Activities calendar

31 July 2015

22:10 - July 31, 2015

దర్శకుల్లో ఒక్కొక్కరికి ఒక వెరైటీ ఉంటుంది. బాలీవుడ్ దర్శకుడు బాల్కి కూడా తన సినిమా కథలతో పాటు 'టైటిల్స్' లో ప్రత్యేకత చూపిస్తుంటాడు. ఈయన తొలి సినిమా 'చీనీ కమ్' అనగా చక్కెర తక్కువ అని అర్థం వస్తుంది. ఆ తర్వాత అమితాబ్, అభిషేక్ లు నటించిన 'పా' చిత్రం సూపర్ వెరైటీగా ఉంటుంది. ఇక అమితాబ్, దనుష్ లతో వచ్చిన సినిమాకు వారి పేర్లే వచ్చే విధంగా 'షమితాబ్' అనే టైటిల్ తో అదుర్స్ అనిపించుకున్నాడు. తాజాగా అర్జున్ కపూర్, కరీనా జంటగా రాబోతున్న సినిమాకు 'కీ & కా'టైటిల్ ఖరారు చేశారు. అయితే 'కీ & కా' అంటే ఏమిటని కొంచెం లోతుగా వెళ్లి ఆలోచిస్తే.. కేక పుట్టించే సమాధానం దొరికింది. కీ అంటే లడ్కీ, కా అంటే లడ్కా.. ఈ రెండింటిని మిక్స్ చేసి మ్యాజిక్ చేశాడు. అయితే టైటిల్సే కాకుండా.. వైరైటీ సినిమాలు తీస్తాడని పేరున్న ఈ దక్షిణాది డైరెక్టర్.. జూనియర్ అయిన అర్జున్ కపూర్ సరసన సీనియర్ హీరోయిన్ కరీనాను ఎంపిక చేశాడు. ఈ జంటతో పాటూ స్టోరీ కూడా వెరైటీగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గురువారం విడుదలైన ఈ సినిమా పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ లో అదరగొడుతోంది. ఏమైతేనేం టైటిల్ తో పాటు సినిమాతో కేక పుట్టిస్తాడేమో చూడాలి. 

22:07 - July 31, 2015

1993 ముంబాయి పేలుళ్ల కేసులో నిందితుడు యూకూబ్ మెమన్ ను నిన్న ఉరితీశారు. ఈనేపథ్యంలో మరణశిక్షే పరిష్కారమా..? పేరుతో వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... వివరాలను వీడియోలో చూద్దాం..

22:03 - July 31, 2015

ట్రిపోలీ: లిబియాలో నలుగురు భారతీయ అధ్యాపకుల కిడ్నాప్‌ తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తోంది. ముందుగా ఇద్దరు భారతీయ అధ్యాపకులను చెరనుంచి విడుదల చేసిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు మరో ఇద్దరిని బందీలుగా ఉంచుకున్నారు. దీంతో కిడ్నాపింగ్‌ డ్రామా కొనసాగుతోంది. చెరనుంచి బయట పడ్డవారు ఇద్దరు కర్ణాటక వాసులు కాగా, మరో ఇద్దరు తెలుగు వారు.                                                     
లిబియాలోని ట్రిపోలీ
లిబియాలోని ట్రిపోలీ పట్టణం సిరిటీ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న నలుగురు భారతీయులను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. వారిలో ఇద్దరు తెలుగువారు గోపీకృష్ణ, బలరామ్ ఉన్నారు. విధులకు నలుగురు కలిసి కారులో వెళ్తుండగా మార్గం మధ్యలో కారును ఆపి డ్రైవర్‌ని దించేసి వారిని అపహరించినట్లు తెలుస్తోంది.
విడిపించేందుకు కేంద్ర చర్యలు
లిబియాలో కిడ్నాపైన తెలుగువారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిడ్నాప్‌నకు గురైన భారతీయుల వివరాలను సేకరించటంతో పాటు లిబియా రాయబార కార్యాలయ ప్రతినిధులను అధికారులు ఫోనులో సంప్రదించారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రధాని మోడీని కలిసి కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు.
అధికారులు ఆరా
ఉగ్రవాదుల డిమాండ్లు తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. అయితే ఈ వ్యవహారంలో తమకు పూర్తి సమాచారం అందలేదని...సమాచారం అందిన వెంటనే ఉగ్రవాదుల డిమాండ్ల మేరకు స్పందించనున్నట్లు లిబియా రాయబార కార్యాలయ అధికారులు చెప్పినట్లు సమాచారం. తమవారిని ఎలాగైనా విడిపించాలని వారి కుటుంబ సభ్యులు ఎంబసీ అధికారులను వేడుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా విడిపించే దిశ గా చర్యలు తీసుకోవాలని గోపికృష్ణ కుటుంబసభ్యులు కోరుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వీరంతా లిబియాలో పనిచేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన బలరాంను విడిపించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
ఇద్దరిని విడిచిపెట్టిన తీవ్రవాదులు
కిడ్నాప్‌నకు గురైన నలుగురు భారతీయుల్లో ఇద్దరిని తీవ్రవాదులు విడిచిపెట్టినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. విడుదలైన బందీల్లో ఒకరైన లక్ష్మీకాంత్‌... బలరాం భార్యకు నలుగురం క్షేమంగా ఉన్నట్లు ఎస్సెమ్మెస్‌ చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ధృవీకరించాల్సి ఉంది. గతేడాది జూన్‌లో సైతం ఇరాక్‌ లోని మొసూల్‌లో 39 మంది భారతీయులను ఇస్లామిక్ తీవ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. లిబియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశాన్ని విడిచివెళ్లాలని గతేడాది భారత పౌరులకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

 

21:56 - July 31, 2015

కృష్ణా: విజయవాడలో ఎపి కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశంలో ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదించింది. దాదాపు 8 గంటల సేపు విజయవాడలో సుదీర్ఘంగా ఏపీ కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కరాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. దీని కోసం 5వేల 500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షల రూపాయలు, రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు.

21:54 - July 31, 2015

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అప్ కమింగ్ మూవీ 'సర్దార్' ఫస్ట్ అదిరిపోయింది. పవర్ స్టారే స్వయంగా ఈ పోస్టర్ ను తయారు చేయించాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.  ఈ పోస్టర్ ఎంత వెరైటీగా ఉందంటే. హీరో ఫేస్ కనిపించదు. కనీసం టైటిల్ కూడా లేదు. పవన్ బెల్టుకున్న గన్ ను ఫోకస్ చేస్తూ.. మరో వైపు గుర్రం ఎదురుగా ఆయుధాలు చేతుల్లో ఉన్న ఏడుగురు విలన్స్ నిల్చుని ఉంటారు. గబ్బర్ సింగ్ లో చెప్పినట్లు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలనే డైలాగ్ ఈ పోస్టర్ కు సరిగ్గా సరిపోతోంది. అయితే గబ్బర్ సింగ్ 2 చిత్రాన్నే సర్దార్ పేరుతో తీసుకొస్తుండటంతో అభిమాను ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్కే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేజ్ లో ఉంటుందో చూడాలి మరి. 

21:52 - July 31, 2015

ఢిల్లీ: 'అభివృద్ధే మా ఎజెండా' అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంట్ సంప్రదాయాలను కాపాడుతున్నామని చెప్పారు. 14 నెలల్లో ఒక్క అవినీతి,కుంభకోణం ఘటన కూడ జరగలేదన్నారు. చిన్న ఆరోపణను కూడా మోడీ సహించడని చెప్పారు. కాంగ్రెస్ పార్లమెంట్ ను సక్రమంగా నడవనీయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పసలేని వాదనలు వినిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంతో తాను తెచ్చిన బిల్లును ఇప్పుడు తానే వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు.

21:41 - July 31, 2015

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన మాటనిలబెట్టుకోవాలని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం.. టిడిపి పోరాడుతోందని పేర్కొన్నారు. ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసిపిని ప్రజలు రిజెక్టు చేశారని ఎద్దేవా చేశారు. ఎపికి ప్రతేక్యహోదా లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎక్కడా చెప్పలేదని... ప్రయత్నిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంతో ఎలాంటి రాజీ కుదుర్చుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ప్యత్యేకహోదా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే... ప్రత్యేకహోదాకు చేస్తున్న పోరులో సహకరించండి.. కానీ వ్యతిరేకంగా మాట్లాడకండని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.  

21:19 - July 31, 2015

తూర్పుగోదావరి: కొత్తపేట శివారు బొరుసువారి సావరంలో గల కనకదుర్గమ్మ ఆలయం కింది భాగాన ఉన్న గోదాంలో బాణాసంచా నిల్వలున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ బాణాసంచా నిల్వలు గుర్తించి వాటిని స్వాధీన పరచుకున్నారు. తనిఖీల్లో భాగంగా వాడపాలెంలో సైతం దాడులు నిర్వహించారు. మొత్తం 3 బాణాసంచా తయారీ కేంద్రాలతో పాటు 2 నిల్వ ఉంచిన గోడౌన్లను సీజ్‌ చేసి సుమారు 200 బస్తాల పటాస్‌, 50 బస్తాల మందుసామాగ్రి, 100 బస్తాల మతాబు మందు స్వాధీనం చేసుకున్నారు. మొత్త 30 లక్షల రూపాయల విలువైన మందుగుండు సామాగ్రి స్వాధీనం అయినట్లు అధికారులు ప్రకటించారు.

 

21:08 - July 31, 2015

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు సజీవదహనం అయ్యారు. ఓరియన్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్టులో ఉన్న శంషుద్దీన్ అనే యువకుడు మృతి చెందారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తోన్నారు. రూ. 5 నుంచి 6 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా చేశారు.

 

మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం

లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలుపొందింది.

 

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. యువకుడి సజీవదహనం

హైదరాబాద్: కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ యువకుడు సజీవదహనం అయ్యాడు. ఫర్నిచర్ షాప్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. 

20:28 - July 31, 2015

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బకాయిలు వెంటనే చెల్లించాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్టు 4వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

 

20:24 - July 31, 2015

అతివల వస్త్ర ప్రపంచంలో చీరలెప్పుడూ ప్రత్యేకమే. ఎన్నో ఫ్యాబ్రిక్స్ లో లభ్యమయ్యే ఈ చీరలకు బ్లాక్ ప్రింట్స్ తో కొత్త అందాలు తీసుకొస్తున్నారు డిజైనర్స్. అలాంటి బ్లాక్ ప్రింటింగ్ వెరైటీస్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....


 

20:08 - July 31, 2015

మహిళల సారథ్యంలో సంస్థలు విజయ పథాన పయనిస్తాయని మరోసారి రుజువయ్యింది. అనేక రంగాలలో మహిళల తమ సత్తా చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తారని అధ్యయనాలు తేలుస్తున్నాయి.
మహిళల ప్రత్యేక సెలవుల ప్యాకేజీ
జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మహిళా ఉద్యోగినులకు సెలవుల విషయంలో కాస్త వెసులు బాటు కల్పించింది. వారి కోసం ప్రత్యేక సెలవుల ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
మహిళాశ్రామికుల వినూత్న పథకాలు
త్రిపుర ప్రభుత్వం మహిళా శ్రామికుల కోసం వినూత్న పథకాలను ప్రకటించింది. అనేక రంగాలలో అరకొర వేతనాలకు పనిచేసే మహిళలకు పెన్షన్ పథకాన్ని వర్తింపజేస్తోంది.
భారత మహిళల ఆర్చరీ టీమ్ బెర్త్ ఖరారు
రియోలో జరిగే ఒలంపిక్స్ కు భారత మహిళల ఆర్చరీ టీమ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇటీవల కోపెన్ హాగ్ లో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి సత్తా చాటిన టీం ఒలంపిక్స్ లో స్థానం సాధించింది.

 

20:06 - July 31, 2015

ఎన్నో ఉద్వేగాలు, ఒడిదుడుకులు ఎదుర్కొనే వయస్సు టీనేజ్. ఇదే వయసులో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఆకర్షణ సహజం. ఈ సమయంలో ఇటు తల్లిదండ్రులు అటు స్కూల్ లో టీచర్స్ పెట్టే ఆంక్షలు పిల్లల్ని గందరగోళంలోకి నెడతాయి. మరి ఈ స్థితిలో ఎలా వ్యవహరిస్తే వారి మధ్య చక్కటి సంబంధాలు కొనసాగించవచ్చో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం... ఆ... వివరాలను వీడియోలో చూద్దాం....


 

19:59 - July 31, 2015

మెదక్‌: నకిలీ డాక్టర్‌ ఉదంతం మెదక్‌ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. కర్నాటక మెడికల్‌ అసోసియేషన్‌ చేత అనర్హుడిగా ప్రకటించబడిన ఓ డాక్టర్‌, మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చేరి ప్రాక్టీస్‌ చేస్తూ వైద్యశాఖ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే బీదర్‌ పట్టణానికి చెందిన రాజశేఖర్‌ ఆరు నెలల పాటు వైద్య వృత్తికి అనర్హుడిగా ప్రకటించబడ్డాడు. దీంతో తెలంగాణ చేరుకొన్న రాజశేఖర్‌ మరో వైద్యుడు మురళీ మోహన్‌తో కలిసి ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. తెలంగాణ మెడికల్‌ అసోసియేషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా వైద్య సేవలు నిర్వహిస్తున్న విషయం బయటకు పొక్కింది. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు మెరుపు దాడి చేసి సంబంధిత ఆసుపత్రిని సీజ్‌ చేసి, నిర్వాహకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

 

19:52 - July 31, 2015

ఢిల్లీ: హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన పూర్తయ్యే వరకు లోక్‌సభలో ఆందోళన విరమించేది లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. విభజన చట్టంలో హైకోర్టు విభజన ప్రస్తావన ఉన్నా జాప్యం చేయడం సరికాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు విభజనలో చొరవ చూపకుండా.. తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని కవిత విమర్శించారు. హైకోర్టు విభజనలో కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. 

19:41 - July 31, 2015

ఢిల్లీ: ఎలాంటి చర్చ జరగకుండానే రాజ్యసభ వాయిదా పడింది. వ్యాపం స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాల్సిందేనని సభ ప్రారంభం నుంచి ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. సభ సజావుగా సాగాలంటే ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మాణాలపై చర్చ జరపాలని కాంగ్రెస్‌ సభ్యుడు గులాంనబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలతో ప్రభుత్వం జరిపే సమావేశంలో స్పష్టత రావాలని ఆజాద్‌ పేర్కొన్నారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్‌ నక్వీ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు అడ్డుకున్నాయి. సభ్యుల గందరగోళం మధ్య డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

 

19:27 - July 31, 2015

వరంగల్: రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండటంతో మేధావులు, అన్నదాతలు, అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో ప్రతి ఒక్కరూ రైతులకు బాసటగా నిలిచి ఆత్మహత్యల నివారణకు కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయమం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యల నివారణకు, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు జస్టిస్‌ చంద్రకుమార్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆత్మహత్యల కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ చంద్రకుమార్‌తో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ప్రభుత్వాలు చొరవతీసుకుని... రైతుల ఆత్మహత్యలను నివారించాలన్నారు.

 

19:14 - July 31, 2015

నిజామాబాద్: ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడంలేదంటూ ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా దగ్గర మున్సిపల్ కార్మికులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇంతలో నర్సింగ్ అనే కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేశారు.

19:09 - July 31, 2015

లిబియా: ట్రిపోలీలో అదృశ్యమైన భారతీయుల్లో.... నాచారానికి చెందిన గోపికృష్ణ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏడేళ్లుగా గోపికృష్ణ లిబియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడని.. విధులకు వెళ్లి వస్తుండగా డ్రైవర్‌ను దించి కిడ్నాప్‌కు పాల్పడినట్లు తెలుస్తుందని గోపికృష్ణ భార్య కళ్యాణి అంటున్నారు. తన భర్త విడుదలకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇద్దరు భారతీయులను విడిచిపెట్టిన ఉగ్రవాదులు

లిబియా: ట్రిపోలీలో కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయుల్లో ఇద్దరిని ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు బలరాం భార్యకు సమాచారం అందింది. కర్నాటకకు చెందిన లక్ష్మికాంత్, విజయ్ కమార్ లను క్షేమంగా వదలిపెట్టారు. ఉగ్రవాదుల చెర నుంచి మరో ఇద్దరినీ రక్షించేందుకు విదేశాంగశాఖ ప్రయత్నాలు చేస్తోంది.

 

లిబియాలో కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయులు క్షేమం..

ట్రిపోలీ: లిబియాలో కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయులు క్షేమంగా ఉన్నారు. కిడ్నాప్ చేసిన నలుగురిని ఉగ్రవాదులు క్షేమంగా వదిలిపెట్టారు. క్షేమంగా ఉన్నామంటూ... బలరాం.. తన కుటుంబసభ్యులకు మెసెజ్ పంపారు. దాంతోపాటు బలరాం భార్యకు విదేశాంగ శాఖ నుంచి పోన్ చేసి.. కిడ్నాప్ అయిన నలుగురూ సేఫ్ గానే ఉన్నారని తెలిపింది. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. ట్రిపోలీలో బలరాం, గోపికృష్ణ, లక్ష్మికాంత్, విజయ్ కమార్ లు మొన్న కిడ్నాప్ కు గురయ్యారు. 

17:50 - July 31, 2015

హైదరాబాద్: తెలంగాణలో అక్టోబర్‌ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం కేసీఆర్‌ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నూతన ఎక్సైజ్‌ విధానం రూపొందిస్తామన్నారు. గుడుంబా వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. గుడుంబా మహమ్మారిని అరికట్టాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. గుడుంబా నివారణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాణాలకు హాని కలిగించని విధంగా తక్కువ ధరకే మద్యాన్ని అందించేందుకు సర్కార్‌ నిర్ణయిస్తుందని వివరించారు. కల్తీ కల్లును అరికడతామన్నారు. వచ్చే ఏడాది చెరువుకట్టలపై 5 కోట్ల ఈత మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం అంతా..ఇక్కడే తయారయ్యే విధంగా డిస్టలరీస్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

 

ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఎన్ కౌంటర్...

హైదరాబాద్: ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మల్కన్ గిరి పీఎస్ పరిధి చిత్రకొండ అటవీప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. 

ఇందిరాగాంధీ విమానశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎయిర్ ఇండియా

ఢిల్లీ: ఇందిరాగాంధీ విమానశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఏఐ-410 విమానం.. పాట్నా నుంచి బయలుదేరింది. సాంకేతిక లోపం ఏర్పడడంతో అనుమతి పొంది పైలెట్ విమానాన్ని దించాడు. 

తెలంగాణలో నూతన ఎక్సైజ్ విధానం

హైదరాబాద్: తెలంగాణలో నూతన ఎక్సైజ్ విధానానికి టీసర్కార్ శ్రీకారం చుట్టింది. అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమలు కానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గుడుంబా వల్ల సంక్షేమ పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా నివారణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హాని కలిగించని మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని సీఎం పేర్కొన్నారు. కల్తీ కల్లును అరికడతామన్నారు. వచ్చే ఏడాది చెరువుకట్టలపై 5 కోట్ల ఈత మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం అంతా..ఇక్కడే తయారయ్యే విధంగా డిస్టలరీస్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

 

భెల్ కంపెనీ నిర్వాసితుల పరిహారం చెల్లింపులో అక్రమాలు..

హైదరాబాద్: భెల్ కంపెనీ నిర్వాసితుల పరిహారం చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. రూ.1.4 కోట్ల అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఆర్ ఐ వెంకటలక్ష్మి, వీఆర్వో నారాయణప్పలపై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్ కూన శశిధర్... వీఆర్ ఏను విధుల నుంచి తొలగించారు.

 

16:31 - July 31, 2015

కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ దేవీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబుకు దుర్గ గుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబు.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. పట్టు చీరను సమర్పించారు. దర్శనానంతరం చంద్రబాబుకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్రంలో పాడి పంటలు పుష్కలంగా పండి రైతులందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

16:25 - July 31, 2015

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్ధులు ఆందోళన బాటపట్టారు. పాత పద్దతిలోనే గ్రూప్ పరీక్షలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిరసన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అనేక లోపాలున్నాయని అభ్యర్థులు ఆరోపించారు. కొత్తగా తీసుకొస్తున్న గ్రూప్-3తో ప్రభుత్వం నిరుద్యోగులకు పొట్టగొట్టే కుట్ర చేస్తోందన్నారు. గ్రూప్-2కు సంబంధించి ఇంటర్వూ విధానాన్ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్యసభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇరు సభల స్పీకర్లు ప్రకటించారు.

 

16:00 - July 31, 2015

గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం నిమిత్తం భూసమీకరణకు ఆగస్టు 20 వరకు గడువు ఇస్తున్నట్లు.. ఆ తర్వాత భూసేకరణ చేపడతామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామకంఠాన్ని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావులు పరిశీలించారు. ఉండవల్లి గ్రామం మధ్యలో ఉన్న 100 ఎకరాలను వదిలేస్తే.. మిగిలిన భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొనడంతో మంత్రులు గ్రామ పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. కూలీలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

15:55 - July 31, 2015

శ్రీకాకుళం: ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల చెరలో తమ బిడ్డ ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న గోపీకృష్ణ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన టి.గోపికృష్ణ లిబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. గోపికృష్ణ కిడ్నాప్ కు గురయ్యారని హైదరాబాద్‌లోని నాచారంలో నివాసమున్న గోపీకృష్ణ భార్య, సోదరులకు సమాచార అందింది. దీంతో టెక్కలిలో నివాసం ఉంటున్న గోపికృష్ణ తండ్రి నాయణరావుకు సమాచారం చేరవేశారు. ఇప్పుడు గోపికృష్ణ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గోపి కృష్ణను దుండగుల చెరనుండి సురక్షితంగా విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తండ్రి నారాయణరావు వేడుకుంటున్నారు.

 

15:51 - July 31, 2015

ఢిల్లీ: స్టేట్‌ స్పెషల్ స్టేటస్ అంశంపై కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ రావ్‌ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిర్ణయమేదీ... కేంద్రప్రభుత్వం తీసుకోలేదని మంత్రి ఇంద్రజిత్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో స్పెషల్ స్టేటస్ అంశంపై సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బీహార్, ఒడిశా సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌ సిఫార్సులను అనుసరించి.. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరిపినట్లు వెల్లడించారు.

 

లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్ ...

ట్రిపోలి: లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. ట్రిపోలి సమీపంలో ఆ.. నలుగురిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల చెరలో తెలుగు రాష్ట్రాలకు చెందిన గోపీకృష్ణ, బలరాం, మరో ఇద్దరు కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, లక్ష్మికాంత్. బలరాం... హైదరాబాద్ లోని కుషాయిగూడ, గోపికృష్ణ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. గోపీకృష్ణ.. ఏడేళ్లుగా లిబియాలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు కిడ్నాప్ ను ధృవీకరించారు. పరిస్థితిని ప్రధానికి వివరించామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

 

ఎఫ్ టిఐఐ విద్యార్థుల ఆందోళనకు రాహుల్ మద్దతు

పుణే: ఎఫ్ టిఐఐ విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ప్రధాని మోడీపై రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నారు..మోడీ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించరు. పార్లమెంట్ లోనూ అదే విధంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వారిని దేశద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా పోల్చుతున్నారని పేర్కొన్నారు.

 

యువజనోత్సవదినంగా కలాం పుట్టినరోజు...

చెన్నై: భారత మాజీ రాష్ట్రపతి డా.ఎపిజె అబ్దుల్ కలాం పుట్టినరోజు అక్టోబర్ 15ను యువజనోత్సవ దినంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. కలాం పేరిట జాతీయ పురస్కారం ఇవ్వనుంది. పురస్కార గ్రహీతలకు రూ. 5లక్షల నగదు, 8 గ్రాముల బంగారం పతకం బహూకరించనున్నారు. 

కేసీఆర్ పదవీచ్యుతుడు అవడం ఖాయం: గాలి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ అడ్డంగా దొరికారని.. హైకోర్టు తుది తీర్పు తర్వాత ఆయన పదవీచ్యుతుడు అవడం ఖాయమని టిడిపి నేత గాలిముద్దుకృష్ణమనాయుడు అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి.. ఎపిలో పెట్టుబడులు పెట్టకుండా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తాననడం సిగ్గుచేటన్నారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదు: ఇంద్రజిత్ సింగ్

ఢిల్లీ: ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని లోక్ సభలో కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు ఎటువంటి పాలసీ లేదన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మాత్రం ఇవ్వగలమని చెప్పారు.

 

13:42 - July 31, 2015

హైదరాబాద్: ఆదిలాబాద్‌ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రెబ్బన, తిర్యాణి, వాంకిడి తదితర మండలంలోని పలు గ్రామాల్లో డమేరియా, మలేరియా ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గత వారం రోజులుగా వైద్యాధికారులకు చెప్తున్నా.. ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

13:41 - July 31, 2015

ఖమ్మం:కారేపల్లి మండలంలో దారుణం జరిగింది. పంతుల్‌నాయక్‌తండాలో కౌసల్య అనే మహిళను తెల్లవారుజామున దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఊర్లో చిన్న కిరాణాషాపు నడుపుతున్న కౌసల్యను.. కొంతమంది యువకులు అరువు కావాలని అడిగారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో చంపుతామని యువకులు బెదిరించారని.. మృతురాలి బంధువులంటున్నారు. హత్యకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

13:40 - July 31, 2015

నల్లగొండ:భువనగిరిలో రైలు కిందపడి సాయి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

13:39 - July 31, 2015

ప్రేయసికి ప్రేమ సందేశం. ప్రియుడికి విరహ విన్నపం. బాస్‌కు సెలవు పెడుతూ సారీ. బిజినెస్‌ బాజా మోగించే భజరంగీ భాయీజాన్‌లు. తడిమితే చాలు తన్నుకుంటూ వచ్చే కొత్త సంగతులు. మీటితే పలికే సంగీత స్వరాలు. నొక్కితే చాలు నాట్యవిన్యాసాలు. దాగుడుమూతలు..దాచుకునే చిలిపి చెమ్మచెక్కలు..రహస్య మంతనాలు..బ్యాంకు బ్యాలెన్సులు అన్నీ ఒక దాంట్లోనే.. అందమైన బుల్లి పిట్టలోనే. ఆ బుల్లిపిట్టలోని బోలెడు సంగతులన్నీ ఎవరికో తెలిసిపోతున్నాయి. మీ అలవాట్లను, అంతరంగాలను, ఆత్మీయ సంబంధాలను వేరెవరో చదివేస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్‌కు బాగా అలవాటుపడుతున్న జనం....
స్మార్ట్‌ ఫోన్‌. లంచ్‌ లేకపోయినా పర్వాలేదు. నిద్ర కరువైనా కలతే లేదు. కాని స్మార్ట్‌ ఫోన్‌ కనపడకపోయినా.. ఒక్క నిమిషం అది పని చేయకపోయినా.. కోమాలోకి వెళ్లిపోతున్నారు జనం. అది లేకపోతే ఇక ఏ పనీ కాదు. అసలు బుర్రే పని చేయదు. అంతలా అలవాటుపడిపోయారు. ఆన్‌ లైన్‌ అకౌంట్స్‌.. అందులోంచి పేమెంట్స్‌.. అరచేతిలో అన్నీ పెట్టేసుకుని యమ దర్జాగా గడిపేస్తున్నారు. యాప్స్‌ను యాపిల్స్‌లా కొరుక్కు తినేస్తున్నారు. మెసేజ్‌ రావడం ఆలస్యం.. అదేంటే తెలియకపోయినా సరే డౌన్‌లోడ్‌ కొట్టేసి.. కొత్త యాప్‌ లోడింగ్‌ చేసేస్తున్నారు. ఆటలు, పాటలు.. ఆ పై మాటలు అన్నీ ఇక అందులోనే. కాని దాని వెనుకే ఓ ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు.
హ్యాకింగ్‌కు గురవుతున్న స్మార్ట్‌ఫోన్స్‌...
హ్యాకింగ్‌. ఇప్పుడిప్పుడే సామాన్యులకు కూడా తెలుస్తున్న విషయమిది. కంప్యూటర్‌నో, సర్వర్‌నో హ్యాక్‌ చేయడం.. ఒక వెబ్‌సైట్‌లోకి ఎంటరైపోయి దాని తమ చేతిలోకి తెచ్చుకోవడం హ్యాకర్లు చేసే పని. నెట్‌కి క్లోజ్‌ అయిపోయిన స్మార్ట్‌ఫోన్‌ కూడా వీరి టార్గెట్‌లోకి వచ్చేశాయి. స్మార్ట్‌గా ఆలోచించే హ్యాకర్లకు ఈ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడటం పెద్ద కష్టమేం కాదు. ఆ ఫోన్‌లోని మన ముచ్చట్లన్నీ లాగేస్తున్నారు.
ఫ్రీ యాప్స్‌ రూపంలోనే హ్యాకింగ్‌ వైరస్‌...
ఫ్రీ డౌన్‌లోడ్‌. ఈ పదం కనపడితే చాలు సంబరపడిపోయి యెస్‌ అని నొక్కేస్తున్నారు. అదే ప్రమాదమంటున్నారు నిపుణులు. ఫ్రీ యాప్స్‌ రూపంలోనే ఈ దొంగలు దూరేస్తున్నారు. ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన దగ్గర్నుంచీ దాని పని అది చేసుకుపోతుంది. డేటా మొత్తం లాగేస్తుంది. కొంతమంది ఈ ప్రమాదాన్ని గుర్తించిన తర్వాత కూడా బయటపడలేకపోతున్నారని.. వారు డేటా బ్యాకప్‌ తీసుకుని ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్‌మెంట్‌ చేస్తున్నారని.. కాని ఆ బ్యాకప్‌లో కూడా హ్యాకింగ్‌ వైరస్‌ అలాగే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సో స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌. ఫ్రీగా వస్తున్నాయి కదాని ఏ యాప్స్‌ పడితే ఆ యాప్స్‌ డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీ రహస్యాలు, ముచ్చట్లు అన్నీ బట్టబయలే. బీకేర్‌ఫుల్‌

రాజమండ్రిలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన..

రాజమండ్రి:పుష్కరాల్లో విధులు నిర్వహించిన తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన తమకు డబ్బు చెల్లించేందుకు అధికారులు కమీషన్ అడుగుతున్నారని నిరసన తెలిపారు. రాత్రనకా పగలనకా కష్టపడ్డ మాకు కూలీ డబ్బుఇవ్వడానికి కూడా అధికారులు కమీషన్లు అడగడం అన్యాయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య విద్యార్థిని హత్య కేసులో నలుగురికి జీవితఖైదు..

గుంటూరు:వైద్యవిద్యార్థిని శ్వేత హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2012లో కృష్ణా జిల్లాకు చెందిన శే ్వతను కిడ్నాప్‌ చేసి హతమార్చారు.

విద్యుత్ ఉద్యోగల వివాదం పై చేతులెత్తేసిన కేంద్రం...!

ఢిల్లీ:తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారిన విద్యుత్ ఉద్యోగుల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించడంలో కేంద్రం చేతులెత్తేసింది. నేటి ఉదయం కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల వాదనలు విన్న హోం శాఖ ఉన్నతాధికారులు, వివాదాన్ని కోర్టు పరిధిలోనే తేల్చుకోండని చెప్పి సమావేశాన్ని ముగించారు. దీంతో వివాదం పరిష్కారం కానుందన్న భావనతో అక్కడికి వెళ్లిన కృష్ణా రావు, రాజీశ్ శర్మలు తలలు పట్టుకున్నారు.

 

అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత...

సత్తెనపల్లి: పెద్ద మొత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీసులు లారీలో తరలిస్తున్న 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని పిడుగురాళ్ల నుంచి కాకినాడకు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తీవ్ర పరిణామాలు ఉంటాయి:చోటా షకీల్..

న్యూఢిల్లీ: మెమన్ ఉరి తీయడం భారత ప్రభుత్వం చట్టపరంగా చేసిన హత్య అని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు షకీల్ అభివర్ణించారు. అందుకు తగ్గ పరిణామాలు ఉంటాయని భారత ప్రభుత్వాన్ని చోటా షకీల్ హెచ్చరించారు. టైగర్ మెమన్ చర్యలకు గాను అతడి సోదరుడిని శిక్షించారన్నారు. యాకుబ్ మెమన్ అమాయకుడు అని గుర్తు చేశారు. అలాంటి వాడిని ఉరి తీసి భారత ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. స్వదేశానికి వచ్చి లొంగిపోతే ఉరి శిక్ష వేయమంటూ యాకుబ్ కు ప్రమాణం చేసి నమ్మక ద్రోహనికి పాల్పడిందని ఆయన భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు చోటా షకీల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

గ్రూప్ -2 ఇంటర్వ్యూ రద్దు చేయాలి:ఓయూఐకాస

హైదరాబాద్: గ్రూప్-2లో ఇంటర్వూ విధానం రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్శిటీ ఐకాస నేతులు టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ చక్రపాణిని వినతిపత్రం సమర్పించారు.

12:53 - July 31, 2015

హైదరాబాద్:నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది.. సిబ్బంది అంతర్గత కుమ్ములాటలు విద్యార్థులపాలిట శాపంగా మారాయి.. ఇద్దరు విద్యార్థుల ఇంటర్ మెమోలో మార్కులను చెరిపేసి సర్టిఫికేట్లను ఇష్యూ చేశారు అధికారులు.. ఆ తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యాలయంముందు ఆందోళనకు దిగారు. .                                                               
ఫిజిక్స్ లో అబెదా అనే విద్యార్థికి 53 మార్కులురాగా...
ఫిజిక్స్ లో అబెదా అనే విద్యార్థికి 53 మార్కులురాగా... అందులోని మూడో నెంబర్‌ను చెరిపేశారు.. అక్షరాల్లోకూడా ఫిఫ్టీ త్రీలో త్రీని తీసేశారు.. దీంతో ఆ సబ్జెక్టులో ఐదు మార్కులువచ్చినట్లు మెమో జారీ అయింది.. సిద్దార్థ అనే మరో విద్యార్థికి కూడా ఇలాగే చేశారు.. వీరి సర్టిఫికేట్లు చూసిన ఇతర విద్యాసంస్థలు... వారికి తమ కాలేజీలో సీటు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.. ఇలా సిబ్బంది నిర్వాకంతో ఆ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది..అయితే ఈ విషయంపై ఎల్ డీసీ లు మాత్రం తమదేం తప్పులేదంటున్నారు.. విద్యార్థి చెప్పినతర్వాతే తమకు ఈ విషయం తెలిసిందని చెబుతున్నారు..
రకరకాలుగా సమాధానం చెపుతున్న ప్రిన్సిపల్...
అటు ప్రిన్సిపల్ మాత్రం ఇది ఓసారి సీబీఎస్ ఈ తప్పని.. మరోసారి తమదే పొరపాటని.. ఇంకోసారి తమ ఆఫీసులోనే ఇలా జరిగిఉంటుందంటూ.. రకరకాలుగా సమాధానం చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారు.. కొత్త మెమో ఇప్పిస్తామంటూ నెలరోజులుగా వారిని తమ ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటూనేఉన్నారు. కావాలనే తమ పిల్లల మెమోల్లో మార్కులు మార్చారని ఆరోపిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.. వెంటనే అసలు మార్కులతో మరో మెమో ఇప్పించి తమ పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నారు.. 

12:50 - July 31, 2015

గుంటూరు: ర్యాగింగ్ రక్కసికి బలైన విద్యార్థిని రితికేశ్వరి కేసులో చర్యలు తీసుకునే దిశగా పోలీసులు మొదటి అడుగు వేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ రక్కసికి రితికేశ్వరి అనే విద్యార్థిని బలైన విషయం విదితమే. అయితే ఆ కేసు విషయంలో అనేక అనుమానాలున్నాయని, ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు ముగ్గురు నిందితులని అరెస్టు చేసి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. కోర్టు ఆ ముగ్గురు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది.

12:47 - July 31, 2015

హైదరాబాద్:పూనె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్‌ను నియమించడంపై కొనసాగుతున్న ఆందోళనలకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు. నేడు పూనెకు చేరుకున్న రాహుల్‌.. వారి నిరసనోద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్ధులతో రాహుల్ భేటీ అయ్యారు. ఎస్‌ఎస్‌యూఐ విద్యార్ధి సంఘం ఇన్‌స్టిట్యూట్ ముందు ఆందోళన నిర్వహించింది. అయితే రాహుల్‌గాంధీని నిరసిస్తూ బిజెపి సైతం నిరసన ప్రదర్శనకు దిగింది.

12:46 - July 31, 2015

హైదరాబాద్:లిబియాలో నలుగురు భారతీయులు అదృశ్యమయ్యారు. అందులో ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నారు. ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. లిబియా రాజధాని ట్రిపోలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉ్రగవాదుల చెరలో హైదరాబాద్‌కు చెందిన గోపీకృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బలరాం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం తెల్సుకున్న భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. లిబియా దేశ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తోంది. 

తాలిబన్ సుప్రీం కంమాండర్ గా ముల్లా అక్తర్ మన్సోర్...

హైదరాబాద్:ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ సుప్రీం కమాండర్ గా కొత్త నాయకుడుని ఎంపిక చేశారు. ముల్లా మహ్మద్ ఒమర్ చనిపోయినట్టు ఇటీవల ప్రకటించడంతో నూతన నాయకుడిగా ముల్లా అక్తర్ మన్సోర్ ను ఎన్నుకున్నట్టు తాలిబన్ తమ వెబ్ సైట్ లో తెలిపింది. సుదీర్ఘకాలం నుంచి ఒమర్ కు నమ్మకస్తుడుగా, సన్నిహితుడుగా ఉంటున్నందువల్లే మన్సోర్ ను నియమించినట్టు వారి పాష్టో భాషలో పేర్కొన్నారు. కాగా ఒమర్ తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్న తాలిబన్ గ్రూప్, ఎప్పుడు, ఎక్కడ మరణించాడనేది మాత్రం వెల్లడించలేదు.   

రిషితేశ్వరి కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్...

గుంటూరు: ర్యాగింగ్ రక్కసికి బలైన విద్యార్థిని రితికేశ్వరి కేసులో చర్యలు తీసుకునే దిశగా పోలీసులు మొదటి అడుగు వేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ రక్కసికి రితికేశ్వరి అనే విద్యార్థిని బలైన విషయం విదితమే. అయితే ఆ కేసు విషయంలో అనేక అనుమానాలున్నాయని, ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు ముగ్గురు నిందితులని అరెస్టు చేసి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. కోర్టు ఆ ముగ్గురు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది.

నా భర్త విడుదలకు చర్యలు తీసుకోండి:గోపీ కృష్ణ భార్య

హైదరాబాద్: లిబియాలో నా భర్త కిడ్నాప్ అయ్యారన్న సమాచారం వచ్చిందని గోపికృష్ణ భార్య కల్యాణి తెలిపారు. కిడ్నాప్ సమాచారంపై ఆమె స్పందిస్తూ.. ఏడేళ్లుగా నా భర్త లిబియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. విధులకు వెళ్తుండగా డ్రైవర్‌ను దించి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తులను విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు నిన్న నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. 

కడపలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు...

కడప:కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను కడపలో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.5.23 లక్షల నగదు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న దొంగను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారని తెలిసింది. 

రేపటి నుంచి తిరుమల పుష్కరిణి మూసివేత...

తిరుపతి:తిరుమల శ్రీవెంకటేశ్వరునికి సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు ఆలయం పక్కనే ఉన్న ప్రధాన పుష్కరిణిని మూసి వేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నిత్యమూ సాయంత్రం జరిపే పుష్కరిణి హారతిని కూడా తాత్కాలికంగా ఆపుతున్నట్టు వివరించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణిని మరింత అందంగా చేసేందుకు మరమ్మతు పనులు ప్రారంభించాల్సిన కారణంగానే భక్తుల స్నానాలు నిలుపుదల చేసినట్టు టీటీడీ తెలిపింది.

సీఎం చంద్రబాబుతో భేటీ కానున్ను రిషితేశ్వరి భేటీ...

విజయవాడ:గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నేటి ఉదయం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రిని కలిసిన వారు, ఆ తర్వాత నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో వారు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు చంద్రబాబును కోరనున్నారు.  

డివైడర్ ను ఢీకొన్న లారీ:ఒకరు మృతి...

కర్నూలు:జిల్లాలో డోన్‌ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్నూలు నుంచి అనంతపురానికి ఇనుప కడ్డీల లోడ్‌తో వెళ్తున్న లారీ ఐటీఐ కాలేజీ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్‌కు గాయాలయ్యాయి. లారీ అనంతపురంకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. 

 

కొమానపల్లి ఎస్ బీఐలో అగ్ని ప్రమాదం...

తూ.గో:జిల్లాలోని ముమ్మిడివరం మండలం కొమానపల్లి ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.3.40 లక్షల ఆస్తినష్టం సంభవించింది. బ్యాంకు ప్రధాన ద్వారం కింద ఉన్న ఖాళీ నుంచి ఎవరో కావాలనే పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారని బ్యాంకు సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

12:11 - July 31, 2015

అనంతపురం: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోని రిషితేశ్వరి ఘటన మరవకముందే.. నెల్లూరులో ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యారు. సీనియర్ల అరాచకాలను భరించలేక.. అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి మధుసూదన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులో గాయత్రి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీలో మధుసూదన్‌రెడ్డి.. జాయిన్ అయ్యారు. హాస్టల్ గదిలో తోటి విద్యార్థులు చితక బాదినట్లు తెలుస్తోంది. దీన్ని భరించలేని విద్యార్థి స్వస్థలం తన స్వగ్రామం ఓబుళదేవరచెరువు చేరుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాల్ డేటా వివరాలను సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్లు

విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్లో విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించారు.

12:03 - July 31, 2015

హైదరాబాద్:బీజేపీ ప్రభుత్వం ఎయిమ్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో జమ్మూలో బంద్‌ కొనసాగుతోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎయిమ్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఇచ్చిన బంద్‌కు 70 ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. జమ్మూకు ఎయిమ్స్‌ కేటాయిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ జమ్మూ ప్రజలను మోసం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. బంద్‌ నేపథ్యంలో జమ్మూలో షాపులన్నీ మూతపడ్డాయి. పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12:01 - July 31, 2015

హైదరాబాద్‌: ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్‌ చేపట్టిన దీక్ష ఉధృతమైంది. నేడు ఉప్పల్‌ బంద్‌కు బిజెపితో పాటు అన్ని రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్‌కు మిత్రపక్షం టిడిపి మద్దతు తెలుపగా.. వామపక్షాలు ఉప్పల్‌లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

11:58 - July 31, 2015

హైదరాబాద్:తలసాని రాజీనామాపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఈ మేరకు మరోసారి ఆయన స్పీకర్‌ మధుసుదనాచారికి ఫిర్యాదు చేశారు. లేదంటే న్యాయపోరాటం తప్పదన్నారు శశిధర్ రెడ్డి.

11:56 - July 31, 2015

విజయవాడ: తొలిసారిగా బెజవాడ కనక దుర్గమ్మ వారి సన్నిధానంలో... ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికగా ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో నూతన రాజధాని నిర్మాణం, రాష్ర్ట ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై సుదీర్ఘ చర్చసాగుతన్నట్లు సమాచారం. ప్రధానంగా నవ్యాంధ్ర రాజధానిపైనే ఎక్కువసేపు చర్చించనుట్లు తెలుస్తోంది. అమరావతి ప్రధాన ప్రాంత బృహత్తర ప్రణాళికను... సింగపూర్ ప్రభుత్వం సమర్పించాక... జరుగుతున్న తొలి సమావేశం కావడంతో రాజధాని నిర్మాణంపైనే చర్చ సాగనుంది. రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి..? కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి..? పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాల్సినవి భవనాలేంటి..? వంటి అనేక అంశాలపై మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇరు రాష్ర్టాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం, రైతు రుణమాఫీ మూడోదశ అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు రానున్నట్లు సమాచారం.

11:54 - July 31, 2015

విజయవాడ : తమ కూతురు ఆత్మహత్య ఘటన కేసులో నిందితులందరికి కఠిన శిక్షలు పడాలని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. తమకుటుంబానికి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తన కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా రిషితేశ్వరీ ఆత్మహత్య ఘటన బాధాకరమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. 

ఒంగోలులో నెలకొల్పనున్న ఐఐటీకి కలాం పేరు!

విజయవాడ: ఒంగోలులో నెలకొల్పనున్న ఐఐటీకి కలాం పేరు పెట్టాలని ఏపి కేబినెట్ ఆసక్తి చూపినట్లు నిర్ణయించినట్లు సమాచారం.

లోక్ సభలో గందరగోళం

ఢిల్లీ: లిలత్ గేట్, వ్యాపం కుంభకోణంపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.దీంతో లోక్ సభలో గందరగోళం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

బొగ్గు కుంభకోనం కేసులో మధుకోడాపై అభియోగాలు

ఢిల్లీ: బొగ్గు కుంభకోనం కేసులో మధుకోడాపై అభియోగాలు నమోదు చేసిన పాటియాల హౌస్ కోర్టు జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ .సి. గుప్తాలతో పాటు మరో ఆరుగురిపై కూడా అభియోగాలు నమోదు చేసింది.

సీనియర్ కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ

ఢిల్లీ: ప్రధాని మోదీ సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు,నిత్ గడ్కరీ, సుష్మాస్వరాజ్ తో భేటీ అయ్యారు.

 

ఢిల్లీలో విద్యుత్ ఉద్యోగుల విభజనపై కీలక సమావేశం

ఢిలీ:కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజనపై కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

మంత్రి తలసాని పై చర్యలు తీసుకోండి: మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్: స్పీకర్ మధు సూదనాచారిని మాజీ కేంద్ర మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కలిశారు. మంత్రి తలసాని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఓబుళదేవరం చెరువులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం: ఓబుళదేవరం చెరువులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మధుసూదన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి ర్యాగింగే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రెంట చింతలలో వివాహిత దారుణ హత్య

గుంటూరు: రెంట చింతలలో వివాహిత దారుణ హత్య జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు బాలమ్మ అనే మహిళను బంధువులు నరికి చంపేశారు.

 

ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రాజధాని నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపైనా కేబినెట్‌ చర్చలు జరుపనుంది. విజయవాడలో తొలిసారి ఏపీ కేబినెట్‌ భేటీ జరుగుతోంది

 

నేటి నుంచి లాల్ దర్వాజ బోనాల జాతర

హైదరాబాద్:లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. తెల్లవారుజామున అ మ్మవారికి వేదపండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ దంపతులతోపాటు నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు.

సింహాచలందేవాలయంలో భక్తుల ఆందోళన

విశాఖ: సింహాచలం ఆలంలో భక్తుల ఆందోళనకు దిగారు. ప్రసాదంగా ఇస్తున్న లడ్డూల్లో పురుగులు వచ్చాయంటూ భక్తులు ఆందోళనకు దిగారు.

'మెడికల్ 'బి' కేటగిరి సిట్ల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

విజయవాడ: మెడికల్ 'బి' కేటగిరి సిట్లను నిబంధనలకు విరుద్ధంగా కేటాయిస్తే కఠిన చర్యలు నిర్ధేశించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి కామినేని అనుమానం వ్యక్తం చేశారు. మేనేజ్ మెంట్ కోటాలో ఎంపికైన అభ్యర్థులను మభ్యపెట్టే కాలేజీలను బ్లాక్ లిస్టులులో పెడతామని హెచ్చరించారు.

లిబియాలో నలుగురు భారతీయ అధ్యాపకులు అదృశ్యం

లిబియా: ట్రిపోలిలో నలుగురు భారతీయ అధ్యాపకులను ఇస్లామిక్ స్టే ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో ఒకరు తెలంగాణకు చెందిన గోపీ కృష్ణ ఉన్నారు. మరో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు కిడ్నాప్ ను ధృవీకరించారు. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఉగ్రవాదుల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని ప్రభుత్వం తెలిపింది.

జలంధర్ రైల్వే స్టేషన్ లో పాక్ మహిళ అరెస్ట్

పంజాబ్:జలంధర్  రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కనిపించిన పాక్ మహిళను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ వద్ద వీసా, పాస్ పోర్టులూ లేవని, సల్మాన్ ను కలిసేందుకు వచ్చానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ఢిల్లీ: స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 1250 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనీ, కోర్టు తీర్పును అమలు పర్చాలనీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.

కాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న మధ్యప్రదేశ్ సీఎం

ఢిల్లీ: కాసేపట్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాన మంత్రితో భేటీ కానున్నారు. వ్యాపం కేసులో విపక్షాల రాజీనామా డిమాండ్ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఢిల్లీలో మ.2 గంటలకు అఖిల పక్ష సమావేశం

ఢిల్లీ: పార్లమెంట్ లో ప్రతిష్టంభనకు తెరదించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించనుంది.

దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయ పద్దతిలో సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర ఉన్నారు.

ఉప్పల్ లో కొనసాగుతున్న బంద్...

హైదరాబాద్:సమ్మె కాలంలో విధులకు గైర్హాజరయ్యారనే కారణంగా జీహెచ్ఎంసీ తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేపట్టిన దీక్ష నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పిన ఎన్వీఎస్ఎస్, దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా నేడు ఉప్పల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.  

రేవంత్ రెడ్డి బెయిల్ షరతుల సడలింపు పిటిషన్ కొట్టివేత...

హైదరాబాద్:ఓటుకు నోటు కేసు ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి నిన్న హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం వీడరాదంటూ విధించిన బెయిల్ షరతులను సడలించాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాదుకు వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రబావితం చేస్తారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేశారు.  

విశాఖలో సీనియర్ జర్నలిస్టు శేఖర్ ఆత్మహత్య...

విశాఖ:రైల్వేలో పనిచేస్తున్న తన భార్యను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ సీనియర్‌ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ నగరంలో జరిగింది. తన భార్యను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని సూసైడ్‌ నోట్‌ రాసిన సీనియర్‌ జర్నలిస్టు శేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆవేదనను శేఖర్‌ పలువురు జర్నలిస్టులకు తెలిపి, నిన్న ఆత్మహత్య చేసుకుంటానన్న ధోరణిలో మాట్లాడారని సమాచారం.

09:55 - July 31, 2015

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. సాయి నామస్మరణతో బాబా ఆలయాలు మార్మోగిపోతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఫిలింనగర్‌ దైవ సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ, వరంగల్‌, విజయవాడ, ఉభయగోదావరి, నల్లగొండ జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

09:53 - July 31, 2015

రైతులంటే నేతలకు అలుసా? లవ్‌ ఫెయిల్యూర్‌ వల్లే అన్నదాతల ఆత్మహత్యలని ఒకరు.. రైతులు పిరికి వాళ్లంటూ మరొకరు ఎగతాళి చేస్తున్నారు. అడిగే దిక్కులేదని చిన్నచూపు చూస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు కొత్త కారణాలు వెతికిన కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్.. వారి మరణాలకు అసలు కారణం రుణపాశమే అని ఎందుకు ఒప్పుకోరు.
రైతులను బాధపెట్టేలా కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ వ్యాఖ్యలు.....
రైతే రాజు.. ఇది పాత మాట.. రైతే భగ్నప్రేమికుడు, అటు ఇటూ కానివాడు ఇది మోడీ సర్కార్ మాట.. చేతనైతే సాయం చేయండి సారు అంటూ వేడుకుంటున్న రైతన్నకు కేంద్రం ఇచ్చిన తాజా నిర్వచనం ఇది. రైతు ఆత్మహత్యలకు ఇవి కూడా కారణాలంటూ నిసిగ్గుగా సమాధానం చెప్పడానికి సిద్ధమైపోయారు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్. మోడీ సర్కార్ వచ్చినప్పటి నుంచి రైతుకు ఊరట కల్గించే మాటలేమో గానీ.. ఊట బావిలో వారిని దూకేలా బాధ పెడుతోంది. రైతుల పట్ల పిచ్చి ప్రేలాపనలు చేస్తూ.. క్షోభపెడుతోంది.
ఆత్మహత్యలకు పాల్పడే వారు నేరస్తులు, పిరికివాళ్లు - హర్యానా మంత్రి ధనకర్.....
ఆత్మహత్యలకు పాల్పడే వారు నేరస్తులు, పిరికివాళ్లు.. ఇది బిజెపి అధికారంలో ఉన్న హర్యానా మంత్రి ధనకర్ వ్యాఖ్య. మరో బిజెపి సీనియర్‌ నేత మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్‌ కాద్సే 2014 నవంబర్‌ 25న ముంబాయిలో మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌ బిల్లు ఛార్జీలను చెల్లించే రైతులు విద్యుత్‌ బిల్లులను ఎందుకు చెల్లించలేరని ఎద్దేవా చేశారు. భారత్‌ వంటి దేశాలలో రైతుల ఆత్మహత్యలు సాధారణ విషయమే అని యూపీఏ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ 2006 ఆగస్టు 5న ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. శరద్‌ పవార్‌ అల్లుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఆ రాష్ట్రంలో కరువుకు సంబంధించి 2013 ఏప్రిల్‌ 7న పూణేలో మాట్లాడుతూ డ్యాంలలో నీళ్లు లేకపోతే మేము మూత్రం పోయాలా అంటూ అత్యంత హీనంగా మాట్లాడారు.
నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో ఇచ్చిన రిపోర్టు చూసిన తర్వాత నోరు మూసుకోవాల్సిందే.....
రాధామోహన్ సింగ్ తో పాటు రైతుల ఆత్మహత్యలకు పిచ్చి కారణాలు చూపుతున్న నేతలు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో ఇచ్చిన రిపోర్టు చూసిన తర్వాత నోరు మూసుకోవాల్సిందే. రుణపాశమే రైతుల పాలిట యమపాశమవుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది. గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చే మార్గం దొరకక, రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్న కఠోర వాస్తవాన్ని ఎన్ సి ఆర్ బి రిపోర్టు బహిర్గతం చేసింది. నమ్ముకున్న విత్తనం మొలకెత్తక, ప్రకృతి వైపరీత్యాలు, పెట్టిన పెట్టుబడిపై లాభం రాకపోవడంతో రైతు కుంగిపోతున్నాడని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి చెప్పిన పిచ్చి కారణాలతో ఏ ఒక్క రైతూ చనిపోలేదు....
కానీ ఇదే రిపోర్టును చదువుతూ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటాన్ని ఏమనాలి. కేంద్ర మంత్రి చెప్పిన పిచ్చి కారణాలతో ఏ ఒక్క రైతూ చనిపోలేదన్న వాస్తవం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక చూస్తే అర్ధమవుతోంది. ఎన్ సిఆర్ బి రిపోర్ట్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 1647 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందుకు పంటలు పండకపోవడం, దివాలా తీయడం, అప్పులు పెరిగిపోవడమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2014లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ఓసారి పరిశీలిద్దాం.....
పంట పండకపోవడంతో తెలంగాణలో 295 మంది, ఏపీలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పేదరికం వల్ల తెలంగాణలో 112 మంది, ఏపీలో ఒక్కరు. కుటుంబ సమస్యలతో తెలంగాణలో 67 మంది, ఏపీలో 11 మంది. దివాలా తీయడంతో తెలంగాణలో 208 మంది, ఏపీలో 36 మంది సూసైడ్‌ చేసుకున్నారు. పంట రుణం వల్ల నష్టపోయి తెలంగాణలో 146 మంది, ఏపీలో 25 మంది. వివాహ సంబంధిత సమస్యలతో తెలంగాణలో 21 మంది, ఏపీలో ఇద్దరు. ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణలో 90 మంది, ఏపీలో 30 మంది చనిపోయారు. అనారోగ్యంతో తెలంగాణలో 101 మంది రైతులు, ఏపీలో 8 మంది, పరికరాలు, యంత్రాల కొనుగోలు వల్ల అప్పుల పాలవ్వడంతో ఏపీలో ఒక్కరు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయేతర రుణం వల్ల తెలంగాణలో 62 మంది, ఏపీలో 10 మంది, ఇతర కారణాల వల్ల తెలంగాణలో 93 మంది, ఏపీలో 50 మంది, అంతుబట్టని కారణాలతో తెలంగాణలో ఒక్కరు, ఏపీలో 10 మంది చనిపోయారు.
రెండో స్థానంలో ఉన్న తెలంగాణలోనూ, ఆరో స్థానంలో ఉన్న ఏపీలోనూ....
రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలోనూ, ఆరో స్థానంలో ఉన్న ఏపీలోనూ ఇవే ఖచ్చితమైన కారణాలు. మెజార్టీ బలవన్మరణాలకు కారణం వివిధ రూపాల్లో తీసుకున్న రుణమే.... మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం ఇదే పరిస్థితి. ఇది చూసిన తర్వాతైనా మన నేతలు రైతు సమస్యల పట్ల చూసే కోణం మారుతుందా.. లేదు మేం నేతలం మాకే చెబుతారా అంటారా.? రైతు కూడా ఓటరే.. సమాధానానికి అతనికీ ఓ ఛాన్స్ వస్తుందని గ్రహించాలి.
2014లో రైతుల ఆత్మహత్యలు - కారణాలు

కారణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్

పంట పండకపోవడం 295 మంది 42

పేదరికం 112 1

కుటుంబ సమస్యలు 67 మంది 11 మంది

దివాలా తీయడం 208 36

పంట రుణం వల్ల నష్టపోయి 146 25

వివాహ సంబంధిత సమస్యలు 21 02

ప్రకృతి వైపరీత్యాలు 90 30

అనారోగ్యం 101 08

పరికరాలు, యంత్రాల కొనుగోలు

వల్ల అప్పులు పాలవ్వడంతో 00 01

వ్యవసాయేతర రుణం వల్ల 62 మంది 10 మంది

ఇతర కారణాలు 93 మంది 50 మంది

అంతుబట్టని కారణాలు 01 10 మంది

09:45 - July 31, 2015

హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు జనం అతలాకుతం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు పునరావాసాల్లో తలదాచుకుంటున్నారు. వరద బాధిత రాష్ర్టాల్లో ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లు సహాయక చర్యలు చేపడుతున్నారు.
గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ్‌బెంగాల్‌, ఉత్తరప్రదేశ్ , మహారాష్ర్ట రాష్ట్రాల్లో భారీ వర్షాలు .....
కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ్‌బెంగాల్‌, ఉత్తరప్రదేశ్ , మహారాష్ర్ట రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
ఉగ్రరూపం దాల్చిన సబర్మతి నది....
గుజరాత్‌లో సబర్మతి నది ఉగ్రరూపం దాల్చింది. బనసకాంత , సురేంద్రనగర్ జిల్లాల్లో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వైమానిక సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. గుజరాత్‌లోని కచ్, ఉత్తర గుజరాత్ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనంతో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. భారీ వర్షాలతో అతలాకుతలమైన గుజరాత్‌ను ఆదుకునేందుకు కేంద్రం ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లను రంగంలోకి దింపింది.
ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న సువర్ణరేఖా నది....
ఒడిశాలో భారీ వర్షాల వల్ల సువర్ణరేఖా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. అటు పశ్చిమబెంగాల్‌ను వర్షాలు కుదిపేస్తున్నాయి. హౌరా, నాడియా, ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పిడుగుపాటుకు వందలాది ఇళ్లు నేలమట్టం కాగా.. వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. రాజస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలతో గంగ, యుమన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.....
బంగ్లాదేశ్ తీరానికి ఆనుకొని ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది దక్షిణ-నైరుతి దిశగా చిట్టగాంగ్‌కు వంద కిలో మీటర్ల దూరంలో, తూర్పు - ఆగ్నేయ దిశగా కోల్‌కతాకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అక్కడి నుంచి ఉత్తర దిశగా కదిలి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనుంది. అక్కణ్నుంచి పశ్చిమ - వాయవ్య దిశగా కదిలే వీలున్నందున, ఇవాళ నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అటు బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో హై అలర్ట్ ప్రకటించారు. 

09:42 - July 31, 2015

హైదరాబాద్:ఇద్దరి మనుసుల్ని కలిపేది స్నేహం. ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు నీనున్నానంటూ గుర్తుచేసేదే స్నేహం. అందుకే తరతరాల బంధాన్ని కూడా గుర్తుచేసేందుకు ఫ్రెండ్‌షిప్‌ డే రానే వచ్చింది. దేశవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్‌ డే ఫీవర్ పట్టుకుంది. కస్టమర్లతో గిఫ్ట్ షాపులు కళకళలాడుతున్నాయి. ఫ్యాన్సీ షాపులన్నీకిటకిటలాడుతాయి గ్రీటింగ్ కార్డులు, ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. దీంతో వ్యాపారవర్గాలకు ఫ్రెండ్‌షిప్‌డే వరంగా మారింది. దేశవ్యాపంగా ఎక్కడ చూసినా సందడే నెలకొంది.

 

09:40 - July 31, 2015

హైదరాబాద్:2014 మార్చిలో అదృశ్యమైన... మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించిన ఆధారాలు... తొలిసారిగా లభ్యమయ్యాయి. హిందూ మహాసముద్రంలోని ఓ మారుమూల దీవిలో 2.7 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల వెడల్పైన విమాన రెక్కభాగాన్ని అధికారులు గుర్తించారు. ఈ శకలం బోయింగ్‌ 777 విమానానికి చెందిందై ఉండొచ్చని మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్ తెలిపారు. ఆఫ్రికా తూర్పు తీరంలోని... లా రీయూనియన్‌ అనే ఫ్రెంచ్ దీవిలో దీన్ని గుర్తించారు. అయితే ఈ శకలం అదృశ్యమైన మలేషియా ఎంహెచ్-370 భాగమేనా..? కాదా..? అన్న విషయం తేలాల్సి ఉందని నజీబ్ ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపారు. 

కోర్బా లింక్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

ఒడిశా: రాయగడ్ సమీపంలో కోర్బా లింక్ ఎక్స్ ప్రెస్ దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఎస్1,ఎస్2,ఎస్4, ఎస్ 5,ఎస్6 బోగ్లో ప్రయాణీకుల నుంచి రూ. 10 లక్షల నగదూ, నగలూ అపహరించారు.

మంత్రి గంటాతో రిషితేశ్వరి పేరెంట్స్ భేటీ

విజయవాడ: నాగార్జున యూనివర్శిటీలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం మంత్రి గంటాశ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారకులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. విచారణ నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

'గ్రీసు పరిణామాలు-భారత్ పై ప్రభావం' ఎస్.వి.కె.లో సదస్సు

హైదరాబాద్:ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'గ్రీసు పరిణామాలు-భారత్ పై ప్రభావం' పై పీపుల్ ఫర్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య వక్తలు ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొంటారు.

శ్రీకాకుళం జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం

శ్రీకాకుళం:జిల్లాలోని గార మండలం బందరువాని పేటలో సముద్రం ముందుకొచ్చింది. 30-40కి.మీ మేర సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురవుతోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం...

చిత్తూరు: జిల్లాలో రోజూ ఎక్కడో ఒక చో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీకోట మండలం బోయచిన్నాగనపల్లిలో ఏనుగులు బీభత్సంతో మామిడి, అరటి, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు అధికారులు యత్నించారు. దీంతో ఏనుగులు తిరగబడ్డాయి. ఈ సంఘటనతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు.

నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులపై పాము కాటు:ఒకరి మృతి

కర్నూలు:ఆలూరు మండలం కత్రికా గ్రామంలోని ఓ ఇంట్లో నిద్రించిన సమయంలో అక్కాతమ్ముడికి పాము కరిచింది. ఈ సంఘటనలో అక్క మరణించగా, తమ్ముడి పరిస్థితి విషమంగా ఉంది. పాముకాటుకు గురైన బాలుడికి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనతో కత్రికా గ్రామంలో విషాదం అలముకుంది.

ప్రశాంతి నిలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

అనంతపురం:పుట్టపర్తిలోని సత్యసాయి ప్రశాంతి నిలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల గురు వందనంతో వేడుకలు మొదలయ్యాయి. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. ఈ వేడుకలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు.

08:32 - July 31, 2015

భూసేకరణ చట్టానికి సవరణలతో కూడిన బిల్లును అమోదించుకుంటామని కేంద్రం చెబుతోంది. విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా ఎందుకు కేంద్రం ముందుకు వెళుతోంది? బిజెపికి భూ బిల్లు పై ఉన్న శ్రద్ధ రామమందిరం నిర్మాణంపై ఎందుకు లేదు? బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి... దీనిపై పెట్టుబడులు పెట్టడం ఎంత వరకు లాభం? విద్యుత్ ఉద్యోగుల విభజన అంశాన్ని కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏపీ రాజధానికి ఉద్యోగులు వెళ్లాలని ఏపీ సీఎం ఆదేశించారు. దాన్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా పై వైసీపీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది? ఈ అంశాలపై గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రంలో హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:59 - July 31, 2015

హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఫోన్ ట్యాపింగ్ వివాదంపై హైకోర్టు స్టే ఇచ్చింది.ఫోన్ ట్యాపింగ్ పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయా? చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదా?రిషితేశ్వరి కేసులో నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందా? ప్రిన్సిపల్ బాబూరావు ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? యూనివర్శిటీకి సెలవులు ఇచ్చి దర్యాప్తు చేయడం ఎంత వరకు సబబు? సిట్టింగ్ జడ్జితో ఎందుకు న్యాయవిచారణ చేయడం లేదు? ప్రొ.కంచె ఐలయ్య పై అరెస్టు వారెంట్ ను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టిపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ రావు,టి.టిడిపి నేత రాం గోపాల్ రెడ్డి, విశ్లేషకుడు కె.ఎస్.లక్ష్మణ రావు,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. మరి వారు ఇంకా ఏఏ అంశాలను చర్చించారో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

అమరావతి వేదికగా నేడు ఏపి క్యాబినెట్ భేటీ

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నేడు మంత్రివర్గ సమావేశం కాబోతోంది. తొలిసారిగా బెజవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధానంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికగా ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ భేటీలో నూతన రాజధాని నిర్మాణం, రాష్ర్ట ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై సుదీర్ఘ చర్చసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సందర్భం ఏదీ లేకుండానే.. బెజవాడలో మంత్రివర్గ సమావేశం నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని చంద్రగిరి కాలనీలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఇళ్ల మధ్య ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాం నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలనుఅదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

నేడు గుంటూరులో విద్యా సంస్థల బంద్...

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విద్యార్థులకు సెలవులు ఇచ్చి విచారణ జరపడాన్ని నిరసిస్తూ వైసీపీ విద్యార్థి విభాగం బంద్‌కు పిలుపునిచ్చింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వరంగల్‌కు చెందిన ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషితేశ్వరి అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. బాలసుబ్రమణ్యం కమిటీ విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమల వెంకన్నస్వామి దర్శనానికి భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 

ఆధార్ అనుసంధానంపై పర్యవేక్షణాధికారి

హైదరాబాద్‌: ఆధార్‌ అనుసంధానంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ పూర్తయిందంటున్న అధికారులు.. ఇక తదుపరి తతంగాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ సర్కిళ్ల వారీగా అధికారులకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించారు.

07:10 - July 31, 2015

హైదరాబాద్: యాకూబ్ మెమన్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు... భారీ భద్రత నడుమ... మృతదేహాన్ని నాగ్‌పూర్‌ నుంచి ముంబై తరలించారు. యాకూబ్‌ను కడసారి చూసేందుకు... బంధువులు, సన్నిహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఐతే పోలీసు ఆంక్షలు వారికి నిరాశనే మిగిల్చాయి. పరిమిత జనాల మధ్య... ముస్లిం సంప్రదాయం ప్రకారం... యాకూబ్ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.
ఉదయం గం.6.30కు ఉరిశిక్ష....
ఉదయం 6గంటల 30నిమిషాలకు... నాగ్‌పూర్‌ జైలులో యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్ష అమలు చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అరగంట తర్వాత చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించగానే ఉరికంభం నుంచి మృతదేహాన్ని కిందికి దించారు. ఇదే విషయాన్ని హోంశాఖతో పాటు యాకూబ్‌ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తర్వాత మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డెడ్‌బాడీ కోసం రాతపూర్వక విజ్ఞప్తి....
8గంటల 35నిమిషాలకు... యాకూబ్ సోదరుడు సులేమన్ మెమన్, కజిన్ ఉస్మాన్‌... నాగ్‌పూర్‌లోని ద్వారకా హోటల్‌ నుంచి జైలు వద్దకు చేరుకున్నారు. వీరిద్దరూ లోపలకు వెళ్లటంతో... అంత్యక్రియలు జైలులోపలే జరుగుతాయని ప్రచారం జరిగింది. యాకూబ్ డెడ్‌బాడీ అప్పగించాల్సిందిగా... సులేమన్‌ రాతపూర్వకంగా జైలు సిబ్బందికి విజ్ఞప్తి చేయటంతో... అందుకు అధికారులు అంగీకరించారు.
గం.9.30కు బంధువులకు డెడ్‌బాడీ....
9 గంటల 30 నిమిషాలకు యాకూబ్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాసేపటికే ప్రత్యేక ఆంబులెన్స్‌లో డెడ్‌బాడీని... నాగ్‌పూర్‌ ఎయిర్‌ పోర్టుకు తరలించారు. ఈలోగా ముంబై ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేశారు. యాకూబ్ నివాసం వద్ద కూడా సెక్యూరిటీ టైట్‌ చేశారు. 10గంటల 40 నిమిషాలకు ముంబై పోలీస్ కమిషనర్‌ అక్కడికి చేరుకొని భద్రత సమీక్షించారు.
గం.12.18 ముంబైకి డెడ్‌బాడీ....
12గంటల 18నిమిషాలకు డెడ్‌బాడీ ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి యాకూబ్‌ నివాసానికి తీసుకెళ్లారు. జనాలు ఎక్కువగా రావద్దని... పోలీసులు అనౌన్స్‌ చేశారు. ఫొటోలు, వీడియో తీయవద్దని... నినాదాలు చేయవద్దని పదేపదే హెచ్చరించారు. 4గంటలకు భారీ భద్రత నడుమ... ఖాబ్రస్తాన్‌ ఛార్ని రోడ్డులోని స్మశానవాటికకు మృతదేహం తరలించారు. 4గంటల 40నిమిషాలకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. 

07:06 - July 31, 2015

హైదరాబాద్‌: గ్రేటర్ పరిధిలో విధుల్లోంచి తొలగించిన మున్సిపల్ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కనిండని కార్మికుల: కుటుంబాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు మంచి రోజులు వస్తాయనుకుంటే, ఉన్న ఉద్యోగాలే ఊడిపోయాయని కార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లోంచి తొలగించిన కార్మికుల స్థితిగతులపై టెన్ టీవి స్పెషల్ స్టోరి.
అల్టిమేటం జారీచేసిన జీహెచ్ ఎంసీ....
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ సమ్మెలో జిహెచ్ఎంసి కార్మికులు సైతం పాల్గొన్నారు. పదిరోజుల తరువాత వేతనాలు పెంచుతాం, విధులకు హజరు కావాలని అల్టిమేటం జారీచేశారు జిహెచ్ఎంసి అధికారులు. పలు ప్రాంతాల్లో వ్రాత పూర్వకంగా కూడా కార్మికులకు ఇచ్చారు. దాంతో పలు ప్రాంతాల్లో విధుల్లో చేరారు కార్మికులు. 16 తేది రాత్రి హైదరాబాద్ నగరంలో వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో 17న సమ్మె విరమించాయి కార్మిక సంఘాలు. అయితే అధికారులు చెప్పినప్పటి నుండి కార్మికులు విధుల్లో ఉన్నారు. అయినా పలుప్రాంతాల్లో కార్మికులను విధులనుంచి తొలగించారు. దాంతో తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. గ్రేటర్ పరిధిలో తొలగించిన కార్మికుల స్థితిగతులను టెన్‌టీవీ పరిశీలించింది.
కార్మికుల ఆవేదన...
ఉప్పల్ సర్మిల్ పరిధిలో పనిచేస్తున్న ఈమె పేరు గౌరమ్మ. 12 సంవత్సరాల నుండి మున్సిపల్ లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఈమె భర్త చనిపోయాడు. దీంతో కుటుంబ భారం అంత గౌరమ్మ చూడాల్సి వస్తోంది.
10 సంవత్సరాలుగా రోడ్డు ఊడ్చే బాలామణి...
బాలమణి 10 సంవత్సరాలుగా రోడ్డు ఊడ్చే పని చేస్తోంది. భర్త లేడు. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. తనకు ఈ పని లేకుంటే కుటుంబం నడవడం కష్టమంటుంది బాలమణి. సమ్మె అనంతరం 12రోజులుగా పెరుకుపోయినా చెత్తను ఎత్తేసిన తరువాత మీరు విధులకు హజరు కావద్దంటూ అధికారులు చెప్పారని బాలమణి వాపోయింది. తమకు బ్రతకడానికి ఇబ్బందికరంగా ఉందని, కనీస వేతనం ఇవ్వమన్నందుకు ఉన్న ఉద్యోగాన్ని తోలగిస్తే ఎలా అని అవేదన వ్యక్తం చేస్తుంది పారిశుద్య కార్మికురాలు కిష్టమ్మ. 20ఏళ్లనుండి పనిచేస్తున్న తమకు ఏనాడూ కనీస వేతనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
7రోజులుగా ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ ధర్నా...
తొలంగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని రోజు రోజుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 7రోజులుగా ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ వి.ఎస్ ఎస్ ప్రభాకర్‌ డిప్యూటి కమిషనర్ కార్యాలయం వద్ద దర్నా చేస్తున్నారు. సామాన్య కార్మికులు, పేదలు అయినే పారిశుద్య కార్మికులపై ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరించడం సరికాదని వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్నాయి కార్మిక సంఘాలు. 

06:59 - July 31, 2015

విజయవాడ:రాష్ట్రంలో పర్యాటకరంగానికి ప్రత్యేక స్థానం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. ప్రకృతి అందాలకు నెలవైన గోదావరి జిల్లాలను ప్రత్యేక ఆకర్షక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ముందుకు వచ్చే ప్రమోటర్స్‌, బిల్డర్స్‌కు ప్రోత్సాహకాలు .......
ఇక రాష్ట్రంలోని సముద్ర తీరంలో ఉన్న ఐలాండ్స్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చే ప్రమోటర్స్‌, బిల్టర్స్‌కు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ఓడల రేవు, అద్దూరు, ఎస్‌.యానాం, చిరయానాం, కోటిపల్లిలను టూరిజం సర్క్యూట్‌లోకి తీసుకురావాలని బాబు ఆదేశించారు. రాజమండ్రిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఇక నెల్లూరును కోస్టల్‌ టూరిజం హబ్‌గా రూపొందించి పులికాట్‌, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, మైపాడ్‌ బీచ్‌, ఇసుకపల్లి బీచ్‌లను అభివృద్ధి చేస్తామని అధికారులకు చంద్రబాబుకు వివరించారు.
అమరావతిలో కాలచక్ర ఆలయం.....
ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను ఆకర్షించే విధంగా అమరావతిలో కాలచక్ర ఆలయాన్ని నిర్మించాలని బాబు సూచించారు. కూచిపూడిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. బౌద్ధ విహారాలు, ఆరాధ్య స్థలాలను కలుపుతూ మల్టీ లేన్‌ రహదారులను ఏర్పాటు చేయాలన్నారు. విదేశీయులు పెట్టుబడులు పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక విశాఖపట్టణం, తిరుపతి సర్క్యూట్‌ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. శ్రీశైలంలో టైగర్‌ పార్క్‌, కుప్పంలో ఎలిఫెంట్‌ పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఏది ఏమైనా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్యరూపం దాలిస్తే అన్ని ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని పలువురు భావిస్తున్నారు. 

06:57 - July 31, 2015

హైదరాబాద్:ఫోన్‌ట్యాపింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో వివరాలు ఇవ్వాలంటూ ఏపీలోని విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్వర్వులపై ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. ప్రత్యేక సీల్డు కవర్‌లో హైకోర్టుకు వివరాలు అందచేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో పాటు... విజయవాడ కోర్టుకు కూడా సీల్డ్‌ కవర్‌లో వివరాలను అందచేసి...ఆ వెంటనే ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా..హైకోర్టుకు అందచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది.
ఫోన్‌ట్యాపింగ్‌పై హైకోర్టు కీలక తీర్పు.....
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఈ విషయం తేలేంత వరకు విజయవాడ కోర్టు ప్రొసిడింగ్స్ పై డిమ్యూటుల్ స్టే విధించింది.
తెలంగాణ తరపున వాదనలు వినిపించిన రాంజెఠ్మాలనీ.....
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదనలు వినిపించారు. అంతర్గత భద్రతలో భాగంగా ఏ రాష్ట్రమైనా, కేంద్ర ప్రభుత్వానికి ఇంటర్ సెషన్ జరిగినప్పుడు ఫోన్ డేటా తీసుకునే అధికారం ఉందని వాధించారు. నోటీ ఫై అథారిటీతో తీసుకున్న కాల్ డేటాను ఏ ఇతర రాష్ట్రాలకు, సెల్ ఫోన్ కంపనీలకు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అలా ఇస్తే ఒక రాష్ట్రం మరో రాష్ట్రంపై అభ్యంతరాలు చెప్తాయన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కోర్టులో విచారణ జరిపి.. తెలంగాణ ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చకుండానే తీర్పు ప్రకటించారని..ఇది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. ఆ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు.
రిట్‌ పిటిషన్‌కు విచారించే అర్హత లేదన్న ఏపీ ఏజీ ......
ఇక ఆంధ్రప్రదేశ్ తరపున ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ..ఈ రిట్‌ పిటిషన్‌కు విచారించే ఆర్హత లేదని వాదించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ..సీల్డ్ కవర్లో డేటా వివరాలు సమర్పించిన తర్వాత..అభ్యంతరాలు ఉంటే హైకోర్టును సంప్రదించాలని సెల్యూలర్ కంపనీలకు మాత్రమే అదేశించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని తమ అధికారుల నెంబర్స్‌ను ట్యాపింగ్ పాల్పడే అవకాశాలు ఉన్నందునే దర్యాప్తు చేస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అడిషనల్ సొలిసిట్ జనరల్ నట్‌రాజ్ వాదనలు వినిపిస్తూ..ఇలాంటి కేసుల్లో మెట్రోపాలిటన్ కోర్టులు తీర్పు ఇవ్వడం సరికాదని వాదించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వానికి , సెల్యూలర్ కంపనీలకు లేఖలు రాశామన్నారు. ఏదైనా తెలంగాణ ప్రభుత్వ తీర్పుకు లోబడే ఉండాలని కోరామని తెలిపారు. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతప్పదని.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక సీల్డు కవర్లో హైకోర్టుకు వివరాలు....
తెలంగాణ, ఏపీ, కేంద్రం తరపున వాదనల్ని విన్న హైకోర్టు...విజయవాడ కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ..ప్రత్యేక సీల్డు కవర్లో హైకోర్టుకు వివరాలు అందచేయాలని ఆదేశించింది. దాంతో పాటు..విజయవాడ కోర్టుకు కూడా సీల్డ్‌ కవర్లో వివరాలు అందిన తర్వాత...ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా హైకోర్టుకు అందచేయాలని పేర్కొంది. సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌డేటాను హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణను 4వారాల పాటు వాయిదా వేసింది. 

06:51 - July 31, 2015

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వాయిస్ పెంచాల‌ని వైసీపీ నిర్ణయించింది. గ‌తంలో ఇదే అంశంపై కేంద్ర పెద్దలకు విన్నవించిన జగన్... తాజాగా ఢిల్లీలో ధ‌ర్నా చేయాల‌ని డిసైడయ్యారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో క‌ల‌సి ఆగ‌స్టు 10న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం రెండు ట్రైన్స్ లో రెండు వేలకు పైగా కార్యకర్తలను ఢిల్లీకి త‌ర‌లించ‌నుంది వైసీపీ. ధ‌ర్నా అనంత‌రం పార్లమెంట్ వరకు ర్యాలీ కూడా నిర్వహించనుంది. ఇందుకోసం లోట‌స్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో చ‌ర్చించిన జ‌గ‌న్, పార్లమెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ధ‌ర్నా చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు.
రోజా ఆధ్వర్యంలో యూనివర్శిటీకి పార్టీ నేతలు....
ఇక వివాదాస్పదంగా మారిన రిషితేశ్వరి ఆత్మహత్య వ్యవహారంపై కూడా పార్టీ ముఖ్యుల‌తో జ‌గ‌న్ చ‌ర్చించారు. రిషితేశ్వరి సూసైడ్ లేఖలో అనేక అంశాలను పేర్కొన్నా... ప్రభుత్వం దాన్ని నీరుగార్చాల‌ని చూడ‌డం దారుణ‌మ‌న్నారు జ‌గ‌న్. పార్టీ మ‌హిళా అధ్యక్షురాలు రోజా ఆధ్వర్యంలో మ‌హిళా ఎమ్మెల్యేలు, క్రిష్ణా, గుంటూరు జిల్లాల శాస‌న‌స‌భ్యులు యూనివ‌ర్సిటికి వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. మొత్తం మీద ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ‌స్దాయిలో తీసుకు వెళ్లాల‌ని వైసీపీ భావిస్తుంది. అందులోను పార్లమెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో దీనిపై ప‌లువురు జాతీయ నాయ‌కుల‌ను క‌లిసే అవ‌కాశం ఉండ‌డంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 

06:49 - July 31, 2015

విజయవాడ:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నేడు మంత్రివర్గ సమావేశం కాబోతోంది. తొలిసారిగా బెజవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధానంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికగా ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ భేటీలో నూతన రాజధాని నిర్మాణం, రాష్ర్ట ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై సుదీర్ఘ చర్చసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సందర్భం ఏదీ లేకుండానే.. బెజవాడలో మంత్రివర్గ సమావేశం నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తొలిసారిగా విజయవాడలో ఏపీ క్యాబినేట్‌ భేటీ......
తొలిసారిగా విజయవాడలో ఏపీ క్యాబినేట్‌ సమావేశం కాబోతోంది. ఈ భేటీలో మంత్రులు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా నవ్యాంధ్ర రాజధానిపైనే ఎక్కువసేపు చర్చించనుట్లు తెలుస్తోంది. అమరావతి ప్రధాన ప్రాంత బృహత్తర ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం సమర్పించాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో రాజధాని నిర్మాణంపైనే చర్చ సాగనుంది. రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి.. కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి..? పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాల్సినవి భవనాలేంటి..? వంటి అనేక అంశాలపై మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇళ్ల నిర్మాణ పథకంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం....
కొత్త ఇళ్ల నిర్మాణ పథకంపై మంత్రులు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని పెంచే అంశం కూడా చర్చకు రానుంది. ప్రస్తుతం ఒక్కో ఇంటికి 70 వేలు చెల్లిస్తుండగా.. దీన్ని లక్షన్నరకు పెంచాలన్నది ప్రభుత్వ యోచన. ఇక నూతన విశ్వవిద్యాలయాలు, విద్యుత్, రాష్ట్రంలో లభ్యమయ్యే ఖనిజాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భూ కేటాయింపులు, పాలనా పరమైన అనేక అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరగనుంది. ఇటు ఇరు రాష్ర్టాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం, రైతు రుణమాఫీ మూడోదశ అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక అబ్దుల్ కలాం మృతికి రాష్ట్ర మంత్రివర్గం నివాళులర్పించనుంది.
పాలనపరమైన నిర్ణయాలను....
ప్రతిసారి హైదరాబాద్‌లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేవారు. కానీ, తొలిసారిగా విజయవాడలో క్యాబినెట్‌ సమావేశం కాబోతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి మంత్రివర్గ సమావేశాన్ని విశాఖలో నిర్వహించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో మరోసారి మంత్రివర్గ సమావేశమైంది. ఇలా ఏపీలోని విశాఖ, రాజమండ్రిలో కేబినెట్‌ భేటీ నిర్వహించిన చంద్రబాబు.. మొదటిసారి అమరావతిలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనిద్వారా పాలనపరమైన నిర్ణయాలను సొంత రాష్ర్టం నుంచి తీసుకుంటున్నామనే సంకేతాలను ప్రజలకు చేరువయ్యేలా.. బాబు కొత్తనిర్ణయాలు తీసుకుంటున్నారనే టాక్‌ విపిస్తోంది. 

06:44 - July 31, 2015

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో కల్లుగీత పరిరక్షణ నినాదం ఊపిరిపోసుకుంటోంది. ఈ వృత్తిని పరిరక్షించాలంటూ ఆగస్టు 1 నుంచి కల్లుగీత కార్మికులు ఆందోళన బాటపడుతున్నారు. ఇంతకీ కల్లుగీత వృత్తికి వచ్చిన ప్రమాదమేమిటి? మన ఆర్థిక వ్యవస్థలో ఈ వృత్తికి వున్న ప్రాధాన్యతేమిటి? కల్లుగీత వృత్తిని పరిరక్షించాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో యర్రం దేవుడుగారు విశాఖపట్టణం పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి.

06:42 - July 31, 2015

చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లుని ఆరోగ్య ప్రదాయినిగా చెబుతుంటారు. విందులు, వినోదాలు, సంబరాలు, ఉత్సవాలలో కల్లును సేవించడం అనేకప్రాంతాలలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. కల్లు లేనిదే ఆయా ఉత్సావాలకు పరిపూర్ణత సిద్ధంచదు.
స్వచ్ఛమైన కల్లు దొరకదు.....
తాటి చెట్లు, ఈత చెట్లు ఇవి లేనిదే స్వచ్ఛమైన కల్లు దొరకదు. వీటిని భూలోక కల్పవృక్షాలుగా అభివర్ణిస్తుంటారు. కల్లుతో పాటు ఈ చెట్ల నుంచి లభించే ప్రతి ఉత్పత్తీ విలువైనదే. విలక్షణమైదే. మరెందరికో ఉపాధి చూపిస్తున్నదే. చాపలు, విసనకర్రలు, బుట్టలు, బ్యాగ్‌లు ఇలాంటివన్నీ వీటి ఆకులు, ఈనెల ద్వారా మనకు లభిస్తుంటాయి. మానవాళికి మహామేలు చేస్తున్న వృక్షసంపదలో తాటి చెట్లు, ఈత చెట్ల ప్రాధాన్యతను ఎవరైనా ఎలా కాదనగలరు? ఈ చెట్ల ద్వారా కేవలం గీతకార్మికులే కాకుండా ఇంకా అనేక వృత్తులవారు జీవనోపాధి పొందుతున్నారు.
కనుమరుగౌతోన్న తాటి, ఈవ వనాలు...
అయితే ఇప్పుడు అనేక ప్రాంతాలలో తాటి, ఈత వనాలు కనుమరుగై పోతున్నాయి. అత్యంత విలువైన ఈ వనాల గురించిగానీ, వీటి ఆధారపడి జీవనోపాధిసాగిస్తున్నవారి బాగోగుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం. అవును. మనుషుల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే విదేశీ మద్యం అమ్మకాలను పెంచే మార్గాల గురించి ఆలోచించే ప్రభుత్వాలకు తాటి, ఈత వనాలు గుదిబండలుగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఊరూరా, వీధివీధినా పోటాపోటీగా లైసెన్స్‌లిచ్చి బారులు, వైన్‌లు తెరిపిస్తున్న ప్రభుత్వాలకు తాటి, ఈత వనాల పెంపంకం గురించి, అవి సమాజానికి చేసే మేలు గురించి చెబితే తలకెక్కుతుందా? పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈత బుట్టలు, చాటలు, చాపల స్థానాన్ని ప్లాస్టిక్‌ వస్తువులు ఆక్రమిస్తున్నాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసే ప్లాస్టిక్‌ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు విధ్వంసమవుతున్న చేతివృత్తులను కాపాడే ప్రయత్నాలు చేయడం లేదు. ప్లాస్టిక్‌ పరిశ్రమల వ్యాపారుల పట్ల మమకారం ప్రదర్శిస్తున్న ప్రభుత్వాలు ఈత బుట్టల అల్లకందారులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సామాజిక అడవులు, లక్షలాది మొక్కల పెంపకం పేరుతో ప్రతి ప్రభుత్వమూ తెగ హడావిడి చేస్తుంది. ఆ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ, ఇలాంటి పథకాల్లో తాటి, ఈత చెట్ల పెంపకానికి పొరపాటున కూడా స్థానం కల్పించకపోవడం ఓ వైపరీత్యం.
యువతలో నైపుణ్యాలు పెంచే పేరుతో....
యువతలో నైపుణ్యాలు పెంచే పేరుతో ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతుంటాయి. వీటిలో అత్యధిక శాతం నిధులు ఐటీరంగానికీ, పరిశ్రమలకు కేటాయిస్తూ వుంటారు. అందులో తప్పులేదు. కానీ, కొన్ని కోట్ల కుటుంబాలకు ఉపాధి చూపించే ప్రాచీన వృత్తులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరన్నదే ప్రశ్న. చాపలు, బుట్టల తయారీ, కల్లు గీత లాంటి వృత్తుల్లో నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం లేదా? కొన్ని రోజుల పాటు కల్లు పాడైపోకుండా దానిని నిల్వ చేసే టెక్నాలజీని గీతవృత్తిదారులకు నేర్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న సమస్త వృత్తులవారికి ఆధునిక టెక్నాలజీని అందించాల్సిన బాధ్యత, ఆయా వృత్తులకు సంబంధించిన సరికొత్త నైపుణ్యాలను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? 

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయిబాబా ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. షిర్డీలోని సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

 

Don't Miss