Activities calendar

26 July 2015

22:05 - July 26, 2015

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో నిర్వహించిన ''ప్లెయిన్ స్పీక్ విత్ రవి తెలకపల్లి'' కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయాలు, తన రాజకీయ నేపథ్యం వంటి పలు అంశాలను బండారు దత్తాత్రేయ వివరించారు. జాతీయ, రాష్ట్ర పరిస్థితులను చర్చించారు. కుటుంబ నేపథ్యం, ఆర్ ఎస్ ఎస్, బిజెపిలో చేరిక వంటి అంశాలను మంత్రి ప్రస్తావించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:57 - July 26, 2015

గుంటూరు: జిల్లాలో వీఆర్వోపై దాడి జరిగింది. మంగళగిరి హైవే సమీపంలో వివాదాస్పదంగా ఉన్న భూమి సర్వేకు వెళ్లిన వీఆర్వోపై స్థల యజమానులు దాడి చేశారు. ఈ దాడిలో వీఆర్వోకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

 

21:54 - July 26, 2015

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో చలవాది జమలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 150వ నెల ఉచిత మెగా మెడికల్‌ కాంప్‌కు తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత మెగా క్యాంప్‌ నిర్వహణను రోశయ్య ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని గవర్నర్‌ రోశయ్య పేర్కొన్నారు. 

21:50 - July 26, 2015

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో హీరో ప్రభాస్‌ భేటీ అయ్యారు. బాహుబలి సినిమా విశేషాలను ప్రధానికి వివరించినట్లు చెప్పారు. టైం చూసుకుని సినిమా చూస్తానని మోడీ చెప్పినట్లు ప్రభాస్‌ చెప్పారు. ప్రభాస్‌తో పాటు కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.

21:48 - July 26, 2015

చిత్తూరు: జిల్లా శ్రీకాళహస్తిలో అగ్నిగుండం ప్రవేశంలో అపశృతి చోటుచేసుకుంది. ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయ సమీపంలోని గుండంలో ప్రమాదవశాత్తూ పడి ముగ్గురు భక్తులు గాయపడ్డారు.

 

లారీ-కారు ఢీ.. ఇద్దరి మృతి..

తూర్పుగోదావరి: జగ్గంపేట మండలంలోని రామవరం శివారు 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

21:13 - July 26, 2015

తిరుపతి: శేషాచలం అటవీప్రాంతంలోని పగటి గుండాలకోనలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 20 మంది కూలీలు పరారయ్యారు. పారారైన కూలీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతకముందు లొంగిపోవాలంటూ పోలీసులు కూలీలకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ వారు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

 

 

20:31 - July 26, 2015

ముంబై: యూకూబ్ మెమన్ ను ఉరితీయొద్దంటూ.. సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ... బిజెపి కార్యకర్తలు ముంబైలోని సల్మాన్ నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. సల్మాన్ బెయిల్ ను రద్దు చేయాలని నినాదాలు చేశారు.

శ్రీకాళహస్తిలో ధర్మరాజు ఉత్సవాల్లో అపశ్రుతి

చిత్తూరు: శ్రీకాళహస్తిలో ధర్మరాజు ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అగ్నిగుండంలో పడి ముగ్గురికి గాయాలయ్యాయి. 

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఘాతుకం

విశాఖ: ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ముంచంగిపుట్టు మండలం గొబ్బరపాడులో బంగి రమణ అనే గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. కొరియర్ గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో అతన్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. మరో గిరిజనుడు బంగి డాబులకు దేహశుద్ధి చేశారు. నిన్న నలుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇంకా మావోయిస్టుల చెరలో ఇద్దరు గిరిజనులున్నారు.

 

శేషాచలం అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్...

తిరుపతి: శేషాచలం అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పగడగుండాలకోన వద్ద ఆరుగురు తమిళ కూలీలను అరెస్టు చేశారు. రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

మంగళగిరి హైవే సమీపంలో వివాదాస్పద భూమి...

గుంటూరు: మంగళగిరి హైవే సమీపంలో వివాదాస్పద భూమి సర్వేకు వెళ్లిన వీఆర్వో శ్రీనివాసరావుపై యజమానులు దాడి చేశారు. వీఆర్వోకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

 

రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

గుంటూరు: నరసరావుపేట మండలం రావిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నవారి పైకి దూసుకెళ్లింది. దీంతో నాలుగేళ్ల బాలుడు సహా ఇద్దరు మృతి చెందారు. మృతులు చైతన్య(4), హనుమంతరావు(43)గా గుర్తించారు.

19:32 - July 26, 2015

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కదం తొక్కేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఆగస్టు నుంచి వివిధ కార్యక్రమాలతో తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు.. ఈ సమ్మె సన్నాహక కార్యక్రమాలపై సదస్సులో సంఘాల నేతలు విస్తృతంగా చర్చించారు.
ఆర్టీసీ కళాభవన్లో సెమినార్
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. మోడీ సర్కారు తీరుకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యాయి... ఎన్ డిఎ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి నిరసన బాటపట్టారు కార్మికులు... ఇందులోభాగంగా తెలంగాణ కార్మిక, ఉద్యోగసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్లో జరిగిన ఈ సెమినార్లో వివిధ అంశాలపై చర్చించారు.
తెలంగాణలో సదస్సులు
సమ్మెకు సన్నాహకంగా ఆగస్టు మొదటివారంలో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని తీర్మానించారు కార్మిక సంఘాల నేతలు.. 27న తెలంగాణలో మోటార్ సైకిల్ ర్యాలీ జరపాలని నిర్ణయించారు.. కార్మిక హక్కులను అణచివేసేందుకే కార్మిక చట్టాలకు ప్రభుత్వం సవరణలు తెస్తోందని సిఐటియు అఖిల భాతర ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని ఎఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహదేవన్ ఆరోపించారు.. దీనివల్ల ప్రభుత్వరంగం... జాతీయ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెను విజవంతం చేయాలని సిఐటియు, ఎఐటియుసి నేతలు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వివిధరంగా కార్మికులు పాల్గొన్నారు.

 

 

19:17 - July 26, 2015

హైదరాబాద్: బంగారు భవిష్యత్‌ ఉన్న చిన్నారులు పరిశ్రమల్లో కార్మికులుగా బతుకీడుస్తున్నారు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన బాలలు.. బతుకుదెరువు కోసం కూలీలుగా మారుతున్నారు. బరువైన పనులు చేసే వయసు కాకపోయినా.. దుర్మార్గుల దౌర్జన్యంతో బతుకులు బండలు చేసుకుంటున్నారు. ప్రజల పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్న మాఫియా.. అన్నెం పున్నెం తెలియని పిల్లల భవిష్యత్‌ను కాలరాస్తున్నాయి.
జన్మభూమి ఎక్స్ ప్రెస్‌లో బాలకార్మికుల తరలింపు
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌. జన్మభూమి ఎక్స్ ప్రెస్‌లో 74 మంది బాల కార్మికులు. రైళ్లలో అక్రమంగా బాల కార్మికులను తరలిస్తున్నారని బాలల హక్కుల సంఘం ఇచ్చిన సమాచారంతో గోపాలపురం పోలీసులు రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, అసోం రాష్ట్రాల నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్‌లో వస్తున్న 74 మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించారు. మాఫియా చెర నుంచి వారిని కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రైళ్లలో తనిఖీలు
తమకు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో రైళ్లలో తనిఖీలు నిర్వహించామని.. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న దాదాపు 74 మంది చిన్నారులకు మాఫియా నుంచి విముక్తి కల్పించామని పోలీసులంటున్నారు. పిల్లలను ఎవరు తరలిస్తున్నారు.. వీరి వెనుక ఉన్న ముఠా ఏదో విచారిస్తామని పోలీసులంటున్నారు. చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని బాలల హక్కుల సంఘం ప్రతినిధులంటున్నారు.
బాలకార్మికులకు పోలీసులు విముక్తి
మరోపక్క విజయనగరం జిల్లాలో కూడా పలు పరిశ్రమల్లో పని చేస్తున్న బాలకార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు. దాదాపు 70 మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. పరిశ్రమల్లో పని చేస్తున్న బాల కార్మికులను చైల్డ్‌లైన్‌ సెంటర్‌కు తరలించారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లలను చదివించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల కార్మికుల చేత పని చేయిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలకు జరిమానా విధించారు.

 

19:00 - July 26, 2015

కరీంనగర్: నదీమతల్లిని పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా పుష్కరాల ముగింపును పురస్కరించుకొని మంథనికి చెందిన కొత్తపల్లి హరీష్‌ గోదావరి తల్లికి వినూత్న బహుమతిని అందించారు. తన తల్లి కోరిక మేరకు హరీష్‌ గోదావరి నదికి 1475 మీటర్ల చీరను బహూకరించారు. మంగళ వాద్యాలతో శోభాయాత్ర నిర్వహించి నదీ తీరం పొడవునా చీరను అలంకరించారు. హరీష్‌ ప్రయత్నానికి మంథని వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

18:57 - July 26, 2015

హైదరాబాద్‌: భాగ్యనగరంలో బోనాల జాతర సందడి మొదలైంది. గోల్కొండ కోటలో బోనాలు సమర్పించేందుకు ఉదయం నుంచి భారీగా నగరవాసులు క్యూ కట్టారు. ఘటాలు, పోతురాజుల నృత్యాల మధ్య.. మహిళలు... కోటకు తరలివచ్చి...అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పిస్తున్నారు.

18:51 - July 26, 2015

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఆగస్టు 15 నుంచి గ్రామజ్యోతి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకానికి 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. జనాభాను బట్టి గ్రామానికి 2 నుంచి 6 కోట్ల వరకు నిధులు ఇవ్వనున్నారు. గ్రామజ్యోతి విధివిధానాల కోసం మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో సబ్‌కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు ఈటెల, తుమ్మల, పోచారం, హరీష్‌రావు, జోగురామన్న సభ్యులుగా ఉన్నారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సబ్‌కమిటీని ఆదేశించారు.

 

18:45 - July 26, 2015

మెదక్: రోడ్డు ప్రమాదం.. ప్రతి ఇంట విషాదం.. తీరని శోకం. కానీ ఓ ఏడేళ్ల చిన్నారి.. సమాజానికి స్పూర్తిగా నిలిచింది. ప్రమాదంలో గాయపడి.. మరొకరికి ప్రాణం పోసేందుకు నడుంకట్టింది. బరువెక్కిన హృదయంతో.. శోకసంద్రంలో మునిగిన ఆ ఇంట.. అందరికీ ధైర్యం చెప్తూ.. అవయవ దానానికి ముందుకొచ్చింది. మెదక్ జిల్లాలో చిన్నారి చిట్టితల్లి నేర్పిన స్ఫూర్తి మార్గం మీకోసం.
పుష్కరయాత్ర.. రెండు కుటుంబాల్లో విషాదం
12 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాలు. పరవళ్లు తొక్కుతూ.. పరుగు నురుగులు పెడుతున్న గోదారమ్మ ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఆసేతు హిమాచలాన్ని తలపిస్తూ కదలివస్తున్న భక్త జన సంద్రం. గోదావరి పుష్కరాల ముగింపు రోజు.. పుష్కరయాత్ర రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లిన మెదక్‌ జిల్లా వాసుల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
డిచ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో.. సిద్ధిపేటకు చెందిన గోపి, రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు గోపి భార్య రూప, కూతరు మనస్వినికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించగా.. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
స్ఫూర్తిగా నిలిచిన మనస్విని కుటుంబం
ఇంత అంతులేని విషాదఛాయల్లోను మనస్విని కుటుంబం.. సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. తీవ్ర మనోవేదనకు గురవుతూ.. ఆవేదనను అనుభవిస్తూ.. సుడులు తిరుగుతున్న కన్నీటిని దిగమింగి.. మరో ప్రాణాన్ని బతికించేందుకు మొత్తం కుటుంబసభ్యులు కదిలారు. ఆచేతన స్థితికి చేరుకున్న చిన్నారి మనస్విని అవయవాలు దానం చేసేందుకు అమ్మమ్మ, నాన్నమ్మలతో పాటు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. నిత్యం చిరునవ్వులు చిందిస్తూ.. నట్టింట.. తమ మధ్య తిరుగాడిన బంగారుతల్లిని మర్చిపోకూడదనే ఉద్ధేశ్యతో అవయవదానం చేసేందుకు నిర్ణయించామని కుటుంబసభ్యులు తెలిపారు. మరొకరి ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా.. వారి రూపంలోనైనా తమ చిట్టితల్లి బతికే ఉంటుందని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.
మనస్వినికి ఘన నివాళి
ఓవైపు.. ఇంట్లో పెద్ద దిక్కుగా మారిన మనస్విని తండ్రి, అల్లారుముద్దుగా పెంచిన మావయ్య అనంతలోకాలకు వెళ్లగా.. మరోవైపు.. నవమాసాలు మోసి గోరుముద్దలు తినిపించి బిడ్డను పెంచిపెద్ద చేసిన తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంతటి దుస్థితిలోనూ అచేతన స్థితికి చేరిన మనస్విని అవయవ దానానికి ముందుకొచ్చిన ఈ కుటుంబసభ్యులు ఎంతైనా అభినందనీయులే. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని టెన్ టీవీ కోరుకుంటూ.. మనస్వినికి ఘన నివాళులర్పిస్తోంది.

 

18:37 - July 26, 2015

హైదరాబాద్‌: నగరంలో బోనాల సందడి నెలకొంది. నిజామాబాద్‌ ఎంపీ కవిత బోనం ఎత్తుకున్నారు. శిల్పారామం నుండి పెద్దమ్మ ఆలయం వరకు తీసిన బోనాల వేడుకలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను నిర్వహిస్తుందన్నారు. ఐటీ ఉద్యోగులు నిర్వహించిన బోనాల పండుగకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కవిత అన్నారు.

18:34 - July 26, 2015

హైదరాబాద్: సమ్మెలో పాల్గొన్న మున్సిపల్‌ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో మండల కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 4న చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రభాకర్‌ దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న పనులు కేవలం సీఎం కొడుకు, కూతురు, అల్లుడు లాభాల కోసమేనని విమర్శించారు.

 

18:29 - July 26, 2015

హైదరాబాద్: ప్రజలు, కార్మికులపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సమ్మెకు కార్మికులు సిద్ధమయ్యారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన సదస్సులో కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆగస్టు మొదటివారంలో సమ్మెకు సన్నాహకార్యక్రమంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని... ఆగస్టు 27న తెలంగాణలో మోటార్ సైకిల్ ర్యాలీలు చేపట్టాలని ఈ కార్యక్రమంలో నిర్ణయించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

మంత్రులకు ప్రజాసంక్షేమంపై శ్రద్ధ లేదు: డీకే.అరుణ

హైదరాబాద్: మంత్రులకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ ఎద్దేవా చేశారు. తమను విమర్శించే అర్హత మంత్రులకు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా తానేం చేశారో హరీశ్ రావుతో చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ హయాంలో 98 శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. మిగిలిన పనుల పూర్తికి నిధులు కేటాయించడంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

యాకూబ్ ఉరిశిక్షపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న సల్మాన్

ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలను సల్మాన్ ఖాన్ ఉపసంహరించుకున్నారు. టైగర్ మెమన్ ను ఉరి తీయాలని ట్వీట్ చేశానని తెలిపారు. యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని..ఉద్దేశపూర్వకంగా అనలేదని స్పష్టం చేశారు. 'ట్విట్టర్ లో నా వ్యాఖ్యలు ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని మా నాన్న చెప్పారు' అని పేర్కొన్నారు. 'ట్విట్టర్ లో నా వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే... క్షమాపణ కోరుతున్నాను' అని తెలిపారు. 

బోర్ వెల్ దగ్ధం...వ్యక్తి సజీవదహనం

గుంటూరు: బొల్లాపల్లి మండలం పాపాయిపాలెం సమీపంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి బోర్ వెల్ దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం అయ్యారు. 

తిరుమల మొదటి-రెండో ఘాట్ రోడ్లలో ప్రమాదం...

తిరుమల: మొదటి ఘాట్ రోడ్డు 57వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రెండో ఘాట్ రోడ్డులో 12వ కి.మీ వద్ద ఇన్నోవా బోల్తా పడి ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

17:31 - July 26, 2015

ఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు...అన్నాహజారే...కేంద్రంపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ఒకే ర్యాంకు..ఒకే పెన్షన్‌ పథకాన్ని అమలు చేయడంలో కేంద్రప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మాజీ సైనికాధికారులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. మాజీ సైనికాధికారులు దేశం కోసం అహోరాత్రులు కష్టపడుతూ దేశాన్ని రక్షిస్తున్నారని.. అలాంటి వారికి ప్రతిఫలాలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం చొరవ చూపడంలేదన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలు ప్రభుత్వం ఇచ్చే రూ. 4వేలతో జీవితాన్ని ఎలా గడపగలరంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక జవాను రాత్రంతా మేల్కొని ఉన్నప్పుడే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలరని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే వన్‌ ర్యాంకు వన్‌ పెన్షన్‌ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

17:21 - July 26, 2015

ముంబై: సల్మాన్ ట్వీట్లపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఉగ్రవాది యాకుబ్‌ను ఉరితీయొద్దన్న....ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన, ఎన్సీపీ సహా పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై బాంద్రాలోని సల్మాన్‌ నివాసానికి... మీడియాతో పాటు జనాలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ముంబై పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

 

17:15 - July 26, 2015

హైదరాబాద్: విరసం నేత... ప్రముఖ రచయిత.. చలసాని ప్రసాద రావుకు ఎంపీ హరిబాబు, విరసం నేత వరవరావులు నివాళులు అర్పించారు. చలసాని మృత దేహం దగ్గర వరవరరావు కన్నీటిపర్యంమతమయ్యారు. చలసాని లేనిలోటు ఎవరూ తీర్చలేనిదని కొనియాడారు.

 

16:59 - July 26, 2015

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైరయ్యారు. ప్రాజెక్టులను పూర్తి చేయమని అడిగితే.. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏం చేశారని ఎదురు దాడి చేయడం సరికాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేయకుంటే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా అని ఆమె ప్రశ్నించారు.

 

 

ఆగస్టు 15 నుంచి గ్రామ జ్యోతి పథకం ప్రారంభం..

హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఆగస్టు 15 నుంచి గ్రామ జ్యోతి పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు రూ.25 వేల కోట్ల రూపాయలను టీసర్కార్ కేటాయించింది. జనాభా ప్రాతిపదికన గ్రామానికి రూ.2 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకూ నిధులు విడుదల చేయనుంది.

 

తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామంలో విషాదం

తూర్పుగోదావరి: రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి అంతిమయాత్ర నిర్వహిస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

 

కళాకారుల 'ధూంధాం'ను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్: గోల్కొండ బోనాల సందర్భంగా నిర్వహించిన కళాకారుల ధూంధాం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా కళాకారులు ఆందోళన చేపట్టారు.

 

శ్రీకాకుళం జిల్లా భీమిలిలో విషాదం...

శ్రీకాకుళం: కొత్తూరు మండలం భీమిలిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో తల్లి, కుమారుడు, కూతరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

16:14 - July 26, 2015

ఢిల్లీ: కార్గిల్ యుద్ధానికి నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. విజయ్‌ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ప్రజాప్రతినిధులు, ప్రజలు నివాళ్లు అర్పించారు. ఢిల్లీలో అమరవీరుల స్థూపానికి రక్షణమంత్రి మనోహర్ పారికర్ నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. 1999లో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాక్...కార్గిల్‌లో చొరబడింది. పాకిస్తాన్‌పై భారత సైన్య యుద్ధం చేసి విజయం సాధించింది. ఈ యుద్ధంలో 490 మంది సైనికులు, అధికారులు వీరమరణం పొందారు.

16:09 - July 26, 2015

హైదరాబాద్‌: నగర సమస్యలపై పోరాడేందుకు ఓ పౌరవేదిక ఆవర్భవించింది. రవీంద్రభారతిలో హైదరాబాద్‌ జిందాబాద్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ పౌరవేదికకు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ చంద్రకుమార్, మాడభూషి శ్రీధర్‌ సహా పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. భాగ్యనగర సమస్యలపై అన్ని పార్టీలు, వర్గాలు.. ఇకపై ఈ వేదిక నుంచి పోరాడతాయని నేతలు స్పష్టం చేశారు.

 

15:58 - July 26, 2015

రంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతరిని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లిదండ్రులే ఆమెను కడతేర్చారు. పరిగి మండలం పూడూరులో శ్రీనివాస్‌, అనురాధ అనే దంపతులు తమ ఏడాది కూతురు శ్రీవాణిని చంపి బావిలో పడేశారు. అంతేగాక తమ కూతురిని ఎవరో కిడ్నాప్‌ చేశారని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే హత్య చేసినట్లు తల్లి ఒప్పుకుంది. గతంలోనూ వీరిద్దరు ఓ హత్యకేసులో జైలుకు వెళ్లివచ్చారని పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

15:50 - July 26, 2015

ఖమ్మం: జిల్లాలోని కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. పుష్కరాలకు భద్రాచలం వెళ్లి వస్తుండగా రైల్వేస్టేషన్‌లో తన బాబును ఎవరో ఎత్తుకెళ్లారని బాలుడి తల్లి శిరీష అంటోంది. విజయవాడకు చెందిన శిరీష సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.

 

15:48 - July 26, 2015

హైదరాబాద్: ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ గందరగోళం సృష్టిస్తుందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. పాలకులు రోజుకో తీరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులపై ప్రజలు, పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉందని ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని రావుల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణిచివేసేందుకు టీఆర్‌ఎస్‌ యత్నిస్తుందని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.

 

15:43 - July 26, 2015

హైదరాబాద్: కేవలం ప్రచారం, ఉనికి కోసమే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

 

పుష్కరాలను జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు: సీఎం చంద్రబాబు

రాజమండ్రి: గోదావరి పుష్కరాలు జయప్రదం చేసిన అందరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి మహాపుష్కర అభినందన సభలో ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాల నిర్వహణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికారులు పోటీపడి పని చేశారని అభినందించారు. తొలిరోజు ఘటన తర్వాత అధికారులు జాగ్రత్తగా పట్టుదలతో పని చేశారని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, ఆహారం, పరిశుభ్రత విషయాల్లో అధికారులు విధులకు గౌర్హాజరు.. కాకుండా పని చేశారని పేర్కొన్నారు. శాంతి భద్రతలను పోలీసులు అద్భుతంగా నిర్వహించారని చెప్పారు.

 

సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత..

ముంబై : ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ఎదుట పోలీసులు భారీ భద్రత చేపట్టారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ ఉరిశిక్షపై సల్మాన్ ట్విట్టర్ లో ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు..ఏకస్వామ్య ప్రభుత్వం - రావుల..

హైదరాబాద్ : తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని ఏకస్వామ్య ప్రభుత్వమని టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతొక్కరినీ అణిచివేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. 

13:41 - July 26, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. కార్గీల్ అమరవీరులకు అందరూ నివాళులర్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, దేశంలో ప్రతి నిమిషానికి ఓ ప్రమాదం జరుగుతోందన్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై తల్లిదండ్రులు..పిల్లలకు మార్గదర్శనం చేయాలని మోడీ సూచించారు. 

13:37 - July 26, 2015

ముంబై : 1993 బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్స్ పై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. యాకుబ్ ను ఉరి తీయవద్దని..అసలు దోషి యాకుబ్ సోదరుడు టైగర్ మెమన్ అని, మెమన్ ను ఉరి తీయాలంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలను బీజేపీ, శివసేన, ఎన్సీపీతో సహా పలు పార్టీలు ఖండించాయి. కోర్టు తీర్పును తప్పుబట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై..న్యాయవ్యవస్థపై గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రచారం..ఉనికి కోసమే ప్రతిపక్షాల విమర్శలు - జూపల్లి..

హైదరాబాద్ : ప్రచారం..ఉనికి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. బీమా ప్రాజెక్టును గతంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల కోసం బడ్జెట్ లో రూ.900 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 

విద్యా వ్యవస్థపై కడియం సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ : విద్యా వ్యవస్థపై డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీల్లో విద్య వ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఇష్టా రాజ్యాంగా నియామకాలతో యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయన్నారు. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, యూనివర్సిటీలను పునరావాస కేంద్రాలుగా మార్చవద్దని సూచించారు. వర్సిటీల పరిపుష్టికి ప్రత్యేక చట్టం రూపొందిస్తామని కడియం తెలిపారు. 

కేంద్రం విధానాలు ప్రజా, కార్మిక వ్యతిరేకమైనవి - తపన్ సేన్..

హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పేర్కొన్నారు. కార్మికుల హక్కులను అణిచివేసే ఉద్ధేశ్యంతో కార్మిక చట్టాలకు సవరణలు చేస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. భూ సేకరణ చట్టంలో మార్పులు తెచ్చి రైతుల నుండి భూములు లాక్కొంటోందన్నారు. 

స్వచ్ఛ హైదరాబాద్ లో దత్తాత్రేయ..

హైదరాబాద్ : అమీర్ పేటలోని ఆదిత్యపార్కు హోటల్ యాజమాన్యం నిర్వహించిన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ చీపురు పట్టారు.

 

13:17 - July 26, 2015

ఢిల్లీ : దేశ రాజధానిలో బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఏపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ విద్యార్థి జేఏసీ ఈ ధర్నా చేపట్టింది. ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విభజన హామీలు, కేంద్ర మేనిఫెస్టో అమలుతో పాటు పోలవరం, రాజధాని నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించాలని నినదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. కాశ్మీర్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం ఏపీని ఎందుకు విస్మరిస్తోందని సూటిగా ప్రశ్నించారు. 

12:47 - July 26, 2015

అంటరానితనం దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. నిచ్చెనమెట్ల కుల సమాజంలో దళితులపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. డా.అంబేద్కర్ నుండి వెన్నెలకంటి రాఘవయ్యదాకా ఎందరో కులవ్యవస్థ పోవాలని ఆశించారు. మహారాష్ట్రలోని దళిత పాంథర్స్ ఉద్యమం నుండి, కారంచేడు, చుండూరు పోరాటాల వరకు దళిత విముక్తికోసం ఎందరో తపించారు. అలాంటి వారిలో దళితులపై జరిగిన చారిత్రక విద్రోహాలకు అక్షర రూపమిచ్చి వారి గాయాల బతుకులను గేయాలుగా మలిచిన అక్షర శిల్పి పోతపోలు రెడ్డెప్ప. కవి, గేయ రచయిత, గాయకుడు పోతపోలు రెడ్డెప్పపై ప్రత్యేక కథనం.

 

సల్మాన్ స్వంత అభిప్రాయం - రజా మురద్..

ఢిల్లీ : 1933 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకుబ్ మెమన్ పై సినీ నటుడు సల్మాన్ చేసిన ట్వీట్స్ పై పలువురు స్పందిస్తున్నారు. సల్మాన్ సొంత అభిప్రాయాలని సినీ నటుడు రజా మురద్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ప్రజా స్వామ్య దేశంలో ప్రతి పౌరుడు స్పందించే హక్కు ఉందని తెలిపారు.

పరేడ్ మైదానంలో కార్గిల్ విజయ్ దివస్..

హైదరాబాద్ : పరేడ్ మైదానంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమర వీరులకు సైనికులు శ్రద్ధాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, శాసనసమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

12:37 - July 26, 2015

చేపను గాలంతో లాగినట్టు లాగేది జ్ఞాపకం. గూళ్ళు మారినా మారనివే గువ్వల గుర్తులు అంటూ సరికొత్తభావాలతో కవిత్వం రాస్తున్న అభ్యుదయకవి బాణాల శ్రీనివాసరావు. మట్టి మడతల్లోంచి వచ్చే మనిషి పరిమళాల్ని అసహ్యించుకునే యాంత్రిక హృదయాల నవ నాగరికుల కుసంస్కారాలను నిరసిస్తూ కులవృత్తుల సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఆయన పర్యాయపదం అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు. రసార్ద్ర హృదయంతో శిల్ప వైవిధ్యంతో కవిత్వం రాస్తున్న బాణాల శ్రీనివాసరావుపై ప్రత్యేక కథనం..

12:36 - July 26, 2015

ప్రజా సాహిత్యమన్నా, శ్రామిక విప్లవమన్నా ఆయనకు అంతులేని మమకారం. విప్లవ పోరాటాలకు ప్రజలను కార్యోన్ముఖులను చేసే సాహితీ సృజనకోసం ఆయన ఎంత గానో పరితపించారు. విరసం ద్వారా తనవంతు కృషి చేశారు. ప్రగతిశీల భావాల ప్రతిభామూర్తి.. విప్లవ సూరీడు. రేపటి సూర్యోదయంకోసం కలలుగన్న స్వాప్నికుడు. అలుపెరుగని నిరంతర శ్రామికుడు. కవి, విమర్శకులు, వి.ర.సం వ్యవస్థాపకుల్లో ఒకరు చలసాని ప్రసాద్. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటు. ఆ మహారచయిత మృతికి టెన్ టివి 'అక్షరం' నివాళులర్పిస్తోంది. 

తెలంగాణలో కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది - తమ్మినేని..

హైదరాబాద్ : తెలంగాణలో కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. ఆదివారం వామపక్ష పార్టీలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. గత ఇరవై రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని సూచించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా 28, 29, 30 తేదీల్లో నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పరిష్కరించిందని, కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

టి.రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల సదస్సు ప్రారంభం..

హైదరాబాద్ : సెప్టెంబర్ 2వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి తపన్ సేన్, సదాశివం, మహదేవన్ తదితర అఖిల భారత నేతలు హాజరయ్యారు.

12:20 - July 26, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలు విమర్శలు చేశారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీలో మున్సిపల్ కార్మికుల వేతనాలను ప్రభుత్వం పెంచడం జరిగిందని, కేసీఆర్ సర్కార్ ఎందుకు పెంచడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిపట్టుదల వీడి చర్చలు సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28వ తేదీ నుండి అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు..రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. 

12:12 - July 26, 2015

రాజమండ్రి : ఫొటోల కోసం చెట్లు నాటవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత కాంగ్రెస్ హాయాంలో కేవలం ఫొటోల కోసం చెట్లు నాటేవారని తెలిపారు. రాజమండ్రిలోని దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టులో ఏర్పాటు చేసిన మహా పుష్కరవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పుష్కరవనం పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు. ప్రతొక్కరూ పది మొక్కలను నాటాలని, మొక్కలు నాటే వాళ్లు వాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. చెట్లు నాటడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సమస్యలుండవని, వాతావరణాన్ని పూర్తిగా మార్చే శక్తి వస్తుందని, ఒక ఉద్యమంలా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, పీతల సుజాత, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి - మోడీ..

ఢిల్లీ : రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని భారత ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్గీల్ అమరవీరులకు అందరూ నివాళులర్పించాలని సూచించారు. దేశంలో ప్రతి నిమిషానికి ఓ ప్రమాదం జరుగుతోందని..ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై తల్లిదండ్రులు..పిల్లలకు మార్గదర్శనం చేయాలని సూచించారు. 

11:56 - July 26, 2015

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజౌలి జిల్లాలో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రంతా ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. భారీ వర్షాలకు తమ ఇళ్లు కూలిపోయాయని రాజౌలి వాసులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రాజౌలి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతొక్కరూ పది మొక్కలు నాటాలి - సీఎం బాబు..

రాజమండ్రి : దివాన్ చెరువులో మహా పుష్కరవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. ప్రతొక్కరూ పది మొక్కలను నాటాలని, మొక్కలు నాటే వాళ్లు వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. ఫొటోల కోసం మొక్కలను నాటవద్దని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

హైదరాబాద్ జిందాబాద్ పౌరవేదిక ఆవిర్భావ సభ..

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో హైదరాబాద్ జిందాబాద్ పౌరవేదిక ఆవిర్భావ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జస్టిస్ చంద్రకుమార్, మాడభూషి శ్రీధర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

ఏడాది పాపను చంపిన తల్లి..

రంగారెడ్డి : పూడురులో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి ఏడాది పాపను చంపి బావిలో పడేసింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మహా పుష్కరవనంను ప్రారంభించిన బాబు..

రాజమండ్రి : దివాన్ చెరువులో ఏర్పాటు చేసిన మహా పుష్కర వనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మొక్కను నాటారు. 

11:10 - July 26, 2015

రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది ? ఆ రాష్ట్రం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు ఏ విధంగా ఉన్నాయి. ? ఏపీ రాష్టం అభివృద్ధి నమూనా ఏ విధంగా ఉండాలి ? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు..ప్రత్యామ్నాయ విధానాలపై టెన్ టివిలో 'టాక్ షో విత్ రాఘవులు' లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి.

బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఏపీ విద్యార్థి జేఏసీ ఆందోళన..

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఏపీ విద్యార్థి జేఏసీ ఆందోళన నిర్వహించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 

ఎర్రవారిపాలెంలో ఏనుగుల బీభత్సం..

తిరుపతి : ఎర్రవారిపాలెం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుండాలజైలు అటవీ ప్రాంతంలో ఏనుగులు వరి, టమోటా పంటలు ధ్వంసం చేశాయి. టపాసులు పేల్చి ఏనుగులను అటవీ సిబ్బంది చెదరగొట్టారు. 

జంతర్ మంతర్ వద్ద అన్నా హాజారే..

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద ఎక్స్ సర్వీస్ మెన్ నిరసన కార్యక్రమం నిర్వమించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అంశంపై వారు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజరే పాల్గొన్నారు. 

ప్రజలను మేల్కోలుపుతాం - అన్నా..

ముంబై : దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే పేర్కొన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉందని, ఈ లోపు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజలను మేల్కోలుపుతామని అన్నా తెలిపారు. గత ఐదు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు స్తంభించాయని, ఈ సభా నిర్వాహణకు ఎంత ఖర్చు అయిందో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బులు మీవా ? మావా ? అని అన్నా నిలదీశారు. 

10:23 - July 26, 2015

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుష్కరాల సందడి ముగిసింది. 12 రోజుల పాటు జరిగిన పుష్కరాల్లో కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లకు భారీగా భక్తులు పోటెత్తారు. దీనితో భద్రాచలం పరిసర ప్రాంతాలు చెత్తమయంగా మారిపోయాయి. దీనితో అధికారులు స్వచ్చ భద్రాద్రి పేరిట కార్యక్రమం ప్రారంభించారు. ఎక్కడికక్కడ పేరకపోయిన చెత్తను తొలగించేందుకు కార్మికులు చీపుర్లు పట్టారు. అధికారులు సైతం చీపుర్లు పట్టి చెత్తను ఏరి పారేస్తున్నారు. కానీ రాజమండ్రి నుండి 350 మంది కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. తెలంగాణలో కార్మికులు సమ్మెలో ఉండడంతో రాజమండ్రి నుండి కార్మికులను తీసుకరావడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు. 

10:16 - July 26, 2015

ముంబై : 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషియైన యాకుబ్ మెమన్ ను ఉరి తీయవద్దంటూ ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. అతడిని ఉరి తీయవద్దంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. సల్లూ భాయ్ చేసిన ట్వీట్స్ పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు దోషి యాకుబ్ సోదరుడు టైగర్ మెమన్ అని, మెమన్ ను ఉరి తీయాలంటూ పేర్కొన్నాడు. ఓ అమాయకుడిని చంపడమంటే మానవత్వాన్ని చంపడమే అని, తన ప్రాణాలను కాపాడుకొనేందుకు తప్పించుకు తిరుగుతున్న టైగర్..టైగరే కాదని..పిల్లి అని పేర్కొన్నాడు. తప్పించుకుని తిరిగే పిల్లిని పట్టుకోలేమని వ్యాఖ్యానించాడు.
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలును మరోమారు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టేయడంతో జులై 30వ తేదీన యాకుబ్ మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశేషం ఏమిటంటే అదేరోజున యాకుబ్ మెమన్ (53) పుట్టినరోజు కావడం గమనార్హం. ఉరిశిక్ష అమలుతో దేశవ్యాప్త చర్చకు యాకుబ్ మెమన్ తెరలేపాడు. 
ఎవరి యాకుబ్..?
అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన టైగర్ మెమన్ సోదరుడే యాకుబ్ మెమన్. ఉన్నత చదువును అభ్యసించిన యాకుబ్ వృత్తిరీత్యా చార్టర్డ్ ఆకౌంట్. దావుద్ ఇబ్రహీం, అన్న టైగర్ మెమన్‌లకు డబ్బులు సమకూర్చేవాడు. దీంతో పాటు 1993 ముంబై వరుస పేలుళ్ల కోసం సొంత వాహనాలను వారికి ఇచ్చాడు. ముంబైలో వరుస పేలుళ్లు జరిగిన తర్వాత యాకుబ్ మెమన్ భారతదేశం వదిలి వెల్లిపోయాడు. పాకిస్ధాన్‌లో తలదాచుకున్నాడు. మెమన్‌ను సీబీఐ అధికారులు 1994లో అరెస్టు చేశారు. అయితే యాకుబ్ మెమన్ అరెస్టులో అప్పట్లో భిన్నవాదనలు వినిపించాయి. 1994లో అతడిని నేపాల్‌లో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతుండగా అతనే లొంగిపోయాడని అతని తరపున్యాయవాదులు వాదించారు. 
257 మంది మృతి..
1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్‌ మెమన్‌ (యాకూబ్‌ సోదరుడు), దావూద్‌ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. చార్టర్డ్ అకౌంట్‌ అయిన మెమన్‌ స్వయంగా ముంబై పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నాడని అభియోగాలు రుజువయ్యాయి. దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్‌తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. యాకుబ్ మెమన్ ఉరిశిక్షపై రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నిరాకరించారు.

మూడో రోజు..ఉప్పల్ ఎమ్మెల్యే దీక్ష..

హైదరాబాద్ : ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆయన దీక్ష చేపట్టారు. 

రాజ్ ఘర్ లో భారీ వర్షాలు..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. భారీ వర్షానికి రాజ్ ఘర్ లో వరదనీరు ముంచెత్తింది. పలు ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. 

27న బంద్ కు పిలుపునిచ్చిన లాలూ..

బీహార్ : ఈనెల 27వ తేదీన రాష్ట్ర బంద్ కు లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. కులాల గణన లెక్కలను కేంద్రం విడుదల చేయాలని కోరుతూ లాలూ డిమాండ్ చేస్తూ ఈబంద్ కు పిలుపునిచ్చారు.

రాజౌరిలో వర్ష బీభత్సం..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రాజౌరి జిల్లాలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. దీనితో జనజీవనం స్తంభించింది.

 

నెక్లెస్ రోడ్డులో పోలీసుల స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో సెంట్రల్ జోన్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న 76 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 22 మంది మైనర్లు ఉన్నారు. 

యాకుబ్ ఉరిపై సల్లూ భాయ్ ట్వీట్స్..

ముంబై : 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలుపై సినీ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. యాకుబ్ ను ఉరి తీయవద్దంటూ ట్విట్టర్ లో సల్మాన్ ట్వీట్స్ చేశారు. యాకుబ్ సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ ను పట్టుకుని ఉరి తీయాలని పేర్కొన్నాడు. 

భద్రాచంలో స్వచ్ఛ భద్రాద్రి..

ఖమ్మం : నేడు భద్రాచలంలో స్వచ్చ భద్రాద్రి కార్యక్రమం జరుగుతోంది. గోదావరి పుష్కరాలు ముగియడంతో భద్రాచలంలో పేరుకపోయిన చెత్తను సిబ్బంది తొలగిస్తున్నారు. 

నేడు హైదరాబాద్ జిందాబాద్ ఆవిర్భావ సభ..

హైదరాబాద్: ఉదయం పది గంటలకు రవీంద్రభారతిలో హైదరాబాద్ జిందాబాద్ పౌర వేదిక ఆవిర్భావం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి జస్టిస్ చంద్రకుమార్, మాడభూషి శ్రీధర్ లు హాజరు కానున్నారు. 

09:25 - July 26, 2015

హైదరాబాద్ : గోల్కొండ బోనాల మూడో పూజ ఆదివారం ఘనంగా జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల పండుగ కోసం ప్రత్యేక బలగాలు తెప్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు పూజకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వస్తున్నారని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాటు చేశామని, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. మూడో పూజకు భారీ ఎత్తున తొట్టెలు, బోనాలను భక్తులు సమర్పిస్తారని పేర్కొన్నారు.
ఆషాడ మాసం లో తెలంగాణ అంతట జరిగే బోనాలకు హైద్రాబాద్ ప్రసిద్ది. ఇందులో గోల్కొండ బోనాలంటే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. తొట్టెల ఊరెగింపు, భక్తుల కోలహలం, పోతురాజుల విన్యాసం ఇలా అన్ని ప్రత్యేకతలే. వీటిని చూడటానికి నగరవాసులు, సందర్శకుల పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైద్రాబాద్ లో మొదటగా జరిగే గోల్కొండ బోనాలు ప్రారంభం కావడంతో కోట చుట్టు ప్రత్యేక పండగ శోభ సంతరించుకుంది. నగరవాసులతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడి వచ్చి సంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ బోనాలను వీక్షిస్తున్నారు. గోల్కొండ లో జరిగే జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలను చూసేందుకు భక్తుల అధిక సంఖ్యలో చేరుకోవడంతో కోట వద్ద రద్దీ ఎక్కవ అయింది.

 

అమర్ జవాన్ జ్యోతి వద్ద పారికర్ నివాళులు..

ఢిల్లీ : కార్గిల్ దివస్ సందర్భంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నివాళులర్పించారు.

 

ప్రొ.కబడ్డీ లీగ్ పోటీల్లో నేటి మ్యాచ్ లు..

కోల్ కతా : ప్రొ.కబడ్డీ లీగ్ లో నేడు జైపూర్ పింక్ పాంథర్స్ తో పాట్నా పైరెట్స్ జట్టు ఢీకొనంది. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. మరో మ్యాచ్ లో తెలుగు టైటాలన్స్ తో యు ముంబా పోటీ పడనుంది. రాత్రి 9గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది.

విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలో మారథాన్ రన్..

ఢిల్లీ : కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దౌలాకౌన్ ప్రాంతంలో మారథాన్ రన్ జరిగింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ టీ షర్ట్స్ ధరించి రన్ లో పాల్గొన్నారు. 

08:19 - July 26, 2015

ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఇండియాలో ఇపుడు టాప్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఎందుకంటే ఆయన కథ అందించిన 'బాహుబలి' సినిమాతో పాటు 'సల్మాన్ ఖాన్' నటించిన బాలీవుడ్ మూవీ 'భజ్రంగి భాయిజాన్' చిత్రాలు విడుదలై భారీ విజయాలు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన టెన్ టివి తో మాట్లాడారు. బాహుబలి..భజ్రంగి భాయిజాన్ చిత్రాలపై ఆయన ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు. 

08:05 - July 26, 2015

బ్యూటీ పార్లర్లు..మహిళలు తమ అందాన్ని మెరుగుపరుచుకొనేందుకు పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఈ పార్లర్లను మూసేయాలంటూ 'హిజబుల్ మూజాహుద్దిన్' అనే ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఓ పోస్టర్ ను విడుదల చేసింది. జమ్మూలోని పూల్వమా పట్టణంలోని అన్ని విద్యా సంస్థల వద్ద హిజబుల్ ముజాహిద్దిన్ సంస్థ పేరుతో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
''అమ్మాయిలెవ్వరూ బురఖా లేకుండ బయటకు రావద్దు..బురఖా లేకుండ స్కూల్, కాలేజ్ లకు వెళ్లరాదు..అలా చేస్తే మీ అంతు చూస్తాం'' అంటూ పోస్టర్ లలో హెచ్చరించింది. అదేవిధంగా కాశ్మీర్ లో ఉన్న అన్ని బ్యూటీ పార్లర్లను 24 గంటలలో మూసి వెయ్యాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అలా చెయ్యని వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ పోస్టర్లు చూసిన మహిళల తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజల హక్కులపై ఆంక్షలు విధించేవారిని వదిలి పెట్టమని, ప్రజలను భయపెడుతున్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రజలను కాపాడడానికి పోలీసులు ఉన్నారని ప్రజలు ఎలాంటి భయందోలనకు గురి కావలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

07:55 - July 26, 2015

మెగస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటిస్తున్న సినిమాలో ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 'శ్రీను వైట్ల' కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చెర్రీకి జతగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాలో స్టంట్ మేన్ గా అలాగే హీరోలకు డూప్ గా చరణ్ నటిస్తున్నాడు. ఇండస్ట్రీలో హీరోలకు ఫైట్ మాస్టర్ లా నటిస్తున్నాడు కాబట్టి ఓ స్పెషల్ రోల్ లో కింగ్ నాగార్జునని నటింప చేయాలని శ్రీనువైట్ల యోచిస్తున్నారని టాక్. ఈ వార్తా గురిం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.
నాగార్జునతో ఇంతకు ముందు 'కింగ్' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీనువైట్ల అడిగిన వెంటనే నాగార్జున ఒకే చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జున తన తనయుడు అఖిల్ మొదటి సినిమాలోనూ గెస్ట్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి చెర్రీ సినిమాలో నాగ్ నటిస్తున్నాడా ? లేదా ? అన్నది శ్రీనువైట్లే చెప్పాలి.

07:49 - July 26, 2015

స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? చిత్రంలో ఎలాంటి డ్యాన్స్..ఫైట్ చేశాడనే దానిపై అభిమానులు విపరీతంగా చర్చించుకుంటారు. తాజాగా ఆయన ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రుద్రమదేవి' సినిమాలో ప్రత్యేక పాత్రలో 'బన్నీ' నటిస్తున్నాడు. 'గోన గన్నారెడ్డి' పాత్ర బన్నీ కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఓ చర్చ జరుగుతోంది. అసలు ఈ చిత్రంలో 'అల్లు అర్జున్' తెరపై ఎంత సేపు కనబడుతాడనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ పాత్ర మొదట 20 నిముషాలు మాత్రమే ఉందని టాలీవుడ్ టాక్. అభిమానులు నిరాశ పడతారనే ఉద్దేశంతో బన్నీ పోషిస్తున్న గోన గన్నారెడ్డి పాత్రను గంటకు పెంచారని తెలుస్తోంది. అంతేకాక బన్నీ పాత్ర నిడివి పెరిగితే సినిమాకి వెయిట్ పెరుగుతుందని గుణశేఖర్ భావించాడంట. ఇక ఈ చిత్రంలో బన్నీ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుంది. 'రుద్రమదేవి' సినిమా సెప్టెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానున్నది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు ఐదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది.

నేడు కేజ్రీవాల్ ను కలువనున్న అన్నా..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సామాజిక ఉద్యమ నేత అన్నా హాజారే కలువనున్నారు. రాత్రి 8గంటలకు వీరి భేటీ ఉంటుందని సమాచారం. 

07:33 - July 26, 2015

గత ఎనిమిది సంవత్సరాలుగా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన 'కాజల్' గుడ్ బై చెప్పనుందా ? ఇందుకు పారితోషకమే అడ్డంకియా ? పెళ్లి చేసుకోనుందా ? ఇలా అనేక పుకార్లు టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. 'టెంపర్' సినిమా తర్వాత మరో చిత్రం చేయని ఈ అమ్మడు నేటి త‌రం హీరోయిన్స్ తో స‌మానంగా పోటీ ప‌డ‌లేక‌పోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాక త‌న పారితోషికంను కోటిన్నర కన్నా తగ్గించనని ఖచ్చితంగా చెప్పడంతో కాజల్ దగ్గరికి రావటానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో మాత్రం 70 లక్షల లోపే తీసుకుంటున్న కాజల్ తెలుగులో మాత్రం కోటిన్నర అడగటంతో నిర్మాతలు కాజల్ ని పక్కన పెడుతున్నట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం స్టార్ హీరోలు ఎవరూ తెలుగులో కాజల్ కి అవకాశాలు ఇవ్వడం లేదు కనుకే అటు వైపు చూస్తోందని టాక్. మరో వైపు ఆమెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, నెమ్మదిగా సినిమా అవకాశాలను తగ్గించుకొంటుందని టాక్. ఈ పుకార్లు నిజమా ? అబద్ధమా ? అనేది కాలమే చెప్పాలి.

07:28 - July 26, 2015

త్రిష..టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని సంచనాలకు కేంద్ర బిందువైంది. తాజాగా అమ్ముడుపై పలు వార్తలు వస్తున్నాయి. త్వరలోలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందని..ఆరాధించే జయలలిత పార్టీలో చేరుతుందని పుకార్లు షికార్లు చేశాయి. 2016లో రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇస్తోందని, ఓన్లీ ప్రచారం మాత్రమే చేస్తుందని ఒకటే గాసిప్స్ వచ్చాయి. తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఫ్యూచర్‌లోనూ వచ్చే ఆలోచన లేదని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. మొత్తానికి త్రిష పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న పుకార్లకు ఈ విధంగా తెరపడిందన్నమాట.

07:11 - July 26, 2015

హైదరాబాద్ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు మున్సిపల్‌ జేఏసీ సిద్ధమైంది. వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరంతర పోరాటం కొనసాగించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. తెలంగాణ సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు సఫాయి కార్మికులు రెడీ అయ్యారు. కొత్త పంథాలో నిరసన తెలిపేందుకు సమాయత్తమయ్యారు. హైదరాబాద్‌లో సమావేశమైన మున్పిపల్ సంఘాల జేఏసి....ప్రభుత్వంపై యుద్ధబేరి మోగించేందుకు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఆదివారం నుంచి ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించింది. 27న భిక్షాటన..28న మున్సిపల్‌ ఆఫీస్‌ల ఎదుట కుటుంబ సభ్యులతో సామూహిక దీక్షలు, 29న కలెక్టరేట్లను ముట్టడించాలని సంకల్పించింది.
ఎమ్మెల్యే ప్రభాకర్ దీక్ష..
సమ్మెను అణచివేసే మొండి వైఖరి ప్రభుత్వం విడనాడి.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల జీతాలు పెంచాలని మున్సిపల్‌ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు విధుల నుంచి తప్పించిన వారిని పనుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో.. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చేస్తున్న దీక్షకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ మద్దతు పలికారు. న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తున్నకార్మికులను ప్రభుత్వం తొలగించడం దారుణమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టిఆర్ఎస్ సర్కార్‌..ఉద్యమ కారులపై ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదన్నారు.
పలు జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు..
హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్‌ సమ్మెకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్మికుల సమ్మెల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి.. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. పలుజిల్లాల్లో 20 రోజు కూడా సఫాయి కార్మికుల ఆందోళనలు హోరెత్తాయి. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కొనేరు కొనప్ప ఇంటి ముందు బైటాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొనప్ప నచ్చజెప్పడంతో... నిరసనకారులు శాంతించారు. కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో మున్సిపల్‌ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాళ్లతో ఉరివేసుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఆందోళనకారులను అణచివేయాలనుకునే నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలన్నారు. అటు మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 

నేడు చలసాని సంతాప సభ..

విశాఖపట్టణం : మధ్యాహ్నాం రెండు గంటలకు చలసాని ప్రసాద్ సంతాప సభ జరుగనుంది. అనంతరం అవయవాల దానానికి ఏఎంసీకి చలసాని ప్రసాద్ భౌతికకాయాన్ని తరలించనున్నారు.

 

నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి..

హైదరాబాద్ : నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. జీహెచ్ఎంసీలో తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తో ఈ కార్యక్రమం జరుగనుంది.

 

నేడు బాసరలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు..

హైదరాబాద్ : బాసరలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు జరుగనున్నాయి. ఆదివారం, సోమవారాల్లో జరిగే ఈ ప్రవేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఏపీలో నేటి నుండి మున్సిపల్ విధులకు హాజరు..

హైదరాబాద్ : నేటి నుండి మున్సిపల్ కార్మికులు విధులకు హాజరు కానున్నారు. రూ.2700 వేతనం పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 

06:46 - July 26, 2015

విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని హెచ్ బీ కాలనీలో శనివారం చలసాని కన్నుమూసిన సంగతి తెలిసిందే. చలసాని మృతిపట్ల విరసం నేతలు, సాహితీవేత్తలు, పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ చేరుకునేలోగానే ఆయన మరణించారు.
కృష్ణా జిల్లాలో జననం..
కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో 1932 అక్టోబరు 27న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించారు చలసాని ప్రసాద్. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నారు. చిన్నతనంలో టైఫాయిడ్‌తో బాధపడ్డారు చలసాని. దాంతో వినికిడి శక్తి కోల్పోయారు. ఆ సమయంలో ఆయన మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించారు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో ఉద్యోగంలో చేరారు చలసాని.
విరసం స్థాపనలో చలసాని ప్రసాద్‌ది కీలక పాత్ర..
విరసం స్థాపనలో చలసాని ప్రసాద్‌ది కీలక పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుపాలయ్యారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన జైలుకు వెళ్లడానికి కూడా వెరవలేదు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు పేరు పొందారు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో సన్నిహితంగా మెలిగేవారు చలసాని. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు.
చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగిన చలసాని..
చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగారు. ఆయన మృతి పట్ల విరసం సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తో అనుభందం ఉన్న యర్లగాడ్డ లక్ష్మప్రసాద్,,సబ్బంహరి పలు రచయితలు ఆయనకు సంతాపం తెలియజేసారు.

06:40 - July 26, 2015

హైదరాబాద్ : సేఫ్ సిటీగా మారుస్తామన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అంత‌ర్జాతీయ హంగుల‌తో క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ సిబ్బందికి అత్యాధునిక వాహ‌నాలు, ఆధునిక ఆయుధ సంప‌త్తిని అంద‌జేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు లేటెస్ట్‌ టెక్నాలజీతో కూడిన క‌మాండ్ కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది. బంజారాహిల్స్ లో పోలీస్ క‌మిష‌న‌రేట్‌కు కేటాయించిన స్థలంలోనే సీసీసీ భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని నిర్ణయించింది. అంత‌ర్జాతీయ స్థాయిలో 15 కంపెనీలు త‌యారు చేసిన డిజైన్లను ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌.. 2 టవర్లతో కూడిన బిల్టింగ్‌కు ఓకే చేప్పారు.
2 టవర్లతో కూడిన భారీ బిల్డింగ్‌ డిజైన్‌కు ఓకే చెప్పిన సీఎం..
16 అంతస్థులతో ఒక టవర్‌, 24 అంతస్థులతో మరో టవర్‌ నిర్మించనున్నారు. ఈ రెండు భ‌వ‌నాల‌ను అనుసంధానం చేస్తూ వంతెన ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ భ‌వ‌నం పై భాగంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్‌, విద్యుత్ అవ‌స‌రాల‌ కోసం సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తారు. ఇక నాలుగో అంత‌స్థులో సుమారు వెయ్యిమంది ప‌ట్టేలా ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, భ‌వ‌నం చుట్టూ ల్యాండ్ స్కేపింగ్, వాట‌ర్ ఫౌంటేయిన్, 600 వాహ‌నాలు ప‌ట్టేలా పార్కింగ్ స్పేస్ తదితర సదుపాయాలు కల్పించేందుకు తుది మెరుగులు దిద్దాల‌ని సీఎస్, డీజీపీల‌ను ఆదేశించారు కేసీఆర్.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్‌..
డిజైన్‌కు తుదిరూపు నిచ్చి టెండ‌ర్లను ఆహ్వానించాలని అధికారుల‌కు సూచించారు తెలంగాణ సీఎం. కమాండ్ కంట్రోల్ రూమ్‌ అందుబాటులోకి వస్తే.. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ఉప‌యోగప‌డుతుంద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ ప్రధాన కార్యాల‌యాల‌ను సీసీసీతో అనుసంధానం చేయాల‌న్నారు. పండగలు, జాత‌ర‌లు, ప్రకృతి వైప‌రిత్యాలు సంభవించిన సమయంలో పోలీసులతో పాటు అధికారులు ప‌రిస్థితిని స‌మిక్షించే విధంగా భ‌వ‌నంలో అన్ని హంగులు ఏర్పాటు చేయాలన్నారు. సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించి విదేశీ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. 

06:39 - July 26, 2015

హైదరాబాద్ : అఖండ గోదావరి పన్నెండు రోజులపాటు పుష్కర జన సందడితో పులకించిపోయింది. మహా పుష్కర సంబరంతో మరో పన్నెండేళ్లకు సరిపడా సంతృప్తిని నింపింది. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ముగిశాయి. పన్నెండు రోజుల ఈ మహా క్రతువులో అధికార యంత్రాంగం, ప్రజలు కలిసి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి మహా పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహించడంలో ఇరు ప్రభుత్వాలు సఫలమయ్యాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 4.80 కోట్ల మంది పుష్కర స్నానాలు చేసినట్లు ఒక అంచనా వెలువడింది. ఇక తెలంగాణలో అయితే అధికారిక లెక్కల ప్రకారం 106 ఘాట్ల పరిధిలో 6.40 కోట్ల మంది స్నానాలు చేశారు. పుష్కరాలను విజయవంతం చేసినందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను, అధికారులను అభినందించారు. మరోసారి గోదావరి పుష్కరం కోసం 2027 వరకూ ఎదురు చూడాల్సిందే.

 

06:38 - July 26, 2015

రాజమండ్రి : గోదావరి... పుష్కరాలు వైభవంగా ముగిసాయి. 144 ఏళ్లకు వచ్చే మహాపుష్కరుడితో కలిసి ప్రవహించిన గౌతమిలో పుణ్యస్నానాలు చేశారు తెలుగురాష్ట్రాల ప్రజలు. చివరిరోజు భక్తులు పోటెత్తడంతో... ఘాట్లన్ని కిక్కిరిసాయి. ముగింపు వేడుకల్లో ఇరు రాష్ట్రాలు పోటీపోటీగా సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్కర హారతితో గోదారమ్మకు పుష్కరాలకు వీడ్కోలు పలికారు. గోదావరి మహా పుష్కరాలకు చివరి రోజు భక్తులు పోటెత్తారు. రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుష్కరస్నానం చేశారు. అనంతరం తండ్రి ఎన్టీఆర్‌కు పిండప్రదానం చేశారు. ఇంకా యోగాగురు రామ్ దేవ్ బాబాతోపాటు.. పలు సినీ రాజకీయ రంగ ప్రముఖులు పుష్కర స్నానమాచరించారు.
తెలంగాణలో..
పుష్కరాల చివరిరోజు.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్తులు పోటెత్తడంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మణుగూరు, మోతె ఘాట్లకు భక్తులు క్యూ కట్టారు. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి భక్తజన సందోహంగా మారింది. చివరిరోజు కూడా లక్షలాదిగా పుష్కరస్నానం చేశారు. కాళేశ్వరంలో ఎంపీ బాల్కాసుమన్‌, మంథినిలో ఎంపీ వినోద్‌ కుటుంబ సమేతంగా పుష్కరస్నానమాచరించారు.అటు నిజామాబాద్, వరంగల్‌, ఆదిలాబాద్ జిల్లాలోనూ స్నానఘట్టాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడడం వల్లనే పుష్కరాలు విజయవంతం అయ్యాయని మంత్రి కడియం శ్రీహరి అన్నారు.
ముగింపు వేడుకలు..
చివరిరోజు సాయంత్రం పుష్కర ముగింపు వేడుకలు ఇరురాష్ట్రాలు ఘనంగా నిర్వహించాయి. రాజమండ్రి ఆర్ట్ కాలేజీలో ప్రముఖ సంగీత విద్వౌంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తన గాత్రంలో గోదారమ్మకు వీడ్కోలు పలికారు. సాయంత్రం నిర్వహించిన నిత్యహారతిని చూసేందుకు భక్తులు భారీగా హజరయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చివరు పెద్దఎత్తున కాల్చిన బాణసంచా వెలుగులు చూపరులను ఆకట్టుకున్నాయి. అటు తెలంగాణలోని భద్రాచలం, పోచంపాడు, బాసర, ధర్మపురి ఘాట్లలో పుష్కర హారతి ఘనంగా నిర్వహించారు. లక్షల మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని పుష్కరాలకు వీడ్కోలు పలికారు. 

06:33 - July 26, 2015

హైదరాబాద్ : ఫుల్ గా మందు కొట్టాడు..నిషా తలకెక్కింది..డబ్బు..అంగబలం ఉందనే గర్వం..ఇంకేముంది..డ్రంక్ అండ్ డ్రైవ్ లో వీడియో చిత్రీకరిస్తున్న మీడియా వ్యక్తిపై దాడికి దిగాడు..బూతులు తిట్టాడు..అసభ్యంగా ప్రవర్తించాడు..దీనికి మీడియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది..చివరకు ఆ మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ రోడ్ నెంబర్ 12లో జరిగింది.
శనివారం రాత్రి పోలీసులు డంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎపి 10ఎజి 0027 కారు వచ్చింది. ఆ కారులో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో ఓ అమ్మాయి కూడా ఉంది. కానీ ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియా వ్యక్తిపై ఆ మందుబాబు దాడికి దిగాడు. బూతులు తిట్టాడు. అసభ్యచేష్టలు ప్రదర్శించాడు. తాను ఓ ఐపీఎస్‌ ఆధికారిణి బంధువునంటూ రెచ్చిపోయాడు. అక్కడనే ఉన్న ఇతర మీడియా సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు మందుబాబుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మందుబాబును అశీష్ సింగ్‌ చోప్రాగా గుర్తించారు. 

06:12 - July 26, 2015

హైదరాబాద్ : ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది. ఇటీవల పాతబస్తీలో పలు ప్రాంతాల్లో వెట్టిచాకిరి చేస్తున్న బాలలను పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 74 మంది బాల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలల హక్కు సంఘం, నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు బాలల హక్కు సంఘానికి సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు రాగానే 74 మంది బాలలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 14-18 సంవత్సరాల లోపు ఉన్నవారే. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ నుండి ఓ ముఠా హైదరాబాద్ కు తరలిస్తోందని బాలల హక్కు సంఘం పేర్కొంది. ఈ ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సంఘం నేతలు పేర్కొన్నారు. విచారణ తరువాత బాల కార్మికులను తరలిస్తున్న ఏజెంట్లను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 

బాలలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ : బాలలను వెట్టిచాకిరీకి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో తరలిస్తున్న 74 మంది బాల కార్మికులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ నుండి ఓ ముఠా హైదరాబాద్ కు తరలిస్తోంది. 

నేడు విరసం ప్రసాద్ భౌతికకాయం అప్పగింత..

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన చలసాని ప్రసాద్ భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని హెచ్ బీ కాలనీలో శనివారం చలసాని కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

నేడు తెలంగాణ వికాస సమితి ప్రథమ వార్షిక సభ..

వరంగల్ : తెలంగాణ వికాస సమితి వార్షిక సమావేశం ఆదివారం హన్మకొండలో జరుగనుంది. కాళోజీ ప్రాంగణం (మయూరి గార్డెన్స్)లో ఆచార్య బియ్యాల జనార్ధన్ హాలు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వేదికగా ప్రథమ వార్షిక సదస్సు జరుగనుంది.

రేపటి నుండి ఉస్మానియా తరలింపు..

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రి ఓపి బ్లాక్ లోని పేషెంట్ల తరలింపు కార్యక్రమాన్ని సోమవారం నుండి ప్రారంభించనున్నారు. తొలి విడతగా ఉస్మానియా ఓపి బ్లాక్ లోని జనరల్ మెడిసిన్ లో చికిత్స పొందుతున్న వంద మంది రోగులను ఫీవర్ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది. 

నేడు ఉచిత ఇంటర్ విద్యపై సదస్సు..

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత ఇంటర్ విద్యపై సదస్సు జరుగనుంది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే ఈ సదస్సుకు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పాల్గొనున్నారు. 

Don't Miss