ విద్యార్థిని ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. సినిమాకు వెళ్లిన తర్వాత సీనియర్ల అసభ్యప్రవర్తన భరించలేక మధ్యలోనే తిరిగివచ్చిన రిశికేశ్వరి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక, లోపల దాచుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. తన ఆవేదనను సూసైడ్‌ నోట్‌ రూపంలో వెల్లడించిన రిశికేశ్వరి బలవతంగా ప్రాణాలు తీసుకుంది.
జీవితాలనే హరిస్తోన్న ర్యాగింగ్‌..
హాస్యానికి పరిమితమవ్వాల్సిన ర్యాగింగ్‌.. జీవితాలనే హరిస్తోంది..! ఆటపట్టించడంతో ఆగిపోవాల్సిన ర్యాగింగ్‌.. బతుకులను బలిగోరుతోంది..! వింత పోకడలు, వికృత చేష్టలు కలగలిసిన ర్యాగింగ్ ఇప్పుడు దేశవ్యాప్తమైంది..! ఎక్కడో మొలకెత్తిన ఈ విషపు మొక్క.. ఇప్పుడు అన్ని వర్సిటీలకూ వ్యాపించింది. చెట్టు స్థాయిని అందుకుని, వృక్షం స్థాయిని దాటుకుని, కోరల మాదిరి ఊడలు చాచిన ఈ వటవృక్షం.. విద్యార్థులను అమాంతం మింగేస్తోంది..! యావత్‌ విద్యావ్యవస్థనే సవాల్‌ చేస్తోంది. ఇది రిశికేశ్వరి తల్లి వేదన మాత్రమే కాదు...! ఇది కూడా రిశికేశ్వరి తండ్రికి మాత్రమే ఎదురైన అనుభవం కాదు..! చిన్నపాటి కామెంట్లతో ముగిసిపోవాల్సిన ర్యాగింగ్‌.. అంతులేని విషాదాన్ని నింపుతోంది. శృతి మించుతున్న ర్యాగింగ్‌ ధాటికి సగటు విద్యార్థి భయపడిపోతుంటే.. ఏకంగా కుటుంబాలే బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న ర్యాగింగ్‌.. తాజాగా మరో విషాదాన్ని మిగిల్చింది. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో హద్దూ అదుపులేని ర్యాగింగ్‌ కు రిశికేశ్వరి అనే విద్యార్థిని బలైన ఉందంతంతో.. మరోసారి ర్యాగింగ్‌ చర్చనీయాంశమైంది.
శారీరకంగా, మానసికంగా వేధింపులు
సీనియర్‌ విద్యార్థులైన ఇద్దరు అబ్బాయిలతో సన్నిహితంగా మెలగాలంటూ రిశికేశ్వరిని ఓ విద్యార్థిని బలవంత పెట్టగా.. దాన్ని రిశికేశ్వరి అంగీకరించలేదు. ఇక్కడే సీనియర్ల అహం దెబ్బతింది. తమ మాట వినలేదనే అక్కసుతో రిశికేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ప్రతి విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పుకునే రిశికేశ్వరి.. నాలుగు గోడల మధ్యన జరిగే దురాగతాలను వారికి చెప్పుకోలేకపోయానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొందంటే.. ఎంతటి మానసిక క్షోభను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. బయటకు చెప్పుకోలేక, ఈ నరకయాతన భరించలేక చివరకు ప్రాణాలు తీసుకోవడమే మేలైన మార్గంగా భావించి ఉసురు తీసుకుంది.
ఆశలు ఆవిరయ్యాయి..
ఆశలు ఆవిరయ్యాయి.. భవిష్యత్‌ అంధకారమైంది.. రిశికేశ్వరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ర్యాగింగ్‌ బారిన పడి ప్రాణాలు తీసుకున్న ఇలాంటి రిశికేశ్వరులు ఎందరో ఉన్నారు. వారి తల్లిదండ్రుల బాధను తీర్చేదెవరు..? వారి కడుపు కోతను ఎవరు తీరుస్తారు..? బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను ర్యాగింగ్‌ పెను భూతంలా వెంటాడుతోంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న బిడ్డలను.. ర్యాగింగ్‌ రూపంలోని గద్దలు ఎగరేసుకుపోతుండడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు అమ్మానాన్నలు.
తల్లిదండ్రులు హడిలిపోయే పరిస్థితులు
పరిస్థితి ఇంతలా చేయి దాటుతున్నా.. విశ్వ విద్యాలయాలనే ర్యాగింగ్‌ పట్టిపీడిస్తున్నా.. అడ్డుకోవడానికి అటు ప్రభుత్వం కానీ, ఇటు కళాశాల యాజమాన్యాలు కానీ ప్రయత్నం చేయకపోవడం అత్యంత అమానుషం. అసలు, యూనివర్సిటీల్లో వార్డెన్లు మొదలు.. వీసీల వరకూ తెలిసే ర్యాగింగ్‌ జరుగుతోందన్న వాదనలు విస్మయపరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను చదువులకు పంపాలంటేనే తల్లిదండ్రులు హడిలిపోయే పరిస్థితులు దాపురించాయి.
ప్రభుత్వం-యాజమాన్యాలు స్పందించాలి..
విద్యా సంవత్సరం ప్రారంభంలో... అది కూడా తొలి రోజుల్లో కొత్తగా వచ్చే విద్యార్థులను ఆటపట్టించడం సీనియర్లకు అదో సరదా. కానీ.. ఆ సరదా హద్దులు దాటుతోంది. వికృత రూపం తీసుకుంటోంది. సీనియర్ల పైశాచిక చర్యలను తట్టుకోలేక, అవమానాలను భరించలేక జూనియర్‌ విద్యార్థులు ఏకంగా ప్రాణాలనే తీసుకుంటున్నారంటే.. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇకనైనా అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యాలు స్పందించకపోతే.. మరెన్నో విద్యా కుసుమాలు మొగ్గలో రాలిపోతూనే ఉంటాయి.

 

 

రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద నిత్యహారతి

రాజమండ్రి: పుష్కరఘాట్ వద్ద నిత్యహారతి ప్రారంభమయింది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. 

వేం కృష్ణకీర్తన్-ఉదయ్ సింహలను విచారించిన ఎసిబి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో వేం కృష్ణకీర్తన్, ఉదయ్ సింహలను ఎసిబి అధికారులు 7 గంటలపాటు విచారించింది. 

నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సమావేశం కొనసాగుతోంది. 

విశాఖలో మున్సిపల్ కార్మికులపై పోలీసుల దాడి..

విశాఖ: పారిశుద్ధ్య పనులను అడ్డుకుంటున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు దాడి చేశారు. ఓ కార్మికుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల దాడికి నిరసనగా త్రీటౌన్ పీఎస్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు.

 

ఎపి ఎక్స్ ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్పు..

హైదరాబాద్: ప్రభుత్వం... హైదరాబాద్-ఢిల్లీ మధ్య నడిచే ఎపి ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్పు చేసింది. ఎపి ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్పు చేశారు. కొత్తపేరు.. నవంబర్ 15 నుంచి అమలులోకి రానుంది. 

18:45 - July 16, 2015

హైదరాబాద్: మున్సిపల్ సమ్మెలో పాల్గొన్న కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను వామపక్షపార్టీల నేతలు కలిశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రేపు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

18:36 - July 16, 2015

కంటిచూపు మందగించడం.. తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, చికిత్స.. వంటి పలు అంశాలను ఈవాళ్టి మానవి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూడండి.. 

18:32 - July 16, 2015

ప్రస్తుతం మహిళలు ఇంటి పనివారుగా మిగిలిపోతున్నారు. మహిళలు సౌకర్యాల లేమితో తక్కువ వేతనాలకు పనులు నిర్వహిస్తున్నారు. పురుషులు.. దినసరి కూలీలుగా.. స్త్రీలు ఇంటి పనివారుగా మారుతున్నారు. ఇదే అంశంపై మానవి.. ఫోకస్ పేరుతో మహిళ దీనస్థితిపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణ టెన్త్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ టెన్త్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ స్థానంలో వరంగల్, చివరి స్థానంలో హైదరాబాద్ లు ఉన్నాయి. 

 

17:56 - July 16, 2015

హైదరాబాద్: 'మైనార్టీలకోసం ఇది చేస్తున్నాం.. అది చేస్తున్నాం... ఎప్పుడూ నేతలు చెప్పేమాటే ఇది'.. ప్రభుత్వాలు వస్తున్నాయ్... పోతున్నాయ్.. కానీ వారి జీవితాలుమాత్రం మారడంలేదు.. జనాభాలో 14 శాతంగా ఉన్న మైనార్టీల్లో 80 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి.. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన రాజేందర్ సచార్ కమిటి, రంగనాధ్ మిశ్రా కమీషన్‌లు కూడా ముస్లీంల కష్టాలపై రిపోర్టులిచ్చాయి... దళితులు గిరిజనుల కంటే ఎక్కువ వెనుకబాటులో మైనార్టీలున్నారని... గణాంకాలతోసహా వివరించింది సచార్ కమిటి... రంగనాధ్ మిశ్రా కమీషన్ కూడా సొంత వ్యవసాయ భూమి, సొంత పరిశ్రమలు లేని వారు ఎక్కువగా ఉన్నారని స్పష్టంచేసింది.. దాదాపు 92 శాతం మంది దినసరి కూలీలు, చేతి వృత్తులు, అసంఘటిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపింది. పట్టణాల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారిలో ఎక్కుశాతం ముస్లీంలే ఉన్నారని అంకెలతో సహ నిర్ధారించింది. వీరి నివేదికలను ఆమోదించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... ఆ తర్వాత ఆ విషయమే మరచిపోయాయి.
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్..పేపర్లకే పరిమితం
అటు తెలంగాణ ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మైనార్టీలకు ఎన్నో వాగ్దానాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమలుదిశగా ఒక్కఅడుగుకూడా వేయలేదు... ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలిచ్చి అన్యాక్రాంతమైన వక్ఫ్ అస్తులను రక్షిస్తామన్నారు. ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.... తెలంగాణలో 77వేల 538 ఎకరాల వక్ఫ్ భూములుంటే ... వీటిలో 57వేల 424 ఎకరాల భూమిని ఆక్రమణకు గురైంది.. మిగిలిన 20వేల 114 ఎకరాలకూ రక్షణ కరువైంది. ఇక 12 శాతం రిజర్వేషన్లుకూడా ప్రకటనకే పరిమితమైంది.. ప్రతి ఏడాది వేలాదిమంది ముస్లింలు జీవనోపాదికోసం విదేశాలకు వలసవెళుతూ అష్టకష్టాలు పడుతున్నారు.
2014-15 రాష్ట్ర బడ్జెట్ లో రూ. లక్షా 637కోట్లు
ఇక బడ్జెట్ విషయానికొస్తే 2014-15 రాష్ట్ర బడ్జెట్ లో లక్షా 637 కోట్లుంటే... అంకెల గారడీతో కేవలం వెయ్యి 30 కోట్లు కేటాయించారు. జనాభా 14 శాతముంటే ఒక్క శాతం మాత్రమే ఇచ్చారు. పైగా అందులో 30 శాతం కూడా ఖర్చు చేయలేదు. 2015-16 బడ్జెట్ లో లక్షా 15వేల 689 కోట్లుంటే మైనారిటీలకు కేటాయించింది11వందల 5 కోట్లు మాత్రమే. అంటే కేవలం 0.95 శాతం నిధులతో సరిపెట్టారు.. ఇందులోఎంత ఖర్చు పెడతారో తెలియదు. అలాగే టీ ప్రభుత్వం.. ఒక్క షాదీముబారక్ తప్ప ముస్లింల కోసం ఏ ఇతర పథకాలనూ ప్రవేశపెట్టలేదు. పేద మైనార్టీలను ఆదుకోవాల్సిన రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థ కేవలం ఫీజ్ రియింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లకు మాత్రమే పరిమిత మైంది. బడ్జెట్ లో ఈ సంస్థకు సర్కారు నామమాత్రపు నిధులిచ్చింది. అధికారులు వీటిని కూడా ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అటు ముస్లింలలో అక్షరాస్యత మరీ తక్కువగా ఉంది. వివిధ సమస్యలతో మైనార్టీలు తమ పిల్లలను బడులకు పంపలేకపోతున్నారు.
కేసీఆర్ కురిపిస్తున్న ప్రేమంతా రాజకీయం: ముస్లీంలు
ముస్లీంలపై ఇఫ్తార్ విందులో కేసీఆర్ కురిపిస్తున్న ప్రేమంతా రాజకీయమే అంటున్నారు ముస్లింలు... గ్రేటర్, కార్పొరేషన్లో పాగా వేసేందుకే ఈ నజరానాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. ముస్లింలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ చట్టం రూపొందించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉన్నా అమలుకునోచుకోలేదు.
ముస్లీం సమస్యలపై పోరాటానికి సీపీఎం సన్నధం
ముస్లీంల సమస్యలపై పోరాటానికి వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ముందుకొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్త ఉద్యమం కోసం సీపీఎం.. జులై 21 నుంచి ఆగస్టు 9 వరకు జిల్లాల వారిగా కార్యక్రమాలు రూపొందిస్తోంది. అన్నిరంగాల్లో వెనకబడి ఉన్న తమ అభివృద్ధికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు.

రేపు వామపక్షాల బంద్ కు మావోయిస్టులు మద్దతు

హైదరాబాద్: మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పది వామపక్షాలు రేపు తలపెట్టిన బంద్ కార్యక్రమానికి మావోయిస్టులు మద్దతు తెలిపాయి. వెంటన్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ఐసీసీ వన్డే ర్యాకింగ్ ల ప్రకటన..

ఢిల్లీ: ఐసీసీ... వన్డే ర్యాకింగ్ లను ప్రకటించింది. 129 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 115 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఏడో ర్యాంకును దక్కించుకుంది.

 

17:29 - July 16, 2015

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలోనే మకాం వేయడంతో... శనివారం నాడు కేబినెట్‌ సమావేశం కూడా గోదావరి తీరంలోనే ఏర్పాటు చేశారు. తొక్కిసలాట ఘటనపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 20న సింగపూర్‌ బృందం రాజమండ్రికి వస్తుండటంతో.. దాని ఏర్పాట్లపైనా చర్చ జరగొచ్చని సమాచారం.

17:27 - July 16, 2015

మహబూబ్‌నగర్: జిల్లాలోని వనపర్తిలో మున్సిపల్ కార్మికులు.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకూ నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు. 

17:18 - July 16, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ధర్నా చేస్తున్న నర్సులను పోలీసులు అరెస్టు చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న తమను పర్మినెంట్ చేయాలంటూ నాలుగురోజులుగా నర్సులు ఆందోళన చేస్తున్నారు. ఈ సమ్మెకు అనుమతిలేదన్న పోలీసులు నిరసన విరమించి విధులకు హాజరుకావాలని కోరారు. ధర్నా కొనసాగిస్తామని నర్సులు తేల్చి చెప్పడంతో వారిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

 

17:13 - July 16, 2015

గుంటూరు: సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేసేందుకు గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు నగర పాలక సంస్థ ఎదుట టెంట్ వేసుకుని సమ్మె చేస్తున్న కార్మికులను రెచ్చేగొట్టే విధంగా ఎమ్మెల్యేలు, అధికారులు.. ఆ ప్రాంతంలో పర్యటనలు చేయడంతో కార్మికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతంలోకి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రావడంతో అక్కడ.. పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లిన కార్మికులను అడ్డుకున్నారు. కొంతమంది కార్మికులపై ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఎమ్మెల్యే, పోలీసుల వైఖరిని నిరసిస్తూ.. నగర పాలక సంస్థ నుండి లాడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

 

కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి:ప్రొ.కోదండరాం

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం కోరారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎపిలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల రిలీవింగ్ పై ఎపి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 

ఎపిలో టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

విశాఖ: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస్ ఫలితాలను విడుదల చేశారు.

 

16:58 - July 16, 2015

గుంటూరు: రాజధాని పేరుతో రైతుల భూములను కాజేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములను మధు పరిశీలించారు. వెంకటాపురం, కోడూరు, వెల్వడం, పుల్లూరుమంగాపురం గ్రామాల్లో మధు పర్యటించారు. 1950 నుంచి నిరుపేదలు సాగు చేసుకుంటున్న వేలాది ఎకరాలను ఇప్పుడు రాజధాని పేరుతో ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని మధు విమర్శించారు. ప్రభుత్వం ఈ ప్రయత్నం విరమించకపోతే.. రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

16:50 - July 16, 2015

నల్గొండ: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. స్కూల్‌ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని టాలెంట్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను చితకబాదారు. చదువు చెప్పాల్సింది పోయి.. పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

 

16:47 - July 16, 2015

విజయవాడ: గోదావరి పుష్కరాలకు రెండు వోల్వో బస్సులను విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణానికి ప్రారంభించారు. విజయవాడ బందరు రోడ్‌లోని కేశినేని నాని కార్యాలయం నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఇటు చిరంజీవి, వైఎస్‌ జగన్‌లపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మండిపడ్డారు. రాజమండ్రి పుష్కర ప్రమాద ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు.

 

 

16:42 - July 16, 2015

రాజమండ్రి: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాలు జరుగుతున్న తీరును ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సర్వేలో మంత్రి నారాయణ, డీజీపీ రాముడు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజమండ్రి ఘటన దురదృష్టకరమన్నారు. రాజమండ్రి ఘటనను ప్రతిపక్షాలు రాజకీయ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

 

16:38 - July 16, 2015

గుంటూరు: జనావాసాల్లో వైన్‌ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా జనం నిరసన గళం వినిపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇళ్ల మధ్య వైన్‌ షాపు ఏర్పాటుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. దీన్ని అడ్డుకున్న స్థానికులు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎం కౌంటర్‌ అని చెప్పి, రాత్రివేళ నిర్మాణాలు పూర్తిచేశారని, ఇప్పుడు వైన్‌షాపు ఓపెన్‌ చేస్తున్నామని చెబుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

 

16:35 - July 16, 2015

మహబూబ్‌నగర్: జిల్లాలో పందులు... 3 నెలల చిన్నారి ప్రాణం తీశాయి. దేవరకద్ర మండలం బల్సుపల్లిలో నివసించే కూర్మమ్మ చెత్తకాగితాలు ఏరుకొని జీవిస్తోంది. ఆమె భర్త ఆరు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వీరికి నలుగురు ఆడ పిల్లలు, ఒక మగ శిశువు ఉన్నారు. కూర్మమ్మ... రోజులాగే నేడూ పనికి వెళ్లింది. పిల్లలు ఆడుకునేందుకువెళ్లడంతో పందులు గుడిసెలోకి చొరబడ్డాయి. శిశువును బయటకులాక్కొచ్చి దాడి చేశాయి. చిన్నారి ఏడుపుతో పిల్లలు ఆ.. పందుల్ని వెళ్లగొట్టారు. అప్పటికే పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.

 

16:29 - July 16, 2015

కరీంనగర్: గోదావరి పుష్కరాలకు ఓ మొసలి కూడా వచ్చింది. అవును నిజమే. నదిలోనే ఉండే మొసలి భక్తుల సందడికే వచ్చిందో.. నీరు పెరగడంతో వచ్చిందో ఘాట్‌లో ప్రత్యక్ష్యమైంది. కరీంనగర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఘాట్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. అమావాస్య రోజు అధికంగా వచ్చిన భక్తులు స్నానాలు చేస్తుండగా మొసలి ఘాట్‌లోకి వచ్చింది. దీన్ని గమనించిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి ఆ మొసలిని పట్టుకున్నారు. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేస్తామని సిబ్బంది చెప్పారు.

 

16:21 - July 16, 2015

గుజరాత్: అహ్మదాబాద్‌లో ముస్లిం సోదరులు భిన్నత్వంలో ఏకత్వం చాటారు. జగన్నాథ్‌ ఆలయానికి వెండి రథాన్ని బహుకరించి తమ ఔనత్యాన్ని చాటుకున్నారు. ఒకే నెలలో రంజాన్‌, జగన్నాథ్‌ రథ్‌ యాత్ర రావడంతో... వెండి రథాన్ని సమర్పించినట్లు ముస్లిం వర్గాలు తెలిపాయి. ఈ పరంపర పదేళ్లుగా కొనసాగుతోందన్నారు. గుజరాత్‌లో హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

నకిలీ పాస్ పుస్తకాల కేసు.. వరలక్ష్మీ ప్రింటింగ్ ప్రెస్ సీజ్

అనంతపురం: నకిలీ పాస్ పుస్తకాల కేసులో తాడిపత్రిలో వరలక్ష్మీ ప్రింటింగ్ ప్రెస్ ను సీజ్ చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. రబ్బర్ స్టాంపులు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

15:39 - July 16, 2015

చెన్నై: తమిళనాడులో ఓ స్కూల్ బస్ బోల్తా పడ్డ ఘటనలో 50మంది చిన్నారులు గాయపడ్డారు. పెరంబదూర్ జిల్లాలోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుచేసుకుంది. డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 50మంది చిన్నారులు గాయపడగా... 27మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరికి పెరంబదూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 

గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు పూర్తి...

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు నగరంలోని పంజాగుట్ట స్మశానవాటికలో పూర్తయ్యాయి. పలువురు సినీరంగ ప్రముఖలు హాజరయ్యారు.

 

15:27 - July 16, 2015

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ సర్కారు పెట్రో డీజెల్‌పై వ్యాట్‌ పెంపుదల చేసినందుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వాటర్‌ క్యాన్లతో ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు.

 

పంజాబ్ లో మృతదేహాల కలకలం..

పంజాబ్: మోగీలో మృతదేహాలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. నరికిన దుండగులు మృతుల్లో ముగ్గురి తలలను నరికారు. 

15:02 - July 16, 2015

అనంతపురం: గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం తగదని తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. పుష్కరాల ఘటనను ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించడం మంచిది కాదన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు రఘువీరాకు పీసీసీ పదవి దక్కిందని ఎద్దేవా చేశారు.

 

14:59 - July 16, 2015

హైదరాబాద్: టీడీపీ నేత రావుల, మంత్రి జూపల్లి మధ్య సాగుతున్న కొనసాగుతున్న బహిరంగ చర్చ సవాల్‌ ఎపిసోడ్‌ కొనసాగుతూనే ఉంది. రావుల సవాల్‌ ను స్వీకరిస్తూ రెండు రోజులపాటు అసెంబ్లీ కమిటీ హాల్‌లో జూపల్లి ఎదురుచూశారు. తాజాగా బహిరంగచర్చ వేదికను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మార్చి మంత్రి జూపల్లి టీడీపీ నేత రావుల ను ఆహ్వానించారు. 

14:56 - July 16, 2015

విశాఖ: జిల్లాలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఉద్ధృతమైంది. సమ్మెలో భాగంగా విశాఖ జీవీఎంసీ కార్మికులు, ఉద్యోగులు గాంధీ విగ్రహం ఎదుట మహాధర్నా నిర్వహించారు. సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు చావో రేవో తేల్చుకుంటామని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. సమ్మెను చిన్నచూపు చూస్తే ప్రభుత్వానికి చేదు అనుభవం తప్పదని జేఏసీ నేతలు హెచ్చరించారు.

 

14:54 - July 16, 2015

హైదరాబాద్: ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీ ఆర్ ఎస్.. ఉద్యమాలను అణిచివేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10 వామపక్ష పార్టీల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై సీపీఎం నేతలు నిప్పులు చెరిగారు.

 

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన వామపక్షపార్టీలు

హైదరాబాద్: మున్సిలప్ కార్మికుల సమ్మెపై వామపక్షపార్టీలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. కార్మికుల అక్రమ అరెస్టులు ఆపాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. సాయంత్రంలోగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, సీఎంతో సాయంత్రానికి కల్లా.. సానుకూల ప్రకటన ఇప్పిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హామీ ఇచ్చారు. అయితే సానుకూల ప్రకటన రాకపోతే రేపటి బంద్ యధాతథంగా ఉంటుందని నేతలు అన్నారు. పుష్కర బస్సులను కూడా కదలనివ్వమని, బంద్ నుంచి అత్యవసర సేవల మినహాయిస్తున్నామని చెప్పారు. రంజాన్ నేపథ్యంలో ముస్లీం సోదరులకు అసౌకర్యం కలిగిస్తున్నందుకు చింతిస్తున్నామని వాపోయారు. 

తాజ్ మహల్ వద్ద ఒకరి గొంతు ఒకరు కోసుకున్న ప్రేమికులు...

ఢిల్లీ:పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట తాజ్ మహల్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అబ్బాయి పేరు రాజ్ వీర్ సింగ్ (25). డెహ్రాడూన్ నివాసి. అమ్మాయి పేరు షబ్నమ్. ఆగ్రాలో ఉంటుంది. ఇరువురూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని పెద్దలను ఒప్పించాలని విశ్వప్రయత్నం చేశారు. మతాలు వేరు కావడంతో ఏ కుటుంబంలోనూ పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో వీరు నిన్న సాయంత్రం తాజ్ మహల్ వద్దకు వచ్చి ఒకరి గొంతును ఒకరు బ్లేడుతో కోసేసుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు వారిని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్ధతు తెలిపిన బిజెపి

హైదరాబాద్ : వేతనాలు పెంపుతో పాటు, తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మద్దతు తెలిపారు. ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ అంటే ఇదేనా, పంతానికి వెళ్లి.. కార్మికులను చర్చలకు కూడా పిలవరా...అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, తన కుమారుడు వద్ద ఉన్న శాఖల్లోనే ఇంత నిర్లక్ష్యమా అని వారు ధ్వజమెత్తారు. 

పందుల నోట్లో పసికందు...

మహబూబ్‌నగర్ : దేవరకద్ర మండలం బలుసుపల్లిలో దారుణం జరిగింది. ఇంటి ఆరుబయట ఉన్నా ఐదు నెలల పసికందును పందులు ఈడ్చుకెళ్లాయి. పసికందును పందులు పీక్కతిన్నాయి. ఆ పసికందు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కార్మికుల పట్ల కేసీఆర్ తీరు అప్రజాస్వామికం: తమ్మినేని

హైదరాబాద్:కార్మికుల పట్ల కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎంబీ భవన్ లో 10 వామపక్ష పార్టీలు భేటీ అయ్యారు. రేపటి రాష్ట్ర బంద్ తో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ... కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక వాగ్ధానాలు ఇచ్చారన్నారు. ఒకప్పుడు ఉద్యమం నడిపిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాల పట్ల నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మండి పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? దొరల రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందన్నారు.

13:29 - July 16, 2015

ఖమ్మం:భద్రాచలంలో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఆయన భద్రాచలంలో 'టెన్ టివి' తో మాట్లాడుతూ... ఎక్కువ సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకునేందుకు మిథిలా స్టేడియంలో ఉత్సవ మూర్తులను ఉంచుతున్నట్లు తెలిపారు. నిమిష నిమషానికి వాతావరణ పరిస్థితులు, భక్తుల రాక ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మంత్రి గా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు రావడం నా అదృష్టం అని తెలిపారు. పోలీస్ ఫోర్సుని పెంచి, ఎన్డీఆర్ ఎఫ్ టీంలను పెంచి ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని తెలిపారు.

13:25 - July 16, 2015

ప.గో: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పుష్కరఘాట్లలో పర్యటించారు. పుష్కరాలలో ఏర్పాట్లపై చంద్రబాబు యాత్రికులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్రంలో పర్యటించిన చంద్రబాబు ఏర్పాట్లపై యాత్రికులతో మాట్లాడి ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.

 

13:23 - July 16, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటై సంవత్సరం పూర్తి కావస్తున్నా...తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు కాలేదన్నారు. వీలైనంత త్వరలో రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని గవర్నర్ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఏపీలో హైకోర్టును ఏర్పాటు చేసుకోవాలని ఉమ్మడి హైకోర్టు సూచించినా...ఆ రాష్ట్రం పట్టించుకోవడంలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అన్నారు.

 

13:21 - July 16, 2015

హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా 10 వామపక్ష పార్టీలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని... పీఆర్సీ నిర్ణయించిన వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలుపుతున్న పార్టీలను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ ధోరణితో, నియంతలాగా, పోలీసు వ్యవస్థను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని మండి పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ పాల్గొని మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టి.టిడిపి, వైసీపీ బంద్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

మధ్యాహ్నం 3 గంటలకు రామకృష్ణ అంత్యక్రియలు

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి. ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చివరి సారిగా దర్శించుకుని, అంజలి ఘటించారు. రామకృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. 

ప్రాణాలు పోయినా పేదలకు భూములు దక్కేలా చేస్తాం:పి.మధు

కృష్ణా: మైలవరం మండలం వెల్వడంలో సీపీఎం బృందం పర్యటించింది. ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ... రాజధాని పేరుతో పేదల భూములు లాక్కొని పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మారకుంటే సహించమని స్పష్టం చేశారు. దేవినేనికి మంత్రి పదవి వచ్చాక పేదల్ని పట్టించుకోవట్లేదన్నారు. మా ప్రాణాలు పోయినా పేదలకు భూములు దక్కేలా చేస్తామని హెచ్చరించారు.

రేపటి బంద్ కు మద్దతు ప్రకటించిన టి.టిడిపి, వైసీపీ

హైదరాబాద్:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలుపుతూ 10 వామపక్ష పార్టీలు రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. వామపక్షాలు చేపట్టిన బంద్ కు టి.టిడిపి, వైపీసీ పార్టీ లు మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా ఉద్యోగ, ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కూడా మద్దతు ప్రకటించాయి.

12:45 - July 16, 2015

హైదరాబాద్:ప్రత్యూష కేసును హైకోర్టు విచారించింది. ప్రత్యూష మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు హోంశాఖ అధికారులు కోర్టుకు వెల్లడించారు. తండ్రి రమేష్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే బాలికను ఎవరి ఆధీనంలో ఉంచాలో సూచించాలని కోర్టు కోరింది. సమాధానం రేపు చెబుతామని హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు.

 

పుష్కర విధుల్లో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం....

రాజమండ్రి: పుష్కర విధులకు వచ్చిన కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్ పురుగు మందు తాగిఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన అధికారులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీఏ, డీఏలు ఇవ్వడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమిక సమాచారం.

హైకోర్టును త్వరగా విభజించాలి:ఎంపీ జితేందర్ రెడ్డి...

హైదరాబాద్ : హైకోర్టును తక్షణమే విభజించాలని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో నూతనంగా ఏర్పడ్డ ప్రతీ రాష్ర్టానికి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ విషయంలో అలా జరగడం లేదన్నారు. పునర్విభజన చట్టంలో హైకోర్టు విభజించాలని స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు కావాలనే ఆలస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో హైకోర్టు అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిగా ఏర్పాటు కావాల్సింది హైకోర్టు అని చెప్పారు. 

బాలమ్మరేవు పుష్కర ఘాట్లో మొసలి కలకం..

కరీంనగర్: పుష్కర ఘాట్ లో మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి బాలమ్మరేవు పుష్కర ఘాట్లో గురువారం జరిగింది. పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు మొసలిని చూడగానే భయాందోళలనకు గురయ్యారు. దీంతో కొద్దిసేపు నీళ్లలోకి భక్తులెవరూ దిగలేదు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని వెంటనే మొసలిని పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘట్ కేసర్ గ్రామ పంచాయతీ ఎదుట బైఠాయించిన పారిశుద్ధ్య కార్మికులు...

రంగారెడ్డి:ఘట్ కేసర్ గ్రామ పంచాయతీ ఎదుట సిఐటియు, ఏఐటియూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టింది. రోడ్డు పై బైఠాయించిన మున్సిపల్ కార్మికులు బైఠాయించడంతో 5. కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సీఆర్ఫీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి.

ఏపీలో విద్యా సంస్థలన్నిటికీ రెండు రోజుల సెలవులు:మంత్రి గంటా..

తిరుపతి: గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు వీలుగా ఏపీ లో విద్యాసంస్థలన్నింటికీ ఈ నెల 20, 21న పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణకు గంటా ఆదేశించారు. అంతకుముందు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి గంటా దర్శించుకున్నారు. 

ఓబలంక ఘాట్ వద్ద యువకుడు గల్లంతు

తూ.గో: గోదావరి పుష్కరాల్లో రావుల పాలెం మండలం ఓబలంక ఘాట్ వద్ద పుష్కర స్నానం చేస్తూ ఓ యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి కోసం అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

వ్యాపం స్కాంపై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

హైదరాబాద్: వ్యాపం కుంభకోణంపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో సిట్ ఛార్జిషీట్లు వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. సిట్ నుంచి 185 కేసుల బదిలీకి సమయం పడుతుందని.. ఛార్జిషీట్లు వేయకపోతే నిందితులు బెయిల్ పొందే అవకాశముందని సీబీఐ పిటిషన్ లో పేర్కొంది. సీబీఐ పిటిషన్ ఈనెల 20న విచారణ చేపట్టనుంది.

పుష్కరాలు ముగిసే వరకూ రాజమండ్రి నుండే పాలన:చంద్రబాబు

రాజమండ్రి:పుష్కరాలు ముగిసేంత వరకూ నవ్యాంధ్రకు రాజధాని నగరంగా రాజమండ్రి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన పరిపాలన అంతా ఇక్కడి నుంచే సాగుతుందని, మంత్రివర్గ సమావేశాలు సైతం రాజమండ్రిలోనే జరుగుతాయని ఆయన అన్నారు. ఈ ఉదయం కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని పరిశీలించిన చంద్రబాబు, మీడియాతో మాట్లాడుతూ, తనను కలిసేందుకు సింగపూర్ బృందం కూడా రాజమండ్రికే వస్తుందని వివరించారు. అమరావతి ప్లాన్ పై ఆ బృందంతో చర్చించనున్నామని తెలిపారు. పుష్కరాలు ముగిసేంతవరకూ తాను ఎక్కడికీ వెళ్లబోనని అన్నారు.

ప్రధాని వారణాసి పర్యటన రద్దు...

హైదరాబాద్:ప్రధాని నరేంద్రమోడీ తన నియోజకవర్గమైన వారణాసి పర్యటన భారీ వర్షాల కారణంగా రద్దయ్యింది. భారీ వర్షాల కారణంతో మోడీ పర్యటన రద్దు కావడం ఇది రెండోసారి. జూన్ 28వ తేదీన మోడీ వారణాసి రావాల్సి ఉండే. అప్పుడు భారీ వర్షాలు కురియడంతో మోడీ పర్యటన రద్దు అయింది. మోడీ పర్యటన రద్దు కావడంతో ఇంటిగ్రెటేడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌తో పాటు వారణాసి - బాబత్‌పూర్ మధ్య నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడుతూనే ఉంది.

శోభా యాత్రకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్: గోదావరి మహాపుష్కర శోభాయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ కు చేరుకుంది. ద్వారకా తిరుమల నుంచి కాలినడకన భక్తులు శోభా యాత్రగా తరలి వచ్చారు. ఈ యాత్రకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు.

గవర్నర్ ను కలిసిన టిఆర్ ఎస్ ఎంపీలు...

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టును త్వరగా విభజించేలా చూడాలని గవర్నర్‌కు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, కేకే, బూర నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్ ఉన్నారు.

11:47 - July 16, 2015

ఇవ్వడానికి భూములున్నాయి. కొని పంచడానికి పైసలున్నాయ్‌. కాని ఇదంతా చేయడానికి చేతులే లేవేమో అనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు భూపంపిణీ పథకం ఏడాదిలోనే అటకెక్కింది. బడ్జెట్లో వేలకోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా... అమలు చేసిన గణాంకాలు చూస్తే... నోరెళ్లపెట్టాల్సిందే. బడాబాబులకు పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు కట్టబెడుతున్న సర్కార్.. దళితుల వరకు వచ్చేసరికి మొండిచేయి చూపిస్తోంది. ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకున్న డేటా పరిశీలిస్తే... కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఖర్చు చేసింది ఒక్క శాతం కూడా లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.
మాటలు కోటలు దాటుతుంటే..
మాటలు కోటలు దాటుతుంటే.. ఆచరణ గడప కూడా దాటదనేది కేసీఆర్‌పై ప్రత్యర్థులు ఎప్పుడూ చేసే విమర్శ. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. అది పేదవాడికి ఈఎమ్‌ఐల రూపంలో అంటే ఇన్‌స్టాల్‌మెంట్లలో ఇస్తానని ఎక్కడన్నా చెప్పారా.. మీరు విన్నారా.. కాని సీఎం సాబ్‌ కాగితాల్లో మాత్రం అదే చూపించారు.
ఆగస్టు 15న ఆర్భాటంగా గోల్కొండ కోట మీద...
ఆగస్టు 15న ఆర్భాటంగా గోల్కొండ కోట మీద కేసీఆర్‌ మొదలుపెట్టిన ఈ పథకం.. కాగితాల దాటి భూమి మీదకే రావటం లేదు. రికార్డుల కోసమే అన్నట్లు కొంతమందికే ఇచ్చి.. చేతులు దులుపుకున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమి పెద్దల ఆక్రమణలో మూలుగుతుంటే..దాన్ని వదిలిపెట్టి భూములు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. పోనీ అదయినా చేస్తారేమోనని చూస్తే.. ఆ నిధులు కూడా బయటికి రావటం లేదు.
ఖర్చు చేసిన మొత్తం రూ.111.16 కోట్లు....
ప్రభుత్వ రికార్డుల ప్రకారం జూన్ 30- 2015 నాటికి ఈ స్కీమ్ కింద లబ్ధి పొందిన దళిత మహిళలు 1112 మంది మాత్రమే. వీరికి మొత్తం 2వేల 9వందల 73.22 ఎకరాలు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ భూమి 269.34 ఎకరాలు కాగా... ప్రైవేట్ ల్యాండ్ 2వేల 703.38 ఎకరాలు. ఇందుకోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 111.16 కోట్లు మాత్రమే. అసలు ఈ పథకం కింద సర్కార్ కేటాయించి, రిలీజ్ చేసిన మొత్తం 18వేల 9వందల 47.97కోట్ల రూపాయలు. అంటే కేటాయించిన మొత్తంలో చేసిన ఖర్చు 0.58శాతం మాత్రమే. దీనిని బట్టే దళితులపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి అర్థమవుతోంది.
ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు చిట్టచివరన....
ఇక లబ్ధిదారుల సంఖ్యల వారీగా చూస్తే... ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు చిట్టచివరన నిలిచాయి. ఖమ్మం జిల్లాలో 59.38 ఎకరాలు మంజూరు చేసి 22 మందికి కేటాయించారు. రంగారెడ్డి జిల్లాలో కూడా 59.39 ఎకరాల భూమిని 22 మంది పేర రిజిస్ట్రేషన్ చేయించారు. తరువాతి స్థానంలో మహబూబ్ నగర్ నిలిచింది. మొత్తం 79 మంది 237 ఎకరాలు అందుకున్నారు. వరంగల్ జిల్లాలో 93 మందికి 246 ఎకరాలు కేటాయించారు. ఈ గణాంకాల వారిగా చూస్తే ఆదిలాబాద్ తొలిస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో అత్యధికంగా 671 ఎకరాల భూమిని 230మందికి అందించారు. సంఖ్యా పరంగా చూస్తే... మెదక్ లో 270 మందికి 659 ఎకరాలు కేటాయించారు.
రిలీజ్ చేసిన మొత్తం రూ.18,947.97కోట్లు...
ఈ గణాంకాలను బట్టి చూస్తేనే.. ఈ పథకంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. అసలు ఈ పథకానికి మార్గ దర్శకాలు కూడా సరిగా విడుదలకాలేదని ఓ సమాచారం. నీటి లభ్యత ఉన్న భూమినే కొనాలా, లేకపోయినా కొనవచ్చా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. దీంతో ఈ స్కీంను పరిశీలిస్తున్న రెవిన్యూ యంత్రాగం... తమకు నచ్చినట్టుగా అమలు చేస్తోంది. దీంతో 18వేల 8వందల 37 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో మూలుగుతున్నాయి. ఉన్నోడికి ఉన్న బాధ..లేనోడికి లేని బాధ అన్నట్లు.. డబ్బులుంచుకుని పథకం ఎందుకు అమలు చేయడం లేదో మరి. ఆ లోగుట్టు కేసీఆర్‌కే ఎరుక.

11:43 - July 16, 2015

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉదృతంగా కొనసాగుతోంది. సమ్మె 11వ రోజుకు చేరుకుంది. రామంతాపూర్‌లో ఆందోళన చేస్తున్న 40 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐటీయూ నేత శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త రాస్తారోకోలకు మున్సిపల్ జేఏసీ పిలుపునిచ్చింది.

 

11:30 - July 16, 2015

ఆ చిన్నారులకు చదువుకోవాలని ఉంది...కానీ చదువు చెప్పే టీచర్లు లేరు. పాఠాలు వినాలని ఉంది...బోధించే మాస్టారు లేరు. డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో అవ్వాలని, పేదరికం నుంచి బయటపాలని మనసులో అచంచలమైన ఆశయముంది. కానీ ఆ తపనకు సానపెట్టే సారు లేరు. సరస్వతీ దేవీ కటాక్షమున్నా వరమిచ్చే గురువు లేరు. పట్టుదలతో చదవాలని ఒట్టు పెట్టుకున్నా...టీచర్లు లేని పాలమూరు జిల్లా గట్టు మండలం ప్రభుత్వ పాఠశాలలపై టెన్‌ టీవీ స్పెషల్ స్టోరి.
ఆరేళ్ల లోపు చిన్నారులు 12వేల మంది....
వెనుకబడిన పాలమూరు జిల్లాలోని గట్టు మండలం ఇది. కరువుతో పాటు దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్న మండలంగా ఘనత సాధించింది. సుమారు 75వేల జనాభా ఉన్న ఈ మండలంలో ఆరేళ్ల లోపు చిన్నారులు 12వేల మంది ఉంటే...ఏడేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు 63వేల మంది ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ మండలంలో చదువుకున్న వాళ్లు 21వేల మంది ఉన్నారు. దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ మండలాన్ని ఎంచుకొని విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తున్నా ఫలితం ఆశించిన స్థాయిలో లేదు. ఒకవైపు విద్యా మిషన్‌లు, అక్షరాస్యతా కార్యక్రమాలు అందరికీ విద్యా, అందరూ చదువుకోవాలంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వాలు..ఈ మండలంలో మాత్రం పిల్లలు చదువుకుంటామంటున్న చదువు కల్పించలేని దుస్థితి.
34ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 9 ఉన్నత పాఠశాలలు....
గట్టులో మండలంలో 34ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 9 ఉన్నత పాఠశాలలున్నాయి. మొత్తం కలిపి సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో 194 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా...గత విద్యా సంవత్సరం వరకు 106మందితో నెట్టుకొచ్చారు. 2013లో జరిగిన బదిలీల కౌన్సిలింగ్ లో ఈ ప్రాంతం నుంచి 12 మంది ఉపాధ్యాయులు వేరే చోటికి బదిలీ చేసుకున్నారు. మారుమూల మండలం కావడం.. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో ఇతర ఉపాధ్యాయులెవరూ ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపించలేదు. వచ్చిన వారు కూడా రాజకీయ పైరవీలతో ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో చదువు మీద ఆసక్తితో బడిమెట్లెక్కే విద్యార్థులకు నిరాశే మిగులుతోంది.
బదిలీ టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ....
కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయకుండా గత విద్యా సంవత్సరం నెట్టుకొచ్చారు. ఈ ఏడాది ప్రభుత్వం బదిలీ అయిన టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో గట్టు మండలంలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో 6 పాఠశాలల్లో బోధకులే లేకుండా పోయారు.
ఏడు పాఠశాలల్లో ఏకోపాధ్యాయ బోధన....
గట్టు మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలతో పాటు చమన్ ఖాన్ దొడ్డి, బల్గెర, మిట్టదొడ్డి, సిద్దలోనితండా, కొత్తపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా పోయారు. రాయపురం, మల్లాపురం, సిద్దోనిపల్లితో కలిపి 7పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రస్తుతం మండలం మొత్తంలో 90మంది మాత్రమే పనిచేస్తున్నారు. 100 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడికి తలొగ్గిన డీఈఓ ....
గట్టులో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత నెల 23వ తేదీన కలెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలతో కలిపి సమావేశం నిర్వహించారు. రేషనలైజేషన్ లో గట్టు మండలానికి ఎక్కువ పోస్టులు తేవడంతో పాటు... ఏకోపాధ్యాయ పాఠశాలలకు టీచర్లు వచ్చే వరకు ఉన్న టీచర్లను రిలీవ్ చేయొద్దని కలెక్టర్ శ్రీదేవి డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడికి తలొగ్గిన డీఈఓ రాజేశ్ టీచర్లను రిలీవ్ చేశారు. రాజకీయ నాయకుల నుంచి లాబీయింగ్ పెరగడంతో టీచర్ల బదిలీ ఇష్టారాజ్యంగా మారింది. దీంతో అక్కడి పాఠశాలల్లో బోధన నిలిచిపోవడంతో దానికి కారణమైన జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్ ను కలెక్టర్ శ్రీదేవీ సరెండర్ చేశారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ సాగుతోంది. ఎవరైనా ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు వస్తే విద్యార్థులకు బోధన అందే అవకాశం ఉంది. లేకపోతే విద్యాశాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ప్రాథమిక హక్కు విద్యపై ప్రభుత్వాల నిర్లక్ష్యం ...
తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యపై కసరత్తు చేస్తోంది. విద్యా హక్కు చట్టం కూడా ఉంది. వీటి సంగతి దేవుడురుగు కానీ...ప్రాథమిక హక్కయిన విద్యపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పిల్లలు రావడం లేదని ఒకపైపు స్కూళ్లను మూసివేస్తూ....చదువుకుంటాం టీచర్లు, సౌకర్యాలు కల్పించాలని గట్టు మండలం చిన్నారులు నెత్తీనోరుబాదుకుంటున్నా వినే దిక్కేలేదు. భావి భారతానికి ఇదేనా భరోసా...పిల్లలకు కనీసం విద్యను అందించలేరా.?

11:24 - July 16, 2015

హైదరాబాద్:కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై ఆసుపత్రి పాలైన ప్రత్యూష వేగంగా కోలుకుంటోంది. గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యూష చికిత్స పొందుతోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక బంధువుల ఇంటికి వెళ్లను అని, స్టేట్‌ హోంలోనే ఉంటానని ప్రత్యూష తెలిపింది. ఎవరైనా సహాయం అందిస్తే ఉన్నత చదువులు చదువుకుంటానని ప్రత్యూష పేర్కొంది. 

11:22 - July 16, 2015

రాజమండ్రి : పుష్కర స్నానాల కోసం రాజమండ్రికి భక్తులు పోటెత్తుతున్నారు. విఐపీ ఘాట్‌ ఖాళీగా ఉన్నా సామాన్య భక్తులను అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన రైల్వే ట్రాక్‌ దాటుతూ రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. 

11:21 - July 16, 2015

హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కొవ్వూరు గౌతమి ఘాట్‌లో తుపాకీ లభ్యం కావడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి తీరంలో పర్యటించాల్సిన ..తుపాకీ దొరకడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీంతో ముఖ్యమంత్రి పర్యటనలో పలు మార్పులు చేశారు. గోదావరి తీరంలోని ఘాట్లను కేవలం ఏరియల్ సర్వేకే పరిమితం చేశారు. మరోవైపు పోలీసులకు దొరికిన తుపాకీ తనదే అంటూ ఓ వ్యక్తి చెప్పడంతో అతనని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

11:19 - July 16, 2015

గుంటూరు:నాగార్జున యూనివర్శిటిలో ఇద్దరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ యూనివర్శిటీ వీసీ ఆదేశాలు జారీచేశారు. రిషితేశ్వరి అనే ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో...ఆమె మృతికి కారకులుగా భావిస్తున్న సీనియర్ విద్యార్థులైన జైచరణ్‌, శ్రీనివాసరావులను వీసి సస్పెండ్‌ చేశారు. రిషితేశ్వరి అనే జూనియర్‌ విద్యార్ధినిని జైచరణ్‌, శ్రీనివాస్‌రావుతో పాటు మరో సీనియర్‌ అమ్మాయి కూడా ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. రిషితేశ్వరి అనే జూనియర్‌ విద్యార్ధినిని జైచరణ్‌, శ్రీనివాస్‌రావుతో పాటు మరో సీనియర్‌ అమ్మాయి కూడా ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటనకు ప్రధాన కారకురాలైన సీనియర్‌ విద్యార్థినిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసును పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు ఎస్పీని కలిసేందుకు విద్యార్థులంతా ఎస్పీ కార్యాలయానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. 

సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జూపల్లి ఎదురు చూపులు

హైదరాబాద్:పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై టి.టిడిపి నాయకులతో చర్చకు సిద్ధంగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లోఎదురు చూస్తున్నారు. మూడో సారి టీడిపి నేతలకు జూపల్లి సవాలు విసిరారు.

పోలవరం కుడి కాలువ,పట్టిసీమ ప్రాజెక్టు పై బాబు సమీక్ష

రాజమండ్రి:పోలవరం కుడి కాలువ పనులు, పట్టిసీమ ప్రాజెక్టు పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.

చల్లపల్లి ఎస్సీబాలికల హాస్టల్ 20మందికి అస్వస్థత

కృష్ణా:చల్లపల్లి ఎస్సీబాలికల హాస్టల్ లో విషాహారం తిని 20 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.అవస్వస్థతకు గురైన విద్యార్థినులను చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సోనియాతో భేటీ అయిన టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్

ఢిల్లీ: సోనియా గాంధీతో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీలో పార్టీ పరిస్తితులు, సభ్యత్వ నమోదు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించన్నుట్లు సమాచారం.

హైకోర్టుకు చేరుకున్న ఉన్నత విద్యామండలి అధికారులు

హైదరాబాద్:ఇంజనీరింగ్ కాలేజీలపై కోర్టు తీర్పు కాపీని తీసుకునేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు హైకోర్టుకు చేరుకున్నారు. తీర్పు కాపీని తీసుకున్న తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించనున్నారు.

పుష్కర భక్తులకు కేనినేని నాని ఉచిత బస్సు సర్వీసులు..

కృష్ణా: గోదావరి పుష్కరాలకు వెళ్లే బెజవాడ భక్తుల కోసం కేశినేని నాని ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ నుంచి రాజమండ్రికి రోజూ రెండు బస్సుల చొప్పున నడపనున్నట్లు ఆయన ప్రకటించారు. నేటి ఉదయం ఈ బస్సులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలు ముగిసేదాకా ఈ ఉచిత బస్సులను నడపనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.  

పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులకు గాయాలు..

జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమరణ ఉప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్ ఎస్ పురా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పుల్లో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి.

'రేపు ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి'

విజయవాడ:మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ.. రేపు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏపీ మున్సిపల్ ఉద్యోగుల, కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఉదయం 9.30 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని జేఏసీ నేతలు తెలిపారు.

 

కొవ్వూరు గౌతమి ఘాట్ లో తుపాకీ స్వాధీనం...

ప.గో: కొవ్వూరు గౌతమి ఘాట్ లో తుపాకీ కలకలం రేపింది రేవు వద్ద పడున్న తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

పుష్కర ఘాట్ల వద్ద దొంగలు చేతివాటం

ఖమ్మం:భద్రాచలంలోని గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పూజారుల అవతారం ఎత్తిన దొంగలు పూజల పేరిట మోసం చేశారు. నదిలో స్నానం చేయాలని చెప్పి భక్తుల బ్యాగులను అపహరించుకువెళ్లారు. కాగా పుష్కరాల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పూజారులు నిరసన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తులు

తూ.గో: రాజమండ్రిలోని అన్ని ఘాట్లకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వీఐపీ ఘాట్ లోకి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. పుష్కర యాత్రికులతో రాజమండ్రిలోని రహదారులు కిటకిటలాడుతున్నాయి.

మంత్రి నాయినితో భేటీ కానున్న కేంద్ర కార్మిక సంఘాలు...

హైదరాబాద్:తెలంగాణ కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో తెలంగాణ కేంద్ర కార్మిక సంఘాల సమావేశం కానుంది. ఈ సందర్భంగా మున్సిపల్‌, గ్రామపంచాయితీ కార్మికులు, ఐకేపీ ఉపాధిహామీ సిబ్బంది సమ్మెపై చర్చించనున్నారు.

09:32 - July 16, 2015

హైదరాబాద్: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మూడవ రోజు పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు తెల్లవారుఝాము నుంచే ఘాట్లలో సందడి చేశారు. వేలాది సంఖ్యలో భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్ల చేశారు. 

09:30 - July 16, 2015

హైదరాబాద్: ఐడియా... చేంజ్ యువర్ లైఫ్. ఇది నిజమో కాదో తెలీదు. కానీ ఒకే ఒక్క ఐడియా... 29 మంది ప్రాణాల్ని బలితీసుకుంది. అధికారుల నిర్లక్ష్యం... అనయాయుల ఉచిత సలహాలు... అపార అనుభవం ఉన్న నేతనే తప్పుదార్లో పడేశాయి. కోటగుమ్మం దుర్ఘటనపై విపక్షాలు... చంద్రబాబు లక్ష్యంగా విమర్శల బాణం ఎక్కుపెట్టాయి.                                                               
రాజమండ్రి పుష్కరాల్లో పెను విషాదం....
మహా పుష్కరాల్లో పెను విషాదం కమ్మేసింది. రాజమండ్రిలో తొలిరోజే మృత్యుఘోష వినిపించింది. పుష్కర శోభతో కళకళలాడాల్సిన... సంబరాలు కన్నీళ్లనే మిగిల్చాయి. 29 మంది భక్తుల... మృత్యువాతకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. కానీ ఈ దుర్ఘటనకు కారకులెవరు..? అభంశుభం తెలియని అమాయకుల్ని పొట్టనపెట్టుకున్నదెవరు..? గోదారమ్మ ఒడిలో సేద తీరుతామనుకున్న.. భక్తులకు గుండెకోత మిగిల్చిందెవరు..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి.
పుష్కరాల కోసం తెగ ఆర్భాటాలు ....
పుష్కరాల కోసం తెగ ఆర్భాటాలు చేసిన పాలకులు... పుష్కర జాగ్రత్తలంటూ సూచనలు చేసిన ప్రభుత్వమే... అసలు నిబంధనల్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటను చూస్తే... ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది.
షెడ్యూల్ ప్రకారం వీఐపీ ఘాట్‌లో బాబు స్నానం....
నిజానికి సీఎం విఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేయాల్సి ఉంది. కానీ భక్తుల ఘాట్‌కు వెళ్లి స్నానం చేస్తే... బ్రహ్మాండమైన ప్రచారం వస్తుందని... ఓ సలహాదారు ఉచిత సలహా ఇచ్చారట. ఆయన ఐడియా ఇవ్వడంతోనే చంద్రబాబు కోటగుమ్మం ఘాట్‌కు వెళ్లారట. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వచ్చారనో..? లేక ఆయన మెప్పు పొందాలనో..? తెలీదు..! కనీసం చీమ కూడా దూరకుండా... అధికార యంత్రాంగం గేట్లను మూసేసింది. సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన పుష్కరిణిలో... చంద్రబాబు కుటుంబ సభ్యులు పుణ్యస్నానం ఆచరించే వరకు... భక్తులకు కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత వెంటనే గేట్లు ఓపెన్ చేయడంతో జరగరాని ఘోరం జరిగిపోయింది.
రాజకీయ నిర్ణయంవల్లే దుర్ఘటన-పోలీసులు....
పోలీసులు సైతం ఇవే అంశాలతో... నివేదిక రూపొందించినట్లు సమాచారం. రాజకీయ నిర్ణయం వల్లే దుర్ఘటన జరిగిందని... తాము విఐపీ ఘాట్‌ వద్ద ఏర్పాట్లు చేశామని... కోటగుమ్మం దగ్గర ముఖ్యమంత్రి స్నానం చేస్తారన్న... ముందస్తు సమాచారం తమకు లేదంటున్నారు పోలీసులు.
కాంట్రాక్టు పనుల్లోనూ అలసత్వం.....
ఇక కాంట్రాక్టు పనుల్లోని అలసత్వం... పెను విషాదానికి కారణమైనట్లు కనిపిస్తోంది. బాబుకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ఖజానా వ్యవహారాలు చూసే మంత్రి... బంధువుకే కాంట్రాక్టు పనులు అప్పగించారట. దీంతో కాంట్రాక్టర్ సరిగ్గా పనులు చేయకపోయినా... అడగటానికి లేకుండా పోయిందని అధికారులు వాపోతున్నారట. పైగా బిల్లులు ఆపాలని ప్రయత్నించినా.. అదీ సాధ్యం కాలేదట. ఏపీ సీఎంకు ఆప్తుడైన మరో కార్పొరేట్ మంత్రి ఒత్తిడితో... సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా చెల్లించేశామంటున్నారు అధికారులు. ఇలా ఇద్దరు మంత్రుల అండదండలు ఉండటంతో... తామెన్నీ ప్రయత్నాలు చేసినా ఫలించలేదంటున్నారు.
ఇతర ఘాట్లను తెరవని అధికారులు.....
ఇక ముఖ్యమంత్రి పుష్కర స్నానం చేసేవరకు... ఇతర ఘాట్లను తెరవకపోవడం కూడా విపత్తుకు ఊతమిచ్చేలా మారింది. ఇలా ఓ సలహాదారు, ఇద్దరు మంత్రులే ఈ విషాదానికి కారణమంటూ ప్రతిపక్షాలు ముప్పేటదాడి చేస్తున్నాయి.
సీఎ ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా...
మొత్తం మీద కోట గుమ్మం ఘటనలో ఏపీ సీఎ ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా... పాలనలో అపార అనుభవం కలిగిన చంద్రబాబు... చుట్టూ ఉన్నవారి మాటలు విని... పద్ధతిపాడు లేకుండా... విచక్షణ మరిచి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ దుష్ఫరిణామం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి బాబుగారు ఏం సమాధానం చెబుతారు..? మృత్యుఘోషకు కారకులైనవారిపై చర్యలు తీసుకుంటారో..? లేదా కమిటీలతోనే కాలయాపనచేస్తారో చూడాలి. 

ఆంధ్రా యూనివర్శిటీకి బెస్ట్ రీసెర్చ్ వర్శిటీ అవార్డు....

హైదరాబాద్: ఏయూ క్యాంపస్: దేశంలో ఉన్నత విద్య, డాక్టరేట్ అంశాలలో పరిశోధనను ప్రోత్సహిస్తున్న అత్యుత్తమ వర్సిటీగా ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంపికైంది. గుజరాత్ టెక్నికల్ వర్సిటీ, కమ్యూనికేషన్ మల్టీ మీడియా అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా ఏయూను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. ఈనెల 17న ఉదయం అహ్మదాబాద్‌లో జరగనున్న ఆఫ్రో ఏసియన్ సదస్సులో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు ఈ అవార్డును అందుకోనున్నారు. టీచింగ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్‌గా దీనిని పిలుస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన 8 మంది దౌత్యాధికారులు హా జరుకానున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత....

హైదరాబాద్: శంషాబాద్ ఏయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1.2 కిలోల బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శోభాయాత్ర యాత్రకు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు

రాజమండ్రి:కాసేపట్లో కోటిపల్లి బస్టాండ్ కు గోదావరి మహా పుష్కర శోభాయాత్ర చేరుకోనుంది. శోభా యాత్రకు సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలకనున్నారు.

11వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ సిబ్బంది కూడా సమ్మె చేపట్టారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రామంతపూర్ లో 40మంది కార్మికులతో పాటు సిఐటియు నాయకుడు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఎవరెస్ట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం...

మెదక్: సదాశివపేట మండలం దుబేరా శివారులోని ఎవరెస్ట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చిన్నారిని హింసించిన కేసులో తండ్రి అరెస్టు...

హైదరాబాద్: చిన్నారి ప్రత్యూషను హింసించిన కేసులో తండ్రి రమేష్ ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రత్యూష చికిత్స పొందుతోంది.

భార్యపై అనుమానంతో రోకలిబండతో మోది చంపేశాడు..

గుంటూరు:కాకుమాను మండలం పాంత్రపాడు గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త రోకలి బండతో తలపై బాది హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

సినీగాయకుడు రామకృష్ణ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సినీ గాయకుడు రామకృష్ణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు. భక్తిరస పాటలే కాకుండా తెలంగాణ ఉద్యమ గీతాలనూ రామకృష్ణ ఆలపించారని, తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను పొందారని సీఎం పేర్కొన్నారు.

 

భద్రాచలంలో బ్రాహ్మణుల ఆందోళన

ఖమ్మం: భద్రాచలంలో బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. ఘాట్లకు దూరంగా పిండ ప్రదానాలు చేయాలని అధికారులు ఆదేశించడంపై నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టారు.

 

07:59 - July 16, 2015

హైదరాబాద్:ఉభయ రాష్ట్రాల్లోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం అవుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదు? మున్సిపల్ కార్మికులు కోరుతున్న డిమాండ్లు న్యాయమైనవి కాదా? ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదు? జీహెచ్ ఎంసీ కమిషనర్ పొలిటీషియన్ గా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? 2013లో చేసిన భూసేకరణలో ఉన్న అంశాలను పక్కకు పెట్టి రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న నీతి ఆయోగ్ ను వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు పై జాతీయ స్థాయిలో చర్చను చేపట్టి ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం లేదా?ఇదే అంశాలంపై న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చల్లో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, శ్రీరాములు టిడిపి నేత, కొండా రాఘవరెడ్డి వైసీపీనేత, ప్రకాష్ రెడ్డి బిజెపి నేత, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరు కూడా చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

ఒంగోలు నగరంలో భారీ చోరీ....

ప్రకాశం:ఒంగోలు నగరంలో గోదావరి పుష్కరాలకు వెళ్లిన వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పుష్కరాలకు వెళ్లి గురువారం తిరిగి వచ్చిన వ్యాపారి ప్రభాకర్ గుప్తా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. 200 సవర్ల బంగారం, రూ. 4 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, రూ. 2లక్షల నగదును దోచుకున్నట్లు వ్యాపారి తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కలకలం

వరంగల్ : ఎంజీఎంలో కలకలం రేగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టు బడ్డ వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు మట్టెవాడ పీఎస్ కు తరలించి ముగ్గురిని విచారిస్తున్నారు.

బొల్లారం వద్ద రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

హైదరాబాద్: ఆల్వాల్ బొల్లారం వద్ద ఆగి వున్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షత గాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కొవ్వూరులో కిక్కిరిసిన పుష్కర యాత్రికులు

ప.గో: కొవ్వూరులో పుష్కర యాత్రికులు కిక్కిరిశారు. గోష్పాదలో పిండ ప్రదానం వద్ద సౌకర్యాల లేమితో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

రామకృష్ణ మృతికి సంతాపం తెలిపిన ప్రజానాట్యమండలి....

హైదరాబాద్: ప్రముఖ సినీ గాయకుడు రామకృష్ణ మృతికి తెలంగాణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మారయ్య, నర్సింహ సంతాపం తెలిపారు.

07:14 - July 16, 2015

హైదరాబాద్: చరిత్ర పునరావృతం అవుతోంది. పాలకులు మారినా... ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రం మారడం లేదు. హక్కుల కోసం గళమెత్తిన సామాన్యుడిపై... కేసీఆర్ సర్కార్ కన్నెర్ర చేసింది. మున్సిపల్ కార్మికులకు అండగా నిలిచిన కామ్రేడ్లకు సంకెళ్లు వేసింది. వామపక్షాలు చేపట్టిన దీక్షను భగ్నం చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
అరెస్టులతో అట్టుడికిన ఇందిరాపార్క్....
ఒకవైపు కార్మికుల ఆక్రందనలు... మరోవైపు ఖాకీల బూట్లచప్పుళ్లు...అరెస్టులతో ఇందిరాపార్క్‌ అట్టుడికిపోయింది...ధర్నాచౌక్ మరోసారి రణరంగంగా మారింది... మున్సిపల్ కార్మికులకు బాసటగా... వామపక్షాలు చేపట్టిన దీక్షపై టీఆర్ఎస్ సర్కార్ కన్నెర్ర చేసింది. పోలీసు బలగంతో దౌర్జన్యంగా దీక్షల్ని భగ్నం చేసింది. దీక్ష చేపట్టిన నేతలను, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేయించి సంకెళ్లు వేసింది. అక్రమ అరెస్టులను అడ్డుకున్న వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సఫాయి కార్మికులను ఈడ్చుకెళ్లి బలవంతంగా వ్యానులోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై లెఫ్ట్ నేతలు భగ్గుమన్నారు. శాంతియుతంగా సాగుతున్న తమ దీక్షను భగ్నం చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు.
కేసీఆర్‌ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకే....
కేసీఆర్‌ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకే అటు వామపక్షాలు, ఇటు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. దీక్ష భగ్నం, అరెస్టులకు నిరసనగా... భవిష్యత్ కార్యచరణకు శ్రీకారం చుట్టాయి. శుక్రవారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేశాయి. గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించాలని...అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. జులై 17న చేపట్టే బంద్‌కు సహకరించాలంటూ... ప్రజలకు, విద్యా, వ్యాపార సంస్థలకు, ఉద్యోగ, కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశాయి.
సమ్మెను ఉధృతం చేసేందుకు....
సమ్మెను ఉధృతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. తమకోసం పోరాటం చేస్తున్న వామపక్షనేతల్ని అరెస్టు చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ తప్పుబట్టింది. తుపాకులు, తూటాలు తమనేం చేయలేవంటూ.... పొరకబట్టిన చేతులతోనే పాలకులకు బుద్ధిచెబుతామంటూ నేతలు గర్జించారు. శుక్రవారం జరిగే బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ నియంత చర్యలపై కాంగ్రెస్‌,టీడీపీ ముప్పేటదాడి.....
కేసీఆర్ నియంత చర్యలపై కాంగ్రెస్‌,టీడీపీ ముప్పేటదాడి చేశాయి. శుక్రవారం జరిగే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మద్దతు ప్రకటించారు. అలాగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పైశాచిక చర్యపై టీ-కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్‌ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో స్పందించని ప్రభుత్వం... దీక్షను భగ్నం చేయడంలో మాత్రం ఆగమేఘాల మీద స్పందించిందని.. హస్తం లీడర్లు మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని కార్మిక నేతలు హెచ్చరించారు.

07:09 - July 16, 2015

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. కాలేజీల అనుమతుల రద్దుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్ధించడంతో.. ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. కోర్టు నుంచి తీర్పు కాపీ అందుకున్న వెంటనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.                                                                                                 
245 కాలేజీల్లో 220 కాలేజీలకు మాత్రమే గుర్తింపు .....
ఇప్పటికే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ కాలేజీల రద్దు వ్యవహారంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమైంది. రాష్ట్రంలోని మొత్తం 245 కాలేజీలకు గాను 220 కాలేజీలకు మాత్రమే గుర్తింపు లభించింది. మరో 20 కాలేజీల్లో సీట్లు తగ్గించి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ఈనెల ఆరు నుంచి చేపట్టాలని నిర్ణయించారు. అయితే గుర్తింపు పొందని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది.
సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్ధించిన డివిజన్‌ బెంచ్‌......
తాజాగా సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్ధించడంతో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌కు కసరత్తు చేస్తోంది. కోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. మళ్లీ తనిఖీలు.. కోర్టుల చుట్టూ తిరగడం లాంటి వ్యవహారాలతో కౌన్సెలింగ్‌కు ఆలస్యమవుతుందని భావించిన కడియం శ్రీహరి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈరోజు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ?
ఇక కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఈరోజు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. ఈనెల 17 నుంచి 27 వరకు మొదటి దఫా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అదే విధంగా 28, 29 తేదీల్లో రెండో దఫా కౌన్సెలింగ్‌ కొనసాగనుంది. ఆగస్టు మొదటివారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎన్నాళ్ల నుంచో కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధులు ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

07:07 - July 16, 2015

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరింది. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులు.. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ....
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏపీలో మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. అయితే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం.. చెత్త తరలింపునకు చర్యలు చేపట్టింది. జేసీబీ వాహనాలతో చెత్త తరలించేందుకు సిద్ధమవగా.. ఆ ప్రయత్నాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుండా.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వామపక్షాలు సంపూర్ణ మద్దతు....
మరోవైపు మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో భారీ మానవహారం నిర్వహించారు. సమ్మెపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని నెరవేర్చాలని కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
సమ్మె విచ్చిన్నానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం...
సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లెఫ్ట్‌ నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే.. సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

07:03 - July 16, 2015

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలతో హస్తం పెద్దలు మంతనాలు జరిపారు. భవిష్యత్‌లో ఏం చేయాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌లు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, రఘువీరా రెడ్డితో పాటు జానా రెడ్డి, షబ్బీర్ అలీ, సి.రాంచంద్రయ్యలు రాహుల్ గాంధీని కలిశారు.
తాజా రాజకీయ పరిణామాలపై...
తెలంగాణ, ఏపీల్లోనూ తాజా రాజకీయ పరిణామాలపై రాహుల్ చర్చించారు. ఇటీవల పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇరురాష్ట్రాల లీడర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. జులై నెలాఖరు కల్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని...ఏఐసీసీ ఇచ్చిన టార్గెట్‌ను చేరుకోవాలని ఆదేశించారు. ఏపీలో తన పర్యటనపై రాహుల్ పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలే ఎజెండాగా తీసుకోవాలన్నారు.
తెలంగాణలో ప్రభుత్వంపై ....
తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను రాహుల్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేసుకునేందుకు... కావాల్సినన్ని అస్త్రాలున్నట్లు యువరాజు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలు, వరంగల్ పార్లమెంట్ ఎన్నిక కోసం క్యాడర్‌ను సిద్ధం చేయాలంటూ రాహుల్ గాంధీ ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లి కష్టపడాలని సూచించారు. బహిరంగ సభలు ప్లాన్ చేస్తే తాను వచ్చేందుకు సిద్ధమన్నారు.
జానా రెడ్డి వ్యవహారంపై ఆరా తీసిన యువనేత....
మరోవైపు జానా రెడ్డి వ్యవహారంపై యువనేత ఆరా తీసినట్లు సమాచారం. జానా రిటైర్మెంట్, పార్టీ మార్పు వంటి అంశాలకు సంబంధించి... జరుగుతోన్న ప్రచారంపై నేరుగా ఆయన్నే అడిగారని తెలుస్తోంది. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పెద్దాయన స్పష్టం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక డీఎస్‌ పార్టీ మారడంపై అధిష్టానం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని తెలుగురాష్ట్రాల నేతలకు రాహూల్ సూచించారు. మరి యువరాజు వ్యూహాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. 

07:00 - July 16, 2015

హైదరాబాద్: ఛాలెంజ్‌ మరో మెట్టు ఎక్కింది. మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మధ్య సవాల్‌ మరో మలుపు తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖ రాశాడంటూ జూపల్లి ఆరోపించగా.. అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు టీడీపీ నేత రావుల. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పేలిన మాటల తూటాలు.. బహిరంగ సవాల్‌కు దారితీసింది.
సై అంటే సై అనుకున్న ఇద్దరు నేతలు....
సై అంటే సై అనుకున్న ఇద్దరు నేతలు ఎవరికివారు టైం, సెంటర్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. అయితే.. సీన్‌ చర్చ వరకూ వెళ్లకపోగా, మీరే రాలేదంటూ ఇద్దరు నేతలూ మీడియా ముఖంగా మాటల దాడి కొనసాగించారు. ఎన్టీఆర్‌ భవన్‌ కు వస్తానని జూపల్లి రాలేదంటూ రావుల ధ్వజమెత్తగా.. అసెంబ్లీ హాల్లో వేచి చూశానంటూ చెప్పుకొచ్చారు జూపల్లి. ఈ విమర్శల నడుమ మరో అస్త్రం సంధించారు మంత్రి జూపల్లి.
బహిరంగ చర్చకు మరోసారి సవాల్‌ విసిరిన జూపల్లి...
బహిరంగ చర్చకు మరోసారి సవాల్‌ విసిరిన జూపల్లి డేట్‌, టైం ఫిక్స్‌ చేస్తూ.. బహిరంగ లేఖను విడుదల చేశారు. ఖైరతాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌ను రిజర్వు చేసి ఉంచానని, రేపు ఉదయం 10 గంటల నుంచి టీడీపీ నేతల కోసం వేచి చూస్తానని ఆ లేఖలో ప్రకటించారు. ఒక వేళ ఈ ప్లేస్‌ టీడీపీ నేతలకు నచ్చకపోతే.. వారు రమ్మన్న చోటికి రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరి, ఈ సవాల్‌కు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు..? జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తారా..? ఖైరతాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ కు వెళ్తారా..? లేదా..? అన్నది చూడాలి.

06:57 - July 16, 2015

అమరావతి: బుద్దుడు నడయాడిన పుణ్యస్థలం అది. శాతవాహనుల సామ్రాజ్యానికి రాజధానిగాను చరిత్రకెక్కింది. నవ్యాంధ్ర రాజధానిగా ప్రపంచ ప్రసిద్ధి చెంది.. అందరినీ ఎంతో ఆకర్షిస్తోంది అమరావతి. అయితే.. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యంతో అమరావతి అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిధులున్నా... అధికారులు ఖర్చు చేయడం లేదు. రాజధాని పేరుతో అయినా రూపురేఖలు మారేనా అని అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
గౌతముడు నడయాడిన నేల...
అమరావతి.. ఒకప్పుడు గౌతమ బుద్దుడు తిరగాడిన నేల. నాటి శాతవాహనుల పాలన, బుద్దుని ఆనవాళ్లతో ప్రపంచం ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం నవ్యాంధ్ర రాజధానిగా అవతరించడంతో అమరావతి నగరానికి ఎంతో ప్రాముఖ్యత లభించింది. అయితే.. అంతర్జాతీయంగా కీర్తి గడించిన అమరావతి పేరును రాజధానిగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ ప్రాంత అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ అద్భుత కట్టడం వైపు ఏ పాలకులు గానీ.. అధికారులు గానీ కన్నెత్తి చూడటం లేదు. పదేళ్ల కిందట ప్రారంభమైన ధ్యాన బుద్ద ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్దికి నోచుకోవడం లేదు.
అమరావతి అంటే అమరలింగేశ్వర దేవాలయం...
గతంలో అమరావతి అంటే అమరలింగేశ్వర దేవాలయం, మ్యూజియం మాత్రమే గుర్తోచ్చేవి. అయితే ప్రస్తుతం ధ్యాన బుద్దుని ప్రాజెక్ట్ అనేక మందిని ఆకర్షిస్తోంది. అద్భుత కట్టడాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం పక్కన పెడితే.. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును ప్రకటించి త్వరలోనే శంఖుస్థాపన చేయబోతున్న ఏపీ ప్రభుత్వం కూడా ఈ మహా కట్టడం అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. 120 అడుగుల బుద్దుని విగ్రహం బూజు పట్టిపోయి ఉండడం.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మత పెద్దలు సైతంమండిపడుతున్నారు..
రాజధాని అమరావతికి చిహ్నంగా...
రాజధాని అమరావతికి చిహ్నంగా ఉన్న ధ్యాన బుద్ద ప్రాజెక్ట్‌ను పదేళ్లుగా నిర్మాణం చేపడుతున్నారు. అయినా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. నిధులు ఉన్నా వాటిని అమలు చేయడంలో అధికారులు చొరవ చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం హృదయ్‌ పథకం కింద ఇటీవల ప్రకటించిన నగరాల్లో అమరావతి కూడా ఉన్నా ఈ ధ్యాన బుద్దుడు మాత్రం అభివృద్ధి ముఖం చూడలేకపోతున్నాడు. బుద్దుని విగ్రహం చుట్టూ చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న బుద్దుని విగ్రహాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. విశ్రాంతి భవనాలు పూర్తి కాకపోవడంతో అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డగా మారుపోయాయి. బుద్దుని జయంతి వేడుకలను ప్రభుత్వం ఆర్భాటంగా విద్యుత్ కాంతుల నడుమ చేసినా ఆ తర్వాత తో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని చూడడమే మానేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఎంతో ఘనచరిత్ర గలిగి.. నవ్యాంధ్ర రాజధానిగా ప్రసిద్ధి చెందుతున్న అమరావతిలో ధ్యాన బుద్ద ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 

06:54 - July 16, 2015

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, నటుడు సాయికిరణ్‌ తండ్రి.. వి.రామకృష్ణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. సుమారు 2 వందల సినిమాలలో 5 వేలకు పైగా పాటలు పాడారు. ముత్యాల ముగ్గు, అందాల రాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీర శూరకర్ణ వంటి చిత్రాలలో రామకృష్ణ పాటలు పాడారు. అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ 1947 ఆగష్టు 20న విజయనగరంలో జన్మించారు.

06:53 - July 16, 2015

హైదరాబాద్: వాహనదారులకు శుభవార్త. ఇన్నాళ్లు చుక్కలంటిన చమురు ధరలు నేలచూపులు చూశాయి. కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న పెట్రోల్‌, డీజిల్ రేట్లు కాస్త దిగొచ్చాయి. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గాయి.
లీటరు పెట్రోలు, డీజిల్ పై రూ. 2 తగ్గింపు....
లీటర్‌ పెట్రోలుపై 2 రూపాయలు, డీజిల్‌పై 2 రూపాయలు తగ్గిస్తూ...చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధరలు తగ్గుముఖం పట్టడంతోనే... ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
హైదరాబాద్‌లో....
హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయల 11 పైసలు ఉండగా... తాజాగా 73 రూపాయల 11 పైసలైంది. అలాగే లీటర్ డీజిల్ ధర 56 రూపాయల 79 పైసల నుంచి 54 రూపాయల 79 పైసలకు తగ్గింది. స్వల్పంగా తగ్గిన ధరలతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక దేశరాజధానిలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం సామాన్యులపై వ్యాట్ మోత మోగించింది. డీజిల్‌పై 16.6 శాతం, పెట్రోల్‌పై 25 శాతం వ్యాట్‌ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయల 78 పైసలు, లీటర్ డీజిల్‌పై రూపాయి 83 పైసలు పెంచారు.

06:49 - July 16, 2015

ఢిల్లీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం మరో మలుపు తిరిగింది. వ్యాపం కీలక పాత్రధారి సునీల్‌శర్మతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులకు సంబంధాలున్నట్లు బయటపడింది. పలువురు నేతలకు సునీల్‌శర్మ ఎన్నోసార్లు ఆర్ధిక సాయం చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌ సర్కార్‌లోని ప్రముఖుల పేర్లు కూడా బయటపడుతున్నాయి.
వ్యాపం కుంభకోణం కీలక పాత్రధారితో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు సంబంధాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన సుధీర్‌శర్మతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నతస్థాయి నాయకులకు మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. వీరికి అనేక సౌకర్యాలు కల్పించినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. ఎన్నోసార్లు వీరికి కావాల్సిన విమాన టికెట్లతో పాటు ఇతర ఖర్చులను సుధీర్‌శర్మ స్వయంగా భరించినట్లు బయటపడింది. ఒకప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ పాఠశాలలో పనిచేసిన సునీల్‌శర్మ.. 2000 సంవత్సరంలో బీజేపీ నేత లక్ష్మికాంత్‌ శర్మ వద్ద సహాయకుడిగా చేరాడు. ఆ తర్వాత లక్ష్మికాంత్‌ మైనింగ్‌శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సుధీర్‌శర్మ కూడా వ్యాపారంలోకి ప్రవేశించి.. బడా పారిశ్రామికవేత్తగా మారాడు.
సుధీర్‌శర్మ నుంచి సాయం పొందినవారి జాబితాలో అనేకమంది ప్రముఖులు
మైనింగ్‌తో పాటు అనేక ఇతర వ్యాపారాలు ఉన్న ఈ బడాబాబు నుంచి ఆర్ధిక సాయం పొందినవారిలో అనేకమంది ప్రముఖులున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ప్రస్తుత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్‌, మధ్యప్రదేశ్‌ మైనింగ్‌, విద్యాశాఖ మాజీ మంత్రి లక్ష్మికాంత్‌ శర్మ, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాత్‌ ఝా (జా), ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత సురేష్‌ సోని తదితరులున్నట్లు తెలుస్తోంది.
వ్యాపం కుంభకోణంలో 2004లో సుధీర్‌శర్మ అరెస్ట్‌
ఇక 2014లో వ్యాపం కుంభకోణంలో సుధీర్‌శర్మను అరెస్ట్‌ చేశారు. పలువురు నేతలకు సుధీర్‌శర్మ డబ్బులు ఖర్చు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ నివేదికలో వెల్లడైంది. తాజాగా ఈ నివేదికను ఓ ఆంగ్ల చానల్‌ బట్టబయలు చేసింది. దీంతో ఇప్పుడు వ్యాపం కేసు మరో మలుపు తిరిగింది. అయితే సుధీర్‌శర్మను 2014లో అరెస్ట్‌ చేసినా.. విచారణ బాధ్యతలు చేపట్టిన సిట్‌ ఈ నివేదికను గాలికి వదిలేసిందనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారుల జోలికి వెళ్లకుండా సిట్‌ అధికారులు మధ్యప్రదేశ్‌ బీజేపీ సర్కార్‌కు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుధీర్‌శర్మ చేసిన సాయాన్ని నేతలు ఖండిస్తున్నారు. పార్టీపరంగా సుధీర్‌శర్మ వ్యవహారాలు నిర్వహించాడే గానీ.. వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు లేవని వారంటున్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తోనే కాకుండా కాంగ్రెస్‌ నేతలతో కూడా సంబంధాలు
ఇక సుధీర్‌శర్మ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకే కాకుండా.. కాంగ్రెస్‌ నేతలకు సైతం ఆర్ధికంగా సాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కుంభకోణంలో తాజాగా కీలక సూత్రధారితో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు ఉన్న సంబంధాలు బయటపడడంతో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం కన్పిస్తోంది. ఈ వ్యవహారాలు భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. 

06:46 - July 16, 2015

హైదరాబాద్:కశ్మీర్‌ సరిహద్దులో మరోసారి పాకిస్థాన్‌ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అఖ్నూర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ శిబిరంపై బుధవారం ఉదయం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీదేవి అనే మహిళ మరణించగా.. ఇద్దరు బీఎస్ఎఫ్‌ జవాన్లతో సహా ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.                                                              
కాల్పులతో ఉలిక్కిపడ్డ ప్రజలు .....
ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పాక్‌ దుశ్చర్యకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పెద్ద పెద్ద మోటార్లతో కాల్పులకు పాల్పడ్డారని ప్రజలు చెబుతున్నారు.
తమ భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌పై కాల్పులు జరిపినట్లు ప్రకటించిన పాక్‌ ఆర్మీ...
మరోపక్క తమ భూభాగంలోకి భారత నిఘా డ్రోన్‌ వచ్చిందని.. అందుకే కాల్పులు జరిపామని పాక్‌ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను భారత రక్షణ శాఖ తిప్పికొట్టింది. కాగా.. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అఖ్నూర్‌ సెక్టార్‌లో పాక్‌ రేంజర్లు కాల్పులకు పాల్పడడంతో ఆర్మీ సిబ్బంది అప్రమత్తమైంది. అడుగడుగున భద్రతా వ్యవస్థను పెంచింది. ఇక బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా పాక్‌ సైనికుల కాల్పులను తిప్పికొట్టాయి. సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయి. 

06:44 - July 16, 2015

హైదరాబాద్: దక్షిణాఫ్రికాపై వన్డేల్లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. తొలిసారి దక్షిణాఫ్రికాపై బంగ్లా సిరీస్‌ కైవసం చేసుకుంది. చిట్టగాంగ్‌ వన్డేలో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా...9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగా..బంగ్లాదేశ్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 170 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. బంగ్లాదేశ్‌ తన సొంతగడ్డపై వరుసగా జింబాబ్వే, పాకిస్తాన్‌, భారత్‌తో పాటు తాజాగా దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇన్నాళ్లూ పసికూనగా పిలవబడ్డ బంగ్లాదేశ్‌ రెచ్చిపోతూ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. 

06:42 - July 16, 2015

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధ్రుతం అవుతోంది. మరోవైపు ప్రభుత్వానికీ, కార్మికులకీ జరుగుతున్న చర్చల్లో ఇంకా పరిష్కారం లభించలేదు. ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కార్మిక నేతల, కార్మికుల అరెస్టులు సాగుతున్నాయి. ఇంతకీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు? వారి డిమాండ్స్ ఏమిటి? చర్చల్లో ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రభుత్వం నుంచి కార్మికులు తక్షణం ఆశిస్తున్నదేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:40 - July 16, 2015

హైదరాబాద్: మన పట్టణాలు, నగరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నదెవరో తేలిపోయింది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాలిస్తున్న ప్రభుత్వాలకు ఆ కార్యక్రమం పట్ల ఎంత చిత్తశుద్ధి వున్నదో అర్ధమవుతున్నది. స్వచ్ఛ, స్వచ్ఛ, స్వచ్ఛ అంటూ చీపుర్లు పట్టుకుని, మీడియా ఫోటోలకు ఫోజులిచ్చిన రాజకీయ నాయకుల, సినీస్టార్ల, ఇతర సెలబ్రిటీల స్వభావం ఏమిటో స్పష్టమవుతోంది. పరిసరాల పరిశుభ్రతలో రేయింబవళ్లు శ్రమిస్తూ, తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టే కార్మికులు, సిబ్బంది ఇప్పుడు సమ్మెలో వున్నారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. సమ్మె ప్రారంభించిన రెండో రోజు నుంచే చాలా వీధుల్లో నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ చెత్త కుప్పల నుంచి అంటువ్యాధులు బుసలుకొట్టే ప్రమాదం వుంది. ఇప్పుడు మనం ఏ చెత్త కుప్పలను చూసి అంటువ్యాధులు ప్రబలుతాయని భయపడుతున్నామో, ప్రతి రోజూ కొన్ని వేల మంది కార్మికులు ఆ చెత్త కుప్పలను ఎత్తిపారబోసి, మన ఆరోగ్యాలను కాపాడుతున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ ఇప్పుడు అదే కార్మికులు తమకు కనీస వేతనాలివ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ కోరుతూ సమ్మెకు దిగితే, స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాల్గొన్న సెలబ్రెటీలెవ్వరూ నోటిమాటగానైనా సంఘీభావం ప్రకటించేందుకు ముందుకు రాకపోవడం విచిత్రం.

సరే ప్రచారాలకే పరిమితమయ్యే సెలబ్రిటీల సంగతి అలా వుంచితే పరిశుభ్రతే తామ ప్రధమ ప్రాధాన్యత అంటూ ఆకర్షణీయ నినాదాలిస్తున్న ప్రభుత్వం సమ్మె సందర్భంగా అనుసరిస్తున్న వైఖరి విస్మయం కలిగిస్తోంది. సమ్మెకు దిగిన కార్మిక ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించకుండా బెదిరింపు ధోరణితో వెళ్లడం ప్రజాస్వామిక సంప్రదాయం కాదు. కార్మిక నేతలను అరెస్టులు చేయడం, ఉద్యోగాలు పీకేస్తామని బెదిరించడం, పోలీసులను, ఆర్మీని రంగంలోకి దింపుతామంటూ చేసే వ్యాఖ్యలు సమస్యను మరింత జఠిలం చేస్తాయి తప్ప సమస్య పరిష్కారానికి దోహదపడవన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఒక వైపు పట్టణాల్లో, నగరాల్లో చెత్త పేరుకుపోతోంది. మరోవైపు ఇది వర్షాకాలం. ఏ క్షణంలోనైనా వాన కురవొచ్చు. మరోవైపు పుష్కర కోలాహలం నడుస్తోంది. ఇంతకీలకమైన సమస్యలు నాన్చుడు వైఖరితో వ్యవహరించడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు. కార్మి కులు ప్రస్తావిస్తున్న సమస్యలను పరిష్కరించకుండా, వారి న్యాయమైన కోరికలు తీర్చకుండా అదిరించో, బెదిరించో కొందరితో సమ్మెను విరమింపచేసే వ్యూహాలు సత్ఫలితాలివ్వవని గతంలో అనేక సందర్భాలలో రుజువైంది. కాబట్టి, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వివేచనతో వ్యవహరించాలి. తమ ఆరోగ్యాలు పాడవుతున్నా, తమ ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా అవేవీ లెక్కచేయకుండా ప్రతిరోజూ కొన్ని లక్షల టన్నుల వ్యర్ధాలను ఎత్తిపోయడంలోనూ, తరలించడంలోనూ, మురుగు కాలువలు శుభ్రం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల గుండె చప్పుడును, వారి ఆవేదనలనూ ప్రభుత్వాలు ఇప్పటికైనా అర్ధం చేసుకుని సానుకూలంగా స్పందిస్తే అందరికీ మేలు జరుగుతుంది.  

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు...

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 2 తగ్గాయి. పెరిగిన ధరలు గత అర్థరాత్రి నుంచి అమలు అవుతాయి. ఇదిలా వుండగా ఢిల్లీ వ్యాట్/అమ్మకం పన్నును పెట్రోలు పై 20 నుంచి 25 శాతానికి, డీజీల్ పై 12.5 నుండి 16.6 శాతినికి పెంచింది.

రేపు రంజాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్:రంజాన్‌ చివరి శుక్రవారం సందర్భంగా భాగ్యనగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. చార్మినార్‌, శాలిబండ, మూసాబౌలి, గుల్జార్‌హౌస్‌, మీరాలం మార్కెట్‌లలో వాహనాల దారి మళ్లింపు జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ మహంకాళీ రోడ్‌ పూర్తిగా మూసివేసి, బాటా చౌరస్తాలో వాహనాలను దారి మళ్లింపు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కావున వాహనదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు కోరారు.

సినీ గాయకుడు వి.రామకృష్ణ మృతి

హైదరాబాద్: అలనాటి సినీ గాయకుడు వి.రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్ వెంటగిరిలో తుది శ్వాస విడిచారు. ఆయన దాదాపు 200 సినిమాలకు పాటలు పాడారు. ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్తకన్నప్ప, దానవీరశూరకర్ణ, అల్లూరి సీతారామరాజు, పల్లెటూరి బావ వంటి హిట్ చిత్రాలకు ఆయన గాత్రమందించారు.

Don't Miss