Activities calendar

21 July 2015

తలసాని వ్యవహారంలో చర్యలు తీసుకుంటా:గరవ్నర్

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్# వ్యవహారంలో చర్యలు తీసుకుంటానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, తలసాని మంత్రి పదవి రెండు అంశాలు ఉన్నాయన్నారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని గవర్నర్ వారికి వివరించారు. టీటీడీపీ నేతలు తలసాని, ఇతర ఎమ్మెల్యేల వ్యవహారం అంశాలపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ ను కలిశారు.

మట్టేవాడ ఎస్సై సస్పెండ్

వరంగల్: మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఎస్సై ముజాయుద్దీన్ ను వరంగల్ నగర కమిషనర్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు దారుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఎస్సైపై పలుఆరోపణలు రావడంతో ఎస్సైను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

సీబీఐ అధికారుల మెరుపు దాడులు....

గుంటూరు:పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు గురైన బయ్యర్లు, మార్కెట్‌యార్డు సూపర్ వైజర్ల నివాసాలపై సీబీఐ అధికారులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారంతో సీబీఐ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దాడులు చేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముగ్గురు బయ్యర్లు, ఇద్దరు మార్కెట్‌యార్డు సూపర్‌వైజర్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో బయ్యర్లు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యుల నుంచి ఆస్తుల వివరాలు, వారి కుటుంబ నేపధ్యాన్ని నమోదు చేసుకున్నారు.

భద్రాచలంలో పోలీసుల ఓవరాక్షన్....

ఖమ్మ: భద్రాచలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వామివారి దర్శనానికి వెళుతున్న ఐఅండ్‌పీఆర్‌ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో పలువురు పోలీసుల కుటుంబాలను దర్శనానికి అనుమతించడంతో పోలీసుల తీరుపై ఐఅండ్‌పీఆర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు

20:31 - July 21, 2015

అనంతపురం:పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 12 రోజులుగా దీక్ష చేపట్టారు. దీక్షలో ఉండగానే వెంకటనాయుడికి గుండె పోటు రావడంతో తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వెంకట నాయుడు మృతి చెందాడని... మృతుని కుటుంబానికి రూ. 20లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మృతుని కుమాడి బాధ్యతలు తీసుకోవాలని పుట్టపర్తి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వెంకట నాయుడు భార్య, కుమారుడు ఉన్నారు. 20 ఏళ్లుగా వెన్నమ నాయుడు కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తున్నాడని... ఆయన మృతి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మున్సిపల్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాత్రం ఇంత వరకు స్పందించలేదని కార్మికులు, కార్మిక నేతలు, పలువురు మండి పడుతున్నారు. 

పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుల సమ్మెలో విషాదం

అనంతపురం: పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో కాంట్రాక్ట్ కార్మికుడు వెంకట నాయుడు మృతి చెందాడు. వెంకట నాయుడు భార్య, కుమారుడు ఉన్నారు. 20 ఏళ్లుగా వెన్నమ నాయుడు కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తున్నాడని... ఆయన మృతి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మున్సిపల్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

19:55 - July 21, 2015

హైదరాబాద్:చిత్రం అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో కనపడుతున్న నిర్మాణాలు అదరహో అనిపిస్తున్నాయి. అందమైన ఆ అపురూప రాజధానిలో తానుండేది ఎక్కడోనని ప్రతి ఆంధ్రుడు తడిమి చూసుకుంటున్నాడు. టీజర్‌ చూపించి సినిమాకు రప్పించినట్లు.. అద్భుతమైన ప్రజెంటేషన్‌తో మురిపిస్తున్నారు. కాని ఈ కథలో ఎవరి పాత్ర ఏంటో చెప్పడం లేదు. అసలు నిర్మాతెవరో తేల్చడం లేదు. ఎవరిని ఏం చేస్తారో.. ఎవరిని ఎక్కడికి పంపిస్తారో క్లారిటీ లేదు. ఈ కొత్త బంగారు లోకం వెనక ఎన్ని కన్నీటి గాథలుంటాయో.. ఎన్ని విషాదాంతాలుంటాయో అంతుబట్టడం లేదు. ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో హరిశ్చంద్ర ప్రసాద్,రామచంద్రయ్య, కె.ఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. విశ్లేషణాత్మకమైన చర్చను మీరూ చూడాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

గోదావరి తీరంలో బాపు,రమణ, ఎన్టీఆర్ విగ్రహాలు

హైదరాబాద్: గోదావరి తీరంలో బాపు,రమణ, ఎన్టీఆర్ విగ్రహాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

రైలు కిందపడి వృద్ధ దంపతుల ఆత్మహత్య

వరంగల్: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక వృద్ధ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతులు సూసైడ్ నోట్ రాసిపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మాధన్‌శెట్టి చంద్రశేఖర్ (60), సరోజ (55) దంపతులు. వీరితోపాటు చంద్రశేఖర్ సోదరి కమల(65) భర్త చనిపోవడంతో ఇద్దరితో కలిసి ఉంటోంది. మంగళవారం పుష్కరస్నానాలు చేద్దామని ముగ్గురు కలిసి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వరంగల్‌కు వచ్చారు.

వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా తలసాని తప్పించుకోలేరు:గండ్ర

హైదరాబాద్: వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా రాజీనామా వివాదం నుంచి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పించుకోలేరని కాంగ్రెస్ నేత గండ్ర పేర్కొన్నారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీ ఫిరాయించడం లేదని సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు రికమండ్ చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారని గండ్ర ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించారన్నారు. ఈ చట్టాన్ని పరిరక్షించే బాధ్యత స్పీకర్, గవర్నర్#దేనని చెప్పారు. ఎంపీ పదవికి కడియం చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించినప్పుడు..

19:25 - July 21, 2015

విజయవాడ:అసలు అమరావతి ఎలా వుంటుంది.? అన్న ప్రశ్నకు సింగపూర్‌ ప్రతినిధులు 'ఊహా రూపాన్ని' ఇచ్చారు. సీడ్‌ క్యాపిటల్‌కి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ని సీఎం చంద్రబాబుకి సింగపూర్‌ ప్రతినిధి బృందం అందించింది. సింగపూర్‌ ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఏపీ తరఫున ఒక్కరూపాయి కూడా ఇవ్వకపోయినప్పటికీ.. కేవలం.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్న ఉద్దేశంతోనే.. వారు తమంతగా ప్లాన్లు మొత్తం పూర్తి చేసుకుని వచ్చారంటూ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి ప్లాన్‌ చూస్తే ఊహాలోకంలో విహరించాల్సిందే....
ఓ వైపు సింగపూర్‌ బృందం నిర్మించిన అమరావతి యానిమేషన్‌ ఫిల్మ్‌ చూస్తే ఊహాలోకంలో విహరించాల్సిందే. ప్లాన్లు పూర్తయ్యాయి ఇక నిర్మాణానికి సంబంధించిన నిధుల వేట మొదలు కావాలి. రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రజలందరూ ఒక ఇటుకను గానీ, కొంత సొమ్మును గానీ విరాళంగా ఇచ్చి సహకరించాలని..చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఇక్కడే అసలు సంగతి మొదలయ్యేది.
రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ ముఖ్యమైన సమస్య....
2019 నాటికి తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. అయితే, రాజధాని నిర్మాణానికి నిధులు అతి ముఖ్యమైన సమస్య. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి ఏ స్థాయిలో నిధులు ఇస్తుంది.? అన్నదానిపైనే రాజధాని నిర్మాణం ఆధారపడి వుంటుంది. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ, ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కానీ ప్రధాని అయ్యాక మోడీ ఏపీ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వ్యవహారాల్ని గాలి కొదిలేశారు.
పైసా ప్రయోజనం లేకుండా సింగపూర్‌ ప్రభుత్వం ఎందుకు వస్తుంది....
ఇక "ఊరక రారు మహానుభావులు" అన్న తరహాలో సింగపూర్‌ ప్రభుత్వం సహా ఏ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అయినా పెట్టుబడిదారుల ప్రయోజనం లేకుండా పైసా విదల్చరనేది జగమెరిగిన సత్యం. నిధులు చేతుల్లోకి వచ్చే వరకూ అహో అద్భుతం అమరావతి.. అని ఊహా లోకంలో విహరిస్తూ ఆనందించడానికి సింగపూర్‌ అందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఉపయోగపడ్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ప్లాన్‌ ప్రకారం అమరావతి పూర్తయ్యేందుకు 2050 వరకు సమయం పడుతుంది...
అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ సిత్రం బాగానే ఉంది. అయితే ఇందులో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. సింగపూర్‌ ప్రభుత్వం ప్లాన్‌చేసిన విధంగా అమరావతి పూర్తి కావడానికి 2050 వరకు సమయం పడుతుందిట. అంటే ప్రస్తుతం సింగపూర్‌ బృందం చూపించిన ప్లాన్‌ ప్రకారం అమరావతిని చూడాలంటే కొన్ని తరాలు గడవాల్సిందే. కనీసం చంద్రబాబునాయుడు ఆచరణలో చురుగ్గా వ్యవహరిస్తే.. 2019 నాటికి పూర్తయ్యే రాజధాని తొలిదశ నిర్మాణాన్ని చూసి అయినా ఆనందించవచ్చునని జనం అనుకుంటున్నారు. 

19:05 - July 21, 2015

శ్రీకాకుళం: సోంపేట మండలం జాలారు వీధిలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ దాంట్లో పడి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వరకల షణ్ముఖరావు(30), బందరు సురేష్(27) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

సీఎం కేజ్రీవాల్ హద్దుల్లో ఉండు... బిజెపి హెచ్చరిక...

ఢిల్లీ: హద్దుల్లో ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ హెచ్చరికలు జారీ చేసింది. గత వారం నడి రోడ్డుపై 19 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపిన ఘటనపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం, పోలీసు శాఖల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీలోని శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోవడం వల్లే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని కేజ్రీవాల్ మండిపడుతున్నారు. 'శాంతి భద్రతలు మమ్మల్ని (రాష్ట్ర ప్రభుత్వం) నిర్వహించనివ్వండి. లేని పక్షంలో మీరు (కేంద్రం) జోక్యం చేసుకుని నిర్వహించండి.

ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులు లేదు: వెంకయ్యనాయుడు...

హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులు లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విభజన బిల్లులో ఉన్న అంశాలపై టిడిపి నేతలు పట్టుబడుతున్నారని తెలిపారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఉండగా విధాన పరమైన ప్రకటన చేయడం సరికాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విలేకర్లు ప్రస్తావించగా వెంకయ్య దాటవేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు.

గోదావరిలో దిగిన ఇద్దరు యువకులు మృతి

ప.గో: పుష్కరస్నానానికి గోదావరిలో దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతులు పశ్చిమబెంగాల్ వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఏసీబీ వలలో బీసీ సంక్షేమ కార్పొరేషన్ ఈడీ

విశాఖ:జిల్లా డీఆర్#డీఏ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటూ బీసీ సంక్షేమ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.జీవన్#బాబు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్#గా దొరికారు. అంనంతరం జీవన్#బాబును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

కాసేపట్లో భేటీ కానున్న కేంద్ర కేబినెట్

హైదరాబాద్: కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో భూసేకరణ చట్ట సవరణ బిల్లు పై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

యశోద ఆస్పతి పార్కింగ్ లో కారు బీభత్సం...

హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి పార్కింగ్‌లో కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అదే ఆస్పత్రిలో ఉన్న ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

ఏసీబీ వలలో సరూర్ నగర్ సర్వేయర్ యాదగిరి....

హైదరాబాద్ : రూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా సర్వేయర్ యాదగిరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భూ సర్వే కోసం యాదగిరి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి నుంచి రూ. 15 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

స్టీల్ ప్లాంట్ విద్యుత్ షాక్ తో ఇద్దరు మహిళలు మృతి

విశాఖ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్లబ్‌లో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరెంట్ షాక్ తగిలిన వెంటనే వారిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి మహిళలను తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే వారిద్దరూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

18:27 - July 21, 2015

హైదరాబాద్: ప్రజల సమస్యలను కేసీఆర్‌ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో నగర పాలక సంస్థ ఆవరణలో పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాలు చేస్తామని జానారెడ్డి అన్నారు. 

18:25 - July 21, 2015

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రిపై మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ దళిత వ్యతిరేకంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూపిస్తోందని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కకపోవడం విడ్డూరమన్నారు.

18:23 - July 21, 2015

నల్లగొండ:నకిరేకల్ మండలంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. చందుపట్ల గ్రామంలోని పెద్ద చెరువు పనులను పర్యవేక్షించారు. అనంతరం మూసీ డ్యాంను సందర్శించిన హరీష్‌రావు.. అక్కడి గేట్ల మరమ్మత్తు పనులపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మూసీ గేట్ల మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా.. హరీష్‌రావుకు వల్లభాపురం గ్రామస్తుల నిరసన సెగ తగిలింది. తాగునీరు అందించాలన డిమాండ్ చేస్తూ.. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. మూసీ డ్యాం ద్వారా సాగు, తాగు నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపడతామని మంత్రి హరీష్‌రావు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనలను విరమించారు.

 

18:05 - July 21, 2015

హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నందున...పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇన్‌టెక్‌ వెల్స్ నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం....ఇక పైపులైన్లు వేసేందుకు రంగం సిద్దం చేసింది. అందులో భాగంగా నేడో రేపో టెండర్ల ఖరారుకు రంగం సిద్దం చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కేంద్ర సంస్థల నుంచి నిధుల సమీకరణ...
ఇంటింటికి రక్షిత మంచినీరు పథకం తెలంగాణ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు. వచ్చే ఎన్నికల్లోపూ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించకపోతే ఓట్లు అడగమని ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకున్నప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. భారీ ప్రాజెక్టు కావడంతో సుమారు 40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత బడ్జెట్ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు కేంద్ర సంస్థల నుంచి నిధులను సమీకరిస్తోంది.
26 చోట్ల ఇన్‌ టెక్‌ వెల్స్ నిర్మాణం
ఇప్పటికే రెండు బడ్జెట్లు కలిపి నాలుగు వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఇన్ టెక్ వెల్స్ నిర్మాణాన్ని చేపట్టింది. 26 చోట్ల వెల్స్ ను నిర్మించి....దగ్గర్లో పారుతున్న నదులు, కాల్వల ద్వారా నీటిని నింపేందుకు అనువుగా ఈ ఇన్ టెక్ వెల్స్ నిర్మాణం చేపట్టింది. అయితే ఇన్ టెక్స్ వెల్స్ నుంచి ఇంటింటికీ పైపులైన్లు నిర్మించాలంటే వేల కోట్ల ఖర్చవుతుంది. దీంతో నిధుల లేమితో సతమతమయిన వాటర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆ పనులను వాయిదా వేస్తు వచ్చింది.
రుణాలిచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భ్యాంకులు, కేంద్ర సంస్థల ఆసక్తి.....
వాటర్ గ్రిడ్ కు రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటే భ్యాంకులు, కేంద్ర సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే రుణ సదుపాయంపై వడ్డీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం కోరుతోంది. మిగులు బడ్జెట్ రాష్టం అయినందున సకాలంలో అప్పులు చెల్లించే వెసులుబాటు ఉన్నందున అంతర్జాతీయ సంస్తలు ఇచ్చిన విధంగా 3 నుంచి 4 శాతం వడ్డీలకే రుణాలు అందించాలని కోరుతోంది. ఈ దిశగా ఆయా సంస్థలతో సంప్రదింపులు సాగిస్తున్న తెలంగాణ సర్కారుకు నాబార్డు మూడు వేల కోట్లను ఈ నెలాఖరు లోపు అందించేందుకు అంగీకరించింది. దీంతో పైపు లైన్ల పనులను చేపట్టాలని నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. అందుకోసం 34 వేల 563 కోట్ల పనుల టెండర్లను నేడో రేపో పిలిచేందుకు రంగం సిద్దం చేసింది.
కంపెనీల అర్హతలు అనుభవం, ఇతర సాంకేతిక అంశాలు.....
పది రోజుల్లో టెండర్లను ఖరారు చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించింది ప్రభుత్వం. కంపెనీల అర్హతలు అనుభవం, ఇతర సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని పనులను కట్టబెట్టనుంది. అయితే వేల కోట్ల రూపాయాల ప్రాజెక్టు కావడంతో పైపు లైన్ల నిర్మాణ కంపెనీలకు దశల వారిగా నిధులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టాకును పరిశీలించి...ప్రభుత్వం సంతృప్తి చెందితే మొత్తం అమౌంట్ ను ఒకే సారి కాకుండా విడతల వారిగా చెల్లించాలని భావిస్తోంది.
మొత్తం 26 సెగ్మెంట్లలో వాటర్ గ్రిడ్ పైపు లైన్లు......
మొత్తం 26 సెంగ్మెట్లో వాటర్ గ్రిడ్ పైపు లైన్లను వేసేలా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనుంది ప్రభుత్వం. ఇలా 34 వేల కోట్లకు పైబడ్డ ఖర్చుతో నిర్మిస్తున్న లక్షల కిలోమీటర్ల పైపు లైన్లను వచ్చే ఎన్నికల లోపు పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం ఎంత మేర ఫలిస్తుందో చూడాలి.

18:01 - July 21, 2015

హైదరాబాద్: అన్నదాత ఆత్మహత్యలపై ఇప్పటికే టీ.కాంగ్రెస్‌ మండిపడుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తోంది. కాని అది అంతగా వర్కవుట్ అవటం లేదు. తాజాగా టీ.కాంగ్రెస్‌కు మరో బ్రహ్మాస్త్రం దొరికింది. ఎన్ సీఆర్ బీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్లాన్ చేస్తోంది. గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపేందుకు హస్తం నేతలు సిద్ధమవుతున్నారు.
రైతు ఆత్మహత్యలపై టీ.కాంగ్రెస్‌ ఆగ్రహం....
టీఆర్ఎస్‌ పాలనపై కాంగ్రెస్‌ ఏడాది కాలంగా విమర్శలు చేస్తోంది. అంశాల వారీగా సర్కారు తీరును ఎండగడుతూ వస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలపై...సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతేగాక అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రైతు భరోసా యాత్ర కూడా చేశారు. ఏకంగా వారి యువనేత రాహుల్‌గాంధీనే రాష్ట్రానికి రప్పించి...రైతులకు భరోసానిచ్చే కార్యక్రమం చేపట్టింది.
96 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక....
గతంలోనే అసెంబ్లీ వేదికకగా రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్‌ నిలదీసింది. రాష్ట్రంలో 96 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే ప్రభుత్వ లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోదంటూ ఆందోళన కూడా చేశారు. అంతేగాక తప్పుడు లెక్కలతో అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించారని...గవర్నర్‌, రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా ఎన్ సీఆర్ బీ ఇచ్చిన నివేదికతో కాంగ్రెస్‌ నేతలు...తమ దాడిని మరింత తీవ్ర తరం చేశారు.
రైతు ఆత్మహత్యల్లో రెండోస్థానంలో తెలంగాణ
ఎన్ సీఆర్ బీ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 898 రైతులు, 449 మంది రైతులు కూలీలు చనిపోయారు. ఈ నివేదికను ఇపుడు కాంగ్రెస్ నేతలు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు. రాష్ట్రంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటే...కేసీఆర్‌ కేవలం 96 మందే చనిపోయారనటం..సిగ్గుచేటన్నారు. ఈ లెక్కలతోనైనా..కేసీఆర్ కళ్లు తెరవాలని దుయ్యబట్టారు.
టి. కాంగ్రెస్ ఆందోళన...
ఎన్ సీఆర్ బీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని టీ.కాంగ్రెస్ యోచిస్తోంది. అవసరమైతే రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో...ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. అంతేకాకుండా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాల తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు జిల్లాల్లో ఆందోళన చేయాలని ప్లాన్ చేస్తోంది.

17:57 - July 21, 2015

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై సదస్సు జరిగింది. పద్మశాలి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికులతో పాటు సమీప గ్రామాల్లోని ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం కేసీఆర్ స్వంత ప్రయోజనాల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించేందుకు డిజైన్‌లో మార్పులు చేస్తున్నారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే ప్రాజెక్టును.. తమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని వామపక్ష పార్టీలు తీర్మానించాయి. ఇందుకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

17:56 - July 21, 2015

కరీంనగర్ : జగిత్యాలలో విషాదం నెలకొంది. పెర్కపల్లెకి చెందిన యువ రైతు రవి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పొలంలోకి వెళ్లిన రవి... మోటార్‌ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుడి కుటుంబం కన్నీరు మున్నీరైంది.

 

17:55 - July 21, 2015

హైదరాబాద్: అయ్యా దండం పెడతాము మళ్లీ సమ్మె చేయము మమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోండి..తమ పిల్లలు చిన్నవాళ్లు ఆకలికి అలమటిస్తారు. ఉద్యోగం లేకుంటే..తాము ఎలా తినిబతకాలే..అంటూ అధికారుల కాళ్లవేళ్లపడుతున్న వీరంతా.. మొన్న హైదరాబాద్‌లో సమ్మె చేసిన పారిశుద్ధ్య కార్మికులు.
1200 నుంచి 1500 మంది కార్మికుల తొలగింపు....
అయితే వీరు చేసిన తప్పంతా..ఒకటే. సమ్మె సమయంలో సర్కార్ చెప్పినప్పుడు సమ్మె విరమించకపోవడమేనటా..! ఇలా నగరవ్యాప్తంగా దాదాపు 12 వందల నుంచి 15 వందల మంది పారిశుద్ధ్యకార్మికులను సర్కార్ విధుల్లో నుంచి తొలిగించింది. ఇప్పుడు వీరు ఉన్న ఉద్యోగం కోల్పోయారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తమను విధుల్లో చేర్చుకోవాలని చెప్పులరిగేలా...తిరుగుతున్నారు. అయినా..ఏ అధికారి కూడా కనికరించడం లేదు. ఈ విషయం తమ చేతిలోగాని, కమిషనర్‌ చేతిలోగాని లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు. మీ భవిష్యత్‌ ప్రభుత్వం చేతిలో ఉందంటూ.. పంపించేస్తున్నారు.
డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా....
అధికారుల తీరుతో..కార్యాలయాల్లో అలిసిపోయిన కార్మికులు పలు పార్టీల ఆధ్వర్యంలో ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. ఇప్పటికైనా...ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలిగించిన కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

17:52 - July 21, 2015

ఖమ్మం:భద్రాచలంలో పుష్కరాలకొచ్చిన నాగ సాధువులు సందడి చేస్తున్నారు. యోగాసనాలతో హల్‌చల్‌ చేస్తున్నారు. విశ్వశాంతి యజ్ఞం పేరుతో ఏర్పాట్లు చేసుకున్నారు. ఘాట్ల ఏర్పాటుకు, భక్తులకు అవసరమైన సౌకర్యాల విషయంలో వెనకబడ్డ ప్రభుత్వం.. వీరికి మాత్రం కోటిన్నర ఖర్చు పెట్టి బాగానే ఏర్పాట్లు చేసింది. 

చికెన్ బాంబులను తెరపైకి తెచ్చిన ఐఎస్ఐఎస్...

లండన్: ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రత్యర్థులపై దాడికి సరికొత్త వ్యూహా రచనకు శ్రీకారం చుట్టారని సమాచారం. అందులోభాగంగా కోళ్లను ఆయుధాలుగా మలచుకుని ప్రత్యర్థుల ఉసురు తీసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం 'చికెన్ బాంబు'లను తెరపైకి తీసుకు వచ్చింది. ప్రత్యర్థుల వద్దకు బాంబులు అమర్చిన కోళ్లను పంపి రిమోట్ సహాయంతో వాటిని పేల్చివేయాలని ఐఎస్ తీవ్రవాదులు పథక రచనలో ఉన్నారని మీడియా మంగళవారం వెల్లడించింది.

 

16:57 - July 21, 2015

ఢిల్లీ: 1993 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి యాకూబ్‌ మెమెన్‌కు ఉరిశిక్ష ఖరారైంది. యాకుబ్‌మెమెన్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో జూలై 30న యాకుబ్‌ మెమెన్‌కు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మెమెన్‌కు 2007లో టాడాకోర్టు మరణశిక్ష విధించింది. నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న యాకుబ్‌ మెమెన్‌కు అధికారులు అక్కడే ఉరి తీయనున్నారు.

16:56 - July 21, 2015

ఢిల్లీ: లలిత్‌గేట్‌ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధపడ్డా ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఆయన ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ....సుష్మస్వరాజ్‌ వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా విపక్షాలు వినడం లేదని మంత్రి పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్‌ విజ్ఞత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

16:54 - July 21, 2015

హైదరాబాద్: బంగారం ధర మరింత దిగివచ్చింది. ఏడాది క్రితం కొండెక్కి కూచున్న పసిడి ధర... కొంతకాలంగా తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో వరుసగా మూడోరోజూ తక్కువ రేటు పలికింది. 10 గ్రాముల బంగారం 24వేల 949 రూపాయలకు పడిపోయింది. గతంలో 30వేల రూపాయల మార్క్‌ దాటిన బంగారం ఇపుడు నేల చూపు చూస్తుండటం... ఆభరణాలు కొనాలనుకుంటున్న వారికి ఆనందం కలిగిస్తుండగా... బంగారంతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి మింగుడు పడటం లేదు. భవిష్యత్తులో మరింత కనిష్ట ధరకు గోల్డ్‌ పడిపోయే ఛాన్స్‌ వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కొడకండ్లలో విషాదం...

మెదక్ : గజ్వేల్ మండలం కొడకండ్లలో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కూతుర్లను చెరువులోకి తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. తల్లీకుమార్తెల ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మృతులు రాజమ్మ(35), దీప(9), పూజ(5). మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ధర్న చేస్తున్న టి.టిడిపి నేతల అరెస్టు

హైదరాబాద్: మంత్రి వర్గం నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ గేటు వద్ద ధర్నా చేస్తున్న టి.టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

రాజ్ భవన్ గేటు వద్ద టి.టిడిపి ధర్నా

హైదరాబాద్: రాజ్ భవన్ గేటు వద్ద టి.టిడిపి నేతలు ధర్నా చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంలో గవర్నర్ ను సీఎం కేసీఆర్ తప్పుదారి పట్టించారని. సీఎం కేసీఆర్ పై కూడా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను టిటిడిపి నేతలు కోరారు.

16:35 - July 21, 2015

హైదరాబాద్: డిసెంబర్ 16న స్పీకర్ కు రాజీనామా లేఖను అందజేశానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..నేను పార్టీ మారడం పై టిడిపి రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. నా గురించి మాట్లాడే ముందు వారి క్యారెక్టర్ తెలుసుకోవాలి స్పష్టం చేశారు. తనకు రాజకీయ అనుభవం లేనట్టు, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలకే చట్టాలు, నిబంధనలు తెలిసినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. 'నాలుగు సార్లు ప్రజా ప్రతినిధిగా, మూడు సార్లు మంత్రిగా పని చేసిన నాకా వారు చెప్పేది?' అని ఆయన మండిపడ్డారు. తనపై రోజుకోసారి గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకెళ్లి డ్రామాలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ, అవాకులు చవాకులు పేలుతున్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు.  

స్పీకర్ కు రాజీనామా లేఖను అందజేశా:తలసాని

హైదరాబాద్: డిసెంబర్ 16న స్పీకర్ కు రాజీనామా లేఖను అందజేశానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..నేను పార్టీ మారడం పై టిడిపి రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. నా గురించి మాట్లాడే ముందు వారి క్యారెక్టర్ తెలుసుకోవాలి స్పష్టం చేశారు. ఏపీలో మాత్రం వైసీపీ ఎంపీలకు టిడీపీ కండువా కప్పి ఎలా పార్టీలోకి చేర్చుకున్నారని ప్రశ్నించారు. టిడిపికి అక్కడ ఒక నీతి... ఇక్కడ ఒక నీతా అని ప్రశ్నించారు. తాను ఎన్నికలు రెడీ ఉన్నాని... ఎవరు వస్తారో రండి అని సవాల్ విసిరారు. ఉత్తగా నావెంబడపడితే... ఎవరినీ వదిలిపెట్టను అని హెచ్చరించారు.

ప్యాంటీన్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా అనుష్కా శర్మ....

హైదరాబాద్: ప్రముఖ కేశ సంరక్షణ ఉత్పత్తుల సంస్థ ప్యాంటీన్.. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్#గా హీరోయిన్ అనుష్కాశర్మను ఎంచుకుంది. విరాట్ కోహ్లీతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న ఈ భామ.. వివిధ సినిమాల్లో తన అద్భుతమైన లుక్స్#తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను తన జుట్టుతో ప్రయోగాలు చేస్తున్నానని, ఇప్పుడున్న స్టైలు ఉంచేయాలా, ఫ్రింజ్ కట్ చేయించాలా.. లేక రంగు ఏమైనా వేయాలా అని ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఒకసారి ప్యాంటీన్ షాంపూ వాడిన తర్వాత తన జుట్టులో తేడా తనకే తెలిసిందని, అంతకుముందు కంటే ఆరోగ్యంగా, పట్టులా ఉండటంతో.. చాలా సంతోషించానని చెప్పింది.

16:22 - July 21, 2015

హైదరాబాద్: దర్శక,నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం "రుద్రమదేవి" చిత్రంలో కేథరిన్ అనామిక అనే పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రలో కేథరిన్ రాజకుమారిలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన న్యూ లుక్ ను ఇటివలే విడుదల చేసారు.  ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి సినిమాలో ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించడం ఖాయమని అంటున్నారు. 

కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న టి.టిడిపి

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అంశంపై టి.టిడిపి నేతలు గరవ్నర్ నరసింహన్ కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

బాసర గోదావరి వంతెనపై ఆటో దగ్ధం...

ఆదిలాబాద్ : బాసర గోదావరి వంతెనపై ప్రమాదవశాత్తు ఆటో దగ్ధమైంది. ఆటోలో కెమికల్స్ తరలిస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. 

ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ పర్యటించాలి: పల్లె

హైదరాబాద్: ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ నేతలకు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత కుమారుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని నిలదీశారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ ప్రజలకు తీవ్ర నష్టం చేశారని, ఏకపక్షంగా మాటలు విని రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.

15:50 - July 21, 2015

తుళ్లూరు : సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన క్యాపిటల్ మాస్టర్ ప్లాన్... గుంటూరు జిల్లాలో పలు గ్రామాలు మాయం కానున్నాయి. గ్రామాలను తాకకుండా.. డిజైన్ రూపొందించాలని చెప్పినట్టు గతంలో మంత్రులు ప్రకటించినా... ఆచరణ కొచ్చేసరికి మాస్టర్ ప్లాన్ ప్రకారం 5 గ్రామాలు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. డిజైన్ ప్రకారం... జిల్లాలోని తాళ్లాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెంతో పాటు... ప్రభుత్వ కీలక నిర్మాణాల నిర్మాణం జరిగే వెలగపూడి, రాయపూడి గ్రామాలు ఇప్పుడు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని అధికార వర్గాలే చెబుతున్నాయి. తుళ్లూరు పరిసర గ్రామాలపైనా పాక్షికంగా ఈ ప్రభావం ఉంటుంది. 
తాళ్లాయపాలెం పరిధిలో సిటీ గ్యాలరీ, వెట్ ల్యాండ్ పార్క్, కల్చరల్ సెంటర్...
మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణం 16.9 కిలోమీటర్ల మేర ఉండనుంది. ప్రాజెక్టుకు కీలకమైన అమరావతి గేట్ వే భాగం తాళ్లాయపాలెం గ్రామ పరిధిలో ఉంటుంది. ఇక్కడే సిటీ గ్యాలరీ, వెట్ ల్యాండ్ పార్క్, కల్చరల్ సెంటర్, అమరావతి ప్లాజా, యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి. అమరావతి డౌన్ టౌన్ లో... ఉద్ధండరాయుని గ్రామంలో అమరావతి వాటర్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారు. ఉద్ధండరాయిని పాలెం, లింగాయపాలెం నడుమ స్పోర్ట్స్ విలేజ్, బొటానికల్ గార్డెన్స్, రిజీనల్ హాస్పిటల్, కెనాల్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో ప్రభుత్వ కీలక నిర్మాణాలు జరగనున్నాయి.
రాజధాని నిర్మాణంతో....
రాజధాని నిర్మాణంతో తమ భూములకు రేట్లు పెరుగుతాయని అమరావతి వాసులు భావించినా... క్యాపిటల్ ప్లాన్ చూస్తుంటే... ఈ ప్రాంతంలోని గ్రామాలన్ని చరిత్రలో కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మాస్టర్ ప్లాన్ లో ప్రస్తుతానికి 5గ్రామాలే పోతున్నా... నిర్మాణం మొత్తం పూర్తయ్యే సరికి.. ఇంకా ఎన్ని పల్లెలు కనుమరుగు అవుతాయో చూడాలి. 

15:48 - July 21, 2015

హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల పాలన వ్యవస్థను గాడిన పెట్టాలని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా విశ్వవిద్యాలయ చట్టాలు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయాలకు ఒకే వ్యక్తి వీసీగా ఉంటే పర్యవేక్షణ కష్టమవుతోందన్నారు. వీసీలు, రిజిస్ట్రార్‌ల నియామకల మార్గదర్శకాల రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

 

15:46 - July 21, 2015

హైదరాబాద్:కర్నూలు జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికను ఎంపీ బుట్టా రేణుక పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరిస్థితిని చూసిన ఆమె.. కంటతడి పెట్టారు. దారుణమైన ఈ ఘటనను ఖండించిన ఎంపీ.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వ్యవస్థలోను.. చట్టాల్లోను మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అత్యాచార సంఘటనను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తానని బుట్టారేణుక హామీ ఇచ్చారు.

15:43 - July 21, 2015

 

హైదరాబాద్ :లలిత్‌ గేట్‌పై అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కేంద్రమంత్రి సుష్మస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం దీనిపై చర్చకు సిద్ధమని, ఈ విషయంలో సుష్మస్వరాజ్‌ వివరణ ఇస్తారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సభకు తెలిపినా విపక్షాలు పట్టువీడలేదు. మంత్రుల రాజీనామా చేశాకే దీనిపై చర్చ జరుపుతామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ఈ స్కాంపై అత్యున్నత సంస్థతో దర్యాప్తు జరిపించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. 

15:35 - July 21, 2015

హైదరాబాద్: రాణీ రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం రుద్రమదేవి సినిమాలో ముక్తాంబ ప్రాతలో నటిస్తున్న నిత్యా మీనన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గుణ శేఖర్ తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే...

ఈ నెల 30న యాకుబ్ మెమెన్ కు ఉరి శిక్ష...

న్యూఢిల్లీ : వందలాది మందిని పొట్టన పెట్టుకున్న యాకుబ్ మెమెన్(53)కు జులై 30న ఉరిశిక్ష పడనుంది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో మెమెన్ పిటిషన్ దాఖలు చేశారు. మెమెన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా తోసిపుచ్చారు. మెమెన్ ఉరిశిక్షకు సంబంధించి మహారాష్ట్ర సర్కార్ రంగం సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మెమెన్ ను నాగపూర్ సెంట్రల్ జైలు లేదా పుణె ఎరవాడ జైలులో ఉరి తీయనున్నారు.

రేపటికి వాయిదా పడ్డ లోక్ సభ...

న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలి రోజే లలిత్‌గేట్‌పై రాజ్యసభ దద్ధరిల్లింది. లలిత్‌మోడీ వివాదం రాజ్యసభను కుదిపేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సభ నాలుగు సార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సభ రేపటికి వాయిదా పడింది. 

కండ్లకోయ అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్ పర్యటన...

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ ఔటర్‌రింగ్ రోడ్డు పర్యటనకు బయల్దేరారు. ఈ సందర్భంగా కండ్లకోయ నుంచి గుర్రంగూడ వరకు సీఎం పర్యటించనున్నారు. కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాంటేషన్‌ను సీఎం పరిశీలించారు. సీఎం వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

15:15 - July 21, 2015

హైదరాబాద్:సింగపూర్‌ను మించిన రాజధాని కట్టిస్తామన్నారు టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. ఏపీ సీఎం చంద్రబాబుపైఉన్న గౌరవంతోనే సింగపూర్ అధికారులు ఉచితంగా కేపిటల్ ప్లాన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు..ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు .

15:10 - July 21, 2015

రాజమండ్రి: తెలుగు వారు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో భారత్‌లోనే నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లి శక్తి, సామర్థ్యాలు ఉన్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ వల్ల రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లవచ్చన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలికాభివృద్ధి అంశంపై సదస్సు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ర్ట మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. 

టీ20 వరల్డ్ కప్ వేదికలు ఇవే....

హైదరాబాద్ : వచ్చే ఏడాది భారత్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మార్చ్ 11 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ లోని వివిధ నగరాల్లో ఈ టోర్నీలో మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే వేదికలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కోల్ కతా, బెంగళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబై, నాగ్ పూర్, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ప్రకటన విడుదల చేసిన సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ...ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమిస్తున్నందుకు బీసీసీఐ ఎంతగానో గర్విస్తోంది.

ఆటో బోల్తాపడి 17 మందికి గాయాలు...

విశాఖ: నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం గంగవరం గ్రామానికి చెందిన 13 మంది రాజమండ్రి పుష్కరాలను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు నక్కపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాలుగేళ్ల బాలుడి పై బంధువు దాష్టీకం..

విశాఖ: గాజువాకలో నాలుగేళ్ల బాలుడిపై సమీప బంధువు దాష్టీకానికి పాల్పడ్డాడు. అతడి చెయ్యి విరగ్గొట్టి, మర్మాంగంపై వాతలు పెట్టాడు. దీనిపై గుడివాడ పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. ఘటన విశాఖలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మన్నం లక్ష్మి రెండేళ్లుగా భర్తకు దూరంగా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆమెకు ఆశ్రయం ఇస్తామని చెప్పిన సమీప బంధువు.. తనలోని శాడిజాన్ని బాలుడిపై చూపించాడు. బాలుడి చెయ్యి విరగ్గొట్టి, వాతలు పెట్టి ప్రత్యక్ష నరకం చూపించాడు.

14:52 - July 21, 2015

హైదరాబాద్:ఉద్యోగినులు ప్రశాంతంగా పని చేయటానికి కావలసిన పరిస్థితులను యాజమాన్యం కల్పించాలి.. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం అన్ని కార్యాలయాల్లో ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలి. లైంగిక కోరికలు వ్యక్తపరచటం శిక్షార్హమైన లైంగిక వేధింపులేనా? అసభ్య పదజాలాన్ని ఉపయోగించటం లైంగిక వేధింపుల కిందకి వస్తుందా? అశ్లీల సాహిత్యాన్ని చూపించటం, శారీరకంగా తాకడం కూడా లైగిక వేధింపుల కింద వస్తుందా? అన్ని కార్యాలయాల్లో ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలి.. కానీ అలా జరుగుతోందా? ఫిర్యాదు కమిటీలకు మహిళలే నేతృత్వం వహించాలి...అలా జరుగుతోందా? ఫిర్యాదు కమిటీ సభ్యులతో సగం మంది మహిళలే ఉండాలి. కమిటీకి సహకరించడానికి అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇత్యాది అంశాలపై 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రచయిత, డిప్యూటీ డైరెక్టర్ పంచాయితీరాజ్ శాఖ జూపాక సుభద్ర, శ్యామ సుందరి సుప్రీం కోర్టు న్యాయవ్యాది పాల్గొన్నారు. మరి కొంత విశ్లేషణాత్మకమైన చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

జర్నలిస్టుల హెల్త్ కార్డుల ఫైల్ పై కేసీఆర్ సంతకం..

హైదరాబాద్ : రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యకార్డుల దస్త్రంపై సీఎం సంతకం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు త్వరగా అందేలా చూడాలని రమణాచారి, అల్లం నారాయణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

టీఎస్ యూనివర్శీటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని యూనివర్సిటీలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలకు ఒకే వ్యక్తి వీసీగా ఉంటే పర్యవేక్షణ కష్టమవుతోందన్నారు. విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతకు అనుగుణంగా నిపుణుల నియామకం చేపట్టాలన్నారు. వీసీ నియామక అధికారం ప్రభుత్వానికి ఉండాలన్నారు. వీసీలు, రిజిస్ట్రార్‌ల నియామకల మార్గదర్శకాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదయ్యను సీఎం నియమించారు.

తెలంగాణ అమరవీరులకు పిండప్రదానం...

కరీంనగర్ : రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద పుష్కరఘాట్‌లో తెలంగాణ అమరవీరులకు పిండ ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ అని తెలిపారు. అమరవీరులు కూడా తమ కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. పుష్కరాల విషయంలో లగడపాటి రాజగోపాల్ సీఎం కేసీఆర్‌కు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ ఇంటి మనిషినని చెప్పుకునే జీవన్‌రెడ్డి బోర్నపల్లికి వంతెన ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

మరోసారి వాయిదా పడ్డ రాజ్యసభ

ఢిల్లీ: మూడో సారి వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మరో సారి వాయిదా పడింది. లలిత్ మోదీ వ్యవహారం సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఛైర్మన్ సభను 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

లలిత్ మోదీ వ్యవహారంపై చర్చకు సిద్ధం:సుష్మాస్వరాజ్

ఢిల్లీ: ఐపీఎల్ కుంభకోణం సూత్రధారి లలిత్ మోదీ వ్యవహారంపై చర్చకు సిద్ధమని బిజెపి నేత సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం

ఢిల్లీ:మూడు సార్లు వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం అయ్యింది. వ్యాపం కుంభకోణం జరుగుతున్న చర్చలో సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ లలిత్ మోదీ విషయంలో సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుష్మ రాజీనామా చేస్తు సభ సజావుగా జరుగుతుందని తెలిపారు.

వైసీపీ, కాంగ్రెస్ నేతలకు కడుపు మంట: ఎమ్మెల్సీ గాలి...

హైదరాబాద్: రాజధాని మాస్టర్ ప్లాన్ అద్భుతంగా ఉండటంతో వైసీపీ, కాంగ్రెస్ నేతలకు కడుపు మంటగా ఉందని ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు మండి పడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ వైసీపీలో కలిసిపోతుందని ఆరోపించారు. అధికారం వస్తే తాము భూముల్ని కొన్న దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు కలలు కన్నారని విమర్శించారు.

ఢిల్లీలో ఘనంగా బోనాల ఉత్సవాలు....

న్యూఢిల్లీ:హస్తినలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బోనాల ఉత్సవాలకు టీఆర్‌ఎస్ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు బాల్క సుమన్, విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ బోనమెత్తుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఎంపీలు తెలిపారు. తెలంగాణకే సొంతమైన బోనాల ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశానికి పరిచయం చేస్తామని పేర్కొన్నారు. నేటి నుంచి తెలంగాణ భవన్‌ను తెలంగాణ సదన్‌గా పిలుస్తామని ప్రకటించారు.

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి.....

హైదరాబాద్:ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పుష్కరస్నానాలు చేసిన ఎంపి గోకరాజు, ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి

ప.గో: కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో బీజేపీ ఎంపి గోకరాజు గంగరాజు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం...

ముంబై: బాంద్రాలోని ఓ షూ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూమ్‌లో లెదర్, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. ఇక కాసేపు అయితే షోరూమ్ తెరుస్తారనే సమయంలోనే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

ఇందిరాగాంధీ బస్తీలో జీ+2 ఇళ్లు నిర్మిస్తాం:కేసీఆర్

హైదరాబాద్: సనత్ నగర్, కూకటల్ పల్లి పరిధిలోని ఇందిరా నగర్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ జీ+2 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు జీహెచ్ ఎంసీ అధికారులను లే అవుట్ నమూనాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్ పీఎస్ ఎదురుగా ముస్లింలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు. 

బాంద్రా రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం...

ముంబై : బాంద్రా రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. 

అసెంబ్లీలో బీజేపీ - కాంగ్రెస్ నేతల వాగ్వాదం..

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ - కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది.

మోడీకి సీఎం కేజ్రీవాల్ బహిరంగ లేఖ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. శాంతి భద్రతలు..రక్షణ విషయంలో జోక్యం చేసుకోవాలని, లేదా పోలీసు వ్యవస్థను తమకు అప్పగించాలని లేఖలో కోరారు. 

ఇందిరానగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఇందిరానగర్ వాసులపై వరాలు కురిపించారు. మంగళవారం ఆయన ఇందిరానగర్ ను సందర్శించారు. ఇరుకైన రహదారి..ఇరువైపులా ఇళ్లను పరిశీలించారు. ఇక్కడి నివాసులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారని, కనీస వసతులు లేవనీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఇలాంటి బస్తీల్లో సుమారు రెండు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని, వారందరికీ దళ వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇందిరానగర్ లో జీ ప్లస్ టు పద్ధతిలో ఇళ్లు నిర్మించడం జరుగుతుందని, ముస్లింల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు.

పాక్ క్రికెటర్లపై లంక అభిమానుల రాళ్ల దాడి..

శ్రీలంక : దేశంలో పర్యటిస్తున్న పాక్ క్రికెటర్లపై లంక అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాక్ క్రీడాకారులపై రాళ్లు కురిపించారు. లంక అభిమాను దుందుడుకు చర్య కారణంగా మ్యాచ్ కొంతసేపు నిలిచిపోయింది. 

సల్లూ భాయ్ కు ఎదురు దెబ్బ..

ఢిల్లీ : హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. 

13:11 - July 21, 2015

చిత్తూరు : తీవ్ర కలకలం రేపిన శేషాచలం ఎన్ కౌంటర్ లో సాక్షులను సిట్ బృందం ఏపీకి తీసుకరావడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత వైగో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై సీఎం జయలలిత జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు.
ఎన్ కౌంటర్ ప్రదేశానికి సాక్షులు..
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ లో 20 మంది కూలీలను ఎన్ కౌంటర్ కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై సిట్ బృందం విచారణ చేపడుతోంది. మంగళవారం ఉదయం కీలక సాక్షులైన శేఖర్, ఇలంగోవన్, బాలచంద్రలను తిరుపతికి తీసుకొచ్చారు. కానీ పుత్తూరు వద్దకు చేరుకోగానే తాను ఏపీ రాష్ట్రానికి రానని, ప్రాణభయం ఉందని పేర్కొంటూ శేఖర్ మొండికేశాడు. సిట్ అధికారులు ఎంత నచ్చచెప్పినా శేఖర్ వినిపించుకోలేదు. దీనితో ఇలంగోవన్, బాలచంద్రలను తిరుపతికి తీసుకొచ్చారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి తీసుకొచ్చారు. పద్మావతి అతిథి గృహంలో రెండు గంటల పాటు సాక్షులను ప్రశ్నించారు. తాము అడిగిన పలు ప్రశ్నలకు సాక్షులు సమాధానం చెప్పలేదని సిట్ అధికారి రమణకుమార్ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అనుమతితోనే ఏపీకి తీసుక రావడం జరిగిందని తెలిపారు. సాక్షులను ఏపీకి తీసుకరావడంపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగే అవకాశం ఉంది. 

ఏపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు..

హైదరాబాద్ : రాజధాని ప్లాన్ కోసం సింగపూర్ కు లక్ష కోట్ల నజారానా వచ్చిందని, రాజమండ్రి తొక్కిసటాల ఘటన దృష్టి మరల్చేందుకే రాజధానిపై హడావుడి ప్రకటన చేసిందని ఆరోపించారు. సింగపూర్ ప్రభుత్వం టిడిపి నేతలకు మేనమామనా ? ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ ఉచితంగా సేవ చేస్తోందా ? రైతులకు, బడుగులకూ మాస్టర్ ప్లాన్ లో చోటెక్కడా ? రాజధానికి భూములు ఇచ్చిన రైతుల బాధలు పట్టావా ? రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదా ? సింగపూర్ దా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరిట సమస్యలపై దృష్టి మళ్లిస్తున్నారని, రాజధాని సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు.

రేపు కాంగ్రెస్ మౌన ప్రదర్శన..

ఢిల్లీ : వ్యాపం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం పార్లమెంట్ లో కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. గాంధీ విగ్రహం ఎదుట సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మౌన ప్రదర్శన చేయనున్నారు. 

పుష్కరాల ప్రచారంపై వేసిన పిల్ ను తోసిపుచ్చిన హైకోర్టు..

హైదరాబాద్ : పుష్కరాల ప్రచారంపై చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది

రంగారెడ్డి జిల్లా కోర్టుకు భత్కల్..

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. 

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం

హైదరాబాద్ : ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరిగింది. అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

 

12:26 - July 21, 2015

రాజమండ్రి : పుష్కరస్నానం చేయడానికి వచ్చిన ఓ గర్భిణీ ప్రసవించింది. ఈ ఘటన రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ వద్ద చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన యశోద ఎనిమిది నెలల గర్భిణీ. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి కోటి లింగాల ఘాట్ లో పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని ప్రసవం చేశారు. తల్లి క్షేమంగా ఉందని, బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

12:20 - July 21, 2015

విజయవాడ : అలనాటి మేటి నటి కనకం (92) కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే మేనల్లుడు మృతి చెందడంతో కనకం దిగులుతో మంచాన పడ్డారు. రెండు రోజుల క్రితం కోమాలోకి వెళ్లిన ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పాతాళ భైరవి, కీలుగుర్రం, గృహప్రవేశం హిట్ చిత్రాలతో పాటు 20కిపైగా సినిమాల్లో కనకం ప్రధాన పాత్ర పోషించారు. తండ్రి ప్రోత్సాహంతోనే కనకం సినిమాల్లో ప్రవేశించారు. గీతాంజలి, జమున, సావిత్రిలాంటి అగ్ర నటీమణులతో కలిసి ఆమె నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, నాగయ్య వంటి హీరోలతో కూడా నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆమె శేష జీవితం అంతా ఆర్థిక ఇబ్బందులతోనే గడిచింది. తుది శ్వాస విడిచే వరకు ఆమె బెజ్జోలిపేటలోని కూతురు అనురాధా ఇంట్లోనే ఉన్నారు. కనకం మృతి చెందినట్లు తెలుసుకున్న జము, రోజా రమణి ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. మరోవైపు కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా ఉన్న బెజవాడలో వందలాది కళాకారులున్నా ఇంతవరకు రాజకీయ నాయకులు, కళాకారులు కనీసం ఆమె మృతిపై స్పందించలేదు. సాయంత్రం కనమ్మ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంసభ్యులు పేర్కొన్నారు. 

12:19 - July 21, 2015

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలోని హామీల అమలు కోసం తమ వాణిని పార్లమెంట్ లో వినిపిస్తామని టిడిపి ఎంపీ తోట నర్సింహం పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రణాళిక బద్దంగా వెళుతామని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధాన మంత్రి దృష్టికి తీసుకరావడం జరిగిందన్నారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 

12:17 - July 21, 2015

ఢిల్లీ : పార్లమెంట్ లో లభిస్తున్న సబ్సిడీ ఆహార పదార్థాలను ఎంపీలు మాత్రమే తినడం లేదని స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. క్యాంటీన్ లో సబ్సిడీని ఎంపీలేగాకుండా జర్నలిస్టులు, పార్లమెంట్ సిబ్బంది, అతిధులు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఐదేళ్లుగా పార్లమెంట్ లో ఆహార పదార్థాలపై లభించిన సబ్సిడీ విలువ రూ.60 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

భోపాల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన..

భోపాల్ : వ్యాపం స్కాంను నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

 

11:34 - July 21, 2015

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లొల్లి చెలరేగింది. అధికార..ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలాయి. లలిత్ మోడీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీనిపై రాద్ధాంతం చేయవద్దంటూ స్పీకర్ పలు మార్లు సూచించినా సభ్యులు పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మధ్యలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారాంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానం చెబుతారని జైట్లీ వెల్లడించారు. అయినా సభలో గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ మధ్యాహ్నాం 12గంటలకు వాయిదా వేశారు. 

రాజ్యసభలో గందరగోళం.

ఢిల్లీ : రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. లలిత్ మోడీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గందరగోళం నెలకొనడంతో మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. 

11:21 - July 21, 2015

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ కడియం శ్రీహరి రాజీనామా చేశారని, దీనిని ఆమోదిస్తున్నట్లు స్పీకర్ సుమిత్ర మహజన్ సభకు తెలిపారు. అలాగే ఇటీవల మృతి చెందిన పలువురు ఎంపీలకు సభ నివాళులర్పించింది. అనంతరం సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. 
నిలదీసేందుకు విపక్షాల సిద్ధం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికారపక్షాన్ని నిలదీసేందుకు విపక్షం సిద్ధమౌతోంది. సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ ల వ్యవహారాంపై సభా కార్యకలాపాలు స్తంభించే అవకాశాలున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు పదవుల నుండి దిగకపోతే, పార్లమెంట్ సమావేశాలు జరిగినిచ్చేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేయగా ఎలాంటి రాజీనామాలు ఉండవని, హెచ్చరికలు చేయలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో ఇరుపక్షాల మధ్య అఖఙలపక్షంలోనే ప్రతిష్టంభన మొందలైనట్లైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షం సహకారాన్ని కోరుతూ ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు. పార్లమెంట్ సజావుగా సాగడం అందరి భాద్యత అని గుర్తు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా నడుస్తున్న సెక్షన్ 8 అంశాన్ని తెలుగు ఎంపీలు లేవనెత్తే అవకాశం ఉంది. 

సుష్మా..వసుంధరలను తప్పించాలి - మాయావతి..

ఢిల్లీ : సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలను కేంద్ర ప్రభుత్వం తప్పించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. లలిత్ మోడీ వ్యవహారాం సీరియస్ ఇష్యూ అని ఆమె తెలిపారు. 

ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఫలితాలు..

ముంబై : ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 49 శాతం వృద్ధితో ఇన్ఫోసిస్ రూ.3,030 కోట్ల నికరలాభం ఆర్జించింది. 

అఖిలేష్ గుడ్ సీఎం - సాక్షి మహరాజ్..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంచి ముఖ్యమంత్రి అని బీజేపీ నేత సాక్షి మహరాజ్ పేర్కొన్నారు. కానీ సీనియర్ మంత్రి అయిన ఆజంఖాన్ ఆయనకు విసుగు తెప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

సమావేశాల్లో మంచి నిర్ణయాలు - మోడీ..

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మంచి నిర్ణయాలు జరిగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 

10:37 - July 21, 2015

వరంగల్ : జిల్లాలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేట గణేష్ నగర్ కు చెందిన చంద్రశేఖర్, తన సోదరి కమల, భార్య సరోజతో కలిసి సోమవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. మంగళవారం ఉదయం అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న వీరు వేగంగా వస్తున్న నవ జీవన్ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడిపోయారు. దీనితో సరోజ, చంద్రశేఖర్ లు అక్కడికక్కడనే మృతి చెందగా కమల తీవ్రంగా గాయపడింది. ఆమెను ఏంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

 

10:30 - July 21, 2015

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కరాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తుండడం జేబు దొంగలకు వరంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ సొమ్ము పోయిందని తెలుసుకున్న భక్తులు లబోదిబోమంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 24 కాసుల బంగారాన్ని దోచుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. పుష్కరఘాట్ లో భక్తులు పుణ్యస్నానాలాచరిస్తున్నారు. గడిచిన ఏడు రోజుల్లో 84 లక్షల మంది స్నానాలు ఆచరించినట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నారు. 

ఏసీబీ కోర్టుకు హాజరైన సండ్ర..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఇటీవలే అరెస్టయి షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. 

లోక్ సభ స్పీకర్ ను కలువనున్న కేంద్ర మంత్రులు..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30గంటలకు లోక్ సభ స్పీకర్ సమిత్రా మహజన్ ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు కలువనున్నారు. 

09:55 - July 21, 2015

కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర బృందం వరుసగా పోస్టర్లు విడుదల చేస్తోంది. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడి పాత్రలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, మహామంత్రి శివ దేవయ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌లు నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. 

09:54 - July 21, 2015

ప్రముఖ సినీ నటుడు నాగార్జున తనయుడు 'అఖిల్' నటిస్తున్న తాజా చిత్రం టీజర్ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. అలాగే టీజర్ ని విడుదల చేయటానికి తేదీని ఫిక్స్ చేసారు. తండ్రి అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అంటే..ఆగస్టు 29న టీజర్ విడుదల చేయనున్నారు. అదే రోజున ఈ చిత్రానికి పెట్టే టైటిల్ ను కూడా ప్రకటించనున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. యువ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 

09:52 - July 21, 2015

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు' త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీక్షిస్తారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారని టాక్. అందమైన బాల్యాన్ని మరిచిపోలేని స్నేహాన్ని వదులుకోలేని జ్ఞాపకాలను మనకిచ్చిన మన సొంత ఊరుకు మనం పెద్ద అయ్యాక ఏమి చేస్తున్నాం అని ప్రశ్నించే కథాంశంతో 'శ్రీమంతుడు' చిత్రం రూపొందింది. ఊరు దత్తత అన్న కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి మోడీకి ఈ సినిమా నచ్చుతుందనే ఉద్దేశ్యంతో ఆయన కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ఈ సినిమా దర్శక నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మహేష్ బావ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ సహకారాన్ని కూడ ఈ సినిమా దర్శక నిర్మాతలు తీసుకుంటున్నట్లు టాక్. 

పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ భంగం కలిగిస్తోంది - నఖ్వీ..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని కేంద్ర మంత్రి నఖ్వీ పేర్కొన్నారు. కానీ సమావేశాలను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఓ జాతీయ ఛానెల్ తో నఖ్వీ పేర్కొన్నారు. 

అన్ని అంశాలపై చర్చిస్తాం - వెంకయ్య నాయుడు..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలో ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చిస్తుందని, ఎలాంటి దాచేయత్నం చేయడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

 

09:17 - July 21, 2015

తూర్పుగోదావరి : జిల్లా బెండపూడి వై జంక్షన్ వద్ద ఓ లారీ రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు గోపిశెట్టి నారాయణరావు, పాపన రాముగా గుర్తించారు. గాయాలకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థిలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశంలో..
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురంలో ఎస్ఆర్ఎం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. బస్సు చెన్నైకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ మృతి చెందగా నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రైలు కింద పడి ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యాయత్నం..

వరంగల్ : అండర్ బ్రిడ్జ్ వద్ద రైలు కింద పడి ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పుల బాధే కారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. మృతులు మెదక్ జిల్లా సిద్ధిపేట వాసులుగా గుర్తించారు. 

అలనాటి నటి టి.కనకం కన్నుమూత..

హైదరాబాద్ : సినీ నటి టి.కనకం (88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కీలుగుర్రం, గృహ ప్రవేశం, షావుకారు, పాతాళ భైవరి తదితర సినిమాల్లో కనకం నటించారు. ఈమె 1930లో విజయవాడలో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు కనకం జన్మించారు.

తణుకు టోల్ గేట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్.

పశ్చిమగోదావరి : తణుకు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 

ఆగ్రాలో లవ్ జిహాదీలపై భజరంగ్ దళ్ ప్రచారం..

ఉత్తర్ ప్రదేశ్ : లవ్ జిహాద్ లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆగ్రాలో లవ్ జిహాదీలపై ప్రచురించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షం..

ఉత్తరాఖండ్ : భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. 

08:32 - July 21, 2015

కార్మిక చట్టాలు అమలు చేస్తే చాలా ప్రమాదకరమని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. టెన్ టివిలో గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో కార్మిక చట్టాల సవరణ..ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం..పార్లమెంట్ సమావేశాలు..వంటి అంశాలపై ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే...
''కార్మిక చట్టాలు అడ్డంగా వస్తున్నాయని పారిశ్రామిక అధిపతులు పేర్కొంటున్నారు. పరిశ్రమలు బాగా నడవలేకపోతే ఎలా వ్యవహరించాలి ? కార్మికులను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు..ఎప్పుడైనా తీసేయవచ్చు అనే ధోరణిలో యాజమాన్యాలు ఉంటున్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టం, కాంట్రాక్టు కార్మికుల నిషేధ నియంత్రణ చట్టం సవరించి స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొంటున్నాయి. అమెరికాలాంటి దేశాల్లో ఇలాంటి విధానం ఉంది. దేశ ఆర్తిక వ్యవస్థ, సమాజం ఎంటో చూడాలి. లాభం రానప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వడం..బోనస్..వారి స్థితి గతులు ఎలా చూడాలని వారు పేర్కొనడం సబబుగానే ఉంది. కానీ ఇక్కడ పారిశ్రామిక రంగ స్వభావం..దేశ ఆర్థిక వ్యవస్థ చూడాలి. అమెరికాలో పర్మినెంట్ ఉద్యోగి కన్నా కాంట్రాక్టుగా పనిచేసే కార్మికుడి జీతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. అమెరికాలో కార్మికుడికి సోషల్ సెక్యూర్టీ ఉంది. ఇక్కడ ఉందా ? కార్పొరేట్ రంగం బాధ్యాతాయుతంగా ఉందా ? స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందా ? బలమైన సామాజిక భద్రత ఉందా ? పారిశ్రామిక అశాంతి కలుగ చేస్తుంది. కార్మిక చట్టాలు అమలు చేస్తే చాలా ప్రమాదకరం'' అని పేర్కొన్నారు. అలాగే ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం..పార్లమెంట్ సమావేశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. 

ఒడిశాలో మావోయిస్టుల ప్రజాకోర్టు..

ఒడిశా : మల్కన్ గిరిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించింది. 11 మంది పోలీసు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్నారని మావోయిస్టు నేతలు ఆరోపించారు. మళ్లీ ఇదే పునరావృతం అయితే చంపేస్తామని మావోయిస్టులు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. 

08:07 - July 21, 2015

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు భాషల్లో డైలాగ్స్ పలికి అలరించారు. టీఎస్సార్, టీవీ9 అవార్డుల ప్రదానోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. పృథ్వీ రాజ్ కపూర్ మనవడు రిషికపూర్‌తో తనకు పరిచయం, స్నేహం ఉన్నాయని పేర్కొన్నారు. హిందీ, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లోని ఆయన డైలాగులకు అభిమానులు చప్పట్లు కొట్టారు. 

07:58 - July 21, 2015

సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్లలో సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాను చివరిది. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంది. మరోవైపు తలసాని బర్తరఫ్ కు ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి. కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం కింద కోరగా ఆయన రాజీనామా చేయలేదు అని అసెంబ్లీ తెలిపింది. దీనితో తలసాని రాజీనామాపై ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి పెంచాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), ఎస్. కుమార్ (బీజేపీ), జీవన్ రెడ్డి (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

లోయలో పడిన వాహనం..ముగ్గురి మృతి..

విశాఖపట్టణం : గోదావరి పుష్కరాలకు యాత్రీకులతో వెళ్లిన ఓ టాటా ఎస్ వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కె.కోటపాడు మండలం వి.సంతపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతగులు విజయనగరం జిల్లా వేపాడు మండలం సింగరయ్య గ్రామ వాసులుగా గుర్తించారు.

07:26 - July 21, 2015

ఫిలిం ఇండస్ట్రీ ఆ నలుగురిదే అని మరోసారి తేలిపోయింది. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకునే నాలుగు సెక్టార్లలో వాళ్లే ఉండటం వల్ల మళ్లీ ఛాంబర్ అధ్యక్ష పదవి ఆ టీమ్ కే దక్కింది. వందలాది థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని టాలీవుడ్ లో నియంతృత్వం కొనసాగిస్తున్న సురేష్ బాబు ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

07:25 - July 21, 2015

ఇంటర్ నేషనల్ లెవల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ వీడియో గేమ్ సీరిస్ 'హిట్ మేన్' ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'హిట్ మేన్.. హిట్ మేన్ ఏజెంట్ 47' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలెగ్జాండర్ దర్శకుడు. ట్వంటియత్ సెంచురీ ఫాక్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

07:24 - July 21, 2015

మంచి కథలు వస్తే తమిళంలో నటిస్తానని సినీ నటుడు ప్రభాస్‌ ప్రకటించారు. నేషనల్ లెవల్ లో బాహుబలి ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ తరువాత ప్రెస్ మీట్ లకు హాజరు కానీ చిత్ర యూనిట్ తాజాగా చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, శివగామి రమ్యకృష్ణ, తమిళ దర్శకులు రాజేష్‌, లింగుసామి, నిర్మాతలు టి.శివ, సీవీ కుమార్‌ తదితరులు పాల్గొని ‘బాహుబలి’ని ప్రశంసలతో ముంచెత్తారు. తొలి చిత్రంతోనే తనను ఆశీర్వదించిన తమిళ ప్రేక్షకులకు ప్రభాస్ కృతజ్ఞతలు చెప్పారు.

ఎనిమిదో రోజు పుష్కరాలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల్లో పుష్కరాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజాము నుండే పుష్కర ఘాట్ లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి, కోటలింగాల ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నర్సాపురం, సిద్ధాంతం ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం, బాసరలో భక్తులు పోటెత్తారు. 

07:03 - July 21, 2015

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది దాటింది. రైతులకు రుణమాఫీలాంటి చక్కటి వాగ్దానాలిచ్చి, అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్నదాతకు బ్యాంక్‌లో అప్పు పుట్టని పరిస్థితిని సృష్టించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు చోట్లా అన్నదాత కష్టాలు ఒక్కటే. చుక్క చినుకు లేదు. తొలకరిలో మేఘాలు ఒలకపోసిన నీళ్లను చూసి, విత్తనాలు చల్లినవారికి కన్నీళ్లే మిగిలాయి. చాలాచోట్ల గింజలు మాడిపోయాయి. మొలకలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు భగీరధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల ఉన్న కొద్ది నీళ్లను పుష్కరాలకు మళ్లించడంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మరోవైపు బ్యాంక్‌ల్లో రైతులకు అప్పులు దొరకడం లేదు. రుణమాఫీ హామీని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం, మొత్తం ఏకమొత్తంగా మాఫీ చేయకపోవడం, బ్యాంక్‌లు తిరిగి రైతులకు రుణాలిచ్చేలా చర్యలు తీసుకోకపోవడం అన్నదాతకు శాపంగా మారింది.
ఆర్బీఐ మార్గదర్శకాలు..
నిజానికి ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్‌లిచ్చే రుణాల్లో కనీసం 18 శాతమైనా రైతులకు ఇవ్వాల్సి వుంది. కానీ, అందులో సగం కూడా ఇవ్వని దైన్యం. బ్యాంక్‌లు ఆర్‌బీఐ మార్గదర్శకాలు నిక్కచ్చిగా పాటిస్తే ఒక్క తెలంగాణలోనే రైతులకు 59వేల కోట్ల రూపాయల రుణాలివ్వాల్సి వుంటుంది. కానీ, ఈ ఏడాది కేవలం 23వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొచ్చారు. గత ఏడాది అనుభవం మరింత దారుణంగా వుంది. 18వేల కోట్ల రూపాయల రుణాలిస్తామన్న బ్యాంకర్లు బుక్‌ అడ్జస్ట్ మెంట్లతోనే సరిపుచ్చారు.
4250 కోట్ల రూపాయలు ఇచ్చిన టి.సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం రుణమాఫీ కింద 4250 కోట్ల రూపాయలు బ్యాంక్‌లకిచ్చింది. ఇందులో అత్యధికభాగం వడ్డీలకే పోయింది. దీంతో రైతుల అసలు అప్పు తీరలేదు. కొత్త అప్పులు పుట్టలేదు. కేవలం 7800 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే ఇచ్చిన బ్యాంక్‌లు బుక్‌ ఎడ్జస్ట్‌ లు చేసి, 18వేల కోట్ల రూపాయలిచ్చినట్టు లెక్కలు చూపించాయి. దీంతో బ్యాంక్‌ అప్పుపుట్టని రైతులు ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయిదు నుంచి పది రూపాయల దాకా వడ్డీ కట్టాల్సి వస్తోంది. దీంతో రుణగ్రస్తత మరింత పెరిగి, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి మరింత పెరిగింది. ఇప్పుడు కాలం అసలే బాగోలేదు. వాతావరణం కలవరపెడుతోంది. ఎప్పుడు చినుకుపడుతుందా? అని రైతులు కళ్లు కాయలకాసేలా ఎదురుచూస్తున్నారు. వేసిన పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వమూ, బ్యాంకర్లు న్యాయంగా వ్యవహరించకపోతే ఇక రైతులకు దిక్కెవరు? 

07:02 - July 21, 2015

కాలం కరిగిపోతోంది. ఆగస్టు నెల వస్తున్నా ఒక్క గట్టివర్షమైనా కురవలేదు. మరోవైపు రైతులకు బ్యాంక్‌లో అప్పులు పుట్టడం లేదు. రైతుల ఆత్మహత్యలూ ఆగడం లేదు. అన్నదాతను కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? రైతుల బాధలు తొలగాలంటే ప్రభుత్వాలు తక్షణం ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో రైతు సంఘం నేత విశ్వేశ్వరరావు మాట్లాడారు. 

06:44 - July 21, 2015

శ్రీలంక : భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. పాకిస్థాన్‌ విజయాన్ని సెలెబ్రేట్‌ చేసుకుంది. భర్త షోయబ్‌ మాలిక్‌తో పాటు పాక్‌ ఆటగాళ్లతో కలిసి "అభీతో పార్టీ షురూ హుయీ హై'' అనే బాలీవుడ్‌ పాటకు స్టెప్పులేసింది. శ్రీలంక- పాకిస్తాన్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు లంకకు చేరిన సానియామీర్జా.. మూడో వన్డేలో పాక్‌ 135 పరుగులతో లంకపై ఘన విజయం సాధించింది. 29 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు చేసిన షోయబ్‌ పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత షోయబ్‌, సానియా ఇద్దరూ డ్యాన్స్ చేసి సందడి చేశారు. పాక్‌ ఆటగాళ్లు అదిలీ, అజామ్‌, ముక్తర్‌ అహ్మద్‌, ఇర్ఫాన్‌ కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. 

06:43 - July 21, 2015

హైదరాబాద్ : ప్రొ.కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ విజయాల జోరు కొనసాగుతోంది. పూణె పల్టాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు 45-24 తేడాతో ఘన విజయం సాధించారు. తెలుగు టీమ్‌ తిరుగులేని ప్రదర్శనతో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి అర్ధ భాగంలో 13-14తో వెనకబడిన తెలుగు జట్టు.. సెకండాఫ్‌లో విజృంభించింది. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి 10, దీపక్‌ 6 రైడింగ్‌ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక పూణె జట్టులో కెప్టెన్‌ వజీర్‌ సింగ్‌ 7, యోగేశ్‌ హుడా 6 రైడింగ్‌ పాయింట్లు సాధించినా ఓటమి తప్పలేదు.

 

06:42 - July 21, 2015

ఢిల్లీ : ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, పంజాబ్‌లలో భారీ వర్షాలతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లో వరదలు పోటెత్తుతున్నాయి. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భోపాల్‌, ఇండోర్‌, ఉజ్జయిని నగరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఉజ్జయిని నగరంలో సిప్రా నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాంలోని జనావాసాలను వరద నీరు ముంచెత్తింది. నది సమీపంలోని మహాంకాళీ ఆలయం నీటిలో మునిగిపోయింది.
పది మంది మృతి..
మధ్యప్రదేశ్‌లో వరద బీభత్సానికి సుమారు పది మంది వరకు మృతి చెందినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉజ్జయిని లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వరద ప్రాభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 2లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఇదిలా ఉంటే సిప్రా నది ప్రమాద స్థాయి కన్నా 5 అడుగులు ఎక్కువగా ప్రవహిస్తోంది.
చండీగఢ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం..
మధ్య ప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, హర్యానాల్లో సైతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా చండీగఢ్‌లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హర్యానాలోని అంబాలా, పంచ్‌కులా, కర్నాల్‌లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్‌, యూపీల్లో సైతం భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. ఉత్తరభారత్‌ లో రుతుపవనాల ప్రభావంతో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

06:37 - July 21, 2015

హైదరాబాద్ : కార్మికుల సమస్యలపై వామపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై సమరశంఖం పూరించాయి. కార్మికుల సమ్మెకు మద్దతుగా బస్సు యాత్రను చేపట్టాయి. యాత్రలో సీపీఎం, సీపీఐ సహా పది వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. నల్గొండలో బస్సు యాత్ర ప్రారంభ సభ జరిగింది. ఐదు రోజుల పాటు తొమ్మిది జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి బస్సు బయలు దేరింది. నల్గొండలో బస్సుయాత్ర ప్రారంభ సభ జరిగింది. ఐదురోజుల పాటు హైదరాబాద్‌ మినహా తెలంగాణ అన్ని జిల్లాల్లో ఈ యాత్ర సాగనుంది.
24న ఇందిరాపార్క్ దగ్గర ముగింపు సభ..
యాత్రలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి సహా ఇతర వామపక్షాల నేతలు పాల్గొంటున్నారు. ఈ నెల 20న నల్గొండ, ఖమ్మం జిల్లాల గుండా తర్వాత 21న వరంగల్‌, కరీంనగర్‌, 22న ఆదిలాబాద్, నిజామాబాద్, 23న మెదక్, మహబూబ్‌నగర్, 24న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ మీదుగా సాగనుంది. తిరిగి ఈ నెల 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ కు చేరుకుని...అక్కడ ముగింపు సభ జరగనుంది.
ప్రభుత్వ తీరుపై తమ్మినేని ఆగ్రహం..
కేసీఆర్‌ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాల కోసం కార్మికులు 25 రోజులుగా సమ్మె చేస్తున్నా...ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. సమ్మెను అణచివేసే ధోరణి మానుకొని...కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా ఉన్నామని చెప్పేందుకే...బస్సు యాత్ర చేస్తున్నట్లు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచితే సరిపోదని..రాష్ట్రంలోని కార్మికులందరికీ పెంచాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లో..బహిరంగసభలు జరుగుతాయి. బస్సు యాత్ర ముగిసే లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే....మరో ప్రత్యక్ష పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని వామపక్ష నేతలు తేల్చి చెప్పారు.

06:35 - July 21, 2015

హైదరాబాద్ : ''అయ్యా దండం పెడతాము మళ్లీ సమ్మె చేయము మమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోండి..తమ పిల్లలు చిన్నవాళ్లు ఆకలికి అలమటిస్తారు. ఉద్యోగం లేకుంటే..తాము ఎలా తినిబతకాలే''..అంటూ అధికారుల కాళ్లవేళ్లపడుతున్నారు. వీరంతా ఇటీవల మున్సిపల్ సమ్మెలో పాల్గొన్నారు. వేతనం పెంచాల్సిన సర్కార్‌ వారికి ఉన్న ఉద్యోగం ఊడపీకింది. దీంతో...ఇప్పుడు వారంతా రొడ్డునపడి బోరున విలపిస్తున్నారు. నగరవ్యాప్తంగా దాదాపు 12 వందల నుంచి 15 వందల మంది పారిశుద్ధ్య కార్మికులను సర్కార్ విధుల్లో నుంచి తొలిగించింది.
కనికరించని అధికారులు...
ఇప్పుడు వీరు ఉన్న ఉద్యోగం కోల్పోయారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తమను విధుల్లో చేర్చుకోవాలని చెప్పులరిగేలా...తిరుగుతున్నారు. అయినా..ఏ అధికారి కూడా కనికరించడం లేదు. ఈ విషయం తమ చేతిలోగాని, కమిషనర్‌ చేతిలోగాని లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు. మీ భవిష్యత్‌ ప్రభుత్వం చేతిలో ఉందంటూ.. పంపించేస్తున్నారు. అధికారుల తీరుతో..కార్యాలయాల్లో అలిసిపోయిన కార్మికులు పలు పార్టీల ఆధ్వర్యంలో ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు.
ఇప్పటికైనా...ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలిగించిన కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

06:33 - July 21, 2015

హైద్రాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్ల ఏరివేతపై సర్కార్‌ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ కార్డుకు ఆధార్‌తో అనుసంధానాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. దాన్ని 20 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్‌ సీఎంతో భేటీ అయ్యారు. హైద్రాబాద్‌లో దాదాపు 15 లక్షల బోగస్ ఓటర్లున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66 శాతం ఓటర్లు ఉండాల్సి ఉంది. కాగా హైద్రాబాద్‌లో ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని సీఎం అన్నారు. బోగస్ ఓట్లు రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారు.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితా రూపొందాలని సీఎం అన్నారు. హైద్రాబాద్‌లోని ఓటర్లంతా తమ ఆధార్ కార్డుతో అనుసంధానం కాకుంటే ఓటు హక్కు ఉండదని కూడా స్పష్టం చేశారు. అందుకే వయోజనులందరూ.. తమ ఓటును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనికి ప్రజలు, పార్టీలు సహకరించాలన్నారు. ఆధార్ అనుసంధానంపై ప్రజల్లో అవగాహన కల్పంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

06:32 - July 21, 2015

రాజమండ్రి : సింగపూర్‌ ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరిచింది. ఏపీ క్యాపిటల్‌ ఏరియా మాస్టర్‌ ప్లాన్‌ అందించిన ఈశ్వరన్‌ బృందానికి బాబు సర్కార్‌ ఘన స్వాగతం పలికింది. రాజమండ్రి పుష్కర హారతి కార్యక్రమంలో సైతం సింగపూర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. సింగపూర్‌ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్‌ నేతృత్వంలోని 29 మంది సభ్యుల బృందాన్ని రాజమండ్రి తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్‌ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన ఈశ్వరన్‌ బృందానికి చంద్రబాబు టీం ఘన స్వాగతం పలికింది. అనంతంరం చంద్రబాబు.. ఈశ్వరన్‌ బృందాన్ని వెంటబెట్టుకుని.. ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా గోదావరి నదిని, పుష్కర ఘాట్లను, అక్కడికి వచ్చిన జనాన్ని చూపించారు.
పుష్కర హారతిని తిలకించిన బృందం..
అనంతరం ఆర్ట్స్ కాలేజీలోని హెలిప్యాడ్‌లో దిగి సీడ్‌ క్యాపిటల్‌ సమర్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి స్వయంగా తీసుకెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత.. చంద్రబాబు తన కారులో ఈశ్వరన్‌ను రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగే నిత్యహారతి కార్యక్రమానికి తీసుకెళ్లారు. నిత్యహారతి కార్యక్రమాన్ని సింగపూర్‌ ప్రతినిధులు ఆసక్తిగా గమనించారు. పలువురు తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సింగపూర్‌ ప్రతినిధులు తిరుగుపయనమయ్యారు. వారికి సీఎం చంద్రబాబు తుది వీడ్కోలు పలికారు. 

06:30 - July 21, 2015

ఢిల్లీ : నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పలు సమస్యలపై గళం విప్పేందుకు గులాబీపార్టీ రెడీ అవుతోంది. సభలో తెలంగాణ సమస్యలు వినిపించేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. విభజనచట్టంలోని పెండింగ్‌ సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు సమాయత్తమయ్యారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై...ఇప్పటికే ఎంపీలు అధినేత కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ప్రధానంగా హైకోర్టు విభజనపై గులాబీ దళం గుర్రుగా ఉంది. హైకోర్టు విభజన కోసం అవసరమైతే.. పార్లమెంట్‌ను స్తంభింపజేసేందుకైనా వెనకడుగు వేయరాదని ఎంపీలు డిసైడయ్యారు. ఇప్పటికే తమతో కలిసి వచ్చే పార్టీల మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. కేంద్రాన్ని ఇరుకున పెడుతున్న భూసేకరణ బిల్లు విషయంలో విపక్షాలకు మద్దతు పలికి...హైకోర్టు విషయంలో ఆయా పార్టీల మద్దతు తీసుకోవాలని నేతలు యోచిస్తున్నారు.
ఉద్యోగుల విభజనపై నో క్లారిటీ..
ఇక విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని టీఆర్‌ఎస్ మండిపోతోంది. ఉద్యోగుల విభజనపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవటాన్ని...సీరియస్‌గా తీసుకుంది. కమలనాథన్‌ కమిటీ జాప్యం, 9, 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల విభజన జాప్యం వంటి అంశాలను...పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని అధికార పార్టీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసకున్నారు.
పాలమూరు ఎత్తిపోతలపై..
వీటికి తోడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులపై...ఏపీ లేవనెత్తుతున్న అంశాలను ఎండగట్టేందుకు నేతలు సమాయత్తమయ్యారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో ఏపీ వ్యవరిస్తున్న తీరును టీఆర్‌ఎస్‌ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం దిశగానే..తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన బీజేపీ ఎంపీల కుంభకోణం, వ్యాపం స్కాం, భూసేకరణపై పార్లమెంట్‌ను స్తంభింపజేసేందుకు అన్ని విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో టీఆర్‌ఎస్ వ్యూహం ఏ మేరకు అమలవుతుందో చూడాలి.

06:28 - July 21, 2015

ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అధికార, విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై ఉన్నారు. విమర్శలు గుప్పించేందుకు, ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, అధికార పక్షం మాత్రం పార్లమెంటు ఉభయ సభల్లో కీలక బిల్లులను గట్టెక్కించేందుకు తంటాలు పడుతోంది. పెండింగ్‌ లో ఉన్న బిల్లుల్లో కీలకమైన రైల్వేల ఆధునికీకరణ, భూసేకరణ, లోక్ పాల్, లోకాయుక్త సవరణలు వంటి బిల్లులు ఉన్నాయి. దీంతో వాటిని గట్టెక్కించేందుకు విపక్షాలు కలిసి రావాలని ప్రధాని అఖిల పక్షం సమావేశంలో పిలుపునిచ్చారు. లోక్‌సభలో 12, రాజ్యసభలో 55 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో జిఎస్‌టి, కార్మిక చట్టాల సవరణ, భూ సేకరణ చట్ట సవరణ , లోక్‌పాల్‌-లోకాయుక్త సవరణ , జల రవాణా, రైల్వే బిల్లులు ముఖ్యమైనవి. పార్లమెంటు ఏడాదికి 100 రోజులు సమావేశం కావాల్సి వుండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు లోక్‌ సభ 35 రోజులు, రాజ్యసభ 32 రోజులు మాత్రమే సమావేశమయ్యాయి.
రాజ్యసభలో చతికిలపడుతున్న మోడీ..
రైతుల నుంచి, వ్యవసాయ కార్మిక సంఘాల నుంచి, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత భూసేకరణ సవరణ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువు ఆగస్టు 3 వరకు పొడిగించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహజన్‌ సోమవారం ఆదేశం జారీ చేశారు. ఈ కమిటీకి గడువు పొడిగించటం ఇది మూడోసారి.సర్కారు. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్న లోక్‌సభలో బిల్లులను తమకు అనుకూలంగా సవరణలు చేసి ఆమోదించుకుంటున్న మోడీ సర్కారు రాజ్యసభలో మాత్రం చతికిలపడుతోంది. భూ సేకరణ బిల్లుతో పాటు జిఎస్‌టి లాంటి కీలక బిల్లులు రాజ్యసభలో ఆమోదించు కోలేకపోయింది. ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు బిల్లులను సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో 35 అంశాలను అజెండాగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎదుట తొమ్మిది, లోక్‌సభలో నాలుగు కీలక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు మరో 11 బిల్లులు నూతనంగా ప్రవేశపెట్టాలని చూస్తోంది.
పెండింగ్ లో పలు బిల్లులు...
లోక్‌సభలో భూ సేకరణ బిల్లుతో పాటు, ఎస్సీ, ఎస్టీ దాడుల నివారణ సవరణ బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో జిఎస్‌టికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రస్తుతం సెలక్ట్‌ కమిటీ పరిశీలనలో ఉంది. ఇక విజిల్‌ బ్లోయర్స్ పరిరక్షణ సవరణ బిల్లు, అవినీతి నిర్మూలన సవరణ బిల్లు, బాల నేరస్తుల సవరణ బిల్లులు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక నూతనంగా ప్రవేశపెట్టనున్న 11 బిల్లుల్లో వినియోగదారుల పరిరక్షణ సవరణ బిల్లు, స్థానిక సంస్థల్లో, పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు ఉన్నాయి.
బీహార్‌ ఎన్నికలకు బాటలు వేసుకోవాలని బీజేపీ ఆలోచన..
తాజా వర్షాకాల సమావేశాల్లో బిల్లులు గట్టెక్కించి త్వరలో జరుగనున్న బీహార్ ఎన్నికలకు బాటలు వేసుకోవాలని బీజేపీ భావిస్తుండగా, బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులను అడ్డంపెట్టుకుని ఆ పార్టీ ఆశలకు గండికొట్టాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. భూసేకరణ బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించగా, అలాగే దేశంలో చర్చనీయాంశంగా ఉన్న లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణంపై కూడా విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సభ ఏ విధంగా కొనసాగుతుందో అన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

నేడు ఉద్యోగ, పెన్షనర్ల రౌండ్ టేబుల్ సమావేశం..

హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరుగనుంది. హెల్త్ కార్డుల జారీ, పదో పీఆర్సీ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు..

హైదరాబాద్ : బల్లార్ష నుండి మంగళవారం ఉదయం సికింద్రాబాద్ కు బయలుదేరాల్సిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 

ఢిల్లీలో బోనాలు..

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బోనాల పండుగను ఢిల్లీలో మంగళవారం నిర్వహించనున్నట్లు లాల్ దర్వాజ మహంకాళీ ఆలయ నిర్వాహక కమిటీ ఛైర్మన్, ప్రధాన సలహారు పేర్కొన్నారు. 

రేపటి నుండి ఇంజినీరింగ్ తనిఖీలు..

హైదరాబాద్ : హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం 83 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీల కోసం జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 22 నుండి 25 వరకు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయనున్నారు. 

నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం..

హైదరాబాద్ : నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరుగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కళ్యాణోత్సవానికి హాజరు కావాలని వేద పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు.

 

మున్సిపల్ సమస్యపై నేడు సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం పురపాలక పరిపాలన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

కళాభారతి నిర్మాణంపై నేడు తుది విచారణ..

హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం తుది విచారణకు స్వీకరించనుంది. 

నేటి నుండి సెర్ప్ ఉద్యోగుల బదిలీలు..

హైదరాబాద్ : పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల బదిలీలకు అధికారులు కసరత్తు చేపట్టారు. సెర్ప్ లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 4204 మంది ఉద్యోగుల బదిలీలకు మంగళవారం నుంచి జిల్లా స్థాయిలో కౌన్సిలింగ్ చేపట్టనున్నారు. 

Don't Miss